Happy Ugadi Wishes in Telugu 2023: Whatsapp Status Images and Messages
Sakshi News home page

Ugadi 2023 Wishes in Telugu: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Published Tue, Mar 21 2023 5:12 PM | Last Updated on Wed, Mar 22 2023 8:46 AM

Happy Ugadi 2023: Wishes, Quotes and Whatsapp Status Messages to share with your loved ones - Sakshi

Ugadi 2023 Wishes in Telugu: తెలుగువారి పండుగ ఉగాది వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్ర పరివారానికి శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!
ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
గతించిన కాలాన్ని మర్చిపోవాలి కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు

తీపి-చేదు కలిసినదే జీవితం కష్టం-సుఖం తెలిసినదే జీవితం ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మామిడి పువ్వు పూతకొచ్చింది కోయిల గొంతుకు కూత కొచ్చింది వేప కొమ్మకు పూవు పూసింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

 

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఆనందంగా.. ఆరోగ్యంగా గడుపుదాం.. కొత్త సంవత్సరం శుభం కలగాలని కోరుకుందాం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
బాధలేమి లేకుండా… మీ ఇంట్లో అందరు ఆనందంగా ఉండాలని కోరుతూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి.. కోకిల మీ అతిథిగా రావాలి.. కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి… హ్యాపీ ఉగాది.
షడ్రుచుల సమ్మేళన జీవితం.. కష్ట,సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు .
మధుర మైన ప్రతిక్షణం నిలుస్తుది జీవితం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
చీకటిని తరిమే ఉషోదయం మాదిరిగా చిగురాకులకు ఊయలలో నవరాగాల కోయిలలా అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన కోయిల రాగాలు అందమైన ముగ్గులు కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలుఉగాది పండుగ సంబురాలు ఎన్నో.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement