శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆశ్వయుజమాసం, తిథి: శు.చవితి రా.11.26 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అనూరాధ రా.8.26 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.1.56 నుండి 3.33 వరకు, దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.09 వరకు,, అమృత ఘడియలు: ఉ.9.54 నుండి 11.31 వరకు. రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం : 5.56, సూర్యాస్తమయం : 5.34.
మేషం... దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.
వృషభం... బంధువులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. పనుల్లో విజయం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం.... సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
కర్కాటకం.... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
సింహం... మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య... పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
తుల..... వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.
వృశ్చికం.... ఉద్యోగయోగం. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
ధనుస్సు.... మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.
మకరం.. యత్నకార్యసిద్ధి. నూతనంగా చేపట్టిన పనులు పురోగతి. ఆస్తిలాభం. దైవదర్శనాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.
కుంభం... కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు.
మీనం.... కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
Comments
Please login to add a commentAdd a comment