శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి పూర్తి (24గంటలు), నక్షత్రం: మఖ సా.4.43 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.1.35 నుండి 3.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.20 నుడి 9.06 వరకు తదుపరి రా.10.27 నుండి 11.19 వరకు, అమృతఘడియలు: ప.2.05 నుండి 3.52 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు, రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 6.04 సూర్యాస్తమయం : 5.24.
మేషం.... పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
మిథునం..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
కర్కాటకం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
సింహం.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
కన్య.... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. మానసిక అశాంతి. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
తుల... శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.
ధనుస్సు... మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం..... శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బం«ధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
కుంభం..... మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
మీనం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment