
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.సప్తమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: స్వాతి ఉ.8.17 వరకు, తదుపరి విశాఖ,వర్జ్యం: ప.2.28 నుండి 4.12 వరకు,దుర్ముహూర్తం: ఉ.11.53 నుండి 12.41 వరకు,అమృతఘడియలు: రా.12.56 నుండి 2.44 వరకు
సూర్యోదయం : 6.29
సూర్యాస్తమయం : 5.58
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం...పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో ఆదరణ. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం....బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
మిథునం...పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.
కర్కాటకం...వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
సింహం....సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కన్య...పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
తుల...సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
వృశ్చికం...ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో అవాంతరాలు. స్వల్ప రుగ్మతలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
ధనుస్సు...సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు నెరవేరతాయి.
మకరం....ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
కుంభం....వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం....సన్నిహితులతో కలహాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment