
అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రమిది. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. మా నాన్నగారు మలేషియాలో ఉద్యోగి. దీంతో నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. ఇంజినీరింగ్ మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశాను. ఆ తర్వాత ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాను.
మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడంతో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత ఓ మూవీ వర్క్‌షాప్‌లో పాల్గొనడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. ఇక ‘దేవకి నందన వాసుదేవ’ లో నేను విజయనగరం అమ్మాయి సత్యభామపాత్రలో నటించాను. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయి తను. సత్యభామపాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది.
నాకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. దీంతో ఈ సినిమాలోని డ్యాన్స్ సాంగ్ ‘బంగారం’కు అది కొంత ఉపయోగపడింది. అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాలగార్లు సెట్స్‌లో సపోర్టివ్‌గా ఉన్నారు. బాలకృష్ణగారి వల్లే ఈ సినిమా గ్రాండ్‌గా వచ్చింది. హీరో సంతోష్ శోభన్ తో ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ చేశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment