Manasa Varanasi
-
గ్యాప్ కాదు.. ప్రిపరేషన్..
ఫ్యాషన్ షోలో దేవకీనందన వాసుదేవ ఫేమ్ నటి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంత ఇల్లు. నా మనసు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందని దేవకీనందన వాసుదేవ ఫేమ్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె సాక్షితో ముచ్చటించారు. 2020లో మిస్ ఇండియాగా ఎంపికయ్యాను. 2024లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చా. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారని పలువురు అంటున్నారు.. అయితే ఇది గ్యాప్ కాదు.. నాకు ప్రిపరేషన్‌లా అనిపిస్తోంది. ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్యాషన్ ఎప్పుడూ సినిమాపైనే. మొన్ననే దేవకీనందన వాసుదేవ రిలీజ్ అయ్యింది. చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వివిధ రకాల థీమ్స్ వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. డిజైనర్ అర్జెంటుమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రణవ్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్స్‌కు చెందిన కలెక్షన్లు, ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగారి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో టాపర్స్‌గా మెరిశారు. ఈ మోడల్ షోలో 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ ర్యాంపుపై సందడి చేశారు. -
అందమైన తెలుగు హీరోయిన్.. మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు! (ఫొటోలు)
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – అశోక్ గల్లా
‘‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. భక్తి అంశాలు, ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు అశోక్ గల్లా. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ– ‘‘దేవకీ నందన వాసుదేవ’లో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు.. ఇలా మైథాలజీ టచ్ ఉంటుంది. ప్రశాంత్‌గారి టచ్‌తో బోయపాటి శ్రీనుగారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అర్జున్ జంధ్యాల ఈ మూవీ తీశారు. సోమినేని బాలకృష్ణగారు కథని నమ్మి రాజీపడకుండా నిర్మించారు. మా సినిమా చూశాక మహేశ్‌బాబు మావయ్య ఎలా స్పందిస్తారా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
సత్యభామ గుర్తుండిపోతుంది: మానస వారణాసి
అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రమిది. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. మా నాన్నగారు మలేషియాలో ఉద్యోగి. దీంతో నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. ఇంజినీరింగ్ మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశాను. ఆ తర్వాత ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాను.మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడంతో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత ఓ మూవీ వర్క్‌షాప్‌లో పాల్గొనడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. ఇక ‘దేవకి నందన వాసుదేవ’ లో నేను విజయనగరం అమ్మాయి సత్యభామపాత్రలో నటించాను. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయి తను. సత్యభామపాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది.నాకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. దీంతో ఈ సినిమాలోని డ్యాన్స్ సాంగ్ ‘బంగారం’కు అది కొంత ఉపయోగపడింది. అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాలగార్లు సెట్స్‌లో సపోర్టివ్‌గా ఉన్నారు. బాలకృష్ణగారి వల్లే ఈ సినిమా గ్రాండ్‌గా వచ్చింది. హీరో సంతోష్ శోభన్ తో ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ చేశాను’’ అన్నారు. -
మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్!
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: 200 థియేటర్లో రిరిలీజ్కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా? ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్ చరణ్ -
విజయవాడలో మిస్ఇండియా 2020 మానస వారణాసి సందడి ( ఫొటోలు )
-
కరోనా కలకలం.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
ప్యూర్టో రికా: మిస్ వరల్డ్ పోటీలకు కరోనా సెగ తాకింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మిస్ ఇండియా 2021 మానస వారణాసితో పాటు పలువురు కరోనా బారిన పడటంతో ఆ పోటీలు అర్థాంతరంగా ఆగిపోయాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే గురువారం(డిసెంబర్ 16వ తేదీన) ప్యూర్టోరికాలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. మొత్తం 17 మందికి కోవిడ్ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు. కాగా 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా- 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే కరోనా కలకలంతో పోటీలు వాయిదా పడక తప్పలేదు. -
‘వుయ్ కేన్’ కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా- 2020 మానస వారణాసి
-
మానస సంచరరే...
ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలిచిన అమ్మాయి అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మనసులలో ఒకటే నామం, ఒకటే రూపం కదలాడుతోంది. మది మదిన సంచరిస్తున్న ఆమే మానస వారణాసి. ఈ భారతీయ సుందరికి డ్రెస్ డిజైన్స్ చేసినవారిలో హైదరాబాదీ డిజైనర్ శ్రవణ్‌కుమార్ ఉన్నారు. మానస వారణాసి సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ స్టైల్ వేషధారణ గురించి ఈ డిజైనర్ చెప్పిన వివరాలు. డ్రెస్ డిజైన్స్. మిస్ ఫ్యాషన్ కూడా... తెలుగు అమ్మాయిల్లో అరుదైన అందం మానసది. తనకు నేను పలు మార్లు డిజైన్స్ అందించాను. తను బాగా ఫ్యాషన్ స్పృహ ఉన్న అమ్మాయి. ఇండియన్, వెస్ట్రన్, అఫిషియల్, ఫార్మల్... ఇలా ఏ డ్రెస్ అయినా బాగా క్యారీ చేయగలదామె. తను తప్పకుండా మిస్ వరల్డ్ అవుతుంది. ఎందుకంటే... ఆమె ఇండియన్ బ్యూటీ, టెక్నికల్ ఇండియన్ బ్యూటీ... ప్యూర్ ఇండియన్ బ్యూటీ... రైట్ బాడీ, రైట్ యాటిట్యూడ్ లతో నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – శ్రవణ్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ టమరీ గాడీగా కాకుండా రెండు రంగులతో చేసిన మ్యాజిక్ వినూత్న అందాన్ని తీసుకువచ్చింది. బంగారు రంగు పెద్ద అంచు ఉన్న వంగపండు లెహంగా అదే రంగు బ్లౌజ్, దుపట్టా, లెహంగాకు సెట్ టాజిల్స్.. ఓ ప్రత్యేక ఆకర్షణ. టవెస్ట్రన్ జంప్‌సూట్ నుంచి డిజైన్ చేసిన మోడల్ డ్రెస్. మేని రంగును డ్రెస్ రంగు మరింతగా ఎలివేట్ చేస్తుంది. టవెస్ట్రన్ షార్ట్ గౌన్‌కి ఇండియన్ సంప్రదాయ చీర అంచు మరింత అందాన్ని తీసుకువచ్చింది. -
వాసవీ కాలేజీ లో మిస్ ఇండియా సందడి
-
రాజమౌళి సినిమాలో చేయాలని ఉంది: మానస వారణాసి
ఫెమినా మిస్ ఇండియా కిరీటంతో అందరి హృదయాలను గెలుచుకొని మిస్ వరల్డ్ కోసం అడుగులు వేస్తున్న తెలుగమ్మాయి మానస వారణాసి. నగరానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన మానస తనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు, ఇష్టాలను షేర్ చేసుకున్నారు. ► ముందుగా మీలో మీకు బాగా నచ్చే లక్షణం? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రశాంతంగా ఉంటేనే ఎదైనా సాధించగలం. ► మీలో నచ్చనిది..? లేజీనెస్...! చేయవలసిన పనులను ఎక్కు వగా వాయిదా వేస్తుంటాను. ► ఇష్టమైన ఫుడ్..? పూర్తిగా వెజిటేరియన్‌ని. వెజిటేరియన్లో ఎదైనా సరే ఇష్టంగా తింటాను. ముఖ్యంగా పులిహోరా నా ఫేవరెట్. ► నచ్చిన సినిమాలు..? తెలుగులో బాహుబలి, వేరే బాషల్లో అయితే ఇంటర్స్టెల్లర్. ► ఇష్టపడే ఫిల్మ్ స్టార్స్...? ఆయుష్ ఖురానా, ప్రియాంక చోప్రా. ► నచ్చిన కలర్..? ఫైర్ రెడ్. ► ఎలాంటి డ్రెస్సింగ్‌ని ఇష్టపడతారు...? ఇండియన్ వేర్. ► పెర్ఫ్యూమ్స్...? కొరియాండర్, లావెండర్ ఫ్లేవర్స్.. ► నచ్చే పుస్తకం..? లిటిల్ ప్రిన్స్ ► ఎలాంటి గేమ్స్ ఇష్టం..? మెదడుకు పనిపెట్టేవి. ► నచ్చిన ప్లేస్? ఎవ్వరినైనా ఆహ్వానించే సుగుణం ఉన్న హైదరాబాద్ నగరం. ► ఇష్టమైన వాహనం? కంఫర్ట్‌గా ఉండే ఏ కారైనా ఇష్టమే. ► ఇష్టమైన పనులు...? సేవ చేయడం. ఆల్రెడీ కొన్ని ఎన్జీవోలతో కలిసి వాలంటీర్‌గా పని చేసాను. ► మోడలింగ్‌లోకి రాకుండా ఉంటే..? యోగా ట్రైనర్‌ని అయ్యేదానిని. ► హబీస్...? పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. పాటలు కూడా పాడతాను. ► ఫిట్‌నెస్‌కు సంబంధించిని నియమాలు? రెండేళ్లుగా క్రమం తప్పకుండా యెగా చేస్తున్నాను. కానీ డైట్ మాత్రం పాటించను. మా అమ్మమ్మ చేసిన వంటకాలేవీ వదలను. ► మీ సక్సెస్ మంత్ర? ఎమోషనల్‌గా, స్ప్రిచ్యువల్గా బ్యాలెన్స్డ్ గా ఉంటాను. అప్పుడే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతాను. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను. ప్రతి పనిలో గతం కంటే ఉన్నతంగా ఉండేలా కష్టపడుతాను. గోల్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అప్పుడే మనం చేసే పనులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఐ లవ్ చాలెంజెస్. ► సినిమాల్లో అవకాకాశాలు వస్తే ..? ప్రస్తుతం నా ధ్యాస అంతా మిస్ వరల్డ్ పైనే. రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి, హైదరాబాద్ ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు..
-
ప్రపంచ సుందరే నా టార్గెట్: మానస వారణాసి
సాక్షి, చిక్కడపల్లి: మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించడమే తన లక్ష్యమని మిస్ ఇండియా మానస వారణాసి అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని అశోక్‌నగర్ వీధి నంబర్– 2లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమెకు తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్, చెల్లెలు మేఘన, అమ్మమ్మ గరికపాటి అన్నపూర్ణ, స్నేహితులు, అపార్ట్‌మెంట్‌వాసులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మానసను లెజెండ్ అపార్ట్మెంట్ వాసులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. ♦చాలా రోజుల తర్వాత నగరంలోని సొంతింటికి వచ్చాను. మిస్ ఇండియా పోటీలో నిలిచేందుకు ఎంతోకాలం నిరీక్షించాను. ముంబై వెళ్లి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ఉంటూ ఎంతో కష్టపడి పోటీలకు సన్నద్ధమయ్యాను. ♦మిస్ ఇండియా ఓ బిగ్ చాలెంజ్. దానిని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాం వైపు స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా అమ్మానాన్న సైతం ఆ దిశగా ముందుకు నడిపించారు. ఇప్పుడు వారెంతో సంతోషపడుతున్నారు. ఇండియాను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫాంపై నిలబెట్టేందుకు కృషి చేస్తా. సినిమా అవకాశాలు ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లను. నా లక్ష్యం మిస్‌వరల్డ్ మాత్రమే. ♦మిస్ ఇండియా మానసను చూడగానే అశోక్‌నగర్‌లోని స్ట్రీట్ నంబర్ వాసులు, లెజెండ్ అపార్ట్మెంట్ వాసులు ఆమెపై పూలవర్షం కురిపించి సత్కరించారు. డప్పు దరువులకనుగణంగా చిన్నారులతో కలిసి ఆమె డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. స్నేహితులు, బంధువులు పూల బొకేలతో మానసను అభినందించారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. స్నేహితులతో కలసి తీన్మార్ డ్యాన్స్ చేస్తున్న మిస్ ఇండియా మానస వారణాసి మాకెంతో గర్వకారణం తమ అపార్ట్మెంట్లో ఉండి ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి అందరితో వినయంగా మాట్లాడే మానసకు మిస్ ఇండియా రావడం గర్వకారణం. – సందీప్ మిశ్రా, అపార్ట్మెంట్ వాసి మిస్ వరల్డ్ రావాలి.. లెజెండ్ అపార్ట్మెంట్లో మానసను తొమ్మిదేళ్లుగా చూ స్తున్నాం. ఆమెకు మిస్ ఇండి యా రావడం ఎంతో సంతో షంగా ఉంది. మిస్ వరల్డ్ కూడా రావాలని ఆశిస్తున్నాం. – పద్మాకర్ జాదవ్, అపార్ట్మెంట్ వాసి విమానాశ్రయంలో ఘనస్వాగతం శంషాబాద్: మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత తొలిసారిగా మానస వారణాసి బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మానస వారణాసి మీడియాతో మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీల్లో వివిధ రాష్ట్రాల అమ్మాయిలతో కలిసి ఉన్నానని, మంచి వాతావరణంలో పోటీలు జరిగాయన్నారు. వలంటీర్‌గా తాను పనిచేసిన అనుభవం కూడా తన విజయానికి దోహదపడిందన్నారు. చదవండి: (మా కూతురికే.. ప్రపంచ సుందరి కిరీటం!) (సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త) -
‘మిస్ ఇండియా ఐనా.. ముద్దుల మనవరాలే’
ఆమె మిస్ ఇండియా అయినా నాకు ముద్దుల మనవరాలే. నా వయసు 80 ఏళ్లు. మానస వారణాసి అంటే మాటల్లో వర్ణించలేనంత ఆప్యాయత, అనురాగం. ఏం అమ్మాయి.. పెళ్లీడుకొచ్చావు. నీకు ఈ కాలేజీలు, స్టేజ్ షోలు ఎందుకు? మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని వెంటపడేదాన్ని. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ప్రతిరోజూ సరదా కబుర్లు సాగుతుండేవి. ఓ వైపు మనవరాలు మానసను చీవాట్లు పెడుతూనే మరోవైపు ఆమె అమితంగా ఇష్టపడే పెసరట్టు, పులిహోర, ఫ్రైడ్‌రైస్, వైట్‌రైస్ వండిపెట్టేదాన్ని. మానస మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచిన తరుణంలో నా ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. వెంటనే ఆమెకు వీడియో కాల్ చేసి విష్ చేశాను. – గరికపాటి అన్నపూర్ణ, మిస్ ఇండియా మానస వారణాసి అమ్మమ్మ చిన్నప్పుడు భరతనాట్యంలో ప్రావీణ్యం..స్విమ్మింగ్‌లో ప్రతిభ.. స్కూల్, కాలేజీలో యాంకరింగ్..ఇలా డ్యాన్సర్‌గా, స్విమ్మర్‌గా, సింగర్‌గా, ఆర్టిస్ట్‌గా, బుక్ రీడర్‌గా నా కూతురు ఎప్పుడూ ముందుండేది. తను ఏదైనా అనుకుంటే ఆ పని చేసే వరకు నిద్రపోయేది కాదు. మలేషియాలో చదివినప్పటికీ..మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఫాలో అవుతూ..నేడు మిస్ ఇండియాగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు మిస్ ఇండియా మానస వారణాసి తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి నగరానికి వస్తున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కుటుంబ సభ్యులను పలకరించింది. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన శైలజ, రవిశంకర్ దంపతులు 1992లో నగరంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత రవిశంకర్ మలేషియాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేసేవారు. అదే సమయంలో కూతురు స్కూల్ విద్య అంతా మలేషియాలో జరిగింది. 11,12 తరగతులు ఫిడ్జ్‌లో చదివింది. ఇంజనీరింగ్ ఇబ్రహింపట్నంలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదివింది. మరిన్ని విశేషాలు వారి మాటల్లో... తనే స్టైలిస్ట్..తనే డిజైనర్ వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీలు చాలా వరకు వర్చువల్ వేదికగా జరిగాయి. ఉదయం 5.30 గంటలకే మానస నిద్రలేచేది. ఉదయం లేచి ఆరోజంతా ఏం చేయాలనే అంశాలపై డైరీ రాసుకునేది. వర్చువల్‌గా పోటీలు మొదలయ్యే వరకు తనే డ్రస్ డిజైన్ చేసుకునేది. సొంతంగా మేకప్ వేసుకునేది. ఇంట్లో ఒక్కరి సాయం కూడా అడిగేది కాదు. ఇలా ఈ పోటీల్లో తనే ఒక స్టైలిస్ట్‌గా, హెయిర్ డిజైనర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న పట్టుదల మాకెంతో నచ్చింది. ముషీరాబాద్, కోఠీలోని పిల్లలకు విద్యాభ్యాసం వీలు కుదిరినప్పుడల్లా ముషీరాబాద్ గర్ల్స్ స్కూల్, కోఠిలోని షెల్టర్‌హోంలో ఉన్న పిల్లలకు ఉదయం వెళ్లి మ్యాథ్స్ ఇంగ్లిష్ నేర్పించేది. నేనే స్వయాన తనని బైక్ మీద డ్రాప్ చేసి వచ్చేదాన్ని తల్లి శైలజ వివరించారు. ఇలా ఓ ఎన్జీఓలో మూడేళ్ల పాటు ఫ్రీగా పిల్లలకు సర్వీస్ చేసింది. ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. తన చెల్లి, ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా గడుపుతుంటుంది. డిసెంబర్లో జరిగే ప్రపంచ పోటీల్లో నా కూతురు ప్రపంచ కిరీటం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తల్లి శైలజ. ఖాళీ దొరికితే నవలలు చదివేది చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అంటే మానసకు చాలా ఇష్టం. ఖాళీ దొరికితే బుక్స్ చదివేది. అలా కాలేజీ డేస్ నుంచి సెలవుల సమయంలో నవలలు చదివేది. వద్దన్నా వినేది కాదు. ఖాళీ టైంలో అక్కతో కలసి యూట్యూబ్‌లో వంటలు చూస్తూ చేసి అమ్మనాన్నలకు వండిపెట్టేవాళ్లమని వివరించింది మానస చెల్లి మేఘన. ఇలా చైనీస్, థాయ్‌లాండ్ వంటకాలన్నీ ఇష్టపడేది మానస. అక్క, నేను గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్లం ఇద్దరం చిన్న చిన్న విషయాల్లో గొడవ పడేవాళ్లం. అయినా.. అక్కంటే నాకు, నేనంటే అక్కకి ప్రాణం. ఇద్దరం ఫేస్టివల్స్ అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్లం. ది బెస్ట్ సిస్టర్ ఫర్ ఎవర్ అంటూ నేను మంచి మెసేజెస్ పంపితే తను ఫిదా అయ్యేది. – మేఘన వారణాసి (మానస సోదరి) ఏమున్నా మాతోనే షేర్ చేసుకుంటుంది మానస ఏమున్నా మాతోనే షేర్ చేసుకునేది. కలసి మూవీస్‌కి వెళ్తుంటాం. ఎక్కువగా తనకి ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం. అందాల పోటీలకోసం మా ఫ్రెండ్ పడిన కష్టం మాకు బాగా తెలుసు. ఇప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. – నిహారిక, మనస్విని, (మానస ఫ్రెండ్స్) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త
‘హైదరాబాద్ నగరం నన్ను తీర్చిదిద్దింది. ఫుడ్ నుంచి ఫ్రెండ్స్ దాకా ఎన్నో ఇచ్చింది. నేను ఈ నగరంతో మమేకమైపోయా’’ అంటోంది నగరవాసి, తాజాగా ముంబయిలో జరిగిన పోటీల్లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న మానస వారణాసి (23). గ్లామర్ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా బ్యూటీ కాంటెస్ట్‌లోకి అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఎంబ్రాయిడరీ నుంచి ట్రెక్కింగ్ దాకా భిన్న రకాల అభిరుచులు, చిన్న వయసులోనే పరిపక్వ ఆలోచనలతో అబ్బురపరిచే మానస ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నేను గ్లామర్ రంగానికి చాలా కొత్త. కాలేజ్ డేస్‌లో మిస్ ఫ్రెషర్‌గా గెలవడం తప్ప.. గతంలో గ్లామర్ రంగంలో ఎప్పుడూ ఫుల్‌టైమ్ పనిచేసింది లేదు. అనుకోకుండా ఈ పోటీకి ఎంపికై, టైటిల్ గెలుచుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. పోటీ ఇప్పటికే.. సిస్టర్స్‌గా ఎప్పటికీ... మిస్ ఇండియా పోటీలో 31 మంది ఫైనలిస్ట్‌లు పలు రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. కోవిడ్ కారణంగా ఈ పోటీ చాలా వరకూ వర్చువల్‌గానే సాగింది. వీరిలో 15 మంది ముంబయిలో జరిగిన ఫైనల్స్‌కు ఎంపికై హాజరయ్యారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు స్టైలింగ్ నుంచి ఎక్సర్సైజ్ దాకా ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నా. ఈ అనుభవం మర్చిపోలేనిది. పోటీ కేవలం ఇక్కడి వరకే. తర్వాత స్వంత సిస్టర్స్‌లా లైఫ్ లాంగ్ టచ్‌లో ఉంటాం. కుటుంబమే కీర్తి... మనుషులే స్ఫూర్తి... అమ్మమ్మ, తల్లిదండ్రులు, సోదరి ఇదే నా కుటుంబం. వాసవిలో ఇంజినీరింగ్ చదివా. సాధారణ జీవితం, అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అది నేర్పిన విలువలే నన్ను నిర్వచిస్తాయి. తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని, పునరావిష్కరించుకునే మనుషులే నాకు స్ఫూర్తి. జీవితాంతం వ్యక్తిగా పరిణతి సాధించుతూనే సాగుతాను. ఏ విషయంలోనైనా అంతిమంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేని సంపూర్ణ జీవితమే నాకు ప్రధానం. సినిమా... రమ్మంటే? భవిష్యత్తు మనకేమి ఇస్తుందో ఎవరికి తెలుసు? ఒక కొత్త ఆశలు..అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నేను మిస్ ఇండియా పోటీలకు వచ్చాను. ఈ టైటిల్ నన్నెక్కడికి తీసుకెళుతుందో చూడాలని నేను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నా. సినిమా రంగ ప్రవేశం అనే ప్రశ్నకు కాలం మాత్రమే సమాధానం చెబుతుంది. నా వరకూ నాకు ఎదురయ్యే ప్రతి అవకాశానికి తలుపులు తెరచి ఉంచాలనేది ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణం నాకు నేర్పింది. అద్భుత యోగం.. అందం మానసికం.. శరీరంతో పాటు మనసు ఆత్మల మేలు కలయికే ఫిట్నెస్. అది అందించేదిగా నేను ఎంచుకున్న యోగా నా జీవితంలో అద్భుతాలు చేసింది. ఇతరుల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం కాక నిన్ను నువ్వు మెప్పించుకోవడమే ముఖ్యమనేది ఫ్యాషన్‌లో పాటించే సూచించే సూత్రం. నువ్వేమిటి అనే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి నువ్వు సంతృప్తిగా భావించకపోతే అందంగా ఉండడం అనేదానిలో అర్ధం లేదు. అందాల భామ.. అభిరుచుల చిరునామా.. నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ఎనలిస్ట్‌గా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ వారణాసి. ఇన్స్ట్రా గ్రామ్ ద్వారా పెట్స్‌పై ప్రేమ నుంచి తన ఎంబ్రాయిడరీ స్కిల్స్ దాకా ఎన్నో ఆమె పంచుకుంటుంటారు. ట్రెక్కింగ్, స్కై గేజింగ్ తదితర సాహసాలు చేయడాన్ని ఇష్టపడే మానస సైన్ లాంగ్వేజ్ లో కూడా శిక్షణ పొందారు. ఒక సాధారణ యువతిగా నగరానికి చెందిన ఎన్జీవో ‘మేక్ ఎ డిఫరెన్స్’తో కలిసి పనిచేయడం నన్ను చాలా మార్చింది. నా అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని అధిగమించడానికి, విద్యాపరమైన సమానత్వాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా ఉపకరించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఇక మిస్ ఇండియాగా సమాజానికి నా వంతు బాధ్యత స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాను.