శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు | All Shivalayam Temples Are Full Of Devotees | Sakshi
Sakshi News home page

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Published Thu, Mar 11 2021 6:52 AM | Last Updated on Thu, Mar 11 2021 4:32 PM

All Shivalayam Temples Are Full Of Devotees - Sakshi

రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. శివన్నామస్మరణతో ఆలయప్రాంగణం మారుమ్రోగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి, ఆలయ జేఈవో లక్ష్మయ్య, ఐజీ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో నిరంతరంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో సర్వదర్శనాన్ని నిషేధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 

సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.35 గంటల నుంచి శుక్రవారం వేకువజామున 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది రుత్వికులచే ఘనంగా నిర్వహిస్తారు. 

కర్నూలు/తూర్పుగోదావరి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో  భక్తులు పెద్దఎత్తున గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో తెల్లవారుజాము 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం మల్లికార్జున స్వామికి లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శ్రీశైలం మల్లన్నకు పాగాలంకరణ, అనంతరం స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు.

చిత్తూరు: శ్రీకాళహస్తిలో వేకువజాము నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం  భక్తులు బారులు తీరారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు.

గుంటూరు: పంచారామక్షేత్రం అమరావతిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం  భక్తులు బారులు తీరారు. అమరలింగేశ్వర స్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది.

విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పున్నమిఘాట్‌, కృష్ణవేణి, పవిత్ర సంగమంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తజనం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలయాల్లో  లింగరూపుడైనా  శివున్ని దర్శించుకోని   ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.  ఈ  సందర్భంగా  దేవదేవుడైనా‌శివునికి పాలు, పత్రాలు సమర్పించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
పోలవరంపై వాస్తవాలు గోదాట్లో కలిపిన ‘ఈనాడు’ !
ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement