
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్‌గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
చదవండి:
200 థియేటర్లో రిరిలీజ్‌కు సిద్ధమైన ఆర్‌ఆర్‌ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా?
ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్ చరణ్
Comments
Please login to add a commentAdd a comment