Kapileswaram
-
యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ..
కపిలేశ్వరపురం(కోనసీమ జిల్లా): వడ్లమూరుకు చెందిన మాకన రాజేష్ తనపై అత్యాచారం చేశాడంటూ అదే గ్రామానికి చెందిన 31 ఏళ్ళ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాది 2018 నుంచి విజయవాడలోని ఓల్డేజ్ హోంలో కూలీగా పనిచేస్తుంది. చదవండి: పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే? తనను ప్రేమించాలంటూ నిందితుడు రాజేష్ వేధించేవాడని, తరువాత తన సమ్మతి లేకుండా శారీరకంగా అనుభవించాడని, పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర పోలీసులు తెలిపారు. -
ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’
మారేడుమిల్లి: దట్టమైన అడవులు....చుట్టూ ఎత్తైన కొండలు...పాతాళానికి జారిపోయేలా లోయలు, గలగలపాతే సెలయేళ్లు, పక్షుల కిలకిలారావాలు, వంపుసొంపుల రహదారులు, ఆహ్లాదం కలిగించే చల్లని వాతావారణం, మనస్సును మైమరిపించే ప్రకృతి రమణీయతకు నిలయం మారేడుమిల్లి మండలం. సుముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తున ఉండే ప్రాంతంలో వాలి సుగ్రీవ్ వాలమూలికల ప్రదేశం, జలతరంగిణి, అమృతధార జలపాతాలు, జంగిల్‌స్టార్, మన్యం యూ పాయింట్, వనవిహరి వంటి పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో పాములేరు గ్రామం ఒక్కటి. ఈ గ్రామం పక్కనుంచి సుందరంగా ప్రవహించే కొండవాగు పర్యాటకులను ఎంతగానో అకర్షిసుంది. అయితే ఈ వాగు చాలా ప్రమాదకరమైంది. ఇందులో స్నానాలకు దిగినవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. కొండల మధ్య సుంచి ఒంపుసొంపులుగా ప్రవహించే ఈ వాగు పైకి ఎంతో సుందరంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నీటి లోపల పెద్దపెద్ద సుడిగుండాలు, ముసళ్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే చాలా మంది పర్యాటకులు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. తరుచూ ప్రమాదాలు పాములేరు వాగులో తరుచూ ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన కాళిదాస్ సందీప్, దాన ఆరుణ్‌కుమార్ అనే ఇద్దరు యువకులు వాగులోకి దిగి మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకినాడ జిల్లా సర్పవరానికి చెందిన బొక్కా మనోజ్, వాసు అనే ఇద్దరు యువకులు వాగులో మునిగి చనిపోయారు. గత ఏడాది రాజమహేంద్రవరానికి చెందిన బీటెక్ విద్యార్థులు నలుగురు, రంగపేటకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. అంతకు ముందు ఏడాది తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతై మృతి చెందారు. ఇలా గత పదేళ్లలో వందలాది మంది వాగులో మృత్యువాత పడ్డారు. ఫలితమివ్వని హెచ్చరిక బోర్డులు పాములేరు వాగులో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అటవీశాఖ అధికారులు వాగులోకి దిగడాన్ని నిషేధించారు. వాగు వద్ద చుట్టూ గతంలో కంచెలు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిని పర్యాటకులు పట్టించుకోవడం లేదు. వాగులోకి దిగే సమయంలో స్థానిక గిరిజనులు హెచ్చరిస్తున్నా పర్యాటకులు లెక్క చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముందు, ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకోవాలని స్ధానిక గిరిజనులు, పర్యాటకులు కోరుతున్నారు. (చదవండి: విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్ చిత్ర నిర్మాణం) -
దూకుడే ప్రాణాలు తీసింది
మారేడుమిల్లి: ఇద్దరు యువకుల మృతితో విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నుంచి వచ్చిన ఆరుగురు యువకుల్లో కాళిదాస్ సందీప్ (24), దాన అరుణ్ కుమార్ (22 ) ఆదివారం పాములేరు వాగులో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వాగులో స్నానం ప్రమాదకరమని హెచ్చరికలున్నా దూకుడుగా వ్యవహరించి దిగడం వల్లే ప్రాణాలు కోల్పోయారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మృతుల్లో సందీప్ డిగ్రీ పూర్తి చేశారు. అరుణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తోటి స్నేహితులు తెలిపారు. వల్లూరు.. కన్నీరు. వాగుల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకుల స్వగ్రామం మండలంలోని వల్లూరు కన్నీరుమున్నీరైంది. రెండు ఆటో కార్మిక కుటుంబాలను పెను విషాదంలో ముంచింది. మండలంలోని వల్లూరుకు చెందిన మృతులు కాళిదాస్ సందీప్ (20), దాన అరుణ్‌కుమార్ (22) అవివాహితులు. అరుణ్ కుమార్ తండ్రి సత్యనారాయణ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సీత గృహిణి. వీరికి ముగ్గురు కొడుకులు. ఆఖరి కొడుకైన అరుణ్ కుమార్ కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పాములేరు ఘటనలో మృత్యువాత పడ్డాడు. విహారానికి వెళ్లి విగత జీవిగా మిగిలావా అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మరో మృతుడు సందీప్ తండ్రి చంటిదొర కూడా ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి మేరీ కువైట్‌లో ఉంటోంది. ఐదు నెలల క్రితం అక్కడకు వెళ్లింది. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ పాములేరు వెళ్లారు. పెద్ద కుమారుడైన సందీప్ వాగుకు బలయ్యాడు. నిత్యం ఎంతో సందడిగా ఉండే సందీప్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు గుండెలు బద్దలయ్యేలా రోదిస్తున్నారు. (చదవండి: ఇన్ఫోసిస్ @ వైజాగ్!) -
కళ్లుగప్పి.. కొల్లగొట్టి..
కోట్ల విలువైన ఇసుక కంట పడిందంటే చాలు.. వారు చెలరేగిపోతారు. అనుమతులతో వారికి ఎలాంటి పనీ లేదు.. నిబంధనలను యథేచ్ఛగా ఇసుకలో తొక్కేస్తారు. అధికారుల కళ్లుగప్పి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. నిశి వేళ.. ఆ ఇసుకను దర్జాగా తవ్వేసి.. తరలించేసి.. కాసులు పండించుకుంటారు. బహుశా! ‘అధికార’ అండ ఉండడంవల్లనేమో! వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు సైతం మొక్కుబడి జరిమానాలతో సరిపెట్టేస్తున్నారు. సాక్షి, కాకినాడ : జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులూ లేకుండా అడ్డగోలుగా తవ్వేసి.. దొరికినంతా దోచుకుంటోంది. జిల్లాలోని 28 ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు గడువు ముగిసి ఏడాది కావస్తోంది. ప్రస్తుతం పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో.. అన్నాబత్తుల వెంకటరమణమూర్తికి చెందిన సర్వే నంబర్ 53, 54, 55 పరిధిలో విస్తరించి ఉన్న 17 ఎకరాల పట్టా భూముల్లో.. సుమారు 2,15,624 క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీసి అమ్ముకునేందుకు మాత్రమే అనుమతులున్నాయి. మిగిలిన రీచ్‌లకు అనుమతుల్లేవు. స్టాక్ పాయింట్లకు, -రవాణాకు కూడా అనుమతులు లేవు. మూడు నెలలుగా అధికారులు వరుస ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని, ఇసుకాసురులు బరితెగించారు. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను కొల్లగొట్టి, పగటిపూట దానిని దర్జాగా అమ్ముకొని సొమ్ములు చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారికి దన్నుగా నిలిచినవారే ఇప్పుడు పార్టీలు మారి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టారు. దీంతో ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొంతమంది తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుకను యథేచ్ఛగా తవ్వేసి, అమ్ముకుంటున్నారు. కొల్లగొడుతున్నదిలా.. కోరుమిల్లి, కపిలేశ్వరపురం రీచ్‌లతో పాటు అయినవిల్లి మండలం శానిపల్లిలంక, కొండుకుదురులంక, పొట్టిలంక, తొగరపాయ; పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం, మొండెపులంక శివారు పుచ్చల్లంక, ఎల్.గన్నవరం శివారు నడిగాడి తదితర ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నిరంతరాయంగా ఈ తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుక తవ్వి ట్రాక్టర్‌కు లోడ్ (యూనిట్) చేయడానికి నలుగురు పని చేస్తున్నారు. వీరికి రూ.200 నుంచి రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు. ప్రతి రీచ్ నుంచి కనీసం పది ట్రాక్టర్లకు తక్కువ కాకుండా ప్రతి రోజూ ఇసుక తవ్వుతున్నారు. దీనిని రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి లారీల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. రెండు యూనిట్లకు గతంలో రూ.2వేల నుంచి రూ.2500 వరకూ వసూలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఇసుక దొరకని పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఏకంగా రూ.5,500 వరకూ గుంజుతున్నారు. పది కిలోమీటర్ల లోపు దూరమైతే రూ.1000, ఆ తర్వాత కిలోమీటర్‌కు కొంత మొత్తం చొప్పున రవాణా చార్జీ అదనంగా వసూలు చేస్తున్నారు. మరోపక్క పశ్చిమ గోదావరి నుంచి కూడా ప్రతి రోజూ వందలాది లారీలు చించినాడ, సిద్ధాంతం వంతెనల మీదుగా జిల్లాలోకి వస్తున్నా పట్టించుకుంటున్నవారే కరువయ్యారు. ‘అధికార’ నేతలకు వాటాలు.. ఇసుక మాఫియాలో ఒకప్పుడు చక్రం తిప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల అండదండలు ప్రస్తుతం పుష్కలంగా ఉండడంతో ‘అనుమతులతో మాకు పనేంటి?’ అన్న ధోరణిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. బహిరంగంగా సాగుతున్న ఈ ఇసుక అక్రమ వ్యాపారంలో కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సైతం భాగస్వామ్యం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇసుక లీజుదారుల నుంచి పర్సంటేజీలు తీసుకునేవారని.. ఇప్పుడు అనుమతులు లేనందున వాటాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో చేసిన ఖర్చును ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా రాబట్టుకొనేందుకు ‘అధికార’ నేతలు ఎత్తులు వేస్తున్నట్టు పలువురు బాహాటంగానే అంటున్నారు. పట్టుబడినా పట్టించుకోరు నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్లకు మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే మాత్రం బైండోవర్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తారు. అలాగే, లారీలైతే మొదటిసారి రూ.10 వేలు రెండోసారి రూ.25 వేలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే బైండోవర్ చేస్తారు. కానీ జిల్లాలో తనిఖీల్లో ఎక్కడైనా ఇసుకతో ట్రాక్టర్ పట్టుబడినా అధికారులు విధిస్తున్న జరిమానా కేవలం రూ.2500 నుంచి రూ.5 వేలు మాత్రమే ఉంటోంది. దీంతో ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేసి, కేవలం ఒక్క రోజులోనే ఆ ట్రాక్టర్‌ను విడిపించుకుని మళ్లీ యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తున్నారు. ఒకవేళ బైండోవర్ చేసే పరిస్థితి వస్తే అధికారులను అక్రమార్కులు ‘మేనేజ్’ చేసేస్తున్నారు. -
ఎంపీ హర్షకుమార్ అనుచరుల దౌర్జన్యం
కపిలేశ్వరపురం: అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ అనుచరులు వీరంగమాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం రచ్చబండలో కార్యక్రమం సందర్భంగా హర్షకుమార్ అనుచరులు పెట్రేగిపోయారు. ఇసుక మాఫియా ఆగడాల గురించి నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్డి ప్రసాద్‌పై హర్షకుమార్ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గతనెలలో సమైక్యవాదులపై హర్షకుమార్ తనయులు శ్రీరాజ్, సుందర్ కర్రలతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.