శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం రవి భరణీ నక్షత్ర 3వ పాదంలో ప్రవేశించు కాలమే డొల్లుకర్తరీ ప్రారంభం. దీనిని చిన్నకర్తరీ అని కూడా అంటారు. రవి కృత్తికా నక్షత్రంలో ప్రవేశించు కాలమే నిజకర్తరీ ప్రారంభం. రవి రోహిణీ నక్షత్ర 2వ పాదంలో ప్రవేశించు కాలమే కర్తరీ త్యాగము. ఈ కర్తరీ దినాలలో వాస్తు సంబంధ నూతన గృహారంభ, గృహప్రవేశాదులు చేయరాదు. కర్తరీలో చేయదగిన కార్యములు సూర్యుడు భరణి, కృత్తిక నక్షత్రాలలో ఉండే కాలంలో వివాహం, యజ్ఞం, మండపాదుల నిర్మాణం చేయవచ్చును.
కర్తరీలో చేయదగని కార్యములు కర్తరీలో చెట్లు నరకడం, నారతీయడం, విత్తనాలు వేయడం, భూమిని తవ్వడం, కొత్త గ్రామాల నిర్మాణం, క్షౌరం, తోటలు వేయడం, చెరువులు, బావుల తవ్వకం, కొత్తబండినెక్కడం వంటి పనులు చేయరాదు. 05.05.2023 శ్రీ శోభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుక్ల పౌర్ణమి, శుక్రవారం రోజున ‘డొల్లుకర్తరీ’ ప్రారంభము అవుతుంది. 11.05.2023 శ్రీ శోభకృత్‌నామ సంవత్సర వైశాఖ బహుళ షష్ఠి గురువారం రోజున నిజకర్తరీ ప్రారంభమవుతుంది. 28.05.2023 శుక్ల అష్టమి, ఆదివారం రోజున నిజకర్తరి త్యాగం. మౌఢ్యమి నిర్ణయం ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యునికి సమీపంగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం మాత్రం శుభగ్రహాలైన గురు శుక్రులకు శక్తిహీనతను మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రుని శక్తిహీనతే ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య. గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమి గానూ, శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీనినే మూఢమి అని కూడా అంటారు. ఈ మౌఢ్యమి శుభకార్యాలకు పనికిరాదు. ఈ సంవత్సరం గురుమౌఢ్యమి 01.04.2023 చైత్ర శుక్ల ఏకాదశి, శనివారం నుంచి 02.05.2023 వైశాఖ శుక్ల ద్వాదశి, మంగళవారం వరకు. శుక్రమౌఢ్యమి 08.08.2023 అధిక శ్రావణ బహుళ సప్తమి మంగళవారం నుంచి 18.08.2023 నిజ శ్రావణ శుక్ల విదియ శుక్రవారం వరకు.
మకర సంక్రమణం మకర సంక్రాంతి పండుగ 15.01.2024 15వ తేదీ ఉదయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పుష్కరాలు 22–04–2023 శ్రీ శోభకృత్‌నామ సంవత్సరర వైశాఖ శుక్ల విదయ శనివారం నుంచి గంగానదికి పుష్కరాలు ప్రారంభం. చంద్రగ్రహణం శ్రీ శోభకృత్‌నామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల పౌర్ణమి 28–10–2023 శనివారం రోజున రాహుగ్రస్థ చంద్రగ్రహణం. స్పర్శకాలం రా.1.04, మధ్యకాలం రా.1.43, మోక్షకాలం రా.2.33, గ్రహణ పుణ్యకాలం 1.25 గం.
Comments
Please login to add a commentAdd a comment