పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఐదు సంవత్సరాల పాటు ప్రేమాయనం సాగించి పెళ్లి ఊసెత్తే సరికి నిమ్న కులస్థురాలువ నే నెపంతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ యువకున్ని అదుపులోకి తీసుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెంకు చెందిన సామ్రాజ్య లక్ష్మి (32) 2011 నుంచి అమీర్‌పేటలోని ఓ నెట్‌వర్క్ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పేనిచేస్తోంది.
2011 నుంచి 2014 వరకు మెహిదీపట్నంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో, 2014 నుంచి సంతోష్‌నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఉంటోంది. ఇదిలా ఉండగా ఆమె పని చేసే సంస్థలోనే హెచ్‌ఆర్‌గా విధులను నిర్వహింస్తున్న యూసూఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన ప్రసన్న కుమార్(28)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారి 2011లో షిరిడి, 2014 తిరుపతి లకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. కాగా సామ్రాజ్య లక్ష్మి పెళ్లి కి వత్తిడి తేవడంతో.. తక్కువ కులానికి చెందిన దానివి అని పెళ్లికి నిరాకరించాడు. దీంతో సామ్రాజ్య లక్ష్మి శుక్రవారం ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.