srisailam temple
-
శ్రీశైలం : కర్ణాటక,మహారాష్ట్రాల నుంచి పాదయాత్రగా వేలాది భక్తులు (ఫొటోలు)
-
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,198 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులుఉగాది సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలోని క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలోని భక్తులకు ఆలయ సిబ్బంది అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. శ్రీశైలం వీధులు... భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్ణాటక నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దోర్నాల, తెలంగాణ నుంచి వందల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో... ట్రాఫిక్ పెరిగింది. -
భగవంతుడా... ఇదేమి ‘భద్రత’!
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆలయాల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. క్షేత్రంలో అడుగడుగునా నిఘా, భద్రత లోపాలు కొట్టొచి్చనట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన భద్రతపై పోలీసు, ఆక్టోపస్ భద్రతా దళం, నిఘా వర్గాలు పలు నివేదికలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు పరచడంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు, భక్తులు అందరూ సెల్ఫోన్లతో, లగేజి బ్యాగులతో ఆలయంలోకి ప్రవేశించేస్తున్నారు. ఆలయంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులను అనుమతించకూడదని ఈవో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ సినా, కొందరు అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారు. –శ్రీశైలం టెంపుల్సెక్యూరిటీ బాధ్యతలు వదిలేసిన గార్డులు శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి 30వేల మంది, రద్దీ రోజుల్లో సుమారు 50 వేల మంది వస్తుంటారు. ఆలయంలో భద్రతకు సుమారు 40 మంది హోంగార్డులు, ఓ ఏజెన్సీ ద్వారా 180 మంది సెక్యూరిటీ గార్డులు, మరో రెండు ఏజెన్సీల ద్వారా 32 మంది సెక్యూరిటీ గార్డులు, ఐదుగురు సెక్యూరిటీ సూపర్వైజర్లు ఉన్నారు. హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఆలయంలో, క్షేత్రంలోని వివిధ ప్రదేశాలలో సెక్యూరిటæ విధుల్లో ఉండాలి. అలాగే క్యూలైన్ల ప్రవేశ ద్వారాల వద్ద భక్తులు సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు, పేలుడు పదార్థాలు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలి. అయితే రూ.150, రూ.300 క్యూలైన్లు, ఆర్జితసేవల క్యూలైన్ వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులు ఓ పర్యవేక్షకురాలి ఆదేశాలతో భద్రత విధులు వదిలేసి, టికెట్లు, ఆధార్ కార్డులు తనిఖీల్లో మునిగిపోతున్నారు. ఆ క్యూలైన్లలో పని చేసే హోంగార్డులు సైతం టికెట్ల తనిఖీలతోనే తలమునకలు అవుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఇతర అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. దీంతో భక్తులు, సిబ్బంది ఆలయంలోకి యథేచ్ఛగా సెల్ ఫోన్లు, లగేజితో ప్రవేశిస్తున్నారు. ఎక్కడా ఏ దశలోనూ అడిగేవాడు, తనిఖీ చేసే వాళ్లు కనిపించడంలేదు. నిరుపయోగంగా భద్రత పరికరాలు శ్రీశైల దేవస్థానం భక్తుల భద్రత దృష్ట్యా ఉచిత క్యూలైన్, ఆర్జిత సేవాకర్తల ప్రవేశ ద్వారం, శ్రీ కృష్ణదేవరాయ గోపురం, రూ.150 క్యూలైన్, రూ.300 క్యూలైన్, హరిహరరాయగోపురం, అమ్మవారి ఆలయం వెనుక తదితర చోట్ల డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఆర్జిత సేవాకర్తల ప్రవేశ ద్వారం, శ్రీకృష్ణదేవరాయగోపురం వద్ద డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఇటీవల తొలగించారు. మిగతా చోట్ల ఉన్నవీ పనిచేయక, అలంకారప్రాయంగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం లగేజ్ స్కానర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు వినియోగించిన దాఖాలాల్లేవు. ఇక ఆలయంలో సెల్‌ఫోన్ జామర్లు లేకపోవడం చూస్తే భద్రతను ఏ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారో అర్థమవుతోంది.హెచ్చరికలు బేఖాతరు శ్రీశైలం ఆలయం భద్రతపై ఆక్టోపస్ బృందాలు పలుమార్లు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్వీయ పర్యవేక్షణ చేపట్టి పలు భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తూ దేవస్థానానికి నివేదికలు కూడా ఇచ్చారు. నిఘా విభాగాలు కూడా క్షేత్ర భద్రతపై పలుమార్లు హెచ్చరించినా ఆలయ అధికారుల తీరులో మార్పురాలేదు.స్క్రీనింగ్ చేస్తున్నాంశ్రీశైలం దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లోకి ప్రవేశించే భక్తులు ఎలాంటి సెల్ఫోన్లు, నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశాం. ఆలయంలో భద్రతను మరింత పటిష్టం చేస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
మహా శివరాత్రి.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
హరహర మహదేవ..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు (ఫోటోలు)
-
మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఏవో శ్యామలరావు
-
శ్రీశైలక్షేత్రంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం : నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభ (ఫొటోలు)
-
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్‌ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
శ్రీశైలం ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు..
-
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
నంద్యాల జిల్లా: శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. నేడు కనుమ పండుగ కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చన నిలుపుదల . మరోపక్క భక్తులు రద్దీ దేశ భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. -
మల్లిఖార్జుని సన్నిధిలో నూతన దంపతులు చై- శోభిత (ఫోటోలు)
-
మల్లన్న సన్నిధిలో కొత్త జంట
-
శ్రీశైలంలో కార్తీక శోభ..
-
శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం..భక్తకోటి పరవశం (ఫొటోలు)
-
కార్తీక సోమవారం.. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం రేపింది. దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ పరిధిలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. డ్రోన్ ఎగురవేసింది తణుకు చెందిన రమేష్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు. డ్రోన్ పట్టుకుని సీసీ కంట్రోల్ రూమ్‌కి తరలించారు. ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీశైలం టెంపుల్ లో కార్తీక మాసం శోభ (ఫొటోలు)
-
శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం
-
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
సాక్షి, నంద్యాల: శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. బయటపడిన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనంగా గుర్తించారు.గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం బయటపడింది. గతంలో పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో పలు తామ్ర శాసనాలు బయటపడ్డాయి. -
శ్రీశైలంలో వార్షిక కుంభోత్సవం
-
శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలంలో అంగరంగ వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)
-
Ugadi 2024: కనులపండువగా శ్రీగిరి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు (ఫొటోలు)
-
మహాశివరాత్రి 2024: శ్రీశైలంలో భారీగా భక్తజనం (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
మహాశివరాత్రి : శ్రీశైలంకు తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
మహాశివరాత్రి 2024: శ్రీశైలంకు భారీగా తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
16 నుంచి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఈ నెల 16–21 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ క్రతువు జరిపించాలని ఆలయాధికారులు భావించినా పలు కారణాలతో ఐదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కుంభాభిషేకంతో పాటు శివాజీ గోపురానికి కూడా కలశ ప్రతిష్టాపన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కుంభాభిషేక పనులు కూడా సిద్ధం చేసినా అనుకోని విధంగా వాయిదా పడింది. ఆ తరువాత ఓ హిందూ ధార్మిక సంస్థ పేరుతో కుంభాభిషేక నిర్వహణపై హైకోర్టుకు వెళ్లారు. కుంభాభిషేకాన్ని ఈ నెల 16– 21 వరకు నిర్వహించాలని హైకోర్టు సూచించడంతో అధికారులు కుంభాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మల్లికార్జున స్వామి గర్భగుడి, ఆలయంలో ఉన్న 4 గోపురాలతో పాటు అమ్మవారి ఆలయం వద్దనున్న గోపురానికి, ఉపాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరి కూలిపోయిన శివాజీ గోపురాన్ని దేవస్థానం పునఃనిర్మించింది. 2018లో ఈ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంతవరకు కలశ ప్రతిష్టాపన జరగలేదు. ఐదేళ్లుగా కలశ ప్రతిష్టాపనకు గోపురం నోచుకోలేదు. కుంభాభిషేకం నిర్వహణ సమయంలోనే కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. -
28న పాక్షిక చంద్రగ్రహణం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్: ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు పేర్కొంది. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి. 28న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలాలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. -
దసరా మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వనం
-
దసరా మహోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు మంగళవారం కలిశారు. త్వరలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎంని ఆహ్వానించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, ఈ నెల 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు జరగనున్నాయి. సీఎం జగన్‌కి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను అందించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. చదవండి: బస్సు యాత్రల్లో జరిగిన మంచిని చెప్పండి: సీఎం జగన్ -
శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు
సాక్షి, నంద్యాల: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, సింహాచలం దేవాలయాల ఈవోలు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఈజవో లవన్న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. ఇక, లవన్న.. శ్రీశైలం ఈవోగా రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. అలాగే, సింహాచలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసమూర్తి నియామకమయ్యారు. ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన -
శ్రీశైలం ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
-
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇకపై
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్ లోని జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్లో బస ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్అవుట్ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చారు. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. "ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది.భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. చదవండి సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు -
అదే తేదీల్లో మహా కుంభాభిషేకానికి ఆదేశాలివ్వలేం
సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో, తిరిగి అదే తేదీల్లో నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సమయం తక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిపింది. భక్తులు ఎక్కువగా వచ్చే కార్తీక మాసంలో మహా కుంభాభిషేకం ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యంలో కొన్ని అంశాలపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. మహా కుంభాభిషేకాన్ని కొనసాగించేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎవరిని సంప్రదించి వాయిదా వేశారు తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖను, దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలు జరిపేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారత వీరశైవ ధర్మాక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ కృష్ణమోహన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. ఆగమ పండితులను సంప్రదించకుండానే మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాలను వాయిదా వేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పూజాదికాల్లో జోక్యం చేసుకునే అధికారం కమిషనర్‌కు లేదన్నారు. దేవదాయ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే మహా కుంభాభిషేకాన్ని వాయిదా వేశామన్నారు. విజయవాడలో నిర్వహించిన యజ్ఞానికి ఎండ తీవ్రత కారణంగా భక్తులు అనుకున్న స్థాయిలో రాలేదని, ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే దేవస్థానం అధికారులతో మాట్లాడి, కంచి పీఠాధిపతి అనుమతి తీసుకున్న తరువాతే కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మహా కుంభాభిషేకానికి ప్రాథమిక ఏర్పాట్లు మాత్రమే జరిగాయని దేవస్థానం తరఫు న్యాయవాది రమణరావు కోర్టుకు నివేదించారు. వాయిదా వల్ల ఆ ర్థిక నష్టం ఏమీ జరగదన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేశామే తప్ప, రద్దు చేయలేదని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వ్యవహారంలో కొన్ని ఆదేశాలిస్తామంటూ నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
శ్రీశైలం : అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు (ఫోటోలు)
-
మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్, కల్పనాదాస్ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, సత్యప్రభ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి దంపతులు రత్నగర్భ స్వామిని దర్శించుకుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని, అనంతరం భ్రమరాంబాదేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. వీరి వెంట పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శ్రీశైలం శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ కె.సుజన, దేవదాయ శాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్, కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు. వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్ అలెన్‌చాంగ్‌టెరాన్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదన్‌రెడ్డి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్‌చాంగ్‌టెరాన్ తెలిపారు. -
హరహర మహాదేవ
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్/సాక్షి, నరసరావుపేట/శ్రీకాళహస్తి రూరల్: హరహర మహాదేవ..శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ శివాలయాల్లో తెల్లవారు జాము నుంచే భక్తులు నదులు, కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, వివిధ వాహన సేవలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించుకుని భక్తులకు కనుల విందు చేశారు. శ్రీశైలం భక్తజనసంద్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తజనసంద్రంగా మారింది. నల్లమల కొండలు శివనామస్మరణతో పరవశించాయి. శనివారం మల్లన్న, భ్రమరాంబదేవిలకు దేవస్థాన ధర్మకర్తల మండలి అ«ధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళపుష్పాలతో అలంకరించి ఆశీనులు గావించారు. వేదపండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా ఆదిదంపతులు ఒకటయ్యారు. శ్రీశైల ఆలయంపైన ఉన్న నవనందులకు అర్ధరాత్రి పాగాను అలంకరించిన దృశ్యం నీలకంఠుడికి పాగాలంకరణ మహాశివరాత్రి పర్వదినాన శ్రీమల్లికార్జునస్వామికి ఆలయంపై పాగాలంకరణ శివరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకం. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వి వెంకటేశ్వర్లు స్వామి వారి గర్భాలయ విమాన గోపురం, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తజనంతో నిండిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శనివారం శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కోటప్పకొండ ప్రత్యేకతైన ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ఏకంగా 22 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతో మార్మోగింది. స్వామి, అమ్మవారికి ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి వారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. నంది వాహన సేవ సమయంలో ఉత్సవమూర్తులు స్వర్ణాభరణాల అలంకరణతో మెరిసిపోయారు. పంచారామాల యాత్ర రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పంచారామాలైన ద్రాక్షారామం శ్రీభీమేశ్వరస్వామి దేవస్థానం, సామర్లకోట శ్రీకుమార భీమారామం, అమరావతి శ్రీఅమరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, భీమవరం సోమేశ్వరస్వామి దేవస్థానం యాత్రికులతో కిటకిటలాడాయి. అలాగే మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. జాగరణకు ఏర్పాట్లు శివాలయాల్లో జాగరణ నిమిత్తం తరలివచ్చిన భక్తుల కోసం ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. భరతనాట్యం, బుర్రకథ, హరికథ కాలక్షేపాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవార్లు జరిగేలా సిద్ధం చేశారు. -
శ్రీశైలం మల్లీఖార్జున స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ సతీమణి సురేఖ
-
శివనామస్మరణతో మార్మోగుతోన్న నల్లమల్ల ఫారెస్ట్
-
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీశైలం భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
సాక్షి, అమరావతి: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు కూడా ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయ శాఖతో ఒప్పందం చేసుకుంది. వాటిలో స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శనం టికెట్లు 500 అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణ టికెట్లతోపాటు ఈ దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నిర్వహించే 95 ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకే దేవదాయ శాఖతో కలసి ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
11 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 12న స్వామి, అమ్మవార్లకు భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ, 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ, 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సాయంత్రం ప్రభోత్సవం, రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరుగుతుంది. 19న సాయంత్రం స్వామి, అమ్మవార్ల రథోత్సవం, తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ, 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. (చదవండి: చాంతాడంతా చలానాలు పెండింగ్..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు) -
మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహానంది ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు అడిషనల్, రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కరిని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ –1 చంద్రకుమార్‌ను కోటప్పకొండ ఆలయానికి, అడిషనల్ కమిషనర్ –2 రామచంద్రమోహన్ శ్రీకాళహస్తి ఆలయానికి, ఎస్టేట్స్ విభాగం జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను శ్రీశైల ఆలయానికి, కర్నూలు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను మహానంది ఆలయానికి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన శైవక్షేత్రాలకు సంబంధించి ఆర్జేసీలు ఆయా ఆలయాల వారీగా తమ పరిధిలోని సీనియర్ అధికారులను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
శ్రీశైలం ప్రాజెక్ట్/దోమలపెంట: శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు శ్రీశైలం డ్యామ్ సమీపంలోని తలకాయ టర్నింగ్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న బస్సు మలుపు వద్ద సక్రమంగా ప్రయాణించక ఎదురుగా ఉన్న సైడ్వాల్ను ఢీకొట్టింది. ప్రమాదాలు తరచూ జరిగే స్థలం కాబట్టి ఆర్ అండ్ బీ అధికారులు ఆ మలుపుల వద్ద ఇనుప గడ్డర్లతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్‌ను ఢీకొన్న బస్సు అక్కడే నిలిచిపోయింది. లేదంటే కింద ఉన్న లోయలోకి పడిపోయి ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. బస్సు ఏమాత్రం ముందుకెళ్లినా వంద అడుగుల లోతున ఉన్న లోయలో పడేదని ప్రయాణికులు తెలిపారు. బ్రేక్ పడకపోవడం వల్లే బస్సు ముందుకు దూసుకెళ్లినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ చాకచక్యంగా బస్సును వెనక్కి మళ్లించి ప్రయాణికులతో సహా మహబూబ్‌నగర్ వెళ్లిపోయారు. -
షాపుల కేటాయింపులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు
సాక్షి, అమరావతి: శ్రీశైలంలోని వ్యాపారులకు లలితాంబిక వ్యాపార సముదాయంలో షాపులు కేటాయించే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏ దశలోనూ ఉల్లంఘించలేదని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న మంగళవారం హైకోర్టుకు నివేదించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు ఎనలేని గౌరవం అని లవన్న తరఫు న్యాయవాది అశోక్ రామ్ కోర్టుకు విన్నవించారు. షాపుల కేటాయింపుపై రాద్ధాంతం చేస్తున్న పిటిషనర్లు, అసలు షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనలేదని, అందువల్ల వారు షాపులు పొందలేకపోయారని తెలిపారు. షాపుల కేటాయింపు కోసం వారు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరిగణనలోకి తీసుకుని మరోచోట షాపులు కేటాయిస్తామన్నారు. 8 నెలల కాలంలో 24 పిటిషన్లు దాఖలు చేసి, షాపుల కేటాయింపు విషయంలో ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. షాపుల కేటాయింపు కోసం నిర్వహించిన వేలంలో గరిష్ట ధర రూ.24 లక్షలకు చేరిందని తెలిపారు. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించే నాటికే షాపుల కూల్చివేత పూర్తయిందన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా ఈవో ఆదేశాల మేరకు పిటిషనర్ల షాపులను అధికారులు కూల్చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్.. షాపుల కేటాయింపు కోసం ఈవోకు వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ వినతి ఆధారంగా షాపుల కేటాయింపులో నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని ఈవోకు స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
శ్రీశైలం: మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము
-
రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్
Updates: 05:00PM రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. దీనిలో భాగంగా ప్రత్యేక విమానంలో హకీంపేటకు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు స్వాగతం పలికారు. TIME: 02.00PM శ్రీశైలం మల్లికార్జున స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్రపతికి అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. నంది సర్కిల్ వద్ద టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లో రూ. 43 కోట్లతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. TIME: 01.30PM భ్రమరాంబ గెస్ట్‌హౌస్ నుంచి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా స్వాగతం పలికారు. TIME: 12.30PM సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన సాక్షి గణపతి ఆలయానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబిక గెస్ట్‌హౌజ్‌కు వెళ్లారు. కొద్ది సేపు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. TIME: 12.00PM శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఘన స్వాగతం పలికారు. భారీ భద్రత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే శ్రీశైలంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత దర్శనాలు యధాతథంగా నిర్వహించనున్నారు. ద్రౌపతి ముర్ము పర్యటించే ప్రదేశాల్లో దుకాణాలు మూసివేశారు. శ్రీశైలం టోల్ గేట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదకు వాహనాలు మళ్లిస్తున్నారు. సాక్షి, కర్నూలు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఉదయం శ్రీశైలం దేవస్థానాన్ని రాష్ట్రపతి దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూల్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వస్తారు. బొల్లారం వార్ మెమోరియల్‌లో అమరజవాన్లకు నివాళులు అర్పించి రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాత్రికి రాజ్‌భవన్ విందులో పాల్గొంటారు. చదవండి: రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ -
శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
Draupadi Murmu: 26న శ్రీశైలం రానున్న రాష్ట్రపతి
సాక్షి, నంద్యాల: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైలం రానున్నారు. ఆమె పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిషాంతి, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, శ్రీశైలదేవస్థానం ఈఓ ఎస్ లవన్న పరిశీలించారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్‌ను, సాక్షిగణపతి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శ్రీశైలం చేరుకుని రాష్ట్రపతి స్వామిఅమ్మవార్ల దర్శనార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రత విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. నందిసర్కిల్లోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ వద్ద కేంద్రప్రభుత్వ పథకాల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట విషయమై టూరిజం శాఖ అధికారులతో మాట్లాడారు. అలాగే శివాజీ స్ఫూర్తి కేంద్రం, వైద్యశాలను పరిశీలించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. రాష్ట్రపతి సందర్శించే స్వామిఅమ్మవార్ల ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేద్దాం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మనజీర్ జిలానీ శామూ న్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి సమావేశమయ్యారు. రాçష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లుకు సంబంధించి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల ని సూచించారు. హెలిప్యాడ్ వద్ద, ఆలయంలో కేంద్రప్రభుత్వం పథకాల ప్రారంభోత్సవ ప్రదేశాల వద్ద, శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, రాష్ట్రపతి పర్యటించే ప్రతి ప్రదేశం వద్ద కూడా ప్రత్యేక స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య టీం, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అదే రోజు రాష్ట్రపతి పర్యటనపై రిహార్సల్స్ నిర్వహిద్దామన్నారు. సమావేశంలో డీఆర్ఓ పుల్లయ్య, డీఎస్పీ శృతి, ఆత్మకూరు ఆర్డీఓ దాస్, మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకర్‌రెడ్డి, జిల్లా వైద్య, అర్అండ్బీ, ట్రాన్స్‌కో, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటనకు భారీ బందోబస్తు శ్రీశైలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన నిమిత్తం భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు ఎస్పీలతో పాటు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్ పార్టీ, బాంబ్‌స్క్వాడ్ తదితర 1,800 మందికి పైగా పోలీస్‌సిబ్బందిని శ్రీశైలానికి డిప్యుటేషన్ విధుల్లో నియమించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. -
చంద్రగ్రహణం.. 12 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8:40 గంటలకు ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది. తిరిగి రాత్రి 7:20 గంటలకు మహాద్వారాలు తెరుచుకోనున్నాయి. సుమారు 12 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేయనుంది. రాత్రి 8 గంటలకు శ్రీవారి దర్శనం పున:ప్రారంభం కానుంది. మరోవైపు.. టీటీడీ అధికారులు వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేస్తున్నారు. ఆలయం తిరిగి సాయంత్రం 6:30 గంటలకు తెరుచుకోనుంది. -
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
శ్రీశైలంలో పేలిన స్టీమ్ బాయిలర్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీశైల దేవస్థానంలోని అన్నదాన భవనం వంటశాల వద్ద ఉన్న స్టీమ్ బాయిలర్ మంగళవారం పేలింది. దేవస్థానం పరిపాలన కార్యాలయానికి దగ్గరలో అన్నదాన భవనాన్ని నిర్మించి భక్తులకు అన్నప్రసాదాలు సిద్ధం చేసి అందిస్తున్నారు. భోజనాలు సిద్ధం చేసేందుకు రెండు స్టీమ్ బాయిలర్లను వాడతారు. చదవండి: జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా కార్తీకమాసం కావడంతో రోజూ 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భోజనం, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. ఇందుకోసం సిబ్బంది వేకువజాము నుంచే వంటలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటలకు వాటర్ ప్రెజర్ పెరిగి ఒక స్టీమ్ బాయిలర్ పేలింది. -
శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం
శ్రీశైలం టెంపుల్: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన అర్చకులు జె.వీరభద్రయ్యస్వామి మాటల్లోనే.. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఓంకారహారతిని దర్శించడం వలన కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి. నాగహారతి: నాగహారతిని దర్శించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. త్రిశూలహారతి: త్రిశూలహారతిని దర్శించడం వలన అకాలమరణం తొలగిపోతుంది. గ్రహదోషాలు నివారించబడతాయి. నందిహారతి: నందిహారతిని దర్శించడం వలన భయం, దుఃఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి. సింహహారతి: సింహహారతిని దర్శించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. మనోధైర్యం కలుగుతుంది. సూర్యహారతి: సూర్యహరతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. దీర్ఘాయుష్షు లభిస్తుంది. చంద్రహారతి: చంద్రహారతిని దర్శించడం వలన మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభహారతి: కుంభహారతిని దర్శించడం వలన కొరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. నక్షత్రహారతి: నక్షత్రహారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. కర్పూర హారతి: కర్పూరహారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఞఫలంతో పాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. (క్లిక్ చేయండి: హరిహరులకు ఎంతో ప్రీతికరం.. కార్తీక మాసం) -
వచ్చే నెలాఖరుకు శ్రీశైల దేవస్థానం సరిహద్దులు
సాక్షి, అమరావతి: శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరుకల్లా ఖరారు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు భూ సరిహద్దులు సక్రమంగా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో కలిసి సమీక్ష నిర్వహించామన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్, దేవదాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భూ సర్వే చేపడతామన్నారు. 1879లో దాదాపు 4,130 ఎకరాలుండగా.. 1967లో మరో 145 ఎకరాలను ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ భూములు ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. రిజర్వ్ ఫారెస్టు నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, బెజవాడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉప ఆయన చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ పాల్గొన్నారు. -
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
శ్రీశైలం దసరా ఉత్సవాలు: సీఎం జగన్‌ను ఆహ్వానించిన కొట్టు సత్యనారాయణ
సాక్షి, అమరావతి: దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం.. సీఎం జగన్‌ను శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి కోరారు. -
Srisailam Temple: శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సగటున 20 వేల నుంచి 25 వేల మంది, ప్రభుత్వ సెలవు రోజుల్లో 40 వేల నుంచి 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. శ్రావణమాసం, కార్తీకమాసం తదితర పర్వదినాల్లో 70 వేల నుంచి 80 వేల దాకా భక్తులు వస్తుంటారు. వీరు సర్వదర్శనం క్యూలలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటారు. దర్శన సమయంలో వీఐపీలు వస్తే సర్వదర్శన క్యూలలోని సామాన్య భక్తులు కొద్దిసేపు ఆగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు సులభంగా స్వామిని దర్శించుకునేలా వీఐపీ ప్రోటోకాల్ దర్శన విధానంలో మార్పులు చేసింది. దీనిని ఈనెల 5 నుంచి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. రోజుకు రెండు సార్లు మాత్రమే దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన విధానంలో రోజుకు రెండు సార్లు అది కూడా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రముఖులకు భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 6.15 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని, అభిషేకం, కుంకుమార్చన జరిపిస్తారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు తమ పర్యటన వివరాలను కనీసం రెండు రోజులు ముందుగానే తెలియజేయాలనే నిబంధన పెట్టారు. సిఫారసు లేఖల విధానంలో మార్పులు ప్రముఖులు వసతి, దర్శనం, ఆర్జితసేవలను ఇతరులకు సిఫారసు చేసేందుకు ఎస్ఎంఎస్, వాట్సాప్ విధానాన్ని వినియోగించేవారు. దీనిని రద్దు చేసి విధిగా లెటర్‌హెడ్ పై కనీసం రెండు రోజులు ముందుగా దేవస్థానానికి సమాచారం ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలాగే సిఫారసు లేఖపై స్పష్టంగా వసతి కావాల్సిన తేదీలు, దర్శనం, ఆర్జితసేవల వివరాలను, దర్శనానికి వచ్చే భక్తుల ఆధార్, ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి. యథావిధిగా స్పర్శ దర్శన వేళలు ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శ దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పర్శదర్శనం కల్పిస్తారు. అలాగే ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కొనసాగుతోంది. సామాన్య భక్తుల కోసమే మార్పులు సామాన్య భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు ప్రోటోకాల్ దర్శనంలో మార్పులు చేశాం. దేవస్థాన ఆగమ కమిటీ, దేవస్థానం ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేశాం. ఈ కొత్త విధానంలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు స్వామి అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలను కల్పిస్తున్నాం. అలాగే ప్రముఖుల సిఫారసు లేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశాం. ఈ నూతన విధానం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చాం. – ఎస్.లవన్న, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
శ్రీశైలం మల్లన్న హుండీలో 378 యూఎస్ డాలర్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలదేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో ఉన్న హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఇందులో రూ.4,08,66,617 నగదు, 335.40 గ్రాముల బంగారం, 8.400 కేజీల వెండి ఉంది. అలాగే 378 యూఎస్ఏ డాలర్లు, 50 కెనడా డాలర్లు, 105 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూఏఈ దిర్హమ్స్, 2 మలేషియా రింగిట్స్, 3 ఖతర్ రియాల్స్ తదితర విదేశీ కరెన్సీ లభించింది. పటిష్టమైన సీసీ కెమెరాల మధ్య అలంకార మండపంలో కానుకల లెక్కింపు జరిగింది. లెక్కించిన హుండీ కానుకలు భక్తులు గత 27 రోజుల్లో సమర్పించినవి అని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. (క్లిక్: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం) సాక్షి గణపతికి పూజలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం బుధవారం సాక్షి గణపతి స్వామికి విశేష పూజలు నిర్వహించారు శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. (క్లిక్: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం) -
ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా?
శ్రీశైలం(నంద్యాల జిల్లా): దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ప్రాంతమే భీముని కొలను. సెలయేర్ల సవ్వడులతో, పక్షుల కిలకిలరావాలతో రెండు కొండలు చీలినట్లు ఉండి ఆ మధ్యలో గంభీరంగా రాతిపొరల నడుమ భీమునికొలను కనువిందు చేస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా సాగే భీమునికొలను సందర్శనం మంచి అనుభూతిని ఇస్తుంది. చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ? స్థల పురాణం ఇదీ.. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసివచ్చిన భీముడు .. ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దానిని పగులగొట్టమని చెప్పాడు. తన గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగానే నీటి ధారలు కిందికి దూకాయని, ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుందని, భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి ’భీముని కొలను’ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆహ్లాదకర ప్రదేశం పూర్వపు రోజుల్లో కాలినడకన వచ్చే భక్తులు ఈ భీమునికొలను మీదుగానే శ్రీశైలాన్ని చేరేవారు. శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో ఈ భీమునికొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. భీముని కొలను లోయప్రాంతం ప్రకృతి అందాలతో అలరారుతూ చూపరుల మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటుంది. కైలాసద్వారం నుంచి దాదాపు 2వేల అడుగుల లోతులో ఉండే ఈ భీమునికొలను లోయ చుట్టూ సుమారు 650 అడుగుల పైగా ఎత్తులో దట్టమైన కొండలు వ్యాపించి ఉన్నాయి. లోయకు ఇరువైపులా రంపంతో కోసినట్లుగా ఏర్పడి నునుపైన శిలలు ముచ్చటగా ఉంటాయి. లోయ పైతట్టు ప్రాంతంలోని కొండ ల్లోంచి ఉబికి వచ్చే సహజ జలధారలు లోయలో బండరాళ్లపై ప్రవహిస్తూ, పెద్దకోనేరులాగా కని్పంచే భీమునికొలను చేరి పొంగిపొర్లుతుంటాయి. ఈ నీరు మండు వేసవిలో కూడా నిరంతరం ప్రవహిస్తుండడం విశేషం. ఇలా చేరుకోవచ్చు..: భీముని కొలను వెళ్లేందుకు శ్రీశైలం నుంచి సుమారు 4 కి.మీ దూరంలో ఉన్న హఠకేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపున అడవి దారిలో 2 కి.మీ. ప్రయాణించి కైలాసద్వారం వెళ్లాలి. హఠకేశ్వరం నుంచి కైలాస ద్వారం వరకు మట్టిరోడ్డు ఉంది. కారు, జీపు, చిన్న వాహనాల్లో ఇక్కడికి సులభంగా వెళ్లవచ్చు. కైలాసద్వారం నుంచి సుమారు 850 మెట్లు దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీమునికొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. -
పాతాళగంగలో దూకి మరణిస్తా.. భర్తకు వాట్సప్ మెసేజ్
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలోని పాతాళగంగలో దూకి మరణిస్తానని నంద్యాలకు చెందిన కృష్ణకుమారి తన భర్తకు వాట్సాప్ ద్వారా శనివారం సందేశం పంపించింది. అనంతరం ఆమె అదృశ్యమైంది. దీంతో మత్స్యకారుల సహకారంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయా ల్సిందిగా కోరారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ మెసేజ్ పంపినట్లు తెలుస్తుంది. చదవండి: (అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి) -
శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
-
ఫలించిన సమన్వయ మంత్రం.. శ్రీశైలంలో సడలిన ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, శ్రీశైలం (కర్నూలు): బుధవారం అర్ధరాత్రి.. అందరూ నిద్రమత్తులో ఉన్న వేళ.. లక్షలాది మంది కన్నడిగులు.. రెచ్చగొట్టిన అల్లరి మూకలు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి.. వాహనాల అద్దాలు పగిలిపోయాయి.. అలజడి విషయం తెలిసి అధికారులు వెంటనే స్పందించారు. సమన్వయంతో వ్యవహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు వెంటనే తొలగిపోయాయి. ఏం జరిగిందంటే... బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పాతాళగంగ మార్గంలోని బీరప్ప సదన్ పక్కనే ఉన్న టీదుకాణం వద్ద నీళ్ల బాటిల్ విషయమై వివాదం చెలరేగింది. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న విషయంపై దుకాణం యజమానితో కన్నడిగులు గొడవపడ్డారు. దుకాణ యజమాని భార్యను కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో యజమాని పక్కనే ఉన్న గొడ్డలితో దాడికి దిగడంతో కన్నడిగులు రెచ్చిపోయారు. టీ దుకాణాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. అలాగే శివసదనం కూడలి వద్ద టైర్లను వేసి కాల్చారు. ఆ తర్వాత క్షేత్ర వ్యాప్తంగా అన్ని కూడళ్లు, పార్కులు, వివిధ ప్రదేశాలు, ప్రధాన పురవీధుల్లో ఉన్న కన్నడిగులందరినీ రెచ్చగొట్టారు. దీంతో వారంత ఏకమై ముందుగా పరిపాలనా భవన్రోడ్డులో ఉన్న దుకాణాలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాలు, కార్లు, జీపుల అద్దాలను పగులగొట్టారు. అక్కడ నుంచి పోస్టాఫీస్ రోడ్డు, పాతాళగంగ మార్గంలో మూసివేసిన దుకాణాలపై కూడా వారు ప్రతాపం చూపించారు. దుకాణ యజమానులు సైతం కన్నడిగులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. పోలీస్ సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎస్పీ శృతి అధికారులు ఏం చేశారంటే.. విషయం తెలుసుకుని ఆత్మకూరు డీఎస్పీ శృతి, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎస్ లవన్న, డిప్యుటేషన్‌పై వచ్చిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు, స్పెషల్‌ఫోర్స్ సిబ్బంది వెంటనే స్పందించారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి అల్లరి మూకలను అదుపు చేశారు. ఇందుకోసం శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్దరామ శివాచార్యమహాస్వామి సహకారాన్ని తీసుకున్నారు. గుంపులుగా ఉన్న వారి వద్దకు వచ్చి కన్నడంలో ప్రశాంతంగా ఉండాలని పీఠాధిపతి ఆదేశించడంతో కన్నడిగులు శాంతించారు. దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహకారంతో డీఎస్పీ శృతి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచారు. తమకు రక్షణ కరువైందని దుకాణ యజమానులు గురువారం సాయంత్రం 4 గంటల వరకు షాపులను తెరవలేదు. దీంతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డీఎస్పీ శృతి, ఈఓ లవన్న దుకాణదారులతో చర్చించారు. షాపులు తెరుచుకోవాల్సిందిగా సూచించి, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో దుకాణాలను సాయంత్రం 5 గంటల నుంచి తెరిచారు. మాట్లాడుతున్న పీఠాధిపతి చదవండి: (రణరంగంగా మారిన శ్రీశైలం..) ఎస్పీ సమీక్ష శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో పరిస్థితులపై ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సమీక్షించారు. గురువారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న ఆయన భ్రమరాంబా అతి«థిగృహంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన ఈఓ ఎస్.లవన్నతో చర్చించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నపాటి ఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా, దేవస్థాన ఈవో ఎస్.లవన్నతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో తిరిగి పరిస్థితిని ఎస్పీ సమీక్షించారు. క్షతగాత్రులకు పరామర్శ శ్రీశైలంప్రాజెక్ట్/కర్నూలు(హాస్పిటల్): శ్రీశైలంఘటనలో గాయాలపాలైన కన్నడ భక్తులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఘటనలో గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరోసర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న రాముడు, క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న శ్రీశైలంను ఆయన ప్రత్యేకంగా కలిసి వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తుడిని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామశివాచార్య మహాస్వామీజీ పరామర్శించారు. శ్రీశైలంలో ప్రశాంత వాతావరణం శ్రీశైలంటెంపుల్: క్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, భక్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. గురువారం శ్రీశైలంలోని భ్రమరాంబా అతిథి గృహంలో దేవస్థాన ఈఓ ఎస్.లవన్న, ఆత్మకూరు డీఎస్పీ శృతితో కలిసి ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బుధవారం అర్ధరాత్రి శ్రీశైలంలో జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు. గాయపడిన కన్నడ భక్తుడు చనిపోయాడని సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు చేస్తున్నారని, ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని వీడియోను చూపించారు. కొన్ని అసాంఘిక శక్తులు క్షేత్ర ప్రతిష్టతను దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. ముస్లింలు కన్నడ భక్తులను కొట్టారని విషప్రచారం చేస్తున్నారని, దానిని ఖండిస్తున్నామన్నారు. గొడవకు బందోబస్తుకు ముడిపెట్టడం సబబుకాదని డీఎస్పీ శృతి అన్నారు. ఉగాది మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు్త ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నామని ఈఓ లవన్న తెలిపారు. క్షేత్రానికి ఎంతమందైనా రావచ్చని, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు. భక్తులంతా శాంత చిత్తులై ఉండాలి శ్రీశైలం చేరుకున్న కన్నడ భక్తులంతా శాంతచిత్తులై ఉండాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామీజీ తెలిపారు. గురువారం కన్నడ భక్తుల కోసం పీఠాధిపతి శాంతి సందేశాన్ని వీడియో రికార్డు చేసి పంపించారు. ఉగాది ఉత్సవాలు మూడు రోజల పాటు జరగనున్నాయని, భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని సూచించారు. -
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
-
శ్రీశైలంలో సీజేఐ ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు
-
మమ్మేల రావయ్యా.. మా శివయ్య!
శ్రీశైలం టెంపుల్/అమరావతి/శ్రీకాళహస్తి రూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం స్వామిఅమ్మవార్లకు నిర్వహించిన రథోత్సవం నేత్రానంద భరితంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ముందు గల గంగాధర మండపం వద్దకు పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథోత్సవంపై ఆశీనులను చేసి సాత్విక బలి సమర్పించారు. అశేష భక్తజనం శివనామాన్ని స్మరిస్తుండగా ఆలయం పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవానికి ముందు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయపుష్కరిణి వద్ద తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అంగరంగ వైభవంగా అమరేశ్వరుని దివ్యరథోత్సవం అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం బుధవారం వైభవంగా సాగింది. అమరావతి, ధరణికోట నుంచి చింకా, ఆలపాటి, కామిరెడ్డి, కోనూరువారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశాస్త్రి పర్యవేక్షణలో పలు పూజలు నిర్వహించి రథోత్సవ ప్రారంభ క్రతువును పూర్తి చేశారు. రథాన్ని సర్వాంగసుందరంగా పూలతో అలంకరించి ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుని అందులో కొలువుదీర్చారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త రాజావాసిరెడ్డి మురళీకృష్ణప్రసాద్‌లు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని క్రోసూరు జంక్షన్ వరకు లాగారు. అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథాన్ని యథాస్థానానికి చేర్చారు. నేత్రపర్వంగా ముక్కంటీశుని రథోత్సవం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో ముక్కంటీశుని రథోత్సవం బుధవారం కనులపండువగా సాగంది. రథోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకు దేవస్థానానికి చెందిన స్వర్ణాభరణాలను అలంకరించడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల తేజస్సును చూసి పరవశించిపోయారు. రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శివోహం..
సాక్షి నెట్వర్క్: ‘హరహర మహాదేవ.. శంభోశంకరా..’ అంటూ మంగళవారం రాష్ట్రం ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏ నోట విన్నా శివనామ స్మరణే వినిపించింది. అభిషేకాలతో భక్తవశంకరుడిని ప్రసన్నం చేసుకున్నారు. పలుచోట్ల పరమేశ్వరుడిని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరిగాయి. శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. నల్లమల కొండలు శివనామ స్మరణతో పరవశించాయి. మల్లన్న, భ్రామరీలకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన స్వామి, అమ్మవారు.. వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు. ఆదిదంపతుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు హరోంహరా.. శంభో.. శివశంకరా అంటూ పరవశించారు. నీలకంఠుడికి పాగాలంకరణ శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో శివుడి లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగాలంకరణ ప్రత్యేకం. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. పండితులు, ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. వెంటనే దేదీప్యకాంతులతో కనువిందుచేసిన విద్యుద్దీపాలను ఆపేశారు. క్షణాల్లో శంభో శివశంభో.. ఓం నమఃశివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి మిన్నంటింది. పృధ్వీ వెంకటేశ్వర్లు స్వామి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. అనంతరం వెలిగిన విద్యుద్దీపాల కాంతుల్లో పాగాలంకరణ భక్తులను కనువిందు చేసింది. అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం కనులపండువగా సాగింది. లక్షలాదిగా భక్తులు వచ్చిన వాహనాలతో శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఔటర్ రింగ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు నిండిపోవడంతో అనేక వాహనాలను రోడ్డుమీదే నిలపాల్సి వచ్చింది. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి తెలంగాణలోని మన్ననూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలను నిలిపేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో.. శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం తెల్లవారుజామున మూడుగంటల నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవారు ఇంద్రవిమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి నంది వాహనంపై, అమ్మ సింహ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత ఒంటిగంట నుంచే దేవస్థానంలో లింగోద్భవ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిగంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. భక్తజనసంద్రంగా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ భక్తులతో పోటెత్తింది. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. 17 భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పట్టువస్త్రాలు, వెండిప్రభను సమర్పించారు. త్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సోమయాజులు, జస్టిస్ కృష్ణమనోహర్, జస్టిస్ పద్మావతి దర్శించుకున్నారు. పంచారామమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో స్వామికి ఏక రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. రామతీర్థంలో.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవాలయమైనా ఏటా మాదిరే శివరాత్రికి భక్తులు హాజరై శ్రీరాముడిని, పక్కనే ఉన్న ఉమాసదాశివుడిని పూజించారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండపై శిఖరజ్యోతి వెలిగించారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలోని శైవక్షేత్రాల్లో అభిషేకాలు, పూజలు చేశారు. పంచారామక్షేత్రాల్లో.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ, భీమారామ, క్షీరారామ, కుమారభీమారామాల్లో పరమశివుడిని, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమాకుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవిలను, శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. వీరంపాలెంలోని శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో స్పటిక లింగానికి నిర్వహించిన పూజల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి పాల్గొన్నారు. విశాఖలో మహాకుంభాభిషేకం మహా శివరాత్రిని పురస్కరించుకొని టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో మంగళవారం 37వ మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. శారదా పీఠా«ధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచామృతం, సుగంధద్రవ్యాలు, పళ్లరసాలతో కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. -
శివనామ స్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం
-
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం
-
శంభో..శివ శంభో!
శ్రీశైలం టెంపుల్: ఇలకైలాసమైన శ్రీశైలం శ్రీగిరిపై వేంచేసి ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సన్నద్ధమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీగిరికి ప్రత్యేక స్థానం. ఇక్కడ మల్లన్నకు జరిగే విశిష్ట సేవలు మరెక్కడా జరగవు. వాటిలో మల్లన్న పాగాలంకరణ ఒకటి. మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో జరిగే ఈ సేవ అత్యంత విశిష్టమైనది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన చేనేత కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్నకు తలపాగాను తయారు చేస్తుంది. ఆ గ్రామానికి చెందిన పృధ్వి వెంకటేశ్వర్లు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు వెంకట సుబ్బారావు తండ్రికి సహకరిస్తున్నారు. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్ వెలుగులు నింపుతారు. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. అనంతరం రాత్రి 12 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు శ్రీగిరిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష వాహన సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ‘శంభో.. శివ శంభో’అని స్వామివారిని కీర్తిస్తూ శ్రీగిరి చేరుకుంటున్నారు. పలువురు శివమాలను ధరించి వస్తున్నారు. నల్లమల కొండల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది మంది శ్రీగిరికి చేరుకుంటున్నారు. గజ వాహనంపై మల్లన్న దరహాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించాడు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి క్షేత్రప్రధాన వీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవానికి తరలించారు. కళాకారుల కోలాహలం నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఏ లోటు రానివ్వకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తున్నాం. భక్తులందరికీ స్వామి వారి అలంకార దర్శనాన్ని కల్పించాం. క్యూలో వేచి ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. – ఎస్.లవన్న, ఈవో, శ్రీశైల దేవస్థానం -
శ్రీశైల క్షేత్రానికి భారీగా వెళుతున్న భక్తులు
-
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రి వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. శ్రీశైలం ఈవో, ఆలయ అర్చకులు సీఎం వైఎస్ జగన్‌కు.. వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. -
శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
-
శ్రీగిరికి కార్తీక శోభ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ 4వ తేదీ వరకు జరుగుతాయి. కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రధానాలయానికి ఎదురుగా గల గంగాధర మండపం వద్ద, ఆలయ దక్షిణ మాడ వీధిలో దీపారాధన చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సాయంత్రం ఆలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్తీకమాసం అంతా స్పర్శ దర్శనం నిలుపుదల చేసి, స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
రేపటి నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. రోజూ 4 విడతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులిస్తారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయ దక్షిణ మాడవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ప్రారంభ సూచికగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ మాసమంతా ఆలయంలో దీపాన్ని వెలిగిస్తారు. -
శ్రీశైలం క్షేత్రంలో అదొక దర్శనీయ స్థలం.. అక్కడి జలంతో రోగ నివారణ!
సాక్షి, కర్నూలు: శ్రీశైలం మహాక్షేత్రంలోని పేరొందిన దర్శనీయ స్థలాలలో పాలధార–పంచధారలు ఒకటి. శ్రీశైల ప్రధానాలయానికి మూడు కిలోమీటర్ల దూరములో రహాదారిని అనుకొని ఎడమవైపుగల లోయ ప్రాంతమే పాలధార–పంచధార. రోడ్డుమార్గము నుంచి 146మెట్లను దిగి ఈ పాలధార–పంచధారలను చేరుకోవాల్సి ఉంటుంది. నిరంతరం వెలువడే జలధారలు: పాలధార–పంచధారల వద్ద కొండరాళ్ల మధ్య నుంచి ఒక జలధార, మరోకచోట ఐదు జలధారలు ప్రవహిస్తుంటాయి. ఎండా వానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తుండడం ఈ జలధారల విశేషం. క్షణకాల సందర్శనతో క్షణాలను మరిపించే ఈ దివ్యస్థల సందర్శనతో భక్తులు ముగ్దులవుతారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాలధార–పంచధారలను తప్పనిసరిగా సందర్శిస్తుంటారు. ఆదిదేవుడి నుంచి అవిర్బావం: ఆదిదేవుడైన పరమేశ్వరుడి నుంచే ఈ పాలధార–పంచధారలు ఉద్బవించాయని చెప్తుంటారు. పరమశివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘెర, తత్పురుష, ఈశాన్య ముఖాల నుంచి ఉద్భవించినవే పంచధారలని చెబుతారు. ఈ జలధారల ప్రవాహతీరులో ఎంతో విశేషం కూడా ఉంది. నిరంతరం వెలువడే ఈ జలధారలు ముందుకు ప్రవహించకుండా అక్కడికక్కడే అంతరించి పోవడం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా ఈ జలధారలు తెల్లగా కనిపించడం వల్ల కొందరు దీన్ని పాలధార–పంచధార అని కూడా పిలుస్తారు. మన ప్రాచీన కావ్యాలు ఈ పాలధార–పంచధారలను పావనతీర్థంగా అభివర్ణించాయి. ఆ జలంతో రోగ నివారణ: ఔషధీ సమ్మిళతమైన పాలధార–పంచధారల నీటికి రోగాన్ని నివారించే శక్తి ఉందనే భావన చాలా ప్రసిద్దంగా ఉంది. ఇప్పటికే కొందరు పాలధార–పంచధార జలాలలను పవిత్ర తీర్థగంగగా భావించి రోగాల నివారణకు వాడుతుంటారు. చదవండి: రాయచోటి రాక్ గార్డెన్స్.. శిలల సొగసు చూడతరమా! -
దేశంలోనే ‘అత్యంత మహిమానిత్య క్షేత్రం’ శ్రీశైలం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలసి ఉన్న మహాక్షేత్రం శ్రీశైలం ఒక్కటే. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో మూడు ప్రాంతాల్లోనే శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్నాయి. కానీ శ్రీశైల క్షేత్రంలో మాత్రమే ఒకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత మహిమానిత్యక్షేత్రంగా శ్రీశైలం విరాజిల్లుతుంది. అందుకే ఈ క్షేత్రానికి నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మొత్తం మారుమోగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం 12 ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు 18 ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నా, కేవలం మూడు ప్రాంతాల్లోనే జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్నాయి. జ్యోతిర్లింగ స్వరూపుడు మల్లికార్జున స్వామి, శక్తిపీఠం భ్రమరాంబాదేవి కొలువైంది ఒకచోటనే. అలాగే జ్యోతిర్లింగ స్వరూపుడు విశ్వనాథుడు, శక్తిపీఠం విశాలాక్షి ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో కొలువై ఉన్నారు. అలాగే జ్యోతిర్లింగ స్వరూపుడు మహాకాళేశ్వరుడు, శక్తిపీఠం మహాకాళి దేవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో కొలువై ఉన్నారు. కానీ వేరు వేరు ప్రదేశాల్లో వీరు కొలువై ఉన్నారు. స్వామివారి ఆలయం ఒకచోట, అమ్మవారి ఆలయం మరోకచోట ఉంటుంది. శ్రీశైలంలో మాత్రమే మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి ఒకే ఆలయ ప్రాంగాణంలో కొలువై ఉన్నారు. దీంతో ఈ క్షేత్రం అత్యంత మహిమానిత్య క్షేత్రంగా పేరొందింది. భక్తులు కూడా ఒకే ఆలయ ప్రాంగాణంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువై ఉండడంతో మహాశక్తిగా, మహిమానిత్యంగా భావించి వేల సంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల కొరిన కొర్కెలు తీర్చే స్వామి అమ్మవార్లుగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఈ క్షేత్ర సందర్శననకు భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. -
టెంపుల్ టూరిజంలో ఆలయాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: టెంపుల్ టూరిజంలో భాగంగా దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాదం’ పథకం కింద రూ.48 కోట్లతో అన్నవరం దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ధి పనులు పూర్తిచేశామని, మరో రూ.50 కోట్లతో సింహాచల ఆలయ అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. రూ.47 కోట్లతో పర్యాటక సంస్థకు చెందిన 15 హోట్లళ్లు, రెస్టారెంట్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకొస్తున్నామన్నారు. పర్యాటక సంస్థకు ఏడాదిలో ఇప్పటికే రూ.40 కోట్ల ఆదాయం వచ్చిందని, రూ.125 కోట్ల వార్షిక ఆదాయం లక్ష్యంతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈవో, ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీ ఎస్.సత్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీశైలంలో ఘనంగా వినాయకచవితి ఉత్సవాలు
-
శ్రీశైల దేవస్థానానికి ఐఎస్వో గుర్తింపు
శ్రీశైలం టెంపుల్: భక్తులకు వైద్య ఆరోగ్య పరంగా కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతున్న రక్షణ చర్యలకుగాను శ్రీశైల దేవస్థానానికి ఐఎస్వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ ధ్రువీకరణ (ఐఎస్వో–45001) లభించింది. అలాగే క్షేత్రపరిధిలో పారిశుధ్య నిర్వహణ, కోవిడ్ నిబంధనల అమలు తదితర చర్యలకుగాను జీహెచ్‌పీ (గుడ్ హైజెనిక్ ప్రాక్ట్రీసెస్) ధ్రువీకరణ కూడా లభించింది. ఈ మేరకు ఆదివారం ఐఎస్వో ప్రతినిధి ఎ.శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావుకు అందజేశారు. రాష్ట్రంలో జీహెచ్‌పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం కావడం విశేషం. చదవండి: Vijayawada: చందమామ నీలి వర్ణంలో కనువిందు ఈ సందర్భంగా ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలు ఎప్పటికప్పుడు తగు సలహాలు, సూచనలు చేస్తూ క్షేత్రాభివృద్ధికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. దేవస్థాన సిబ్బంది కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అందరి కృషితోనే ఐఎస్వో ధ్రువీకరణ లభించిందన్నారు. -
శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్/కర్నూలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు. అమిత్ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. -
నేడు శ్రీశైలానికి అమిత్ షా
-
శ్రీశైలానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
-
నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలం రానున్నారు. మధ్యాహ్నం 12.40 నుంచి 1.40 గంటల మధ్య ఆయన కుటుంబసభ్యులతో భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. దర్శనానంతరం భ్రమరాంబిక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని భోజనం చేస్తారు. అనంతరం 2.40కి శ్రీశైలం నుంచి బయలుదేరతారని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. అమిత్‌షాకు ఆలయంలో రాష్ట్ర దేవదాయ శాఖ తరుఫున స్వాగతం పలికేందుకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ బుధవారం రాత్రి శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. -
రేపు శ్రీశైలంకు కేంద్రమంత్రి అమిత్ షా
సాక్షి, అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైలంకు వెళ్లనున్నారు. అమిత్ షా ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. -
శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
సాక్షి, కర్నూలు : శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంతో జరిగిన అవకతవకలపై గురువారం రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ శివన్నారాయణస్వామి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారులు టోల్గేట్, దర్శన టిక్కెట్ కౌంటర్, డొనేషన్ కౌంటర్లలో రికార్డుల పునఃపరిశీలన చేశారు. -
శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై సమగ్ర దర్యాప్తు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై పోలీస్ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఎస్పీ ఫక్కీరప్ప సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రుతితో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. పోలీసులు సున్నిపెంటలో అనుమానిత వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. లంబాడీ కాలనీలో నివాసం ఉంటున్న గుంటె బాలకృష్ణ అలియాస్ బాలును అదుపులోకి తీసుకున్నారు. గతంలో తాను ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంకు చెందిన వెంకట్ అనే వ్యక్తి నుంచి డ్రోన్‌ను అద్దెకు తీసుకుని డ్యాం పరిసర ప్రాంతాలను వీడియో తీసినట్టు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం తాను డ్రోన్‌ను వినియోగించడం లేదన్నాడు. అతడికి చెందిన కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం రాత్రి మరోసారి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ తిరగడం కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డులో డీఎస్పీ శ్రుతి పోలీస్ సిబ్బందితో వెళుతుండగా ఇది కనిపించింది. -
శ్రీశైలంలో డ్రోన్ కలకలం
శ్రీశైలం: గుర్తు తెలియని డ్రోన్ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనుకాల నుంచి తక్కువ ఎత్తులోకి రావడంతో గమనించిన భద్రతా సిబ్బంది ఆలయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విషయం తెలియజేశారు. దీంతో దేవస్థాన అధికారులతో పాటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని గమనించి డ్రోన్‌ను నియంత్రిస్తున్న అపరిచిత వ్యక్తి సిగ్నల్స్‌ను ఆపివేశారు. అనంతరం అది కనిపించకుండాపోయింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పరిధిలోని రెండో పవర్‌హౌస్‌లో విద్యుదుత్పాదనను నిరంతరం కొనసాగిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెకండ్ పవర్‌హౌస్ వద్ద పోలీస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది డ్రోన్‌ను వినియోగించి ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఘటనపై శ్రీశైలం సీఐ వెంకటరమణ మాట్లాడుతూ డ్రోన్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలంలోని సత్రాలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. డ్యామ్ వద్ద 40 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
శ్రీశైలం, కాణిపాక దర్శన వేళల్లో మార్పులు
శ్రీశైలం టెంపుల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో చేసిన మార్పులకు అనుగుణంగా శ్రీశైల మల్లన్న దర్శన వేళలను మార్పు చేశారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుంచి రాత్రి మూసివేసే వరకు రోజువారీ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. వీటిని అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. 23న కాణిపాక దర్శన వేళల్లో స్వల్ప మార్పు కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 23న స్వామివారి దర్శన వేళలలో స్వల్ప మార్పు చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశు ఆదివారం తెలిపారు. ఆ రోజు స్వామివారి ప్రధాన ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. పూజల అనంతరం దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. శ్రీభోగ శ్రీనివాసునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం తిరుమల: శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం చేశారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల నడుమ ఆలయంలోని బంగారువాకిలి చెంత ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. నేడు సుందరకాండ అఖండ పారాయణం కరోనా నుంచి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జూన్ 21న 15వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. చదవండి: తిరుమల–తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు -
మండుటెండలో సైతం.. భక్తిభావం ఉప్పొంగగా..
సాక్షి, శ్రీశైలం/టెంపుల్: తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు. వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుండగా.. మండుటెండలు సైతం చిన్నబోతున్నాయి. నల్లమల అడవులు చల్లని గాలులతో స్వాగతం పలుకుతున్నాయి. అన్నదాతలు ఆహారపానీయాలు అందిస్తూ వారి సేవలో తరిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మౌలిక వసతులు కల్పించి భరోసా కల్పిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు తరలిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది. చదవండి: నేరుగా అమ్మ దర్శనానికే..! ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు ఐలా నోటీసులు -
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. శివన్నామస్మరణతో ఆలయప్రాంగణం మారుమ్రోగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి, ఆలయ జేఈవో లక్ష్మయ్య, ఐజీ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో నిరంతరంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో సర్వదర్శనాన్ని నిషేధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.35 గంటల నుంచి శుక్రవారం వేకువజామున 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది రుత్వికులచే ఘనంగా నిర్వహిస్తారు. కర్నూలు/తూర్పుగోదావరి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో భక్తులు పెద్దఎత్తున గోదావరి స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో తెల్లవారుజాము 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం మల్లికార్జున స్వామికి లింగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శ్రీశైలం మల్లన్నకు పాగాలంకరణ, అనంతరం స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. చిత్తూరు: శ్రీకాళహస్తిలో వేకువజాము నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. గుంటూరు: పంచారామక్షేత్రం అమరావతిలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమరలింగేశ్వర స్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగుతుంది. విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పున్నమిఘాట్, కృష్ణవేణి, పవిత్ర సంగమంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారికి భక్తజనం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలయాల్లో లింగరూపుడైనా శివున్ని దర్శించుకోని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవదేవుడైనాశివునికి పాలు, పత్రాలు సమర్పించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: పోలవరంపై వాస్తవాలు గోదాట్లో కలిపిన ‘ఈనాడు’ ! ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా -
పాపాల పుట్టలు పగులుతున్నాయ్
సాక్షి, అమరావతి: భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. పెద్ద ఆలయాల్లో అవినీతికి ఆస్కారం ఉన్న విభాగాల్లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ట వేసి సాగిస్తున్న అవినీతి దందాలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. పదేళ్లుగా దుర్గమ్మ ఆలయ ఆస్తుల రిజిస్టర్‌ను సరిగా నిర్వహించడం లేదన్న విషయం కూడా బయటపడింది. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు సహా ఆలయానికి వచ్చే ఆదాయం, ఆస్తుల వివరాలను 43వ నంబర్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, పదేళ్లుగా అలాంటివేవీ నమోదు చేయడం లేదని ఏసీబీ అధికారులు తేల్చారు. అవినీతికి పరాకాష్టగా మారిన ఈ వ్యవహారంలో 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం దేవదాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీశైలం ఆలయంలోనూ.. 2020 జూన్‌లో ఏసీబీ అధికారులు శ్రీశైలం ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. 2016 ఏప్రిల్ నుంచి ఆలయంలో చోటుచేసుకున్న అక్రమాలను బయటపెట్టారు. స్వామివారి దర్శన టికెట్లకు సంబంధించి దాదాపు రూ.2.50 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నట్టు అప్పట్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పట్లో టికెట్ల విక్రయ విభాగంలో పనిచేసే 26 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉన్నారన్న ఆరోపణలతో ఆరు నెలల క్రితం 11 మంది ఆలయ రెగ్యులర్ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసాదాల నుంచి ఫొటోల వరకూ.. దుర్గ గుడిలో కీలకంగా పనిచేసే ఓ ఉద్యోగి సంప్రదాయ విక్రయ కౌంటర్లో తన సమీప బంధువును అనధికారికంగా నియమించి భారీగా సొమ్ములు దిగమింగుతున్నట్టు ఏసీబీ తేలి్చంది. అమ్మవారి దర్శన టికెట్ల అమ్మకాలకు సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో జరిగే లావాదేవీలకు సంబంధించిన రశీదుల రిజిస్టర్లో సూపరింటెండెంట్ సంతకాలు ఉండటం లేదని, టికెట్ల విక్రయాల్లో భారీ లొసుగులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. భక్తులు అందజేసే చీరల్ని ఉంచే గొడౌన్, అమ్మవారి ఫొటోలు అమ్మే విభాగంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏసీబీ తేల్చింది. అన్న ప్రసాద విభాగంలో కూరగాయలు, పాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. అన్నదానం కోసం భక్తులు ఇచ్చిన రూ.54,31,382 నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా బ్యాంకు ఖాతాలో అలా ఉంచినట్టు తేల్చారు. కొందరు ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరు నెలలకు పైగా విధులకు హాజరుకాకపోయినా వారిని కొనసాగిస్తున్నట్టు నిర్ధారించారు. దుర్గ గుడికి మళ్లీ వచ్చిన ఏసీబీ ఇంద్రకీలాద్రి (విజయవాడ, పశ్చిమ): ఏసీబీ అధికారులు మరోమారు బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనానికి వెళ్లిన అధికారులు ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంతకుముందు ఆలయంలో జరిపిన తనిఖీలకు సంబంధించి కొన్ని కీలక పత్రాల గురించి ఆరా తీయడంతో పాటు కొన్ని సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా.. ఆలయ ఈవో ఎంవీ సురేష్ బాబు తీరుపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అంతర్గత బదిలీల సందర్భంగా ఈవో తనకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించినట్టు పేర్కొంటున్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు సూపరింటెండెంట్ స్థాయి బాధ్యతలు అప్పగించగా.. సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు కింది స్థాయిలో విధులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఎవరి దందా వారిదే దుర్గ గుడిలో పదేళ్లుగా కొనసాగుతున్న అనేక అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొన్ని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉద్యోగులు ఎవరికి వారు అవినీతి దందాలను కొనసాగిస్తున్నట్టు తేలింది. ఈవోలు కూడా ఆ ఉద్యోగుల దందాకు వంత పాడుతూ వస్తున్నారు.ఆలయ ఆస్తులకు సంబంధించిన 43 రిజిస్టర్‌తో పాటు షాపులు, భూముల లీజులకు సంబంధించిన 8ఏ రిజిస్టర్‌ను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని ఏసీబీ తేల్చింది. వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లను సమకూర్చేందుకు టీడీపీ హయాంలో మాక్స్ డిటిక్టెవ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం దానికి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. అనుమతులు పొందకుండానే రెండేళ్లుగా ఆ ఏజెన్సీని కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నారు. ఆరేళ్లుగా ఆలయ పర్యవేక్షక సూపరింటెండెంట్ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగికి ఆ ప్రైవేట్ ఏజెన్సీతో బినామీ లావాదేవీలున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఆలయాలు సహకార డెయిరీల నుంచే నెయ్యి కొనుగోలు చేయాల్సి ఉండగా, గత కొన్నేళ్లుగా గుంటూరు జిల్లా టీడీపీ నాయకుడికి చెందిన డెయిరీ నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. -
15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం
సాక్షి, తిరుమల/తిరుపతి సెంట్రల్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభమవడంతో అప్పటినుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగుతోంది. ఈనెల 14న ధనుర్మాసం పూర్తికానున్న నేపథ్యంలో.. 15వ తేదీ నుంచి శ్రీవారికి సుప్రభాతసేవ నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగుతాయి. కాగా, ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేది గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కామధేనుపూజ ఏర్పాట్లపై సోమవారం తిరుపతిలో ఆయన సమీక్షించారు. శ్రీగిరిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ చేశారు. పంచాహ్నిక దీక్షతో మొదలైన ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవ క్రతువులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన చేసి.. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. చదవండి: 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు తిరుమలలో సినీ ప్రముఖులు -
మల్లన్న సన్నిధిలో బంగారు, వెండి నాణేలు
సాక్షి, శ్రీశైలం : శ్రీశైల మల్లన్న సన్నధిలో మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో మఠంలోని నీటిగుండం వద్ద ఆదివారం ఈ నాణేలు లభ్యమయ్యాయి. లభ్యమైన వాటిలో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, ఓ బంగారు రింగ్ ఉంది. అయితే బయటపడ్డ ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటికి చెందినవి ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 15న ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా.. మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించినట్టుగా బయటపడింది. 97 వెండి నాణేలు విడిగా లభించగా.. 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి.(చదవండి : శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు) -
గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు
శ్రీశైలం: శ్రీశైలంలోని ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. ఉప స్థపతి జవహర్ మంగళవారం వీటిని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఆలయ ఈవో కేఎస్.రామారావు వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ..5 ఇన్ టూ 9 అంగుళాల సైజులో ఉన్న రాగి రేకులపై నాగరి, కన్నడ లిపితో చెక్కిన శాసనాలు ఉన్నాయన్నారు. శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉందని, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించారని చెప్పారు. 97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని తెలిపారు. ఇవి 1800–1910 మధ్య తయారైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు. వీటి పరిశీలనకు శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ అధ్యయన కేంద్రం సంస్కృతి, పురావస్తు విభాగం ఆచార్యులను పిలిపించామని, పురావస్తు కార్యాలయానికి కూడా సమాచారమిచ్చామని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీలలో 29 తామ్ర శాసనాలు లభించాయి. (చదవండి: సింహం ప్రతిమలు మాయం, విచారణకు కమిటీ) -
శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం..
సాక్షి, కర్నూలు: శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం రేపుతుంది. శ్రీశైలంలో ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం దేవస్థానం వైద్యశాల వైద్యుడితో పాటు, ముగ్గురి సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. శ్రీశైలం మండలం లో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో వారంపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఒకేరోజు 13 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ఆలయ ఉద్యోగులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీశైలం చేరుకున్న నందిగామ ఎమ్మెల్యే పాదయాత్ర
సాక్షి, కర్నూలు: వికేంద్రీకరణకు మద్ధతుగా కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చేపట్టిన పాద్రయాత్ర ఆదివారం రోజున కర్నూలు జిల్లా శ్రీశైలంకు చేరుకుంది. ఈ నెల 21న నందిగామ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈ రోజు ఉదయం శ్రీశైలానికి చేరుకొని శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జునస్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం వికేంద్రీకరణకు మద్దతు తెలిపేలా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహనరావుతో పాటు శ్రీశైలం వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
హంస వాహనాధీశా.. హరోం హర
సాక్షి, శ్రీశైలం: శ్రీగిరి కొండలు శివ నామస్మరణతో ప్రతిధ్వనిస్తుండగా.. శ్రీశైల క్షేత్రం బ్రహ్మోత్సవ కాంతులతో కళకళ లాడుతుండగా.. దేవేరి భ్రామరితో కలసి మల్లన్న మందస్మిత దరహాస వీచికలతో హంస వాహనంపై కనులపండువగా దర్శనమివ్వగా.. హంస వాహనాధీశా.. హరోం.. హర అంటూ శివ స్వాములు ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనంపై విశేష వాహన పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి 7.30 గంటలకు హంస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకార పూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరి నామస్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రధాన పురవీధిలోని అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. శివరాత్రి రోజు జరిగే బ్రహ్మోత్సవ కల్యాణానికి మొదటిసారిగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున ఈఓ సురేష్‌బాబు దంపతులు ఆదివారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ఫలపుష్పాదులు, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులుతో కూడిన పళ్లాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసి సమర్పించారు. నేడు శ్రీశైలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మ గుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. కాగా సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు, నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి నిత్యపూజలు చేపడతారు. టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణమూర్తులకు సోమవారం తిరుమల, తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా టీటీడీ దేవస్థానం తరపున శ్రీశైలంలో జరిగే శివరాత్రి, దసరా ఉత్సవాలకు పట్టువస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కళా నీరాజనం బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల అమోఘంగా తమ కళలను ప్రదర్శించడంతో భక్తులు పులకించిపోయారు. తప్పెట చిందులు, కోలాటం, డోలు కళాకారుల విన్యాసాలు, చెంచు గిరిజనుల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు, కేరళ నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి. -
గోల్మాల్!
కర్నూలు, శ్రీశైలం: దేవస్థానంలోని డొనేషన్ కౌంటర్లో గోల్మాల్ జరిగినట్లు సమాచారం. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి డొనేషన్ కౌంటర్లో పనిచేస్తున్న ఒక ఔట్‌సోర్సింVŠŠ ఉద్యోగిని శ్రీశైలం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డొనేషన్ కౌంటర్లో పనిచేస్తున్న మరో ముగ్గురు ఔట్సోర్సింగ్ సిబ్బందితో పాటుçసంబంధిత విరాళాల కేంద్రం ఉన్నతాధికారులపై కూడా పోలీసులు అనుమానాలువ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. భక్తులు వివిధ పథకాలకు అందించే విరాళాలు ఈ కేంద్రంలో సేకరిస్తారు. అయితే గత ఏడాది 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు సుమారు రూ. 15 నుంచి 30 లక్షలకుపైగానే గోల్మాల్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో కంప్యూటర్ సర్వర్, హార్డ్ డిస్క్‌ల నుంచి సమాచారం సేకరిస్తే అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయశాఖ, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఇవ్వడానికి ఈఓ కేఎస్ రామారావు గురువారం విజయవాడకు వెళ్లారు. ఆయన శ్రీశైలం చేరుకున్నాక.. శుక్రవారం డొనేషన్ కౌంటర్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈఓ ఇచ్చిన ప్రాథమిక సమాచారం తోనే డొనేషన్‌కౌంటర్‌లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దేవస్థానం సిబ్బంది ద్వారా తెలిసింది. -
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
-
మూతపడనున్న తిరుమల, శ్రీశైలం ఆలయాలు
సాక్షి, తిరుమల/శ్రీశైలం: సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 26న కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహాద్వారాలను మూసివే యనున్నారు. 26న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా ఆలయాన్ని మూసివేస్తారు. ఈ లెక్కన 25న రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆల య తలుపులను మూసివేయనున్నారు. 26న మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యా హ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, శ్రీశైలం ఆలయ మహాద్వారాలను ఈ నెల 26న కొన్ని గంటల పాటు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన తరువాత అదే రోజు ఉదయం 11:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరవను న్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. నేడు శ్రీవారి ‘ప్రత్యేక’ ప్రవేశ దర్శనం తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఈనెల 17న వయోవృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను అధికారులు జారీ చేస్తారు. అలాగే, ఈనెల 18న 5 ఏళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. -
శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. శ్రీశైలం ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఎప్పుడు నియమితులయ్యారనే వివరాలతో ఆలయ ఈవో కేఎస్ రామారావు.. దేవదాయ శాఖ కమిషనర్ పద్మకు శనివారం నివేదికను అందజేశారు. ఆలయంలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల్లో ముగ్గురు, మరో 14 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అన్యమతస్తులేనని తెలుస్తోంది. ఈ 14 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో తొమ్మిది మంది చంద్రబాబు సీఎంగా ఉన్న 1998–2003 మధ్య నియమితులైనవారేనని శ్రీశైలం దేవస్థానం ఈవో నివేదికలో పేర్కొన్నారు. మరో ఐదుగురు 2010–11లో ఉద్యోగాలు పొందారని వివరించారు. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగుల్లో ఒకరు చంద్రబాబు సీఎంగా ఉన్న 2001లోనూ, మిగిలిన ఇద్దరు 1982, 1993లో నియమితులయ్యారని తెలిపారు. 1993లో చేరిన రెగ్యులర్ ఉద్యోగిని దేవదాయ శాఖ తొలగించినప్పటికీ.. అతడు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడని.. 2014లో చంద్రబాబు సర్కారే తిరిగి అతడిని ఆలయంలో ఉద్యోగిగా నియమించింది. -
‘శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు’
సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానం ముందు దుకాణాల వేలం రద్దు చేయాలని దేవదాయ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు వేలం జరగగా ఈ వేలంలో దుకాణాదారులు, పాటదారులకు మధ్య వివాదం తలెత్తింది. కాగా ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ దీనిపై నిర్ణయం తీసుకున్నామని పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవినీతిని ఉపేక్షించే ప్రశ్నేలేదని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. దీనిపై సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానం పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని చెప్పారు శ్రీశైలం ఈవో బదిలీ.. ఇదిలా ఉండగా శ్రీశైలం ఆలయ ఈవోను బదిలీ చేస్తూ తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన ఈవోగా కెఎస్ రామారావు నియమితులయ్యారు. ఈవో శ్రీరామచంద్ర మూర్తి ని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని పేర్కొంది. -
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో మహాశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. వేములవాడ: తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు డాలర్ శేషాద్రి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలతో దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమీ ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడలోని పాత శివాలయం, యలనమకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయం, దుర్గగుడిలోని మల్లేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. అర్చనలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
శివరాత్రికి సిద్ధమవుతున్న శ్రీగిరి
కర్నూలు, శ్రీశైలం: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 25 నుంచి మార్చి 6 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదిమహాశివరాత్రి పర్వదినం శివునికి అత్యంతప్రీతికరమైనసోమవారం (మార్చి 4) రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి వసతి తదితర వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే శాశ్వత ప్రాతిపదికన క్షేత్రవ్యాప్తంగా 300 వరకు మరుగుదొడ్లు నిర్మించారు. వీటికి అదనంగా 200 టాయిలెట్లను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. నాగలూటి, దోర్నాలలో సైతం 20 చొప్పున తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈఈ రామిరెడ్డి తెలిపారు. అలాగే క్షేత్రవ్యాప్తంగా 500 మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు, ఉద్యాన వనాలు, యాత్రికులు సేదతీరే ప్రదేశాల వద్ద నిరంతరం మంచినీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి వీలుగా ఉచిత, అతిశీఘ్ర దర్శన క్యూలతో పాటు శివదీక్షా స్వాముల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నారు. శివస్వాముల కోసం చంద్రవతి కల్యామండపం నుంచి శివాజీగోపురం ఎదురుగా ఉన్న భ్రామరి ఉద్యానవన క్యూ ద్వారా ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. క్యూలలో ఉచితంగా పాలు, మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేయడానికి దాతల సహకారాన్ని తీసుకుంటున్నారు. పాతాళగంగ మొదలుకొని క్షేత్రవ్యాప్తంగా పారిశుద్ధ్య లోటు రాకుండా దేవస్థానం శానిటేషన్ విభాగంతో పాటూ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు అవడం వల్ల ఈ సారి పార్కింగ్ ప్రదేశాల సంఖ్య పెరిగింది. యజ్ఞవాటిక వద్ద గతంలో ఉండే బస్ పార్కింగ్ బదులు కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి పై భాగంలో చదును చేసి బస్సు పార్కింగ్‌కు కేటాయించనున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా మరొక బస్ పార్కింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. ఏటా రాత్రి పూట విద్యుత్ వెలుగుల కోసం అత్యధికంగా టవర్లైట్లను వినియోగించేవారు. ఈసారి అవుటర్‌రింగ్ రోడ్డు మొత్తం లైటింగ్ వ్యవస్థ ఉన్నందున వాటి సంఖ్య తగ్గించి అవసరమైన 10 ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం ప్రసాద పథకం కింద అదనపు ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి ప్రసాద పథకం కింద పర్యాటక శాఖ ద్వారా నిధులు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది శిఖరేశ్వరం, కర్ణాటక సత్రం వద్ద భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులు శివరాత్రిలోగా పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నారు. పాతాళగంగ వద్ద దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఈ పథకం ద్వారా చేపట్టారు. గర్భిణులు, చంటిపిల్లల తల్లులకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం విడతల వారీగా జరిగేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. వివిధ ప్రదేశాలలో వైద్యశిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పుడున్న 108 వాహనానికి ఆదనంగా మరికొన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఘాటు రోడ్డులో వాహనాలు అగిపోతే ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు క్రేన్లను శ్రీశైలం–దోర్నాల, అలాగే మున్ననూరు నుంచి శ్రీశైలం వరకు అందుబాటులో ఉంచనున్నారు. లడ్డూ ప్రసాదానికి లోటు రానివ్వం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 10 లక్షలకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. వారికి మల్లన్న లడ్డూప్రసాదం కొరత రాకుండా ఈ ఏడాది 40 లక్షల లడ్డూలను తయారు చేయించనున్నాం. గత ఏడాది 30 లక్షలకు పైగా తయారు చేసి,భక్తులకు అందించాం. ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 10 లక్షల లడ్డూలను చేయిస్తున్నాం. లడ్డూ విక్రయాలకు మొత్తం 16 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీరామచంద్రమూర్తి, ఈఓ -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన అర్చకుడు గంటి రాధాకృష్ణ
-
శ్రీశైలంలో అర్ధరాత్రి పూజలు.. కలకలం
సాక్షి, శ్రీశైలం/కర్నూలు : శ్రీశైల మల్లన్న సన్నిధిలో కలకలం రేగింది. వేదపండితుడు గంటి రాధాకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. రాధాకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించాడంటూ పేర్కొన్నారు. క్షుద్రపూజలు చేశాడని ఆరోపించారు. దీంతో అధికారులు, వేదపండితుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ క్షుద్రపూజలు నిర్వహించారనే ఆరోపణలొచ్చాయి. -
ఆశాదీపం
-
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మసోత్సవాలు
-
కార్తీక మాసాన... ఇల కైలాసాన...
పరమేశ్వరుడు మల్లికార్జున మహాలింగమూర్తిగా, పార్వతీదేవి భ్రమరాంబగా, గణపతి సాక్షిగణపతిగా, సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖునిగా, వీరభద్రస్వామి క్షేత్రపాలకుడిగా, నంది శనగల బసవన్నగా, గంగ పాతాళ గంగగా సమస్త మునులు వృక్షాలుగా, ఆ కైలాసమే భూమిపై అవతరించిందా అన్నట్లు దర్శనమిచ్చే ప్రదేశం శ్రీశైలం. అందుకే ఇది ఇలకైలాసం. శ్రీశైలాన్ని దర్శించడం ఒక యజ్ఞం ఆచరించిన ఫలితాన్నిస్తుందని, ఈ క్షేత్రాన్ని ఒక్కో మాసంలో దర్శిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని శ్రీపర్వతపురాణం చెప్పింది. కార్తీకమాసాన శ్రీశైలదర్శనం అతి గొప్పదైన వాజపేయ యాగాన్ని చేసిన ఫలితాన్ని ఇస్తుందని కూడా అదే పురాణం చెప్తోంది. కార్తీకమాసంలో శ్రీశైలఆలయంలో జరిగే కైకర్యాలెన్నో.... వాటిలో కొన్ని సాక్షి పాఠకుల కోసం నిరంతర శివ భజన కార్తీకమాసం ప్రారంభమైనరోజే ఆలయంలో నిరంతర శివనామభజన ప్రారంభమౌతుంది.ఈ మాసమంతా, ఇరవైనాలుగు గంటలూ వీరశిరోమండపం వద్ద శివనామస్మరణతో భజన కొనసాగుతూనే ఉంటుంది. ఆకాశదీపం ఆలయంలో ఆకాశదీపం నెలకొల్పే ఘట్టం కన్నులపండువగా ఉంటుంది. ముందుగా దీపానికి పూజాదికాలు నిర్వహిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి కట్టిన తాడుతో ఆకాశదీపాన్ని పైకి లాగుతుంటే పంచాక్షరీ నామస్మరణతో, ఆకాశదీపకాంతులతో ఆ ప్రాంతమంతా మరింత కాంతిమంతమౌతుంది. సోమవారం... సేవలతోరం కార్తీక సోమవారం క్షేత్రమంతా భక్తులతో కిటకిటలాడుతుంటే, ఆలయంలో అనేక ఉత్సవాలతో స్వామి అమ్మవార్లు కొలువు తీరుతారు. ఆ రోజు సాయంత్రం స్వామీ అమ్మవార్లు నంది వాహనంపై కొలువుదీరి ఆలయ ఉత్సవంగా ఆలయం చుట్టూ ఊరేగి ఈశాన్యభాగంలో ఉన్న పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆలయపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవ కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి లక్షదీపాలను వెలిగిస్తారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించి కార్తికదీపారాధనతో పునీతులవుతారు. ఆ తర్వాత ఆలయపుష్కరిణిలో జలాన్ని శివతీర్థంగా భావించి హారతి కార్యక్రమం జరుగుతుంది. పురాణ ప్రవచనకర్తలు కార్తికమాస మాహాత్మ్యాన్ని భక్తులకు తెలియజెప్తారు. ఈ కార్యక్రమం నాలుగు సోమవారాలు పౌర్ణమి నాడు జరుగుతుంది. వారోత్సవాలు మల్లికార్జునస్వామి వారికి ప్రతిరోజూ తెల్లవారుజామునపదకొండు మంది ఆలయపండితులతో మహాన్యాసపారాయణ, ఆరుద్రానక్షత్రం, మాసశివరాత్రి, పౌర్ణమి రోజుల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రాతఃకాలంలో జరుగుతుంది.అలాగే అమ్మవారి ఆలయప్రాంగణంలో ప్రతి శుక్రవారం,మూలానక్షత్రం, పౌర్ణమి రోజున స్వామీఅమ్మవార్లకు పుష్పాలంకత ఊయలసేవ మరియు ప్రతి ఆదివారం, పౌర్ణమి,మూలానక్షత్రంరోజున పల్లకీసేవ, మాసశివరాత్రి రోజున నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సాక్షిగణపతికి నిత్యం గణపతి హోమాన్ని ఆర్జితసేవగా భక్తులకు ఆచరించుకునే అవకాశం కల్పిస్తుండగా, ప్రతి బుధవారం, పౌర్ణమి, సంకటహర చవితి రోజుల్లో ప్రత్యేక గణపతి హోమాన్ని, విశేష అభిషేకాన్ని దేవస్థానం సర్కారిసేవగా నిర్వహిస్తోంది. సుబ్రహ్మణ్యస్వామికి ప్రతిమంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథుల్లో విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఆలయంలోని శనగల బసవన్నకు ప్రతి మంగళవారం, త్రయోదశి సమయాల్లో వృషభసూక్తంతో విశేష అభిషేకం ఆచరిస్తారు. దీన్ని నందిసేవగా పిలుస్తారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో, ఆలయప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం, పూజలు నిర్వహిస్తారు, అంకాళమ్మ అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉదయం విశేష అభిషేకం జరుగుతుంది. జ్వాలాతోరణం ఆలయానికి ముందు భాగంలో గంగాధర మండపం ఉన్న ప్రదేశంలో దేవాంగభక్తుడితో సమర్పించబడిన నూలు దారాలను ఆవునేతితో తడిపి అక్కడ ఏర్పాటు చేసిన స్తంభాలకు వేలాడదీస్తారు. భక్తుల నమశ్శివాయ భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. స్వామీ అమ్మవార్లు వెండి పల్లకిలో అక్కడికి చేరుకుంటారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ నూలుదారపు గుత్తులను వెలిగిస్తారు. స్వామీ అమ్మవార్ల పల్లకిని మూడు సార్లు అటూ, ఇటూ దాటించి తీసుకుని వెళ్తారు. భక్తులు కూడా దాటి ఆ భస్మాన్ని తీసుకుని ధరిస్తారు. కొందరు దాన్ని దాచుకుంటారు. త్రిపురాసురసంహారం జరిగి కైలాసానికి తిరిగి వచ్చిన స్వామివారి గౌరవార్థం అమ్మవారు ఈ జ్వాలాతోరణకార్యక్రమాన్ని నిర్వహించిందనీ, దాన్నే నేటికీ ఆచరించడం జరుగుతోంది. కార్తీక పౌర్ణమి – నదీహారతి ఈరోజు సాయంత్రం పవిత్ర కృష్ణానదీమతల్లికి ప్రత్యేక పూజలు ఆచరించి సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి, నదీహారతి కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఆలయ అర్చకులు, అమ్మవారి ఆలయ అర్చకులు పదకొండు రకాలహారతులను కృష్ణానదికి చూపుతారు. హారతిదీపకాంతులు నదిలో ప్రతిబింబించే దృశ్యం చూసి భక్తులంతా అత్యంత ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. – కె.వి.సత్యబ్రహ్మాచార్య ‘ఆలయాలు– ఆగమాలు’ గ్రంథ రచయిత -
శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
-
27న శ్రీశైలం ఆలయం మూసివేత
శ్రీశైలం: చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని ఈ నెల 27న మధ్యాహ్నం 2 నుంచి మరుసటిరోజు వేకువజామున 4.30 వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీరామచం ద్రమూర్తి సోమవారం తెలిపారు. 27న తెల్లవారు జామున 3.30 నుంచి మంగళ వాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతి ఉంటాయన్నారు. 5.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. -
స్పర్శ దర్శనం.. మహాభారం
సాక్షి, శ్రీశైలం : వారణాసి(కాశీ), శ్రీశైలం మహాక్షేత్రంలో మాత్రమే మల్లికార్జునస్వామిని స్పర్శించి దర్శించుకునే భాగ్యం ఉంటుంది. భోళాశంకరుడైన శ్రీశైల శ్రీమల్లికార్జునస్వామికి శిరస్సు తాకించి కేవలం పిడికెడు విభూది, పాలు, నీళ్లు, పత్రి సమర్పిస్తే చాలు తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ భాగ్యాన్ని కూడా శ్రీశైలానికి వచ్చే సాధారణ భక్తులు నోచుకోలేక పోతున్నారు. మల్లన్న ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో సాధారణ భక్తులు మల్లన్న స్పర్శ దర్శనం శని, ఆది, సోమవారాలలో చేసుకోవడానికి వీలు లేకుండా అప్పటి ఈఓ భరత్‌గుప్త ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటూ మాత్రమే స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆదాయమే లక్ష్యంగా టికెట్ల పెంపుదల.. మల్లన్న ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో అధికారులు ఇష్టారీతిగా సేవాటిక్కెట్లను పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు గర్భాలయ అభిషేకం రూ.1000, ముందస్తు అభిషేకం రూ.1500గా ఉండేది. ఆ తర్వాత మల్లన్న గర్భాలయంలో అభిషేకానికి రూ.5000గా నిర్ణయించారు. సామూహిక అభిషేక టికెట్‌ను రూ.1500కు పెంచేశారు. అలాగే అమ్మవారి ఆలయ శ్రీచక్రం ముందు కుంకుమార్చన టికెట్టు ధర రూ.300, అడ్వాన్స్ టికెట్లు రూ.500 ఉండేది. వాటిని కూడా ఏకంగా రూ.1000కు పెంచేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగే రుద్ర, చండీహోమం టికెట్ ధరలు రూ.750గా ఉండేవి. వాటిని ఏకంగా రెట్టింపు చేసి రూ.1500కు పెంచేశారు. కొన్నేళ్ల క్రితం వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పించే వారు. ఇప్పుడు రూ.500 వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ తీసుకున్న వారికి మాత్రమే గర్భాలయంలోకి అనుమతించి స్పర్శ దర్శనం చేయిస్తున్నారు. ఆ టిక్కెట్ల్లను కూడా పరిమితి సంఖ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా కేవలం ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12.30కు, సాయంత్రం 6.30 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే దేవుడు దర్శనానికి క్షేత్రానికి వచ్చే భక్తులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవా టికెట్లతో పాటు టోల్ గేట్ నుంచి టెంకాయల వరకు అధిక రేట్లు ఉండటంతో భక్తులు మండి పడుతున్నారు. కొత్త ఈఓ పాలనలో భక్తుల కష్టాలు తొలిగేనా.. ఇటీవల శ్రీశైలం ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామచంద్రమూర్తి సాధారణ భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రద్దీ లేని రోజుల్లోనైనా మల్లన్న స్పర్శదర్శన భాగ్యం అందరికీ కల్పించాలని, రూ.5000 అభిషేకం టికెట్టు తీసుకున్న దంపతులతో పాటూ వారి వెంట ఉన్న పిలలు, వృద్ధులకు అవకాశం ఇవ్వా లని భక్తులు కోరు తున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలను అభిషేక సమయంలో తల్లిదండ్రులతో పాటూ అనుమతించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, ప్రముఖ పర్వదినాలను మినహాయించి మిగిలిన రోజుల్లో స్పర్శ దర్శ నంపై ఈఓ దృష్టి సారించాలని కోరుతున్నారు. రద్దీ రోజుల్లో వసతి గదుల కొరతతో ఇబ్బం దులు పడుతున్నారు. తక్కువ ధరతో గదులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. కొబ్బరి కాయ రూ. 20 భక్తులు స్వామిఅమ్మవార్లకు సమర్పించే కొబ్బరకాయల ధరలను కూడా శ్రీశైలదేవస్థానం వారు ఇటీవలే రెండు మార్లు పెంచేశారు. కొంతకాలం వరకు రూ.10గా ఉన్న ధర, రూ. 15, ప్రస్తుతం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు కుటుంబసమేతంగా వచ్చినా ఒక్క కొబ్బరికాయ మాత్రమే సమర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులు కొనాల్సిందే.. శ్రీశైలదేవస్థానం ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికుల సౌకర్యం కోసం ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసింది. కొంతకాలం క్రితం వరకు అందులో ఉచిత వైద్యంతో పాటూ మందులు కూడా దాతల సహకారంతో ఉచితంగానే అందజేసేవారు. ప్రస్తుతం మందులు లేక పోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. టోల్ బాదుడు.. శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించడానికి నిత్యం వేల సంఖ్యలో వివిధ వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. అయితే టోల్ గేట్ టిక్కెట్ ధరలు కూడా భారీగా ఉన్నాయి. కారు, జీపు మొదలైన వాటికి రూ.100, టెంపో, ట్రాక్టర్, బస్ మొదలైన వాటికి రూ. 200, లోడ్ బండ్లకు రూ.500 వరకు టోల్గేట్ రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి నెలకు రూ.50 లక్షలకుపై గా ఆదాయం సమకూరుతున్నా వాహనదారులకు పార్కింగ్, తదితర విషయాల్లో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. -
ప్రథమ సేవకుడిగా పనిచేస్తా
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చెంత నూతన ఈఓ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రథమ సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు. తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా భీమవరమని చెప్పారు. తాను 20 డిగ్రీ పట్టాలు అందుకుంటున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. ప్రశ్న: భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? జవాబు: శ్రీశైలం వచ్చే ప్రతి భక్తుడూ.. వసతి దొరకాలని, సంతృప్తికరమైన దర్శనం కలగాలని కోరుకుంటాడు. ప్రధాన సేవకుడిగా వారి కోరికలను నెరవేర్చడం నా బాధ్యత. మల్లన్న దర్శనానికి వచ్చే దివ్యాంగులు, గర్భిణిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. వీరి కోసం ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తాను. ఇంత ముందులా కాకుండా నేరుగా స్వామి అమ్మవార్లను త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాను. ప్ర: వసతి గదులను ఏమైనా నిర్మిస్తున్నారా? జ: సాధారణ భక్తుల కోసం రింగ్‌రోడ్డు సమీపంలో 200 వసతి గదులను నిర్మిస్తున్నాం. భక్తులకు అవసరమైన డార్మెంటరీలను నిర్మిస్తాం. అలాగే అతి తక్కువ ధరతో లాకర్ బాత్రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్ర: గతంలో ఏ ఆలయంలో ఈఓగా పనిచేశారు? జ: నేను శ్రీకాళహస్తి ఈఓగా 2010 నుంచి 2012 వరకు పనిచేశాను. అక్కడ ఉన్న సమయంలో 50 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. శ్రీశైల దేవస్థానానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా అవసరం ఉంది. ఇక్కడ అన్నదానానికి రూ.43 కోట్ల వరకు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. త్వరలో మరి కొన్నింటిని చేసే దశగా ప్రయత్నం చేస్తాను. ప్ర: పుష్కరిణి సమస్య మీ దృష్టికి వచ్చిందా? జ: వచ్చింది. పుష్కరిణిలోకి కంచిమఠం వారికి సంబంధించిన డ్రైనేజీ నీరు ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. కంచిమఠం నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. ఆలయానికి దగ్గరలో ఉడడంతో భక్తుల ఇక్కడే స్నానాలు చేయాలని చూస్తారు. వారి కోరిక మేరకు త్వరలో పూర్తి స్థాయిలో పుష్కరిణి అందుబాటులోకి తేస్తాను. ప్ర: భక్తులకు మినరల్ వాటర్ అందిస్తారా? జ: కచ్చితంగా.. క్షేత్రంలో శివగంగ జల ప్రసాద పథకం ద్వారా ఎనిమిది మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదని నా దృష్టికి వచ్చింది. త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్లను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి భక్తులకు అందుబాటులోకి తెస్తాను. ప్ర: మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయనున్నారు? జ: క్షేత్రాభివృద్ధికి నా వంతుగా మాస్టర్ ప్లాన్‌లోని పనులను త్వరగతిన అమలు చేస్తాను. ఇందులో ప్రధానంగా వసతి గదులపై దృష్టి సారించాను. నందిసర్కిల్ ప్రాంతంలోని సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్.. ఆలయ ప్రధాన పురవీధిలోని దుకాణాలను తొలగించి షిప్ట్ చేయాలే ఉద్దేశంతో నిర్మించారు. వర్షాలు పడిన సమయంలో లికేజీ కాకుండా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను. -
కత్తి పక్కన పెట్టారు
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైలం దేవస్థాంనంలో క్షురకులు శుక్రవారం విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో పాతాళగంగ దారిలో ఉన్న కేశఖండనశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళ్యాణ కట్ట సంఘం అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల కేశఖండనశాల జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేశామన్నారు. ఈనెల 1న విజయవాడకు చెందిన ఓలేటి రాఘవులు కేశఖండన చేసిన అనంతరం ఓ భక్తుడి నుంచి రూ.10 తీసుకున్నందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు పెంచలయ్య దుర్భాషలాడుతూ దాడి చేయడానికి నిరసనగా విధులు బహిష్కరించామన్నారు. అలాగే తమకు నెలకు రూ.15వేలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరగా పరిష్కరిస్తామని చెప్పిన విజయవాడ ధర్మకర్త మండలి అధ్యక్షుడు గౌరంగ బాబు, ఎంఎల్సీ బుద్దా వెంకన్న నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 14వ తేదీ వరకు గడువు ఇచ్చినా పాలకుల్లో చలనం లేకపోవడంతో కత్తి పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. శ్రీశైల దేవస్థానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. క్షేత్రంలో పనిచేసే క్షురకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే క్షురకుల సంక్షేమ నిధి నుంచి సహాయం చేస్తామని అధికారులు చెప్పినా అమలు కావడం లేదని వాపోయారు. కళ్యాణకట్టలో పనిచేసే చెన్నయ్యకు కొన్ని రోజుల క్రితం కాలు విరిగిపోయినా నేటి వరకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీ.. ఉగాది విషెస్
-
తెలుగులో మాట్లాడిన మోదీ.. ఉగాది విషెస్
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీశైలం: దేశ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అంటూ తెలుగులోనే విషెస్ తెలిపారు మోదీ. న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ, శ్రీశైలం ఆలయ ప్రధాన అర్చకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం లేనందున వీడియో కాన్ఫరెన్స్‌లో మీతో మాట్లాడుతున్నానని అర్చకులకు చెప్పారు. తెలుగువారికి ఉగాది ఎంతో పవిత్రమైన పండుగ అన్నారు. తీపి, చేదు కలయికతో కూడిన ఉగాది పచ్చడి మహా అద్భుతంగా ఉంటుంది. బసమేశ్వరుడు నడయాడిన నేల శ్రీశైలం. ఉగాది యుగానికి ఆరంభం. సంతోషం, బాధతో కూడిన జీవితాలను ఉగాది పచ్చడి ప్రతిభింబిస్తుంది. సరికొత్త ఆశలు, ఆశయాలతో ఉగాది ప్రారంభమవుతుందంటూ ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. -
బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
కర్నూలు : శ్రీశైలం బ్రహ్మోత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కర్నూలు జిల్లాతో పాటుౖ వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల పోలీసులను నియమించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసు అధికారుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన 2 వేల మంది పోలీసులను బందోబస్తులో పాల్గొంటారు. కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, హోంగార్డు కమాండెంట్‌తో పాటు 14 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 116 మంది ఎస్ఐలు, 894 మంది కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లు, 409 మంది హోంగార్డులు, 25 సెక్షన్ల ఏఆర్ ప్లటూన్లు, 4 ప్లటూన్ల ఏపీఎస్పీ బృందాలు, 12 స్పెషల్ పార్టీ బృందాలతో పాటు బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీఎస్ మఫ్టీ పోలీసు బృందాలను కూడా నియమించారు. ఫారెస్ట్‌లోకొనసాగుతున్న కూంబింగ్... అధిక శాతం భక్తులు కాలినడకన వెళ్తున్నందున ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు సాయుధ బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మొత్తం సాయుధ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈనెల 15 వరకు స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పోలీసు శాఖ ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలం ఘాట్‌లో వెళ్లే వాహనాలు ఫిట్నెస్(సామర్థ్యం) పత్రాలు కలిగి ఉంటేనే అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓవర్‌లోడ్‌తో వెళ్లకుండా చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించారు. కాలినడకన వెళ్లే భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. తప్పిపోయినవారి సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షణకు ఇద్దరు డీఎస్పీలను నియమించారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరా, బాడీ ఓన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. -
శ్రీశైల దేవస్థానం సీఎస్వోపై వేటు
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో)గా విధులు నిర్వర్తి స్తున్న కె. నాగేశ్వరరావుపై వేటు పడింది. గిరిజన యువకుడు అంకన్నను చితకబాదిన సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈవో భరత్‌గుప్త.. సీఎస్‌వోను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా రిటైరైన నాగేశ్వరరావు ఐదు నెలల క్రితం తిరిగి సీఎస్‌వోగా చేరారు. కాగా, ఆలయ ప్రాంగణంలో భక్తులు పడేసే చిల్లరను ఏరుకుంటున్నాడంటూ సోమవారం మధ్యాహ్నం గిరిజన యువకుడు బయల అంకన్న (17)ను సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో లాఠీతో నాగేశ్వరరావు చితకబాదారు. ఈ దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో అదే రోజు రాత్రి ఆయనను వి«ధుల నుంచి తప్పిస్తూ ఈవో ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. సీఎస్‌వో తనను కులం పేరుతో దూషిస్తూ లాఠీతో దాడి చేశారంటూ బాధితుడు అంకన్న మంగళ వారం వన్‌టౌన్ ఎస్ఐ వరప్రసాద్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నేత బలమురి పరమేశ్వర్, కొమురం భీం సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఆశీర్వాదం దేవస్థానం ఈవోకు, వన్‌టౌన్ ఎస్ఐకు వినతిపత్రం అందజేశారు. -
గిరిజన యువకుడిపై దాష్టీకం.. వైరల్
సాక్షి, శ్రీశైలం: చెంచు గిరిజన యువకుడిపై ఓ ప్రసిద్ధ దేవస్థానానికి చెందిన ఓ ఉన్నతాధికారి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ సీఎస్వోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ గిరిజన యువకుడు శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం చెంబులు శుభ్రపరిచేవాడు. ఈ క్రమంలో బాధిత గిరిజన యువకుడు అక్కడ చిల్లర డబ్బులు ఏరుకున్నట్లు దేవస్థానం సీఎస్ఓ దృష్టికొచ్చింది. తీవ్ర ఆవేశంతో ఆ గిరిజన యువకుడిని బూతులు తిడుతూ సీఎస్ఓ చితకబాదారు. దేవస్థానం సీసీ కెమెరాల నిఘా విభాగం గదిలో గిరిజనుడిని కొట్టిన వ్యవహారం వీడియోలు లీక్ కావడంతో విషయం వెలుగు చూసింది. -
శ్రీశైలంపై జీఎస్టీ పిడుగు!
· దేవస్థానానికి వచ్చే రాబడి, వసూళ్లపై ట్యాక్స్ ? · అన్నదాన నిర్వహణ, ఉచిత ప్రసాదాలపై ప్రభావం · ముడిసరుకులు, ఇతరత్రా కోసం ఏటా రూ. 25కోట్లకు పైగా కొనుగోళ్లు · ఇప్పటి వరకు వ్యాట్ ద్వారా మినహాయింపు · జీఎస్టీ వస్తే ట్యాక్స్ కట్టాల్సిందే · ప్రత్యేక దర్శన, ఆర్జితసేవా టికెట్లపై కూడా పన్ను · దేవస్థానాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లేదన్న ఆర్థిక మంత్రి జైట్లీ శ్రీశైలం: జీఎస్టీ (వస్తుసేవల పన్ను) భారం శ్రీశైల దేవస్థానంపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల తిరపతి దేవస్థానం తరువాత అత్యధిక ఆదాయం కలిగిన క్షేత్రంగా శ్రీశైలం పేరొందింది. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబడి, ఆదాయం.. తదితర వాటిపై పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) చట్టం.. 2003లో అమలులోకి వచ్చింది. అయితే మతపరమైన ధార్మిక సంస్థలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. దీంతో ఆయా దేవస్థానాలకు పన్ను కట్టాల్సిన భారం లేకుండా పోయింది. అయితే జూలై నుంచి అమలులోకి వస్తుందనుకుంటున్న జీఎస్టీపై గత ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ..వివరణ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ఏ దేవస్థానాలకు కూడా పన్ను కట్టే విషయంలో సడలింపు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులోకి వస్తే అన్ని దేవస్థానాలు, తప్పనిసరిగా పన్నులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల రాబడి తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కోసం ఆ భారాన్ని భక్తులపై వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. దర్శన ఆర్జితసేవలపై.. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక, అతిశీఘ్ర దర్శనాలు, అభిషేకాది ఆర్జిత సేవా టికెట్లపై కూడా జీఎస్టీ బాదుడు కనిపించనుంది. గత ఏడాది మల్లన్న అభిషేకాది ఆర్జితసేవలు, ఇతర పూజలు, వ్రతాలు, కల్యాణోత్సవం.. తదితర వాటిపై రూ. 58 కోట్లకు పైగా ఆదాయం లభించింది. అలాగే దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గదులు, సత్రాలు, కాటేజీలు, ఇతర భవనాల అద్దె మొదలైన వాటి ద్వారా 2016–17 సంవత్సరంలో సుమారు రూ. 6.50 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇవే కాకుండా దేవస్థానం టోల్గేట్, తలనీలాల వేలాలు, కొబ్బరి చిప్పల విక్రయం, దుకాణాల అద్దెలు మొదలైన వాటి ద్వారా రూ. 13 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వార్షికంగా శ్రీశైల దేవస్థానానికి పలు మార్గాల ద్వారా గత ఏడాది రూ. 250 కోట్లకు పైగా రాబడి లభించింది. దాతలు ఇచ్చే విరాళాలు.. ఇంకా ఎన్నో మార్గాల ద్వారా వచ్చే రాబడిపై జీఎస్టీ భారం పడితే కనీసం 12 శాతం నుంచి గరిష్టంగా 18 శాతం వరకు దేవస్థానం పన్ను చెల్లించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉచిత భోజన పథకానికి కష్టాలు.. దేవస్థానం ఎన్నో ఏళ్లుగా ఉచిత భోజన పథకాన్ని అమలు చేస్తోంది. దాతల విరాళాలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచి వాటి ద్వారా వచ్చే వడ్డీతో అన్నదానాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం ముడిసరుకులైన కాయగూరలు, పాలు, పెరుగు, నెయ్యి, వంటగ్యాస్ తదితరాలకు.. రూ. కోట్లలో ఖర్చు చేస్తోంది. గత ఏడాది రూ.5.32 కోట్లకు పైగా వ్యయం చేసింది. జీఎస్టీ అమలైతే ఆయా ముడి సరుకులను బట్టి 12 శాతం నుంచి సుమారు 28 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. దీంతో ఉచిత భోజన పథాకానికి కష్టాలు వచ్చినట్లేనని అంటున్నారు. మల్లన్న ప్రసాదాలపై.. శ్రీశైల దేవస్థానం.. లాభాపేక్ష లేకుండా నష్టాలను భరిస్తూనే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాలను అందజేస్తోంది. ఇందు కోసం గత ఏడాది రూ.18 కోట్ల వరకు ముడిసరుకులను కొనుగోలు చేశారు. ఇతర ఆర్జితసేవలు, పూజా సామగ్రి, ప్రసాద వితరణ కోసం సుమారు రూ. 2.60 కోట్లకు పైగా వ్యయం చేశారు. వీటన్నింటిపై కూడా ట్యాక్స్ పడితే ప్రసాదాల నిర్వహణ ఎలా అనే విషయంపై దేవస్థానం ఇప్పటికే ఆలోచనలో పడింది. పూర్తిస్థాయిలో సమాలోచన చేస్తున్నాం: నారాయణ భరత్‌గుప్త, ఈఓ వచ్చే నెల నుంచి అమలు కానున్న జీఎస్టీ విషయంలో ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి. లాభనష్టాలతో సంబంధం లేకుండా భక్తుల సౌకర్యం కోసం నిర్వహించే పథకాల అమలు విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం. జీఎస్టీ, ఇతర ఆర్థిక వ్యవహరాల పర్యవేక్షణకై చీఫ్ ఫైనాన్సియర్ అడ్వైజర్‌ను శ్రీశైలదేవస్థానంలో నియమించుకున్నాం. జీఎస్టీ చట్టాన్ని అనుసరించి విధి విధానాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం. -
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
= ఘాట్ రోడ్డు ప్రమాద మృతులకు పొస్టుమార్టం పూర్తి = ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలింపు పెద్దదోర్నాల : ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. మృతుల్లో పెద్దదోర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతున్న నీలమ్మ (50), కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారి స్వరూప (6) ఉన్నారు. మండల పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్లో చింతల సమీపంలో జరిగిన ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని దొంగర్‌గావ్‌కు చెందిన విజయ్‌కుమార్ (40), రాజేశ్వరి శ్రీదేవి (45), నాగం (45)లు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నలుగురి మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటక నుంచి పెద్దదోర్నాలకు చేరుకున్న బంధువులకు మృతదేహాలు అప్పగించారు. కర్నూలులో మృతి చెందిన చిన్నారి స్వరూప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అక్కడికి వెళ్లిన బంధువులకు అప్పగించారు. పెద్దదోర్నాల నుంచి నాలుగు మృతదేహాలతో ప్రత్యేక వాహనంలో కర్నూలు బయల్దేరిన బంధువులు అక్కడ స్వరూప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఐదు మృతదేహాలనూ స్వగ్రామానికి తరలించారు. -
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు
కర్నూలు: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి భరత్‌గుప్తా తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం 6.30 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయన్నారు. భక్తులు ఈ మార్పును గమనించాలని ఈవో కోరారు. -
శ్రీశైలం ఆలయంలో తలనీలాలు దోపీడీ
-
శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం
కర్నూలు: శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. దేవస్థానం వసతిగృహం చండీ సదన్‌లో సీఐ రాసలీలలు నడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నారు. రాష్ట్రంలో పవిత్ర పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో ఆలయ వసతిగృహంలో ఇలాంటి ఘటనలు జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
త్వరలో తిరుమలేశునికి ‘పచ్చకర్పూరం’
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామిపై పచ్చకర్పూరం పేరిట ప్రశస్త్యమైన గ్రంథం ఆవిష్కృతం కానుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణ పండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని రచించారు. ఇప్పటికే వివిధ రకాల గ్రంథాలను రచించిన పురాణపండ శ్రీనివాస్ తిరుమలేశుని వైభవంతో తాజా గ్రంథానికి రూపకల్పన చేశారు. ఈనెల 20వ తేదీ తరువాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన సతీమణి చేతుల మీదుగా తిరుమలలో గ్రంథ ఆవిష్కరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
శ్రీశైలం దేవస్థానానికి ఛీప్ విజిలెన్స్ నియామకం
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేకంగా ఛీప్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్ట వేసేందుకు వెహికల్ స్కానర్లు, డ్రోన్లు ఉపయోగించాలని పోలీస్ శాఖకు సీఎం చంద్రబాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. -
శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. కర్నూలు నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం దేవస్థానం పాలకమండలి కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులు, రసీదు పుస్తకాల తనిఖీ చేశారు. నకిలీ రసీదు పుస్తకాలు ముద్రించి అక్రమంగా మట్టి తరలింపు చేపట్టినట్టు శ్రీనివాస్ అనే వర్క్ ఇన్స్పెక్టర్పై పది రోజుల క్రితం దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలకు ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు vigilance attacks in srisailam temple srisailam temple, vigilance attacks , శ్రీశైలం దేవస్థానం, విజిలెన్స్ , తనిఖీలు శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. కర్నూలు నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం దేవస్థానం పాలకమండలి కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులు, రసీదు పుస్తకాల తనిఖీ చేశారు. నకిలీ రసీదు పుస్తకాలు ముద్రించి అక్రమంగా మట్టి తరలింపు చేపట్టినట్టు శ్రీనివాస్ అనే వర్క్ ఇన్స్పెక్టర్పై పది రోజుల క్రితం దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
భక్తవ శంకర..శంభో హర హర!
-
మల్లన్న సేవలో శాసన సభ కమిటీ సభ్యులు
కర్నూలు: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఏపీ శాసన సభ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు పలికారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర స్త్రీ, శిశు, వికలాంగ, వృద్ధుల సంక్షేమ వ్యవహారాల శాసన సభ కమిటీ చైర్పర్సన్ గీత, సభ్యులు సత్యప్రభ, లక్ష్మీదేవి, బొడ్డు నాగేశ్వరరావు ఉన్నారు. అనంతరం చైర్పర్సన్ గీత విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తామన్నారు. -
ఇదేం నిబంధన..?
శ్రీశైలంలో షాపుల వేలం ప్రక్రియలో హిందూయేతరులు పాల్గొనకూడదా..! స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లవుతున్నా ఇంకా ఇటువంటి నిబంధనలా? హైదరాబాద్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన షాపుల వేలం ప్రక్రియలో పాల్గొనడానికి హిందూయేతరులు అనర్హులంటూ టెండర్ నిబంధన రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టెండర్ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. కుల, మత, జాతి, లింగ, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 15ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అవుతున్నా దేవాదాయశాఖ ఇప్పటికీ పౌరుల పట్ల మతేతర వ్యవహారాల్లో మతపరమైన వివక్ష చూపుతుండటం శోచనీయమంది. షాపుల వేలం ప్రక్రియలో హిందూయేతరులకు స్థానం లేకుండా చేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని దేవాదాయశాఖను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2016, జనవరి 1 నుంచి 2018, డిసెంబర్ 31 వరకు శ్రీశైలం దేవస్థానం సమాచార కేంద్రం ఉన్న 1, 2 షాపుల లీజు హక్కుల నిమిత్తం దేవాదాయశాఖ వేలం నోటీసు జారీ చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనేందుకు అనర్హులని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. 1, 2 షాపులను గత 40 ఏళ్లుగా తాము నిర్వహిస్తున్నామని, ప్రతీ వేలంలో అత్యధిక మొత్తాలకు షాపు లీజుల్ని దక్కించుకుంటున్నామని, ఈసారి షాపుల లీజులు పొందేందుకు హిందూయేతరులు అనర్హులంటూ జారీ చేసిన వేలం నోటీసును రద్దు చేయాలంటూ ఆయూబ్ అలీఖాన్, ఎ.ఎం.బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. ఈ ధోరణి అవాంఛనీయమైంది.. పిటిషనర్ల తరఫున ఎం.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందూయేతరులకు వేలం ప్రక్రియలో పాల్గొనే అవకాశమివ్వకుండా టెండర్ నిబంధనలను రూపొందించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ వ్యక్తమవని అభ్యంతరాలను ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూయేతరులు వేలం ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులనడంపై విస్మయం వెలిబుచ్చారు. దేవాదాయశాఖ అనుసరిస్తున్న ఈ ధోరణి అవాంఛనీయమైనదిగా తేల్చారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు దేవాదాయశాఖ పనితీరుపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జస్టిస్ నాగార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాథమిక ఆధారాలను బట్టి దేవాదాయశాఖ రూపొందించిన నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. శ్రీశైల దేవస్థాన పరిధిలోని షాపులను మతవిశ్వాసాల ఆధారంగా కేటాయిస్తున్నామని దేవాదాయశాఖ అధికారులే చెప్పట్లేదని, అలాంటప్పుడు హిందూయేతరులను వేలం ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధం విధించడం ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వివరణివ్వాలని దేవాదాయశాఖ అధికారుల్ని ఆదేశించారు. పిటిషనర్ల రెండుషాపుల్ని రూ.9,500, రూ.6,000కు వేలంలో ఇతరులు దక్కించుకున్నారని విద్యాసాగర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ మొత్తాల్ని పిటిషనర్లే చెల్లించి, తమ షాపుల్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చని, అయితే ఈ కొనసాగింపు కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.