సాక్షి, అమరావతి: శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కరోనామీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు
కరోనాపై విజయంతో నవయుగానికి నాంది
Published Wed, Mar 25 2020 5:43 AM | Last Updated on Wed, Mar 25 2020 12:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment