Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Vruschika Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Vrischikam-Ugadi Rasi Phalalu 2023: ఈ ఏడాది చాలా బాగుంది.. అయితే అవివాహితులు మాత్రం..

Published Mon, Mar 20 2023 12:03 PM | Last Updated on Mon, Mar 20 2023 6:33 PM

Yearly Rasi Phalalu Scorpio Horoscope 2023 - Sakshi

వృశ్చిక రాశి (ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3 అవమానం 3)
Ugadi 2023 Panchangam: వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. చతురంలో శని, పంచమ, షష్ఠమ స్థానాలలో గురు రాహువుల సంచారం, వ్యయ లాభ స్థానాలలో కేతుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మధ్యస్థంగా ఉంటాయి.

ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు. ఉన్నతస్థానాలను సాధిస్తారు. దైవభక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు, వాగ్దానాలు కుదురుతాయి. శనిగ్రహ అనుకూలత కొరకు ప్రతినిత్యం కాలభైరవాష్టకం, హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి. నెలకు ఒకసారైనా శనికి తైలాభిషేకం చేయించండి.

భూముల వ్యవహారాలు వివాదస్పదం కాకుండా చర్యలు తీసుకోండి. శుభకార్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. మీ హితవుకోరే బంధువులు ఎవరో తెలుస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు. వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్తి చెబుతారు. జీవితభాగస్వామితో అన్నివిషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు.

జీవిత భాగస్వామి చెప్పిన పనులను కాదనకుండా చేస్తారు. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇస్తారు. సంతానం మనోభావాలను గౌరవిస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళు వంటి వ్యవహారాలలో కఠినంగా వ్యవహరిస్తారు. కీళ్ళనొప్పులు, ఎలర్జీ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయం వచ్చే వాటిల్లోనే ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. తెల్లజిల్లేడువత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది.

ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు
జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పని సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. మీ ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. మీ వాళ్ళకు ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి. నష్టపోకుండా లాభాలతో బయటపడతారు.

స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారన్న అపవాదు వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలిని నిలబెట్టు కుంటారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది.

మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థల పురోగతి బాగుంటుంది. విద్యా, ఉద్యోగ, విదేశీయాన సంబంధమైన విషయాలు బాగుంటాయి. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు).

సాంకేతికవిద్యలోనూ, వైద్యవిద్యలోనూ రాణిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయాలలో మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వల్ల లాభపడతారు.

రాజకీయంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఒక స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేసి, విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయపదవి ప్రాప్తి. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవు పెడతారు. స్త్రీ, పురుషుల అనుబంధానికి, స్నేహానికి వక్రభాష్యాలు చెప్పేవారు మీ వల్ల ఇబ్బందులు పడతారు.

పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇతరులను నిష్కారణంగా అనుమానిస్తారు. ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినా, మీ వైరివర్గంవారు విమర్శిస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయాలి, సౌరపాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు.

మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడడం వలన వైరివర్గం మీ మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ సన్నిహిత, సహచరవర్గంలో ఉండేవారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది.

స్త్రీలకు ప్రత్యేకం:
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యాసంబంధ విషయాలు బాగున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపిక అవుతారు. సాంకేతికవిద్యలో రాణిస్తారు. రాజకీయ పదవీప్రాప్తి. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చుపెట్టి సంతానాన్ని ఒకదారికి తీసుకు వస్తారు. మీరు ఊహించిన విధంగా వారు జీవితంలో స్థిరపడతారు.

ఆర్థికాభివృద్ధి కొరకు కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. కుటుంబానికి సహోదరసహోదరీ వర్గానికి అండగా నిలుస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, పెట్టుబడులు లాభిస్తాయి. సంపాదించిన ధనాన్ని మంచికి ఉపయోగిస్తారు. కళా, సాహిత్య, సాంకేతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ప్రేమవివాహాలు సఫలం కావు. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు కలిసివస్తాయి.

జీతం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేయరు. ప్రదేశం ఆధారంగా ఉద్యోగ నిర్ణయం చేస్తారు. సర్పదోష నివారణా కంకణం ధరించండి. వీలైనంత వరకు విభేదాలకు దూరంగా ఉండండి. మీకు మీరుగా సమస్యలను పెద్దవిగా చేయవద్దు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి.

మంచి ఉద్యోగం లభిస్తుంది
అవివాహితులకు వివాహకాలం. నిత్యం హనుమాన్‌ సింధూర్‌ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. సంఘాల ద్వారా మంచి ఖ్యాతి, సంఘాలకు మంచి నాయకత్వం వహించడం తద్వారా లాభాలు గడించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. బ్యాంకు ఋణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. ప్రతిష్ఠాత్మక పదవులకు ఎంపిక అవుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంది.

వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుంటే!
గతించిన రక్తసంబంధీకుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణం అవుతాయి. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుని అయినవాళ్ళకు దూరం అవుతారు. వివాహపరంగా సొంత నిర్ణయాలు మీ జీవితానికి మేలు చేయవు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంద్రాణి రూపును మెడలో ధరించండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా వచ్చిన ఓ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో కొంత ఓర్పు పాటించడం అవసరం. ప్రభుత్వ పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపుతారు. సంతానం మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది. మీ మనస్తత్వానికి విరుద్ధంగా సంతానం ప్రవర్తిస్తారు.

మొండితనంతో ఉండవద్దు
ఇంట్లో మీ మాటే నెగ్గాలి అన్న మొండితనంతో ఉండవద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, భేదాభిప్రాయాలలో పంతాలకు పోకుండా, సర్దుకుపోవడం వల్ల లాభం చేకూరుతుంది. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్లోనూ, వ్యాపారప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ఆత్మీయులతో, సన్నిహితులతో వాగ్వివాదాలు సంభవిస్తాయి. బ్యూటీపార్లర్లు నడిపేవారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement