శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.సప్తమి రా.1.34 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు ఉ.9.40 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.6.22 నుండి 8.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.33 వరకు, అమృతఘడియలు: ఉ.7.06 నుండి 8.48 వరకు, తిరిగి తె.4.47 నుండి 6.31 వరకు (తెల్లవారితే ఆదివారం); రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.04, సూర్యాస్తమయం: 5.26.
మేషం.... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
వృషభం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.
కర్కాటకం... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.
కన్య... మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
తుల.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం.... పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.
ధనుస్సు... రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
మకరం..... శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కుంభం... బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మీనం... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment