యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ.. | Man Molested Young Woman In Konaseema District | Sakshi
Sakshi News home page

యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ..

Published Wed, Aug 17 2022 6:04 PM | Last Updated on Wed, Aug 17 2022 6:04 PM

Man Molested Young Woman In Konaseema District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కపిలేశ్వరపురం(కోనసీమ జిల్లా): వడ్లమూరుకు చెందిన మాకన రాజేష్‌ తనపై అత్యాచారం చేశాడంటూ అదే గ్రామానికి చెందిన 31 ఏళ్ళ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాది 2018 నుంచి విజయవాడలోని ఓల్డేజ్‌ హోంలో కూలీగా పనిచేస్తుంది.
చదవండి: పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే?

తనను ప్రేమించాలంటూ నిందితుడు రాజేష్‌ వేధించేవాడని, తరువాత తన సమ్మతి లేకుండా శారీరకంగా అనుభవించాడని, పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement