ugadi wishes
-
వేడుకలో...
నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ కథానాయిక. సాయికుమార్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, సాయికుమార్ ఉన్న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సూర్యగా నాని, శంకరంగా సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో ఏదైనా వేడుకకు సంబంధించిన ఫొటో అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ‘‘హై బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 29న రిలీజ్ చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మురళి జి. -
అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024 -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
Ugadi 2023 Wishes: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Ugadi 2023 Wishes in Telugu: తెలుగువారి పండుగ ఉగాది వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్ర పరివారానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు! ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గతించిన కాలాన్ని మర్చిపోవాలి కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తీపి-చేదు కలిసినదే జీవితం కష్టం-సుఖం తెలిసినదే జీవితం ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మామిడి పువ్వు పూతకొచ్చింది కోయిల గొంతుకు కూత కొచ్చింది వేప కొమ్మకు పూవు పూసింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆనందంగా.. ఆరోగ్యంగా గడుపుదాం.. కొత్త సంవత్సరం శుభం కలగాలని కోరుకుందాం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. బాధలేమి లేకుండా… మీ ఇంట్లో అందరు ఆనందంగా ఉండాలని కోరుతూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి.. కోకిల మీ అతిథిగా రావాలి.. కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి… హ్యాపీ ఉగాది. షడ్రుచుల సమ్మేళన జీవితం.. కష్ట,సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.. తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు . మధుర మైన ప్రతిక్షణం నిలుస్తుది జీవితం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చీకటిని తరిమే ఉషోదయం మాదిరిగా చిగురాకులకు ఊయలలో నవరాగాల కోయిలలా అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన కోయిల రాగాలు అందమైన ముగ్గులు కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలుఉగాది పండుగ సంబురాలు ఎన్నో.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. -
తెలుగు వారికి శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ప్రజలు ఉగాది పండుగ జరుపుకోంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. ‘షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ.. కొత్త లక్ష్యాలకు, ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలే జరగాలి. సమృద్ధిగా వానలు కురవాలి.. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు జరగాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2023 -
Ugadi 2022: శుభకృత్‌లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీశుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022 -
ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్ ఉగాది పండగ శుభాకాంక్షలు
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ‘ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్’ రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు తెలుగు పండగలను నిర్వహిస్తోంది. తెలుగు పండగల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేస్తోంది. ఫిన్లాండ్ దేశంలో సుమారు వెయ్యికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది రఘునాథ్ పర్లపల్లి ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్(ఎఫ్ఐటీఏ)కి నూతన అధ్యక్షుడిగా నియమించడ్డారు. ఆయన ఈ పదవిలో మర్చి 2023 వరకు కొనసాగుతారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిన్లాండ్లో నివసించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం( ఉగాది) పండగ’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసే ఓ ప్రత్యేక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో చిన్నారులు శ్రీ ప్లవ నామ సంవత్సర(ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్ఐటీఏ నిర్వహించిన పలు కార్యక్రమాలకు సహకారం అందించిన న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్ఐటీఏ తరపున తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండగ నుంచి శుభం జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం -
తెలుగు అకాడమీ ఆధ్వర్యం లో ఉగాది వేడుకలు
-
ఆరెంజ్ ఆర్మీ ఉగాది శుభాకాంక్షలు వింటే నవ్వులే నవ్వుల్..
చెన్నై: తెలుగు వారు నూతన సంవత్సరంగా ఆచరించే 'ఉగాది' పర్వదినాన్ని పురస్కరించుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సన్‌రైజర్స్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీడియోను ఫ్రాంఛైజీ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు తెలుగులో శుభాకాంక్షలు తెలియజేసిన విధానం అభిమానుల్లో నవ్వుల పువ్వులు పూయించింది. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ మినహా మిగతా వారి విషస్ వింటే కడుపు చెక్కలు అయ్యేలా నవ్వడం ఖాయం. వచ్చీ రానీ తెలుగులో వారు చేసిన ప్రయత్నం నవ్వులు పూయించడంతో పాటు అందరినీ ఆకట్టుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, జేసన్ హోల్డర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో సహా ప్రతి ఒక్క ఆటగాడు తమ అభిమానులకు 'ఉగాది శుభాకంక్షాలు' తెలిపారు. 'ఆరెంజ్ ఆర్మీ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు' అనే క్యాప్షన్ జోడించి సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. -
తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు కలగాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలి. మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. తెలుగు వారికి.. మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాల’’ని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
ఉగాది శుభాకాంక్షలు: సీఎం జగన్
-
కరోనాపై విజయంతో నవయుగానికి నాంది
సాక్షి, అమరావతి: శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కరోనామీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు -
తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ తెలుగులో శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఉగాది పండుగ సందర్భంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు! ఈ పర్వదినం సందర్భంగా మీ ఆకాంక్షలు నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. — Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019 -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలన్నారు. పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆక్షాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని వైఎస్ జగన్ అభిలషించారు. ప్రజాక్షేత్రంలోనే వైఎస్ జగన్ ఉగాది వేడుకలు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ఉగాది వేడుకలను ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో జరుపుకోనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పర్వదిన సందర్భంగా రేపటి పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి పాదయాత్ర సోమవారం యథాప్రకారం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. ముగిసిన 114వ రోజు ప్రజాసంకల్పయాత్ర వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 114వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో ముగించారు. ఇవాళ 13.2 కిలోమీటర్లు నడిచిన జననేత వైఎస్ జగన్ ఇప్పటి వరకు 1,528 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. నేటి పాదయాత్ర పెద్ద పాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం, గరికపాడు, బీకేపాలెం మీదుగా కాకుమాను వరకు కొనసాగింది. -
తెలుగులో మాట్లాడిన మోదీ.. ఉగాది విషెస్
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీశైలం: దేశ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అంటూ తెలుగులోనే విషెస్ తెలిపారు మోదీ. న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ, శ్రీశైలం ఆలయ ప్రధాన అర్చకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం లేనందున వీడియో కాన్ఫరెన్స్‌లో మీతో మాట్లాడుతున్నానని అర్చకులకు చెప్పారు. తెలుగువారికి ఉగాది ఎంతో పవిత్రమైన పండుగ అన్నారు. తీపి, చేదు కలయికతో కూడిన ఉగాది పచ్చడి మహా అద్భుతంగా ఉంటుంది. బసమేశ్వరుడు నడయాడిన నేల శ్రీశైలం. ఉగాది యుగానికి ఆరంభం. సంతోషం, బాధతో కూడిన జీవితాలను ఉగాది పచ్చడి ప్రతిభింబిస్తుంది. సరికొత్త ఆశలు, ఆశయాలతో ఉగాది ప్రారంభమవుతుందంటూ ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర తొలి పండగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఏడాదంతా సకాలంలో వానలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
జయనామ సంవత్సరంలో జగనే సీఎం
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: జయనామ సంవత్సరంలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పండితుడు సదాశివయ్యశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల గ్రహబలం బాగుందని, విశేష ప్రజాదరణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయపథంలో పయనిస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలు మారతాయని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, శింగరాజు వెంకటరావు, జిల్లా ఉపాధి కల్పన విభాగం కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ పోకల అనూరాధ, జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నగర ఎస్సీ సెల్ కన్వీనర్ యరజర్ల రమేష్, నగర సేవాదళ్ కన్వీనర్ కంకణాల వెంకటరావు, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, నగర యూత్ కన్వీనర్ నెరుసుల రాము, నగర ప్రచార కమిటీ సెక్రటరీ రాయపాటి కోటి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు టీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.