
తాళ్లపూడి: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి జరిగింది. గోదావరి స్నానాలకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యమయింది. శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి గోదావరి నదిలో స్నానం చేయడానికి ఐదుగురు యువకులు దిగి గల్లంతయ్యారు.
పుణ్యస్నానాలకు దిగి...
తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తారిపూడి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన ఐదుగురు. తిరుమల శెట్టి పవన్ , పడాల దుర్గాప్రసాద్ ,అనీసెట్టి పవన్, గర్రె ఆకాష్ ,పడాల సాయి గా గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
