Rasi Phalalu 2023
-
ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి.. ఆస్తులు కొంటారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.అష్టమి ప.1.24 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: స్వాతి రా.1.08 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.52 నుండి 12.40 వరకు,అమృతఘడియలు: ప.3.14 నుండి 5.01 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.45. మేషం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు కొంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.వృషభం...పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.మిథునం...ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలోఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం...మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.సింహం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.కన్య....మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవచింతన.తుల....శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.వృశ్చికం...సోదరులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు...వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.మకరం....వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.కుంభం...సన్నిహితులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.మీనం..పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత. -
ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు
వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. -
ఈ నూతన సంవత్సరాన ఈ రాశి వారికి ఋణ విషయాలలో విచిత్ర స్థితి
మిథున రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6. మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి. మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి. శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి. మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు. జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు. సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు. నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ. డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. -
ఉగాది ఆరంభంతో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి అవకాశం
కర్కాటక రాశి ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి. మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది. పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు. శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం. జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం. సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి. అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన. డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం. జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు. -
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
సింహ రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2. మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు. మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది. ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు. మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం. జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది. 13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. -
కన్యా రాశి వారికి ఈ ఉగాది సంవత్సరాన మంచి శుభవార్త
కన్యా రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2. ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు. మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి. ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు. మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం. నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే. ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం. -
తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలా జరగవచ్చు
తులా రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5. చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ. జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం. నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం. డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి. పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. -
ఈ రాశి వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంతో ఫలితం ఎలా ఉందంటే?
వృశ్చిక రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5. విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు. -
ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..
ధనూ రాశి ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష. మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి. ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది. -
ఈ ఉగాది సంవత్సరాన ఈ రాశి వారికి ప్రమోషన్ అవకాశమే
మకర రాశి ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3 , అవమానం–1 . ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి. పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. శాంతి మార్గం: అమ్మవారి అర్చన చేయండి. రోజూ సుబ్రహ్మణ్య, దుర్గాపూజలు చేస్తుండండి. ‘శ్రీమాత్రే నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించండి. ఏప్రిల్: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం. మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు. జూన్: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు. ఆగస్ట్: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. సెప్టెంబర్: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు. నవంబర్: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. డిసెంబర్: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం. -
ఈ ఉగాది కొత్త సంవత్సరంతో.. ఈ రాశి వారకి ఎలా ఉందంటే..?
కుంభ రాశి ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1 ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం. ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం. ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. శాంతి మార్గం: రోజూ ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. శని, గురువులకు జపం దానం చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం. జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు. జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి. సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది. అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి. జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం. మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం. -
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి
మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి
మేష రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి. అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం. శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా ‘దుర్గా సప్తశ్లోకీ’ పారాయణ చేయండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం. ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి. మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి. జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి. అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు. మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. -
Today Telugu Horoscope:ఈ రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి పూర్తి (24గంటలు), నక్షత్రం: మఖ సా.4.43 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.1.35 నుండి 3.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.20 నుడి 9.06 వరకు తదుపరి రా.10.27 నుండి 11.19 వరకు, అమృతఘడియలు: ప.2.05 నుండి 3.52 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు, రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 6.04 సూర్యాస్తమయం : 5.24. మేషం.... పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వృషభం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. మిథునం..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. కర్కాటకం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. సింహం.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. కన్య.... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. మానసిక అశాంతి. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. తుల... శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ధనుస్సు... మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మకరం..... శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బం«ధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. కుంభం..... మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. -
ఈ రాశి వారికి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.నవమి తె.5.18 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి దశమి, నక్షత్రం: ఆశ్లేష ప.2.10 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.3.26 నుండి 5.14 వరకు, దుర్ముహూర్తం: ప.12.05 నుండి 12.52 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.08 వరకు, అమృతఘడియలు: ప.12.22 నుండి 2.10 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.04, సూర్యాస్తమయం: 5.24. మేషం.... ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొన్ని మార్పులు. ఉద్యోగాలలో సమస్యలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వృషభం.... సోదరులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. మిథునం... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. కర్కాటకం..... బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. వస్తులాభాలు. సింహం... రుణాలు చేస్తారు. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు ఫలితం కనిపించదు. కన్య.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. తుల.... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృశ్చికం... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు మరింత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ధనుస్సు... కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. మకరం..... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కుంభం... ఇంట శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీనం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. -
Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.సప్తమి రా.1.34 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు ఉ.9.40 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.6.22 నుండి 8.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.33 వరకు, అమృతఘడియలు: ఉ.7.06 నుండి 8.48 వరకు, తిరిగి తె.4.47 నుండి 6.31 వరకు (తెల్లవారితే ఆదివారం); రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.04, సూర్యాస్తమయం: 5.26. మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు. వృషభం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. మిథునం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు. కర్కాటకం... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. సింహం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు. కన్య... మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. తుల.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృశ్చికం.... పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. ధనుస్సు... రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. మకరం..... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కుంభం... బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. మీనం... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. -
Today Telugu Horoscope: ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.షష్ఠి రా.12.10 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.8.02 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.8.50 నుండి 10.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.20 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.53 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.03, సూర్యాస్తమయం: 5.26. మేషం... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. వృషభం.... వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. మిథునం... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. కర్కాటకం.... బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్య పనులు సజావుగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కన్య.... కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు. తుల.... రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. అనారోగ్యం. వృశ్చికం... చేపట్టిన వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొంటారు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. ధనుస్సు.. శుభవర్తమానాలు అందుతాయి. కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. మకరం.... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. కుంభం.. కుటుంబంలో సమస్యలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి. మీనం..... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. -
Horoscope Today: ఈ రాశివారికి సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పంచమి రా.11.12 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర ఉ.6.47 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ప.3.36 నుండి 5.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.34 వరకు, తదుపరి ప.2.24 నుండి 3.10 వరకు, అమృత ఘడియలు: రా.9.30 నుండి 11.10 వరకు, రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం : 6.02, సూర్యాస్తమయం : 5.27. మేషం.... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన. వృషభం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. మిథునం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కర్కాటకం.... కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. అర్థిక ఇబ్బందులు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. సింహం... సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కన్య.... కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత. తుల... పనుల్లో ప్రతిష్ఠంభన ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. వృశ్చికం... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. ధనుస్సు... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిత్రమైన సంఘటనలు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. మకరం... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కుంభం... పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి. మీనం.... బంధువులతో స్వల్ప విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి. -
ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు తీరతాయి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: పౌర్ణమి రా.1.57 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: రేవతి ఉ.7.56 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: రా.3.04 నుండి 4.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.01 నుండి 7.32 వరకు, అమృతఘడియలు: రా.12.01 నుండి 1.34 వరకు, పాక్షిక చంద్ర గ్రహణం.; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.00, సూర్యాస్తమయం: 5.28. మేషం.... కొత్త వ్యక్తుల పరిచయం. మిత్రులతో సఖ్యత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. వృషభం... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. మిథునం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కర్కాటకం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. సింహం... సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కన్య.... చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. తుల.... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. వృశ్చికం... పనుల్లో విజయం. శుభకార్యాల నిర్ధారణ. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు అనుకూలిస్తాయి. ధనుస్సు... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. మకరం.... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. కుంభం.... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీనం.. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చర్చల్లో పురోగతి. పనులు అనుకున్న విధంగా పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. -
Today Telugu Horoscope: ఈ రాశి వారికి శ్రమ ఫలిస్తుంది
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు ఆశ్వయుజమాసం, తిథి: శు.పంచమి రా.10.28 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: జ్యేష్ఠ రా.8.10 వరకు, తదుపరి మూల, వర్జ్యం: ప.3.57 నుండి 5.28 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.15 వరకు, అమృత ఘడియలు: ఉ.11.24 నుండి 1.00 వరకు. సూర్యోదయం : 5.56 సూర్యాస్తమయం : 5.34 రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు యమగండం :ఉ.6.00 నుండి 7.30 వరకు. మేషం... దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. వృషభం... పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథునం... ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కర్కాటకం... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. సింహం.... కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కన్య.... నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.. తుల... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. వృశ్చికం... పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. ధనుస్సు... పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగుల మందగిస్తాయి. మకరం.... బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కుంభం.... శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. -
ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆశ్వయుజమాసం, తిథి: శు.చవితి రా.11.26 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అనూరాధ రా.8.26 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.1.56 నుండి 3.33 వరకు, దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.09 వరకు,, అమృత ఘడియలు: ఉ.9.54 నుండి 11.31 వరకు. రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం : 5.56, సూర్యాస్తమయం : 5.34. మేషం... దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. వృషభం... బంధువులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. పనుల్లో విజయం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. మిథునం.... సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. కర్కాటకం.... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు. సింహం... మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కన్య... పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. తుల..... వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు. వృశ్చికం.... ఉద్యోగయోగం. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. ధనుస్సు.... మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు. మకరం.. యత్నకార్యసిద్ధి. నూతనంగా చేపట్టిన పనులు పురోగతి. ఆస్తిలాభం. దైవదర్శనాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. కుంభం... కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు. మీనం.... కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. -
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి, వ్యవహారాలలో పురోగతి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆశ్వయుజమాసం, తిథి: శు.తదియ రా.11.56 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: విశాఖ రా.8.11 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.12.15 నుండి 1.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.32 నుండి 11.21 వరకు, అమృతఘడియలు: ఉ.11.08 నుండి 12.46 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.35. మేషం... అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. వృషభం....పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథునం... మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. కర్కాటకం....కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. సింహం...ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. కన్య....కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. తుల....వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వృశ్చికం...ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ధనుస్సు...ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మకరం....రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుంభం...బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. మీనం...రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. -
Horoscope Today: ఈ రాశి వారు శుభవార్త వింటారు, ఆకస్మిక ధనలాభం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు,నిజ శ్రావణ మాసం, తిథి: శు.షష్ఠి రా.10.12 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: స్వాతి తె.4.37 వరకు (తెల్లవారితే బుధవారం),వర్జ్యం: ఉ.9.26 నుండి 11.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.40 వరకు,అమృతఘడియలు: రా.7.23 నుండి 9.05 వరకు. మేషం....ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో విజయం. బంధువుల నుంచి విలువైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. వృషభం...ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిథునం...రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో చికాకులు. కర్కాటకం...వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభించవచ్చు. సింహం.....పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. కన్య.....రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. తుల....ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. వృశ్చికం..దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. ధనుస్సు...ఉద్యోగయత్నాలలో అనుకూలత. వేడుకల్లో పాల్గొంటారు. వస్తులాభాలు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. మకరం....మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం. కుంభం...ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. మీనం...కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వాహనయోగం. -
ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం, ధనలాభం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పాడ్యమి రా.10.04 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: విశాఖ రా.9.34 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.1.32 నుండి 3.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.18 వరకు, అమృతఘడియలు: ప.12.44 నుండి 2.20 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. మేషం: ఆర్థిక పరిస్థితి నిరుత్సుహపరుస్తుంది. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. వృషభం: సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహనాలు జాగ్రత్త. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. దైవచింతన. మిథునం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కీలక నిర్ణయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి. కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు. వృశ్చికం: బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పనులు చకచకా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. ధనుస్సు: వ్యవహారాలు నిరాశ కలిగిస్తుంది. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమ తప్పదు. ధననష్టం. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు. కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పైచేయిగా ఉంటుంది. వస్తులాభాలు. మీనం: పరపతి పెరుగుతుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. -
శోభకృత్ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి?
-
మీనం: ఫాస్ట్‌ఫుడ్ సహా ఈ వ్యాపారాలు బెటర్! స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.. ఇంకా
మీన రాశి - (ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2) మీనరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురు రాహువుల సంచారం, సప్తమ అష్టమస్థానాలలో కేతుగ్రహ సంచారం, వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అనేకమందితో నూతనమైన వ్యవహారాలు వ్యాపారాలు లాభిస్తాయి. ఆశపెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు. ఎంతోమందికి మీరు అభయహస్తం ఇస్తారు. కొంతమంది విద్యాభ్యాసం కోసం స్వార్జితాన్ని విరాళంగా అందజేస్తారు. వ్యాపార వ్యవహారాలు ఊహకు మించి పెరుగుతాయి. ప్రతి పనికి అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. లాటరీలు, క్రికెట్ బెట్టింగ్‌లు పనికిరావు. దొంగ స్వామీజీల వల్ల, నకిలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ వ్యాపారాలు బెటర్ ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలకు మంచిపేరు వస్తుంది. నూతన పదవీప్రాప్తి వుంది. గృహయోగం, వాహనయోగం కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలలో ఉద్యోగప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. స్టేషనరీ, రవాణా, ఆహార, అలంకార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. లాయర్లకు, పోలీసు అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములు మోసం చేస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణ చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). మీతో వైరం పెట్టుకుంటే శత్రువర్గం మీపై దుష్ప్రచారం కొనసాగిస్తారు. విమర్శలను పట్టించుకోకుండా నడుచుకుంటారు. మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలిసివస్తుంది. లోహపు వ్యాపారులకు, ఆహారధాన్యాల వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. సంవత్సర ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. పన్నుల అధికారుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్ళి సంబంధం కుదురుతుంది. గడప గౌరమ్మ వాడేటప్పుడు ఇందులో సుమంగళీ పసుపు కలిపి ఉపయోగించండి. ఆకస్మికంగా ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. ఉద్యోగపరంగా మీపై కక్ష సాధించాలనుకునే మీ పైఅధికారికి స్థానచలనం కలగడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఇతరుల బరువు, బాధ్యతలను మీపై వేసుకోవడానికి ప్రయత్నించవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల గృహంలో చికాకులు ఎదురవుతాయి. సంతానం చదువుల నిమిత్తం అధిక ధనం వెచ్చించవలసిన పరిస్థితి రావచ్చు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు ఈ సంవత్సరము బాగుంది. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్స్ ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. కొంతమంది సన్నిహితులు దూరం అవుతారు. మరి కొంతమంది సన్నిహితులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, కార్యాలయంలో రాజకీయాలు అధికం అవుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతవరకు అనుకూలంగా వుంటుంది. ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా అవార్డులు స్వీకరిస్తారు. అవివాహితులైన స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది. క్రీడారంగంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులు ప్రక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా బయటపడతారు. రహస్య సమాలోచనలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులు అవుతారు. మొండికి పడిన శుభకార్యాలు ఓ దారికి వస్తాయి. బాధ్యతలు నెరవేర్చడానికి అధిక ప్రాధాన్యమిస్తారు. దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి. ఆత్మీయులతో విడిపోవడం కన్నా, కలిసి వుండటం మంచిదని గ్రహించండి. వ్యాపారం మీ అంచనాలను మించి ఎదుగుతుంది. లాభాలు బాగుంటాయి. విద్యాసంబంధమైన విషయాలు, విదేశీయాన యత్నాలు సానుకూలపడతాయి. ఐఐటీ, మెడిసిన్, సాంకేతిక రంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిషం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక సంతృప్తి ఉండదు. సంతాన పురోగతి సంతృప్తికరంగా వుంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. గైనిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కళా, సాహిత్య రంగాలలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపికవుతారు. స్వయం సంపాదన ప్రారంభమవుతుంది. గతాన్ని మరచి మాట్లాడడం వలన విమర్శలకు గురవుతారు. భార్యాభర్తల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంటుంది (ఇది కొంతమంది విషయంలో మాత్రమే). ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన పదవి సంతోషం కలిగించదు. పిల్లల చదువుల కోసం అధికంగా ఖర్చుచేస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యాల వల్ల అనుకున్న ఫలితాలు వస్తాయి. అలంకార వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. మరో గృహయోగం ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయానికి విలువలేని చోట పనిచేయడం అనవసరమని భావిస్తారు. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎగ్జిక్యూటిల్ పోస్టుల్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఉన్నవారికి, జ్యూడిషియల్ ఆఫీసర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ విషయాలు అంతగా పట్టించుకోలేరు. ఆత్మీయుల ముసుగులో ఉన్న వ్యక్తుల నిజస్వరూపం ఆలస్యంగా తెలుసుకుంటారు. మీపై వచ్చిన నిందారోపణలు నిజం కాదని నిరూపించుకో గలుగుతారు. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబానికి బరువు కాకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. సంతాన పురోగతి గురించి ఆందోళన చెందవలసి వస్తుంది. తల్లిదండ్రులు, బంధువుల పెద్దలతో విభేదాలు వచ్చే పరిస్థితులు సంభవం. ఆకస్మికంగా శుభకార్యాలు నిశ్చయమవుతాయి. స్వీయ సంపాదనతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కండరాలు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యం బాధిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. -
మకరరాశి: మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సమస్యలు, ఆత్మీయుల మధ్య విభేదాలు
మకర రాశి (ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6) మకరరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయంలో శని, తృతీయ చతుర్థాలలో గురు సంచారం, తృతీయ చతుర్థాలలో రాహుగ్రహ సంచారం, భాగ్య దశమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వివాహాది వ్యవహారాలు, నూతన స్వగృహం ఏర్పాట్లు ఈ సంవత్సరం సానుకూలపడతాయి. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. దీనికి మీ బంధువుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అయిన వాళ్ళతో సంబంధాలు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇతరుల పేరుమీద మీరు చేసే వ్యాపారాలు, బినామీ వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపార సంస్థలను విస్తరింపజేయటమే ధ్యేయంగా కష్టపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ వాటాలను తగ్గించుకుంటారు. కోళ్ళఫారాలు, పశువుల పెంపకం, ఫారిన్ కొలాబరేషన్ కంపెనీలలో లావాదేవీలు లాభిస్తాయి. భూముల కొనుగోళ్ళ విషయాలలో అగ్రిమెంట్స్‌కు ప్రాముఖ్యతనిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ, కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. అలంకార వస్తు సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి, ఉద్యోగాలలో చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు ఎంపికవడం, రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మరుగుపరచే ప్రయత్నాలు చేసి, సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రతిష్ఠ, స్థానం కుదుపులకు లోనైనా నిలబడుతుంది. వెన్నునొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది కలిగించవచ్చు. చిన్న చిన్న కలహాలు, ఆత్మీయుల మధ్య విభేదాలు చికాకు కలిగిస్తాయి. గతంలో ఫైనాన్స్ కంపెనీల్లో మీరు పొదుపు చేసిన ధనం ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. అభిమానించి నెత్తిన పెట్టుకున్న పెద్దలు నిష్కారణంగా దూరంగా ఉంచుతారు. ఎందుకు దూరంగా ఉంచారో? కారణాలు తెలియక మనోవేదనకు గురవుతారు. మీలో ప్రతీకార వాంఛ పెరుగుతుంది. మీ సన్నిహితులు చేసిన పొరపాట్లకు న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఖర్చులు తగ్గించే అవకాశాలు ఉండవు. పొదుపు చేసుకునే అవకాశాలు కూడా కనబడవు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల అవకాశాన్ని చేజార్చుకుంటారు. సమాజంలోని ముఖ్యులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పర్యటనలు, విందులు, వినోదాలు సంతోషం కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారాలు చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారు తరుచూ ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం ఉండదు. తల్లిదండ్రులు, పెద్దలపట్ల ఎంత విధేయంగా ఉన్నా, వాళ్ళ అభిమానాన్ని సంపూర్ణంగా పొందలేకపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబంలో బంధువుల అతి జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంచటానికి అధికంగా శ్రమిస్తారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరఘోష తొలగిపోతుంది. పూర్తి అయ్యాయి అనుకున్న పనుల విషయంలో మళ్ళీ చర్చలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఘర్షణలు అనివార్యం అవుతాయి. సహోదర వర్గంలో ఒకరు మీకు అండగా నిలుస్తారు. పరిచయాల కన్నా స్నేహం కన్నా ధనమే ముఖ్యమని గ్రహించి బాధపడతారు. చెప్పుకోదగిన సమస్యలు ఆందోళనకు గురిచేస్తాయి. బయటి స్నేహితులకు చెప్పుకుని ఊరట చెందుతారు. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, వీరఖడ్గం మెడలో ధరించాలి. మొత్తం మీద మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ మనోధైర్యం, నిబ్బరం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరికీ మంచి చేసి, చిన్న కారణం వల్ల విరోధం అవుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల నైరాశ్యం, కోపం కలుగుతాయి. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని కించపరచిన వాళ్ళు మీ సహాయం అర్థించే పరిస్థితి వస్తుంది. మీ పేరుపైన ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి. చిన్నచిన్న కారణాల వల్ల పెద్ద సమస్యలు పక్కతోవ పడతాయి. అష్టమూలికా తైలంతో నవగ్రహ వత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సామాజిక విషయాలలో మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కోర్టువ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సాంస్కృతిక, కళారంగాలలో గుర్తింపు లభిస్తుంది. విలువైన నగలు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నైతిక బాధ్యతలను నెరవేరుస్తారు. ప్రశాంతంగా సాగుతున్న మీ జీవిత చక్రంలో ఓ వ్యక్తి ప్రవేశం కొన్ని మార్పులకు దారితీస్తుంది. కుటుంబ వ్యవహారాల పట్ల దృష్టి పెడతారు. సంతానం క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జీవితంలోకి ఆహ్వానించి, జీవితాంతం కలిసి ఉండాలని మీరు వలచిన వ్యక్తి నిజస్వరూపం తెలుసుకుని వేదనకు గురవుతారు. అందరినీ నమ్మాల్సిన పరిస్థితి, ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఇబ్బంది పెడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు చిక్కుల్లో పడతారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాచుకున్న ధనం, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల చిక్కులు ఏర్పడుతాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఇతర భాషల వల్ల ప్రయోజనం, పోటీ పరీక్షలకు సంబంధించి విజయం సాధిస్తారు. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు, మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది. గైనిక్ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. చీటీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారం వల్ల నష్టపోతారు. స్త్రీల వల్ల కొన్ని సందర్భాలలో నిందలు, ఆరోపణలు రావచ్చు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో చాలా విషయాలు పరిష్కరించు కోగలుగుతారు. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలు వాటికి అవే పూర్తి అవుతాయి. ఐఐటీ, మెడిసిన్ సీటు లభిస్తుంది. పోటీ పరీక్షలలో కష్టపడి చదవకపోయినా, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సెల్ఫ్‌డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మీద ప్రేమ లేకపోయినా మీ పేరు కలిసివస్తుందని అన్ని విషయాల్లో మీ పేరుకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. -
కుంభం: మిశ్రమ ఫలితాలు.. ఆ విషయాల్లో జాగ్రత్త! ఇక సినీ, కళా పరిశ్రమల వారు
(ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2) కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ద్వితీయ తృతీయ స్థానాలలో గురు రాహువుల సంచారం, అష్టమ నవమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, లగ్నంలో శని సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి అవకాశాలు చేతికి అందివస్తాయి. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. ప్రజాకర్షణ పెరుగుతుంది. సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. లిఖితపూర్వక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణం అని ప్రచారం జరుగుతుంది. ఆత్మీయులతో విభేదాలు కొద్దికాలం చికాకు కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళు, పాదాల నొప్పులు, ఈఎన్టీ సమస్యల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. రహస్యంగా ఋణాలు చేస్తారు. రహస్యంగా దానాలు, సహాయం చేస్తారు. ఆదాయ మార్గాలు అప్పటికప్పుడు ఏర్పడుతాయి. పూజలలో, ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఒక అవకాశం వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇందుకు రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భూములు, ఇళ్ళ క్రయ విక్రయాలలో లాభపడతారు. వైరివర్గంతో తాత్కలికంగా సయోధ్య కుదురుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో అధికంగా జోక్యం చేసుకునే వాళ్ళకు ప్రాధాన్యత తగ్గించి, వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. పోటీపరీక్షలలో విజయాలు, ప్రభుత్వ ఉద్యోగం మొదలైనవి లాభిస్తాయి. రాజకీయ పదవీ ప్రాప్తి లభిస్తుంది. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. కొంతకాలం రక్తసంబంధీకులతో విభేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో వెన్ను నొప్పి బాధిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా, ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట వినడం బంధువులలో ఆశ్చర్యానికి కారణమవుతుంది. మిత్రుల సహకారం, ప్రోత్సాహం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలికి వస్తాయి. ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు మొదలైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వివాదాలకు దూరంగా వుండాలని భావించినా, కాలం అందుకు సహకరించదు. సంవత్సర ద్వితీయార్ధంలో సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికంగానే ఉంటాయి. ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించండి. స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. చాలా సందర్భాలలో కృషి ఫలిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. సినీ, కళా పరిశ్రమలలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఒకచోట భూమిని అమ్మి వేరేచోట కొంటారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకో గలుగుతారు. కుటుంబసభ్యులకు బంగారు ఆభరణాలు కొని ఇవ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది. సమాజంలో అఖండఖ్యాతి లభిస్తుంది. ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నతవర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు. మీపై వచ్చిన ఆరోపణలు, నిందలు మరుగునపడతాయి. చాలామంది మీ పట్ల నమ్మిక కలిగి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించి స్త్రీల దగ్గర నమ్మకాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. దూరప్రాంతయానం లాభిస్తుంది. దూరప్రాంతంలో విద్య అభ్యసించ గలుగుతారు. వైవాహిక ఇబ్బందులు ఏదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యం అవుతుంది. ప్రేమ వివాహాలు కలిసిరావు. పునర్వివాహం కొరకు ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, రాహు కేతుగ్రహ దోషపరిహార కంకణం లేదా రూపు ధరించాలి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా మీరు చేసిన ఆర్థిక సహాయం వల్ల గృహంలో అశాంతి ఏర్పడుతుంది. చేతగాని వాళ్ళకు, ఎందుకూ పనికిరాని వాళ్ళకి, సోమరిపోతులకు మీరు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మీ పలుకుబడి, నమ్మకమే అనేక విషయాల్లో మీ విజయానికి, లాభాలకు కారణమవుతాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ప్రేమ వివాహాల పట్ల మీకున్న సదాభిప్రాయం పూర్తిగా పోతుంది. జీవితభాగస్వామి నిరంకుశ ధోరణి, మీ కాపురంలో ఇతరుల జోక్యం మానసిక వేదనకు, కఠినమైన నిర్ణయాలకు కూడా కారణమవుతాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. శాశ్వతంగా విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అందరికీ కాదు. అన్ని విషయాల్లోనూ విజయం సాధించి, శక్తి సామర్థ్యాలతో, ఐశ్వర్యంతో, అధికారంతో, పొలిటికల్ పవర్‌తో ఈ సమాజానికి సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంటారు. అదే కోణంలో మీరు విజయం సాధిస్తారు. పొగిడిన వాళ్ళని దూరంగా పెడతారు, విమర్శించిన వాళ్ళని దగ్గరగా తీసుకుంటారు. అనంత కాలచక్రం ఎవ్వరి కోసం ఆగదని గ్రహిస్తారు. విద్య విషయాలు అనుకూలిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇతరుల ప్రోత్సాహంతో ఉన్నత విద్య అభ్యసిస్తారు. వివాహాది శుభకార్యాల విషయం వివాదస్పదం అవుతుంది. శక్తి సామర్థ్యాల వల్ల ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సంతాన విషయాలలో పురోగతి బాగుంటుంది. విదేశాలలో చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అవకాశం లభిస్తాయి. అవివాహితులైన స్త్రీలకి వివాహం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నా, నష్టాలు రాకుండా బయటపడతారు. నిర్మాణ విషయాల్లో నాణ్యతకు ప్రాధాన్యతను ఇస్తారు. చేతివృత్తులు, అలంకార వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు మధ్యమంగా వుంటాయి. నూనె, ఆహారధాన్యాల వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారం చేయదగినది కాదు. సహోదర, సహోదరీ వర్గంతో సంబంధాలు మెరుగుపడతాయి. హనుమాన్ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కోర్టుతీర్పులు అనుకూలంగా వుంటాయి. మానసికంగా మీకు అశాంతి కలిగించేలా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు. నూతన కంపెనీ ఏర్పాటు కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఉద్యోగ విషయాలు, ప్రమోషన్లు అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. -
ధనుస్సు : ఈ రాశి వారికి ఈ ఏడాది సూపర్..
ధనుస్సు(ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3) ధనుస్సు రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తృతీయ స్థానంలో శని, చతుర్థ పంచమ స్థానాలలో గురు సంచారం, దశమ లాభ స్థానాలలో కేతుగ్రహ సంచారం, చతుర్థ పంచమ స్థానాలలో రాహుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు సంకల్పాలను నెరవేర్చుకోవడానికి నూటికి నూరుపాళ్ళు శ్రమించాల్సి ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అన్నివిధాలుగా సానుకూల ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. జలసంబంధ వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ధనం, కీర్తి సూచిస్తున్నాయి. ఓం నమోనారాయణ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకచోట లాభాలు రాకపోయినా మరొకచోట లాభాలు వస్తాయి. ఫాస్ట్‌ఫుడ్ వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. బంగారం, వెండి వంటి లోహాల వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబ పురోగతిలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. వైరివర్గం మిమ్మల్ని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. స్వగృహ యోగం సంభవం. నూతన వ్యాపారం మొదలుపెట్టడానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి,ఉద్యోగాలలో మీరు చేసిన కార్యక్రమాలు వివాదస్పదం అవుతాయి. కొందరికి మీరు వ్యక్తిగతంగా హామీ ఉండవలసి వస్తుంది. ప్రేమ, వివాహం వంటివి నిదానంగా అనుకూలిస్తాయి. సంవత్సర చివరలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది. సమష్టిగా నూతన వ్యవహారాలను నిర్వహిస్తారు. ఎవరికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలో, ఎంత భాగం ఇవ్వాలో చక్కగా నిర్ణయిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. చిట్‌ఫండ్స్, ఉమ్మడి ఖాతాలు లాభించవు. ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందిపడతారు. ఒక మంచి కార్యక్రమం కోసం వసూలు చేసిన చందాల విషయంలో వివాదాలు, నిందలు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేకశైలిని నిలబెట్టుకుంటారు. పట్టుదలగా వ్యవహరిస్తారు. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. కొత్త పరిచయాల వల్ల ఉపయోగం కలుగుతుంది. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంవత్సర ద్వితీయార్ధంలో సంతాన విషయమై ప్రత్యేకశ్రద్ధ వహించవలసి వస్తుంది. కీళ్ళనొప్పులు రావచ్చు. లైసెన్సు, ఆయుధాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. సంవత్సర ప్రథమార్ధంలో ఆర్థిక విషయాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చెల్లించవలసి ఋణాలు చెల్లిస్తారు. తనఖాలు విడిపిస్తారు. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగి, జనాకర్షణ ఏర్పడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో కోరుకున్న పురోగతి లభిస్తుంది. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారాలు అనుకూల ఫలితాలను సాధిస్తారు. చేతివృత్తుల వారికి మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. భూములు కొనుగోలు, అమ్మకాల విషయాలలో లాభపడతారు. రహస్య ప్రయాణాలు చేస్తారు. రహస్య చర్చలు ఫలిస్తాయి. మాట నిలకడలేని మనుషులతో కలిసి పనిచేసి నష్టపోతారు. కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు. పరిస్థితులు అందుకు అనుకూలించవు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండడం మంచిది. వాహన సౌఖ్యం కలుగుతుంది. ఎన్ని సాధించినా ప్రశాంతత లభించదు. కుటుంబంలో ఆప్యాయతానురాగాలు లోపిస్తాయి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకుంటారు. అందరి అభిప్రాయాలకు భిన్నంగా ఒక శుభకార్యాన్ని పూర్తిచేస్తారు. రాజకీయంగా ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా, ఎలక్టాన్రిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానా రకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. సంవత్సర ద్వితీయార్ధంలో కాలానికి ఎదురీది అనుకూల ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధించి కుటుంబ ప్రతిష్ఠ నిలబెడతారు. శుభకార్యాల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి సంభవం. అవివాహితులకు వివాహప్రాప్తి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయాలి, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు సర్దుకుపోతారు. అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. చట్టపరంగా విడిపోవాలని నిశ్చయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. అందరికీ వర్తించదు. మీ సంతానానికి కలలో కూడా ఊహించని విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువవుతాయి. ఇబ్బందులు నాగాస్త్రం వలే మీదకు వస్తాయి. శ్రీకృష్ణుని దయతో అర్జునుడు బయటపడినట్లు దైవానుగ్రహంతో మీరు బయటపడగలుగుతారు. పూర్వీకుల స్థిరాస్తుల విషయంలో కొత్త సంగతులు వెలుగు చూస్తాయి. అవి మీకు లాభిస్తాయి. క్రీడా, సాంస్కృతిక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. తల్లిదండ్రుల మాటను గౌరవిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధించి, ఉద్యోగం సంపాదిస్తారు. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. విదేశీ సంబంధం కుదురుతుంది. ఆకస్మికంగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పేరుపై ఇతరులు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. స్వగృహ నిర్మాణం నెరవేరుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి కలసివస్తుంది. ఒకప్పుడు ఎంతో కష్టపడ్డ జీవితం ఈ రోజు చిగురించిన చెట్టులాగా కళకళ లాడుతుంది. మీ వైభోగాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించే వ్యక్తి శాశ్వతంగా దూరం కావడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ధనాకర్షణకు అష్టలక్ష్మీ పీఠాన్ని ఉపయోగించండి. వ్యాపారపరంగా అనేక అవకాశాలు కలిసివస్తాయి. నూతన బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. అందరినీ మీ కనుసన్నలలో ఉంచకోగలుగుతారు. కాంట్రాక్టులు, టెండర్లు, వర్క్ ఆర్డర్లు, వస్త్ర వ్యాపారాలు, సబ్‌కాంట్రాక్టులు లాభదాయకంగా ఉంటాయి. వ్యక్తిగత అవసరాలకు, ఆరోగ్యం కొరకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. సంతానం కోసం మీరు కల్పించిన సదుపాయాలు, వసతులు, దుర్వినియోగం అవుతాయి. స్థిరాస్తి విషయాలలో ఒప్పందాలు కుదురుతాయి. అమ్మాయి పెళ్ళికి సంబంధించి ఒక మంచి సంబంధం దగ్గర వరకు వచ్చి చేజారిపోతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి కాలం అనుకూలంగా వుంది. అవివాహితులైన స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబంలో అనైక్యత. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయటం కష్టమవుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ సహకారం వల్ల ఒక పునర్వివాహం జరుగుతుంది. ఎక్కడా తలవంచకుండా రాజీలేని జీవితాన్ని గడుపుతారు. అడ్మినిస్ట్రేషన్ పదవుల్లో ఉన్నవారికి, అధికారంలో ఉన్నవారికి ఇతరులకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. విలువైన ఆభరణాలు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సంవత్సర ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
మిథున రాశి: అన్నింటా శుభయోగం.. ఆ ఒక్కటి చేస్తే మరింత రాజయోగం
మిథున రాశి (ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4) మిథునరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. చతుర్థ పంచమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, దశమ లాభస్థానాలలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. కీలకమైన స్థానాలలో ఉన్నవారి వల్ల లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి. కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్‌కు దూరంగా వుండటం మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మిత్రులు అగర్భశత్రువులు అవుతారు. అందరూ బలహీనులు అని భావించవద్దు. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఎక్కువ ఆలస్యం చేయకుండా శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రతలో జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. బంధువులకు సహాయం చేయడం వల్ల చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులు అసూయాపరులై ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. వాస్తవిక దృష్టితో ఆలోచించి, కుల మత వర్గాలకు అతీతంగా శక్తిసామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని వాతావరణం కలిగించవద్దు. పట్టువిడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం నవగ్రహ పాశుపత హోమం చేయాలి, శక్తికంకణం లేదా శక్తిరూపు ధరించాలి. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళను వదిలించుకోవడం కష్టంగా మారుతుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటువేస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంది. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజిస్తే మంచిఫలితాలు ఉంటాయి. లీజులు, అగ్రిమెంట్లు, లైసెన్సులు లాభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో జీవితం మరో కొత్త పంథాలో నడుస్తుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. చెప్పుడు మాటలు విని నష్టపోతారు. శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతలు దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త వహించండి. కీళ్ళనొప్పులు, గైనిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లాభించదు. చిట్టీలు కట్టి మోసపోతారు. హనుమాన్ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అలంకార సామగ్రి అమ్మేవారికి, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్స్ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ధనాన్ని పొదుపు చేస్తారు. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. పొదుపు పథకాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి, అలంకార సామగ్రి విక్రయాలు మొదలైన వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతిక రంగాలలో, నాట్య, సంగీత రంగాలలో రాణిస్తారు. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాలలోని వారు రాణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు ఎంపికవుతారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అనువంశికంగా మీకు రావలసిన ఆస్తిలో పెద్దలు రాసిన డాక్యుమెంట్స్‌లో కొన్ని లోపాలు బయటపడతాయి. ఈ లోపాల కారణంగా మీరు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ నష్టపోయే అవకాశం ఉంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తొలగిపోతుయి, జనాకర్షణ ఏర్పడుతుంది. సాధారణ విద్యలోనూ, వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. -
Ugadi 2023:ఐశ్వర్య ప్రాప్తి కోసం సింహ రాశి వాళ్లు దీనిని ధరిస్తే మేలు..
సింహ రాశి (ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7) సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయ తృతీయాలలో కేతువు, సప్తమంలో శని, అష్టమ భాగ్యస్థానాలలో గురు రాహువుల సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సహోదర సహోదరీ వర్గం నుంచి ఆప్యాయతలు లభిస్తాయి. రాజకీయాలలో ఉన్నత పదవులను అందుకోగలుగుతారు. చిన్నపాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. జీవితంలో ఘనవిజయాలు సాధిస్తారు. అసమర్థుల మీద జాలిపడి అందలం ఎక్కిస్తారు. ఆ అసమర్థులే అఖండులై మీకు అండగా ఉంటారు. పోటీదారులు ప్రతిచోట మీకు ఎదురుపడ్డా మీకు వచ్చిన నష్టం ఏమీలేదు. వృత్తికి సంబంధించినవన్నీ ఆడంబరంగా ఉండాలని భావిస్తారు. సహోదర సహోదరీ వర్గానికి అన్నివిధాలుగా అండగా ఉన్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు. సొంతవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీకు అవి తప్పులుగా అనిపించవు. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపార అనుభవాన్ని, మేధస్సును సొంతం చేసుకుంటారు. ఎదుటివాళ్ళు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేద్దామనే ఆలోచనే రాదు. సాత్విక స్వభావం, మాట మీద నిలబడే మనస్తత్త్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి అభిషేకానికైనా మహాతీర్థం పొడిలో కొద్దిగా నీళ్ళు కలిపి అభిషేకం చేయండి. ఇష్టదేవతానుగ్రహం కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అనుకున్న వాటిని ఏదోరకంగా సాధిస్తారు. జీవితభాగస్వామి ఆత్మీయులతో కొద్దికాలం చికాకులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. గతంలో మీరు డాక్యుమెంట్స్‌పై చేసిన సంతకాలు వివాదస్పదం అవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు. రచనా, వ్యాసాలు, పుస్తక రచన, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి ఉద్యోగాలలో విశేషమైన నిపుణత ఉంటుంది. మీ మేధస్సు, ఆలోచనలు, శ్రమ ఎక్కువకాలం దోచుకోబడతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ఐశ్వర్యప్రాప్తికి, వృత్తి ఉద్యోగాలలో సానుకూలతకు, వివాహప్రాప్తికి, సంతానప్రాప్తికి లకీ‡్ష్మచందనం ధరించడం వలన మేలు జరుగుతుంది. దాంపత్య జీవితంలో టీకప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. పునర్వివాహ యత్నాలు సఫలీకృఋతమవుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు, బంధువులు, రక్తసంబంధీకులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ సంతానానికి విద్యాసంబంధ, ఉద్యోగసంబంధ అవకాశాలు లభిస్తాయి. అరటినారవత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం మంచిది. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. ఋణాలు తీరుస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి. సామాన్య జనానికి ఉపకరించే ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించే అవకాశం ఉండదు. పొదుపు చేసుకునే అవకాశాలు కనబడవు. అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల చేజార్చుకుంటారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. వృత్తి ఉద్యోగాలలో కృత్రిమ పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉండరు. రాజకీయ పదవి లభిస్తుంది. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. çప్రేమ, పెళ్ళి వ్యవహారాలు చికాకుపరుస్తాయి. అవివాహితులకు వివాహకాలం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. తెల్లజిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. అలంకార సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యూహాలను వెతుకుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. గోప్యంగా విలువైన వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. పిల్లలు జీవితంలో స్థిరత్వం సాధించలేదన్న దిగులు తీరుతుంది. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కంప్యూటర్, విద్య, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. మీరు చేసే ఇతరత్రా వ్యాపారాలు, వ్యవసాయరంగ ఉత్పత్తులు, బ్యూటీపార్లర్స్, హోటళ్ళు నడపడం మొదలైన వ్యాపారాలు కలిసివస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు, లాభపడతారు. రాజకీయ పదవి లభిస్తుంది. ప్రేమ వివాహాలు ఫలించవు. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపిక అవుతారు. డాక్టర్ కావాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వస్త్ర వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు బాగున్నాయి. కీర్తిశేషులైన వారి జ్ఞాపకాలు బాధిస్తాయి. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లకీ‡్ష్మదేవి అనుగ్రహం, లకీ‡్ష్మకటాక్షం కలుగుతుంది. చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు పొడిగించబడతాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వపరమైన సబ్సిడీలు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనువంశికంగా రావలసిన ఆస్తుల విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాలలో ప్రత్యేకశ్రద్ధ అవసరం. కీళ్ళనొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. గ్రీన్‌కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. రాజకీయ పదవీప్రాప్తి, ప్రజాకర్షణ సంప్రాప్తం. పూజలలో, ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి, ఇది ఎంతో విశిష్ఠమైనది మీ కీర్తిప్రతిష్ఠల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. బిందుప్రస్థార అష్టమవర్గుననుసరించి పేరు మార్చుకోవాలి. దొంగ స్వామీజీల వల్ల, దొంగ గురువుల వల్ల నష్టపోతారు, జాగ్రత్త వహించండి. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విధులను సక్రమంగా, నీతిగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ కోరుకునే వారికి బదిలీ అవుతుంది. క్రీడారంగంలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది. -
కన్య రాశి: చారానా సంపాదన బారానా ఖర్చు, కానీ స్త్రీలకు ప్రత్యేకం!
ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 కన్యారాశి వారికి ఈ సంవత్సరం సప్తమ అష్టమస్థానాలలో గురురాహువుల సంచారం, షష్ఠమ స్థానంలో శని, లగ్న ద్వితీయాలలో కేతుగ్రహ సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఉన్నతస్థానాన్ని అధిరోహించే అవకాశాలు లభిస్తాయి. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు, సేవాసంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, వ్యవహారాలపరంగా బాగుంది. రాజకీయంగా అగ్నిపరీక్షాకాలం. విద్యాసంబంధమైన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీలు బాగా సాగుతాయి. ఆక్వారంగంలో, పౌల్టీర్రంగంలో కలిసిరాదు. ఈ సంవత్సరం ప్రధానమైన విషయాలు బాగున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు పరిశీలించుకోవడం మంచిది. ఫైనాన్స్ స్కీములలో చేరవద్దు. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుకుంటారు. ఇతరులు రెచ్చగొట్టే యత్నాలు చేసినా ఓర్పు వహించి వ్యాపార, ఉద్యోగాలను పదిలపరుచుకోండి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కొత్తగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు నడిపే విషయంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయపడతారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందులపాలు చేయగలుగుతారు. మీపై వచ్చిన ఆరోపణలు మరుగున పడతాయి. విదేశాలలో స్థిరపడిన ఆత్మీయవర్గంతో కలిసి తాత్కాలిక వ్యాపారాలు చేస్తారు. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల అనారోగ్యం కలుగుతుంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యం అవుతుంది. ప్రేమవివాహాలు కలిసిరావు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు పొడగించబడతాయి. స్థిరాస్తుల పంపకం వ్యవహారంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. గృహశాంతి పాడు చేసుకోవడం ఇష్టం లేక జీవితంలో నటించాల్సి వస్తుంది. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. మీ వైరివర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ పదవి సంప్రాప్తిస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత శత్రువులు మళ్ళీ తెరమీదకు వస్తారు. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. చాలా సందర్భాలలో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సి వస్తుంది. సంతానం కొన్ని విషయాలలో వక్రమార్గంలోకి వెళ్తారు. విందులు, వినోదాలు ఎక్కువవుతాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ కప్పుసాంబ్రాణితో ధూపం వేయండి. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్స్‌కి దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మొత్తంమీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం.. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. క్రీడారంగంలో కొన్ని విజయాలు నమోదు చేసుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, వైరాగ్యం, గతస్మృతులు మనోవేదనకు కారణం అవుతాయి. అన్నీ ఉన్నా అనుభవించలేకపోతున్నామనే భావన మీ మనసును కలవరపరుస్తుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుందనే భావన పదేపదే అనిపిస్తుంది. కీర్తిశేషులైన రక్తసంబంధీకుల జ్ఞాపకాలు బాధిస్తాయి. విద్యా, కళా, సాహిత్యరంగాలలో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు కలిసివస్తాయి. సమాజంలో మీరొక సెలబ్రిటీ అవుతారు. ప్రతిరోజు నుదుటన యజ్ఞభస్మం ధరించండి. సమాజంలో నెలకొన్న కుల, మత, వర్గ ప్రాంతీయ వైషమ్యాలు మీకు నష్టం కలిగిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా వుంది. మీ పేరుమీద ఉన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. మీ వ్యక్తిగతమైన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, సెల్‌పోన్, కంప్యూటర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొదలగు వాటి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. నూతనమైన వస్త్రాలు ఎక్కువగా ధరిస్తారు. సనాతన సాంప్రదాయల పట్ల మొగ్గు చూపిస్తారు. నానారకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. పొదుపు చేసిన ధనంతో ఏదైన స్థలం కానీ, ఫ్లాట్ కానీ తీసుకోవాలని అనుకుంటారు. మీ మీద ఆధారపడిన వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందజేస్తారు. మనసులోకి ఎవరినీ రానీయకూడదు, ఎవరికీ చోటు ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారు. మీరు మనసులో స్థానమిచ్చి, జీవితాన్ని పంచుకుందామని భావించిన వ్యక్తి మోసం చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు లోనవుతారు. ఇది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు. మీ వల్ల కాదని అందరూ హేళన చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తిచేసి, ప్రశంసలు అందుకుంటారు. తెలివిగా ఆలోచించండి. చిరునవ్వుల వెనుక ఉన్న వైషమ్యాన్ని జాగ్రత్తగా గమనించండి. పొగిడిన వాళ్ళంతా మీ అభిమానులు కారు. వెన్నుదట్టిన వాళ్ళందరూ మీ హితులు కారు. కాలం మీకు అనుకూలంగా ఉన్నంత వరకే. మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రానంత వరకే వాళ్ళ ప్రేమాభిమానాలు పరిమితమవుతాయి. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. వివాహం కానివారికి వివాహప్రాప్తి, సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. సాంకేతిక, కళారంగాలలో రాణిస్తారు. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఇందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. సాంస్కృతిక కార్యక్రమాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా ఉపయోగం లేకపోయినా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మీరే మరిచిపోతారు. భగవంతుడిని నమ్మండి, ఆరాధించండి. చార్టెడ్ అకౌంటెంట్స్‌కు, సివిల్ ఇంజనీర్లకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, విద్యాసంస్థలు నడిపే వారికి కాలం చాలా అనుకూలంగా వుంది. గతంలో చేసిన పొరపాట్లను తిరిగి జరగకుండా జాగ్రత్తపడతారు. ఒకానొక సందర్భంలో మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులే కరువవుతారు. చివరికి పెద్దలు, తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలంగా వుంది. -
తులా రాశి: ఈ రాశి వారు వాటికి దూరంగా ఉండాలి.. లేదంటే?
(ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7) తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న వ్యయాలలో కేతుగ్రహ సంచారం, షష్ఠ సప్తమాలలో గురు రాహువుల సంచారం, పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఎక్కడకు వెళ్ళినా గౌరవంగా ఆహ్వానించే వారు అధికంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యానుకూలత సాధిస్తారు. ఉన్నత విద్యకోసం చేసే దూరప్రయాణాలు లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు మంచి ప్రఖ్యాతి పొందుతాయి. సాంస్కృతిక, క్రీడారంగాలలో ప్రతిభాపాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నీచ రాజకీయాలు మనస్తాపం కలిగిస్తాయి. నైతికధర్మానికి కట్టుబడి ఉంటారు. పాల ఉత్పత్తులు, తత్సంబంధమైన వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. గతంలో చేసిన పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రతిష్ఠాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందుతారు. బంధువర్గంలో పదేపదే మీ నుంచి ఆర్థికసాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలుపెడతారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండిధైర్యంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి. వైరివర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వైరివర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం ప్రయత్నిస్తారు,. ఫైనాన్స్ స్కీములు, లక్కీడ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపు పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఋణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వెన్నుపోటుదారులు స్నేహితుల్లోనే ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీపరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, తదితర సర్వీసులకు ఎంపిక అవుతారు. కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించడం, దిగమింగటం జరుగుతుంది. దొంగలని తెలిసి కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని ఇబ్బందులను, సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసినవారి నిజస్వరూపం బయటపడుతుంది. ఫాస్ట్ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ళ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్‌సేల్ వ్యాపారాలు, సుగంధద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనవసరమైన బాధ్యతలు నెత్తిన పడతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగున్నా, భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన లాభాలు రావు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయాలి, పాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. ప్రేమ పెళ్ళిళ్ళు ప్రధాన ప్రస్తావనాంశంగా మారుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు చేసే వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో కష్టపడి వ్యాపారాన్ని ఒక దారిలోకి తీసుకువస్తారు. టీమ్ స్పిరిట్‌తో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శతృత్వం పెంచుకుంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు. సౌందర్య సాధక చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన అలవాట్ల వల్ల ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉన్నంతలో అందంగా కనిపించాలని భావిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. సహేతుకమైన దానధర్మాలు చేస్తారు. పెళ్ళి ముందా, చదువు ముందా అనే సమస్య ఏర్పడుతుంది. ఈ విషయంలో పెద్దల మాట వినరు. చదువు పూర్తయ్యాకే పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకి పెళ్ళి చూపులో అందరికీ మీరు నచ్చుతారు. మీకు మాత్రం ఎవరూ నచ్చరు. ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అరటినార వత్తులతో అష్టమూలికాతైలం కలిపి దీపారాధన చేయండి. ఈఎన్టీ సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఒళ్ళు బరువు తగ్గించుకుని నాజూకుగా కనిపిస్తారు. తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పనీ చేయరు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). మీ ఆత్మీయవర్గం విదేశాలలో స్థిరపడతారు. మీకు అన్నివిధాలా అందుబాటులో ఉంటారు. చేతి వృత్తులు, అలంకార కేంద్రాలు, బ్యూటీపార్లర్లు, డిజైనింగ్, వస్త్ర వ్యాపారం మొదలైనవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. అవివాహితులైన స్త్రీలకి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల వల్ల న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించి ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. అధికారం చేతుల్లో ఉన్నా సహాయం చేయటానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, గ్రహబాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. మానసికంగా సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్ళని ప్రేమగా చూస్తారు. సహోదర సహోదరీ వర్గాన్ని కూడా ఆదరిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మనకెందుకులే మనం తప్పించుకుపోదాం, డబ్బులెందుకు ఖర్చు పెట్టాలి? సేవలు ఎందుకు చేయాలి? నా తోడబుట్టిన వాళ్ళందరికీ లేని బాధ్యత నాకు మాత్రం ఎందుకు? ఈ విధంగా మీరు ఆలోచించరు. ఇటువంటి ఆలోచన మీ కలలోకి కూడా రాదు. ధర్మాన్ని వదిలేస్తే భగవంతుడు మనల్ని వదిలేస్తాడని మీ ప్రగాఢ నమ్మకం. ఇదే రకమైన బుద్ధి అందరికీ ఉంటే ఈ దేశం ఎంత బాగుండేదో కదా అనే ఆలోచన కలుగుతుంది. ఫైనాన్స్ మరియు చిట్టీల వ్యాపారం పెడితే దివాళా తీస్తారు, జాగ్రత్త ! క్రీడారంగంలో మంచి ప్రతిభాపాటవాలు చూపించినా కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాల వల్ల మీకు లభించవలసిన ఖ్యాతి, అవార్డులు, రివార్డులు లభించవు. చలనచిత్ర రంగంలో, టీవీ రంగంలో అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్ళి చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కీలక సమయంలో మీ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటారు. మీ శత్రువర్గానికి తగిన విధంగా గట్టి గుణపాఠం చెబుతారు. అవార్డులు, రివార్డులు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. -
వృశ్చికం: మొండితనం వద్దు.. సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం!
వృశ్చిక రాశి (ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3 అవమానం 3) Ugadi 2023 Panchangam: వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. చతురంలో శని, పంచమ, షష్ఠమ స్థానాలలో గురు రాహువుల సంచారం, వ్యయ లాభ స్థానాలలో కేతుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మధ్యస్థంగా ఉంటాయి. ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు. ఉన్నతస్థానాలను సాధిస్తారు. దైవభక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు, వాగ్దానాలు కుదురుతాయి. శనిగ్రహ అనుకూలత కొరకు ప్రతినిత్యం కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నెలకు ఒకసారైనా శనికి తైలాభిషేకం చేయించండి. భూముల వ్యవహారాలు వివాదస్పదం కాకుండా చర్యలు తీసుకోండి. శుభకార్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. మీ హితవుకోరే బంధువులు ఎవరో తెలుస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు. వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్తి చెబుతారు. జీవితభాగస్వామితో అన్నివిషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు. జీవిత భాగస్వామి చెప్పిన పనులను కాదనకుండా చేస్తారు. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇస్తారు. సంతానం మనోభావాలను గౌరవిస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళు వంటి వ్యవహారాలలో కఠినంగా వ్యవహరిస్తారు. కీళ్ళనొప్పులు, ఎలర్జీ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయం వచ్చే వాటిల్లోనే ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. తెల్లజిల్లేడువత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పని సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. మీ ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. మీ వాళ్ళకు ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి. నష్టపోకుండా లాభాలతో బయటపడతారు. స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారన్న అపవాదు వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలిని నిలబెట్టు కుంటారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థల పురోగతి బాగుంటుంది. విద్యా, ఉద్యోగ, విదేశీయాన సంబంధమైన విషయాలు బాగుంటాయి. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). సాంకేతికవిద్యలోనూ, వైద్యవిద్యలోనూ రాణిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయాలలో మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వల్ల లాభపడతారు. రాజకీయంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఒక స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేసి, విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయపదవి ప్రాప్తి. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవు పెడతారు. స్త్రీ, పురుషుల అనుబంధానికి, స్నేహానికి వక్రభాష్యాలు చెప్పేవారు మీ వల్ల ఇబ్బందులు పడతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇతరులను నిష్కారణంగా అనుమానిస్తారు. ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినా, మీ వైరివర్గంవారు విమర్శిస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయాలి, సౌరపాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడడం వలన వైరివర్గం మీ మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ సన్నిహిత, సహచరవర్గంలో ఉండేవారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యాసంబంధ విషయాలు బాగున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపిక అవుతారు. సాంకేతికవిద్యలో రాణిస్తారు. రాజకీయ పదవీప్రాప్తి. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చుపెట్టి సంతానాన్ని ఒకదారికి తీసుకు వస్తారు. మీరు ఊహించిన విధంగా వారు జీవితంలో స్థిరపడతారు. ఆర్థికాభివృద్ధి కొరకు కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. కుటుంబానికి సహోదరసహోదరీ వర్గానికి అండగా నిలుస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, పెట్టుబడులు లాభిస్తాయి. సంపాదించిన ధనాన్ని మంచికి ఉపయోగిస్తారు. కళా, సాహిత్య, సాంకేతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ప్రేమవివాహాలు సఫలం కావు. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు కలిసివస్తాయి. జీతం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేయరు. ప్రదేశం ఆధారంగా ఉద్యోగ నిర్ణయం చేస్తారు. సర్పదోష నివారణా కంకణం ధరించండి. వీలైనంత వరకు విభేదాలకు దూరంగా ఉండండి. మీకు మీరుగా సమస్యలను పెద్దవిగా చేయవద్దు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. మంచి ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు వివాహకాలం. నిత్యం హనుమాన్ సింధూర్ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. సంఘాల ద్వారా మంచి ఖ్యాతి, సంఘాలకు మంచి నాయకత్వం వహించడం తద్వారా లాభాలు గడించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. బ్యాంకు ఋణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. ప్రతిష్ఠాత్మక పదవులకు ఎంపిక అవుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంది. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుంటే! గతించిన రక్తసంబంధీకుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణం అవుతాయి. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుని అయినవాళ్ళకు దూరం అవుతారు. వివాహపరంగా సొంత నిర్ణయాలు మీ జీవితానికి మేలు చేయవు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంద్రాణి రూపును మెడలో ధరించండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా వచ్చిన ఓ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత ఓర్పు పాటించడం అవసరం. ప్రభుత్వ పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపుతారు. సంతానం మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది. మీ మనస్తత్వానికి విరుద్ధంగా సంతానం ప్రవర్తిస్తారు. మొండితనంతో ఉండవద్దు ఇంట్లో మీ మాటే నెగ్గాలి అన్న మొండితనంతో ఉండవద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, భేదాభిప్రాయాలలో పంతాలకు పోకుండా, సర్దుకుపోవడం వల్ల లాభం చేకూరుతుంది. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్లోనూ, వ్యాపారప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ఆత్మీయులతో, సన్నిహితులతో వాగ్వివాదాలు సంభవిస్తాయి. బ్యూటీపార్లర్లు నడిపేవారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
కర్కాటకం: గ్రూప్–1 కొలువు.. ప్రేమ వివాహం కలిసిరాదు, ఆ హోమం చేయండి
కర్కాటక రాశి (ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4) కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. తృతీయ చతుర్థ స్థానాలో కేతువు, అష్టమస్థానంలో శని, భాగ్య దశమ స్థానాలలో గురురాహువులు, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు కీలక ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన గృహ వస్తు వాహనాలను సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ పేరుమీద నడిచే సంస్థలకు ఆదరణ లభిస్తుంది. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఇతరుల కుయుక్తులు మీపై ప్రభావం చూపవు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. అందరినీ కలుపుకొనిపోయి విజయాలు సాధిస్తారు. ఎరుపు, పసుపు వత్తులతో అష్టమూలికాతైలం కలిపి దీపారాధన చేయండి. స్త్రీల సహాయసహకారాలు లాభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. కార్యాలయంలో మీపై దుష్ప్రచారం చేసేవారికి బదిలీ జరుగుతుంది. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన వ్యాపారాలలో రాణిస్తారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. విడిపోయిన రెండు కుటుంబాలను కలుపుతారు. బంధువులతో, దాయాదులతో వివాదాలు సంభవిస్తాయి. ఇతరులు మీపై మోపిన ఆరోపణలు బహుళ ప్రచారంలో ఉంటాయి. మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. పన్నుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కీ ళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోని వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఒత్తిడుల నుంచి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. ఏరు దాటాక తెప్పను తగలేసే వ్యక్తులు మీ మనోవేదనకు కారణం అవుతారు. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. తనఖాలో ఉంచిన విలువైన వస్తువులను విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాను అమలుపరచడం మంచిది. జీవితభాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా, సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకి గురిచేస్తుంది. వ్యతిరేకమైన ఆలోచనా ధోరణి, ఇతరులపై అనుమానం మానసిక సంఘర్షణకు దారితీస్తాయి. విదేశాలలో విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. వివాహం కాని వారికి వివాహప్రాప్తి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూమైన కాలం. నూనె, లోహ వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు అనుకూలమైన కాలం, మంచి లాభాలు వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మకద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతలు మీ సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం ఉండదు. ప్రతి విషయంలోనూ ఎంతోకొంత సొంతలాభం లేకుండా తలదూర్చరు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, రాహుకేతు గ్రహదోష పరిహార కంకణం లేదా రూపు ధరించాలి. గతంలో ఉచితంగా చేసిన కార్యక్రమాలకు, ప్రజాసేవకు కొన్ని వ్యాఖ్యానాలు రావడం మీలోని ఈ మార్పుకు కారణం అవుతుంది. మధ్యవర్తిత్వం చేసి కొందరి మధ్య సయోధ్య కుదురుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటిలోనూ మెరిట్ మార్కులు సంపాదిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగానికి ఎంపికవుతారు. కుటుంబానికి అండగా ఉండటానికి భగవంతుడు ఈ అవకాశం కల్పించాడని మీరు భావిస్తారు. ఎక్కడా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. సొంతవాళ్ళను ఇతరులు అవమానిస్తే వాళ్ళకు తగినవిధంగా బుద్ధి చెబుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యారంగంలో చక్కగా రాణిస్తారు. పిల్లలను చదివించడానికి అవసరమైన డబ్బు లేకపోవడం వల్ల ఇతరుల సహాయం మీద ఆధారపడటం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం సంభవిస్తుంది. పేదరికం వల్ల చదువుకోలేని చదువులు కనీసం పిల్లలైనా చదువుకోవాలని ఆశిస్తారు. దొంగ స్వామీజీలను, దొంగ బాబాలను, దొంగ గురువులను నమ్మి మోసపోతారు. పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, అలవాట్లు, స్నేహితులు మొదలైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశకాలమాన పరిస్థితులను బట్టి మీ ప్రత్యేక పర్యవేక్షణ చాలా అవసరం. మెరిట్ మార్కులు సాధించినా, ఇతరాత్ర రంగాలలో మీకు మెరిట్ సర్టిఫికెట్లు ఉన్నా ఏ విద్యాసంస్థలోనూ ఫీజులో రాయితీ లభించదు. ధర్మదేవత ఒంటికాలి మీద నడవటం స్పష్టంగా కనబడుతుంది. ఆర్థికాభివృద్ధి కోసం స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉపయోగించండి. క్రీడారంగంలో, కీలకమైన పోటీలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. ప్రేమ వివాహం పట్ల ఊహించుకున్న ఆశల సౌధాలు కూలిపోతాయి. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులకు వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ సమస్యలను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం ఆందోళనకు కారణం అవుతుంది. సివిల్ సర్వీస్‌లకు, గ్రూప్–1 సర్వీస్‌లకు, మెడికిల్, ఐఐటీ వంటి వాటికి ఎంపిక అవుతారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏదో ఒక ఉద్యోగం మీరు సంపాదించగలుగుతారు. మీరు జీవితంలోకి ఆహ్వానించాలనుకున్న వ్యక్తికి ఇది వరకే రెండు పెళ్ళిళ్ళు అయ్యాయన్న విషయం తెలుసుకోగలుగుతారు. మనసు దృఢపరచుకుంటారు. పాతాళంలోకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది. మనస్సు నివ్వెరపోతుంది. నవనాడులూ కృంగిపోతాయి. మీ మనస్సు, మీ కళ్ళు రెండూ మోసం చేశాయని గ్రహిస్తారు. నేను చాలా తెలివిగల దానిని అనే అహంభావం ఉన్న మీకు, మీరెంత తెలివి తక్కువాళ్ళు అనేది రుజువవుతుంది (ఇది కొంతమంది విషయంలో మాత్రమే, అందరికీ కాదు). పెళ్ళికి సంబంధించి తల్లిదండ్రుల మాటలు వినాలని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించినా మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి. మీ ఆలోచనలకు అనుగుణంగా పిల్లలను వృద్ధిలోకి తీసుకొస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. సమాజంలో మీ స్థాయిని, స్థానాన్ని పెంచుకోవడానికి దివారాత్రులు విశేషంగా కృషి చేస్తారు. చాలామంది అసూయపరులు మీరు అభివృద్ధి చెందకూడదని వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి మీ విషయంలో నిజమవుతుంది. సంవత్సర ద్వితీయార్ధంలో సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. -
వృషభం: ఈ రాశి వారికి ఇవి కలిసిరావు.. కీలక విషయం పరిష్కారం
(ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1) వృషభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పంచమ షష్ఠమ స్థానాలలో కేతువు, లాభ వ్యయస్థానాలలో గురు రాహువుల సంచారం, దశమస్థానంలో శని, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సాహసోపేత నిర్ణయాలతో చేపట్టిన కార్యాలలో విజయాలు సాధిస్తారు. ప్రతిరంగంలో గట్టిపోటీని ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ఓర్పు నేర్పులతో అందరినీ కలుపుకొనిపోయే ధోరణి అవలంబిస్తారు. ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షకపాత్ర పోషించవలసి వస్తుంది. తల్లిదండ్రులు, పెద్దల పట్ల బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. కుటుంబ విషయాలు మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఫ్యాన్సీ షాపుల వారికి, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రేతలకు, స్టేషనరీ వ్యాపారులకు, బ్యూటీపార్లర్స్ వారికి, చేతివృత్తుల వారికి, సుగంధద్రవ్య వ్యాపారులకు, ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి, హోల్‌సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా సత్ఫలితాలనిచ్చే నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు, స్నేహాలు ధనం ముందు పనిచేయవని తెలుసుకుంటారు. రాజకీయంగా కలసి వస్తుంది. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో, వారసత్వ ఆస్తులకు సంబంధించిన అంశాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు సమస్యలు సృష్టిస్తారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు అండగా నిలబడతారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. సర్పదోషాలు, గ్రహ బాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. మనోనిగ్రహంతో, క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. సంతానం లేని వారికి సంతానప్రాప్తి, వివాహం కాని వారికి వివాహప్రాప్తి కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు. వృత్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందినవాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. మీకు మేలు కలిగించే పత్రాలు ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి. దూరప్రాంత విద్యాసంబంధ విషయాలు కష్టంమీద ఫలిస్తాయి. ఇతరుల జీవితాలు సరిదిద్దవలసిన బాధ్యతలు మీమీద పడతాయి. గతంలో మీకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. నూతన కోర్సులను అభ్యసిస్తారు. సంవత్సర మధ్యలో జీవితభాగస్వామి ఆరోగ్యం గురించి, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధవహించవలసి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అయినా వివాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. శత్రువర్గం బలపడి ఉండటం ఇబ్బందికరంగా మారుతుంది. టీవీ, సినీరంగాల్లోని వారికి, కళాకారులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచటం వల్ల ఎంతగానో లాభపడతారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. విదేశీ ఉద్యోగ, విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. మీరు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రశంసలు పొందుతాయి. మానసిక సంతోషం కోసమే ధర్మకార్యాలు చేస్తారు. ప్రచారం కోసం కాదు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కోరుకున్న ఉద్యోగం లభించడం మీకు సంతోషాన్నిస్తుంది. వైద్య విద్యలో రాణిస్తారు. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ అనుకూలంగా మారుతాయి. దయ లేని అధికారుల వల్ల కొంతకాలం ఇబ్బందిపడతారు. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తిలో మీ వాటా దక్కుతుంది. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. ఆవేశంలో మాట్లాడిన మాటలకు చింతించవలసి వస్తుంది. విద్యాపరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని అనుకూల ఫలితాలను సాధిస్తారు. దూరదృష్టితో చేసే ప్రతి పని మీకు కలిసి వస్తుంది. మీ చెడు కోరుకునే వారు మీకు అత్యంత సమీపంలో ఉన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోండి. స్వగృహ యోగం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి. కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంవత్సర ద్వితీయార్ధంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో చిన్నచిన్న ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. మీ పిల్లలపై ఇతరుల పెత్తనం మీకు నచ్చని విషయం అవుతుంది. ఒకప్పుడు మీరు గౌరవించిన వ్యక్తులే మీకు బద్ధశత్రువులు అవుతారు. మీ పేరుమీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు విషయాల్లో ఇతరులకు సలహాలు ఇవ్వవద్దు. మోసగాళ్ళకు జీవితంలో తావు ఇవ్వకండి. పెద్దల నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. ప్రేమ వివాహాలు కలిసిరావు. ఇతరులకు చేబదులుగా ధనం ఇవ్వొద్దు, తీసుకోవద్దు. డబ్బు ఇవ్వవలసి వస్తే అప్పుగా ఇవ్వొద్దు, దానంగా ఇవ్వండి. రాజకీయ వాతావరణంలోకి ప్రవేశించవలసి వస్తుంది. రాజకీయపదవి లభిస్తుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని పాటిస్తారు. ఆత్మీయవర్గం సూటిపోటి మాటలు బాధిస్తాయి. వృద్ధులపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉత్తర్వులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. సంగీత, సాహిత్యరంగాలో అవార్డులు, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. పలుకుబడి, డబ్బులతో ఎంతపనైనా సులభసాధ్యం చేస్తుందని గ్రహిస్తారు. విద్య, సాంకేతిక, క్రీడారంగాలలో విశేషంగా రాణిస్తారు. మీ శక్తిసామర్థ్యాలకు గాను, ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి. పోటీపరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా విజయం సాధించాలనే మీ పట్టుదల మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రేమవివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సాంకేతిక విద్యాపరంగా చక్కగా రాణిస్తారు. తల్లిదండ్రులతో పెనవేసుకున్న అనుబంధాలు ఏమవుతాయోనని సందిగ్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. కొద్దికాలం గైనిక్ సమస్యలతో బాధపడతారు. అవివాహితులకు వివాహకాలం. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధ్యతలలో భాగం పంచుకుంటారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. సహోదర సహోదరీ వర్గాన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. తోటివాళ్ళ ముందు ప్రతిష్ఠను నిలబెట్టుకోవడానికి ఆరోగ్యం, నిద్ర, ఆహారాన్ని లెక్కచేయకుండా శ్రమిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. మొత్తంమీద ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
మేషం: ఈ రాశి వారు జీవితాశయాన్ని సాధిస్తారు
మేషం (ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1) మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న వ్యయస్థానాల్లో గురురాహువుల సంచారం, షష్ఠమ సప్తమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, లాభస్థానంలో శనిగ్రహ సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబం నుంచి వేరుపడే ఆలోచనలు, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితాశయాన్ని సాధించ గలుగుతారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరిగేలా ఓ మంచి అవకాశం వస్తుంది. మీకు రావలసిన ధనం అంత సులభంగా చేతికి అందదు. లక్షల్లో ఇచ్చిన ధనాన్ని వేలల్లో వసూలు చేసుకుంటారు. కుటుంబంలో అశాంత వాతావరణం లేకుండా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల వల్ల చికాకులు, విభేదాలు సంభవిస్తాయి. జ్యేష్ఠ కుమార్తె లేక కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని విషయాలలో రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది. మధ్యవర్తి సంతకాలు ఎక్కడా పెట్టకండి. కొన్ని విషయాలో మొండిగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. దొంగల వల్ల ప్రమాదం పొంచి వుంది. భాగస్వాములతో వివాదాలు వస్తాయి. మోసానికి సాక్ష్యం మౌనమే అవుతుంది. భూముల వల్ల లాభం పొందుతారు. భూ వివాదాలు కూడా ఎదురవుతాయి. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. ఆరోగ్య విషయాలలో, సెల్ఫ్‌డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహోదర సహోదరీ వర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు. నూతన వ్యాపారం కలిసొస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేస్తారు. దీర్ఘాకాలిక ఋణాలు తీర్చివేస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మందుల వ్యాపారులకు, వైద్యులకు, లోహపు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, చేతివృత్తి పనివారికి, విద్యా పరిశోధన రంగాల్లో ఉన్నవారికి, ఆహారధాన్యాల వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వస్త్ర వ్యాపారులకు ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కళా, సాహితీరంగాలలో ప్రఖ్యాతి లభిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పౌల్టీఫ్రావ్ులు, పశువుల పెంపకం లాభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సిబ్బందికి మీ మనస్తత్వం అర్థంకాక విధిలేని పరిస్థితులలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు. స్వగృహ నిర్మాణం నెరవేరుతుంది. పాత శత్రువులే కొత్తగా తారసపడతారు. వారిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్ధంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఉన్నతాధికారుల వద్ద అభిమానం సంపాదించుకుంటారు. విద్యా సంబంధిత ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రమాదకర వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి ఖర్చుపెట్టే ధనానికి తగిన విధంగా ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ ప్రయాణం రెండవ ప్రయత్నంలో నెరవేరుతుంది. ఉన్న ఆస్తులను అతికష్టం మీద అమ్మకుండా కాపాడుకుంటారు. చెప్పుడు మాటలు మీ కుటుంబసభ్యుల మీద తీవ్ర ప్రభావం చూపించడం సమస్యగా మారుతుంది. గతంలో కంటే భిన్నంగా ఉన్న మీ ప్రవర్తన, ఆలోచనా విధానం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలకు దారితీస్తుంది. దుర్వ్యసనాల ప్రభావం, స్నేహితుల ప్రభావం కొంత పెడదోవ పట్టించే అవకాశం ఉంది. బెట్టింగులకు దూరంగా ఉండండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. మంచి సంబంధం తిరస్కరించినందుకు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. జీవితంలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ప్రధానపాత్ర వహిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయాలి, చేతికి మహాపాశుపత కంకణం ధరించాలి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. చాలా సందర్భాలలో మీకు ఇష్టంలేని విషయంపైనే చర్చించవలసి వస్తుంది. పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగడానికి మొగ్గు చూపుతారు. మీ మీద ఎటువంటి ప్రలోభాలు పనిచేయవు. జీవితాశయాన్ని సాధిస్తారు. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. మామూలు ప్రమిదలతో దీపారాధన చేయటం కన్నా లక్ష్మీప్రమిదలతో దీపారాధన చేయటం వల్ల్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది. అయినవాళ్ళకి అరమరికలు లేకుండా సహాయం చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ కాలం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీ నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. వెన్నుచూపి పారిపోవటం మీ చరిత్రలో లేదని నిరూపిస్తారు. దివారాత్రులు శ్రమించినా గుర్తింపు రాని ఉద్యోగాలను మానేసి, మరొక చోట ఉద్యోగం చూసుకుందామని భావిస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తారు, లాభాలు గడిస్తారు. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. జీవితా శయాన్ని సాధించుకోగలుగుతారు. సర్పదోషాలు, గ్రహాల వల్ల కలిగే బాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయ రాదు). విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో మంచి ఫలితాలు వచ్చినా, ఇంటర్వ్యూలలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. పూజలలో, అభిషేకాలలో జవ్వాదిని ఉపయోగించండి. క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ముఖ్యంగా సంగీత నాట్యాల్లో అఖండమైన పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. సినిమారంగంలో, టీ.వీలలో అవకాశాలు వస్తాయి. కోర్టుతీర్పులు అనివార్యం అవుతాయి. ముఖ్యులతో విడిపోవలసి వస్తుంది. కీలకమైన స్థానంలో నిరాదరణ ఎదురవడంతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. భవిష్యత్తు ఫలితాలకు మంచి పునాది ఏర్పడు తుంది. అతికష్టం మీద ఉన్నత విద్యను అభ్యసిస్తారు. మీ పేరుమీద చేసే వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. క్రమశిక్షణ తప్పిన సంతానాన్ని అతికష్టం మీద దారిలో పెట్టగలుగుతారు. సంతానం ప్రయోజకులవుతారన్న నమ్మకం కుదురు తుంది. తల్లివైపు బంధువులకు కొంతకాలం అండగా నిలువవలసి వస్తుంది. మీ ఆత్మీయవర్గం విదేశాలలో స్థిరపడతారు. మీకు సహాయం చేస్తారు. చేతివృత్తులు, అలంకార కేంద్రాలు, వస్త్ర వ్యాపారం వంటి వాటిలో రాణిస్తారు. ఫైనాన్స్, చీటీల వ్యాపారాలు చెప్పదగినవి కావు. వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది.