
స్టాక్ మార్కెట్ (ఫైల్ ఫోటో)
ముంబై : మహాశివరాత్రి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు(మంగళవారం) సెలవును పాటిస్తున్నాయి. ఈక్విటీ, ఫారెక్స్, మనీ మార్కెట్లన్నీ నేడు ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. గత వారం పతనం నుంచి కోలుకున్న బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం 200 పాయింట్ల లాభంలో 34వేల కీలక మార్కుకు పైన ముగిసిన సంగతి తెలిసిందే.
నిఫ్టీ ఇండెక్స్ కూడా 63 పాయింట్ల లాభంలో 10,518 వద్ద క్లోజైంది. మరోవైపు వాల్‌స్ట్రీట్ నుంచి పాజిటివ్ సంకేతాలు రావడంతో, ఆసియన్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్నింగ్ ట్రేడ్‌లో ఆస్ట్రేలియన్ స్టాక్స్ 0.2 శాతం, దక్షిణ కొరియా కొస్పి 0.9 శాతం, జపాన్ నిక్కీ 0.75 శాతం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment