Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Kumbha Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Kumbha Rasi-Ugadi Rasi Phalalu 2023: ఆ విషయాల్లో జాగ్రత్త! ఇక సినీ, కళా పరిశ్రమల వారు..

Published Mon, Mar 20 2023 1:34 PM | Last Updated on Mon, Mar 20 2023 6:30 PM

Yearly Rasi Phalalu Aquarius Horoscope 2023 - Sakshi

(ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2)
కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ద్వితీయ తృతీయ స్థానాలలో గురు రాహువుల సంచారం, అష్టమ నవమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, లగ్నంలో శని సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి అవకాశాలు చేతికి అందివస్తాయి. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది.

ప్రజాకర్షణ పెరుగుతుంది. సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. లిఖితపూర్వక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణం అని ప్రచారం జరుగుతుంది. ఆత్మీయులతో విభేదాలు కొద్దికాలం చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళు, పాదాల నొప్పులు, ఈఎన్‌టీ సమస్యల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది.

రహస్యంగా ఋణాలు చేస్తారు. రహస్యంగా దానాలు, సహాయం చేస్తారు. ఆదాయ మార్గాలు అప్పటికప్పుడు ఏర్పడుతాయి. పూజలలో, ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఒక అవకాశం వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి.

ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇందుకు రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భూములు, ఇళ్ళ క్రయ విక్రయాలలో లాభపడతారు. వైరివర్గంతో తాత్కలికంగా సయోధ్య కుదురుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో అధికంగా జోక్యం చేసుకునే వాళ్ళకు ప్రాధాన్యత తగ్గించి, వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు.

పోటీపరీక్షలలో విజయాలు, ప్రభుత్వ ఉద్యోగం మొదలైనవి లాభిస్తాయి. రాజకీయ పదవీ ప్రాప్తి లభిస్తుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొంతకాలం రక్తసంబంధీకులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో వెన్ను నొప్పి బాధిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా, ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి.

విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట వినడం బంధువులలో ఆశ్చర్యానికి కారణమవుతుంది. మిత్రుల సహకారం, ప్రోత్సాహం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలికి వస్తాయి. ఏటీఎం కార్డులు, క్రెడిట్‌ కార్డులు మొదలైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా వుండాలని భావించినా, కాలం అందుకు సహకరించదు. సంవత్సర ద్వితీయార్ధంలో సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు.

వ్యాపారంలో లాభాలు సంతృప్తికంగానే ఉంటాయి. ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించండి. స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. చాలా సందర్భాలలో కృషి ఫలిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సినీ, కళా పరిశ్రమలలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఒకచోట భూమిని అమ్మి వేరేచోట కొంటారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకో గలుగుతారు. కుటుంబసభ్యులకు బంగారు ఆభరణాలు కొని ఇవ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది. సమాజంలో అఖండఖ్యాతి లభిస్తుంది. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి.

సమాజంలో ఉన్నతవర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు. మీపై వచ్చిన ఆరోపణలు, నిందలు మరుగునపడతాయి. చాలామంది మీ పట్ల నమ్మిక కలిగి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించి స్త్రీల దగ్గర నమ్మకాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. దూరప్రాంతయానం లాభిస్తుంది. దూరప్రాంతంలో విద్య అభ్యసించ గలుగుతారు.

వైవాహిక ఇబ్బందులు ఏదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యం అవుతుంది. ప్రేమ వివాహాలు కలిసిరావు. పునర్వివాహం కొరకు ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, రాహు కేతుగ్రహ దోషపరిహార కంకణం లేదా రూపు ధరించాలి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా మీరు చేసిన ఆర్థిక సహాయం వల్ల గృహంలో అశాంతి ఏర్పడుతుంది.

చేతగాని వాళ్ళకు, ఎందుకూ పనికిరాని వాళ్ళకి, సోమరిపోతులకు మీరు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ అనుకూలంగా ఉన్నాయి.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మీ పలుకుబడి, నమ్మకమే అనేక విషయాల్లో మీ విజయానికి, లాభాలకు కారణమవుతాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ప్రేమ వివాహాల పట్ల మీకున్న సదాభిప్రాయం పూర్తిగా పోతుంది.

జీవితభాగస్వామి నిరంకుశ ధోరణి, మీ కాపురంలో ఇతరుల జోక్యం మానసిక వేదనకు, కఠినమైన నిర్ణయాలకు కూడా కారణమవుతాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. శాశ్వతంగా విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది.

అందరికీ కాదు. అన్ని విషయాల్లోనూ విజయం సాధించి, శక్తి సామర్థ్యాలతో, ఐశ్వర్యంతో, అధికారంతో, పొలిటికల్‌ పవర్‌తో ఈ సమాజానికి సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంటారు. అదే కోణంలో మీరు విజయం సాధిస్తారు. పొగిడిన వాళ్ళని దూరంగా పెడతారు, విమర్శించిన వాళ్ళని దగ్గరగా తీసుకుంటారు. అనంత కాలచక్రం ఎవ్వరి కోసం ఆగదని గ్రహిస్తారు. విద్య విషయాలు అనుకూలిస్తాయి.

పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రైవేట్‌ కంపెనీల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇతరుల ప్రోత్సాహంతో ఉన్నత విద్య అభ్యసిస్తారు. వివాహాది శుభకార్యాల విషయం వివాదస్పదం అవుతుంది. శక్తి సామర్థ్యాల వల్ల ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సంతాన విషయాలలో పురోగతి బాగుంటుంది.

విదేశాలలో చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అవకాశం లభిస్తాయి. అవివాహితులైన స్త్రీలకి వివాహం కుదురుతుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నా, నష్టాలు రాకుండా బయటపడతారు. నిర్మాణ విషయాల్లో నాణ్యతకు ప్రాధాన్యతను ఇస్తారు. చేతివృత్తులు, అలంకార వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు మధ్యమంగా వుంటాయి. నూనె, ఆహారధాన్యాల వ్యాపారాలు చాలా బాగుంటాయి.

ఫైనాన్స్‌ వ్యాపారం చేయదగినది కాదు. సహోదర, సహోదరీ వర్గంతో సంబంధాలు మెరుగుపడతాయి. హనుమాన్‌ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కోర్టుతీర్పులు అనుకూలంగా వుంటాయి. మానసికంగా మీకు అశాంతి కలిగించేలా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు. నూతన కంపెనీ ఏర్పాటు కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఉద్యోగ విషయాలు, ప్రమోషన్లు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement