Prasanna Kumar
-
ఆయన వద్దనడంతోనే వెంకటేశ్‌తో సినిమా ఆగిపోయింది: ప్రసన్నకుమార్
ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) రాసిన ఎన్నో కథలు వెండితెరపై హిట్లు, సూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా.. ఇప్పుడు మజాకా చిత్రాలకు ప్రసన్నకుమార్ కథ అందించగా వాటిని నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశాడు. ఇటీవలే వీరి కాంబినేషన్లో మజాకా మూవీ కూడా వచ్చింది. తన కెరీర్లో నాని, రవితేజ, నాగార్జున వంటి పెద్ద హీరోలతో పని చేసిన ప్రసన్నకుమార్ ఓసారి వెంకటేశ్ (Daggubati Venkatesh)తోనూ సినిమా చేయాలనుకున్నాడట!కథ ఓకే అయింది కానీ..ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. వెంకటేశ్‌గారికి గతంలో ఓ కథ పూర్తిగా వివరించి చెప్పాం. ఆయన సరేనని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. డేట్స్ చెప్పి షూటింగ్ మొదలుపెట్టేయండి అన్నారు. అయితే వెళ్లేముందు వాళ్ల అన్నయ్య సురేశ్‌బాబుకు కూడా కథ చెప్పమన్నారు. ఆయనతో రెండుమూడుసార్లు కూర్చున్నాం.. కథ వివరించాం.. ఆయనకేవో కొన్ని డౌట్స్ వస్తే వివరణ ఇచ్చాం. మాకు నమ్మకముందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. సురేశ్‌బాబు వల్లే..ఆయనకు తెలిసిన ఇద్దరుముగ్గురిని పిలిపిస్తాను. వారి అభిప్రాయం తెలుసుకున్నాక మాట్లాడదాం అన్నారు. ఎక్కడెక్కడి నుంచో ముగ్గురు వివిధ సమయాల్లో వచ్చారు. ఒక్కొక్కరికి సెపరేట్‌గా కథ చెప్పాను. ఆ ముగ్గురూ కథ బాగుందన్నారు. నాకు కథపై పట్టుందని, నన్ను డిస్టర్బ్ చేయకపోతే బెటర్ అని సురేశ్‌బాబు దగ్గరకు వెళ్లి చెప్పారు. కానీ సురేశ్‌బాబు నన్ను పిలిచి.. వేరేవాళ్ల నిర్ణయాలను పట్టించుకోను, తన నిర్ణయమే ఫైనల్ అన్నారు. అలాంటప్పుడు ఎందుకు వారికి కథ చెప్పడం అనిపించింది. అలా ఆయనకు నచ్చక సినిమా కుదర్లేదు అని చెప్పుకొచ్చాడు.చదవండి: మన దేశంలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా -
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ
అందం, అమాయకత్వంతో అలరించిన హీరోయిన్లలో స్నేహ ముందువరుసలో ఉంటారు. ప్రియమైన నీకు సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు.. ఇలా అనేక చిత్రాల్లో కథానాయికగా నటించింది. 2009లో అచ్చముందు అచ్చముందు అనే తమిళ సినిమాలో నటుడు ప్రసన్నతో జోడీగా నటించింది. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు సంతానం. అతి ఉండకూడదు పెళ్లి తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో చివరగా వినయ విధేయ రామలో కనిపించింది. ఇటీవలే చీరల బిజినెస్‌లోకి దిగింది స్నేహ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పొజెసివ్‌నెస్ ఉండాలి.. కానీ అతిగా ఉండకూదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేం. ఉదాహరణకు.. బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అదే నమ్మకాన్ని పెంచుతుంది ఒకరు మనల్ని అడిగేముందే.. నేను ఫలానా చోటుకు వెళ్తున్నాను.. ఈ సమయంలోపు వచ్చేస్తాను అని సమాచారం ఇవ్వాలి. అక్కడికి వెళ్లాక కూడా మీకు టైముంటే ఒకసారి మీ భాగస్వామికి ఫోన్ చేసి నేను చేరుకున్నాను, నువ్వు భోజనం చేశావా? అని ఆరా తీయాలి. ఇలాంటి చిన్నచిన్నవే ప్రేమను, నమ్మకాన్ని పెంచుతాయి. పెళ్లయిన కొత్తలో నేను కూడా పొజెసివ్‌గా ఉండేదాన్ని. అలా అని తనపై నమ్మకం లేదని అర్థం కాదు. బ్రేకప్ మంచే చేసింది! గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వారికి బ్రేకప్ అయింది. దానివల్ల నాకెలాంటి సమస్యా లేదు. ఎందుకంటే ఆ బ్రేకప్ జరిగి ఉండకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికేవాడే కాదు! అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చిపడటంతో ఆ ఏడాదంతా ఎంతో కష్టంగా నడిచింది. మానసిక ఒత్తిడికి లోనయ్యాను. సరిగ్గా అప్పుడే నేను ఉత్తమ నటిగా తమిళనాడు ఫిలిం అవార్డు అందుకున్నాను అని చెప్పుకొచ్చింది. చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్ తనయుడు -
ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఓటమి భయం పట్టుకున్న ఆ పార్టీ అభ్యర్థులు చివరికి అడ్డదారులు ఎంచుకున్నారు. ఆయారాం, గయారాంలను గుర్తించి ప్యాకేజీ ఆఫర్లతో వారిని కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఆ పార్టీ ఓడిపోయాక అధికారం కోసం వైఎస్సార్సీపీ చెంత చేరిన నేతలే ఇప్పుడు టీడీపీ నేతల ప్యాకేజీలకు కక్కుర్తిపడుతున్నారు. నిఖార్సైన వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వారిచ్చే ప్యాకేజీలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక టీడీపీ నేతల బరితెగింపును చూస్తున్న ఓటర్లు మాత్రం వారిని ఛీదరించుకుంటున్నారు. తాజాగా.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రూ.3 కోట్లు ఆఫర్ ఇవ్వడం బట్టబయలు కావడంతో టీడీపీ అభ్యర్థుల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. వేమిరెడ్డి దంపతులు ఓట్ల కొనుగోలుకు నోట్ల కట్టలను విచ్చలవిడిగా విసురుతున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ఎరవేస్తున్నారు. ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో మత్స్యకార గ్రామాల్లో దురాయి ఆచారాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ల కొనేందుకు రూ.80 లక్షలకు బేరం పెట్టిన విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో వీరు తాజాగా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించారు. ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలు.. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తునారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు స్థానిక లీడర్లకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున రేటు ఫిక్స్ చేశారు. వీరి పరిధిలో ఓట్లు వేయించే బాధ్యత మీదే అంటూ టార్గెట్లు పెడుతున్నారు. అలాగే, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కందుకూరు నియోజకవర్గాలతో పాటు తన సతీమణి పోటీచేస్తున్న కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు రేట్లు ఫిక్స్చేసి ప్రలోభాలకు గురిచేయడం వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ఆయారాం, గయారాంలను ఒకొక్కరిని రహస్యంగా తమ శిబిరాలకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బుచి్చరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు బ్యాంకు చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఒకరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన నేత కావడం గమనార్హం. ఎన్నికల వేళ ప్యాకేజీ ఆఫర్ పెంచుకుని తిరిగి సొంత పార్టీలోకి మారారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. అలాగే, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ కూడా ఇదే తరహా ప్యాకేజీలతో పార్టీ ఫిరాయించారని చెబుతున్నారు. నేతలకు ప్యాకేజీలతో పాటు ఓటర్లకు సైతం భారీగానే డబ్బులిస్తామని, ఆ డబ్బుల పంపిణీ బాధ్యత కూడా మీదే అని ఆశపెట్టి మరీ పార్టీ కండువా కప్పుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఏర్పాటుచేసుకున్న టీమ్‌తో వ్యవహారాలు నడిపిస్తున్నారు. రివర్స్ అవుతున్న ఓటర్లు.. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులు మండల స్థాయి నేతలకు రూ.కోట్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ప్యాకేజీలు ఇస్తున్నారు. ప్యాకేజీలు తీసుకున్న వారు ఈ దఫా ఎన్నికల్లో ప్రశాంతిరెడ్డికి ఓట్లు వేద్దామని స్థానికులకు చెబుతుండడంతో ‘ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ల దగ్గర’.. అంటూ భగ్గుమంటున్నారు. తమకు సీఎం జగన్ రూ.లక్షల్లో సాయం అందించారని, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్లకు ఓటేసి ఆయనకు ద్రోహం చేయలేమని ఓటర్లు తెగేసి చెబుతున్నారు. -
టీడీపీలో ‘ఆడియో’ దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఆ ఆడియో సంభాషణను విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ ఆడియో తనది కాదని ప్రశాంతిరెడ్డి కామాక్షమ్మ అమ్మవారి సాక్షిగా చెప్పగలరా అని రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబంతో తమకు అనుబంధం ఉందన్నారు. నేటికీ జగన్మోహన్రెడ్డితో ఆ అనుబంధం కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు. ఓడితే ముఖం చాటేస్తారు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెద్దలపట్ల అగౌరవంగా మాట్లాడడం, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలగుతాం అని చెప్పడం చూస్తే వారి వ్యవహారం ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. ఓడిపోతే విదేశాల్లో వ్యాపారాలు, లావాదేవీలు చేసుకుంటూ ప్రజా జీవితంలోకి రారని వారి మాటల బట్టి తెలుస్తోందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ అభ్యర్థులు కావాలో ఓడిపోతే ముఖం చాటేసే టీడీపీ అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరూలేకే టీడీపీ వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకుందన్నారు. నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చారు: ప్రసన్నకుమార్‌రెడ్డి ఇక తన సోదరుడు రాజేంద్రకు ప్రశాంతిరెడ్డి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఆహా్వనించినా వారి ప్రలోభాలకు తలొగ్గలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వాడు అని సం¿ోదించడం చూస్తే ఎంత అహంకారంతో మాట్లాడుతోందో అర్థమవుతోందన్నారు. ఆడియో సంభాషణ ఇలా.. రాజేంద్ర: హలో ప్రశాంతక్కా.. బావున్నావక్కా.. ప్రశాంతి: ఎక్కడున్నావ్? రాజేంద్ర: అక్కా బెంగళూరులో ఉన్నా. అక్కా ఇక్కడ రెండు పీజీలు ఏర్పాటుచేశాను ప్రశాంతి: నీవు ఇక్కడ లేవా? రాజేంద్ర: పీజీలు ఏర్పాటుచేసి ఇక్కడే ఉన్నాను. వచ్చిపోతుంటాను అక్కా. ప్రశాంతి: నేనెందుకు చేశానంటే.. ఇప్పుడే నీవు చెప్పొద్దు.. కోవూరు నుంచి పోటీచేయమని అడుగుతున్నారు వాళ్లు.. సర్వేపల్లి నుంచి పోటీచేయమని అడిగారు.. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు కదా అని వద్దన్నాను. కోవూరు తీసుకోమన్నారు.. ఫస్ట్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అల్లుడు కోసం ఉంచారు.. ఆయన పార్టీలోకి రాకపోవడంతో నన్నే చేయమంటున్నారు. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: ఇంకా వాళ్లు (వైఎస్సార్సీపీ) మా వెంటçపడే ఉన్నారు. నాక్కూడా పార్టీ మారడం ఇష్టంలేదు, ఫస్ట్ నుంచి ఈ పార్టీ అంటే ఇష్టం నాకు.. మరీ వాళ్లు ఈ మాదిరి చేసేసరికి అన్నను కని్వన్స్ చేయలేకపోయా. నాకు ఇంత అవమానం జరిగితే ఇంకా వెంటపడతావా అన్నారు. నాది చేతగానితనం అనుకుంటావా. నాకు రాజకీయం అవసరంలేదు. నేను పోటీచేస్తా.. గెలిస్తే గెలుస్తా.. లేకుంటే ఓడిపోతా. ఆ తర్వాత క్విట్ అయిపోతా.. పోటీచేయకుండా ఉండనన్నాడు.. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: వీళ్లందరూ నన్ను ఉండమంటున్నారు. లేదులే మేం ఎంపీ ఎలక్షన్ చేసుకుంటాం అన్నాను.. లేదులే అన్నాను. కోవూరు అయితే ఆదాల అల్లుడు అనుకున్నారు. కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కోవూరే తీసుకోమంటున్నారు. రాజేంద్ర: అవును కదక్కా అందరం ఇంట్లో వారం కదా. ప్రశాంతి: ఇంట్లో వారమే కానీ వాళ్లు పోటీచేయమంటున్నారు.. అన్న కూడా పార్టీ వీడుతున్నారు కాబట్టి వైఎస్సార్సీపీ నుంచి ప్రెజెర్స్ ఉంటాయి.. ఆత్మకూరు అయితే పదివేలతో ఆనం రామనారాయణరెడ్డి ఓడిపోతాడు.. అయితే, విక్రమ్ బాగా చేస్తున్నాడు.. రామనారాయణరెడ్డి పోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది.. రాజేంద్ర: అక్కా.. నేను మధ్యస్తంగా ఏమి చెప్పలేను.. నాకు ఇద్దరు కావాలక్కా.. ఈ మ«ధ్య అన్నకు దూరంగా ఉన్నా. ప్రశాంతి: మీడియాకు వీడియోలు పెడుతున్నావు కదా.. ప్రతి ఎలక్షన్‌కు అన్నదమ్ముల మధ్య మామూలే కదా.. రాజేంద్ర: కానీ, మా మధ్య ఏమీలేవక్కా.. అన్న గెలుపు కోసం గట్టిగా కృషిచేసేవాళ్లం. ప్రశాంతి: ఎక్కడా చెప్పకు రాజేంద్ర.. మేమైతే ఇంకా ఓకే చెప్పలేదు రాజేంద్ర. అంతా బంధువులు కదా.. సర్వేపల్లి గురించి చెప్పినా నేను ఒప్పుకోలేదు. నీవు సర్వేపల్లిలో అయితే గెలుస్తావన్నారు.. గెలవనని కాదు. నాకు ఇష్టంలేదు అని చెప్పా.. మరీ ఆయనకు (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి) టికెట్ ఇవ్వమనే చెప్పారు.. నేను వద్దని చెప్పాను.. ఎవరు ముందుకు రాకపోతే ఆయనకే టికెట్ ఇస్తారు కదా పాపం.. -
టీడీపీ నేతలు ఓడిపోతున్నారు.. వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో లీక్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. టీడీపీలో చేరితే మూడు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కాగా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇటీవల కొవ్వూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి కాల్ చేశారు. ఈ కాల్ సందర్భంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. అలాగే, ప్రసన్న కుమార్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డిని విడగొట్టేందుకు పలు మార్లు రాజేంద్రనాథ్‌కు ఆమె కాల్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనాథ్‌ను టీడీపీలో చేరాలని సూచించారు. టీడీపీలో చేరితో మూడు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అలాగే, టీడీపీకి అభ్యర్థులు లేకపోవడంతో తనను కొవ్వూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని ఆమె ఈ కాల్లో మాట్లాడారు. ఇదే సమయంలో తాము ఓడిపోతే ప్రజలను వదిలేసి వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం, ప్రశాంతి రెడ్డి ఆడియోను రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. నా మద్దతు కోసం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ చేశారు. నల్లపురెడ్డి కుటంబంలో విభేదాలు తేవాలని చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేదు. ప్రశాంతి రెడ్డి రెడ్డికి మా కుటుంబం పేరెత్తే అర్హత కూడా లేదన్నారు. -
డెలివరీ అయిన మూడోరోజే అనసూయ అలా చేసింది!
సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయ్యే యాంకర్.. అనసూయ భరద్వాజ్. ఆంటీ అన్న ఒక్క పదంతో నెటిజన్లు ఈమెను ఆటాడుకుంటారు. తన డ్రెస్సింగ్‌ను, మాటల్ని.. అన్నింటినీ విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ప్రతిదాన్ని భూతద్దంలో వెతికి మరీ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఎవరెన్ని చేసినా ఆమెను దెబ్బతీయలేరంటున్నాడు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఈయన జబర్దస్త్ కామెడీ షోకి సైతం స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించాడు. అర్ధరాత్రి వరకు.. తాజాగా అతడు అనసూయ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'అలీ టాకీస్ అనే షో చేసినప్పుడు అనసూయ ఎపిసోడ్ షూట్ అవగానే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రిహార్సల్స్ చేసేది. ఆమెకు పనిపట్ల అంతటి అంకితభావం ఉంది. ఓసారి ఓ టీవీ ఛానల్ వాళ్లు నా డైరెక్షన్లో కొత్త షో చేద్దామన్నారు. అనసూయను యాంకర్‌గా అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. టెస్ట్ షూట్ చేద్దామన్నారు. అందుకోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాం. డెలివరీ అయిన మూడో రోజే.. సరిగ్గా షూటింగ్‌కు రెండు రోజుల ముందు ఆమె డెలివరీ అయింది. ఒకరోజు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది. రెండో రోజు జిమ్‌కు వెళ్లింది. మూడో రోజు సెట్‌కు వచ్చింది. అరగంటకోసారి బిడ్డకు పాలు పడుతూ యాంకరింగ్ చేసింది. అందరం ఆశ్చర్యపోయాం.. ఆ రోజు షూటింగ్‌కు వచ్చినందుకుగానూ ఇంతవరకు డబ్బులు అడగలేదు. టెస్ట్ షూటే కదా నేను రాలేను, ఇంకెవర్నైనా చూసుకో అని మాట వరసకు కూడా అనలేదు. అందరూ ఊరికే తనను విమర్శిస్తుంటారు. కానీ తనంత టఫ్ అమ్మాయి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. పైకి చూడటానికి గ్లామర్‌గా కనిపిస్తుంది కానీ దాని వెనక ఆ అమ్మాయి పడ్డ కష్టాలు ఎవరికీ తెలియదు' అని చెప్పుకొచ్చాడు ప్రసన్న కుమార్. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన రకుల్.. మరోసారి.. -
వెంకటగిరి వైఎస్ఆర్ నగర్లో టిడ్కో గృహాలను పరిశీలించిన టిడ్కో ఛైర్మన్ ప్రసన్నకుమార్
-
చంద్రబాబుపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్
-
జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ బేబీని గుర్తుపట్టారా?
సినీ హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నెట్టింట్లో తెగ వెతుకుతారు. అలానే హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు కూడా తెగ వైరల్ అవుతాయి. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తాజాగా ఓ క్యూట్ బేబీ ఫొటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామందికి ఉన్న అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ వెండితెరపై ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే మొదట సావిత్రి, సౌందర్య వంటి తారలు గుర్తుకు రావడం సహజం. ఈ జాబితాలో మరో భామ కూడా చేరుతుంది. ఆమె ఎవరో కాదు స్నేహ.. ఈ ఫోటోలో క్యూట్‌గా ఉన్నది జూనియర్ సౌందర్యగా పిలుచుకునే స్నేహనే.. తెలుగులో స్నేహ ‘తొలివలపు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. తరుణ్‌తో కలిసి ‘ప్రియమైన నీకు’ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ 68వ చిత్రంలో స్నేహ ఒక కీలకపాత్రలో నటించనుంది. -
పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు
సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామందికి ఉన్న అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ వెండితెరపై ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే మొదట సావిత్రి, సౌందర్య వంటి తారలు గుర్తుకు రావడం సహజం. ఈ జాబితాలో మరో భామ కూడా చేరుతుంది. ఆమె మరెవరోకాదు.. తెలుగుతోపాటు సౌత్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆమె రామ్ చరణ్ వినయ విధేయ రామతో రిఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నటి స్నేహ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె పూర్వీకులు ఏపీలోని రాజమండ్రిలో నివసించారు. కానీ ఆమె తల్లిదండ్రులు రాజారామ్, పద్మావతి వ్యాపార రిత్యా ముంబాయికి వెళ్లారు. హీరోయిన్ స్నేహ కూడా అక్కడే జన్మించారు. నిర్మాతతో ప్రేమలో కోలీవుడ్‌లో స్థిరపడిన స్నేహ, ప్రసన్నలకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కితాబు చాలామంది ఇస్తుంటారు. పదకొండేళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికీ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. సినీ పరిశ్రమలో విడాకులు తరచు పెరుగుతున్న పరిస్థితుల్లో స్నేహ, ప్రసన్నల కుటుంబ జీవితం అందరికీ ఉదాహరణగా చెప్పుకుంటారు కూడా. పెళ్లయ్యాక ఇద్దరూ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరోక వ్యక్తిని ప్రేమించారని తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ వెల్లడించాడు. (ఇదీ చదవండి: Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్ రివ్యూ) ఆ ప్రేమ విఫలం కావడంతోనే స్నేహ ఇక పెళ్లి చేసుకోదనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రసన్నతో ప్రేమలో పడకముందే స్నేహ ఓ సినీ నిర్మాతతో ప్రేమలో పడిందని, అది విఫలమైందని బెయిల్వాన్ రంగనాథన్ పేర్కొన్నాడు. 'స్నేహ ప్రసన్నతో ప్రేమలో పడకముందే నిర్మాత రవితో ప్రేమలో ఉన్నారని, కొంతకాలం తర్వాత వారి ప్రేమ పెళ్లి దాకా కూడా వెళ్లిందని ఆయన చెప్పాడు. అంతేకాకుండా వారిద్దరూ డైమండ్ రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారని తెలిపాడు. నిశ్చితార్థం తర్వాత, స్నేహ తన ప్రియుడు రవికి తన పట్ల చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని గ్రహించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం సరికాదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. అలా రవితో తన ప్రేమకు స్నేహ స్వస్తి చెప్పినట్లు ఆయన గుర్తుచేశాడు. ఈ సంఘటన తర్వాత ప్రసన్నతో పరిచయం ఆమెకు పరిచయం ఏర్పడింది. కానీ ప్రేమ పట్ల తనకు నమ్మకం లేకపోవడంతో మొదట ప్రసన్నకు కూడా ఆమె దూరంగా ఉండేదని తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆయన అన్నాడు. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారని బైల్వాన్ రంగనాథన్ తెలిపారు. త్వరలో స్నేహ, ప్రసన్న విడిపోవాలని యోచిస్తున్నట్లు తమిళనాట వార్తలు బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత వారిద్దరూ వాటికి బ్రేక్ వేసి హ్యాపీ లైఫ్‌ను గడుపుతున్నామని వెల్లడించారు. వాళ్లిద్దరూ మంచి కపుల్స్ అని బైల్వాన్ కితాబు ఇచ్చారు. ప్రసన్న, స్నేహ మొదట 2009 థ్రిల్లర్ అచ్చబేడులో వెండి తెరపై జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వారి పెళ్లి అనంతరం స్నేహ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ కొంత కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ చెస్తుంది. కొన్నిసార్లు స్నేహ రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపిస్తుంది. ప్రసన్న చివరిసారిగా దుల్కర్ సల్మాన్ చిత్రం కింగ్ ఆఫ్ కొత్తలో నటించాడు. ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. -
హైలెస్సో హైలెస్సా...
‘‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లు. సామ్ .జి, వంశీకృష్ణ వర్మ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ సాగే పాటని తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విడుదల చేశారు. డి. ప్రసన్న కుమార్ సాహిత్యం అందించిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, ఎ. ప్రవస్తి పాడారు. ‘‘అందమైన ప్రేమకథని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు అనూప్’’ అన్నారు మేకర్స్. -
తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నైవేలీ సిద్ధం.. చైర్మన్ మోటుపల్లి ప్రసన్న కుమార్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అప్పటికప్పుడు వినియోగించుకోవాల్సిందే. భారీ పరిమాణంలో విద్యుత్‌ను నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవడానికి అవసరమైన సాంకేతికత, సదుపాయాలు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేవు. ఇందుకు భిన్నంగా దేశంలోనే తొలిసారిగా 8 మెగావాట్ల భారీ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం(బెస్)ను దక్షిణ అండమాన్ దీవిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్సీ) ఏర్పాటు చేసి విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతంగా స్టోరేజీ సిస్టంను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, దానికి అనుసంధానంగా 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. 101.94 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.136.61 కోట్లను ఖర్చు చేసినట్టు నైవేలీ సంస్థ సీఎండీ మోటుపల్లి ప్రసన్న కుమార్ తెలిపారు. సాధారణంగా యూనిట్ సౌర విద్యుదుత్పత్తికి రూ.2.60 నుంచి రూ.2.8 పైసల వ్యయం అవుతుండగా, బ్యాటరీ సిస్టంలో నిల్వ చేసేందుకు అవుతున్న వ్యయాన్ని కలుపుకుని.. మొత్తంగా యూనిట్‌కు రూ.7.41 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన ఆయన గత జనవరి 12న నైవేలీ సంస్థ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశంలో ఏర్పాటైన తొలి బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైవేలీ సంస్థ తరఫున పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అండమాన్‌లో మరో బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్.. దక్షిణ అండమాన్ విద్యుత్ అవసరాలు 35 మెగావాట్లు. పూర్తిగా డీజిల్ జనరేటర్లతోనే ఆధారపడేవారు. పెద్ద ఎత్తున కాలుష్యం, డీజిల్ వ్యయం ఉండేది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంతో ఈ సమస్య కొంత మేరకు తగ్గింది. అండమాన్ విజ్ఞప్తి మేరకు రెండో విడత కింద మరో 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, 8 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. రెండో దశ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసే విద్యుత్ ధర ఇంకా తక్కువగా ఉండనుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సాంకేతిక విశేషాలు.. - లిథియం అయాన్ బ్యాటరీల మోడ్యూల్స్ - 1260 - 0.96 ఎంవీఏ సామర్థ్యం గల 9 బెస్ కంటైనర్లు - 0.96 ఎంవీఏల సామర్థ్యం గల బై-డైరెక్షనల్ పవర్ కండిషనింగ్ సిస్టంలు- 18 - యూనిట్ విద్యుత్ ధర రూ.7.4 ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం.. వ్యాపార విస్తరణలో భాగంగా పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, లిగ్నైట్ నుంచి మిథనాల్, గ్యాస్, డీజిల్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ప్రవేశించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ, ఏపీతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జలాశయాలపై పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల రంగ పరిశ్రమల కోసం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ క్లస్టర్లో నైవేలీ ఆధ్వర్యంలో ఎలక్రి్టక్ వాహనాల పరిశ్రమ స్థాపనకు పరిశీలిస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల ఇంధన శాఖలతో చర్చలు సైతం జరిపాం. రెండు రాష్ట్రాల్లో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్.. తెలంగాణకు 230 మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనున్నాం. ఆ వెంటనే సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే తెలంగాణకు 311 మెగావాట్లు తెలంగాణకు, 230 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. మా విద్యుత్ అత్యంత చౌక.. మా లిగ్నైట్ గనుల దగ్గరే విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాం. లిగ్నైట్ రవాణా ఖర్చులుండవు. దీంతో దేశంలోనే అత్యంత చౌక విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ధరలపరంగా మెరిట్ ఆర్డర్లో టాప్ పోజిషన్లో ఉన్నాం. రూ.24000 కోట్ల పెట్టుబడులు.. దేశంలోనే 1000 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ మాదే. 2030 నాటికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 6000 మెగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల స్థాపన కోసం నైవేలీ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ఎల్ను నెలకోల్పాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు అవకాశాలను పరిశీలిస్తాం. -
లోకేష్ పై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం
-
చిన్న సినిమాలు సక్సెస్ కావాలి
‘‘చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు. ‘ఐక్యూ’ సినిమా సక్సెస్‌తో ఆయన మరిన్ని సినిమాలు ప్లా¯Œ చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు. సాయి చరణ్, పల్లవి జంటగా జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’. కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ–‘‘ఐక్యూ’ సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది.. అందుకే రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది’’ అన్నారు. రచయిత ఘటికాచలం పాల్గొన్నారు. -
టిడ్కో ఇళ్లపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో పేదల ప్రగతి కోసం నూరు శాతం పనిచేసే ప్రభుత్వం సీఎం జగనన్నదేనని, ఇది చూసి ఓర్వలేని టీడీపీ.. వారికి వత్తాసు పలికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని టిడ్కో గృహాలను మంగళవారం ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో 5,024 టిడ్కో ఇళ్లను అన్ని వసతులతో సిద్ధంచేశామన్నారు. గత ప్రభుత్వం సగం చేసిన పనులను తాము పూర్తిచేశామని, కరోనా కష్టకాలంలో కొన్ని నెలలు పనులు ఆగినా అనంతరం వేగంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాయడం సరికాదని ప్రసన్నకుమార్ హితవు పలికారు. మంచినీరు లేనిచోట ఇళ్లా!? ఇక తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఎస్టీపీ, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు లేకుండా గత ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వంపై దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడినప్పటికీ అన్ని వసతులు కల్పించి టిడ్కో ఇళ్లను సిద్ధంచేశామన్నారు. నిజానికి.. గత ప్రభుత్వం మంచినీరు దొరకని ప్రదేశాలను టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిందన్నారు. తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, నవులూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో వాటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి నీరు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరున లబ్దిదారులకు అందిస్తామని ఆయన ప్రకటించారు. పచ్చ మీడియా అసత్య ప్రచారాలు మానుకుని ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలేగాని, ప్రభుత్వ కృషికి ఆటంకంగా నిలువరాదని ప్రసన్నకుమార్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
పేదల కల నెరవేరుస్తున్న సీఎం జగన్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ అన్నారు. విశాఖలోని 52వ వార్డు గౌరీనగర్‌లో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకుల ఆరోపణలు శుద్ధ అబద్ధమన్నారు. టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినా అవి పూర్తి కాలేదన్నారు. వాటిని ఒక యజ్ఞంలా పూర్తి చేశామన్నారు. రూపాయికే ఇల్లు రాష్ట్రంలో 2.62 లక్షల గృహాలు నిర్మాణం జరుగుతుండగా.. అందులో 1,43,600 గృహాలు కేవలం ఒక్క రూపాయికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అందిస్తున్నారని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2018లో విడుదల చేసిన జీవోలో ప్రతి 300 చదరపు గజాల గృహ లబ్దిదారుడు రూ.2.65 లక్షలు చెల్లించాలని ఉందని గుర్తు చేశారు. ఈ సొమ్ము బ్యాంకుల్లో అప్పు తీసుకుని వాయిదాలు కడితే 20 ఏళ్లకు సుమారు రూ.7.20 లక్షలు కట్టాల్సి వచ్చేదన్నారు. పాదయాత్ర సందర్భంగా కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను ఉచితంగా అందజేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారమే పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో బీ కేటగిరీ ఇళ్లు రూ.50 వేలు ఉండగా.. దాన్ని రూ.25 వేలు చేశారన్నారు. సీ కేటగిరీ ఇళ్లు రూ.లక్ష ఉండగా.. దాన్ని రూ.50 వేలు చేశారని వివరించారు. ఇప్పటికే 22 పట్టణాల్లో 50 వేల గృహాలను లబ్ధిదారులకు అందించామన్నారు. అందులో 25 వేల గృహాలు ఒక్క రూపాయికే అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ కృష్ణ, సింహాచలం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలు శ్రీదేవి వర్మ, వైఎస్సార్ సీపీ నాయకులు జియ్యాని మారుతి పాల్గొన్నారు. -
ఆ వెబ్‌సిరీస్‌లో విలన్‌గా మారిన హీరోయిన్ స్నేహ భర్త
తమిళ సినిమా: ఇరు దురువం ఈ వెబ్ సిరీస్ కరోనా లాక్డౌన్ సమయంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో తాజాగా దానికి సీక్వెల్‌ను రూపొందించారు. తొలి వెబ్ సిరీస్‌కు కుమరన్, రెండవ భాగానికి అరుణ్ ప్రకాష్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటుడు నందా, ప్రసన్న, నటి బిగ్ బాస్ అభిరామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఇది సోనీ లీవ్ ఓటేటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ వర్గాలు చెన్నైలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నటుడు ప్రసన్న మాట్లాడుతూ తాను ఇందులో ప్రతి నాయకుడిగా వైవిధ్య భరిత కథాపాత్రను పోషించినట్లు చెప్పారు. తన పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయన్నారు. ఇక కాగా నటుడు నందా ఈ వెబ్ సిరీస్ తొలి భాగంలో కథానాయకుడుగా నటించారు. దీంతో ఇప్పుడు సీక్వెల్లో నటించడం సులభం అయిందని చెప్పారు. ఇందులో ఈయన సిన్సియర్ పోలీస్ అధికారిగా నటించారు. దర్శకుడు అరుణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఇరు దురువం వెబ్ సిరీస్‌కు ఇది సీక్వెల్ అన్నారు. తొలి భాగంలోని విక్టర్ (నందా) పాత్ర తనను బాగా ఆకట్టుకుందన్నారు. దాన్ని మెయిన్‌గా తీసుకొని 10 ఎపిసోడ్స్ ఈజీగా రూపొందించవచ్చని భావించారన్నారు. అలా పది నెలల పాటు ఈ వెబ్ సిరీస్ కథను తయారు చేసినట్లు చెప్పారు. దీనికి మూడో సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారు. ఇందులో కిడ్నాప్ గురైన యువతిగా, ఒక బిడ్డకు తల్లిగా, భర్తకు దూరమైన భార్యగా తాను నటించినట్లు నటి అభిరామి పేర్కొన్నారు. -
మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్!
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: 200 థియేటర్లో రిరిలీజ్కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా? ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్ చరణ్ -
ఎక్కడ సూటుకేసులు దొరికితే పవన్ అక్కడికి వెళ్తారు: ఎమ్మెల్యే ప్రసన్న కుమార్
-
నాలుగో విడత టిడ్కో ఇళ్లు పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో (జీ+3) ఇళ్లు నాలుగో విడత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో 14,460 మంది లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ పనులపైనా టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్ అధ్యక్షతన బుధవారం బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు. నంద్యాల, శ్రీకాకుళం, పొన్నూరు, అడవి తక్కెళ్లపాడు, సాలూరు, కావలి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నవాటిని అందజేయనున్నారు. ఇందులో నంద్యాల 5 వేలు, శ్రీకాకుళం 1,280, పొన్నూరు 2,368, అడవి తక్కెళ్లపాడు(గుంటూరు) 2,500, సాలూరు 1,200 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారానికి కావలిలో మరో 2,112 యూనిట్లు కూడా అన్ని వసతులతో అందుబాటులోకి రానున్నాయి. కాగా, పంపిణీ చేసేనాటికి ఆయా ప్రాంతాల్లో అదనంగా ఎన్ని పూర్తయితే అన్నింటినీ అదే వేదిక ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లలో ప్రభుత్వం రూ. 1కే అందిస్తున్న 300 చ.అడుగుల యూనిట్లు మినహా మిగిలిన 365, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల విషయంలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కానివారికి నాలుగైదు రోజుల్లో మంజూరు చేయించి జనవరి మొదటి వారంలో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, జనవరి చివరినాటికి సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన 1.20 లక్షల యూనిట్ల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 75 నుంచి 80 శాతం పూర్తయిన బ్లాకులకు యుద్ధప్రాతిపదికన ఎస్టీపీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారుల బ్యాంకు లింకేజీని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఆయా పట్టణ స్థానిక సంస్థల అధికారులను ఆదేశించారు. బోర్డు సమావేశంలో చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మితో పాటు టిడ్కో బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు... ‘ధమాకా’ అలా ఉంటుంది: ప్రసన్న కుమార్
‘రవితేజ కోసం కథ రాయడం పెద్దగా కష్టం అనిపించలేదు. ఎందుకంటే నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు. నా వ్యక్తిత్వం కూడా ఆయనలాగే ఉంటుంది. నా గత సినిమాలు చూసినా కూడా అందులో హీరో పాత్రలలో రవితేజ ప్రభావం ఉంటుంది. తెలియకుండానే ఆయన ఇంపాక్ట్ నాలో ఉంది’అని సినీ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ తాజాగా మీడియాలో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని అనుకున్నాం. మొదట వాళ్లకి సైన్ చేశాను. అదే సమయంలో రవితేజ గారు నా వర్క్ నచ్చి అభినందించాలని పిలిచారు. తర్వాత చాలా రోజులు సరదాగా మాట్లాడుకున్నాం. నేను ఏదీ ఆశించలేదు. కొన్ని రోజుల జర్నీ తర్వాత ..'ఏదైనా ఉంటే చెప్పు.. మనం చేద్దాం' అని రవితేజ గారు అన్నారు. దీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మొదట ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే వేరే కారణాలు వల్ల అది కురలేదు. తర్వాత ధమాకా కథ చెప్పాను. లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం. ఎంటర్ టైన్ మెంట్ అనేది రవితేజ బలం. మా బలం కూడా అదే. ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం. ► ఈ చిత్రంలో రవితేజది డ్యూయల్ రోల్. ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ వుంటుంది. ఒక ఇన్సిడెంట్‌ని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తారనేదానిపై బేస్ అయిన సినిమా. రౌడీ అల్లుడికి మరో వెర్షన్ అనుకుంటున్నాను. ► ఈ చిత్రంలో రావు రమేష్ హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా అవుట్ స్టాండింగ్ అంటున్నారు. అలీ గారి పాత్ర కూడా బాగుంటుంది. హీరో హీరోయిన్ మధ్య సీక్వెన్స్ లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ సీక్వెన్స్. ► దర్శకుడు త్రినాథరావు నక్కినతో నాకు మంచి బాండింగ్ ఉంది. నేను ఒక సీన్ చెబితే దాని అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఆయన కి తెలిసిపోతుంది. డైలాగ్ రాసిన తర్వాత ఈ సీన్ బాగుంటుందని చెబితే.. నాపై నమ్మకంతో వదిలేస్తాడు. బయట ఈ కంఫర్ట్ ఉండకపోవచ్చు. మా ఇద్దరికి మంచి సింక్ కుదిరింది. ► కథ రాసి పేపర్లు ఇచ్చిపోయే రైటర్ని కాదు నేను. సినిమా ప్రాసస్ ని ఎంజాయ్ చేస్తాను. సినిమా సెట్ లో ఉంటాను. నేను పెట్టిన ఎఫర్ట్ కి తగ్గట్టె పారితోషికం ఇస్తారు. ► చిన్న స్థాయి నుంచి వచ్చి స్టార్ రైటర్ గా ఎదిగారని ఎవరైన అంటుంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మానాన్నలకు బెటర్ లైఫ్‌ని ఇస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళ అవసరాలని తీరుస్తున్నపుడు మనం సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంటుంది. ► నాగార్జున గారి కోసం ఒక స్క్రిప్ట్ చేస్తున్నాను. ఇది రీమేక్ అని వార్తలు వచ్చాయి. అది అవాస్తవం. నా సొంత కథే. విశ్వక్ సేన్ చేస్తున్న దాస్ కా ధమ్కి షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో చిన్న సినిమా కూడా చేస్తున్నా. -
‘సీతారామపురంలో..’ విజయం ఖాయం
శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట...’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ...‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం. రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పాటలు, ట్రైలర్స్ , టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ..ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. తెలుగు ఫిలించాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... సీతారామ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ కావడం ఖాయం. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు ప్రాణం. దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు’అన్నారు. నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ...‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి మా చిత్రానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. దర్శకుడు వినయ్‌బాబు అత్భుతమైన ట్విస్ట్‌లతో సినిమాను ఇంట్రెస్టింగ్గా తెరక్కించారు. కచ్చితంగా ఇదొక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ నెల 18న వస్తోన్న మా చిత్రాన్ని యువతో పాటు ప్రతి తల్లీదండ్రి చూసేలా ఉంటుందన్నారు. ‘ఈ చిత్రంలో మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి’అని దర్శకుడు ఎమ్ విజయ్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దణధీర్, హీరోయిన్ నందినిలతో పాటు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు వియన్ ఆదిత్య, చంద్రమహేష్,కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
హీరోయిన్ స్నేహ భర్తతో విడిపోనుందా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ పాత్రలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహకు 2011లో నటుడు ప్రసన్నకుమార్‌తో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ వినయ విధేయ రామ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స్నే తన ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా ఆమె వైవాహిక జీవితం గురించి రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందని, మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్‌కి చెక్ పెట్టింది స్నేహ. భర్తతో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను షేర్ చేసుకుంటూ ట్విన్నింగ్ అంటూ పోస్ట్ చేసింది. ఈ ఒక్క పోస్టుతో డివోర్స్ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. -
భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ?
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం వెండితెరపై ఆమె సందడి కరువైంది. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆమె రామ్ చరణ్ వినయ విధేయ రామతో రిఎంట్రీ ఇచ్చింది. మళ్లీ సినిమాకు విరామం ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! 2012లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకుంది ఈ జంట. అప్పటి నుంచి కోలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఫ్యాన్స్ చేత మన్ననలు అందుకుంటున్నారు. ఎంతో అన్యన్యంగా తమ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అందరి చేత ప్రసంశలు అందుకుంటున్నారు. అంతేకాదు భర్తతో, పిల్లలతో కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ స్నేహ మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ స్నేహ కొద్ది రోజులుగా తన భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె మరో ఇంట్లో వేరుగా ఉంటోందంటూ పలు తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయని, ప్రస్తుతం స్నేహ భర్త మీద కోపంతో ఉందని.. అందువల్లే భర్తకు దూరంగా ఉంటుందంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఈ జంట స్పందించలేదు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే స్నేహ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. -
‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ బిగ్ హిట్ కావాలి’
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ..‘అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి .ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి’ అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘వరుస అపజయాలతో నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీ కి ఊపిరి నింపాయి.మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ తో చిన్న సినిమా గా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారేలా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకొన్నాడు .ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి ’అన్నారు. చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ.. ఒక్క సినిమా చేయడం ఎంత కష్టమో ఈ చిత్రం ద్వారా తెలిసింది. ఒక్క మూవీ కోసం ఒక లైట్ బాయ్ దగ్గరనుండి నటీ నటులు, టెక్నిషియన్స్ వరకు ఎంతో మంది కష్టపడతారు. ఇలా వీరందరూ కలిస్తేనే ఒక సినిమాగా బయటకు వస్తుంది. అలాంటి సినిమాను అవమానంగా చూడద్దు అని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. మా సినిమాను మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాలని ప్రేక్షకులను కోరకుంటున్నాను’అని అన్నారు. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేస్తున్న ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు తనను ఆశ్వీర్వదించి, సినిమాను ఆదరించాలని హీరోల తేజ్ కురపాటి అన్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు . -
సామాన్యుడిని ఇబ్బంది పెడితే.. మూల్యం చెల్లించాల్సిందే
కరోనాతో హాలీవుడ్, బాలీవుడ్ కొలాప్స్ అయినా.. టాలీవుడ్ మాత్రం సక్సెస్ బాటలో పయనించింది. ఇటీవల టికెట్ రేట్లు పెంచడంతో సామాన్యుడి ఆగ్రహానికి గురై సినిమాలన్నీ వెలవెలబోయాయి. మళ్లీ టికెట్లు రేట్లు తగ్గించడంతో బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాయి. సామాన్యుడిని ఇబ్బంది పెడితే ఎంత గొప్ప వారైనా మూల్యం చెల్లించాల్సిందే. అటువంటి మంచి టైటిల్ వస్తున్న ‘సామాన్యుడి ధైర్యం` చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు. రామ్ బొత్స దర్శకత్వంలో సీహెట్ నరేశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం‘సామాన్యుడి ధైర్యం`.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా రమణ కొఠారు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభత్సోవం శనివారం హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రముఖ పాత్రికేయులు వినాయకరావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. ``సామాన్యుడికి మించిన ధైర్యం ఎవరిలో ఉండదు. అలాంటి అద్భుతమైన టైటిల్ తో ఈ సినిమా రూపొందిస్తోన్న దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. సామాన్యుడి పై వచ్చిన చిత్రాలన్నీ గొప్ప విజయాలు సాధించాయి. ఆ కోవలో ఈచిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా’అన్నారు. నిర్మాత రమణ కొటారి మాట్లాడుతూ...`దర్శకుడు చెప్పిన కథ నచ్చి తొలి సారిగా సినిమా రంగంలోకి వస్తూ ‘సామాన్యుడి దైర్యం’ నిర్మిస్తునాను.దర్శకుడు రామ్ బొత్స మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఇలాంటి నూతన దర్శకులను ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మా `సామాన్యుడి దైర్యం` తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’అన్నారు దర్శకుడు రామ్ బొత్స మాట్లాడుతూ...``మా నిర్మాతకు కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. సామాన్యుడి ధైర్యం ఎలా ఉంటుందో మా సినిమాలో చూపించబోతున్నాం. కొత్త, పాత నటీనటులతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో యాక్షన్, హాస్యం, సామాజిక అంశాలుంటాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు వి.సాగర్, వడ్లపట్ల మోహన్ , లయన్ సాయి వెంకట్, భాస్కర్ సాగర్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
విడుదలకు సిద్ధమైన `మయూరాక్షి `
`భాగమతి` ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం `మయూరాక్షి`. శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూన్ 3న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘ఇంజనీరింగ్ చదువుకున్న జయంత్ సినిమాల మీద ఆసక్తితో నిర్మాతగా మారి ఇప్పటికి రెండు చిత్రాలు రిలీజ్ చేశారు. ఇది తన మూడో చిత్రం. ప్యాషన్ తో వచ్చే కొత్త నిర్మాతలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి. ఎంతో మందికి పని దొరుకుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. నిర్మాత వరం జయంత్ కుమార్ మాట్లాడూతూ..‘సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుందన్, మియా జార్జ్ నటన, గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్. జూన్ 3న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. -
సోషల్ యాప్‌లే అతడి అడ్డా: యువతులతో నగ్నంగా..
కడప అర్బన్ : ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతిరెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ బూడిద సునీల్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ప్రసన్నకుమార్ చిన్నవయసులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదవు మానేశాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు (ఇన్సెట్లో) నిందితుడు ప్రసన్న కుమార్ ప్రసన్నకుమార్‌కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్‌చాట్ ద్వారా 2020 డిసెంబర్లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అని, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మబలికాడు. శ్రీనివాసుకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించాలని డబ్బులు కావాలని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బు ఇచ్చింది. తరువాత ప్రశాంత్‌రెడ్డికి శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 30 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవి రింగులను దొంగిలించుకుని వెళ్లాడు. ప్రసన్నకుమార్‌ను పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అల్లరి, చిల్లరగా తిరిగేవాడు. కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించి, వారితో అసభ్యకరరీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వివస్త్ర రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకుంటాడు. తద్వారా వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్‌పే, ఫోన్ పేల ద్వారా డబ్బులను వసూలు చేసేవాడు. మరికొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సాగా తిరిగేవాడు. ఈ విధంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 సంఖ్యలో మహిళలను మోసగించినట్లు తెలిసింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్ఐలు ఎస్‌కెఎం హుసేన్, బి.రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు ఎస్.ఓబులేసు, పులయ్య, ప్రదీప్‌లను డిఎస్పీ సునీల్ అభినందించారు. ఈ సంఘటనలో నిందితుడి నుంచి రూ.1,26,000 నగదును, 30గ్రాముల బరువున్న బంగారుగాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, నిందితుడి సెల్ఫోన్లను రికవరీ చేశారు. -
ఛార్జీలు చెల్లించేది లేదు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లను పునః ప్రారంభించే విషయంపై హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి జరిపిన ఈ మీటింగులో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, నిర్మాతలు, పంపిణీదారులు, సినిమా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు విషయాలు చర్చించామంటూ, ఆ అంశాలను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లకు నిర్మాతలు వర్చ్యువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) ఛార్జీలు చెల్లించరు. అయితే, కంటెంట్ ట్రాన్స్పోర్ట్ కోసం మాత్రం నిర్మాతలు నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న తమ ప్రొజెక్టర్లను ఆయా థియేటర్ ఓనర్స్ కొనుగోలు చేయడానికి వీలుగా డిజిటల్ ప్రొవైడర్లు ఆప్షన్ ఇవ్వాలి. దీని వల్ల ప్రకటనల ఆదాయాన్ని స్వీకరించడానికి థియేటర్ ఓనర్స్కు వీలు కలుగుతుంది. థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయలేకపోతే, నిర్మాతలు కొంతవరకు కల్పించుకొని ప్రొజెక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయం చేస్తారు. మొదటి మూడు అంశాలకూ డిజిటల్ ప్రొవైడర్లు అంగీకరించకపోతే, థియేటర్ యజమానులు వారి సొంత ప్రొజెక్టర్లుతో నడిపిస్తారు. కాగా, ఈ సమస్యలపై గురువారం సాయంత్రం 4 గంటలకు మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు నిర్మాతల మండలి తెలిపింది. -
బందరులో జబర్దస్త్ నటుల హంగామా
మచిలీపట్నం: యంగ్ రైటర్ ప్రసన్న కుమార్, మౌనికల వివాహ బంధంతో ఒకటయ్యారు. మచిలీపట్నంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ జరిగింది. ప్రసన్న కుమార్, మౌనికల వివాహానికి సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు త్రినాద్రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, రామ్ ప్రసాద్, మాస్ అవినాష్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు నూతన వధూవరులకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ అందజేస్తున్నారు.(హ్యాపీ బర్త్‌డే డియర్ సోనూసూద్) కాగా, నేను లోకల్, సినిమా చూపిస్త మావ, హాలో గురు ప్రేమ కోసమే సినిమాలకు రచయితగా పనిచేసిన ప్రసన్న కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే ఆయన.. రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీ బాల్ ప్లేయర్ అరికపూడి రమణరావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు. (సుశాంత్ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు) -
అభిమానిగా వెళ్లి నటుడినయ్యా
సినీ నటుడు ప్రసన్నకుమార్ అంటే ఒక్క క్షణం ఆలోచిస్తారేమోగానీ చంటి ప్రసన్న అంటే ఠక్కున గుర్తు పడతారు. విలక్షణ నటన, డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత ఆయన సొంతం. ఈయన మన విశాఖవాసే. గాజువాకకు చెందిన ప్రసన్నకుమార్ నటనపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు సామాజిక అంశాలపై చిత్రాలు తీయడం అంటే ఆసక్తి. అలా లఘు చిత్రాలను తీసి తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. అందులో ఎక్కువ చిత్రాలు ఆయన స్వీయ దర్శకత్వంలోనివే కావడం విశేషం. ఆ ఒరవడిలో తీసిన చిత్రమే ‘మరో అడుగు మార్పు కోసం’. కులాలు, రిజర్వేషన్ల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ చిత్రానికి రెండు అవార్డులు రాగా.. వాటిలో నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్‌గా దాసరి ఎక్స్‌లెన్స్ అవార్డును నేడు నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరీనాలో అందుకుంటున్న సందర్భంగా ప్రసన్నకుమార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. బాల్యం.. చదువు మాది గాజువాక. టెన్త్ వరకు పోర్టు స్కూల్లో, ఇంటర్ విజయనగరం ఎంఆర్ కాలేజీలో చదివాను. ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాను. సినిమాలంటే ఆసక్తితో 1987లో రాష్ట్ర పారిశ్రామిక సంస్థలో సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్లాను. డ్యాన్సులంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సులంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారి డ్యాన్సులను అనుసరించేవాడిని. పోర్టు స్కూల్లో చదువుతున్నప్పుడు గురువు కృష్ణారావు ప్రోత్సాహంతో తొలిసారిగా ‘పరీక్షలు లేవు’ నాటకంలో పాత్రను వేశాను. 7వ తరగతిలోనే నాటక రచన చిన్న చిన్న నాటకాల్లో వేస్తున్న నేను 7వ తరగతిలో సొంతంగా ‘మోడ్రన్ యముడు’ నాటకాన్ని రచించి స్కూల్లో నటించా. అదే మూలకథగా యమలీల చిత్రం తీయడం ఆనందంగా ఉంది. స్టార్ మేకర్ సత్యానంద్‌తో కలసి అత్తి కృష్ణారావు వద్ద నాటకాలు వేశాం. అనేక నాటకాలను ప్రదర్శించాం కూడా. ముద్దమందారం మొదటి చిత్రం ముద్ద మందారం సినిమా షుటింగ్ జరుగుతున్నప్పుడు చూడటానికి వెళ్లాను. అక్కడే నాకు తొలి అవకాశం వచ్చింది. ముందు నుంచి డ్యాన్స్‌పై ఆసక్తి ఉండటంతో సినిమాలోని పాట చిత్రీకరణ చూసినప్పుడు నా డ్యాన్స్‌ను గమనించి డ్యాన్స్ మాస్టర్ శివ సుబ్రహ్మణ్యంరాజు ఆ చిత్రంలోనే మరో పాటలో నాకు అవకాశం కల్పించారు. అభిమానిగా వెళ్లి నటుడినయ్యా అభిలాష చిత్రం షూటింగ్ వైజాగ్‌లో జరుగుతున్నపుడు చిరంజీవిని చూడటానికి వెళ్లాను. ఆయన్ను కలిసి మాట్లాడుతున్న సమయంలో అనుకోకుండా ఆ సినిమాలోనే నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో డాక్టర్ పాత్ర చేస్తున్న వ్యక్తి అప్పుటికే చాలా టేక్‌లు తీసుకున్నా సీన్ రావట్లేదు. దీంతో చిరంజీవి ఆ పాత్ర చేయమని చెప్పారు. అభిమాన హీరో చిత్రంలో నటించడం అద్భుత అవకాశం అనుకున్నా. ఒక్క టేక్‌లోనే షాట్ ఓకే అవడంతో అందరూ ప్రశంసించారు. తర్వాత చిరంజీవితో చాలెంజ్, యముడికి మొగుడు, జేబుదొంగ, గ్యాంగ్‌లీడర్, ఇంద్ర తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాను. తర్వాత అగ్ర నటులైన కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో నటించాను. దాదాపు అన్నీ హిట్ చిత్రాలే. చంటి అవకాశం ఒక అద్భుతం.. చంటి సినిమా తమిళంలో చేసిన వ్యక్తి డేట్స్ దొరకకపోవటంతో నిర్మాత కేఎస్ రామారావుగారు నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం నా కెరీర్లో మైలురాయి. ఇప్పటికీ చంటి ప్రసన్నగానే గుర్తు పడుతున్నారు. పోలీసు పాత్రలంటే చాలా ఇష్టం మా నాన్నగారు పోలీస్. దీంతో నాకు చిన్నప్పటి నుంచి పోలీసు పాత్రలంటే చాలా ఇష్టం. నేను చేసిన 300 చిత్రాల్లో కూడా చాలా వరకు పోలీసు పాత్రలే. వరుణ్ తేజ్ చిత్రంలో చేస్తున్నా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుంది. సామాజిక అంశాలపై చిత్రాలు సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలు తీయడం అంటే ఆసక్తి. 2004నుంచి హైదరాబాద్‌లో ఉండటం తగ్గించి ఆ తరహా చిత్రాలను నేనే తీస్తున్నాను. ఆ ఒరవడిలో తీసిందే ‘మరో అడుగు మార్పు కోసం’. ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, ఉద్యోగావకాశాలు కల్పిస్తే రిజర్వేషన్లతో పని లేదనేది ఈ చిత్రం ఇతివృత్తం. ఒకే టేక్‌లో 15 నిమిషాల డైలాగ్ ‘మరో అడుగు మార్పు కోసం’ చిత్రంలో అసెంబ్లీ సన్నివేశంలో 15 నిమిషాల పాటు సాగే ఒక డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పాను. కుల వివక్ష, రిజర్వేషన్లు, విద్యావ్యవస్థ, ప్రేమికుల ఆత్మహత్య, అవినీతి, అక్రమాలపై సాగే ఈ డైలాగ్ అందరినీ ఆలోచింపజేసింది. దీనిపై నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. 9 నంది అవార్డులు లఘు చిత్రాలైన వేట, పెద్దలను దిద్దిన పిల్లలు, చేయూతనివ్వండి చిత్రాలకు రెండేసి నంది అవార్డులు, చేయి చేయి కలుపుదాం సినిమాకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి మూడు నంది అవార్డులు వచ్చాయి. తాజాగా ‘మరో అడుగు మార్పు కోసం’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం, భారత్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా భారత్ కళారత్న అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్‌గా దాసరి ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రకటించారు. ‘మరో అడుగు మార్పు కోసం’ ఉచిత ప్రదర్శన నేడు ‘మరో అడుగు మార్పు కోసం’ చిత్రం రెండు అవార్డులను పొందిన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వుడా చిల్డ్రన్ ఎరీనాలో చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు అవార్డుల విజయోత్సవం నిర్వహించానున్నారు. ఈ ప్రదర్శనకు పిల్లలను తీసుకువచ్చి వారిలో దేశ భక్తిని నింపాలని ప్రసన్న కుమార్ కోరారు. -
చిన్నారిని మింగిన బోరుబావి
విడవలూరు/ నెల్లూరు (పొగతోట)/ కోవూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని బోరుబావి మింగేసింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డను చూసి మురిసిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. బోరుబావిలో ఇద్దరు పిల్లలు పడిపోగా.. 3 గంటల పాటు స్థానికులు, అధికారులు కృషి చేసి ఒక్కరిని మాత్రమే ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ఈ విషాద సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని పెదపాళెంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎల్లంగారి ఈశ్వరయ్య, నాగమ్మల కుమార్తె మోక్షిత (3), పామంచి తాతయ్య, పోలమ్మల కుమారుడు పామంచి గోపిరాజు (3) ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటూ పక్కనే ఉన్న పాఠశాల వద్దకు వెళ్లారు. అయితే పాఠశాలలో తాగునీటి అవసరాల కోసం దగ్గరలోని ఖాళీ స్థలంలో 16 అడుగులమేర బోరుబావిని తవ్వారు. దీన్ని గమనించని చిన్నారి మోక్షిత మొదట ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. ఆ వెంటనే గోపిరాజు కూడా బోరుబావిలో పడ్డాడు. దీనిని గమనించిన మోక్షిత తండ్రి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. అక్కడే పనులు చేస్తున్న యువకులు వెంటనే జేసీబీ సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు, ఫైర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సకాలంలో సంఘటనా స్థలానికి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పక్క ఊరిలోనే పర్యటిస్తున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తొలుత బాలుడు గోపిరాజును సురక్షితంగా బయటకు తీశారు. మోక్షిత లోపల ఉండడంతో బయటకు తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. కొన ఊపిరితో ఉన్న బాలికను వెంటనే 108 వాహనంలో రామతీర్థంలోని ప్రాథమిక వైద్యశాలకు.. అక్కడి నుంచి కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆ గ్రామం శోకసంద్రంగా మారింది. బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం ఈ సంఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి వెంటనే సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అలాగే తన సొంత నిధుల నుంచి మోక్షిత కుటుంబానికి రూ. 50 వేలు, బాలుడికి రూ. 50 వేలు, చిన్నారులను కాపాడేందుకు సాహసం చేసిన స్థానిక యువకులు చిరంజీవి, ప్రసాద్‌లకు మరో రూ. 50 వేలు అందజేస్తున్నట్టు చెప్పారు. అలాగే కలెక్టర్ శేషగిరిబాబు తక్షణ సహాయం కింద ఆర్డీవో చిన్నికృష్ణ ద్వారా రూ. 25 వేలు మోక్షిత కుటుంబసభ్యులకు అందచేశారు. కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే చిన్నారులను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రతి క్షణం సహాయక చర్యలను పర్యవేక్షించారు. మోక్షిత మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే బోరుబావులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. -
30న నిర్మాతల మండలి ఎన్నికలు
ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతలమండలి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఈసారి జరగాల్సిన ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాతల మండలి ఎన్నికలు జూన్ 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతల మండలి నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడింది. నిర్మాతలందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి నిర్మాతల మండలి బలంగా ఉండాలని పి.రామ్మోహన్రావు, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నిజానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులిచ్చి నిర్మాతల మండలి స్ట్రాంగ్‌గా ఉండాలన్నదే మా కోరిక. కానీ సమయాభావం వల్ల సభ్యులందరూ అందుబాటులో లేని కారణంగా ఎన్నికలు జరపక తప్పటం లేదు’’ అన్నారు. టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మిగిలిన సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అర్హులైన, ఆసక్తి ఉన్న సభ్యులకి పదవులిస్తాం’’ అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’,‘గిల్డ్ప్యానెల్’ పోటీ పడనున్నాయి. ఈ కార్యక్రమంలో వైవీయస్ చౌదరి, నిర్మాతలు మోహన్ వడ్లపట్ల, రామసత్యనారాయణ, అశోక్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై 14 గుడ్లు పెట్టిన పాము
కోడి గుడ్డు పెట్టడం చూశారా.. అంటే వెంటనే ఓ.. చూశాం మా ఇంట్లో చాలా కోళ్లున్నాయి. చాలా గుడ్లు పెట్టేవి అని చాలా మంది నుంచి సమాధానం వస్తుంది. అదే పాము గుడ్డు పెట్టడం చూశారా అంటే నోట మాటరాదు. అమ్మో పామును చూస్తేనే సగం చస్తాం. అలాంటిది అది గుడ్డు పెడుతుంటే చూడటమా.. అంత ధైర్యం లేదు బాబోయ్ అనేస్తాం. మీలాగే కర్ణాటకలోని మద్దూరు అనే పట్టణంలో ఓ టీచర్ తన ఇంట్లోకి జొరపడ్డ ఆడ నాగుపామును చూసి భయపడిపోయాడు. పాములు పట్టే వ్యక్తి అయిన ప్రసన్న కుమార్‌ను పిలిపించాడు. అతడు వచ్చి దాన్ని పట్టుకుందామనుకునే లోపే అది రోడ్డుపైకి పరుగు తీసింది. వారు రోడ్డుపైకి వెళ్లేలోపే గుండ్రంగా చుట్టుకుని గుడ్లు పెట్టడం మొదలు పెట్టింది. అలా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 14 గుడ్లు పెట్టింది ఆ పాము. తర్వాత ఆ నాగుపామును గుడ్లతో పాటు సురక్షితంగా దగ్గరలోని అడవిలో ప్రసన్న కుమార్ వదిలిపెట్టి వచ్చాడు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడి జనం ఆతృతగా చూశారు. కానీ పామును ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు. ఈ మొత్తాన్ని ఆ టీచర్ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో ఆ వీడియో తెగ వైరల్ అయింది. -
సృష్టిలో ఏదైనా సాధ్యమే
‘‘గీతాంజలి, త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 21న, సినిమాని మార్చి 21న విడుదల చేయనున్నారు. రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజిలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి, ఈ కథ రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో చెప్పడానికి మనుషులు ఎవరు? ఇక్కడ ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా సినిమా. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తెరకెక్కించాం’’ అన్నారు. విద్యుల్లేఖారామన్, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, ‘చమ్మక్’ చంద్ర, ‘గెటప్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, సంగీతం: అనూప్ రూబెన్స్. -
సహనం కోల్పోనివ్వకండి
‘థియేటర్స్ దొరకనివ్వకుండా ఓ మాఫియా జరుగుతోంది. సినిమాను సాఫీగా రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. థియేటర్స్ అన్నీ నలుగురైదుగురు చేతుల్లోనే ఉండిపోయాయి’ అంటూ ‘పేటా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సమాధానంగా నిర్మాత ‘బన్నీ’ వాసు, తన సోషల్ మీడియాలో ‘‘ప్రసన్నగారు, తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం హద్దుని దాటడం మాత్రమే మిగిలింది’’ అని రాసుకొచ్చారు. -
కథ చెబుతానంటే ఎవరూ వినలేదు
రాజకిరణ్ సినిమా పతాకంపై రాజకిర ణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందితారాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘న్యూజిలాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ఇది. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఇందులో యాడ్ చేశాం. నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలామంది నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాను. వినటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాంటి సమయంలో కొంచెం ధైర్యం చేసి నేనే రాజకిరణ్ సినిమా అనే బ్యానర్‌ను పెట్టాను. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి అన్నీ సెట్ అయ్యాయి. ఇది హారర్ సినిమా కాదు కానీ హారర్ టచ్ ఉంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. నందితారాజ్ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రమిది. దర్శకుడు నాకు చెప్పింది చెప్పినట్లు తీశారు. అశుతోష్ రాణాగారితో పని చేయటం చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకిరణ్ రెండేళ్ల క్రితం నాకు ఈ కథ చెప్పారు, మంచి హిట్ పాయింట్ అని చెప్పాను. ఓ రోజు ఆయన ఫోన్ ‘మీరే మెయిన్ లీడ్’ అన్నారు. రాజేశ్ మెయిన్ లీడ్ ఏంటి? కొందరు అన్నారు. కానీ మా నిర్మాతలు హిట్ సినిమా తీయటమే ధ్యేయంగా నిర్మించారు’’ అన్నారు. విద్యుల్లేఖా రామన్ మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’ చిత్రం నుంచి నేను రాజకిరణ్ గారికి ఫ్యాన్. ఈ సినిమాలో రాజేశ్‌తో మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్ భండారి, ఎడిటర్: ఉపేంద్ర. -
విశ్వామిత్ర టీజర్: నందిత మళ్లీ భయపెడుతుందా?
రాజ్‌కిరణ్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’ టీజర్ విడుదలైంది. నందితరాజ్, ప్రసన్నకుమార్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. యూఎస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని హారర్, థ్రిల్లర్ జానర్‌గా ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతోంది. ప్రేమకథా చిత్రంలో దెయ్యం ప్రాతలో అలరించిన నందిత మరి ఈ సినిమాలో కూడా భయపెట్టబోతోందా?, లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మార్పుకోసం
నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రసన్నకుమార్ లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మరో అడుగు మార్పుకోసం’. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ని ప్రముఖ క్రికెటర్ వెంకటపతి రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రసన్నకుమార్ నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు. వైజాగ్‌లో తరచూ అతని జిమ్‌కి వెళ్లేవాళ్లం. ఈ సినిమా కథ విని, ఆశ్చర్యపోయా. ఇలాంటి కాన్సెప్ట్‌తో బోల్డ్ అటెంప్ట్ చేసినందుకు అభినందిస్తున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సినిమా మీద ప్యాషన్‌తో ఈ రంగంలో కొనసాగుతున్నాను. అదే బాధ్యతతో ఈ చిత్రం తీశా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సినిమా పూర్తి చేశా’’ అన్నారు ప్రసన్నకుమార్. ‘‘సినిమాను నమ్మితే తప్పకుండా గొప్పవాళ్లను చేస్తుంది. ప్రసన్నకుమార్ కష్టం నాకు తెలుసు. మా బ్యానర్లో వచ్చిన ‘బిచ్చగాడు’లా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ప్రముఖ నృత్యదర్శకులు శివసుబ్రమణ్యం రాజు దంపతులను సన్మానించారు. దర్శకుడు అజయ్ కుమార్, నటుడు అఖిల్ కార్తీక్ పాల్గొన్నారు. -
చిరంజీవి.. కుమార్
హైదరాబాద్, మూసాపేట: తాను చనిపోతూ ఓ యువకుడు అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపాడు. మూసాపేట ఆంజనేయనగర్ కాలనీకి చెందిన కూచుంపూడి నాగేశ్వరరావు, తులసి దంపతుల కుమారుడు బాల ప్రసన్న కుమార్(21) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం దూలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. అతడి గుండె, లివర్, కిడ్నీ, లంగ్స్‌తో మరికొందరికి జీవితాన్నివ్వవచ్చని బాధితుడి తల్లిదండ్రులకు సూచిండడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మృతుడి అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా తీసి అత్యవసరంగా చెన్నైకి తరలించారు. తన కుమారుడు లేడన్న బాధ ఉన్నప్పటికీ అతడి అవయవాలు అమర్చిన ఇంకొందరిలో చిరంజీవిగా ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు. -
ఎవరెస్టుపై మన్యం వీరులు
చింతూరు (రంపచోడవరం): మన్యంవీరులు మరోమారు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటి రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి పెట్టారు. చింతూరు మండలానికి చెందిన దూబి భద్రయ్య శిక్షణలో జిల్లా నుంచి ఎవరెస్టు అధిరోహణకు వెళ్లిన నలుగురు గురుకుల కళాశాల విద్యార్థుల్లో అడ్డతీగలకు చెందిన ప్రసన్నకుమార్ గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరో హించినట్లు భద్రయ్య తెలిపారు. ప్రసన్నకుమార్‌తో పాటు నెల్లూరుకు చెందిన వెంకటేష్ అనే వి ద్యార్థి కూడా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడని ఆయన తెలిపారు. 87 వేల మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు మన రాష్ట్రానికి చెందిన పది మంది గురుకుల విద్యార్థులు గత నెల 18న బయలుదేరి వెళ్లారు. నేపాల్, చైనా, టిబెట్ మీదుగా ఎవరెస్టు శిఖరం వద్దకు చేరుకున్న వారు మైనస్ 40 డిగ్రీల చలిలో ఈ నెల 8న ఎవరెస్టు అధిరోహణ యాత్ర ప్రారంభించగా పది మందిలో ఇద్దరు విద్యార్థులు గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. కూతవేటు దూరంలో మరో ముగ్గురు జిల్లాకు చెందిన మరో ముగ్గురు గురుకుల విద్యార్థులు ఎవరెస్టు అధిరోహణలో కూతవేటు దూరంలో ఉన్నారు. చింతూరుకు చెందిన వీరబాబు, అడ్డతీగలకు చెందిన సత్యనారాయణ, మారేడుమిల్లికి చెందిన రమణారెడ్డి ఇప్పటి వరకూ 7,100 మీట ర్లు ఎక్కారని, మరో 1,600 మీటర్లు ఎక్కితే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారని, రెండు రోజుల్లో వారు ఈ ఘనత చాటుతారని కోచ్ భద్ర య్య తెలిపారు. వీరితోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెం దిన రమణమూర్తి, రేణుక, విశాఖపట్నం జిల్లాకు చెందిన రాంబాబు, వాసుదేవ, సింహాచలంకూడా ఎవరెస్టు అధిరోహణలో నిమగ్నమై ఉన్నారన్నారు. -
పెళ్లింట విషాదం
సాక్షి, గోదావరిఖని(రామగుండం): వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న వ్యక్తి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని ఎల్బీనగర్లో నివాసముండే సమ్మయ్య సింగరేణిలో పనిచేసి చాలా ఏళ్ళ క్రితమే పదవీ విరమణ పొందాడు. ఈయనకు కుమారులు ప్రసన్నకుమార్ (35), రాహూల్‌తో పాటు కుమార్తె ఉన్నారు. ప్రసన్నకుమార్ స్థానికంగా వీడియోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి కేబుల్ నెట్వర్క్ నిర్వహించేవాడు. పదేళ్ళక్రితం కెమెరామెన్‌గా టీవీ చానెల్‌కు పనిచేసి ఆ తర్వాత మెదక్‌జిల్లాకు ఓ టీవీకి రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాహూల్ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మే 6వ తేదీన సోదరుడు రాహూల్ వివాహానికి సంబంధించి పెళ్లి కార్డులు పంచేందుకు హైదరాబాద్ వెళ్ళిన ప్రసన్నకుమార్ తిరుగుప్రయాణంలో సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ఆ కుటుంబానికి ప్రసన్నకుమార్ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. సోదరుడి వివాహాన్ని సైతం ఆయన స్వయంగా దగ్గరుండి చేసే క్రమంలో మృత్యువాత పడడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకురాగా వివిధ పత్రికలు, టీవీ చానెళ్ళకు చెందిన జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. గోదావరినది ఒడ్డున అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
ఒక్కటైన ప్రేమజంట
తనకల్లు (కదిరి) : అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన మణిమాల, కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎర్రగుంట్లకు చెందిన ప్రసన్నకుమార్ ప్రేమకథ సుఖాంతమైంది. వీరిద్దరూ కలసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగేళ్ల కిందట ఇంజినీరింగ్ చదివేవారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. చదువు పూర్తయ్యాక తమ ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిపారు. పెళ్లి చేసి ఆశీర్వదించాలని కోరారు. కులాలు వేరైనా అబ్బాయి తరఫు వారు సుముఖత చూపగా, అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తనకల్లు మండలం తవళం ఆంజనేయస్వామి దేవస్థానంలో వారిద్దరూ దండలు మార్చుకొని బుధవారం ఒక్కటయ్యారు. వధూవరులను ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రమణ, ఇతర పెద్ద మనుషులు ఆశీర్వదించారు. -
ప్రేమపేరుతో మోసం..యువకుడి అరెస్ట్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఐదు సంవత్సరాల పాటు ప్రేమాయనం సాగించి పెళ్లి ఊసెత్తే సరికి నిమ్న కులస్థురాలువ నే నెపంతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ యువకున్ని అదుపులోకి తీసుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెంకు చెందిన సామ్రాజ్య లక్ష్మి (32) 2011 నుంచి అమీర్‌పేటలోని ఓ నెట్వర్క్ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పేనిచేస్తోంది. 2011 నుంచి 2014 వరకు మెహిదీపట్నంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో, 2014 నుంచి సంతోష్‌నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటోంది. ఇదిలా ఉండగా ఆమె పని చేసే సంస్థలోనే హెచ్ఆర్గా విధులను నిర్వహింస్తున్న యూసూఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన ప్రసన్న కుమార్(28)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారి 2011లో షిరిడి, 2014 తిరుపతి లకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. కాగా సామ్రాజ్య లక్ష్మి పెళ్లి కి వత్తిడి తేవడంతో.. తక్కువ కులానికి చెందిన దానివి అని పెళ్లికి నిరాకరించాడు. దీంతో సామ్రాజ్య లక్ష్మి శుక్రవారం ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
-
కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడిన ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ ప్రసన్నకుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. లంచం కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన రఫీతోపాటు ఆయన బస చేసిన లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర లాడ్జిపైనా దాడులు చేశారు. ఆయన ఉంటున్న 201 నంబర్ రూంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రఫీతోపాటు ప్రసన్నకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రమాదేవి తెలిపారు. -
ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
-
ఏసీబీ వలలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఏసీబీ వలలో చిక్కారు. డీఈడీ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించడం కోసం కాలేజ్ యాజమాన్యాల నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి రూ. 1000 రూపాయల చొప్పున ఆయన వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డెరైక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కూల్ డైరెక్టర్ విద్యార్ధినిలపై లైంగిక వేధింపులు
-
పోలీసుల్ని ఆశ్రయించిన సినీనటి సిరిప్రియ
కాకినాడ: సినీనటి సిరిప్రియ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసుల్ని ఆశ్రయించింది. వారం క్రితం సామర్లకోటకు చెందిన ప్రసన్న కుమార్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. కాగా ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ సిరిప్రియ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. సిరిప్రియ నటించిన 'ఆమె కోరిక' సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్‌లోనూ సిరిప్రియ నటించింది. ఆమె అసలు పేరు చంద్రకళ. కాగా ప్రసన్నకుమార్ ఫేస్బుక్ ద్వారా పరిచయం. గత ఆరేళ్లుగా ప్రేమించుకున్న వీరిద్దరూ వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దలు అడ్డు చెప్పడంతో సిరిప్రియ పోలీసులను రక్షణ కోరింది. కాగా ప్రసన్నకుమార్ బీటెక్ చదువుతున్నాడు. ఈ సందర్భంగా సిరిప్రియ మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీ అంటే చాలామందికి చులకన భావం అని అందుకే తన భర్త కుటుంబసభ్యులు తమ పెళ్లిని అంగీకరించడం లేదని తెలిపింది. తన క్యారెక్టర్ మంచిది కాదని, అతడిని ట్రాప్ చేసినట్లు ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులు చెబుతున్నారని, తన భర్తను కలవనివ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తాను గతంలో యూట్యూబ్‌లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశానని, అయితే అది ప్రొఫెషన్ మాత్రమే అని సిరిప్రియ పేర్కొంది. బతుకుదెరువు కోసమే నటిస్తున్నానని, తనకు కొంత సమయం ఇస్తే మరో ఉపాధి చూసుకుంటానని ఆమె తెలిపింది. ప్రసన్నకుమార్ కుటుంబసభ్యులతో భవిష్యత్‌లో ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున పోలీసుల్ని ఆశ్రయించినట్లు సిరిప్రియ చెప్పింది. -
పాఠశాలల్లో సెల్ వినియోగం నిషేధం
మోగితే ఉపాధ్యాయులపై చర్యలు ఆర్జేడీ ప్రసన్నకుమార్ హెచ్చరిక టెన్త్ ఉత్తీర్ణతపై ప్రత్యేక శ్రద్ధ యలమంచిలి : పాఠశాలల పనివేళల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పాఠశాలల విద్య ఆర్జేడీ( కాకినాడ)ఎంఆర్ ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ పట్టుబడితే సస్పెన్షన్ తప్పదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల వేళల్లో మొబైల్ ఫోన్ వినియోగించినందుకు ఒక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చిన ఆయన పాఠశాలల నిర్వహణపై డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన పరిధిలో ఆరు జిల్లాల్లో 5,300 హైస్కూళ్ల నుంచి సుమారు 3.20లక్షల మంది టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణతకు రోజువారి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నట్టు చెప్పారు. వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,సంప్రదాయ దుస్తులతో ఉపాధ్యాయులు పాఠశాలలకు రావాలని ఆదేశాలు పంపినట్టు తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రణాళిక ప్రకారం బోధన చేపట్టాలన్నారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్‌లు తనిఖీ చేపడుతున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులు చేసిన హోమ్‌వర్క్‌ను, నోట్‌పుస్తకాలను దిద్దకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయమై కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అదనపు తరగతులు నిర్వహించకూడదు కదా..? అని అడిగినపుడు ‘చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని, అదనపు సమయాల్లో విద్యార్థులను చదివిస్తున్నట్టు తెలిపారు’. త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయుల రేషన్లైజేషన్ ప్రక్రియలో హైస్కూళ్లలో పనిచేస్తున్న అదనపు ఉపాధ్యాయులను యూపీ స్కూళ్లకు, యూపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లను ప్రాథమిక పాఠశాలలకు పంపుతామన్నారు. విద్యాప్రమాణాలు సన్నగిల్లకుండా డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, వి.బాలప్రభుకుమార్, వనం నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
‘శంఖారావానికి’ మద్దతు ఇవ్వండి
బెలగాం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం నుంచి చేపడుతున్న సమైక్య శంఖారావానికి నాయకులు, కార్యకర్తలు మద్దతు పలకాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రసన్నకుమార్, ఉదయభాను పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పట్టణంలోని రాజశేఖరరెడ్డి, తెలుగుతల్లి విగ్రహా లకు వారు పూలమాలలు వేసి,నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని స్పష్టం చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ శ్రీనివాసరావు, యువజన విభాగం కన్వీనర్ వెంకటేష్, మం డల కన్వీనర్ చుక్క లక్ష్ముంనాయుడు, పాల్గొన్నారు. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రైవేట్ భవనంలో పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ, ప్రతి వార్డుకూ పది నుంచి 15 మం దితో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మజ్జి వెంకటేష్, చుక్క లక్ష్ముంనాయుడు, కేతిరెడ్డి రాఘవకుమార్, బాలమురళీకృష్ణ, రవికుమార్, షఫి , ఎస్వీఎస్ఎన్ రెడ్డి, పాల్గొన్నారు. -
జగన్ ఎప్పుడూ కోహినూర్ వజ్రమే: ప్రసన్న కుమార్
నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఎప్పుడూ కోహినూర్ వజ్రమేననే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్‌కు బెయిల్ మంజూరు కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన కుట్రలు బహిర్గతమయ్యాయన్నారు. వైఎస్ జగన్‌కు బెయిల్ రావడంతో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్, వేదాయపాలెం సెంటర్లలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, కావలి, కోవూరులలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల సంబరాలు జరుపుకున్నారు.