శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.షష్ఠి రా.12.10 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.8.02 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.8.50 నుండి 10.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.20 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.53 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.03, సూర్యాస్తమయం: 5.26.
మేషం... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం.... వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మిథునం... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
కర్కాటకం.... బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ముఖ్య పనులు సజావుగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కన్య.... కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
తుల.... రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. అనారోగ్యం.
వృశ్చికం... చేపట్టిన వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొంటారు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
ధనుస్సు.. శుభవర్తమానాలు అందుతాయి. కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మకరం.... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కుంభం.. కుటుంబంలో సమస్యలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.
మీనం..... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment