
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు ఆశ్వయుజమాసం, తిథి: శు.పంచమి రా.10.28 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: జ్యేష్ఠ రా.8.10 వరకు, తదుపరి మూల, వర్జ్యం: ప.3.57 నుండి 5.28 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.15 వరకు, అమృత ఘడియలు: ఉ.11.24 నుండి 1.00 వరకు.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :ఉ.6.00 నుండి 7.30 వరకు.
మేషం... దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం... పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం... ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం.... కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య.... నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది..
తుల... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
వృశ్చికం... పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
ధనుస్సు... పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగుల మందగిస్తాయి.
మకరం.... బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం.... శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.
మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment