శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పంచమి రా.11.12 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మృగశిర ఉ.6.47 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ప.3.36 నుండి 5.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.34 వరకు, తదుపరి ప.2.24 నుండి 3.10 వరకు, అమృత ఘడియలు: రా.9.30 నుండి 11.10 వరకు, రాహుకాలం ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం : 6.02, సూర్యాస్తమయం : 5.27.
మేషం.... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన.
వృషభం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిథునం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కర్కాటకం.... కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. అర్థిక ఇబ్బందులు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం... సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కన్య.... కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
తుల... పనుల్లో ప్రతిష్ఠంభన ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
ధనుస్సు... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిత్రమైన సంఘటనలు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం... సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కుంభం... పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.
మీనం.... బంధువులతో స్వల్ప విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment