Ugadi 2023
-
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ( ఫొటోలు)
-
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మర్చి 22న ఘనంగా జరిగాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు సింగపూర్‌లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేక గంటల పంచాంగాన్ని సభ్యులకు అందించారు. జోతిష పండితులు పంచాంగకర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు , మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ దీన్ని రూపొందించారు. ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహిస్తున్నపలు భక్తి, స్వచ్చంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని భక్తులు కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
విజయవాడ: ఉగాది సందర్భంగా ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
Ugadi 2023: ఉగాది పండుగ.. ఈ విశేషాలు తెలుసా?
మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. ఇంటికి ఉగాది కళ.. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబసభ్యుల కలయికలో ఆనందం, షడ్రుచుల పచ్చడితో ఆరోగ్యం తెలియజేసే ఈ పండగ వసంతరుతువు ్ర΄ారంభానికి సూచికగానూ జరుపుకుంటారు. శోభకృత్నామ సంవత్సరాన్ని శోభాయమానంగా అలంకరించడానికి.. స్వాగతించే రంగోలి అందమైన ముగ్గుల అలంకరణకు ఎంత శ్రద్ధ పెడతామో మనందరికీ తెలిసిందే. మరింత అందంగా తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకునే రంగోలిని తీర్చలేమనుకునేవారు రెడీమేడ్ డిజైనర్ రంగోలీలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. డోర్ హ్యాంగింగ్స్ మెయిన్ డోర్ ఇంటికి శక్తిని, శుభాన్ని ఆహ్వానిస్తుంది. మనవైన హస్తకళలు లేదా ఛాయా చిత్రాలని ఉపయోగించవచ్చు. సంప్రదాయ వేడుక కాబట్టి ఇత్తడి డోర్‌బెల్స్‌ను అలంకరిస్తే ప్రత్యేక కళతో పాటు ఆ మువ్వల సవ్వడి ఆనందాన్ని ఇస్తుంది. మామిడి, వేప శుభసూచికగా గుమ్మానికి మామిడి, వేప ఆకులతో తోరణం కడతారు. అలాగే, గుమ్మానికి ఒక వైపు చిన్న అరటి చెట్టును జోడించడం ఈ రోజును మరింత శుభ ప్రదంగా మార్చేస్తుంది. లేదంటే ఆర్టిఫిషియల్ అరటి చెట్టును కూడా వాడచ్చు. లైటింగ్ పండగ అలంకరణలో ప్రత్యేక స్థానాలు వంటగది, పూజ గది. ఈ రెండు ప్లేసుల్లో లైటింగ్ డల్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని, ఈ ప్రత్యేకమైన రోజున లైటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే కాంతిమంతంగా ఉంటాయి. హ్యాంగింగ్స్ వాల్ పేపర్లు, సంప్రదాయ వాల్ హ్యాంగింగ్స్, పూల దండలను వేలాడదీయడం వంటి మరిన్ని అందుబాటులో ఉండే అలంకరణ వస్తువులను ఎంచుకోవచ్చు. సువాసన గల ఇండోర్ ΄్లాంట్ డెకొరేషన్ కూడా పండగ కళను పెంచుతుంది. పండగ చేసుకుంటారిలా... సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. తెలుపు రంగు లేదా ఈ సంవత్సరం ఉగాది బుధవారం వచ్చింది కాబట్టి వీలయితే బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం మంచిది. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజించాలి. తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. అల్పాహారం కంటే ముందుగా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తినాలి. సంవత్సరం ΄÷డుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు జరగడం పరిపాటి. పచ్చడి ఇలా పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి – అర టీ స్పూన్. తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి. స్పూన్‌తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. -
తాడేపల్లి: సీఎం జగన్ నివాసంలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
Karimnagar: ఉగాది వేళ.. జాతకాల్లో అదృష్టం వెతుక్కుంటున్న నేతలు
సాక్షి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటి పోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడే నుంచే పోటీ చేసిన ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిరిసిల్ల: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కె.కె.మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లేదు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుతం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి నర్సింగరావు (కాంగ్రెస్) గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జరిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)కు ఈసారి గట్టి పోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)కు, పుట్ట మధు (బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. -
సీఎం జగన్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
-
ఉగాది పచ్చడి సేవించిన సీఎం జగన్ దంపతులు
-
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసిన సీఎం జగన్
-
సతీసమేతంగా ఉగాది సంబరాల్లో సీఎం జగన్
-
శోభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి?
-
తాడేపల్లిలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం జగన్ దంపతులు
-
శ్రీశైలం : అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు (ఫోటోలు)
-
Ugadi 2023: కొత్త కాంతుల శోభకృత్.. తెలుగు రాష్ట్రాల్లో తొలి పండగ సందడి (ఫొటోలు)
-
Sri Shobhakruth Nama Ugadi 2023: శోభాయమానం
ఉగాది మన తొలిపండుగ. ఈసారి ఉగాదికి పేరు శోభకృత్. శోభ అంటే కాంతి. మన జీవితాలకు అవసరమైన...భాగ్యాల, సౌభాగ్యాల కాంతిని ఈ ఉగాది ఇస్తుందనిఆశిద్దాం. ఈసారి వసంత విషువత్ జరిగిన మరుసటి రోజున ఉగాది వచ్చింది. అంటే వసంత విషువత్ మొదలు అయిన మరుసటి రోజున చైత్రమాసంమొదలు అయింది. ఇది ఒక విశేషం. ఇలా జరగడం అరుదు. ఈ అరుదైన సంఘటన మనకు, దేశానికి, ప్రపంచానికి అత్యంత మేలు చెయ్యాలని అపేక్షిద్దాం. ఉగాదితో చాంద్ర–సౌర (లూని సోలర్) సంవత్సరం మొదలు అవుతుంది. పౌర్ణమి చంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో ఉండడం చైత్రమాసం. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పా డ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నాక్షత్రమాసం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖను ఉత్తరంవైపుగా దాటడం వసంత విషువత్ అవుతుంది. వసంత విషువత్ మార్చ్ 21న జరుగుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్త ఋషులు నాక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగం పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువులో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అని అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి ఆనుగుణ్యంగానూ రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థాలు. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. నాక్షత్ర చాంద్ర– సౌర గమనాల ప్రా తిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. సప్త ఋషుల తరువాత విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపా దనలను, మార్పులను తీసుకువచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహర్షి సంవత్సరాదిని వసంత విషువత్ కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ వస్తోంది. వసంత విషువత్‌తో వసంతం మొదలు అవుతుంది; సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని ΄÷ందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం వేపపువ్వు, బెల్లం, మిరియాలపొడి, చింతపండు, ఉప్పు, మామిడి ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగ శ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను వ్యక్తులకు సూచన్రపా యంగా పంచాంగం చెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి; చేద్దాం.ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవ్వాలి, అవుదాం. మంచికి తొలి అడుగుగా, ఒక పండుగగా, తొలి పండుగగా ఉగాది మనకు అందివచ్చింది. ఇతర పండుగలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ ఉగాది. వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది. ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం. చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలు. వీటిని వసంతం తెస్తుంది, ఇస్తుంది. వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే ‘అహమృతూనాం కుసుమాకరః‘ అంటూ కృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చెప్పాడు. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘... సంతో వసంతవల్లోకహితం చరంతః ...’ అని వివేకచూడామణిలో ఆదిశంకరాచార్య అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం, హితం వంటివసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. – రోచిష్మాన్ -
Ugadi 2023 Wishes: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి
Ugadi 2023 Wishes in Telugu: తెలుగువారి పండుగ ఉగాది వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్ర పరివారానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఈ ఏడాది మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీకు మంచి ఆరోగ్యం, సంపద, ఆనందం, ఉల్లాసాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది వెలుగులు మీ జీవితంలో నూతన కాంతిని తెస్తాయని ఆశిస్తూ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు! ఈ ఏడాది పొడవనా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గతించిన కాలాన్ని మర్చిపోవాలి కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తీపి-చేదు కలిసినదే జీవితం కష్టం-సుఖం తెలిసినదే జీవితం ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని కోరుకుంటూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మామిడి పువ్వు పూతకొచ్చింది కోయిల గొంతుకు కూత కొచ్చింది వేప కొమ్మకు పూవు పూసింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆనందంగా.. ఆరోగ్యంగా గడుపుదాం.. కొత్త సంవత్సరం శుభం కలగాలని కోరుకుందాం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. బాధలేమి లేకుండా… మీ ఇంట్లో అందరు ఆనందంగా ఉండాలని కోరుతూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి.. కోకిల మీ అతిథిగా రావాలి.. కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి… హ్యాపీ ఉగాది. షడ్రుచుల సమ్మేళన జీవితం.. కష్ట,సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం…. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.. తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు . మధుర మైన ప్రతిక్షణం నిలుస్తుది జీవితం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చీకటిని తరిమే ఉషోదయం మాదిరిగా చిగురాకులకు ఊయలలో నవరాగాల కోయిలలా అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన కోయిల రాగాలు అందమైన ముగ్గులు కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలుఉగాది పండుగ సంబురాలు ఎన్నో.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. -
తెలుగు వారికి శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ప్రజలు ఉగాది పండుగ జరుపుకోంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. ‘షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ.. కొత్త లక్ష్యాలకు, ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలే జరగాలి. సమృద్ధిగా వానలు కురవాలి.. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు జరగాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2023 -
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం.. ఈ ఏడాదిశుభ ముహూర్తాలు ఇవే!
చైత్రమాసం ►22.03.23 బుధవారం, శుక్ల పాడ్యమి ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం. ►26.03.23 ఆదివారం, షష్ఠి రోహిణి, మకరలగ్నం, తె.2.51 గృహారంభం. ►27.03.23 సోమవారం, షష్ఠి రోహిణి, మేషలగ్నం, ఉ.8.15 క్రయవిక్రయాలు, నూతన వస్త్ర ఆరంభము. ►29.03.23 చైత్ర శుద్ధ అష్టమి నుంచి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురు మౌఢ్యమి. ►30.03.23 గురువారం, శు. నవమి పునర్వసు, మేషలగ్నం, ఉ.8.03 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►05.04.23 బుధవారం, శు. చతుర్ధశి ఉత్తర, మేషలగ్నం ఉ.7.39 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►06.04.23 గురువారం, పూర్ణిమ హస్త, మేషలగ్నం, ఉ.7.35 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►07.04.23 శుక్రవారం, బ. పాడ్యమి చిత్త, మేషలగ్నం, ఉ.7.31 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►08.04.23 శనివారం, విదియ స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►10.04.23 సోమవారం, చవితి అనూరాధ, మేషలగ్నం ఉ.7.20 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దసం, కేశఖండన. ►12.04.23 బుధవారం, సప్తమి మూలా, మేషలగ్నం ఉ.7.12 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. ►15.04.23 శనివారం, దశమి ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 డోలారోహణం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు, దస్త్రం, కేశఖండన. వైశాఖమాసం ►21.04.23 శుక్రవారం, వైశాఖ శు. విదియ భరణి, కన్యాలగ్నం సా. 4.40 వ్యాపారం, క్రయవిక్రయాలు. ►23.04.23 ఆదివారం, చవితి రోహిణి, కర్కాటకలగ్నం, ఉ.11.45 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►25.04.23 గురుమోఢ్యమి త్యాగం ►26.04.23 బుధవారం, సప్తమి పునర్వసు, కన్యాలగ్నం, సా. 4.20 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►27.04.23 గురువారం, సప్తమి పుష్యమి, వృషభలగ్నం, ఉ.7.41 వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►30.04.23 ఆదివారం, దశమి మఘ, వృషభలగ్నం, ఉ.7.29 వివాహం, వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాశన, కేశఖండన, బారసాల. ►03.05.23 బుధవారం, త్రయోదశి హస్త, వృషభలగ్నం, ఉ.7.18 వివాహం, గృహారంభం, ఉపనయనం, శంకుస్థాపన. ►03.05.23 బుధవారం, చతుర్దశి చిత్త, మకరలగ్నం రా.12.22 వివాహం, గర్భాధానం. ►05.05.23 శుక్రవారం, వైశాఖ పూర్ణిమ స్వాతి, కన్యాగ్నం, మ.3.45 క్రయవిక్రయాలు, దస్త్రం. ►07.05.23 ఆదివారం, బ. విదియ అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►10.05.23 బుధవారం, పంచమి పూర్వాషాఢ, వృషభలగ్నం, ఉ.6.50 క్రయవిక్రయాలు, సమస్తశుభాలు. ►10.05.23 నుంచి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంకుస్థాపనలు, బోరింగ్లు నిషిద్ధం. ►11.05.23 గురువారం, షష్ఠి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 అన్నప్రాశన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. ►14.05.23 ఆదివారం, దశమి శతభిషం, మిథునలగ్నం, ఉ.9.24 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠమాసం ►21.05.23 ఆదివారం, శు. విదియ మృగశిర, మిథునలగ్నం ఉ.9.56 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. ►25.05.23 గురువారం, షష్ఠి పుష్యమి, మిథునలగ్నం, ఉ.8.40 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. ►26.05.23 శుక్రవారం, సప్తమి మఖ, మీనలగ్నం రా.1.52 వివాహం, గర్భాధానం, ప్రయాణాలు. ►31.05.23 బుధవారం, ఏకాదశి స్వాతి, మిథునలగ్నం, ఉ.8.16 అన్నప్రాశన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంకుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. ఆషాఢ మాసం ►03.06.23 శనివారం, పూర్ణిమ అనూరాధ, మీనలగ్నం రా.1.20 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►05.06.23 సోమవారం, బ. విదియ మూల, మిథునలగ్నం, ఉ.7.20 సమస్త శుభాలు. ►07.06.23 బుధవారం, చవితి ఉత్తరాషాఢ, మిథునలగ్నం ఉ.7.49 అన్నప్రాశన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 వివాహం, గర్భాధానం, ప్రయాణం. ►08.06.23 గురువారం, పంచమి శ్రవణం, కన్యాలగ్నం, మ.1.30 డోలారోహణం, క్రయవిక్రయాలు. ►09.06.23 శుక్రవారం, సప్తమి శతభిషం, మీనలగ్నం, రా.12.56 వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణమాసం ►23.07.23 ఆదివారం, శు. షష్ఠి ఉత్తరా, కన్యాలగ్నం ఉ.11.50 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►26.07.23 బుధవారం, శు. నవమి స్వాతి, వృశ్చికలగ్నం, మ.4.09 క్రయవిక్రయాలు, డోలారోహణం. ►28.07.23 శుక్రవారం, శు. దశమి అనూరాధ, కన్యాలగ్నం, ఉ.10.15 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►30.07.23 ఆదివారం, శు. చతుర్దశి మూలా, కన్యాలగ్నం ఉ.10.07 డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. ►31.07.23 సోమవారం, శు. చతుర్దశి పూర్వాషాఢ, ధనుర్లగ్నం సా.5.01 క్రయవిక్రయాలు, ప్రయాణం. ►04.08.23 శుక్రవారం, బ. తదియ పూర్వాభాద్ర, ధనుర్లగ్నం సా.4.45 క్రయవిక్రయాలు, ప్రయాణం. ►05.08.23 శనివారం, బ. చవితి ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం మ.1.30 క్రయ విక్రయాలు, ప్రయాణం. ►06.08.23 ఆదివారం, బ. పంచమి రేవతి, కన్యాలగ్నం, ఉ.11.05 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. ►07.08.23 సోమవారం, బ. షష్ఠి అశ్వని, కన్యాలగ్నం, ఉ.10.19 నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. ►08.08.23 మంగళవారం శోభకృత్నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుంచి శోభకృత్ నామ సంవత్సర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు ►19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం ►20.08.23 శుక్లపక్షం, ఆదివారం, చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 గృహారంభం, గృహప్రవేశం, వివాహం. ►20.08.23 ఆదివారం, పంచమి చిత్త, కర్కాటకలగ్నం, రా.2.58 గృహారంభం, గృహప్రవేశం, వివాహం. ►24.08.23 గురువారం, నవమి అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 వివాహం, గృహప్రవేశం. మిథునలగ్నం, రా.2.40 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►26.08.23 శనివారం, దశమి మూలా, వృషభలగ్నం, రా.11.45 వివాహం, గృహప్రవేం, గర్భాధానం. ►30.08.23 బుధవారం, పూర్ణిమ శతభిషం, వృషభలగ్నం, రా.11.30 వివాహం, గృహప్రవేం, గర్భాధానం. ►31.08.23 గురువారం, బ. పాడ్యమి శతభిషం, వృశ్చికలగ్నం, ఉ.11.48 రాఖీపూర్ణిమ, వివాహం, క్రయవిక్రయాలు. ►01.09.23 శుక్రవారం, బ. విదియ ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►02.09.23 శనివారం, బ. తదియ ఉత్తరాభాద్ర, వృశ్చికలగ్నం, ఉ.11.45 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►02.09.23 శనివారం, బ. తదియ రేవతి, వృషభలగ్నం, రా.11.18 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►03.09.23 ఆదివారం, బ. చవితి రేవతి, వృశ్చికలగ్నం, ఉ.11.35 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►03.09.23 ఆదివారం, బ. పంచమి అశ్వని, వృషభలగ్నం, రా.11.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►04.09.23 సోమవారం, బ. పంచమి అశ్విని, వృషభలగ్నం, ఉ.9.20 క్రయవిక్రయాలు. ►06.09.23 బుధవారం, బ. అష్టమి రోహిణి, వృషభలగ్నం, రా.11.02 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాధానం. ►07.09.23 గురువారం, బ. అష్టమి రోహిణి, వృశ్చికలగ్నం, ఉ.10.21 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►07.09.23 గురువారం, బ. నవమి మృగశిర, మిథునలగ్నం, రా.1.25 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►10.09.23 ఆదివారం, బ. ఏకాదశి పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 శంకుస్థాపన, క్రయవిక్రయాలు, గృహప్రవేశం, ప్రయాణాలు. భాద్రపద మాసం ►16.09.23 శనివారం, శు. విదియ హస్త, వృశ్చికలగ్నం, ఉ.10.46 డోలారోహణం, అన్నప్రాశన, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. ►17.09.23 ఆదివారం, శు. తదియ చిత్త, ధనుర్లగ్నం మ.1.53 డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. ►18.09.23 సోమవారం, శు. తదియ చిత్త, శుభ సమయం ఉ.10.30 నుంచి వినాయక చవితి పూజ గణపతి నవరాత్రులు. ►24.09.23 ఆదివారం, శు. ఏకాదశి పూర్వాషాఢ, వృశ్చికలగ్నం,ఉ.10.30 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. ►25.09.23 సోమవారం, శు. ఏకాదశి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 డోలారోహణం, అన్నప్రాశన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. ►29.09.23 శుక్రవారం, శు. పూర్ణిమ ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.2.36 క్రయవిక్రయాలు. ►30.09.23 నుంచి మహాలయ పక్షం/పితృపక్షం ముహూర్తాలు ఉండవు. ►14.10.23 మహాలయ అమావాస్య ఆశ్వయుజ మాసం ►15.10.23 ఆదివారం, శు. పాడ్యమి చిత్త, వృశ్చికలగ్నం, ఉ.8.50 శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవీ పూజలు. ►16.10.23 సోమవారం, శు. విదియ స్వాతి, వృశ్చికలగ్నం ఉ.8.45 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. ►18.10.23 బుధవారం, శు. చవితి అనూరాధ, వృశ్చికలగ్నం, ఉ.8.36 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు ►19.10.23 గురువారం, శు. పంచమి జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 సరస్వతీ పూజ. ►21.10.23 శనివారం, శు. అష్టమి ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 వివాహం, గృహప్రవేశం. ►22.10.23 ఆదివారం, దుర్గాష్టమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.11.33 అన్నప్రాశన, శంకుస్థాపన. ►23.10.23 సోమవారం, మహర్నవమి శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.8.18 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. ►24.10.23 మంగళవారం, విజయదశమి ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుంచి 11.45 లోపు విజయ ముహూర్త కాలము. ►25.10.23 బుధవారం, ఏకాదశి శతభిషం, ధనుర్లగ్నం, ఉ.10.09 ఉపనయనం, వివాహం, శంకుస్థాపన. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 సమస్త శుభాలు. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 వివాహం, గృహప్రవేశం, గర్భాధానం. ►26.10.23 గురువారం, త్రయోదశి ఉత్తరాభాద్ర, కన్యాలగ్నం, తె.4.21 వివాహం, గృహప్రవేశం. ►28.10.23 శనివారం, అశ్వయుజ పూర్ణిమ రా.1.05 నుంచి 2.22 వరకు చంద్రగ్రహణం ►01.11.23 బుధవారం, బ. చవితి మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం. ►01.11.23 బుధవారం, బ, చవితి మృగశిర, మిథునలగ్నం, రా.10.12 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, గర్భాధానం. ►09.11.23 గురువారం, బ. ఏకాదశి ఉత్తర, వృశ్చికలగ్నం, ఉ.07.18 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం. కార్తిక మాసం ►16.11.23 గురువారం, శు. తదియ మూలా, ధనుర్లగ్నం, ఉ.9.05 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►17.11.23 శుక్రవారం, శు. పంచమి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.5.41 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►18.11.23 శనివారం, శు. పంచమి ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►18.11.23 శని/ఆదివారం, శు. పంచమి/షష్ఠి శ్రవణం, తులాలగ్నం, తె.5.05 వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►19.11.23 ఆదివారం, శు. సప్తమి శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 వివాహం, గృహప్రవేశం. ►22.11.23 బుధవారం, శు. దశమి ఉత్తరాభాద్ర, మిథునలగ్నం, రా.8.55 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, గర్భాధానం. ►23.11.23 గురువారం, శు. ఏకాదశి ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.33 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►23.11.23 గురువారం, శు. ద్వాదశి రేవతి, తులాలగ్నం, తె.5.18 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ►24.11.23 శుక్రవారం, శు. ద్వాదశి రేవతి, ధనుర్లగ్నం, ఉ.8.25 వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అన్నప్రాశన. ►24.11.23 శుక్రవారం, శు. త్రయోదశి అశ్వని, మిథునలగ్నం, రా.8.41 వివాహం, గృహప్రవేశం. ►25.11.23 శనివారం, శు. త్రయోదశి అశ్వని, ధనుర్లగ్నం, ఉ.9.25 సమస్త శుభాలు. ►29.11.23 బుధవారం, బ. విదియ మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 వివాహం, శంకుస్థాపన. ►01.12.23 శుక్రవారం, బ. చవితి పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 గృహారంభం. ►02.12.23 శనివారం, బ. పంచమి పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 అన్నప్రాశన, క్రయవిక్రయాలు. ►03.12.23 ఆదివారం, బ. సప్తమి మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 గర్భాధానం, ప్రయాణం. ►06.12.23 బుధవారం, బ. నవమి ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. ►06.12.23 బుధవారం, బ. దశమి ఉత్తర, తులాలగ్నం, తె.4.30 వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. ►07.12.23 గురువారం, బ. ఏకాదశి హస్త, మిథునలగ్నం, రా.7.45 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. 08.12.23 శుక్రవారం, బ. ఏకాదశి చిత్త, మిథునలగ్నం, రా.7.41 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. మార్గశిర మాసం ►15.12.23 శుక్రవారం, శు. చవితి ఉత్తరాషాఢ, తులాలగ్నం, తె.3.56 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►20.12.23 బుధవారం, అష్టమి ఉత్తరాభాద్ర, మకరలగ్నం, ఉ.9.13 అన్నప్రాశన, వివాహం. ►20.12.23 బుధవారం, నవమి రేవతి, తులాలగ్నం, తె.3.38 వివాహం, ప్రయాణం. ►21.12.23 గురువారం, దశమి అశ్విని, తులాలగ్నం, తె.3.29 గృహారంభం ►28.12.23 గురువారం, బ. విదియ పునర్వసు, మకరలగ్నం, ఉ.8.42 గృహారంభం. ►03.01.24 బుధవారం, సప్తమి ఉత్తర, మకరలగ్నం, ఉ.8.06 అన్నప్రాశన, వివాహం, గృహారంభం. ►03.01.24 బుధవారం, సప్తమి హస్త, వృశ్చికలగ్నం తె.3.36 వివాహం, గృహారంభం. ►04.01.24 గురువారం, అష్టమి హస్త, మకరలగ్నం, ఉ.8.12 అన్నప్రాశన, వివాహం, గృహారంభం. ►05.01.24 శుక్రవారం, దశమి స్వాతి, తులాలగ్నం, రా.2.29 ప్రయాణాలు. పుష్యమాసం ►13.01.24 శనివారం, శు. విదియ శ్రవణం ఉ.11.45 డోలారోహణం, బారసాల. ►15.01.24 సోమవారం, పంచమి శతభిషం ఉ.10.09 మకర సంక్రమణం ►18.01.24 గురువారం, అష్టమి అశ్విని ఉ.10.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►21.01.24 ఆదివారం, ఏకాదశి మృగశిర, ఉ.9.45 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►25.01.24 గురువారం, పూర్ణిమ పునర్వసు ఉ.8.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. ►02.02.24 శుక్రవారం, బ.సప్తమి స్వాతి ఉ.9.15 బారసాల, డోలారోహణం, అన్నప్రాçశన. ►05.02.24 సోమవారం, దశమి అనూరాధ ఉ.7.35 బారసాల, డోలారోహణం, అన్నప్రాశన. మాఘ మాసం ►14.02.24 బుధవారం, శు. షష్ఠి అశ్విని, ధనుర్లగ్నం తె.3.54 వివాహం, గృహారంభం. ►17.02.24 శనివారం, నవమి రోహిణి, తులాలగ్నం, రా.11.40 వివాహం, గర్భాధానం. ►18.02.24 ఆదివారం, నవమి రోహిణి, మేషలగ్నం, ఉ.10.43 వివాహం, గృహారంభం. ►19.02.24 సోమవారం, దశమి మృగశిర, మేషలగ్నం, ఉ.10.39 ఉపనయనం, అక్షరాభ్యాసం, గృహారంభం. ►21.02.24 బుధవారం, త్రయోదశి పుష్యమి, తులాలగ్నం, రా.11.21 గర్భాధానం. ►24.02.24 శనివారం, పూర్ణిమ మఖ, వృషభలగ్నం ఉ.11.45 వివాహం. ►25.02.24 ఆదివారం, బ. పాడ్యమి ఉత్తర, ధనుర్లగ్నం తె.3.14 గృహారంభం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►28.02.24 బుధవారం, చవితి చిత్త, వృశ్చికలగ్నం రా.11.51 వివాహం, గృహప్రవేశం. ►02.03.24 శనివారం, సప్తమి అనూరాధ, ధనుర్లగ్నం, రా.2.49 వివాహం, గృహప్రవేశం. ఫాల్గుణ మాసం ►15.03.24 శుక్రవారం, శు.షష్ఠి రోహిణి, ధనుర్లగ్నం, రా.1.55 వివాహం, గృహప్రవేశం, ప్రయాణాలు. ►17.03.24 ఆదివారం, అష్టమి మృగశిర, వృషభలగ్నం ఉ.10.20 వివాహం, గృహారంభం, గృహప్రవేశం. ►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, వృషభలగ్నం ఉ.10.06 ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం. ►20.03.24 బుధవారం, ఏకాదశి పుష్యమి, తులాలగ్నం, రా.9.45 గర్భాధానం, ప్రయాణాలు. ►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, తులాలగ్నం, రా.9.23 వివాహం. ►22.03.24 శుక్రవారం, త్రయోదశి మఖ, ధనురలగ్నం, రా.1.31 వివాహం, గృహప్రవేశం. ►24.03.24 ఆదివారం, పూర్ణిమ ఉత్తర, వృషభలగ్నం, ఉ.9.51 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు. ►25.03.24 సోమవారం, పూర్ణిమ ఉత్తర, మేషలగ్నం, ఉ.8.19 వివాహం, గృహప్రవేశం, సకల శుభాలు. ►27.03.24 బుధవారం, బ. విదియ చిత్త, మేషలగ్నం, ఉ.8.15 ఉపనయనం, ప్రతిష్ఠ, గృహారంభం. ►27.03.24 బుధవారం, తదియ స్వాతి, ధనుర్లగ్నం, రా.1.17 వివాహం, ప్రయాణాలు. ►30.03.24 శనివారం, పంచమి అనూరాధ, వృషభలగ్నం, ఉ.9.27 ఉపనయనం, ప్రతిష్ఠ. ►01.04.24 సోమవారం, సప్తమి మూలా, మేషలగ్నం, ఉ.7.51 అక్షరాభ్యాసం. ►03.04.24 బుధవారం, నవమి ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.9.11 అన్నప్రాశన, ఉపనయనం, వివాహం. ►03.04.24 బుధవారం, దశమి శ్రవణం, తులాలగ్నం రా.8.35 వివాహం, గర్భాధానం. ►04.03.24 గురువారం, ఏకాదశి ధనిష్ఠ, ధనుర్లగ్నం, రా.12.41 వివాహం, గృహప్రవేశం. -
నవగహ్ర సంచార భాష్యాలు 2023– 24.. జరుగబోవు సంఘటనలు
► శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం వర్ధిల్లుతుంది. ► జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దయ ప్రజలకు లభిస్తుంది. ► యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ► పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడతాయి. ► అరబ్ దేశాలలో నిరసనలు. భారీ కుంభకోణాలు బయటపడతాయి. ప్రముఖుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ► ఇండోనేషియా, చైనాలో భూకంపం వల్ల అపార నష్టం. ► విజిలెన్స్, ఈడీ, సీబీఐ దాడులు సంచలనాత్మక నేర సంబంధమైన విషయాలు బయటపెడతాయి. ► సముద్ర వాతావరణంలో చెడ్డ మార్పులు దెబ్బతీస్తాయి. (అరేబియా, బంగాళాఖాతం) ► తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వనున్న బీజేపీ. ► కొన్ని రాష్ట్రాల మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటనున్న బీజేపీ ► పాకిస్తాన్, చైనాలతో భారతదేశానికి సరిహద్దు వివాదాలు శ్రుతిమించి రాగానపడతాయి, సరిహద్దులలో అప్రమత్తత, ఉద్రిక్తత వాతావరణం. ► గ్రేటర్లో ప్రతి కొనుగోలు గోల్మాల్. ► బిట్‌కాయిన్ భవిష్యత్తులో కొంపదీస్తుంది. ► పెట్రోల్ ధరలకు సమానంగా ఉల్లి ధర, కొన్ని కూరగాయలు. ► క్రీడాకారుల భద్రతా విషయంలో విశేషమైన జాగ్రత్తలు అవసరం. ► తెలంగాణలో బలం పెంచుకోనున్న కమలం. ► పెరిగిన రేట్ల వలన సామాన్య ప్రజలకు అగ్నిపరీక్షా కాలం. ► కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జలబీభత్సం, ఆర్థికనష్టం. ► కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పూర్తిగా బలహీనపడే సూచనలు ఉన్నాయి. ► చైనా కుటిల రాజకీయం బయటపడుతుంది. ► జమ్మూ, కాశ్మీర్ల విషయంలో ప్రధాని సంచలనాత్మక నిర్ణయాలు. ► ముప్పయి ఏళ్ళకే సైట్, స్పాండిలైటిస్. ఆరోగ్యం భాస్కరాదిత్యం అని గ్రహించండి. ► గో హత్యల నిషేధం దిశగా చట్టాలు అమలు. ► భారత రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్న అమిత్ షా. ► ఆయుర్వేదం మందులు అధిక ధర కలిగి ఉంటాయి. ప్రజలు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తారు. ► మమతా బెనర్జీ జాతకంలో మహారాజయోగం నడుస్తోంది. (2024) ► పామాయిల్ సాగుబడి గిట్టుబాటు అవుతుంది. ► విదేశాలలో చదువుకునే భారతీయ విద్యార్థులకు తప్పని కష్టాలు. ► చేతులెత్తనున్న ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీ, ప్రజల నెత్తిన శఠగోపం. ► దేవాలయాలలో చోరీలు అధికం అవుతాయి. ► సెల్‌ఫోన్ యువత పెడదోవ పట్టడానికి, నాశనానికి కారణం అవుతుంది. ► రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలు. ► వంట నూనెల ధరలు ఆకాశంలోకి వెళ్తాయి. ► చేదెక్కనున్న పంచదార. ► అందరికీ సూర్యుడు ముఖ్యం (సోలార్ పవర్). ► 2024వ సంవత్సరంలో రాజకీయాలలో స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది. ► డ్రంకెన్ డైనోసర్స్ విజృంభిస్తారు. నపట్టాలు ఉంటాయి కానీ భూములే ఉండవు. ► కోడిగుడ్డు, మాంసం ధరలు అధికమవుతాయి. ► వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు అధికం అవుతాయి. ► ప్రతికూల గ్రహస్థితి వల్ల విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. ► హోమియోపతి వైద్యానికి అత్యంత ఆదరణ. ► డ్రాగన్ కంట్రీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది. ► మరింత అధికం గృహ సంబంధిత పన్నులు. ► శ్రీలంక, టర్కీకి గడ్డుకాలం. ► మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. (నూనె ధరలు పెరగడం దీనికి కారణం) ► నీట మునిగే కొన్ని ప్రాంతాలు. ► ప్రకృతిలో అందం నశిస్తుంది. మనుషులలో జీవత్వం తగ్గిపోతుంది. ► ఆహారం కాలుష్యం, ఆయువు క్షీణం. ► దొంగతనాలు పెరుగుతాయి. ► చిరుధాన్యాలు మంచి ధర కలిగి ఉంటాయి. పంట వేసిన వాడికి పంట పండుతుంది. ► కొత్త రకాలైన ఆహారపు డైట్లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ► గో సంతతికి గడ్డుకాలం. ► ఇదివరకు తల్లిపాలు కొరత ఇప్పుడు పిల్లల కొరత. ► ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోనున్న నూతన జనాభా. ► డయాబెటిస్, ఊబకాయం అధికమవుతాయి. ► బ్రిటన్‌కి గడ్డుకాలం (గురువు గారు చెప్పిన దాంట్లో మార్పులేదు). ► అనాథల సంఖ్య పెరుగుతుంది. ► కొన్ని వ్యాపారాలు రాత్రికి రాత్రే మూతపడతాయి. ► నఅంతరించిపోతున్న కళలకు గుర్తింపు, సహాయం లభిస్తుంది. ► బంగారం దుకాణాలకు ఎక్కువ సెక్యూరిటీ అవసరం. ► నఇదే పద్ధతిలో ఇనుము, ఇసుక, ఇటుక, సిమెంటు. ► ఉన్నత పదవులలో ఉన్నవారికి భద్రత మరింత అవసరం. ► ఈత వస్తే సముద్రం పక్కన ఇల్లు కట్టుకోండి. ► టమాటాలు, డ్రగ్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ► నసౌరశక్తి వ్యాపారాలు బాగుంటాయి. ► అంగవైకల్యంతో ఉన్నవారికి శుభవార్త. ► మెడికల్ రంగంలో నూతన మార్పులు కలిసివస్తాయి. ► అన్ని దేశాల జీడీపీ గణనీయంగా మారబోతుంది. ► వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. శ్వాసకోస వ్యాధులకు మందులు దొరకవు ► విమానం నడిపేవారికి దారి కనబడక గమ్యం మారుతుంది. ► భూకంపాలు కనివిని ఎరుగని రీతిలో పెరుగుతాయి. నూతన ప్రదేశాలకు ఇవి వ్యాప్తి చెందుతాయి. ► నీటి కాలుష్యం పెరుగుతుంది. ► ప్రకృతి బీభత్సాల వల్ల కలిగిన నష్టం అందరికీ సమానంగా అందుతుంది. ► ఇవి బీద, బిక్కు, పేద, గొప్ప, అధికారి అన్నది లేకుండా పెద్ద దేశాలు, చిన్న దేశాలు అనేది లేకుండా బాధిస్తాయి. ► బియ్యం, కందిపప్పు. మినపపప్పు దినుసులు సామాన్యుడికి దొరకడం కష్టం అవుతుంది. ► పేకముక్కలలాగా నేలకొరిగే కట్టడాలు. ► రాగి, మట్టిపాత్రల ప్రాధాన్యత పెరుగుతుంది. ► దంచికొట్టనున్న ఎండలు. ఇంట్లో ఉండలేము, బయటకు వెళ్ళలేము. ► ఆర్గానిక్ పంటల ప్రాధాన్యం పెరుగుతుంది. ► నిమ్మకాయల వాడకం పెరుగుతుంది (అధిక ధర కలిగి ఉంటాయి). ► ఎలక్టాన్రిక్ వెహికిల్స్ వాడకం పెరుగుతుంది. ► పురాణ కట్టడాలే కాదు నూతన కట్టడాలు కూలిపోతాయి. ► పెరిగిపోనున్న రేడియేషన్. అంతరించిపోనున్న మరికొన్ని పక్షులు. ► జమ్ము కాశ్మీర్‌కు శుభవార్త, కట్టుదిట్టమైన భద్రతా వలయంలో కాశ్మీర్. ► కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, బ్యాంకులో భద్రంగా ఉన్నాయి (ఋణాలు) ► గ్యాంబ్లింగ్‌లో కొత్త అధ్యాయాలు, పోలీసులకు చుక్కలు. ► వృద్ధాశ్రమాలకు అడ్వాన్స్‌లు, డిపాజిట్లు. ► పోపు లేకుండా పులిహోర ప్రసాదం. ► బ్రిటన్ ప్రధానమంత్రికి గడ్డుకాలం. ► అన్నింటికీ లోన్లు ఇచ్చే బ్యాంకులు మధ్యాహ్న భోజనానికీ లోన్ ఇస్తాయి. ► ఆఫ్రికా ఖండానికి ఆకలి బాధలు. ► అగ్నిప్రమాదాల్లో అంతరించి పోనున్న జీవరాశులు. ► రణరంగంగా మారనున్న భారతదేశం. ► పాకిస్తాన్లో ప్రకృతి బీభత్సం ఎక్కువ అవుతుంది. ► యూరప్‌కు గడ్డుకాలం. ► ధాన్యము కరువు వాటిల్లుతుంది. ► ఇండియన్ మిలటరీ బలోపేతం శత్రువులను భూస్థాపితం. ► తీవ్రవాదుల చర్యలు విస్తరిస్తాయి. ► అగ్రరాజ్యం అమెరికా చీకటిమయం. ► నార్త్ కొరియా వార్తల్లో ఉంటుంది. ► ప్రపంచ దేశాలన్నింటినీ వణికించనున్న యుద్ధభయం. ఎవరు ఎక్కడి నుండి యుద్ధం మొదలు పెడతారో, బాంబులు పడతాయో అనే భయంతో, ఆందోళనలో ప్రజలు. ► ఓల్డేజ్ హోవ్‌ులో సౌకర్యాలు పెరుగుతాయి. శేషజీవితం గడపడానికి అనువైన ప్రదేశం. ► అకాల వర్షాలు ఈసారి కూడా రైతులపట్ల జాలి చూపవు. పంట నష్టం తప్పకపోవచ్చు. ► హైదరాబాద్ చుట్టూ భారీగా పెరగనున్న భూముల ధరలు. ► బ్యాంక్ రుణాల వడ్డీలు, యూజర్ చార్జీలు సామాన్యుడి నడ్డి విరుస్తాయి. ► మెన్స్ క్రికెట్‌కే కాదు ఉమెన్స్ క్రికెట్‌కి కూడా అభిమానుల ఆదరణ పెరుగుతుంది. ► సైబర్ నేరాలు అధికమవుతాయి. ► కారు కొనుక్కోవడానికి బతిమాలి అప్పు ఇస్తారు బియ్యం కొనుక్కోవడానికి బిచ్చం కూడా కష్టం. ► ప్రత్తి పంటకు సువర్ణకాలం. ► భవిష్యత్‌కు బంగారు బాట నీటి వ్యాపారం. ► ప్రజలలో తగ్గిపోనున్న రోగనిరోధక శక్తి. ► అనేక రైలు వంతెనలకు, బ్రిడ్జిలకు నూరేళ్ళు నిండాయి. ► గడ్డి దొరకని గడ్డుకాలము మూగ జీవుల పట్ల కాఠిన్యం వహించిన దైవం. ► పేలుళ్లు, అగ్నిపర్వతముల ప్రకంపనలు నిత్య దీపావళితో సమానం. ► క్రీడా, వైద్యరంగంలో భారత్‌కు ప్రపంచ ప్రఖ్యాతి. ► మన దేశ సహాయ సహకారాలు చాలా దేశాలకు అవసరం అవుతాయి. ► సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానం. ► ఫిబ్రవరి నుండే మనకు ఎండాకాలం ప్రారంభం. ► ఉక్కు, స్టీలు పరిశ్రమలకు అనుకూల కాలం. ► భయం నీడలో మానవుడు భద్రత లేని జీవితాలు. ► చెట్ల పెంపకం అధికమవుతుంది. ► రష్యాతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కన్నా, ఉక్రెయిన్ను సమర్థిస్తున్న దేశాలకే ఎక్కువ ప్రమాదం, నష్టం వాటిల్లుతుంది. ► పాకిస్తాన్‌కు తాలిబాన్లతో, ప్రకృతితో ఇబ్బందులు ఏర్పడుతాయి.తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. కోలుకోలేని విధంగా పాకిస్తాన్ ననష్టపోతుంది. ► టర్కీ, జపాన్, ఇండోనేషియాలో భూకంపాల పరంపర కొనసాగుతుంది. ► చైనా భవిష్యత్తు బట్టబయలవుతుంది. వేసుకున్న ప్రణాళికలు బయటపడతాయి. ► వైద్యుల పంట పండించనున్న మధుమేహ రోగులు. ► యుద్ధం సంభవిస్తే జ్యోతిష ఫలితాలలో మార్పులు వస్తాయి. ► ఏ వ్యక్తి జాతకంలోనూ ఆయుఃప్రమాణం పరిశీలించలేదు. చదవండి: శ్రీ శోభకృత్నామ సంవత్సర పండుగల జాబితా ఇదే -
Dos Donts List: అమంగళమైన చేష్టలు.. ఈ పనులు చేయకండి!
► బొట్టు లేకుండా ఉండటం, కాటుక పెట్టుకోకపోవడం (అధికారం, ఆచారం కలిగినవాళ్ళు) ► గడపలపై కూర్చోవటం ► నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం. ► ఎడమ చేతితో పిల్లలను కొట్టటం (కుడి చేత్తో కొడితే శుభమని అర్థం కాదు). ► స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం (ఉతికిన బట్టలు ఉండి కూడా) ► రాత్రిపూట ఇళ్ళు చిమ్మటం, అన్నం ఎత్తి పడవేయటం ► కూర్చున్న కుర్చీల కింద, పీటల కింద నీళ్ళు చిమ్మటం (పోయటం) ► కాళ్ళు దాటుకుంటూ వెళ్ళటం (నడవటం) ► రోళ్ళు, రోకలిబండ, పాత్రలు కడగకుండా ఉంచటం ► చీకట్లో భోజనం చేయటం, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయటం ► భోజనం చేసి స్నానం చేయటం, సహపంక్తి భోజనాలలో మధ్యలో లేచిపోవటం ► భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం (అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు) ► అన్నం తింటూ చేతులు నాక్కోవటం ► బుసలు కొడుతూ కాఫీ, టీ వంటివి తాగటం ► అదేపనిగా కాళ్ళు ఊపడం ► ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయటం ► అన్నం చిన్నముద్దలుగా చేసి గాలిలో ఎగరవేస్తూ నోటితో లాఘవంగా పట్టుకొని తినడం ► మంగళ సూత్రాలతో నారింజ, బత్తాయి వంటి పండ్లను కోయడం. (మంగళ సూత్ర లోహము నిత్య ఉపయోగార్థమైన వస్తువు కాదు. పవిత్రతకు మాంగల్యానికి చిహ్నము) ► మంచం మీద కూర్చుని భోజనం చేయటం ► దీపారాధనకు ఒక్కటే వత్తి వెలిగించటం, దీపాన్ని నోటితో ఊది ఆర్పివేయటం ► అదేపనిగా ఉమ్మి వేయటం, పళ్ళు కుట్టుకోవడం, చెవులలో పుల్లలు పెట్టి కెలకటం, గోళ్ళు కొరకటం, కనుబొమ్మలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు) ► రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకొనుట (రంగస్థల కళాకారులు కానివారు) ► మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం. -
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది : గ్రహాలు వాటి స్వభావాలు
రవి ఏకాదశ రుద్రులలో ఒకడైన సూర్యభగవానుడు నవగ్రహాలకు నాయకుడు. అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి. సింహరాశ్యాధిపతి. సూర్యునకు అతి సమీపంలోకి గురు, శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు మౌఢ్యమి ఏర్పడుతుంది. రాహువు, కేతుగ్రస్తమైనా రవి గ్రహణం ఏర్పడుతుంది. రవి దశ నడుస్తున్నవారు; సింహరాశి వారు; కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు శివాలయంలో సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఆరోగ్యానికి, అధికారానికి, దర్పమైన జీవితానికి, సమాజంలో భయభక్తులు గల మానవులుగా జీవించడానికి రవి కారకుడు. విష జ్వరాలకు, కంటిరోగాలకు రవి కారకుడు. సూర్యారాధనలో తర్పణం ముఖ్యమైనది. ఉదయం, సాయంత్రం, సూర్యాస్తమయంలోపు సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయాలి. రవి ప్రభావం చేత జాతకునకు అనువంశికంగా వచ్చే ప్రయోజనాలు, దుర్నిమిత్తాలు సంభవిస్తాయి. తరతరాలుగా వస్తున్న సిరిసంపదలకు సూర్యుడే కారకుడు. భూదాన గుణం, అనువంశిక, వృత్తి, వైద్యం, పదవి, ప్రజాప్రాతినిధ్యం సూర్యగ్రహం వలనే సంప్రాప్తిస్తాయి. ఆత్మగౌరవానికి, అహంకారానికి, మితిమీరిన ఆత్మవిశ్వాసానికి రవి కారకుడు. రవి జాతకులు ఇష్టంలేని వాస్తవాలను గ్రహించరు. పొగడ్తలకు పొంగిపోతారు. నిజాయితీపరులు వీళ్ళ పక్కన ఉండలేరు. భజనపరులకే చోటు ఉంటుంది. కుజ, గురు, చంద్ర, బుధులతో మిత్రత్వం కలిగిన వాడు, శుక్ర, రాహు, కేతువులు, శత్రువులు. కుమారుడైన శనితో బద్ధవైరం కలిగినవాడు. స్థిరమైన భావాలకు, సంప్రదాయాలకు రవి కారకుడు. ఉన్నా లేకపోయినా గంభీరంగా ఉంటారు. విశేషమైన ఖర్చులు చేస్తారు. వీటిల్లో చాలావరకు అపాత్రదానం అవుతాయి. వీళ్ళ పేరు మీద విద్యాసంస్థలు, చెరువులు, బావులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, సేవా సదనాలు ఉంటాయి. సుదీర్ఘ రాజకీయ జీవితానికి రవి గ్రహమే కారణం. ప్రజలతో సంబంధాలు ఉంటాయి గాని, వాళ్ళతో కలిసిపోరు. పూర్వీకుల నుంచి వస్తున్న ప్రజాబలం వల్లనే గెలుస్తారు. రాజకీయ పదవిని కూడా ప్రభుత్వ ఉద్యోగం మాదిరి చేస్తారు. ఉద్యోగం నిజాయితీగా చేస్తారు. నేరస్తులను వ్యక్తిగత శత్రువులుగా భావిస్తారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయరు. పై అధికారుల మాట, మంత్రుల మాట వినరు. భార్య విషయంలోనూ వీళ్ళు స్వతంత్రంగానే వ్యవహరిస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం పోగొట్టుకొని అప్పుల పాలయినా చెక్కు చెదరరు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వైద్యవృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన సూర్యగ్రహ ప్రభావం చేత అపర ధన్వంతరిగా పేరు గాంచుతారు. వైద్య విధానంలో నూతన విషయాలు కనుగొంటారు. మూలికల మీద, చెట్లమీద మంచి పరిజ్ఞానం ఉంటుంది. అల్లోపతిలో కూడా అద్భుతంగా రాణిస్తారు. బీద కుటుంబంలో పుట్టినా, కష్టపడి చదివి అధికార పదవి చేపట్టడానికి రవి గ్రహం కారణం. నైపుణ్యాని కన్నా స్నేహానికి ప్రాధాన్యమిస్తారు. గుప్త దానాలు చేస్తారు. కళాసాహిత్య రంగాలలో ప్రఖ్యాతి సాధిస్తారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి న్యాయం చేస్తారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. జీవిత చరమాంకంలో అన్ని రకాల ఐహిక సుఖాలను పరిత్యజిస్తారు. రవి గ్రహ (సూర్యుని) లక్షణాలు : క్రమశిక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలని సుఖం లేకుండా శ్రమ జీవితాన్ని గడుపుతారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు ప్రాధాన్యమిస్తారు. కులగౌరవం, వంశగౌరవం పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక విషయాల్లో గట్టి మనుషులుగా ప్రఖ్యాతి వహిస్తారు. చేసిన దానధర్మాలకు, మంచి పనులకు పెద్దగా ప్రచారం రాదు. కఠినంగా వ్యవహరించే వ్యక్తులుగా పేరు వస్తుంది. సన్నిహిత, సేవకవర్గం ఏ పని అయినా కొంత ఆలస్యంగానయినా చేయించుకో గలుగుతారు. వీళ్లను భయపెట్టి లొంగదీసుకునే యత్నాలు ఫలించవు. బంధువుల వల్ల సన్నిహిత రక్త సంబంధీకుల వల్ల, పర స్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొంతకాలం అజ్ఞాత వాసం, అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. రాజకీయ రంగంలో ప్రారంభం నుంచే ఆధిక్య స్థితి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉండి సామాన్యులను దూరం చేసుకుంటారు. సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాలలోని వారికి దూరం అవుతారు. శిరోవేదన, పార్శ్యపు నొప్పి, కీళ్ళ నొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా కృషి చేస్తారు. లేక అనేక ఉద్యోగుల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. స్థాయి లేని వ్యక్తుల్ని మీకు పోటీగా నిలిపి వాళ్ళను బలవంతులను చేసి, మీకు పోటీగా నిలపాలనే యత్నాలు అత్యున్నత స్థానాలలోని వ్యక్తులు చేస్తారు. ఇందుకు మీ సొంత ధనం, ప్రోత్సాహం కూడా తోడవుతుంది. కొనుగోలు చేసిన ఆస్తులు వివాదాస్పదం కావచ్చు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా రాణిస్తాయి. శనిదశ కూడా మంచిగానే ఉంటుంది. స్నేహితులు చేసే సహాయ సహకారాలు జీవితంలో మరువలేనివిగా ఉంటాయి. మహోన్నత ఆశయ సాధన ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభించడం, జీవితంలో చెప్పుకోదగిన అంశం. సిద్ధ గంధంతో శివార్చన, ఆంజనేయస్వామి ఆరాధన వల్ల మరింత వృద్ధి సాధించ గలుగుతారు. మే నెల సాధారణంగా బాగుంటుంది. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. సంతానం వల్ల మంచి ప్రఖ్యాతి వస్తుంది. శ్లో: జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరవ్ మీ జాతకంలో రవి అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతిగారిని సంప్రదించండి. శుక్రుడు శుక్రుని ఆరాధించడం వలన అపమృత్యుభయం ఉండదు. విలాస జీవితం, స్త్రీ, వివాహ సౌఖ్యం, సుఖనిద్ర, విలాస వస్తువుల సేకరణ, అధునాతనమైన భవంతి, బహు వాహనాలు, నవనాగరికతకు తగిన వేషభాషలు, సౌందర్య ఆరాధన– ఇలాంటివన్నీ శుక్రగ్రహ అధీనంలో ఉంటాయి. సర్వ ఐహిక సుఖకారకుడు శుక్రుడు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్ర నక్షత్రములు, వృషభరాశి, తులారాశి శుక్రగ్రహ స్వరాశులు, మీనరాశి, శుక్రునకు ఉచ్చక్షేత్రము, కన్యారాశి నీచక్షేత్రము. స్త్రీ సంతానానికి శుక్రుడే కారకుడు. పురుష జాతకంలో కళత్ర కారకుడు, స్త్రీ జాతకంలో భర్తృకారకుడు. శుక్ర జాతకులు తమ జీవితంలో స్త్రీలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వీరి జీవితంలో యోగావయోగాలు స్త్రీలపై ఆధారపడి ఉంటాయి. భార్య, ప్రేయసి, స్నేహితురాళ్లు గ్రహస్థితిని బట్టి ఎవరో ఒకరు జీవితంలో ప్రధానమైన మార్పులకు కారకులవుతారు. వివాహానంతరం గొప్ప స్థితి, ధనం, సౌందర్యం కలిగిన స్త్రీ భార్యగా లభించడం శుక్రగ్రహ ప్రభావమే! శుక్రగ్రహ జాతకులు పదుగురిలో గుర్తింపు పొందే ప్రవర్తన, వేష భాషలు, రూపం కలిగి ఉంటారు. మద్యం సేవించినట్లయితే అసభ్యంగా ప్రవర్తించి, గౌరవం పోగొట్టుకుంటారు. రాజకీయాలు లేనిచోట కూడా రాజకీయాలు నడపడం, తన మాట వినని వారి పతనం కోరుకోవడం, తన పరోక్షంలో సమాజం తన గురించి ఏమి చెప్పుకుంటుందో వాకబు చేయడం, నిఘాలు వేయడం, హితవు చెప్పే వాళ్ల మీద పగ పెంచుకోవడం, భజనపరులను చేరదీయడం, స్థాయి దిగజార్చుకొని పరులను పొగడడం, సన్మాన, సత్కార సభలు జరపడం, తనకు మళ్ళీ జరిపించుకొనడం వీరి దైనందిన జీవితంలో ఒక భాగం. సినీ కళాకారుల జాతకంలో శుక్ర గ్రహస్థితి ముఖ్యమైనది. రాజకీయ రంగంలో కొంతకాలం మాత్రమే రాణించగలరు. పరస్త్రీలతో రహస్య ప్రవర్తనం, శారీరక శ్రమ చేయకపోవడం, మేధస్సుతోనే మంత్రాంగం, సౌఖ్యమైన వృత్తి, ఉద్యోగాలు వీరికి సంప్రాప్తిస్తాయి. తల్లితో, సహోదరీ వర్గంతో అనుబంధం ఎక్కువ. ఆడవాళ్ళతో కలిసిపోయి వాళ్ళకు తగినట్లుగా ప్రవర్తించడం, జనులు హేళన చేసినా, అదీ ఓ గుర్తింపుగా భావించి పొంగిపోవడం, స్త్రీ దేవతా భక్తి, పిసినారితనం, సామాజిక న్యాయంపై చులకన, తన స్థాయివారిని కించపరచడం, తనకన్నా అధికులను కాకా పట్టడం, పూల మొక్కలు పెంచడం, కళాత్మకమైన వస్తు సేకరణ, అలంకరణ, ఓర్పు తక్కువ, క్రమశిక్షణ లేకుండుట, ఒకేసారి రెండుమూడు పనులు చేయడం, ఎదుటివారి మనస్సులోని మాట గ్రహించగలగడం, అబద్ధాలు చెప్పడం, సౌఖ్య విలాస జీవితాన్ని గడపడం, వీరి యోగ కారక లక్షణాలు. వీరికి ఉన్న పుత్రికా వాత్సల్యం చెప్పనలవికానిది. కొడుకుల పట్ల సామాన్యమైన అనుబంధమే. జాతక చక్రప్రకారం శుక్రుడు, శత్రు, నీచక్షేత్రాలలో ఉన్నట్లయితే కళత్ర వియోగం. ద్వికళత్ర యోగం, త్రికళత్ర యోగం, ప్రేమ వివాహం వల్ల అపఖ్యాతి, అవయోగం, అన్యస్త్రీ బానిసత్వం, వ్యసనం, బద్దకం పరాకాష్టకు చేరి స్త్రీ సంపాదన మీద జీవించుట, వృత్తి, ఉద్యోగం లేకుండా బిజీగా తిరుగునట్లు నటించడం వంటి లక్షణాలు కలుగుతాయి. నీచక్షేత్ర శుక్రస్థితి వల్ల భార్యతో అన్యోన్యత లేకుండుట, ప్రేమ వివాహ వైఫల్యం, విడాకులు రాకపోవడం, స్త్రీలు జీవితాన్ని పాడుచేయడం, చిన్నచిన్న గుడ్డలతో సంకోచం లేకుండా నలుగురిలో తిరగడం వంటి లక్షణాలు సంప్రాప్తిస్తాయి. స్త్రీ జాతకంలో యోగకారక శుక్రుని ఫలితంగా అతి సౌందర్యవతి, అహంభావం, శారీరక బలహీనత, ఉన్నత విద్య, వైద్యవృత్తి, సినిమా, మోడలింగ్ రంగాల్లో రాణించగలరు. భర్త, పిల్లలపైన నియంత్రణ సాధించి బద్దకంతో పనిచేయక, అనారోగ్య లక్షణాలు వల్లెవేస్తుంటారు. సమాజసేవ, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ఉత్సాహంగా పాల్గొంటారు. భర్తను అత్తమామల నుండి విడదీయడం, అర్థంలేని సామాన్లు కొని డబ్బు నాశనం చేయడం, భర్తకు తెలియకుండా అప్పులు చేయడం, కోడళ్లను వేధించడం, నడుంనొప్పి, రక్తస్రావం, పచ్చకామెర్లు, లోబీపీ వీరి రోగ లక్షణాలు. భర్త, పిల్లల వల్ల సౌఖ్యం, గౌరవం. పుట్టినింట్లో సామాన్య స్థితి, వివాహానంతరం గొప్ప స్థితి, రుచికరమైన వంటలు చేయలేకపోవుట, సంకుచిత స్వభావం, మంచి జ్ఞాపకశక్తి వీరి లక్షణాలు. శుక్రగ్రహ లక్షణాలు :– జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఎత్తులకు పైఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. స్థిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పుచేసి అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు, ఎక్కువమంది అభిరుచి ఎలా ఉంటుందో తేలిగ్గా తెలుసుకోగలరు. కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు.గతం మరచి ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటారు. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన వ్యాపారాల్లో రాణిస్తారు. ముఖ్యంగా శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసివస్తాయి. విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా ఖర్చు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. పడమటి, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించాలి. దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవీ పూజ కలిసి వస్తుంది. ప్రజాబలం, సంఘంలో మంచిపేరు, సన్నిహిత సహచర వర్గం అండదండలు అనుసరించి నడిచే వర్గం ఉంటారు. అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు. మేధస్సు, స్వీయవిద్య, సాంకేతిక పరిజ్ఞానం, అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు. శ్లో: హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం ప్రణమామ్యహవ్ మీ జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతిగారిని సంప్రదించండి. గురువు (బృహస్పతి) ఇంద్రునికి అన్ని విధాలా తోడ్పడటం, అవసరమైన సమయాలలో సలహాలను ఇచ్చి దేవతలను ఆదుకోవడం దేవగురువు బృహస్పతి కార్యక్రమాలు. శుభకార్యాలకు, ముహూర్తాలకు బృహస్పతి బలం చాలా ప్రధానం. గురువు రాశి మారినప్పడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు సంప్రాప్తిస్తాయి. గురువు ధన కారకుడు. జీవితంలో స్థిరత్వానికి, హోదా కలిగిన ఉద్యోగానికి, అందానికి ఈ గ్రహమే కారణం. సమస్త శుభకార్యాలకు గురుబలం కలిగిన ముహూర్తం అవసరం. తరతరాల విద్య, విజ్ఞాన పాండిత్యాలు, సనాతన సంప్రదాయాలు, తరగని స్థిరాస్తులు లభించడానికి గురువే కారణం. అనువంశిక అధికారానికి, కీర్తిప్రతిష్ఠలకు ఈ గ్రహమే కారణం. సమాజంలో మంచిని ప్రోత్సహించడం, అబద్ధాలను సహించ లేకపోవడం ఈ గ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి. బంగారానికి గురువు అధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు బృహస్పతి అధిపతి. గురుగ్రహ జాతకులు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాము నమ్మే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అపార శాస్త్ర పరిజ్ఞానం, జ్ఞానం వంటివి గురుగ్రహ అనుకూలత వల్ల సంప్రాప్తిస్తాయి. న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా ప్రఖ్యాతి సాధిస్తారు. ప్రలోభాలకు లొంగకుండా తన స్థానానికి న్యాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో వీళ్ళకు అందరూ సమానమే! గురుగ్రహ జాతకులు వాక్పటిమ, తేజస్సు కలిగి ఉంటారు. గురుగ్రహ లక్షణాలు: నిజాయితీ, సామర్థ్యం, పరిజ్ఞానం వీళ్ళ జీవితంలో ఓ భాగంగా నడుస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, తగిన సలహాలు ఇస్తారు. నిర్ణయాలు తీసుకునే బాధ్యత వాళ్ళకే వదిలేస్తారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళరు. తన మాట కాదన్న వాడిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. ధనం దానికదే వస్తుంది. వీళ్ళ క్రమశిక్షణా పద్ధతులు, జీవన విధానం ఆచరించాలంటే కలియుగంలో సాధ్యపడదు. దేశభక్తి, దైవభక్తి, వృత్తి ఉద్యోగాల పట్ల అంకితభావం ఉంటుంది. ఇన్ని మంచి గుణాలు ఉన్నా, వీళ్ళకు కుటుంబపరంగా మనశ్శాంతి ఉండదు. భార్యతో విభేదాలు, సంతానంతో తెగదెంపులు సంభవిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల పరువు–ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. సంతానం ‘పండిత పుత్రః పరమ శుంఠః’ సామెతను నిజం చేస్తారు. బంధువుల ఎదుట వినయ విధేయతలు నటించి కావలసిన పనులు చక్కబెట్టుకుంటారు. పక్కకు వెళ్ళి తిట్టుకుంటారు. సహోదర, సహోదరీ వర్గానికి ధర్మబుద్ధితో వీళ్ళు చేసే సహాయం పూర్తి వ్యతిరేక ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులు సృష్టించే హీన చరిత్రలో బంధువులు భాగస్వాములవుతారు. 16 వేలు గురుగ్రహ జపం–శనగలు దానం ఇవ్వాలి. నిత్యం వైష్ణవ దేవతార్చన చేయాలి. మంచి లాభాలు, పేరు సంపాదిస్తారు. సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. భూ సంబంధ వ్యాపారాలు కలసివస్తాయి. ఆస్తి విలువ పెరగడమే ధనవంతులు కావడానికి కారణం అవుతుంది. వ్యాపార కూడలి ప్రదేశాలు అద్దెకు ఇచ్చి, అమ్మే అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం వల్ల కుటుంబ ప్రతిష్ఠ పెరుగుదల ఎలా ఉన్నా వాళ్ళ స్థితి మాత్రం బాగుంటుంది. వాళ్ళ మనస్తత్వం, పద్ధతులు ఏవిధంగా ఉన్నా అదృష్టం కలసి వస్తుంది. జీవిత ప్రారంభంలో తెలిసీ తెలియక చేసిన నిర్ణయాలు, పనులు మంచిగా మలుపు తిరుగుతాయి. చిన్న పాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు. అసమర్థులను జాలిపడి అందలం ఎక్కిస్తారు. ఆ అసమర్థులే అఖండులై, బలమైన ప్రత్యర్థులుగా తయారవుతారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయబడిన శక్తి ఉంటుంది. స్వయంకృతాపరాధాలను సరిదిద్దుకోలేరు. సొమ్ము, పదవి, ప్రయోజనాలు కొన్ని సందర్భాలలో కోల్పోయినా, ఇతురులు మీ వల్లనే వాటిని పొందారన్న పేరు సమాజంలో వినిపిస్తుంది. హస్తవాసి మంచిదని అందరూ మెచ్చుకుంటారు. ఫిబ్రవరి, అక్టోబరు నెలల్లో ప్రారంభించే వ్యాపార, వ్యవహారాలు బాగుంటాయి. భాగస్వామ్యంలో కొంతకాలం మాత్రమే లాభపడతారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత కష్టకాలం ఎదుర్కొంటారు. సహోదర, సహోదరీ వర్గం బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పై అధికారుల వల,్ల కిందిస్థాయి సిబ్బంది వల్ల ఏకకాలంలో సమస్యలు వస్తాయి. ఋణాల విషయాల్లో అసత్య ప్రచారాలు చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలలో నెగ్గుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా, ఆధ్యాత్మికంగా అనేక రంగాలలో అనుభవం సాధిస్తారు. మనుషుల మనస్తత్వం తెలుసుకోవడంలో విజయం సాధిస్తారు. మీకంటే వెనుక వచ్చిన వాళ్ళు మిమ్ములను దాటి ముందుకు పోయినా, వాళ్ళకన్నా ఆధిక్యాన్ని దీర్ఘకాలంలో సాధించగలుగుతారు. పెద్దలు స్థిరాస్థులు పోగొట్టినా, స్వయం శక్తితో సాధించుకోగలుగుతారు. శత్రువర్గంపై విజయం సాధిస్తారు. సొంత వాళ్ళ వల్ల ఎదురయ్యే సమస్యలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పడమర, దక్షిణం, ఉత్తరం దిశలు అనుకూలము. కుబేర కంకణ ధారణ వల్ల ఆర్థిక, వృత్తిపరమైన స్థిరత్వం కలుగుతుంది. శ్లో: దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతివ్ు మీ జాతకంలో గురువు అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతి గారిని సంప్రదించండి. శని నవగ్రహాలలో శనైశ్చరుని స్థానం ప్రత్యేకమైనది. శని ఇచ్చే ఫలితాలు శుభఫలితాలైనా, అశుభఫలితాలైనా విపరీతంగా ఉంటాయి. శనికి ప్రత్యధిదేవత ఈశ్వరుడు. శని రాజ గ్రహాలతో ప్రబల విరోధం గలవాడు. రాజరికానికి, నియంతృత్వానికి వ్యతిరేకి. శ్రమ జీవితం, వైరాగ్యం, సమధర్మం శనిగ్రహ లక్షణాలు. తమ్ముడు తనవాడయినా న్యాయం అందరికీ సమానమేనన్న వర్తన కలిగినవాడు. ప్రజా సంబంధాలు, ప్రజాదరణ, ఖండాంతర ఖ్యాతి, అధికారం, సాంకేతిక విద్యలు, ఉద్యమాలకు నాయకత్వం, జీవితాశయ సాధనకు సౌఖ్యాలను త్యాగం చేయుడం, సామూహిక మేలు కోసం పోరాడటం శనిగ్రహ లక్షణాలు. శని ఆయుర్దాయ కారకుడు. అనేక రంగాల్లో అత్యున్నత స్థితి, భోగభాగ్యాలు అనుభవించడానికి, శాశ్వత కీర్తివంతుడు కావడానికి శని కారకుడు. శని విశేష రాజయోగం ఇవ్వగలడు. శని దుష్ప్రభావాలు మాత్రమే ఇస్తారన్న ప్రచారం సరియైనది కాదు. ఉత్తరాభాద్ర, పుష్యమి, అనూరాధ నక్షత్రాలకు శని అధిపతి. కుంభ, మకర రాశులకు శని అధిపతి. ఏలిననాటి శని నడుస్తున్నప్పుడు ఎన్నో బాధలు వస్తాయని, దివాలా తీస్తారని, సర్వనాశనం జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఏలిననాటి శని కాలంలో రాజయోగం పట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయుష్కారకుడైన శని బలాన్ని పరిశీలించిన తర్వాత జాతకాలలో ఇతర అంశాలు పరిశీలించాలి. విశేషమైన జనాకర్షణ, రాజకీయ అధికారం, ప్రజా సంబంధాలు స్వయంశక్తి, ఆయుర్దాయం, రహస్య జీవనం, సన్యాసం, నైతిక ధర్మం, చట్ట ఉల్లంఘన, ఈశత్వం, ప్రాప్తి, ప్రతీకారం మొదలైనవి శనైశ్చరుని స్థితిననుసరించి, జాతకునికి సంప్రాప్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, విశేష జననాశనం, ప్రజా ఉద్యమాలు శని సంచార స్థితిననుసరించే ఉంటాయి. ఎవ్వరికైనా ఏల్నాటి శని ప్రభావం తప్పదు. శని దశ, అంతర్దశ, ఏల్నాటి శని కాలాలలో శని స్వతంత్రించి మహరాజయోగాన్ని, సిరి సంపదల్ని, రాజకీయ అధికారాన్ని, గొప్ప యోగం ఇవ్వగలడు. ఏల్నాటి శని కాలంలో, శని మహర్దశ, అంతర్దశలలో ఎందరో మంత్రులు, ధన అధికార మదాంధులు, సామాన్య మానవుడు సైతం అనుభవించని దుర్భర కష్టాలు అనుభవించి నహుషభ్రష్టత పొందారు. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రాలకు శని కారకుడు. కలియుగంలో నవగ్రహాలలో శనికి మించి అధిక శుభయోగం ఇవ్వగల గ్రహం మరొకటి లేదు. జాతకచక్రంలో తానున్న స్థితిని అనుసరించి, వివిధ రంగాలలో యోగాన్ని, తన దశ, అంతర్దశలలో, ఏల్నాటి శని కాలంలో ఇస్తాడు. జాతకరీత్యా శని యోగకారకుడైనప్పుడు అధికారం, సిరిసంపదలను ఇచ్చినా, తానున్న భావం సరిగా లేనప్పుడు, జాతకుడు తనకంటే పెద్దదైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం, లేక కులాంతర వివాహం చేసుకుని, అయిన వాళ్ళకు శత్రువై దూరంగా జీవించడం, భార్యావియోగం, ఏకాంత జీవితం, అనేక మంది సేవకుల మధ్య ఉన్నా, ఒంటరితనం అనుభవిస్తారు. ఇది కళత్ర విషయంలోనే గాదు, ఏ భావానికైనా, సహోదరులు, దాయాదులు, బంధువులు, ధైర్యసాహసాలు, పరువు–ప్రతిష్ఠలు, సంతానం, ఆరోగ్యం, పదవి, కీర్తి–కోర్టు వ్యవహారాలు దేనిమీదనైనా తన ప్రభావం, యోగాన్ని వృద్ధి చేసి భావాన్ని దెబ్బతీస్తాడు. శని తానున్న భావాన్ని వృద్ధి చేస్తాడా, చెడు చేస్తాడా అనేది వ్యక్తిగత జాతకచక్రంలో స్థితిని బట్టి ఉంటుంది. శనిగ్రహ జాతకులు నైతిక ధర్మానికి ప్రాధాన్యమిస్తారు. చేసిన మేలు మరువరు. పదేపదే కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అపకారం చేసిన వాళ్ళకు పదింతలు చెరుపు చేయనిదే వాళ్ళు విశ్రమించరు. కుంభ నిక్షిప్త భుజంగంలా సమయం కొరకు వేచి దెబ్బతీస్తారు. శత్రువుల పట్ల క్షమాగుణం ఉండదు. వీరి జ్ఞాపకశక్తి వీళ్ళ శత్రువులకు శాపం. వృద్ధుల పట్ల, స్త్రీల పట్ల శ్రద్ధ వహించి కులమత భేదాలు లేకుండా ప్రవర్తిస్తారు. ప్రత్యర్థులు వీరిని ఏమి చేయలేరు. నిద్రలేమిని భరిస్తారు. అన్నపానాదులు లేక శ్రమిస్తారు. శని దశలో లేక ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అధికమైన శుభ సంబంధిత రాజయోగం లేక తత్సమానమైన యోగాన్ని అనుభవిస్తారు. శని కాలభైరవ ఉపాసకుడు. శని గ్రహ సాధారణ లక్షణాలు :– శనిగ్రహ జాతకులు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని మేధస్సును సొంతం చేసుకుంటారు. ఎక్కువగా వింటారు, మంచి మాటకారితనం ఉంటుంది. ఎదుటి వాళ్ళు మోసం చేయనంత వరకూ ఇతరులను మోసం చేద్దామన్న ఆలోచనే రాదు. బంధుప్రీతి, స్నేహితుల పట్ల అవ్యాజమైన అనుబంధం వీరి లక్షణం. తన లోపం తెలుసుకున్నాక చేసిన పొరపాటును తిరిగి చేయరు. తన తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. అందరిని సమభావంతో ప్రేమగానే చూస్తారు. తాను ద్వేషించే వ్యక్తులను అభిమానించే వారిని శత్రువులుగానే చూస్తారు. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. సాత్విక స్వభావం, మాటమీద నిలబడే తత్వం ఉంటుంది. నైతిక బాధ్యతలకు ప్రాముఖ్యతనిస్తారు. నమ్మిన వాళ్ళ కోసం పరిశ్రమిస్తారు. సాధారణ శరీర సౌష్టవం. అమితమైన జ్ఞాపకశక్తి, రచనా వ్యాసాంగం, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి, ఉద్యోగాలలో విశేషమైన నిపుణత ఉంటుంది. వీళ్ళు చేసే ఏ పనికీ ఇతరులు ప్రత్యామ్నాయం అని చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే వీళ్ళ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం దోచుకోబడతాయి. ధనం ఏదో రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి. అభిమానించే ప్రజానీకం, నమ్మిన అనుచర వర్గం ఉంటారు. స్త్రీల వలన అదృష్టం కలసి వస్తుంది. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుపాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. అంతకుమించి ఇబ్బంది కలగదు. బంధువర్గం కన్నా బయటి వారి సహాయ సహకారాలు బాగా అందివస్తాయి. జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు వంటివి ఇబ్బంది పెడతాయి. శ్లో: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజవ్ ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరవ్ మీ జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా? లేక ప్రతికూలంగా ఉన్నాడా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి శ్రీమతి ములుగు శివజ్యోతి గారిని సంప్రదించండి. -
బుద్ధులను బట్టి జాతకాలు నడుస్తాయా?
గ్రహస్థితిని అనుసరించి మంచి, చెడు ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర సిద్ధాంతము. అన్ని శాస్త్రాలకెల్లా వేదం గొప్పది. ఈ వేదానికి ధర్మం, న్యాయం, సత్యం అనునవి మూలాధార స్తంభాలు. ధర్మాన్ని అనుసరించి ఎవరికీ వారు సక్రమంగా నడుచుకుంటే ప్రపంచస్థితి, దేశస్థితి ఇప్పటికంటే భిన్నంగా ఉండేది. మార్పు ఎక్కువ మందిలో కలిగితేనే సమాజంలో మంచి అయినా, చెడు అయినా ప్రభావం చూపుతాయి. ధర్మం ప్రస్తుతం ఒంటి కాలుమీద కూడా నడవడం లేదు. పూర్తిగా చతికిల బడిపోయింది. స్వార్థం, కోరికలు, విలాసాలు, క్షణికావేశం అనే అగ్నిజ్వాలలు ధర్మాన్ని చుట్టుముట్టాయి. అందుకే ప్రపంచంలో అశాంతి, అరాచకం అధికమయ్యాయి. మన దేశం గురించి చెప్పాలంటే ధర్మం చాలా రంగాల్లో క్షీణించింది. ఆ ప్రభావం ప్రకృతి రూపంలో, మహమ్మారి వ్యాధుల రూపంలో మనదేశాన్ని బాధించింది, బాధిస్తుంది. సామూహిక బాధలు, భయాలు, వ్యక్తిగత బాధలు, మానసిక ఒత్తిడి అధికం అవుతున్నాయి. వీటన్నింటికీ కారణం కేవలం గ్రహస్థితి ఒక్కటే కాదు, మానవులు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు, ప్రవర్తన, ధర్మాతిక్రమణ కూడా కారణం. ఎక్కడ చూసినా స్వార్థం, సంకుచిత స్వభావం, అసూయ, అధికమయ్యాయి. నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. కృతజ్ఞత అనేది కుందేటి కొమ్ములా వెదికినా కనిపించనిది. వ్యక్తుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, సంస్థల పట్ల కృతజ్ఞత లేకపోవడం, ఈ రకమైన స్వార్థం పెరిగిపోవడం తప్పక పరిశీలించదగినది. పెద్దంతరం, చిన్నంతరం దాదాపుగా మృగ్యమైపోయింది. ధర్మాన్ని, నైతిక ధర్మాన్ని మానవుడు విస్మరించి అశాంతిని కొని తెచ్చుకుంటున్నాడు. గ్రహస్థితి బాగాలేదని బాధపడడానికి, దేవుడు దయచూపలేదని విమర్శించే వారికి ముందు ఆత్మపరిశీలన అవసరం. చూడలేని ప్రతి అంశానికి గ్రహస్థితిని, దేవుడిని అడ్డం పెట్టడం అవకాశవాదం అవుతుంది. భగవంతుడు, గ్రహాలు మనకిచ్చిన విజ్ఞానంతో మనం ఏ మేరకు ధర్మాన్ని రక్షించి సక్రమంగా ప్రవర్తించామో పరిశీలించుకోవలసిన సమయం ఆసన్నమైంది. మన చేతలు, బుద్ధులు కూడా అనుకూల ఫలితాలకు కారణం అవుతుందన్న విషయం గ్రహించుట మేలు. స్వదేశాన్ని, స్వజనులను, భగవంతుడిని, తల్లిదండ్రులను మరచిపోకుండా చేతనయినంతలో నీ ధర్మాన్ని నీవు సక్రమంగా నిర్వర్తించు. ఈ విధమైన చైతన్యం అందరిలో కలిగినప్పుడు ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే ప్రకృతి శాంతిస్తుంది. గ్రహ బాధలు తగ్గి, దుస్సంఘటనలు దూరం అవుతాయి. మానవుని స్వార్థం అధికమైనప్పుడు, మేధస్సు వికటించినప్పుడు చేదుఫలితాలే దక్కుతాయి. ఇందుకు దైవాన్ని, జాతకులను, గ్రహాలను విమర్శించడం, విశ్లేషించడం వృథా. ధర్మో రక్షతి రక్షితః -
శ్రీ శోభకృత్నామ సంవత్సర పండుగల జాబితా ఇదే
మార్చి 2023 22. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది 24. రంజాన్ ప్రారంభం 26. మత్స్య జయంతి 30. శ్రీరామ నవమి ఏప్రిల్ 2023 01. గురుమౌఢ్యమి ప్రారంభం కామద ఏకాదశి, రేవతి కార్తె 05.బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం 06.హనుమాన్ జయంతి 07.గుడ్ ఫ్రైడే 09.సంకటహర చతుర్థి, ఈస్టర్ సండే 11.జ్యోతిరావు ఫూలే జయంతి 12 షహదత్ హజ్రత్ అలీ 14.అంబేద్కర్ జయంతి అశ్వని కార్తె 18. మాసశివరాత్రి, వరాహ జయంతి 22. పరశురామ జయంతి, రంజాన్ 25. శ్రీ ఆదిశంకర జయంతి, రామానుజ జయంతి 28. భరణి కార్తె మే 2023 01.అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కార్మిక దినోత్సవం 04. నరసింహ జయంతి 05. బుద్ధ పూర్ణిమ అన్నమయ్య జయంతి డొల్లుకర్తరి ప్రారంభం 08. సంకటహర చతుర్థి 11. నిజకర్తరీ ప్రారంభం 12.కృత్తిక కార్తె 14.హనుమజయంతి 15.మతత్రయ ఏకాదశి 17.మాసశివరాత్రి 19.శనైశ్చర జయంతి 25.రోహిణి కార్తె 31.నిర్జల ఏకాదశి జూన్ 2023 02.తెలంగాణ అవతరణ 04.ఏరువాక పౌర్ణమి 07.సంకటహర చతుర్థి 08.మృగశిర కార్తె 15.కూర్మ జయంతి 16.మాసశివరాత్రి 17.వటసావిత్రి వ్రతం 20.పూరీ జగన్నాథ రథోత్సవము 21.అంతర్జాతీయ యోగాదినోత్సవము 23.ఆరుద్ర కార్తె, స్కంద పంచమి 24.కుమారషష్ఠి 25.భానుసప్తమి, బోనాలు ప్రారంభం 29.తొలి ఏకాదశి, బక్రీద్ జూలై 2023 01.శని త్రయోదశి 03.గురు పూర్ణిమ 06.పునర్వసు కార్తె సంకటహర చతుర్థి 15.మాసశివరాత్రి, శనిత్రయోదశి 16.హైదరాబాద్ బోనాలు ప్రారంభం 17.దక్షిణాయనం ప్రారంభం 20.పుష్యమి కార్తె 29.మొహర్రం ఆగష్టు 2023 03.ఆశ్లేష కార్తె 04.సంకటహర చతుర్థి 08.శుక్ర మౌఢ్యమి ప్రారంభం 14.మాసశివరాత్రి 15.స్వాతంత్య్ర దినోత్సవం 17.మఖ కార్తె 19.శుక్రమౌఢ్యమి త్యాగం 21.నాగ పంచమి 25.వరలక్ష్మీ వత్రం 27.మతత్రయ ఏకాదశి 31.రాఖీ పౌర్ణిమ, పుబ్బకార్తె సెప్టెంబరు 2023 03.సంకటహర చతుర్థి 05.బలరామ జయంతి గురు పూజోత్సవము 07.శ్రీకృష్ణాష్టమి 10. మతత్రయ ఏకాదశి 12.మాసశివరాత్రి, ఉత్తర కార్తె 14. పోలాల అమావాస్య 18. వినాయక చవితి 25.పరివర్తన ఏకాదశి 28. హస్త కార్తె, మిలాద్ ఉన్ నబీ, అనంత పద్మనాభ వ్రతం 29.మహాలయ పక్షాలు ప్రారంభం అక్టోబరు 2023 01. ఉండ్రాళ్ళతద్ది 02.సంకటహర చతుర్థి, గాంధీ జయంతి 10. మతత్రయ ఏకాదశి 11.చిత్త కార్తె 12.మాస శివరాత్రి 14.మహాలయ అమావాస్య బతుకమ్మ ప్రారంభం 15.దేవినవరాత్రులు ప్రారంభం 22.దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ 23.మహర్నవమి 24.విజయ దశమి 28.వాల్మీకి జయంతి, చంద్రగ్రహణం 31.అట్లతద్ది నవంబరు 2023 01.సంకటహర చతుర్థి 07.విశాఖ కార్తె 11.ధన త్రయోదశి, మాసశివరాత్రి శని త్రయోదశి, ధన్వంతరి జయంతి 12.దీపావళి 14.బాలల దినోత్సవం 15.భగినీ హస్త భోజనం 17.నాగుల చవితి 19.భానుసప్తమి 20.అనూరాధ కార్తె డిసెంబరు 2023 03.జ్యేష్ఠ కార్తె 11.మాసశివరాత్రి 13.పోలిస్వర్గం 16.మూల కార్తె 17.ధనుర్మాస ప్రారంభం 18.సుబ్రహ్మణ్య షష్ఠి 22.గీతా జయంతి ముక్కోటి ఏకాదశి 24.హనుమత్ వ్రతం 25.క్రిస్మస్ 26.దత్తజయంతి 29.పూర్వాషాఢ కార్తె 30.సంకంటహర చతుర్థి జనవరి 2024 01.ఆంగ్ల సంవత్సరాది 07.అందరికీ ఏకాదశి 10.మాసశివరాత్రి 11.ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం 14.భోగి 15.మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం 16.కనుమ 17.ముక్కనుమ 24.శ్రావణ కార్తె 29.సంకటహర చతుర్థి ఫిబ్రవరి 2024 06.ధనిష్ఠ కార్తె 08.మాసశివరాత్రి 09.చొల్లంగి అమావాస్య 14.శ్రీపంచమి 16. భీష్మ ఏకాదశి, శతభిష కార్తె మార్చి 2024 04. పూర్వాభాద్ర కార్తె 08. మహాశివరాత్రి, మాసశివరాత్రి 12. రంజాన్ నెల ప్రారంభం 17.ఉత్తరాభాద్ర కార్తె 21.నృసింహ ద్వాదశి 23. శని త్రయోదశి 26. హోలీ 28. సంకటహర చతుర్థి 31. రేవతి కార్తె ఏప్రిల్ 2024 06.శని త్రయోదశి 07. మాసశివరాత్రి 09. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది -
కర్మ తప్పక వెంటాడుతుంది.. తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి భోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్టుడ్రి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసినా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?’ అని నిలదీస్తాడు. అందుకు కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద గువ్వల జంట ఒకటి వాటి గూట్లో గుడ్లతో నివసిస్తోంది. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అవి చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు‘ అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. ‘కర్మ అంతగా వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు?’ అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది’ అని వివరిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడి అంతరార్థం. 1.చంద్రుడు : అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దంలో దిగంబరముగా చూసుకోవడం, వెక్కిరించడం వంటి చేష్టలు చేయకూడదు. 2.గురువు : సర్వ శాస్త్రాలు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువును కించపరచితే గురుదేవునికి ఆగ్రహం కలుగుతుంది. గురువులను పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది. 3.బుధుడు : బుధుడికి చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటే కోపం. అందునా బుధవారం ఈ పని అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, జ్ఞానం ఉంది కదా అని విర్రవీగినా బుధుడు ఆగ్రహిస్తాడు. 4.శని : శనికి పెద్దలను కించపరచినా, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపం. తల్లిదండ్రులను చులకన చేసినా సహించడు. సేవక వృత్తి చేసిన వారిని శని కాపాడతాడు. 5.సూర్యుడు : పితృదేవతలని దూషిస్తే రవికి కోపం. సూర్యుడు నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదు. 6.శుక్రుడు : శుక్రుడికి భార్య భర్తనుగాని, భర్త భార్యనుగాని కించపరిస్తే కోపం. శుక్రుడు ప్రేమ కారకుడు. లకీ‡్ష్మ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు, మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టం. 7.కుజుడు : అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపం. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు. 8.కేతువు : జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడితే కేతువు ఆగ్రహిస్తాడు, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరం చేయవలసిన కార్యాలు చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది. 9.రాహువు : వైద్యవృత్తి పేరుతో మోసగించినా, సర్పాలకు హాని చేసినా రాహువు ఆగ్రహిస్తాడు. భ్రమకు, మాయకు రాహువు కారకుడు. శివదీక్ష నవగ్రహానుగ్రహము శ్రీమన్నారాయణునిచే శ్లాఘించబడిన మహత్తరమైన శాశ్వత శుభత్వమును కలుగజేయునదే శివదీక్ష. పార్వతీమాత పరమశివుని అనుగ్రహము కొరకు, స్వామిని వివాహము చేసుకోవడానికి కఠోరమైన శివార్చన నిర్వహించినది. లోకమాత పార్వతి మండువేసవిలో పంచాగ్నుల మధ్య, శీతకాలములో తడి వస్త్రము ధరించి, వర్షాకాలమందు జడివానలో సదాశివుని స్మరించి, శివదీక్ష నిర్వర్తించి, స్వామి కటాక్షము పొందినది. అర్ధ శరీరమును పొందగలిగినదా గౌరీ మనోహరి. శివదీక్షాపరులకు పరమేశ్వరుని అనుగ్రహము నిశ్చయము. శుభయోగమును అనేక సంవత్సరములు పొందగలరు. శివదీక్షను స్వీకరించిన కార్తికేయుడు సర్వదేవతా సేనాధిపతి అయినాడు. అర్జునుడు పాశుపతాస్త్రమును శివముఖతః పొందగలిగాడు. శివదీక్ష మానవునికి వంశానుగత శాశ్వత శుభయోగమునిస్తుంది. ఏలిననాటి శని శివదీక్షపరునికి అధికార ప్రాప్తిని, రాహువు ఆకస్మిక ధనమును, విదేశీ వ్యవహారములయందు విజయప్రాప్తిని, కుజుడు భూ సంపదలను, రవి ఆరోగ్యమును, గురువు ఉన్నత విద్య, సువర్ణ ఆభరణములను, కీర్తి ప్రతిష్ఠలను, శుక్రుడు కళత్ర వాహన సౌఖ్యములను, కేతువు విఘ్నములను హరించి అమృత యోగమును ఇస్తారు. చంద్రుడు జల సంపదలను, మనోబలమును ప్రసాదిస్తాడు. నవగ్రహములు, ద్వాదశ ఆదిత్యులు, నక్షత్ర మండలములు, శివాజ్ఞను అనుసరించి సంచరించును. శివదీక్ష స్వీకరించి తరించండి ! దీక్షా నియమములను సక్రమముగా పాటించండి. -
ఉగాది పంచాంగం: నవనాయక ఫలితాలు భవిష్య భారతం (2023– 2024)
రాజు– బుధుడు: అధికారంలో ఉన్నవారు వ్యాపార ధోరణిలో ప్రభుత్వాలు నడుపుతారు. ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల మధ్య అభిప్రాయాల భేదాలు తలెత్తుతాయి. అధిక పన్నులు తప్పవు. సామాన్య మానవుడికి తినడానికి, తాగడానికి, నివసించడానికి అయ్యే ఖర్చులు అందుబాటు ధరల్లో ఉండవు. భారతదేశం తీసుకున్న కీలక నిర్ణయాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆయుర్వేద, జ్యోతిష మొదలగు అరుదైన శాస్త్రాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున మద్దతు లభిస్తుంది. దేశ ఆహార పద్ధతులలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలో మార్పులు సంభవిస్తాయి. ప్రపంచ స్థాయిలో దేశాలకు దేశాల మధ్య స్నేహం కాకుండా వ్యాపారధోరణి ఆలోచనలు తలెత్తుతాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్య నియమాలు పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. నూనె లేకుండా వంటలు చేసుకోవలసిన పరస్థితి సంభవిస్తుంది (ఆరోగ్య నియమం కాదు నూనె కొనలేని పరిస్థితులు ఏర్పడుతాయి.) చర్మ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. పెద్ద నాయకులు సభలు ఏర్పాటు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అపశ్రుతులు సంభవించే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయి. ప్రముఖ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. ధాన్యాధిపతి– శని: అన్నదాన సత్రాలు అధికమవుతాయి. లోకంలో కనివిని ఎరుగని స్థాయిలో వృద్ధాశ్రమాలు అభివృద్ధి చెందుతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ధాన్యం అపరాల దిగుబడి తగ్గుతుంది. ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి. పురుగుమందులు ఎక్కువగా ఉపయోగించబడిన పదార్థాలను స్వీకరించి తద్వారా అనేకరకాలైన రోగాలకు గురయ్యే అవకాశం ఉంది. మన సంస్కృతికి విరుద్ధమైన పోషక విలువలు లేని రకరకాల ఆహారపదార్థాలు, పానీయాలు మార్కెట్లో చలామణీ అవుతాయి. ఉచిత సేవాకేంద్రాలో కూడా వాణిజ్యపరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. నువ్వులు, జొన్నలు, రాగులు, ఉలవలు అందుబాటులో ఉంటాయి. పశుదాణాకు కొరత ఏర్పడుతుంది. అకాల వర్షాల వల్ల, వడగళ్ళవాన వల్ల, ఈదురు గాలుల వలన ధాన్య సంపదకు, పంటలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. వివిధ రకాలైన పంట పొలాలకు నష్టం కలుగుతుంది. అర్ఘ్యాధిపతి– గురువు: వేదాధ్యయనం బాగా జరుగుతుంది. తిరిగి వేదాభ్యాసాన్ని ఆశ్రయించేవాళ్ళు అధికమవుతారు. వేదమంత్రాలతో దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అతివృష్టి, అనావృష్టి కొనసాగుతుంది. అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష ప్రయాణాలలో అపశ్రుతులు చోటుచేసుకుంటాయి. ప్రజలలో దానగుణం పెరుగుతుంది. వేదపాఠశాలలు పునరుద్ధిరించబడతాయి, అరుదైన శాస్త్రాలను సంరక్షించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. అధికంగా పిల్లలలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన విద్యను నేర్చుకోవాలనే ఉబలాటం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న నేపథ్యంలో ఆలోచిస్తారు. మేఘాధిపతి– గురువు: అతివృష్టి, అనావృష్టి, పిడుగుపాటులు, వడగళ్ళ వానలు సంభవం. సముద్రంలో ఆటుపోట్లు ప్రపంచస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఆస్తి నష్టం తప్పదు. జలప్రళయాలు వస్తాయి. ఆస్తినష్టం సంభవిస్తుంది. సముద్రమధ్య దీవులకు యమగండ కాలం దాపురిస్తుంది. భూకంపాలు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రకృతి నిర్దయ ప్రపంచానికి తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. సునామీలు వచ్చే అవకాశం ఉంది. అగ్నిపర్వతాలు పేలడం సర్వసాధారణం అవుతుంది. మంత్రి– శుక్రుడు: మంత్రిత్వం బ్రాహ్మణ గ్రహమైన శుక్రుడికి రావడం మంచిదే. పాలకుల ఆలోచనా విధానం, అభివృద్ధికి వ్యూహాలు బాగుంటాయి.అయితే ఆచరణలో మాత్రం తగిన ఫలితాలు రావు. అధికార పక్షానికి, విపక్షాలకు ఎన్నడూ లేని విధంగా సంగ్రామం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంటుంది. ముఖ్య నాయకుల అసహజ మరణం తీవ్రవిషాదానికి దారితీస్తుంది. పండ్లు, పూలు, స్వీట్లు, మద్యం అధిక ధరలు కలిగి ఉంటాయి. విదేశీ వివాహాల వ్యామోహం అన్ని హద్దులను దాటిపోతుంది. పర్వతప్రాంతాలలో దుస్సంఘటనలు సంభవిస్తాయి. ప్రేమ వివాహాలు, విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. మారుపెళ్ళిళ్ళ ప్రస్తావన నిత్యకృత్యంగా మారుతుంది. కవులు, కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్నపిల్లలు కళాసాంస్కృతిక వైజ్ఞానిక రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. బాలమేధావులను చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి లోనవుతుంది. కులమతవర్గ వివక్షలు అధికమవుతాయి. మత మార్పిడులు దేశాన్ని ఒక కుదుపు కుదుపుతాయి. మద్యం వినియోగం అధికమవుతుంది. అనేక రంగాలలో రాజకీయంగా, సామాజిక రంగాలలో, నేరచరిత్రలో స్త్రీల పాత్ర గణనీయంగా పెరుగుతుంది. భార్యా బాధితులు అధికమవుతారు. యువతీ యువకులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సంస్కృతీ సంప్రదాయాలకు దూరంగా ఉంటారు. యువత మద్యం, మాదక ద్రవ్యాల వలన నిర్వీర్యమవుతారు. సైన్యాధిపతి– శుక్రుడు: రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. సైనికుల వలన దేశానికి ప్రఖ్యాతి లభిస్తుంది. చాలా ప్రదేశాలలో ప్రభుత్వానికి పోటీగా తీవ్రవాద శక్తులు బలోపేతమవుతాయి. హ్యాకర్స్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆంతరంగిక భద్రతా వ్యవస్థకు గడ్డుకాలం. జైలు నుంచి పారిపోయే ఖైదీల సంఖ్య అధికమవుతుంది. స్త్రీలు అనేక రంగాలలో విశేషంగా రాణిస్తారు. క్రీడా, వైద్య, సాంస్కృతిక రంగాలలో స్త్రీలకు అఖండ ఖ్యాతి వస్తుంది. స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, వేధింపులు అధికమవుతాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. మారణాయుధాల వినియోగం, కొనుగోలు, రక్షణ బడ్జెట్ అధికమవుతుంది. సైన్యాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత రక్షణ రంగం బలపడుతుంది. అద్భుతమైన వ్యూహాలు రచించి, శత్రుదేశాలకు కొరకరాని కొయ్యగా తయారవుతుంది. సెక్యూరిటీ రంగంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. చాలామంది స్త్రీలు ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికవుతారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, షూటింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింన్ తదితర క్రీడారంగాలలో స్త్రీలు బాగా రాణిస్తారు. రసాధిపతి– బుధుడు: ప్రజాపోరాటాలు అధికమవు తాయి. బంగారం సహా లోహాలన్నీ ధర కలిగి ఉంటాయి. పెట్రోలు, డీజిల్ హింసాత్మక సంఘటన లలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మారణాయుధాల వినియోగం అధికమవుతుంది. చింతపండు, నూనె, దాల్చినచెక్క, అల్లం, నెయ్యి, పాలు, పెరుగు, హోమ ద్రవ్యాలు, పూజా, అలంకార సామాగ్రి, ఆయుర్వేద మూలికలు ధర కలిగి ఉంటాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యులకు అనుకూల కాలం. చేతివృత్తుల వారికి ఊరట లభిస్తుంది. సంప్రదాయ వస్తువులకు, సామాగ్రికి ఆదరణ పెరుగుతుంది. నీరసాధిపతి– చంద్రుడు: చంద్రునికి నీరసాధిపత్యం వచ్చినందున నిజమైన సాహిత్య కళాకారులకి గుర్తింపు లభిస్తుంది. ప్రజాదరణ లభిస్తుంది. ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఇబ్బందులు ఏర్పడుతాయి. ముఖ్య స్థానాలలో ఉన్న నాయకులపై లైంగిక ఆరోపణలు, స్కావ్ులు, ఇతర ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. దాచిపెట్టుకున్న సొమ్ము మనకు అందకుండా ఎక్కడ ఉందో అని రోజూ బాధపడుతున్న వారికి ఒక శుభవార్త అందుతుంది. వాళ్ళ డబ్బులు ఎవరు కొట్టేశారో, ఏ బడాబాబుల దగ్గర ఉన్నాయో బట్టబయలు అవుతుంది. దంత సమస్యలు అధికమవు తాయి. తైవాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలలో ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందే అవకాశం ఉంది. ప్రకృతి ముందు మానవుడు బలహీనుడని మరోసారి రుజువు అవుతుంది. కలుషితమైన ఆహారం, పానీయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆత్మహత్య ధోరణి ప్రపంచ స్థాయిలో అధికమవుతుంది. మంచినీళ్ళు తాగటం కూడా ఓ పెద్ద వరంగా మారుతుంది. సస్యాధిపతి– చంద్రుడు: జల ఉపద్రవాల వల్ల అనేక ప్రాంతాల్లో బీభత్సం సంభవిస్తుంది. కంట్లో నీళ్ళు, ఇంట్లో నీళ్ళు, త్రాగేందుకు మాత్రం నీళ్ళు దొరకవు. చంద్రుడికి సస్యాధిపత్యం రావడం వలన కళా సంబంధమైన, వినోద సంబంధమైన విషయాలు ప్రజలకు వైషమ్య సందేశాలను అందజేస్తాయి. భార్యాభర్తల మధ్య, యువతీ యువకుల మధ్య ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. కన్నవారి ప్రేమాభి మానాలు, రక్తసంబంధీకులు ప్రేమానురాగాలను సైతం తూకం వేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు చలామణీలో ఉంటాయి. అన్నిరకాల ధాన్యం, నిత్యవసర సరుకుల ధరలు విశేషంగా పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు హెచ్చుగానే ఉంటాయి. దేశ ఆర్థిక పరిస్థితి వెనుకంజలో ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం చాలా ముఖ్యమైనది.