maha shivratri
-
శ్రీశైలంలో వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్‌ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే తెలుగువారు, సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి , ధర్మ నిరతి, ధర్మానుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు అయిన నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దశమ వార్షికోత్సవం జరుపుకోబోతున్న ఈ శుభసందర్భంలో అనేక కార్యక్రమాలు రూపొందించామని నిర్వాహుకులు తెలిపారు. ఇందులో భాగంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం 8 మార్చి 2024 రాత్రి 11 గంటలు నుండి శనివారం ఉదయం 6 గంటలు వరకు శ్రీ అరసకేసరి శివాన్ మందిరంలో పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది. భారతదేశం నుండి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో పంచ లింగాలను, పార్థివ లింగములుగా సమంత్రకముగా రూపొందించారు. ఈ సందర్భంగా పంచ రుద్రులుకి ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటలు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్నారు. వందమందికి పైగా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతోఅందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అనంతరం అతిథులకు తీర్ధ ప్రాసాదాలందించారు. మహాశివరాత్రి రోజున అభిషేకం, అందునా పంచారామ లింగార్చనతో కూడుకొన్నజాగరణ తదితర కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేసారు, కార్యక్రమ రూపకర్తలకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
సద్గురు ఇషా యోగా సెంటర్లో మహాశివరాత్రి వేడుకలు (ఫోటోలు)
-
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం
-
శివోహం..
శ్రీశైలంటెంపుల్/సాక్షి, నరసరావుపేట/రేణిగుంట(తిరుపతి జిల్లా)/నెల్లిమర్ల రూరల్/బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలంలో మల్లన్నకు సంప్రదాయబద్ధంగా తల పాగాలంకరణ, కోటప్పకొండలో భారీ విద్యుత్ ప్రభల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో విశేష అభిషేకాలు జరిపారు. వివిధ వాహనాలపై కొలువుతీరిన ఆది దంపతులు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను అనుగ్రహించారు... నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. స్వామి వారు నంది వాహనంపై ఊరేగారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఆ వెంటనే మరో వైపు పాగాలంకరణ ప్రారంభమైంది. ఆలయంలోని విద్యుత్ దీపాలను ఆర్పి వేయగా.. బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై పాగాను అలంకరించారు. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జేసీ టీ.రాహుల్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జోన్ డీఐజీ సీహెచ్.విజయరావు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్ర విమానం, చప్పరంపై స్వామివారి దర్శనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారు జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలోభక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు క్యూలైన్లను పర్యవేక్షించారు. కాగా ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం, చప్పరంపై పురవీధుల్లో విహరించారు. రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని కటాక్షించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవార్ల లింగోద్భవ దర్శనం(నిజరూప దర్శనం) ప్రారంభం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి బారులుతీరారు. రామతీర్థంలో శివనామస్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్టం నుంచి భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు శ్రీరాముడు రామక్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారన్నది భక్తుల విశ్వాసం. రామకోనేరు గట్టు, కల్యాణ మండపం, నీలాచలగిరి పరిసర ప్రాంతాల్లో కాగడాలు వెలిగించి రాత్రంతా జాగారం చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండ పర్వతంపై శిఖర జ్యోతిని వెలిగించారు. ఎస్పీ దీపిక పాటిల్, దేవదాయశాఖ కమిషనర్ రామ సత్యనారాయణ, తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. సాగర తీరంలో మహా కుంభాభిషేకం శివ నామస్మరణతో విశాఖ సాగరతీరం హోరెత్తింది. కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 39వ మహా కుంభాభిషేకం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని శ్రీశారదపీఠం పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, టి.సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వీరభద్రస్వామి పూజ నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపుతాళ్లు పంపిణీ చేశారు. కోటప్పకొండలో ప్రభల ఉత్సవం పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు బిందె తీర్థంతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కోటప్పకొండ ప్రత్యేకతను చాటే ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. ప్రభల వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీత్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురే‹Ùరెడ్డి, బి.కృష్ణమోహన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్‌లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతురావు, వెంపాడ చిరంజివి దర్శించుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. -
Maha Shivratri 2024 ఉపవాసం, జాగారం, ఇంట్రస్టింగ్ సంగతులు
మహా శివరాత్రి అంటే సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడైనా మహాశివుడకి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే బోళా శంకరుడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. అన్నింటిలోనూ మహిమాన్వితమైనది మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివ పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. శివరాత్రి పర్వదినం క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు పుట్టిన హలాహలం ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదమున్న కారణంగా ముక్కోటి దేవతలు పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో ఆ గరళాన్ని గొంతులో బంధించి గరళ కంఠుడుడయ్యాడు. కంఠం నీలంగా మారి మారడంతో నీలకంఠుడయ్యాడు. సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వివాదం పెరిగి పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. ఆ ఈ రోజు తనను మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగ శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, మినహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం అంటే ‘దగ్గరగా ఉండడం’ అని! ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉప వసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కో అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. -
Maha Shivratri: మళ్ళీ రావు ఆ బంగారు రోజులు..
మాది నంద్యాల. అనగనగా రోజుల్లో కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారుట. 14వ శతాబ్దంలో నందన అనే మహారాజు గారు మా మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేరొచ్చిందని కాల క్రమేణా అదే నంద్యాలగా రూపాంతరం చెందిందని అంటారు. చుట్టూ నవనందులు ఉన్నా మాకు మహనంది మీదే మక్కువ ఎక్కువ. ఒక్క రోజు సెలవు దొరికితే చాలు "పొదామా అంటే, పోదామా" అనుకుంటూ మేము పిల్లలమంతా అద్దె సైకిల్లు తీసుకుని పొద్దున మహనందికి తయారు. పోయి పెద్ద కోనేరులో ఈతలు కొట్టి అలిసి పోయి, సేద తీరడానికి చిన్న కోనేరులో ఈతలు కొట్టి తేరుకుని సాయంత్రానికంతా తిరిగి ఇళ్ళు చేరుకునేవాళ్లం. ఈతల మధ్యలో సమయం దొరికితే మహనందీశ్వరుణ్ణి కూడా దర్శించుకుని దండం పెట్టుకునేవాళ్లం. మీరు ఈ మాట ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దండం పెట్టుకునేవాళ్లం అన్నాను అంతే కానీ కొరికలు కోరుకునే వాళ్లం అనలేదు. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికని, కోరికలు తీర్చుకోడానికే దేవుడుకి దండం పెట్టుకోవాలని మేము నేర్చుకోలేదు. ఒకరోజు గుడిలోకి వెళ్ళి నేనూ, నా ఫ్రెండు శంకర్ దండం పెట్టుకున్నాక.. శంకర్ కిందికి వంగి దేవుడి పళ్ళెంలో ఉన్న నోట్లని గుప్పిట నిండుగా పట్టుకుని ఆక్కడి నుండి పారిపోయాడు. నాకు కూడా అక్కడ ఉన్న ఒక అయిదురూపాయల నోటు టెంప్ట్ చేసింది కానీ , తీసుకోలేకపోయాను. అందుకు నా మీద దేవుడికి కోపం వచ్చి చేతకాని నన్ను ఆర్టిస్ట్ కమ్మని శపించి, ధైర్యం, చాకచక్యం పుష్కలంగా ఉన్న శంకర్‌ను ప్రముఖ పొలిటీషియన్ కమ్మని వరమిచ్చాడు. గుడిలో పులిహోర మాత్రం ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. శివుడు మా ప్రాంతపు ఎక్కువ దేవుడు. మా నూనెపల్లె నడిబొడ్డున శివాలయం ఉంది. తెల్లవారిన దగ్గర నుంచి "బ్రహ్మమురారి సురార్చిత లింగం | నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం | తత్-ప్రణమామి సదాశివ లింగమ్ |" అని ఎప్పుడూ వినపడుతూనే ఉండేది. అప్పుడు నేనూ, నావంటి నూనెపల్లె పిల్లలం కలిసి శివాలయం ముందు నుండి ఆటలాడుతూ పరిగెడుతూ బ్రహ్మమురారి సురార్చిత లింగం అని పాడుకుంటూ మంచి నీళ్ళ బాయి దగ్గర మలుపు తిరగగానే మసీదు నుంచి అజాన్ రాగానే అల్లాహు అక్బర్ | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్| అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్| హయ్యా అలస్-సలాహ్| హయ్యా అలల్-ఫలాహ్| అల్లాహు అక్బర్. అని ముగింపు పాడుకునేవాళ్లం. ఆ రోజుల్లో మీరెవరు అని అంటే మేము నూనెపల్లె వాళ్లం అని మాత్రమే మా ప్రవర. మాది నిజానికి ప్రకాశం జిల్లా. మా జేజి నాయన తన కుటుంబాన్ని తీసుకుని బ్రతుకు తెరువుకోసం నూనెపల్లె చేరినపుడు ఆయనని వెల్ కం టు నూనెపల్లె అని స్వాగతించింది మా ఊరి మహాదేవుడు శివుడు, తన గుడి అరుగు మీద స్థలం చూపి నువ్వు ఇక్కడ టైలరింగ్ చేసుకోవచ్చబ్బా! అన్నాట్టా. మా పెద్దల బ్రతుకు గిర్రున తిరగడానికి కుట్టు మిషన్ చక్రం కదిలింది ఈ శివాలయం గుడి నీడ నుండే. మామూలుగా పండగలన్నీ ఉదయపు సంబరాలయితే ఒక్క మహా శివరాత్రి మాత్రం సాయంత్రం నుండి మొదలయ్యే ఉత్సాహం. ప్రతి పండగకు ముందు పిల్లలమంతా కూడి రాబోయే పండగ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పుకునే వాళ్లమో! లెక్కే లేదు. అప్పుడు మా చొక్కాకు ఒక జేబు, నిక్కరకు రెండు జేబులు ఉన్నా ఆ మూడు జేబుల నిండా కబురులు తరగని అక్షయ నిధుల్లా పోటెత్తేవి. అప్పుడు మా ఊరి రోడ్లు ఎప్పుడూ ఎద్దుల బళ్లతోనూ, గుర్రపు జట్కాలతోనూ , రిక్షాల మూడు చక్రాలతోనూ, సైకిల్ బెల్లులతోనూ, సైడ్, సైడ్ జరుగు జరుగు అని హెచ్చరిస్తూ కదిలేవి. ఒకటీ రెండు బస్సులు ఉన్నా, అవి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ పోతూ ఆగుతూ కదులుతూ ఉండేవి. ఆ రోజుల్లో ప్రతి పండగకు మా ఊరి శివాలయం ముందు పందిరి కట్టి హరికథలు నడుస్తూ ఉండేవి. మామూలు రోజుల్లో చీకటి పడగానే త్వరగా నిద్రపోయే ఊరి రహదారులు పండగ రోజుల్లో మాత్రం తెల్లవార్లూ మేలుకుని ఉంటాయి. కథలు చెప్పడానికి వచ్చిన హరిదాసు గారి కథా గమనాన్ని, మృదుమధురమైన గానాన్ని, కాలి అందియలు ఘల్లు మనడాన్ని, చేతిలోని చిడతలు ఝల్లు మనడాన్ని, ఆ పిట్టకథలను, ఆ వేదాంత చర్చను, మధ్య మధ్యలో పాపులర్ సినిమాల పాటల చమత్కారపు పేరడీలను ఊరు ఊరంతా, దారి దారంతా గడ్డం క్రింద చేయిపెట్టుకుని అలా కళ్ళప్పగించి చూస్తూ, వింటూ ఉండేది. ఈ హరి కథల కోసమని చీకటిపడే సమయానికంతా ఊరిని, దారిని బందు పెట్టేవారు. ఇక ఆ రాత్రి ఆ దారిన ఒక వాహనం నడవదు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్క సైకిలు చక్రమూ తిరగదు. ఊరి జనం అంతా చేతికందిన చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు పట్టుకుని రోడ్దుని ఆక్రమించుకునేవారు. అందరికన్నా ముందు అక్కడికి చేరుకునేది నావంటి పిల్లలు. వారి వారి అమ్మా నాయనల కోసమో, అవ్వా తాతల కోసం కాదు. స్కూలు, ట్యూషన్ క్లాస్మెంట్ కోసమని, ప్రాణ స్నేహితుల కోసమని తగు మాత్రం స్థలం రిజర్వు చేసి పెట్టేవారు. ఎన్నయినా చెప్పండి మళ్ళీ రావు ఆ బంగారు రోజులు. ఆకాశానికి నక్షత్రాలు పూచే ఆ సాయంకాలాలు, అరచేతుల్లో గాజు మొబైల్ అద్దాలకు బదులు దేవుడు రాసిన గీతలు కనపడే రోజులు మరిక లేవు. ఇవన్నీ మామూలు రోజుల్లోని పండగల సాయంకాలాల గుడి బయటి దృశ్యాలు. హరికథల పండగ రోజుల్లో బాగా నిద్ర అనిపిస్తే ఇంటికి రావచ్చు. శివరాత్రి సంగతి వేరు. శివరాత్రి రోజున శివాలయం బయట రోడ్డుకి అడ్డంగా పెద్ద తెల్లని తెర కట్టేవారు. తెరకి అటూ ఇటూ జనం కూర్చునేవారు. చాపలు, దుప్పట్లు, బొంతలు, బియ్యం బస్తాల జనపనార పట్టాలు మామూలే. పిల్లలు ముందు గానే వచ్చి స్థలం రిజర్వు చేసి పెట్టడమూ మామూలే. ఆ రాత్రి శివాలయం ముందు మూడు ఆటలు సినిమాలు వేసేవారు. పౌరాణిక సినిమాలే వేసేవారు. మూడు సినిమాలలో ఒక సినిమా మాత్రం దక్షయజ్ఞం ఖచ్చితంగా ఉండేది. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ కూడా తప్పకా ఉండేది. మేము ఆ సినిమాని ఉప్మా, చట్ని, గారె, సాంబారుల కథ అని పిలుచుకుని, గట్టిగా నవ్వి ఆపై కళ్ళు మూసి దేవుడికి దండం పెట్టుకుని లెంపలు వేసుకునేవాళ్లం ఆ శివరాత్రి రాత్రులలో, ముఖ్యంగా దక్షయజ్ఞం సినిమా చూస్తున్నప్పుడు మా ఊరి శివాలయంలో ఉండే ఆ చంద్రచూడుడు, చంద్రశేఖరుడు, విషకంఠుడు, పినాకపాణి , మహాశివుడు క్లైమాక్స్ లో గుడి లోపలినుండి ఆ ఫలాన తెరమీదకు వచ్చి నందమూరి రామారావు ఒంటి మీదికి పూని శివతాండవం చేయిస్తాడు చూడు! తీవ్ర దుఃఖంతో, మహా కోపంతో, తన జూట నుండి ఒక కేశాన్ని పెరికి నేలకేసి కొడితే ఆ వెంట్రుక నుండి ఆయన పెద్ద కొడుకు వీరభద్రుడు పుట్టుకొస్తాడు చూడు. అది మాకు శివరాత్రి అంటే. ఆ ఒక్క దృశ్యం చూడడం కోసమే కదా సంవత్సరమంతా వేచి వేచి శివరాత్రి జాగారం చేసేది. ఈ రోజుల్లో లాగా ఏ క్షణన కావాలిస్తే ఆ క్షణాన కళ్ళముందుకి నర్తనశాలలు, పాండవ వనవాసాలు, వినాయక విజయాలు వచ్చే కాలం కాదు కదా. ఆ రోజుల్లో ప్రతి అనుభవానికి ఒక గొప్ప విలువ ఉండేది. లిప్త పాటు అదృష్టాల్ని ఒడిసిపట్టుకుని బ్రతుకు పుస్తకంలో మెరుపుల నెమలీకలా దాచుకుని తీరాల్సిందే. పండగ పూట సినిమాలు చూస్తూ జాగారం చెయడమేమిటి కలికాలం అని పెద్ద తరం వాళ్ళు విసుక్కుంటున్నా సరే, దారి మీద మూడాటల తెర ఆడుతూనే ఉండేది. సినిమా టాకీసులలో రాత్రి మూడాటలు ఆడుతూనే ఉండేవి, గుళ్ళల్లో పూజలు, అవధూతల ఆశ్రమాల్లో భజనలు కొనసాగుతూనే ఉండేవి. ఏదో ఒక రకంగా, ఒక రూపంగా భక్తి అనేది కళ్ల మీదికి నిదుర మూత వాలకుండా కాపాడుతూ ఉండేది. ఒక రాత్రి ముగిసేది. ఆ తరువాతి పగటిని రాత్రిలా జనం అంతా నిద్రపోయేవారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వచ్చే జాగారపు యామిని ప్రస్తుతం మరణించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో జనం మెలకువగానే ఉంటున్నారు. పగళ్ళు నిద్రపోతూనే ఉంటున్నారు. శివుడికి ఒకరోజు, రాత్రికి ఒక కాలం, సినిమాకి ఒక వారం అంటూ ఏమీ ఉండటం లేదు. శివరాత్రికి చలికాలం శివ శివ అని పారిపోతుంది అనేవారు. చలికాలం రాకముందే చలి పారిపోయే కాలం వచ్చినట్లుంది. భస్మాసురుడికి భయపడి శివుడు పరుగులెత్తాడు అని అనుకునేవారు. అసురుడి దాకా ఎందుకు మామూలు మనిషికి భయపడే చూసే పరమశివుడు ఎప్పుడో పారిపోయినట్లుగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఆలయాలు ఉన్నాయి కానీ, దేవుడులు అక్కడ ఉండటం లేరేమో అని గట్టి నమ్మకమే ఉంది. పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కానీ, అనుభవాలు మిగలడం లేదు నిన్నటి రాత్రికి ఈ శివరాత్రికి తేడా కనపడ్డం లేదు. మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు. మద్రాసులో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అనేవి ఉన్నాయని. ఇప్పుడు నేను రాసుకున్నదంతా చచ్చిపోయిన మా నూనెపల్లె కథ, ఒక వదలని దుఃఖపు గీతి రాత. -
విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్‌కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
శివతాండవానికి సరస్వతీపుత్రుడి తెలుగు నట్టువాంగం
ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు. తెలుగులో అంతటి శివతాండవం ఉంది. “సరస్వతీపుత్ర” పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి…వెలుగుతూ ఉండడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన మాటల్లో తెలిసేది. నిజానికి బాధపడాల్సింది మనం. పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం “పెనుగొండ లక్ష్మి” విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం. ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు. పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తివారే ముందుమాటగా, చివరి మాటగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం. పుట్టపర్తివారి శివతాండవ కావ్యసారమిది అని చెప్పేంత మంత్ర, నాట్య, సంగీత, సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం నాకు లేదు. ఇరవై ఏళ్ల వయసులో హిందూపురంలో ప్రఖ్యాత తెలుగు విద్వాంసుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ దగ్గర కొన్నేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం, ఛందస్సు- అలంకారాలు నేర్చుకునే భాగ్యం కలిగింది. ఆయన దగ్గరికి వెళ్లేవరకూ తెలుగులో పుట్టపర్తి నారాయణాచార్యులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్న రెండు సాహితీ హిమవన్నగాలు ఉన్నాయనే నాకు తెలియదు. భాషలో ఏ ఉదాహరణ అయినా వీరిద్దరి కావ్యాల ప్రస్తావనతోనే చెప్పేవారు. కడప రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన పుట్టపర్తివారితో కలిసి పనిచేశారు. అలా నాకు శివతాండవమంటే పులకింత. పూనకం. ఒళ్లు తెలియదు. అర్థం తెలియకుండానే కొన్నేళ్లపాటు పాడుకుంటూ ఉండేవాడిని. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా వాటి ఆకార పరిమాణాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది. శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు. “ఆడెనమ్మా శివుడు. పాడెనమ్మా భవుడు. ఏమానందము? భూమీతలమున! శివ తాండవమట! శివ లాస్యంబట!” ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. ఇక్కడికి కావ్యం సమాప్తం. శివ అంటే చైతన్యం. ప్రాణం. స్పందన. శుభం. మంగళం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు. ఆ హిందీ అనువాద గ్రంథం ఇటీవల ముద్రణకు నోచుకుంది. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018 -
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..! -
మహాశివరాత్రి 2024: శ్రీశైలంలో భారీగా భక్తజనం (ఫొటోలు)
-
Mahashivratri 2024 : ఒక చైతన్య జాగృతి
చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు మాసశివరాత్రిగా జరుపుకుంటారు. పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన∙శివరాత్రినాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. అ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. మహాశివరాత్రినాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్యఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తిచేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు. సోమవారం ’ఇందుప్రదోషం’ గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనం.16 సోమవారాలు నియమ పూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ, శివ రూపమే సనాతనం. ఇదే సకల రూపాలకు మూలం. సాక్షాత్తు శివుడు గుణాతీతుడు. కాలాతీతుడు. నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్చుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ. గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని కాకతాళీయంగా ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ణి కృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడోజాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు. శివ తత్త్వం శివతత్త్వం ఎవరికీ అంత సులువుగా అర్థమైనది కాదు. శివుని కన్నా పెద్దది గాని, చిన్నది గాని సాటి మరొకటి లేదనేది తత్త్వ సాధకులు మోక్ష సాధకులకు ఆశ్రయించదగ్గ ఏకైక రూపం శివస్వరూపం. శివతత్త్వంలోని నిగూఢమైనటువంటి విషయాలలో ప్రప్రథమమైనవి జ్యోతిర్లింగాలు. శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని, ఇది శివతత్త్వంలో భాగమేనని జ్యోతిర్లింగమనగా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు (అనగా జ్ఞానము) ప్రసాదించేది అని జ్యోతిర్లింగాల తత్త్వం తెలియచేస్తుంది. శివతత్త్వంలో మరొకటి లింగాకారం. శివలింగాకారం పై భాగం లింగంగా కింద పానపట్టం యోని రూపంలో ప్రకృతీ పురుషుల ప్రతీకగా ప్రకృతీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరు లేరు అని చెప్పేటటువంటి తత్త్వం. శివతత్త్వంలో మరొక తత్త్వం ప్రళయ తత్త్వం. ప్రళయతత్త్వం మూడు విధాలుగా ఉన్నది. రాత్రి సమయంలో నిద్ర ఇది ప్రళయతత్త్వంలో ఒక భాగం (నిద్ర) ప్రాపంచిక మాయ నుండి మరపునిస్తుంది. రెండవది మరణం. ఇది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ప్రళయం. మూడవది మహా ప్రళయం. సమస్తం శివునిలో కలసిపోవటం. నాలుగవది త్రిమూర్తితత్త్వం (శివ, విష్ణు, బ్రహ్మ). శివుని నుండి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేది శాస్త్రం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించి శివుడు అంతం చేయటం లోకోక్తి. పంచభూతలింగాల తత్త్వం. పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అన్నిటిలోను శివుడున్నాడు అనేటటువంటి తత్త్వం. రుద్రతత్త్వం అంటే శివుడిని పూజించేటటువంటి పద్ధతి. రుద్రంలో మహన్యాసం, నమకం, చమకం అనే విధానం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడవే అని నిర్ధారిస్తుంది. శివతత్త్వంలో శివస్వరూపంలో దాగివున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. శివరాత్రులు ఐదు రకాలు 1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు. 2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం. 3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి. 5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఆ రూపంలోనే అంతా! శివుని తలపై గంగ ప్రవాహం ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞానం ప్రసారమవుతుందని సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు భగవంతుడిపై ధ్యాస ఎల్లవేళలా ఉండాలని సూచిస్తుంది. శివునికి మూడో కన్ను చెడును, అజ్ఞాన నాశనాన్ని చూపిస్తుంది. శివుని వద్ద ఉన్న త్రిశూలం జ్ఞానం, కోరిక, అమలు అనేటటువంటి మూడింటి స్వరూపం. శివుని ఢమరుకం వేదగ్రంథాలు వేదస్వరాన్ని తెలియచేసే ఢమరుకం. శివుని మెడపై ఉన్న సర్పం అహం నియంత్రణను సూచిస్తుంది. శివుడు ధరించే రుద్రాక్ష స్వచ్ఛతను, ధరించే మాలలు ఏకాగ్రతనూ సూచిస్తాయి. నడుముకు చుట్టుకునే పులి చర్మం భయం లేనటువంటి తత్త్వాన్ని సూచిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయసింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్మనారు, అక్కమహాదేవి, బెజ్జ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆధ్యాత్మికవేత్త. -
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మహాశివరాత్రి : శ్రీశైలంకు తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
బ్రహ్మోత్సవాలకు వేళాయే..
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో 11 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. ఉదయం 8:10 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు భేరిపూజ, భేరీతాడనం, సకలదేవతాహ్వానపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహిస్తారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 2న భృంగి వాహనసేవ, 3న హంస వాహన సేవ, 4న మయూర వాహన సేవ, 5న రావణ వాహన సేవ, 6న పుష్పపల్లకిసేవ, 7న గజ వాహన సేవ, 8న ప్ర¿ోత్సవం, నందివాహన సేవ, అదే రోజు రాత్రి 10గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిõÙకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 9న రథోత్సవం, తెప్పోత్సవం, 10న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి చేపట్టి సాయంత్రం ధ్వజావరోహణ చేస్తారు. 11న అశ్వ వాహనసేవ, పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. నేడు పట్టు వస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారిచే స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. అలాగే, 2న ద్వారక తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, 3న విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, 4న కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టువస్త్రాలను సమర్పి0చనున్నాయి. 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులు స్వామిఅమ్మవార్లకు పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. -
మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది.ఫోక్ సింగర్‌గా గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ సింగర్‌గా కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె పాడిన పాటలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరోసారి మంగ్లీ పాడిన ఓ పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో‘భం భం భోలే’ అనే సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను మంగ్లీ శివరాత్రి స్పెషల్ సాంగ్‌గా రిలీజ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆలయం లోపల వీడియోలు, ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు. అలాంటిది గర్భగుడిలో మంగ్లీ అండ్ టీం షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరికి పర్మీషన్ ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున గర్భగుడిలో ఈ పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్‌లో ఆలయ అర్చకులు కూడా కనిపిస్తుండటంతో చాన్నాళ్లుగా వస్తున్న ఆచారాలను ఎలా పక్కన పెడతారంటూ భక్తులు కన్నెర్ర జేస్తున్నారు. -
18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు
ఉజ్జయిని: మహా శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఏకంగా 18,82,229 దీపాలు వెలిగించారు. గిన్నిస్ రికార్డు సృష్టించారు. శనివారం సాయంత్రం క్షిప్రా నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 2022లో అయోధ్యలో అత్యధికంగా 15.76 లక్షల దీపాలు వెలిగించారు. ఉజ్జయినిలో గత శివరాత్రి సందర్భంగా 11,71,078 దీపాలు వెలిగించారు. -
Maha Shivratri 2023 : శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు (ఫొటోలు)
-
Maha Shivaratri 2023: పాహి పాహి పరమేశ్వరా
సృష్టి, స్థితి, లయకారులలో శివుడికి లయకారుడని పేరు. అయితేనేం, ఆయన పరమ బోళావాడు. భక్తజన రక్షకుడు. సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతి నాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. భక్తితో కొలిచే తన భక్తులతోపా పాటు క్రిమికిటకాదులకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వ పా పాపహరణం. నేడు మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన ఆ శుభకరుడి గురించి చెప్పుకోవడం ఎంతో మంగళప్రదం. మనం ప్రతి నెలలోనూ తెలుగు క్యాలెండర్లలోనూ, పంచాంగాల్లోనూ పండుగలు– పర్వదినాలలో మాస శివరాత్రి అని ఉండటాన్ని చూస్తూంటాం. ఇంతకీ మాస శివరాత్రి అంటే ఏమిటి, మహాశివరాత్రికీ, మాస శివరాత్రికీ గల వ్యత్యాసం ఏమిటో చూద్దాం. ప్రతిమాసంలోనూ బహుళ పక్షం వచ్చే చతుర్ధశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నింటిలోనూ తలమానికమైనది, మహిమాన్వితమైనది మహాశివరాత్రి. తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందురోజు – రాత్రి చతుర్దశి కలిగి ఉన్న రోజుని జరుపుకోవాలని నిర్ణయ సింధు చెబుతోంది. ‘మహా’ అని ఎక్కడ అనిపించినా అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి. శివ పా పార్వతులిరువురికి సంబంధించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం. అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కూడా ఉత్సవం జరుగుతుంది. శివ అంటే మంగళకరమైన అని. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. ఇంతకీ శివరాత్రి ఎందుకని అంతటి పర్వదినమైందో చూద్దాం. క్షీరసాగర మథనంలో అమృతంకంటే ముందు హాలాహలం పుట్టిన విషయం తెలిసిందే. అది ముల్లోకాలను దహించివేస్తుందన్న ప్రమాదం ఉండడంతో దేవదానవులందరు భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళ కంఠుడుగా పేరుపొందాడు. ఈ హాలాహల ప్రభావానికి ఆయన కంఠం నీలంగా మారడంతో నీలకంఠుడయ్యాడు. లోకాలన్నీ ఆ లోకనాయకుడి మూలాన స్థిమితపడిన రోజు పర్వదినం గాక మరేమిటి?అయితే... సంప్రదాయ ప్రియులు జరుపుకునే ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఒకటి రెండు ఐతిహ్యాలున్నాయి. ఆది మధ్యాంత రహితుడు పరమేశ్వరుడు ఆది మధ్యాంత రహితుడనడానికి సంబంధించిన ఈ గాథని చూద్దాం: పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప ’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదం గా మారింది. రానురానూ అది మరింతగా పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలూ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పో రు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు శ్వేతవరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతదూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పా పాతాళందాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి, తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజ మేనని సాక్ష్యం ఇవ్వమనిప్రా పాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపో యింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపో యానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పా డు. ‘నిజమే’నంది మొగలిపువ్వు.దాంతో తాను ఓడిపో యానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలిపువ్వు నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండీ అల్పవిషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్త్రాలు, పూలమాలలు, పువ్వులు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారంగా పూజించారు. ఆ పూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. జ్యోతిర్లింగరూపంలో బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్ధశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పా డు. అంతేకాదు, ఆ తిథినాడు తన మూర్తిని, లింగాన్ని పూజించే వారికి మోక్షం లభిస్తుందన్నాడు. శివరాత్రినాడు పా పార్వతీసమేతంగా తనను అర్చించే వారు మహోన్నత ఫలాలు పొందే విధంగా అనుగ్రహించాడు. మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపా పాన్ని ధ్యానిస్తూ, శివ నామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు.. నాలుగు జాములు నిద్రపో కుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కాంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పా పాపా పాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనో, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపా పాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రి కి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఉపవాసం ఎలా? శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేషప్రా పాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపా పానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం ‘దగ్గరగా ఉండడం’ అని! భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు, ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పా పాటు శరీరంలోప్రా పాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం వుండి శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారాయన భక్తులు. కనుకనే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ‘త్రయంబకం యజామహే...‘ అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలూ తగ్గి, పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. ఇవేవీ చేయ(లే)కపో యినా నిర్మలమైన మనస్సు తో వీలైనన్ని సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా చాలు, ఆ బోళాశంకరుడుపొంగిపో యి వరాలిస్తాడు. ఆయన రూపం అపురూపం శివుడు నిరాకారుడు. సాకారుడు కూడా. అదే ఆయన ప్రత్యేకత. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపా పాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. రెండు స్వరూపా పాలు శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాక ప్రేమస్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే శాంతస్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. జగతః మాతా పితరౌ శివ పార్వతులు తమ కల్యాణ మహోత్సవానికి చక్కగా చిగిర్చే పూచే వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకిచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రివేళ అయితే అది మనకి ఇచ్చింది అని భావించి తెల్లవారుజామున మంచిదనుకున్నారు ఆ తలిదండ్రులు. మల్లెల్నీ మొల్లల్నీ మనకి విడిచి వాసన, రూపసౌందర్యం లేని తుమ్మిపూవుల్ని సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మన పరం చేసి విభూతిని పులుముకున్నారు. ఊరేగింపునకి ఎద్దునీ, అలంకారాలుగా పా పాముల్నీ ... ఇలా జగత్తుకోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆ ఆది దంపతుల కల్యాణ మహోత్సవానికి పిల్లలమైన మనం తప్పక హాజరు కావాలి. ఆశీస్సులు అందుకోవాలి. అందుకే ఈ జాగరణం. – డి.వి.ఆర్. -
మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు : గవర్నర్
సాక్షి, హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. జాగారం రూపంలో మేల్కొని ఉంచే మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు అని పేర్కొన్నారు. మహాశివరాత్రి కోట్లాది మంది శివుడి భక్తులకు ఆరాధ్యమైన పర్వదినమని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావాన్ని పెంపొందించాలని గవర్నర్ ప్రార్థించారు. కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తమిళిసైని పుదుచ్చేరి సీఎం రంగస్వామి సత్కరించారు. -
Mahashivratri 2023: శ్రీగిరిలో బ్రహ్మోత్సవ వైభవం!
అదిగదిగో శ్రీశైలం.. భూలోకాన కైలాసం అంటూ భక్తజనం మల్లన్న ఎదుట ప్రణమిల్లుతోంది. శ్రీశైలవాసా.. శరణు మల్లన్న అంటూ నీరాజనం పడుతున్నారు. నల్లమల అభయారణ్యం మీదుగా పగలు, రేయి చిన్నాపెద్దా తేడా లేకుండా పాదయాత్రగా వచ్చే శివభక్త గణం ఎండలు మండుతున్నా.. చల్లని గాలులు వణికిస్తున్నా.. భక్తిభావం తొణకడం లేదు. అడుగులన్నీ శ్రీగిరి వైపు పడుతున్నాయి. కైలాస ద్వారం చేరుకుని మరింత ఉత్సాహంతో మల్లికార్జునుడి దర్శనానికి బారులుదీరుతున్నారు. బ్రహ్మోత్సవ సందడి అంబరాన్ని తాకుతుండగా.. భక్తజనం పులకించిపోతుంది. శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలంలో దేవదేవుళ్లు పూలపల్లకీపై వివహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ భక్తజనం ఆనంద పరవశులై స్వామిఅమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరవ రోజు గురువారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ సేవ దివ్య పరిమళభరితంగా సాగింది. ఆలయ తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుంగంధ పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. పల్లకీలో స్వామి ఊరేగుతున్నంత సేపు అశేష భక్తజనవాహిని కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థాన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ఈవో ఎస్.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్.కనకదుర్గ, అంబాల లక్ష్మీసావిత్రమ్మ, ఎం.విజయలక్ష్మి, మఠం విరుపాక్షయ్యస్వామి, ఓ.మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం భక్తజన సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేకువజామున్నే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణవేణమ్మకు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం మల్లన్న దర్శనానికి బారులుదీరుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులందరికీ స్వామి వారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అందరికీ అలంకార దర్శనాన్ని కల్పిస్తున్నారు. మల్లికార్జున స్వామి గర్భాలయంలో కూడా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో నాగలూటి, పెచ్చుర్వు, కైలాసద్వారం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొర్రప్రోలూరు శివస్వాములు 20 కి.మీ దూరంలోని ఆత్మకూరు డివిజన్లోని రోళ్ల పెంట చేరుకుని అక్కడ నుంచి నేరుగా పెచ్చెర్వుకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలక్షేత్రానికి నడకమార్గంలో మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులకు ఏ లోటు రానీయొద్దు ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానీయొద్దని దేవస్థానం అధికారులను ఈఓ లవన్న ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్ర పరిధిలో తాత్కాలిక వైద్యశాల, అన్న ప్రసాదవితరణ, దర్శన క్యూలైన్ల్లను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో వైద్య శిబిరాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదాల కేంద్రాల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమయానుసారంగా అన్నప్రసాదాలను అందించాలని సూచించారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందించాలని సూచించారు. మేము.. మీకు సహాయ పడగలము! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలదేవస్థానం ఆధ్వర్యంలో నందికూడలి వద్ద సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో కరపత్రాలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఏదేనీ సమాచారాన్ని అడిగిన వెంటనే మర్యాదపూర్వకంగా వారికి తెలియజేస్తున్నారు. రథశిఖర కలశానికి పూజలు ఆదివారం రథోత్సవం సందర్భంగా రథశిఖర కలశానికి గురువారం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈఓ లవన్న ప్రత్యేక పూజల నిర్వహించి, రథశిఖర కలశాన్ని స్వయంగా మోసుకుంటూ ఆలయప్రదక్షిణ చేశారు. అనంతరం రథశిఖర కలశాన్ని సంప్రదాయబద్దంగా రథం వద్దకు చేర్చారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ, గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
మహాశివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈనెల 18న 2,427 బస్సులను నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు 17వ తేదీ నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, ఆలంపూర్కు 16, రామప్పకు 15, ఉమామహేశ్వరానికి మరో 14 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు ఈ ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. వీటికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు శుక్రవారం కలిశారు. శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వనించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వామివారి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసిన వేద పడింతులు.. వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: గొప్ప చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్ -
విజయవాడ కెనాల్ రోడ్డులో రథోత్సవం. కిక్కిరిసిన భక్తజనం (ఫొటోలు)
-
శివయ్యా.. మాకెందుకీ శిక్ష
వరంగల్ (మంగపేట): మహాశివరాత్రి.. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈనేపథ్యంలో మహాశివుడి దర్శనం కోసం వచ్చి.. పుణ్యస్నానానికి గోదావరిలోకి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాతపడ్డాడు. తల్లిదండ్రుల కళ్లెదుటే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. వివరాలు.. కమలాపురంలోని టీడీపీ కాలనీకి చెందిన భూక్యా రవి, శారద తమ కుమారులు చంటి, సాయికుమార్(19)తో కలిసి ఉదయం సుమారు 8 గంటలకు ఇంటెక్వెల్ సమీపంలో గోదావరి స్నానానికి వెళ్లారు. తల్లి దండ్రులు గోదావరిలో స్నానాలు చేస్తుండగా సాయికుమార్ తన స్నేహితుడు భూక్యా తరుణ్‌తో కలిసి మరోచోట స్నానం చేసేందుకు వెళ్లాడు. తరుణ్ ఒడ్డుపై ఉండగా సాయికుమార్ గోదావరిలో దిగేందుకు ప్రయత్నిస్తూ.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో పడిపోయాడు. చేయి అందించాలని తరుణ్‌ను కోరాడు. చేయి అందించిన తరుణ్ సైతం సాయికుమార్‌తో పాటు గోదావరిలో పడిపోయాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో కాపాడాలంటూ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు తరుణ్‌ను బయటకు తీసుకురాగా అప్పటికే సాయికుమార్ నీటమునిగాడు. తహసీల్దార్ సలీం, ఎస్సై తాహెర్‌బాబా సంఘటనా స్థలానికి చేరుకుని నాటు పడవల సాయంతో గజఈతగాళ్లు వలలతో గాలింపు ముమ్మరం చేశారు. స్థానిక మత్స్యకారులు నాటుపడవల సాయంతో వలలతో గాలిస్తూ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సాయికుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్లెదుటే విగతజీవిగా మారిన కుమారుడి మృతదేహం వద్ద .. శివయ్యా.. ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశావు.. నీ దర్శనానికే వచ్చాముకదా.. దయ చూపలేదు కదా.. అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభవించిన భక్తజనం (ఫోటోలు)
-
భక్త జనం.. శివోహం (ఫోటోలు)
-
భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు
-
చిత్తూరు జిల్లాలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
హరహర మహదేవ!‘మహా’ ప్రసాదం (ఫోటోలు)
-
Keesaragutta Temple: కీసర గుట్టపై శంభో శంకరా (ఫోటోలు)
-
శివన్నామస్మరణలో శైవక్షేత్రాలు (ఫోటోలు)
-
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
-
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం
-
భక్తులతో కిటకిటలాడుతున్న కీసరగుట్ట శివాలయం
-
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు
-
భీమేశ్వర ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
-
ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..
-
పశుపతినాథ క్షేత్రం.. జింక కొమ్ము పట్టుకుని లాగడంతో!
భారతదేశానికి వెలుపల ఉన్న శివాలయాలలో నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ క్షేత్రం ప్రాచీనమైనది. పురాణేతిహాసాల్లో ఈ క్షేత్రం ఆవిర్భావం గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివుడు పార్వతీ సమేతంగా కాశీ నుంచి బయలుదేరి, భాగామతి నదీతీరంలో మృతస్థలి అనే ప్రదేశంలో జింకరూపంలో నిద్రించగా, శివుడిని తిరిగి కాశీకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో దేవతలు జింక కొమ్ము పట్టుకుని లాగారట. అప్పుడు ఆ కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి అక్కడ పడిందట. ఆ నాలుగు ముక్కలూ పడిన చోటే చతుర్ముఖ శివలింగం వెలసింది. ఈ ప్రాంతమే పశుపతినాథ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అని చెబుతారు. పశుపతినాథ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందనే దానిపై సరైన ఆధారాలేవీ లేవు. నేపాల్‌ను పరిపాలించిన రాచవంశానికి చెందిన ‘గోపాలరాజ వంశావళి’లో ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటి నుంచే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పగోడాలా కనిపించే ఈ ఆలయం పైకప్పులపై బంగారు, రాగి తాపడం, ప్రధాన ద్వారాలకు వెండితాపడం కనిపిస్తాయి. ఈ ఆలయంలో దక్షిణభారత పూజారులే నిత్యార్చనలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారత్ నుంచి కూడా వేలాదిమంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. -
శివయ్య సేవలో సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/గుడివాడ టౌన్ : కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక మహా శివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సుమారు అరగంట సేపు శివుని సేవలో పాలు పంచుకున్నారు. నిలువెత్తు శివుని విగ్రహం ముందు ఏర్పాటు చేసిన తేజో(శివ) లింగానికి మహారుద్ర, చతుర్వేద మంత్రోచ్ఛారణల మధ్య పాలు, పవిత్ర జలాలతో స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం బిల్వ పత్రాలను శివ లింగానికి సమర్పించి నమస్కరించారు. పూలు, రుద్రాక్షల దండలతో శివలింగాన్ని స్వయంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ వేద పండితులు అందజేసిన హారతిని సీఎం జగన్ కూడా కళ్లకు అద్దుకున్నారు. అనంతరం అదే ప్రాంగణంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చుట్టిన తలపాగాతో పట్టువస్త్రంలో వివిధ సుగంధ పరిమళాలతో కూడిన వస్తువులను నెత్తిన ఉంచుకొని భక్తి శ్రద్ధలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం వాటిని హోమంలో అగ్నిదేవునికి ఆహుతినిచ్చారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. శివుని కృపా కటాక్షాల కోసం మహా సంకల్పం పరమశివుని కృపాకటాక్షాలను సీఎం జగన్ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు సిద్ధింప చేయాలనే మహాసంకల్పంతో మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుండి అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు మహారుద్ర పారాయణం, రుద్రహోమం, సహస్ర లింగార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, జాగరణ దీక్ష నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా, మహాదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘విశేష పూజలు, జాగరణతో ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. – శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం ట్వీట్ -
హరహర మహాదేవ.. శంభో శంకర
-
దేశవ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటేత్తారు. తినేత్రుడిని స్మరిస్తూ..భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొన్ని శైవక్షేత్రాలు భక్తులతో క్రిక్కిరిసిపోగా.. కొన్ని చోట్ల కరోనా భయంతో వెలవెలబోయాయి. దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడకలు ఎలా జరిగాయంటే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ విశ్వనాధుడిని దర్శించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. ఉత్తరఖాండ్ ప్రస్తుతం రాష్ట్రంలో మహాకుంభమేళా జరుగుతోంది. దాంతో పాటు నేడు మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసిరావడంతో భక్తులు, సాధువులు పెద్ద సంఖ్యలో హరిద్వార్ గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని త్రయంభకేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున హాజరయి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి కోవిడ్ కారణంగా ఆంక్షలు విధించడంతో త్రయంభకేశ్వర ఆలయం వెలవెలబోతుంది. ఒడిశాలో రాష్ట్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మూకశ్మీర్ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలు శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ నేపాల్‌లోని పశుపతి నాథ్ ఆలయం ప్రముఖ శైవక్షేత్రం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి కరోనా కారణంగా ఆలయం వెలవెలబోయింది. పంజాబ్ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఆలయాలకు భారీ ఎత్తున పోటేత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫోటో కర్టెసీ: ఏఎన్ఐ -
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. శివన్నామస్మరణతో ఆలయప్రాంగణం మారుమ్రోగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి, ఆలయ జేఈవో లక్ష్మయ్య, ఐజీ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో నిరంతరంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో సర్వదర్శనాన్ని నిషేధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.35 గంటల నుంచి శుక్రవారం వేకువజామున 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది రుత్వికులచే ఘనంగా నిర్వహిస్తారు. కర్నూలు/తూర్పుగోదావరి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో భక్తులు పెద్దఎత్తున గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో తెల్లవారుజాము 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం మల్లికార్జున స్వామికి లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శ్రీశైలం మల్లన్నకు పాగాలంకరణ, అనంతరం స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. చిత్తూరు: శ్రీకాళహస్తిలో వేకువజాము నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. గుంటూరు: పంచారామక్షేత్రం అమరావతిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమరలింగేశ్వర స్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది. విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పున్నమిఘాట్, కృష్ణవేణి, పవిత్ర సంగమంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తజనం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలయాల్లో లింగరూపుడైనా శివున్ని దర్శించుకోని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవదేవుడైనాశివునికి పాలు, పత్రాలు సమర్పించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: పోలవరంపై వాస్తవాలు గోదాట్లో కలిపిన ‘ఈనాడు’ ! ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా -
మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు
సాక్షి, అమరావతి/శ్రీకాళహస్తి రూరల్/శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా)/శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఉత్సవ మూర్తులతో పాటు ఆలయాలను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు వారం రోజుల్లో రెండు విడతలు ఆలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పారిశుధ్యం, కరోనా నియంత్రణ చర్యలపై ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. పండుగ రోజున 25 వేల మందికి భక్తులు వచ్చే అవకాశం ఉన్న ఆలయాల్లో ప్రత్యేకించి అదనపు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క ఆలయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించారు. భక్తుల మధ్య భౌతికదూరం, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆలయాల వద్ద కోనేరుల్లో పూర్తి స్థాయి క్లోరినేషన్ చేశారు. హంసవాహనంపై ఆదిదేవుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై విహరించారు. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వరులు పురవీధుల్లో విహరించారు. రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిది్వలాసంతో భక్తులకు ఆభయ ప్రదానం చేశారు. శివరాత్రి జాగరణకు జంగమయ్య క్షేత్రం సిద్ధం వాయులింగక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని జాగరణకు ఏర్పాట్లను పూర్తి చేశారు. మూగజీవాలైన సాలెపురుగు, సర్పం, ఏనుగు శివుని ప్రార్ధించి ముక్తిని పొందిన క్షేత్రమే శ్రీ–కాళ–హస్తి. దక్షిణ కైలాసంగా ప్రాచుర్యం పొందిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తారు. శివయ్యకు పట్టువ్రస్తాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి దంపతులు శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు బుధవారం పట్టువ్రస్తాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు త్రినేత్ర అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. అతిథి గృహం నుంచి పట్టు వ్రస్తాలను తలమీద పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వ్రస్తాలను మంత్రి ఆలయ అలంకార మండపంలో ప్రధాన అర్చకులకు అందజేయగా, వారు ఉత్సవమూర్తులకు అలంకరించారు. కాగా, ఆలయ ఏకశిలా ధ్వజస్తంభంపై ఉన్న సూక్ష్మ నందికి ఎమ్మెల్యే బియ్యపుమధుసూదన్‌రెడ్డి బంగారుతాపడం వేయించారు. బుధవారం ఆలయంలో బంగారు సూక్ష్మనందికి మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శివయ్యను వేడుకున్నానని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పట్టు వస్త్రాలు సమర్పించాక విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాలు బాగా కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నానన్నారు. గజ వాహనంపై మల్లన్న దర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధవారం రాత్రి శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబదేవి సమేతంగా గజవాహనంపై ఊరేగారు. స్వామిఅమ్మవార్ల వైభవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనా దీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్నకు గురువారం రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం గుండా తరలివస్తున్న శివస్వాములతో పాటు ఇప్పటికే క్షేత్రానికి చేరుకున్న భక్తులతో శ్రీగిరి కిటకిటలాడుతోంది. -
గుడివాడలో శివరాత్రి వేడుకలకు సీఎం వైఎస్ జగన్
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో గురువారం నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆయన సీఎం కార్యాలయ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎస్పీ ఎం.రవీంద్రనా«థ్‌బాబుతో కలిసి స్టేడియంలో పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు పరమశివుడి కృపాకటాక్షాలు సిద్ధించాలనే సంకల్పంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభిషేకం, మహా హోమం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. కాగా, మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుంచి అర్థరాత్రి లింగోద్భవ కాలం వరకు రుద్రపారాయణం, రుద్రహోమం, సహస్రలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణ కార్యక్రమాలు జరుగుతాయని నాని తెలిపారు. -
ఆరు రకాల ఉపవాసాలు మంచివట!
‘‘లంఖణం పరమౌషధం’’ అనేది పెద్దవాళ్ల నోట తరుచూ వింటుంటాం! ఇది ఆషామాషీగా చెప్పింది కాదని, నిజంగానే ఉపవాసానికి, ఆరోగ్యానికి లంకె ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వేళకు తిండి తినడం ఎంత ముఖ్యమో అప్పుడప్పుడూ ఉపవాసం ఉండడమూ అంతే శ్రేయస్కరం. అందుకే అప్పుడప్పుడూ కడుపును ఖాళీగా ఉంచుకోమంటుంటారు పెద్దలు, వైద్యులు. భారతీయ సంస్కృతిలో ఉపవాసానికీ చోటుంది. మహాశివరాత్రి, నాగుల చవితి లాంటి కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం చాలామందికి అలవాటు. దీని ద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలసి వస్తాయి. కాలం మారింది. శారీరక శ్రమ తగ్గి, చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు రావడం, వేళాపాళా లేని ఉద్యోగాలు, జంక్‌ఫుడ్ తదితర వాటి వల్ల ఊబకాయుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దీనివల్ల రకరకాల వ్యాధులూ విజృంభిస్తున్నాయి. అందుకే అడ్డదిడ్డంగా తిండి తినే బదులు ఓ క్రమపద్ధతి అలవాటు చేసుకోవాలని, దీనికి ఉపవాసాన్నీ జోడించాలని తాజాగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, జీవితకాలం పెరగడం జరుగుతాయని అంటున్నాయి. ఈ క్రమంలో ఆరు రకాల ఉపవాసాలు ఆరోగ్యానికి శ్రేష్ఠం అని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఆ ఆరింటి గురించి తెలుసుకుందామిలా. 1) 16/8 పద్ధతి దీన్నే లీన్గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతి అని కూడా అంటారు. ఇందులో ఉదయం అల్పాహారం తీసుకోకూడదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు. అంటే రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 16గంటల పాటు ఉపవాసం ఉండాలి. మహిళలైతే 15గంటలు ఉంటే చాలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేని వాళ్లకు ఈ పద్ధతి పాటించడం కష్టం. కానీ అల్పహారం ఎగరగొట్టే వాళ్లకు సులభం. అయితే, ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. దీనివల్ల భోజనంపై ధ్యాస కూడా తగ్గుతుంది. ఉపవాసం ముగిశాక తీసుకునే ఆహారం మాత్రం పూర్తి బలవర్థకంగా ఉండాలి. విపరీతంగా జంక్‌ఫుడ్ తినేవారికి, అధికంగా కేలరీలు ఉండే వారికి ఈ విధానంతో ఫలితం ఉండదు. 2) 5:2 డైట్! దీన్నే ఫాస్ట్ డైట్ అని అంటారు. ఇందులో వారానికి ఐదురోజులు సాధారణ ఆహార నియమాలే పాటించాలి. అయితే, రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. అంటే మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలి. ఈ విధానంలోని సానుకూల ఫలితాలపై ఇప్పటికీ సరైన పరిశోధనలు లేనప్పటికీ చాలామంది 5:2డైట్‌ను అనుసరిస్తున్నారు. 3) ఈట్ స్టాప్ ఈట్ కొన్నేళ్లపాటు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని ఫిట్నెస్ నిపుణుడు బ్రాడ్ పిలాన్ ప్రవేశపెట్టారు. ఇందులో వారంలో 48గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్ చేశాక మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసేంతవరకు ఉపవాసం ఉండాలి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ మధ్య ఉపవాసంగానూ చేసుకోవచ్చు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఈ పద్ధతి అనుసరించేటట్లయితే ఆహారం తీసుకొనే దశలో మాత్రం సాధారణంగానే భోజనం ఉండాలి. నిజానికి 24గంటల పాటు ఉపవాసం ఉండడం చాలామందికి అంత సులభమైన విషయం కాదు. 4) రోజు మార్చి రోజు(ఆల్టర్నేటివ్ డే) ఇందులో వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. లేదా 500 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ దీన్ని పాటించడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఉపవాసం రోజు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవడం అంత సులభం కాదు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విధానం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. 5) ది వారియర్ డైట్ ఇందులో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4నుంచి 8గంటల లోపు లార్జ్ మీల్ భుజించాలి. ఇది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న విధానం. 6) స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్ ఇందులో వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ తీసుకోకూడదు. అయితే, ఏయేరోజు పాటించాలనేది మీ ఇష్టం. ఉదాహరణకు ఏదైనా రోజు ఆకలి లేనప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమృద్ధిగా తినాలి. ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకవు. అలాంటప్పుడు ఈ పద్ధతి అవలంబించుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని రకాలు ట్రై చేయవద్దు. ఏదైనా సరే ఒక విధానం ప్రకారం అనుసరిస్తేనే మేలు. ఉపవాసం శ్రేయస్కరం కావచ్చు కానీ శ్రుతి మించితే ప్రమాదమని గుర్తుపెట్టుకోవాలి. -
మహా శివరాత్రికి 3,777 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినానికి ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాధారణ చార్జీలనే వసూలు చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు సాధారణ టికెట్ రేట్లనే ఈ పండక్కి వసూలు చేయనున్నారు. మహాశివరాత్రికి రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంలకు 938 బస్సుల్ని నడుపుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల్ని నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ఠాకూర్ అన్ని రీజియన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ తప్పని సరి..: ఆర్టీసీ ఎండీ ఠాకూర్ శనివారం కోటప్పకొండలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్క్ లేనిదే బస్సుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని, ప్రతి క్యాంప్‌లో శానిటైజర్ల స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొబైల్ టీంలు ఏర్పాటు చేయాలన్నారు. -
కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ
లక్నో: భక్తి, మూఢనమ్మకాల మాటున మానవులు వింతవింత చేష్టలు చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో జరిగిన ఘోరమైన ఘటన మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ సంఘటన జరిగింది. ఓ మహిళ జీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కొందరి సహాయంతో అడ్డుకోవడంతో ఆమె బతికింది. అయితే తాను శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు జీవ సమాధి అవుతానని 50 ఏళ్ల మహిళ రాద్ధాంతం చేసింది. దీనికి గ్రామస్తులంతా సహకరించడం వింత. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాన్పూర్ నగర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో ఉన్న సజేటి గ్రామానికి రామ్ సంజీవన్, గోమతిదేవి భార్యాభర్తలు. వీరు శివభక్తులు. ఆమె భక్తిభావనలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో తనను సమాధి చేయాలని కుటుంబసభ్యులను కోరింది. శివుడు తనకు కలలో కనిపించాడని, మహాశివరాత్రికి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాను సమాధి కావాలని పట్టుబట్టింది. దీంతో ఆమెను సమాధి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇంటి బయట నాలుగు అడుగుల గొయ్యిని తవ్వించారు. ఆ తర్వాత మంచంపై ధ్యానముద్రలో కూర్చుని ఉన్న గోమతిదేవిని గొయ్యిలో దించారు. దీనికి స్థానికులంతా సహకరించారు. అనంతరం అందరూ భజనలు చేస్తూ పూలు, మట్టిని ఆమెపై చల్లారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమెను సమాధి చేయడం చూసి ఖంగు తిన్నారు. వెంటనే గోమతిదేవిని గొయ్యి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రావడం ఆలస్యమై ఉంటే ఆమె జీవ సమాధి అయ్యి ఉండేది. మూఢ నమ్మకాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. -
శివరాత్రి నాడు శివునికి నైవేద్యం కరువు..
మర్రిపూడి: ఎకరాలకు ఎకరాలు మాన్యం భూములున్నాయి.. వాటిపై వేలాది రూపాయల ఆదాయం వచ్చే మార్గం ఉంది. అయినా పురాతన ఆలయాలకు ఆలనాపాలనా కరువైంది. ఏడాదికి ఓమారు వచ్చే మహా శివరాత్రి పర్వదినం రోజు కూడా ఆ లయకారునికి నైవేద్యం సమర్పించే దిక్కు లేకుండా పోయింది. కొండపి మండల పరిధిలోని దేవుడి భూములు ఏళ్ల తరబడి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక టీడీపీ నేతల అండతో కొందరు మాన్యం భూములు యథేశ్చగా దున్నుకుని పైర్లు వేసుకుని అనుభవిస్తున్నారు. దీంతో స్వామి వారి ఆలయాలు ఆదరణ కరువైశిథిల స్థితికి చేరాయి. శివునికి దూప, దీపాలు కరువు.. మండలంలోని సన్నమూరు గ్రామానికి పడమర దిక్కున పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. పటిష్టంగా రాతి కట్టడమైన ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించినట్లు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ఆధారంగా తెలుస్తోంది. అప్పట్లో స్వాముల వారికి ధూపదీప నైవేద్యం పెట్టేందుకు ఓ ధర్మకర్తను ఏర్పాటు చేశారు. అప్పట్లో 26 ఎకరాల మాన్యపు భూమిని రామలింగేశ్వర స్వామికి కేటాయించారు. స్వామి వారికి నైవేద్యం సమర్పించే ధర్మకర్తకు ఆ భూమిపై వచ్చే ఆదాయంతో పోషణ జరిగేవిధంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో రామలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. ఆలయం చుట్టూ చిల్ల చెట్లు అల్లుకుపోవడంతో ఆ ప్రదేశంలో అసలు ఓ పుణ్యక్షేత్రం ఉందన్న విషయమే నేటి వారికి తెలియని స్థితి ఏర్పడింది. ఆక్రమణ చెరలో మాన్యం భూములు.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో దొంగలు పడి శివ లింగాన్ని తవ్వేశారు. ప్రతిష్టంచిన ప్రదేశంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు పెద్దలు చెబుతున్నారు. ఆలయం దెబ్బతిని పోవడంతో కొందరు స్వార్ధపరులు ఇదే అవకాశంగా తీసుకున్నారు. సన్నమూరు గ్రామం పరిధిలో సర్వే నంబర్ 85లో 25.75 ఎకరాల మాన్యపు భూమిని కొందరు గ్రామానికి చెందిన టీడీపీ నేతల అండదండలతో యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ రబీ సీజన్లోనూ ఆ మాన్యం భూమిలో కందిపంట సాగుచేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఎండోమెంట్ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. శిథిల స్థితిలో మరికొన్ని ఆలయాలు.. మండలంలో తంగెళ్ల గ్రామంలోని శివాలయానికి దేవుని మాన్యంపు భూమి 65.76 ఎకరాలు ఉంది. ధర్మకర్తను ఏర్పాటు చేశారు. కానీ గుడికి కనీసి వెల్లవేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నిర్వాహణ సక్రమంగాలేక ఆలయం శిథిలావస్థకు చేరింది. అలాగే మండలంలోని కెల్లపల్లి గ్రామంలో శివాలయంలో 54.42 ఎకరాల దేవుని మాన్యపు భూమి ఉంది. ధర్మకర్తలు ఉన్నా కేవలం నైవేద్యానికే పరిమితం చేశారు. కానీ గతంలో ఎన్నడూ శివరాత్రి పండుగ వేడుకలు నిర్వహించిన దాఖలాలు లేవు. అలాగే కాకర్లలో 63 ఎకరాల మాన్యం భూమి ఉన్న శివాలయంలోనూ ఎలాంటి ఉత్సవాలు జరిగిన దాఖలాలు లేవు. రామాయపాలెం శివాలయానికి 18.29 ఎకరాల దేవుని మాన్యపు భూమిని కేటాయించారు. ఇక్కడ నైవేద్యం పెట్టేనాథుడు కరువయ్యారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. 2008–09 లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్సార్ రాష్ట్రంలో రూ.28 వేల ఆలయాలను జీర్ణోద్దరణ చేసి, నైవేద్యానికి నిధులు కేటాయించారు. ఆ సమయంలో కూడా ఈ ఆలయాలను పునరుద్ధరించిన దాఖలాలు లేవు. ఎండోమెంట్ అధికారులు స్పందించి అన్యాక్రాంతం అవుతున్న దేవుని మాన్యాలను కాపాడాలని మండల ప్రజలు కోరుచున్నారు. -
అగ్నిగుండంలో తోపులాట; ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని పాత శివాలయం దగ్గర కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ నేపథ్యంలో అగ్నిగుండంలో నడస్తుండగా తోపులాట జరిగి ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వారిలో ఇద్దరి భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిగుండంలో నడుస్తుండగా భక్తులు ఒక్కసారిగా తోసుకోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
అగ్నిగుండం కార్యక్రమంలో అపశ్రుతి
-
బంగారు బల్లి.. మళ్లీ దర్శనమిచ్చింది
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో మాత్రమే కలుగుతుంది. అంతరించే జాతుల్లో చేరిన ఈ బంగారు బల్లి కొన్నేళ్లుగా కనిపించడం లేదు. అయితే శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వెనుకనున్న శిలాతోరణంపై దర్శనమిచ్చింది. కాగా, మునుపు ఒకసారి మహాశివరాత్రి నాడే (2016లో) ఈ బంగారు బల్లి తిరుమల చక్రతీర్థం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభ సమయంలో భక్తుల కంటపడటం విశేషం. (రాయంచపై సోమస్కంధుడి రాజసం ) -
హర హర మహాదేవ శంభో శంకర
సాక్షి, నెట్వర్క్: హర హర మహాదేవ శంభో శంకర నామస్మరణతో రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు పులకించాయి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. దక్షిణ కైలాసంగా పేరొందిన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్త జనం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామివారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై పట్టణంలోని నాలుగుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శనివారం మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవం నిర్వహణకు స్వామివారి రథాన్ని సిద్ధంగా ఉంచారు. ఆలయంలో అడుగడుగునా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవ కల్యాణం శ్రీశైలంలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి పర్వదిన ఘడియలు ప్రారంభం కాగానే శ్రీమల్లికార్జునస్వామిని వరుడిగా తీర్చిదిద్దే పాగాలంకరణ మొదలైంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 11 మంది రుత్వికులు స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివనామస్మరణతో హోరెత్తిన సాగరతీరం సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షణలో కోటి లింగాలకు పూజలు నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్న సుబ్బరామిరెడ్డి, స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర వైభవంగా కోటప్పకొండ తిరునాళ్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన విద్యుత్ ప్రభల కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామతీర్థంలో శివనామ స్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవ దేవాలయం అయినప్పటికీ ఏటా శివరాత్రికి లక్షలాది మంది భక్తులు హాజరై పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సాక్షాత్తూ శ్రీరాముడే రామ క్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. -
ఈషా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు హాజరైన వెంకయ్యనాయుడు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ
-
వేములవాడకు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజామునే స్నానమాచరించి గుడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలన్నింటిని రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఖమ్మం: కల్లూరు మండలంలోని కాశ్మీర మహాదేవ క్షేత్రం శివాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు దర్శించుకున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కూసుమంచిలోని గణపేశ్వరాలయంలోని పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట : హుస్నాబాద్ మండలం పొట్టపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్‌లోని సోమేశ్వర ఆలయంలో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొమురం భీం అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలంలోని ఈజ్గాంలో శివమల్లన్న జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నల్లగొండ: తిప్పర్తి మండలం, రామలింగాలగూడెం శివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి పూజారులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పాలకిషేకం చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్లో గల 400 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన శివాలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు బూర్గంపాడు మండలం మోతె గ్రామంలో పవిత్ర గోదావరి నదిమధ్యలో కొలువైన వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో శివయ్యను దర్శించేందుకు తరలి వస్తున్నారు. ములుగు: వెంకటాపురం మండలం లోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక, అధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. మెదక్: పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి ఏడుపాయల వనదుర్గా మాతకు మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరి వెంట ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. ఏడుపాయల మంజీర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఉపవాస దీక్షతో వనదుర్గాభవాన్ని మాతను దర్శించుకుంటున్నారు. ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రంలో ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఆదేశాల మేరకు మూడంచెల భద్రత నెలకొల్పారు. కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. బాన్సువాడ మoడలం సోమేశ్వర్ సోమలింగాల ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి: మంథని వద్ద గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల: వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిస్తున్నారు. అనంతరం కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు చేపడుతున్నారు. సంగారెడ్డి: ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకీ సంగమేశ్వర స్వామిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ దర్శించుకున్నారు. నారాయణఖేడ్‌లోని పంచగామ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు చిట్కూల్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆందోల్ గ్రామంలోని శివాలయంలోనూ అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు. మంచిర్యాల్: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారం శివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించిన భక్తులు అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. జోగులాంబ గద్వాల- అలంపూర్ బాలబ్రహ్మేశ్వరాలయంలో భారీగా తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాల సమీపంలో కృష్ణానదీలో పుణ్యస్నానాలు ఆచరించి నదీఆగ్రహారం స్పటిక రామేశ్వరాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. అడ్డాకుల మండలం కందూరులో కల్పవృక్షాలకు నెలవైన శ్రీ రామలింగేశ్వరాలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. నిజామాబాద్: మహా శివరాత్రి పర్వదిన వేడుకలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. నీల కంటేశ్వరాలయం , శంభుని గుడి, ఆర్మూర్ నవనాథ సిద్దేశ్వరాలయం, బోధన్ చక్రేశ్వరాలయం, లొంక రామ లింగేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నీలకంటేశ్వర ఆలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్: నవ సిద్ధుల గుట్టపై భక్తుల తాకిడి పెరిగింది. నిర్మల్: బాసరలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉప ఆలయం శ్రీ సురేశ్వరాలయం, శ్రీ వ్యాసేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతసేవతో సంతతధార అభిషేకాలు మొదలయ్యాయి. శివలింగానికి ఆలయ అర్చకులు, వేదపండితులు బిల్వార్చనతో పూజలు చేశారు. సాయంత్రం ప్రదోష కాలంలో మహాలింగార్చన కార్యక్రమం తలపెట్టారు. పుట్టమన్నుతో చేసిన 365 మృత్తికా లింగమూర్తులకు వేదమంత్రోత్సరణతో అభిషేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో సూర్యేశ్వర, వ్యాసేశ్వర ఆలయాల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా హారతి, మంత్రపుష్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంచిర్యాల: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. -
శివనామస్మరణతో పోటెత్తిన ఆలయాలు
సాక్షి, రాజమండ్రి: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. కృష్ణా: శివన్నామస్మరణతో మల్లన్నగట్టు శైవక్షేత్రం మార్మోగుతోంది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. విస్సన్నపేట మండలం కొండపర్వగట్టు శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామిని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పరమశివుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలం ఐలూరులో రామేశ్వరస్వామిని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వీరివెంట కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జొన్నాల మోహనరెడ్డి, మర్రెడ్డి శేషిరెడ్డి, షేక్ లతీఫ్, నడకుదురు రాజేంద్ర, కిలారపు శ్రీనివాసరావు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద భక్తులు కోలాహలం నెలకొంది. పండగను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్నారు. దీంతో శివనామ స్మరణలతో కృష్ణాతీరం ప్రతిధ్వనిస్తోంది. తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప.గో: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి తానేటి వనిత పట్టిసీమ వీరభద్రేశ్వరుని దర్శించుకున్నారు. గుంటూరు: కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమరావతి భక్తులతో అమరేశ్వరుడి ఆలయం కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే కృష్ణ నదిలో స్నానమాచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీస్థాయిలో భక్తులు గుడికి తరలి వస్తున్నారు. విశాఖపట్నం: ఆర్కే బీచ్ లో రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి అధ్వర్యంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. కోటి శివలింగాలకు అభిషేకాలు చేపట్టారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాదికారి స్వామి స్వత్మానందేంద్ర సరస్వతి మహా కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు చిత్తూర్ ఎంపీ రెడ్డప్ప, సినీ నటులు వాణి శ్రీ, శారద, కవిత, మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల్లో నేడు ప్రవేశం ఉచితమని అధికారులు ప్రకటించారు. కాశీపట్నంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం, బొర్రా గూహ లోని మహా శివలింగానికి, కిముడుపల్లిలో స్వయంభు శివలింగానికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి శివరాత్రి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హుకుంపేట మండలం మత్స గుండంలో, సబ్బవరం లోని భీమా లింగేశ్వర ఆలయం, లింగాల తిరుగుడు లోని సోమేశ్వరాలయం, చోడవరం లోని గౌరీ, పార్వతి సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అప్పికొండ పుణ్యక్షేత్రంలోనూ పెద్ద ఎత్తున అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. చిత్తూరు: సోమల మండలంలోని దుర్గం కొండలోని శివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిరవహించారు. కట్టమంచి కులుండీశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు దర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా: ఆచంట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరామేశ్వర స్వామివారిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాధరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భీమవరంలోని పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేస్తున్నారు. నరసాపురంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. పాలకొల్లు పంచారామక్షేత్రంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమానీలకంఠేశ్వర క్షేత్రంలో స్వామివారు విశేష అభిషేకాలు అందుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, తాడువాయి శివాలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. పట్టిసీమ పట్టిసాచలక్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. వీరభద్రేశ్వర స్వామికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలిపూజ నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం: సీఎస్ పురం మండలంలోని బైరవకోన లో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. నెల్లూరు: నగరంలో మాగుంట సర్కిల్ లో బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో 18 అడుగుల శివలింగం ఏర్పాటు చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాతో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న భక్తులు అభిషేకాలు చేస్తున్నారు. కావలి పాత ఊరులోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. మూలస్థానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మైపాడు, కాటేపల్లి, పట్రాంగంలలో భక్తులు సముద్ర స్నానాలు చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఘటిక సిద్దేశ్వరం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సంగంలో పినాకినీ నదిలో స్నానమాచరించి సంగమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాపూరు మండలం సిద్దేశ్వర కోన లో విశేష పూజలు చేపట్టారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడలోని శ్రీ కామాక్షి తాయి సమేత మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో శివ రాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డిలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాకినాడ: సామర్లకోట కుమారా రామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వరం ఆలయంలో ఘనంగా శివరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వైఎస్సార్ కడప: రాజంపేట మండలం ఊటుకూరులోని భక్తకన్నప్ప జన్మస్థలమైన శివాలయానికి శివభక్తులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఆలయం శివనామస్మరణలతో మారుమోగుతోంది. బద్వేలు నియోజకవర్గంలో శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. లంకమల, మల్లెంకొండ, గండి క్షేత్రంలోని దేవాలయాలకు తెల్లవారు జామునుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరుశురాముడు మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందిన రాజంపేట మండలం హత్యరాలలో శివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. హత్యరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వరున్ని దర్శించుకుని పులకించిపోతున్నారు. రైల్వే కోడూరులో శ్రీ భుజంగేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు. శివపార్వతుల కల్యాణోత్సవం కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిత్తూరు జిల్లా: కట్టమంచి కులుండీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రావారిపాళెంలో తలకోన సిద్దేశ్వర స్వామికి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమరగపించారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు ఉదయం రథోత్సవ సేవ నిర్వహించారు. రథంపై తిరుమాఢ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. రాత్రికి అశ్వవాహనంపై తిరిగి ఊరేగించనున్నారు. ఎర్రవారిపాళ్ళెం మండలం తలకోనలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్వతి పరమేశ్వరులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శేషవస్త్రాలు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పలు శివాలయాకు ఆయన శేషవస్త్రాలు అందించారు. తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. విజయవాడ: పున్నమిఘాట్, క్రుష్ణవేణి, పవిత్ర సంగమంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలాచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం వేకువజామునే భక్తులు బారులు తీరారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా: పెదపూడి మండలం గొల్లల మామిడాడ పాటిమీద వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అల్లవరం మండలం గోడి గ్రామంలోని శివాలయంలో ఎంపి చింతా అనురాధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాట్రేనికోనలో కుండలేశ్వర స్వామి వారిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి ఘాట్లకు భక్తులు పోటెత్తారు. సూర్యోదయానికి ముందు నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. కోటిలింగేశ్వరస్వామి ఆలయం, ఉమా మార్కండేయ స్వామి ఆలయాలు శివనామస్మరణతో హోరెత్తిపోతున్నాయి. గౌతమి గోదావరి నది తీరంలోని పంచారామక్షేత్రం ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ వీరభద్రేశ్వరస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయాన్నే స్నానమాచరించి కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దక్షిణకాశిగా పేరుగాంచిన ద్రాక్షారామంలో కొలువైన మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. అనంతపురం: గుంతకల్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో మహా శివరాత్రివేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. మొదటిరోడ్డు శివాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీకాకుళం: కోటేశ్వర స్వామి, శ్రీముఖలింగం మధుకేశ్వరస్వామి, రావివలస ఎండలమల్లికార్జున స్వామి దేవాలయాలు పండగను పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. -
మారిషస్ మహా పండుగ శివరాత్రి...
పచ్చని చెరుకు పొలాలు, వెండి జలపాతాలు, పగడపు దిబ్బలు, కట్టిపడేసే సూర్యోదయాలు, ఎగిరే డాల్ఫిన్లు, గోల్ఫ్ కోర్సులు, బీచ్‌లు, దూరంగా కనిపించే సముద్రపు సొర చేపలు, దీవిని చుట్టిన తెల్లని ఇసుక తీరం, స్కూబా డైవింగ్, హనీమూన్ జంటలు, సినిమా షూటింగ్‌లు, భోజన ప్రియుల కోసం దీవి చుట్టూ స్వాగతం పలికే ఇండియన్ రెస్టారెంట్లు... మారిషస్ అంటే ఎన్నో ఎన్నో.. ప్రపంచంలో 27 వ అతి చిన్న దేశం అయినా బహు భాషల, బహు సంస్కృతులకు నిలయం మారిషస్. తొమ్మిది జిల్లాలు, ఐదు భాషలు (ఇంగ్లిష్ , క్రియోల్, ఫ్రెంచ్, హిందీ, తమిళం) ఇక్కడ వారి సొంతం. ఇవన్నీ అలా ఉంచితే దేశమంతా పవిత్రంగా భావించే రోజు మహాశివరాత్రి. ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో ఉన్న ఈ చిన్న ద్వీపంలో మహాశివుడు ఎలా వెలిశాడు.. మహాశివరాత్రి ఎందుకు ఇక్కడ అంత ప్రాచుర్యం సంతరించుకుంది అంటే..మహా శివుడంటే ఎనలేని భక్తి.. శివరాత్రికి ఇక్కడ జాతీయ సెలవుదినం. మారిషస్ హిందువులకు చాలా పవిత్రమైన రోజు. మహాశివరాత్రిని గ్రాండ్ బాసి¯Œ లోని సరస్సు వద్ద విశేషంగా జరుపుకుంటారు. ఈ సరస్సునే గంగా తలావ్ అని కూడా పిలుస్తారు. శివరాత్రి సమయంలో దాదాపు 6 లక్షల మంది ఈ సరస్సుకు యాత్రగా వెళతారు. ఢోలక్ లాంటి వాయిద్యాలను వాయిస్తూ, కాలినడక, వాహనాల ద్వారా సరస్సుకి చేరుకుంటారు. అక్కడ శివుడిని అర్చించి, సరస్సులోని నీటిని ఇంటికి తీసుకుని వెళతారు. శివరాత్రికి ఉపవాసం ఉండి మరుసటి ఉదయం ఖర్జూరం, వాల్నట్స్, స్వీట్ పోటాటోస్తో ఉపవాస దీక్షను వదులుతారు. భక్తులకు దారి పొడుగునా అల్పాహారం, పానీయాలను స్వచ్ఛందంగా అందిస్తారు. గంగా తలావ్ గంగా తలావ్ అంటే ’గంగా సరస్సు’ అని అర్ధం. మన గంగానది సూచకంగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. మారిషస్ నడిబొడ్డున లోతైన సావన్నే జిల్లాలో ఏకాంత పర్వత ప్రాంతంలో ఉన్న సరస్సు. ఇది సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉంది. మారిషస్‌లో ఇది అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా పరిగణిస్తారు. సరస్సు ఒడ్డున శివ మందిరం ఉంది. గ్రాండ్ బాసిన్ వెంట హనుమంతుడు, గంగాదేవి, గణేష్‌లతో సహా ఇతర దేవాలయాలు ఉన్నాయి. అనేక కథలు ఈ సరస్సు గురించి స్థానికంగా అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడి ఝట నుంచి రాలిన ఒక నీటి బిందువు ఈ సరస్సుగా మారిందని ఒక కథ. ఇక్కడ సరస్సు ఉందని ట్రియోలెట్ గ్రామానికి చెందిన పూజారికి కల రావటం, అక్కడ నిజంగానే సరస్సు ఉండటంతో ప్రజల్లో విపరీతమైన భక్తి, విశ్వాసాలు ఏర్పడ్డాయి. గంగా తలావోకు వెళ్ళిన మొదటి యాత్రికుల బృందం ట్రయోలెట్ గ్రామానికి చెందినది. దీనికి 1898 లో టెర్రె రూజ్ నుండి పండిట్ గిరి గోస్సేన్ నాయకత్వం వహించారు. 1866 లో పాండి సంజిబోన్లాల్ రీయూనియన్ ద్వీపం ద్వారా వ్యాపారిగా వచ్చారు. ట్రియోలెట్ వద్ద మిస్టర్ లాంగ్లోయిస్ భవనాన్ని కొనుగోలు చేసి, గ్రాండ్ బాసి¯Œ ను తీర్థయాత్రగా మార్చటానికి కృషి చేశారు. ఆయన కొన్నభవనాన్ని ఆలయంగా మార్చాడు. పోర్ట్ లూయిస్‌లోని సోకలింగం మీనాట్చీ అమ్మెన్ కోవిల్ నిర్మిస్తున్న కొందరు ఆలయానికి ప్రస్తుత ఆకృతిని ఇవ్వడంలో సహాయపడ్డారు. తర్వాత ఆయన భారతదేశానికి వెళ్లి, భారీ శివలింగాన్ని తీసుకువచ్చి గుడిలో ప్రతిష్టించారు. ముందు ఈ సరస్సును ‘పరి తలావ్’ అని పిలిచేవారు. 1998 లో దీనిని ‘పవిత్ర సరస్సు’గా ప్రకటించారు. 1972లో ప్రధాని రామ్గూలం గోముఖ్ భారతదేశంలోని గంగానది నుంచి నీటిని తీసుకువచ్చి, గ్రాండ్ బాసిన్ నీటితో కలిపి గంగా తలావ్ అని పేరు పెట్టారు. సరస్సు, ఆలయ ప్రాంగణం గంగా తలావ్ ప్రవేశద్వారం వద్ద త్రిశూలంతో నిలబడి ఉన్న శివుడి విగ్రహం ఉంటుంది. మంగల్ మహాదేవ్గా పిలిచే ఈ విగ్రహం 33 మీ (108 అడుగులు) ఎత్తు ఉంటుంది. 2007 లో ప్రతిష్టించిన ఈ విగ్రహం గుజరాత్ వడోదరలోని సుర్సాగర్ సరస్సులో ఉన్న శివవిగ్రహం నమూనా. శివుడితో పాటు ఇక్కడ అనేక దేవీదేవతల విగ్రహాలున్నాయి.శివరాత్రి రోజున దేశమంతా ఒక్కచోటికి వచ్చి, ఏకాగ్రతతో శివుడి భక్తిలో లయం అయినట్లు అనిపిస్తుంది. యువత ఈ పండుగ సమయంలో అందించే సేవల గురించి విశేషమైనవి. – మహేశ్ విశ్వనాథ, ట్రావెలర్ -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
-
‘రాజన్న’ భక్తులకు హెలికాఫ్టర్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్ : శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లడానికి హెలికాప్టర్ సదుపాయాన్ని కల్పించింది. హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్లి తిరిగి రావడానికి టికెట్ ధర రూ.30వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ సూచన మేరకే వేములవాడకు హెలికాఫ్టర్ సదుపాయాన్ని కల్పించామన్నారు. రూ.100 కోట్లు పెట్టి వేములవాడలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక్క టూరిజం ప్రాంతాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. -
మార్కెట్లకు మహాశివరాత్రి కళ
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి మహాశివ రాత్రి కళ వచ్చింది. పండుగ నేపథ్యంలో పూలు, పండ్ల దిగుమతి భారీగా పెరిగింది. హోల్‌సేల్ విక్రయాలకు అడ్డాలయిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్ తదితర మార్కెట్లు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. వందల కొద్దీ లారీల్లో పండ్లు, పూలు ఇక్కడికి వస్తున్నాయి. శివరాత్రి పండగ రోజు నగర ప్రజలు ఎక్కువ శాతం ఉపవాసం ఉండి..ఎక్కువగా పండ్లు ఆరగిస్తారు. రెండు మూడు రోజులపాటు పూజలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పూల విక్రయం కూడా అధికంగా ఉంటుంది. గతేడాది శివరాత్రి పండగ సందర్భంగా 2000 టన్నుల పండ్లు దిగుమతి కాగా పూలు దాదాపు 40 టన్నుల వరకు దిగుమతి అయ్యాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈసారి కూడా ఇదే రీతిలో దిగుమతులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ, సంత్రా, మొసంబి, ద్రాక్షతోపాటు దానిమ్మ పండ్లు ఎక్కువగా దిగుమతి పెరిగిందని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. పూల వ్యాపారం కోటిన్నర, పండ్లు దాదాపు రూ.20 కోట్ల మేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ధరలు యథాతథం ఈ ఏడాది రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి సరిపడా పండ్ల దిగుమతి జరగడంతో రేట్లు ఎక్కువగా పెరగలేదు. ఇక శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గత ఏడాది ఉన్న ధరలే హోల్‌సేల్‌గా ఉన్నాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. పుచ్చకాయ, మొసంబి, సంత్రా గత ఏడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గత ఏడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. శివరాత్రి పురస్కరించుకొని రిటైల్ ధరలు కాస్త పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలో రూ.10–రూ.20 వరకు పెంచారు. మార్కెట్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు మహాశివరాత్రి నేపథ్యంలో మారెŠక్ట్కు పండ్ల దిగుమతి పెరుగుంది. అందుకే రైతులకు ముందస్తుగానే స్థలాలు కేటాయించాం. పండ్లకు గిట్టుబాటు ధర లభించే చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మార్కెట్లోకి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించి, జాగ్రత్తలు పాటిస్తున్నాం. పండ్ల వాహనాలు ఎప్పటికప్పుడు అన్లోడ్ చేయించి బయటకు పంపించడానికి కమీషన్ ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. – ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ, ఉన్నత శ్రేణి కార్యదర్శి పూల రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు శివరాత్రి పురస్కరించుకొని మార్కెట్‌కు దాదాపు అన్ని రకాల పూలు ఎక్కువ మొత్తంలో దిగుతులు జరుగుతున్నాయి. ఈ ఏడాది పూల ధరలు అంతగా పెరగలేదు. అన్ని రకాల పూల ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. మార్కెట్‌కు వచ్చే పూల రైతులకు స్థలాలు ఎప్పటికప్పుడు కేటాయించి, వారికి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాం. కమీషన్ ఏజెంట్లు కొన్న పూలకు రైతులకు వెంటనే డబ్బులు అందుతాయి. రైతులకు ఇంకా ఎమైనా ఇబ్బందులు ఉంటే కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని మార్కెట్ గోడలపై పోస్టర్లు అంటించాం.– ఎం.రవీందర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి(ఎఫ్ఏసీ), గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ -
పోదాం కీసర..
కీసర: ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో బుధవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లిఖార్జున అవధాని పర్యవేక్షణలో, కీసరగుట్ట ఆలయ పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య గణపతిశర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనము, రుత్విక్ పరణము, యాగశాల ప్రవేశము, అఖండజ్యోతి ప్రతిష్టాపన, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారికి నందివాహనసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తారు. భక్తుల సంఖ్యకుతగినట్లు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహోత్సవాల సందర్భంగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చునని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, శానిటేషన్, విషన్భగీరథ , వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధుల్లో పాల్గొంటారు. నేడు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు: బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జాతర సందర్బంగా ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా శాఖలకు సంబందించిన ప్రగతిపై ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి , జిల్లాకలెక్టర్ వాసం.వెంకటేశ్వర్లు క్రీడోత్సవాలు, స్టాల్స్‌ను ప్రారంభిస్తారు. పకడ్బందీ ఏర్పాట్లు :బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ తెలిపారు. మంత్రి, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే విషయమై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే లక్ష లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశామని, భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైతే ప్రసాదాల తయారీని పెంచుతామన్నారు.– ఆలయ ఛైర్మన్ తటాకంశ్రీనివాస్శర్మ పూజా కార్యక్రమాల వివరాలివీ.. మొదటిరోజు: 19 వ తేదీ (బుధవారం) ఉదయం 11గంటలకు విఘ్నేశ్వరపూజతో బ్రహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం పుణ్యావాహచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు. 2వ రోజు: 20 తేదీ(గురువారం) ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు వస్తారు. రాత్రి 10 గంటలకు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామివార్ల కళ్యాణ మహోత్సవం. 3వ రోజు: 21వ తేదీ (శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణమండపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకారహోమం, రాత్రి 8గంటలకు నందివాహన సేవ, భజనలు, రాత్రి 12 గంటల నుంచి లింగోద్బవ కాలంంలో శ్రీరామలింగేశ్వరస్వామికి సంతతధారాభిషేకం. 4వ రోజు: 22 వ తేదీ (శని వారం) ఉదయం 5.30 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కళ్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 9 గంటలకు రుద్రస్వాహాకారహోమం, రాత్రి 7గంటల నుంచిì ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమానరథోత్సవం. 5వ రోజు: 23వ తేదీ( ఆదివారం )5.30 కు మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం,సాముహికఅభిషేకాలు, రాత్రి 7కు ప్రదోష కాలపూజ, హారతి, మంత్రపుష్పము, రాత్రి+ 8 గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం. 6వ రోజు: 24వ తేదీ(సోమవారం) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10 గంటలకు క్షేత్ర దిగ్బలి, అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాల పరిసమాప్తి, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
మహా ‘శివ’రాత్రి మార్మోగిపోయేలా
ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. ఏదో మాట వరసకు జన్మానికో శివరాత్రి అంటారు గాని, నిజానికి ఏటా మహాశివరాత్రి పర్వదినం వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా, ముందుగా హాలాహలం పుట్టింది. హాలహల విషజ్వాలలు ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా, హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారడంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహతప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించసాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగరం చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుని పూజించి, జాగరం చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం. పురాణాలే కాదు, వాటి కంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌భెట్కా గుహలలోని కుడ్యచిత్రాలు ఆనాటి శివారాధనకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. అవి క్రీస్తుపూర్వం ఎనిమిదివేల ఏళ్ల నాటివని చరిత్రకారుల అంచనా. భీమ్‌భెట్కా గుహలలో శివతాండవ దృశ్యాలు, శివుడి త్రిశూలం, ఆయన వాహనమైన నంది చిత్రాలు నేటికీ నిలిచి ఉన్నాయి. సింధులోయ నాగరికత కాలంలో హరప్పా మొహెంజదారో ప్రాంతాల్లోని ప్రజలు శివుడిని పశుపతిగా ఆరాధించేవారనేందుకు మొహెంజదారోలో జరిపిన తవ్వకాలలో ఆధారాలు దొరికాయి. వేద వాంగ్మయం శివుడిని ప్రధానంగా రుద్రుడిగా ప్రస్తుతించింది. రుగ్వేదంలో మొదటిసారిగా ‘శివ’నామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ బీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే, శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి. గ్రీకు దేవుడు ‘డయోనిసిస్’కు శివుని పోలికలు ఉండటంతో భారత భూభాగంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ ఇక్కడి శివుడిని ‘ఇండియన్ డయోనిసిస్’గా అభివర్ణించాడు. కాలక్రమేణా భారత ఉపఖండంలో శివుడినే పరమదైవంగా పరిగణించే శైవమతం వ్యాప్తిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో శైవమతం విస్తృతంగా వ్యాపించింది. భగవద్గీత కంటే ముందునాటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా, శ్రీలంక, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరగా ఉండటంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలిగా జరిగేది. అందుకే చాలాచోట్ల శైవక్షేత్రాలు, శక్తి పీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో చాలా రాజ్యాలు శైవాన్ని బాగా ఆదరించాయి. ఆ కాలంలోనే విస్తృతంగా శివునికి ఆలయ నిర్మాణాలు జరిగాయి. అందరివాడు శివుడు అందరివాడు. బ్రహ్మవిష్ణు దేవేంద్రాది దేవతలే కాదు, రావణుడు, బాణాసురుడు, భస్మాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరులు, సమస్త రుషులు, ఆది శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి గిరిజనులు శివుని ఆరాధించిన వారే. కాళహస్తి మహాత్మ్యం కథనం ప్రకారం సాలెపురుగు, సర్పం, ఏనుగు కూడా శివుని పూజించినట్లు తెలుస్తోంది. దేవ దానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ, మహాభారత కాలాల నాటికే శైవమత వ్యాప్తి విస్తృతంగా ఉండేది. బ్రహ్మ సృష్టికారకుడని, విష్ణువు స్థితికారకుడని, శివుడు లయకారకుడని పలు పురాణాలు చెబుతున్నా, శైవమతం ప్రకారం సృష్టి స్థితి లయలకు శివుడే కారకుడు. శివుడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడే ఆదిదేవుడు. సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు. కర్ణాటకలోని మురుడేశ్వరుడు శివుడిని వివిధ భంగిమల్లోని విగ్రహమూర్తిగానే కాకుండా, లింగరూపంలో పూజిస్తారు. చాలాచోట్ల శివాలయాల్లో శివుని పూర్తి విగ్రహాలకు బదులు శివలింగాలే కనిపిస్తాయి. శివపురాణం, లింగపురాణాల్లో శివుని మహిమలకు సంబంధించిన గాథలు విపులంగా కనిపిస్తాయి. అంతేకాదు, మిగిలిన పురాణాల్లోనూ శివుని ప్రస్తావన, శివునికి సంబంధించిన గాథలు కనిపిస్తాయి. సనాతన మతాలైన వైష్ణవ, శాక్తేయాల్లోనూ శివునికి సముచిత ప్రాధాన్యం కనిపిస్తుంది. స్మార్త సంప్రదాయంలోని పంచాయతన దేవతల్లో శివుడికీ స్థానం కల్పించారు. వైష్ణవం పుంజుకోక ముందు ఉత్తర దక్షిణ భారత ప్రాంతాల్లోని పలు రాజ్యాల్లో శైవానికి విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రతి రాజ్యంలోనూ శివాలయాలు వెలిశాయి. వాటికి సంబంధించిన స్థల పురాణాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుషానుల పాలనలో చలామణీలో ఉన్న బంగారు నాణేలపై నంది వాహనంతో శివుని బొమ్మను ముద్రించారంటే ఆనాటి కాలంలో శైవానికి ఎలాంటి ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం, జామ్‌నగర్‌లో నాగేశ్వర క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలోని మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాలేశ్వర క్షేత్రం, ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర క్షేత్రం, ఉత్తరాఖండ్‌లో కేదారనాథ క్షేత్రం, మహారాష్ట్రలో పుణె సమీపంలోని భీమశంకర క్షేత్రం, నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం, ఎల్లోరా వద్ద ఘృష్ణేశ్వర క్షేత్రం, ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని విశ్వేశ్వర క్షేత్రం, జార్ఖండ్‌లో దేవ్‌గఢ్ వద్ద వైద్యనాథ క్షేత్రం, తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి: అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, భీమవరంలోని సోమేశ్వర ఆలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయం. ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. పంచభూత క్షేత్రాలు ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తమిళనాడులోని జంబుకేశ్వరం జల క్షేత్రంగా, అరుణాచలం అగ్ని క్షేత్రంగా, కంచిలోని ఏకాంబరేశ్వరాలయం పృథ్వీక్షేత్రంగా, చిదంబరంలోని నటరాజ ఆలయం ఆకాశ క్షేత్రంగా, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఆదియోగి మన పురాణాలు ఆదియోగి శివుడేనని చెబుతాయి. పరమయోగులందరికీ శివుడే గురువని చెబుతాయి. సనాతన మతాలలో యోగసాధనకు విస్తృత ప్రాధాన్యం ఉంది. జీవుని అంతిమ లక్ష్యం కైవల్యమేనని, కైవల్యపథాన్ని చేరుకోవడానికి యోగమే మార్గమని, యోగసాధనతోనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. యోగ విద్యలో వివిధ పద్ధతులు ఉన్నా, శైవ సంప్రదాయానికి చెందిన గ్రంథాలు ఎక్కువగా హఠయోగానికే ప్రాధాన్యమిచ్చాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన ‘ఈశ్వర గీత’, పదో శతాబ్దికి చెందిన ‘శివసూత్ర’, ‘శివసంహిత’ వంటి గ్రంథాలు శైవ సంప్రదాయంలో యోగసాధనకు గల ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తాయి. భవబంధాలలో చిక్కుకున్న మనుషులు నిరంతరం ఈతిబాధల్లో కొట్టుమిట్టాడుతుంటారని, పరమాత్మను చేరుకోవాలంటే మనుషులకు యోగమే తగిన మార్గమని పదో శతాబ్దికి చెందిన కాశ్మీర శైవ పండితుడు అభినవగుప్తుడు తన రచనల్లో చెప్పాడు. ఉపఖండానికి వెలుపల... భారత ఉపఖండానికి వెలుపల సైతం ప్రాచీనకాలం నుంచి శివారాధన ఉండేది. ఇండోనేసియాలో శివుడిని ‘బటరగురు’గా ఆరాధిస్తారు. ‘బటరగురు’ అంటే ఆదిగురువు అని అర్థం. ‘బటరగురు’ శిల్పరూపం, ఆరాధన పద్ధతులు దాదాపు మన దేశంలోని దక్షిణామూర్తిని పోలి ఉంటాయి. ఇండోనేసియాలోని లువులో పురాతనమైన ‘బటరగురు’ ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ఆగ్నేయాసియాలో బౌద్ధ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాలంలో సైతం జావా దీవుల్లో శివారాధన కొనసాగేది. అక్కడి ప్రజలు శివుడిని బుద్ధుడు, జనార్దనుడు (విష్ణువు)తో సమానంగా ఆరాధించేవారు. అక్కడి ప్రజలు బుద్ధుడిని శివుని తమ్ముడిగా భావిస్తారు. కుషానుల కాలంలో మధ్య ఆసియా ప్రాంతంలోనూ శైవమత ప్రాబల్యం ఉండేది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న సోగ్డియా, యుతియాన్ రాజ్యాలలో శివారాధన జరిగేది. జపానీయులు పూజించే ఏడుగురు అదృష్టదేవతలకు శివతత్వమే మూలమని చరిత్రకారులు భావిస్తారు. తాంత్రిక ఆచారాలు పాటించే వజ్రయాన, మహాయాన బౌద్ధులు శివుడిని కూడా పూజిస్తారు. పరమశివునికి పదివేల పేర్లు ప్రసిద్ధ దేవతలను సహస్రనామ స్తోత్రాలతో అర్చించడం పరిపాటి. అదే కోవలో శివ సహస్రనామ స్తోత్రం కూడా వాడుకలో ఉంది. అంతేకాదు, మహన్యాసంలో శివునికి దశసహస్రనామాలు ఉన్నాయి. అందులోని పదివేల పేర్లూ పరమశివుని గుణ విశేషాలను స్తుతించేవే! మహాదేవుడిగా, మహేశ్వరుడిగా, త్రినేత్రుడిగా, రుద్రుడిగా, హరుడిగా, శంభునిగా, శంకరునిగా భక్తులు శివుడిని ఆరాధిస్తారు. యోగముద్రలో ఉన్న శివుడిని దక్షిణామూర్తిగా, తాండవ భంగిమలోని శివుడిని నటరాజుగా కూడా పూజిస్తారు. శివరాత్రి ప్రశస్తి మహాశివరాత్రి నేపథ్యానికి సంబంధించి క్షీరసాగరమథన ఘట్టం అందరికీ తెలిసినదే. అయితే, ఇదేరోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ, తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున జాగరం ఉంటూ యోగసాధన చేయడం ద్వారా కుండలినీ శక్తి జాగృతమవుతుందని కొందరు నమ్ముతారు. శివరాత్రి రోజున యోగసాధనలో గడిపేవారు తక్కువే గాని, ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మొదలుకొని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు, భజనల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణాలలో రాత్రంతా జాగరం ఉండేలా నృత్యగాన కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు. మన దేశంలోని వివిధ ఆలయాలతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలోను, పాకిస్తాన్‌లోని ఉమర్‌కోట్‌లో ఉన్న శివాలయంలోను శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మారిషస్‌లో శివరాత్రి రోజున భక్తులు ‘గంగాతలావొ’ సరస్సులో పవిత్రస్నానాలను ఆచరిస్తారు. -
మహా శివరాత్రి బ్రహ్మోత్సవం
-
శ్రీకాళహస్తి ఉత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
-
రామతీర్థం శివరాత్రి వేడుకల్లో అపశృతి
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసకుంది. శివరాత్రి వేడుకలకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు రామతీర్థం కొండపై నుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను విజయనగరం జిల్లా దాసన్నపేటకు చెందిన సాయిరాం, కుమార్‌లుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విషాద జాతర
నెల్లిమర్ల రూరల్: శివజాగరణ చేసి వెళ్తు న్న ఓ కుటుంబం రహదారి ప్రమాదంలో చిన్నారి బాలుడిని కోల్పోయింది. మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం దేవస్థానానికి పూజలుజాగరణ కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆటోబోల్తాపడిన సంఘటనలో ఆ చిన్నారి ప్రాణం గాలిలో కలసిపోయింది. మండలంలో పెదతరిమి జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొత్త ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి రామారావు కుటుంబ సభ్యులు రామతీర్థంలో జరిగే శివరాత్రి జాతరకు సోమవారం ఆటోలో వచ్చారు. రాత్రంతా జాగరణ చేసి మంగళవారం స్వామివారిని దర్శించుకొని ఆటోలో తిరిగి వెళుతున్న క్రమంలో పెదతరిమి గ్రామం వద్దకు రాగానే వెనుక నుంచి మద్యం మత్తులో అతివేగంతో వస్తున్న ద్విచక్రవాహన చోదకుడు ఆటోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో కంట్రోల్ తప్పడంతో పక్కనే ఉన్న నాలుగు అడుగుల గోతిలో బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మైలపల్లి పోలీసు అనే ఎనిమిది నెలల బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాబు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అభం శుభం తెలియని పసికందు ఇలా రహదారి ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పరుల సేవలో తరించడమే ఈశ్వర తత్వం’
చెన్నై : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా యోగా కేంద్రంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి విచ్చేసిన కోవింద్.. ఆదియోగి విగ్రహం వద్ద ‘ఆదియోగి దివ్య దర్శనం’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌండ్-లైట్ షోను ప్రారంభించారు. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. అనంతరం ‘జ్ఞానం - ధ్యానం - ఆనందం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కోవింద్. తర్వాత ధ్యాన లింగం, లింగ భైరవి దేవిలను దర్శించుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు కోవింద్. ‘పరుల సేవలో తరించే జీవితమే అత్యుత్తమ జీవితం. ఇదే ఆ పరమేశ్వరుని సందేశం. మనిషి ముక్తి సాధించడానికి 112 మార్గాలున్నాయి. దాన్ని సూచిస్తూ నెలకొల్పిన ఈ 112 అడుగుల ఆదియోగి విగ్రహం ఏదుట ఈ రోజు మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నా’రు. అంతేకాక యువత యోగా పట్ల ఆకర్షితులవ్వడం చాలా సంతోషకరమైన పరిణామంగా చెప్పుకొచ్చారు. ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ఘనంగా శివరాత్రి వేడుకలును నిర్వహించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమిత్ త్రివేది, హరిహరన్, కార్తీక్ తదితరులు సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. జాగరణ సందర్భంగా రాత్రంతా సంగీతం, ఫోక్ ఆర్ట్, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు దేశవిదేశాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
శివరాత్రి వేడుకలు.. కాజల్ డ్యాన్స్ వీడియో వైరల్
చెన్నై : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్ శివరాత్రి పర్వదినం సందర్భంగా కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా, అదితిరావు హైదరిలతో పాటు రానా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ మహాశివరాత్రి విశిష్టత గురించి ప్రసంగించారు. అనంతరం శివరాత్రి జాగరణలో భాగంగా రాత్రంతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్, తమన్నా, వాసుదేవ్ కలిసి డ్యాన్స్ చేశారు. వారంతా డ్యాన్స్ చేస్తున్న వీడియోను కాజల్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ గాయకుడు కార్తిక్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా హాజరయ్యారు. కొద్దిసేపు వాసుదేవ్‌తో మాట్లాడి ఆయన వెళ్లిపోయారు. View this post on Instagram 😍😍😍😃😃 #KajalAggarwal #Kajal #Kajalism #ishafoundation #Sadhguru A post shared by MEGAANGELKAJAL (@megaangelkajal) on Mar 4, 2019 at 10:12am PST -
మార్కెట్‌కు శివరాత్రి కళ
సాక్షి సిటీబ్యూరో: ఈ ఏడాది శివరాత్రి పుర్వదినం సందర్భంగా నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పూలు పండ్లు హోల్‌సేల్ విక్రయాలు జరిగాయి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్ మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. మార్కెట్ ఎ ంత మొత్తంలో ఎప్పుడూ పండ్లు రాలేదని, పూలు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని మార్కెట్ ఆధికారులు తెలిపారు. శివరాత్రి రోజున ఎక్కువ శాతం మంది ఉపవాసాలు చేసి పండ్లు ఆరగిస్తారు. మిగితా రోజుల్లో దాదాపు ఎనిమిది 800 టన్నుల పండ్లు దిగుమతి అయితే శివరాత్రి సందర్భంగా 1,800 టన్నుల వివిధ రాకల పండ్లు దిగుమతి కాగా పూలు 10 టన్నుల వరకు దిగు మతి అయ్యాయని మార్కెట్ కార్యదర్శి వివరించా రు. గ్రేటర్ పరిధిలో శివరాత్రి పండగ రోజు దా దా పు 1500 టన్నుల వివిధ రకాల పండ్ల విక్రయాలు జరుగుతాయని మార్కెట్ అధికారుల అం చనా. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ , సం త్రా, మొసాంబి, ద్రాక్ష, దానిమ్మ పండ్లకు దిగుమ తి పెరిగిందని హోల్‌సెల్ వ్యాపారులు తెలిపారు. రికార్డు స్థాయిలో పండ్లు, పూలు గతంతో పోలిస్తే ఈ ఏడాది పూల దిగుమతి మూడొంతులు, పండ్లు రెండింతలు ఎక్కువగా దిగుమతి అయ్యాయి. పూలు 40 టన్నులు, పండ్లు 1500 టన్నులు మార్కెట్‌కు వచ్చాయి. దాదాపు పూల వ్యాపారం రూ.1.50 కోట్లు, పండ్లు రూ.20 కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని అంచనా. హోల్‌సేల్ ధరలు యథాతథం ఈ ఏడాది పండ్ల దిగమతి ఎక్కువగా ఉండడంతో ధరలు అంతగా పెరగలేదు. శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గతేడాది ఉన్న ధరలే హోల్‌సేల్ ధరలున్నాయి. పుచ్చకాయ, మొసాంబి, సంత్రా గతేడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గతేడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో పెరిగిన రిటైల్ ధరలు పూలు, పండ్ల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో ఎక్కువగా పెరగలేదు. అయితే బహిరంగ మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు వివిధ రకాల పండ్లు భక్తులు తప్పనిసరిగా ఉపవాస ప్రసాదంగా స్వీకరిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని రిటేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్లో పండ్ల ధరలను రెండింతలు పెంచి విక్రయించారు. దీంతో గత్యంతరం లేక ఎక్కువ డబ్బులు చెల్లించి నగర ప్రజలు కొనాల్సి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలోగా అభ్య మైయ్యే వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. విడివిడిగా విక్రయించే వాటిపై కూడా రూ. 5 నుంచి రూ. 10 వరకు ధరలు పెరిగాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేశాం ప్రతి ఏటా శివరాత్రికి ముందు నగరంతో పాటు శివారు జిల్లాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు పండ్లు కోనుగోలు కోసం పెద్దు ఎత్తున మార్కెట్‌కు వస్తారు. రెండు మూడు రోజుల ముందు నుంచే మార్కెట్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇదే సమయంలో మార్కెట్‌కు మార్కెట్ ఫీజులు ఎప్పటికప్పుడు వసూలు చేసి అదాయం పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. – గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ సొసైటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఇ. వెంకటేశం రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు పలు జిల్లాల నుంచి బంతి, చామంతితో పాటు ఇతర పువ్వులు ఎక్కువ మొత్తం లో మార్కెట్‌కు వచ్చాయి. రోజు కంటే అదివారం మూడింతలు పూలు వచ్చాయి. రైతులకు తా త్కాలిక స్థలాలను కేటాయించాం. రైతులు ధర విషయంలో మోసపోకుండా మద్ధతు ధర నిర్ణయించాం. – కె. శ్రీధర్, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ సొసైటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి -
శివోహం
-
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో మహాశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. వేములవాడ: తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు డాలర్ శేషాద్రి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలతో దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమీ ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడలోని పాత శివాలయం, యలనమకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం, దుర్గగుడిలోని మల్లేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. అర్చనలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వం, సోదరభావం పెంపొం దించాలని ఈ శుభ సందర్భంగా గవర్నర్ ఆకాం క్షించారు. ఎంతో నిష్టతో కోట్లాది మంది శివుడి భక్తులు మహాశివరాత్రి రోజున ప్రార్థనలు చేస్తా రని తెలిపారు. రాష్ట్రం శ్రేయస్సుతో, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శివుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.