Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Dhanasu Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Dhanussu-Ugadi Rasi Phalalu 2023: ధనుస్సు రాశివారికి ఈ ఏడాది సూపర్..

Published Mon, Mar 20 2023 12:50 PM | Last Updated on Mon, Mar 20 2023 6:30 PM

Yearly Rasi Phalalu Sagittarius Horoscope 2023 - Sakshi

ధనుస్సు(ఆదాయం  8, వ్యయం  11,  రాజపూజ్యం 6, అవమానం 3)
ధనుస్సు రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తృతీయ స్థానంలో శని, చతుర్థ పంచమ స్థానాలలో గురు సంచారం, దశమ లాభ స్థానాలలో కేతుగ్రహ సంచారం, చతుర్థ పంచమ స్థానాలలో రాహుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు సంకల్పాలను నెరవేర్చుకోవడానికి నూటికి నూరుపాళ్ళు శ్రమించాల్సి ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అన్నివిధాలుగా సానుకూల ఫలితాలను అందుకోగలుగుతారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. జలసంబంధ వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ధనం, కీర్తి సూచిస్తున్నాయి. 

ఓం నమోనారాయణ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఒకచోట లాభాలు రాకపోయినా మరొకచోట లాభాలు వస్తాయి. ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. బంగారం, వెండి వంటి లోహాల వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబ పురోగతిలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. వైరివర్గం మిమ్మల్ని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. స్వగృహ యోగం సంభవం. నూతన వ్యాపారం మొదలుపెట్టడానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి,ఉద్యోగాలలో మీరు చేసిన కార్యక్రమాలు వివాదస్పదం అవుతాయి. కొందరికి మీరు వ్యక్తిగతంగా హామీ ఉండవలసి వస్తుంది. ప్రేమ, వివాహం వంటివి నిదానంగా అనుకూలిస్తాయి. సంవత్సర చివరలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది. సమష్టిగా నూతన వ్యవహారాలను నిర్వహిస్తారు. ఎవరికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలో, ఎంత భాగం ఇవ్వాలో చక్కగా నిర్ణయిస్తారు. 

ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. చిట్‌ఫండ్స్, ఉమ్మడి ఖాతాలు లాభించవు. ఫైనాన్స్‌ వ్యాపారంలో ఇబ్బందిపడతారు. ఒక మంచి కార్యక్రమం కోసం వసూలు చేసిన చందాల విషయంలో వివాదాలు, నిందలు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేకశైలిని నిలబెట్టుకుంటారు. పట్టుదలగా వ్యవహరిస్తారు. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. కొత్త పరిచయాల వల్ల ఉపయోగం కలుగుతుంది. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంవత్సర ద్వితీయార్ధంలో సంతాన విషయమై ప్రత్యేకశ్రద్ధ వహించవలసి వస్తుంది. కీళ్ళనొప్పులు రావచ్చు. లైసెన్సు, ఆయుధాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి.

సంవత్సర ప్రథమార్ధంలో ఆర్థిక విషయాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చెల్లించవలసి ఋణాలు చెల్లిస్తారు. తనఖాలు విడిపిస్తారు. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగి, జనాకర్షణ ఏర్పడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో కోరుకున్న పురోగతి లభిస్తుంది. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారాలు అనుకూల ఫలితాలను సాధిస్తారు. చేతివృత్తుల వారికి మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. భూములు కొనుగోలు, అమ్మకాల విషయాలలో లాభపడతారు. రహస్య ప్రయాణాలు చేస్తారు. రహస్య చర్చలు ఫలిస్తాయి.

మాట నిలకడలేని మనుషులతో కలిసి పనిచేసి నష్టపోతారు. కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తారు. పరిస్థితులు అందుకు అనుకూలించవు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండడం మంచిది. వాహన సౌఖ్యం కలుగుతుంది. ఎన్ని సాధించినా ప్రశాంతత లభించదు. కుటుంబంలో ఆప్యాయతానురాగాలు లోపిస్తాయి. ఇన్సూరెన్స్‌ సేవలను ఉపయోగించుకుంటారు. అందరి అభిప్రాయాలకు భిన్నంగా ఒక శుభకార్యాన్ని పూర్తిచేస్తారు. రాజకీయంగా ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో  విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్‌ మీడియా, ఎలక్టాన్రిక్‌ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానా రకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి.

సంవత్సర ద్వితీయార్ధంలో కాలానికి ఎదురీది అనుకూల ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధించి కుటుంబ ప్రతిష్ఠ నిలబెడతారు. శుభకార్యాల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి సంభవం. అవివాహితులకు వివాహప్రాప్తి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయాలి, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. 

స్త్రీలకు ప్రత్యేకం:  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు సర్దుకుపోతారు. అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. చట్టపరంగా విడిపోవాలని నిశ్చయించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. అందరికీ వర్తించదు.

మీ సంతానానికి కలలో కూడా ఊహించని విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువవుతాయి. ఇబ్బందులు నాగాస్త్రం వలే మీదకు వస్తాయి. శ్రీకృష్ణుని దయతో అర్జునుడు బయటపడినట్లు దైవానుగ్రహంతో మీరు బయటపడగలుగుతారు. పూర్వీకుల స్థిరాస్తుల విషయంలో కొత్త సంగతులు వెలుగు చూస్తాయి. అవి మీకు లాభిస్తాయి. 

క్రీడా, సాంస్కృతిక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. తల్లిదండ్రుల మాటను గౌరవిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధించి, ఉద్యోగం సంపాదిస్తారు. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. విదేశీ సంబంధం కుదురుతుంది. ఆకస్మికంగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పేరుపై ఇతరులు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. స్వగృహ నిర్మాణం నెరవేరుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి కలసివస్తుంది. ఒకప్పుడు ఎంతో కష్టపడ్డ జీవితం ఈ రోజు చిగురించిన చెట్టులాగా కళకళ లాడుతుంది. మీ వైభోగాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించే వ్యక్తి శాశ్వతంగా దూరం కావడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది.

ధనాకర్షణకు అష్టలక్ష‍్మీ పీఠాన్ని ఉపయోగించండి. వ్యాపారపరంగా అనేక అవకాశాలు కలిసివస్తాయి. నూతన బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. అందరినీ మీ కనుసన్నలలో ఉంచకోగలుగుతారు. కాంట్రాక్టులు, టెండర్లు, వర్క్‌ ఆర్డర్‌లు, వస్త్ర వ్యాపారాలు, సబ్‌కాంట్రాక్టులు లాభదాయకంగా ఉంటాయి. వ్యక్తిగత అవసరాలకు, ఆరోగ్యం కొరకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. సంతానం కోసం మీరు కల్పించిన సదుపాయాలు, వసతులు, దుర్వినియోగం అవుతాయి. స్థిరాస్తి విషయాలలో ఒప్పందాలు కుదురుతాయి. అమ్మాయి పెళ్ళికి సంబంధించి ఒక మంచి సంబంధం దగ్గర వరకు వచ్చి చేజారిపోతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి కాలం అనుకూలంగా వుంది. 

అవివాహితులైన స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబంలో అనైక్యత. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయటం కష్టమవుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ సహకారం వల్ల ఒక పునర్వివాహం జరుగుతుంది. ఎక్కడా తలవంచకుండా రాజీలేని జీవితాన్ని గడుపుతారు. అడ్మినిస్ట్రేషన్‌ పదవుల్లో ఉన్నవారికి, అధికారంలో ఉన్నవారికి ఇతరులకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. విలువైన ఆభరణాలు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సంవత్సర ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement