
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.పంచమి రా.2.34 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: చిత్త తె.5.40 వరకు (తెల్లవారితే మంగళవారం) తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.11.57 నుండి 1.41 వరకు, దుర్ముహూర్తం: ప.12.40 నుండి 1.28 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: రా.10.29 నుండి 12.14 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.30, సూర్యాస్తమయం: 5.57.
మేషం...కొత్త పనులు చేపడతారు. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.
వృషభం... శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.
మిథునం....రుణఒత్తిడులు పెరుగుతాయి. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. ఉద్యోగ మార్పులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.
కర్కాటకం...ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
సింహం....వ్యయప్రయాసలు. «ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య....ఉద్యోగయత్నాలలో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకర పరిస్థితి.
తుల.....పనులు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం..పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. చిన్ననాటì విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు.....పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.
మకరం...ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. శ్రమ తప్పదు. బంధువుల కలయిక.
కుంభం..శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. పనులలో కొంత జాప్యం. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగాలు, వ్యాపారాలలో చికాకులు. మిత్రులను కలుసుకుంటారు.
మీనం...వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
Comments
Please login to add a commentAdd a comment