ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీశైలం: దేశ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అంటూ తెలుగులోనే విషెస్ తెలిపారు మోదీ. న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ, శ్రీశైలం ఆలయ ప్రధాన అర్చకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం లేనందున వీడియో కాన్ఫరెన్స్‌లో మీతో మాట్లాడుతున్నానని అర్చకులకు చెప్పారు. తెలుగువారికి ఉగాది ఎంతో పవిత్రమైన పండుగ అన్నారు.
తీపి, చేదు కలయికతో కూడిన ఉగాది పచ్చడి మహా అద్భుతంగా ఉంటుంది. బసమేశ్వరుడు నడయాడిన నేల శ్రీశైలం. ఉగాది యుగానికి ఆరంభం. సంతోషం, బాధతో కూడిన జీవితాలను ఉగాది పచ్చడి ప్రతిభింబిస్తుంది. సరికొత్త ఆశలు, ఆశయాలతో ఉగాది ప్రారంభమవుతుందంటూ ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment