అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ అనుచరులు వీరంగమాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడికి పాల్పడ్డారు.
కపిలేశ్వరపురం: అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ అనుచరులు వీరంగమాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం రచ్చబండలో కార్యక్రమం సందర్భంగా హర్షకుమార్ అనుచరులు పెట్రేగిపోయారు.
ఇసుక మాఫియా ఆగడాల గురించి నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్డి ప్రసాద్‌పై హర్షకుమార్ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గతనెలలో సమైక్యవాదులపై హర్షకుమార్ తనయులు శ్రీరాజ్, సుందర్ కర్రలతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.