Scorpio
-
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో సురక్షితమైన కార్లు (ఫోటోలు)
-
గద్వాల: లారీ, స్కార్పియో ఢీ.. నలుగురి మృతి
గద్వాల, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఓ స్కార్పియో వాహనం ఢీ కొట్టుకోవడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్-బెంగు జాతీయ రహదారి 44 పై ఎర్రవల్లి చౌరస్తా ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్పాట్లోనే చనిపోగా.. గాయపడిన ముగ్గురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నెంబర్ ఏపీ 29 జి 5553. కర్నూలు ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలోని వాళ్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ధాటికి వాహన ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
క్షణకాలంలో ఘోర ప్రమాదం
మదనపల్లె: అన్నమయ్యజిల్లా మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఆదివారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో స్కార్పియో వాహనాన్ని వేగంగా నడుపుతూ.. ఎదురుగా వస్తున్న రెండుకార్లు, రోడ్డుపై నిల్చున్న ఇద్దరు రైతులను ఢీకొని, అదుపుచేయలేని స్థితిలో లారీని ఢీకొని, ఐదుగురిని మృత్యువాతపడేలా చేసిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదతీవ్రతకు స్కార్పియో వాహనం నుజ్జునుజ్జు కావడంతో పాటుగా డ్రైవర్ తల ఎగిరి మొండెం కిందపడింది. వాహనంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప–బెంగళూరు జాతీయరహదారిపై మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాద ఘటన షాక్‌కు గురిచేసింది. ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాలు చిధ్రమైన వైనం, వాహనం నుజ్జునుజ్జు చూస్తుంటే.. మృత్యువు దూసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు మదనపల్లెకు చెందినవారే కావడం బాధాకరం. ఘటనకు సంబంధించిన వివరాలు.. మదనపల్లె పట్టణం దేవతానగర్‌కు చెందిన చలపతి కుమారుడు సుంకరవిక్రమ్(38) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ 8నెలల క్రితం తిరిగి వచ్చాడు. స్థానికంగా తిరిగేందుకు ఏపీ–39, ఎన్జే–8439 స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశాడు. అమ్మచెరువుమిట్టకు చెందిన ఆటోడ్రైవర్ మల్లికార్జున కుమారుడు తిలక్(19) స్థానికంగా ఓ డిగ్రీ కళాశాలలో మొదటిసంవత్సరం చదువుతున్నాడు. తట్టివారిపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప కుమారుడు శ్రీనాథ్(25) ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్నాడు. రామారావుకాలనీకి చెందిన చరణ్‌కుమార్(25), హరీష్(33), మహేష్(31)లు స్నేహితులు. వీరు ఆరుగురు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలవరకు మదనపల్లెలోనే ఉన్నారు. తర్వాత మద్యం తాగుందుకు కర్ణాటకకు వెళ్లాలని నిర్ణయించుకుని విక్రమ్‌ను స్కార్పియో వాహనం తీసుకురమ్మని కోరారు. వాహనంలో ఆరుగురు కలిసి కర్ణాటకకు వెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు మద్యంతాగి మదనపల్లెకు బయలుదేరారు. కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్ట్‌లో బారికేడ్లను ఢీకొన్నారు. అక్కడ పోలీసులు తమను పట్టుకుంటారేమోనన్న భయంతో వాహనాన్ని వేగంగా నడుపుతూ, ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. అలాగే వస్తూ..మరో కారు సైడ్మిర్రర్ను ఢీకొని, వేగంగా ప్రయాణిస్తున్నారు. అదేసమయంలో చీకలబైలు పంచాయతీ కోళ్లవారిపల్లెకు చెందిన కరమల సుబ్రహ్మణ్యం ఆచారి అలియాస్ కాళిదాసు(55), యల్లుట్ల చంద్రప్ప(50) బార్లపల్లె పాలడిపోలో పాలుపోసి, రోడ్డుపై నిల్చున్నారు. వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం రోడ్డుకు అటువైపు నిల్చున్న వీరిద్దరినీ ఢీకొంది. వాహనం ఢీకొన్న ధాటికి రైతులు ఇద్దరూ ఎగిరి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో స్థానికులు అరుపులు, కేకలు వేయడంతో ఆందోళన చెందిన విక్రమ్ స్కార్పియో వాహనాన్ని మరింత వేగం పెంచాడు. మితిమీరిన వేగంలో వాహనాన్ని అదుపుచేయలేక, వెనుక పరిగెత్తుకుని వస్తున్న వ్యక్తులను గమనిస్తూ, ఏమరుపాటులో ఎదురుగా వస్తున్న బోరుసామగ్రి తరలించే లారీని ఢీకొన్నాడు. దీంతో స్కార్పియో గాల్లోకి ఎగిరిలేచింది. టాప్ ఎగిరిపోయి కిందపడ్డ దెబ్బకు డ్రైవర్ విక్రమ్ తల తెగి మొండెం కిందపడింది. వాహనంలో ఉన్నటువంటి తిలక్, శ్రీనాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. చరణ్‌కుమార్, హరీష్, మహేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో తాలూకా సీఐ ఎన్.శేఖర్, 108 సిబ్బందిని అప్రమత్తం చేసి క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చరణ్‌కుమార్, హరీష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు రెఫర్ చేశారు. మహేష్ మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. క్షణకాలంలో ఘోర ప్రమాదం రాత్రి 7.40 గంటల సమయం. పల్లె ప్రశాంతంగా ఉన్న సమయంలో రోడ్డుపై దూసుకొచ్చిన ఓ వాహనం లారీని ఢీకొని గాల్లోకి ఎగిరి అందులోని వ్యక్తులు చెల్లాచెదురుగా కిందపడిన వైనం ఒక్కసారిగా భయాన్ని కల్పించిందని ప్రత్యక్షసాక్షి, బార్లపల్లె గ్రామస్తురాలు పద్మావతి తెలిపారు. స్కార్పియో వాహనం వేగంగా రావడం చూసిన తాను ఎక్కడ ఢీకొడుతుందోనని, ముందుగానే లారీని మార్జిన్లో నిలిపేశానని, అయితే దూసుకొచ్చి మరీ ఢీకొని గాల్లోకి లేచిందని తమిళనాడుకు చెందిన బోరు లారీ డ్రైవర్ దినేష్ చెప్పుకొచ్చాడు. కళ్లముందే ముగ్గురి ప్రాణాలు ఘోరంగా పోవడం తనను కలిచివేసిందని, షాక్ నుంచి తేరుకోలేకపోయానని భయపడుతూ చెప్పాడు. ప్రమాదంలో పేద కుటుంబాలకు చెందిన రైతులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు: కంపెనీ క్లారిటీ ఇది
తన కుమారుడికి మరణానికి కారణమంటూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలైన కేసుపై సంస్థ స్పందించింది. మృతుడు నడిపిన స్కార్పియో వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్‌లో ఎలాంటి లోపం లేదంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 23, 2023న దాఖలైన ఎఫ్ఐఆర్కు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు రూ. 20 లక్షల ఖరీదు చేసే కారులో భద్రతా ఫీచర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సంబంధిత కారులో ఎయిర్‌బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే వాహనం బోల్తా పడిన కారణంగా కారులో ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాలేదని తెలిపింది.అంతేకాదు ఈ కేసు 18 నెలలకు పైగా పాతది ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని తెలిపింది. 2020లో తయారైన స్కార్పియో S9 వేరియంట్లో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని ధృవీకరింకరించింది. తమ పరిశీలనలో ఎయిర్‌బ్యాగ్‌ల లోపం లేదని తేలిందని వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావని తెలిపింది. దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్టు కూడా తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది, విచారణకు తాము పూర్తి సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజేష్ మిశ్రా ఫిర్యాదు మేరకు మిశ్రా తన కుమారుడు అపూర్వ్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్ స్కార్పియో కారును బహుమతిగా ఇచ్చారు. 2022 జనవరి 14న అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లనే తనకు తీరని నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదు చేశారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రాతో పాటు, ఇతర కీలక ఉద్యోగులపై చీటింగ్ కేసు, 506 (నేరపూరిత బెదిరింపు), 102-B (నేరపూరిత బెదిరింపు)కేసులుపెట్టిన సంగతితెలిసిందే. -
ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే!
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మీద కాన్పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన 'రాజేష్ మిశ్రా' తన కుమారుడు మహీంద్రా కారులో ప్రయాణిస్తూ చనిపోవడంతో ఆనంద్ మహీంద్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానీతో పాటు కంపెనీలోని 11 మంది ఉద్యోగులపై కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం తన కొడుకు 'మహీంద్రా స్కార్పియో' (Mahindra Scorpio)లో ప్రయాణించే సమయంలో సీటు బెల్టు ధరించి ఉన్నప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల మరణించినట్లు వెల్లడించాడు. 2022 జనవరి 14న తన కొడుకు అపూర్వ్ లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగి వస్తున్న సమయంలో స్కార్పియో ప్రమాదానికి గురైనట్లు, ఈ సమయంలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లే మరణించాడని చెప్పుకొచ్చాడు. భద్రతలో స్టార్ రేటింగ్ కలిగిన కారులో ఎయిర్ బ్యాగులు ఎందుకు ఓపెన్ కాలేదని ఆరోపించాడు. ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే! ప్రమాదంలో కొడుకు మరణించిన 15 రోజుల తరువాత తాను కారు కొనుగోలు చేసిన డీలర్‌షిప్‌కి వెళ్లి సీటు బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదని వాపోయాడు. ఈ సందర్భంగా ఉద్యోగులు, రాజేష్ మిశ్రా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత వీరిపై కేసు నమోదు చేయించాడు. ఆరోపణల మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఆనంద్ మహీంద్రా ఇంకా స్పందించలేదు. FIR registered against Mahindra chairman in Kanpur, UP. Rajesh Mishra, a UP's Kanpur resident, gifted Mahindra Scorpio to his son Apoorv Mishra. On 14 January 2022, Apoorv returning to Kanpur from Lucknow in Scorpio met with an accident and died. He was wearing the seat belt… pic.twitter.com/7Pk3q9Mbgr — Piyush Rai (@Benarasiyaa) September 25, 2023 -
‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగం!
Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియోపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. 2002లో విడుదలైన స్కార్పియోకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆ వెహికల్ ఫ్లాప్ అయి ఉంటే బోర్డు నన్ను తొలగించేది. స్కార్పియో నమ్మకమైన యుద్ధ గుర్రం. అది ఎల్లప్పుడూ నా వెంటే ఉంటుంది. స్కార్పియో విఫలమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మహీంద్రా సంస్థ 2002లో స్కార్పియోని విడుదల చేసింది. స్కార్పియో రాకతో మహీంద్ర దశ మారింది. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని సంస్థ పేరు ప్రఖ్యాతలు గడించింది. తాజాగా, ఆ వెహికల్ 9 లక్షల అమ్మకాల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా ఆటోమొబైల్ ఎడిటోరియల్ సంస్థ ఆటోకార్ ఇండియా ఎడిటర్ హోర్మజ్డ్ సోరాబ్జీ స్కార్పియో విక్రయాలపై ట్వీట్ చేశారు. I’m sure you haven’t forgotten how we were in Nashik together to road test the prototype @hormazdsorabjee Phew, we’ve come a long way since then! But this trusty warhorse has always been at our side, ready to ride into battle with us. If it had flopped, the board would have fired… https://t.co/qklIM7lbtw — anand mahindra (@anandmahindra) July 1, 2023 ఆ ట్వీట్లో 2002లో మార్కెట్లో విడుదలైన స్కార్పియో మహీంద్రా బ్రాండ్ వ్యాల్యూను మార్చేసింది. ఏకంగా ఇప్పుడు 9లక్షల యూనిట్ల అమ్మకాల్ని సాధించింది. మిలియన్ మార్క్‌కు చేరువలో ఉందని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు మహీంద్రా స్పందించారు. ప్రోటోటైప్ ప్యూను రోడ్ టెస్ట్ చేయడానికి మేము నాసిక్‌లో ఎలా ఉన్నామో మీరు మర్చిపోలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా నుంచి చాలా దూరం ప్రయాణించాం. ఈ ప్రయాణంలో ఈ నమ్మకమైన యుద్ధ గుర్రం (స్కార్పియో) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. మాతో యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ అది విఫలమై ఉంటే బోర్డు నన్ను నుంచి తొలగించేది. అందుకని స్కార్పియోకు జీవితాంతం రుణపడి ఉంటానని ట్వీటర్లో పేర్కొన్నారు. చదవండి : ‘భారతీయులకు అంత సీన్‌లేదన్నాడు..రిషి సునాక్ చేసి చూపించారు..’ -
వృశ్చికం: మొండితనం వద్దు.. సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం!
వృశ్చిక రాశి (ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3 అవమానం 3) Ugadi 2023 Panchangam: వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. చతురంలో శని, పంచమ, షష్ఠమ స్థానాలలో గురు రాహువుల సంచారం, వ్యయ లాభ స్థానాలలో కేతుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మధ్యస్థంగా ఉంటాయి. ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు. ఉన్నతస్థానాలను సాధిస్తారు. దైవభక్తి, శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు, వాగ్దానాలు కుదురుతాయి. శనిగ్రహ అనుకూలత కొరకు ప్రతినిత్యం కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నెలకు ఒకసారైనా శనికి తైలాభిషేకం చేయించండి. భూముల వ్యవహారాలు వివాదస్పదం కాకుండా చర్యలు తీసుకోండి. శుభకార్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. మీ హితవుకోరే బంధువులు ఎవరో తెలుస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు. వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్తి చెబుతారు. జీవితభాగస్వామితో అన్నివిషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు. జీవిత భాగస్వామి చెప్పిన పనులను కాదనకుండా చేస్తారు. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇస్తారు. సంతానం మనోభావాలను గౌరవిస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళు వంటి వ్యవహారాలలో కఠినంగా వ్యవహరిస్తారు. కీళ్ళనొప్పులు, ఎలర్జీ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయం వచ్చే వాటిల్లోనే ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. తెల్లజిల్లేడువత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పని సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. మీ ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. మీ వాళ్ళకు ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి. నష్టపోకుండా లాభాలతో బయటపడతారు. స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారన్న అపవాదు వస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేక శైలిని నిలబెట్టు కుంటారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థల పురోగతి బాగుంటుంది. విద్యా, ఉద్యోగ, విదేశీయాన సంబంధమైన విషయాలు బాగుంటాయి. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). సాంకేతికవిద్యలోనూ, వైద్యవిద్యలోనూ రాణిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయాలలో మీ ఓర్పు, సహనం, మాటల చాతుర్యం వల్ల లాభపడతారు. రాజకీయంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఒక స్త్రీని వదిలించుకోవడానికి న్యాయ పోరాటం చేసి, విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయపదవి ప్రాప్తి. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవు పెడతారు. స్త్రీ, పురుషుల అనుబంధానికి, స్నేహానికి వక్రభాష్యాలు చెప్పేవారు మీ వల్ల ఇబ్బందులు పడతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇతరులను నిష్కారణంగా అనుమానిస్తారు. ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినా, మీ వైరివర్గంవారు విమర్శిస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోర పాశుపత హోమం చేయాలి, సౌరపాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడడం వలన వైరివర్గం మీ మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ సన్నిహిత, సహచరవర్గంలో ఉండేవారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యాసంబంధ విషయాలు బాగున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపిక అవుతారు. సాంకేతికవిద్యలో రాణిస్తారు. రాజకీయ పదవీప్రాప్తి. ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చుపెట్టి సంతానాన్ని ఒకదారికి తీసుకు వస్తారు. మీరు ఊహించిన విధంగా వారు జీవితంలో స్థిరపడతారు. ఆర్థికాభివృద్ధి కొరకు కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. కుటుంబానికి సహోదరసహోదరీ వర్గానికి అండగా నిలుస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, పెట్టుబడులు లాభిస్తాయి. సంపాదించిన ధనాన్ని మంచికి ఉపయోగిస్తారు. కళా, సాహిత్య, సాంకేతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ప్రేమవివాహాలు సఫలం కావు. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు కలిసివస్తాయి. జీతం ఆధారంగా ఉద్యోగ నిర్ణయాలు చేయరు. ప్రదేశం ఆధారంగా ఉద్యోగ నిర్ణయం చేస్తారు. సర్పదోష నివారణా కంకణం ధరించండి. వీలైనంత వరకు విభేదాలకు దూరంగా ఉండండి. మీకు మీరుగా సమస్యలను పెద్దవిగా చేయవద్దు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. మంచి ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు వివాహకాలం. నిత్యం హనుమాన్ సింధూర్ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. సంఘాల ద్వారా మంచి ఖ్యాతి, సంఘాలకు మంచి నాయకత్వం వహించడం తద్వారా లాభాలు గడించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. బ్యాంకు ఋణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. ప్రతిష్ఠాత్మక పదవులకు ఎంపిక అవుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంది. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుంటే! గతించిన రక్తసంబంధీకుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణం అవుతాయి. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుని అయినవాళ్ళకు దూరం అవుతారు. వివాహపరంగా సొంత నిర్ణయాలు మీ జీవితానికి మేలు చేయవు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంద్రాణి రూపును మెడలో ధరించండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా వచ్చిన ఓ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత ఓర్పు పాటించడం అవసరం. ప్రభుత్వ పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపుతారు. సంతానం మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది. మీ మనస్తత్వానికి విరుద్ధంగా సంతానం ప్రవర్తిస్తారు. మొండితనంతో ఉండవద్దు ఇంట్లో మీ మాటే నెగ్గాలి అన్న మొండితనంతో ఉండవద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, భేదాభిప్రాయాలలో పంతాలకు పోకుండా, సర్దుకుపోవడం వల్ల లాభం చేకూరుతుంది. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్లోనూ, వ్యాపారప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. ఆత్మీయులతో, సన్నిహితులతో వాగ్వివాదాలు సంభవిస్తాయి. బ్యూటీపార్లర్లు నడిపేవారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
Yearly Horoscope: ఈ ఏడాది రాశి ఫలాలు.. పూర్తి వివరాలు
రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు మేషరాశి ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు. ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1 వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1 మిధున రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4 కర్కాటక రాశి ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4 కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లవ్సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. సింహ రాశి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిష్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి. కన్యా రాశి ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. తులారాశి ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి. ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము. తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కుంభ రాశి ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి. బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. మీన రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. హనుమాన్ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. -పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె) సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023. -
కొనుగోలుదారులకు భారీ షాక్, మహీంద్రా కార్లలో లోపాలు..రీకాల్‌కు పిలుపు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసిన కార్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కార్లలో వేడిని నిరోధించేందుకు సింథటిక్ ఎలాస్టోమర్ నుంచి తయారు చేసిన రబ్బర్ బెలో’లో లోపాలు తలెత్తుతున్నట్లు తేలింది. దీంతో మహీంద్రా యాజమాన్యం ఈ ఏడాది జులై 1 నుంచి నవంబర్ 11 వరకు మ్యానిఫ్యాక్చరింగ్ చేసిన 6618 స్కార్పియో - ఎన్ కార్లను, ఎక్సయూవీ - 700 వేరియంట్‌కు చెందిన 12,566 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. కార్లలోని తలెత్తుతున్న లోపాలపై మహీంద్రా యాజమాన్యం స్పందించింది. కార్లలో ఉండే బెల్ హౌసింగ్ లోపల రబ్బరు బెలో’ ఏం సంస్థ తయారు చేసింది. ఏయే తేదీలలో వాటిని తయారు చేశారో గుర్తించి, క్రమబద్దీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వాహనాదారులకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత డీలర్ షిప్ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలని కోరింది. నాణ్యతలో రాజీపడం అంతేకాదు సంస్థ తయారు చేసే కార్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడమని, అలాగే ప్రస్తుతం కార్లలోని లోపాల్ని గుర్తించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు మహీంద్రా సంస్థ తెలిపిన వివరాల మేరకు..మహీంద్రా ఎక్స్‌యూవీ 700, స్కార్పియో - ఎన్లు కార్లు వాహనదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఒక్క ఆగస్ట్ నెలలో ఈ రెండు కార్లు సుమారు 2.40 లక్షలు ఓపెన్ బుకింగ్స్ అయ్యాయని..ఆ బుకింగ్స్ చేసుకున్న కార్లు కొనుగులో దారులకు చేరాలంటే 20 నుంచి 24 నెలల సమయం పడుతుందన్నారు. అందుకు మార్కెట్లో ఈ కార్లు ఉన్న డిమాండేనని చెప్పారు. ఇక ఇదే ఏడాది జులై నెలలో స్కార్పియో ఎన్ వేరియంట్ లక్ష కార్లను వాహనదారులు బుక్ చేసుకోగా.. ట్రాప్ - ఎండ్ ట్రిమ్ కార్ల కోసం 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంది. మిగిలిన వేరియంట్ కార్లను కొనుగులో చేసిన కస్టమర్ల దగ్గరికి చేరుకునేందుకు 20-24 నెలల సమయం పట్టనున్నట్లు స్పష్టం చేశారు. చదవండి👉 ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
ఆర్ఆర్ఆర్ మేనియా: ఆనంద్ మహీంద్ర కొత్త కారు నిక్‌నేమ్ ‘భీమ్’కే ఓటు
సాక్షి,ముంబై: మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన స్కార్పియో-ఎన్ కారుకి మంచి పేరు కావాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌కు నెటిజన్ల స్పందన బాగానే వచ్చింది. అయితే మళ్లీ ఆనంద్ మహీంద్ర మళ్లీ డైలమాలో పడ్డారు. వచ్చిన సూచనల్లో రెండు నిక్‌నేమ్స్‌ను సెలక్ట్ చేసుకున్నారు. అయితే వీటిల్లో దేన్ని ఫైనల్ చేయాలో తోచక మళ్లీ ఫ్యాన్స్‌నే ఆశ్రయించారు. (బిగ్ డే..మంచి పేరు కావాలి.. చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా) కొత్త స్కార్పియో-ఎన్ అనే నిక్‌నేమ్స్ వరదలా వచ్చాయి. ఇందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చని వాటిల్లో రెండింటిని షార్ట్‌లిస్ట్ చేసాను. భీమ్, బిచ్చూ అనే రెండు పేర్లలో మీ ఓటు దేనికి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇప్పటికే 25వేలకు పైగా స్పందనలొచ్చాయి. విశేషం ఏమిటంటే చాలామంది ‘భీమ్’ కే ఓటు వేస్తుండటం. భీమ్ ఈజ్ సింబల్ ఆఫ్ కింగ్.. స్కార్పియోకి అదే బాగా సూట్ అవుతుంది.. పలకడం కూడా ఈజీ అంటూ చాలామంది కమెంట్ చేశారు. Thank you all for the flood of suggestions for the nickname of my new Scorpio-N. I’ve shortlisted two. Here’s the final shoot-out between them. Need your verdict. — anand mahindra (@anandmahindra) October 8, 2022 Bheem ☑️ pic.twitter.com/Hf9BG0rnx2 — 🇩 🇻 🇸 #NTR30⚓ (@venkateshDUGUTA) October 8, 2022 BHEEM pic.twitter.com/5HwcaywfrL — Bellamkonda's (@kotiGowd9999) October 8, 2022 Bheem is the symbol of King. — Shweta Sinha (@gudiasinha) October 8, 2022 #Bheem pic.twitter.com/WFgUxyrL8p — nikhil reddy (@MuskuNikhil) October 8, 2022 -
బిగ్ డే..మంచి పేరు కావాలి చెప్పండబ్బా: ఆనంద్ మహీంద్రా
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక సంతోషకరమైన వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల మహీంద్రా లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ తన చేతికి వచ్చిన ముచ్చటను ట్విటర్లో షేర్ చేశారు. నిజంగా ఇది నాకు బిగ్ డే.. స్కార్పియో ఎన్ ను రిసీవ్ చేసుకున్నా. అయితే దీనికి ఒక మంచి పేరు కావాలి. ఎవరైనా పేరు సూచించే వారికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో మహీంద్రా ఇటీవల లాంచ్ చేసింది. ఈ పండుగ సీజన్లో స్కార్పియో-ఎన్ డెలివరీలను ప్రారంభించింది. ఈ క్రమంలో మహీంద్ర ప్రతినిధి ఆనంద్ మహీంద్రకు స్కార్పియో-ఎన్ తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర, తన స్కార్పియోకు పేరు సూచించమని అభిమానులను అడగడం విశేషంగా నిలిచింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ క్యాబిన్ ప్రీమియం లుక్‌తో, 3D సరౌండ్ 12-స్పీకర్ సోనీ సిస్టమ్, విశాలమైన సన్‌రూఫ్, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ సీట్లు, సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్లతో లాంచ్ చేసింది. స్కార్పియో-ఎన్ ఎస్యూవీ ధర Z2 పెట్రోల్ MT వేరియంట్ రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం. అలాగే Z8 L డీజిల్ MT వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. 5 వేరియంట్లు, ఏడు రంగుల్లో లభ్యం. ఈ ఏడాది జూలై 31న బుకింగ్‌లు ప్రారంభమైన తొలి నిమిషంలోనే 25 వేలకు పైగా వాహనాలు బుక్ అయ్యాయి. అంతేకాదు ఈ మోడల్ దేశంలో అత్యంత వేగంగా లక్ష బుకింగ్స్ నమోదు చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Big day for me; received my ScorpioN…. Need a good name for it…Recommendations welcome! pic.twitter.com/YI730Eo9uh — anand mahindra (@anandmahindra) October 7, 2022 -
మహీంద్రా బుకింగ్స్ బీభత్సం.. నిమిషాల్లో రూ.18వేల కోట్ల బిజినెస్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్ల బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఆ సంస్థకు చెందిన (Scorpio N) స్కార్పియో-ఎన్ మోడల్ కారు బుకింగ్స్ బీభత్సం సృష్టించింది. దీంతో కేవలం నిమిషాల వ్యవధిలో వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మహింద్రా కొత్త స్కార్పియో-ఎన్(Mahindra Scorpio N) అధికారిక బుకింగ్స్ (శనివారం) జూలై 30 ప్రారంభమైంది. అలా విడుదల అయ్యిందో లేదో ప్రారంభమైన నిమిషంలోనే 25 వేలు, అరగంటలో లక్ష బుక్సింగ్స్ నమోదయ్యాయి. ఈ విలువ రూ.18వేల కోట్లపైనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా. కొత్త మహింద్రా స్కార్పియో-ఎన్ ధర ఎక్స్-షోరూంలో పెట్రోల్ వెర్షన్లకు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మద్యలో ఉండనుంది. అలాగే డీజిల్ వెర్షన్ల ధర రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల మధ్యలో ఉంది. అయితే కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధర కేవలం తొలి 25 వేల బుకింగ్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ సమయంలో ఏ ధర ఉంటుందో దాన్నే కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది. మహీంద్రా ఈ కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ప్రక్రియను సెప్టంబర్ 26 నుంచి ప్రారంభించబోతుంది. డిసెంబర్ 2022 నాటికి 20 వేల యూనిట్లకు పైగా స్కార్పియో-ఎన్ వెహికిల్ డెలివరీ చేపట్టాలని సన్నాహాలు కూడా చేస్తోంది. కాగా మహీంద్రాలోని థార్, ఎక్స్‌యూవీ700 మోడల్స్ కోసం కూడా కస్టమర్లు వేచి చూస్తున్నారు. మరి ఈ బుకింగ్స్ ఏ రికార్డు క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి. చదవండి: ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! -
అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్..
తనకే కారు ఉందని రెచ్చిపోయాడు.. రోడ్డు మీద స్పీడ్ పెంచి కారు నడిపి.. బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడగా.. పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక.. ట్విస్ట్ ఏంటంటే అతనో ‘లా’ విద్యార్థి కావడం విశేషం. వివరాల ప్రకారం.. అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బైకర్, కారు డ్రైవర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్కార్పియో డ్రైవ్ చేస్తున్న అనుజ్ చౌదరి.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న శ్రేయాన్ష్‌ను హై స్పీడ్‌లో కారుతో ఢీకొట్టాడు. అంతకు ముందు బైకర్‌ను బూతులు తిడుతూ.. కారుతో తొక్కించి చంపేస్తానంటూ బైకర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌ను వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టాడు. కారు ఢీకొట్టడంతో కింద పడిపోయిన బైకర్.. శ్రీయాన్ష్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అనురాగ్ అయ్యర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అనంతరం, పీఎంవో ఇండియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీపీ న్యూఢిల్లీలను ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రేయాన్ష్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు కలిసి ఆరావళిలోని టెంపుల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న అనుజ్‌తో వాగ్వాదం జరిగిందన్నాడు. ట్విట్టర్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుజ్ చౌదరిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కారును సీజ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @PMOIndia @ArvindKejriwal @DCPNewDelhi Please help us , the Scorpio Car driver almost killed a few of our riders and threatened to kill us by crushing us under the car. This is not what we vote for or pay taxes for no one was severely injured Gears respect riders pic.twitter.com/rcZIZvP7q4 — ANURAG R IYER (@anuragiyer) June 5, 2022 ఇది కూడా చదవండి: మ్యూజియం పై దాడి చేసిన యువకుడు... కారణం విని షాక్ అయిన పోలీసులు -
రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెల్లవారు జాము.. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్ వైపు నల్లరంగు స్కార్పియో వచ్చింది.. తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు.. స్కార్పియో డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని పెంచి రంపచోడవరం వైపు పోనిచ్చాడు.. కంగుతిన్న పోలీస్‌లు రెండు కార్లతో ఆ వాహనాన్ని వెంబడించారు.. వెనుక వైపు పోలీస్ వాహనం వస్తుంటే ముందుగా వెళుతున్న స్కార్పియో రోడ్డు మలుపులు దాటుకుంటూ వెళుతోంది.. అచ్చు సినిమాల్లోలా. అలా రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లాక అక్కడ మలుపులో సిమెంట్ గోడను స్కార్పియో ఢీకొట్టి జలాశయంలోకి దూసుకుపోయింది. కారులో ఉన్న గంజాయి మూటలు ఒక్కసారిగా చెల్లాచెదురుగా బయట పడిపోయాయి. ప్రాజెక్టులో పడిపోయిన వాహనం నుంచి ఓ వ్యక్తి ఒడ్డుకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 300 కేజీల వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టులో పడిపోయిన వాహనాన్ని బయటకు తీసి మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒడిశా ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఆదివారం రాత్రే మారేడుమిల్లి ప్రాంతానికి తెచ్చి, తరలిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో కారును వెంబడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. వాహనంలో గంజాయి తరలిస్తున్న సమాచారం రావడంతో నిఘా వేసి పట్టుకున్నట్టు రంపచోడవరం అడిషనల్ ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు. -
వృశ్చిక రాశి ఫలాలు 2022-23
విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (చతుర్థం)లోను తదుపరి మీనం (పంచమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (తృతీయం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (సప్తమం), కేతువు వృశ్చికం (జన్మం)లోను తదుపరి రాహువు మేషం (షష్ఠం), కేతువు తుల (వ్యయం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (సప్తమం)లో స్తంభన. కుజస్తంభన వల్ల ఆగస్టు నుంచి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది మినహా మిగిలిన గ్రహాలన్నీ చాలా యోగ్యంగా ఉంటాయి. గురువు సంచారం అనుకూలత దృష్ట్యా ఆర్థిక విషయాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆదాయం కావలసిన రీతిగా అందడం, శుభకార్యాలు, ధర్మకార్యాలకు చక్కగా వెచ్చించడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటివి జరుగుతాయి. గతంలో చాలాకాలంగా ఉన్న సమస్యలు ఎటువంటివైనా ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నిస్తే అనుకూలం అవుతాయి. భవిష్యత్తులో చేయాలనుకునే పెద్ద ప్రాజెక్ట్‌లకు ఈ సంవత్సరమే శ్రీకారం చుట్టడం శుభదాయకం. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి బాగా అనుకూలం. ఋణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం. వృత్తిరీత్యా స్థాయి గౌరవము పెరుగుతాయి. మీరు ఇతరులకు బాగా సçహాయం చేసే అవకాశం ఉంటుంది. తరచుగా శుభవార్తలు వింటారు. వ్యాపార విషయంగా స్థానమార్పు కోరుకునేవారికి ప్రస్తుతం కాలం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారులకు సంవత్సరం అంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. ఆశించిన రీతిలో ఫలితాలు ఉండటంలో ధైర్యంగా ముందుకు వెడతారు. ఆగస్టు తరువాత కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. ఆగస్టు నుంచి ఏదో తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు. ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయి. మెరుగైన వైద్య సలహాలు అందుకుంటారు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. మంచి గౌరవం వచ్చేలాగా విద్యా వ్యాసంగం సాగుతుంది. రైతులకు అన్ని కోణాల్లోనూ సహాయ సహకారాలు అందుతాయి. తద్వారా మంచి వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. గర్భిణిలు సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. ఆగస్టు 10 తరువాత చిన్న చిన్న చికాకులు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి విద్యా వ్యాసంగంలో మంచి ఫలితాలు వుంటాయి. భార్యా భర్తల నడుమ మనస్పర్థలు తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది. అయితే ఆగస్టు నుంచి కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. ఆరోగ్య, ఋణ విషయాల్లో ఆగస్టు నుంచి జాగ్రత్తలు అవసరం. అనురాధ నక్షత్రం వారికి ఈ ఏడాది ప్రశాంతత కలుగుతుంది. ఎప్పటినుంచో ఉన్న చికాకులకు ఈ సంవత్సరం పరిష్కారాలు లభిస్తాయి. ఆగస్టు లోపు ప్రయత్నిస్తే మొండి బాకీలు వసూలవుతాయి. ఆగస్టు తర్వాత ఏ విధమైన వ్యవహారాలూ వుండకుండా చూసుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. అయితే అనారోగ్యవంతులయిన ఈ నక్షత్రం వారు ఆగస్టు నుంచి తరచుగా ఇబ్బందులు పడే అవకాశముంది. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. మీ విషయాలు గోప్యంగా వుంచకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. శాంతి: ప్రత్యేకంగా ఆగస్టు 10 తరువాత కుజుడికి శాంతి చేయించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ఆరు ముఖాల రుద్రాక్షధారణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: మీరు స్వయంగా ప్రయత్నిస్తే, చాలాకాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. ఋణ ప్రయత్నాలు సానుకూలం. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా, ఫలితాలు మాత్రం అనుకూలం. రోజువారీ పనులు, వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. మే: ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ప్రయత్నాలన్నీ సానుకూలం అవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా, విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల అవసరాలు తీర్చడంలో కృతకృత్యులవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది. జూన్: కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలోకాని, పిల్లల అభివృద్ధిలోకాని అనుకూలత తక్కువ. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూరప్రయాణాలు చేయవద్దని సూచన. జూలై: కొన్ని అంశాలు అనుకూలం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయి. మీ సంబంధీకుల ఇళ్లలో నిశ్చయమైన శుభకార్యాలు మీకు ఆనందం కలిగిస్తాయి. అంతటా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం విశేషం. ఆగస్టు: కుజుడు వృషభ మిథున రాశులలో సంచారం చేస్తూ అనుకూలించని స్థితి. రానున్న కాలంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తరచుగా కుజ గ్రహ శాంతి చేయించండి. రాబోయే కాలంలో మీ జాతకానికి, ఈ కుజ సంచారానికి అనుబంధంగా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి జాతక శోధన చేయించుకోండి. సెప్టెంబర్: కుజుడు మినహా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఇది చాలా మంచి కాలం అనే చెప్పాలి. తెలివిగా ప్రవర్తిస్తారు. మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. గత సమస్యల పరిష్కారానికి వెదుకులాట ఈ నెల ఫలిస్తుంది. పెంపుడు జంతువులతో ఇబ్బంది ఎదురవుతుంది. అక్టోబర్: వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా 15వ తేదీ నుంచి జాగ్రత్తపడాలి. మిగిలినకాలం మిగిలిన అన్ని అంశాలూ సానుకూలంగానే ఉంటాయి. ఇతరుల వ్యవహారాలపై దృష్టి పెట్టకండి. నెలాఖరులో ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి. నవంబర్: శని గురు రాహువుల అనుకూల సంచారం, మిగిలిన గ్రహాల ప్రతికూల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలలో తోటివారి సహకారం, సిబ్బంది సహకారం తగ్గుతుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తం తరచు ప్రయాణాలు చేస్తుంటారు. డిసెంబర్: చాలా విచిత్రమైన కాలం. ఎప్పుడు యోగ్యంగా ఉంటుందో, ఎప్పుడు చికాకుగా ఉంటుందో చెప్పలేని కాలం. అయితే శుక్ర సంచారం అనుకూలత వల్ల చాలా వరకు కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితిని పొందుతారు. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ఒత్తిడి తప్పదు. ప్రతి విషయంలోనూ అధిక దనవ్యయం జరుగుతుంది. జనవరి: శుభాశుభ పరిణామములు ఎక్కువ అనే చెప్పాలి. ఈ నెల 22 వరకు కొత్త ప్రయోగాలు చేయవద్దు. ధైర్యం విడనాడకుండా ముందుకు వెడతారు. దానధర్మాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ చివరకు లాభం ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫిబ్రవరి: రోజూ ఏదో ఒక కొత్త వ్యవహారం మీద ఆలోచనలు చేస్తారు. అన్ని అంశాల్లోనూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. ఖర్చులు అదే రీతిగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఆరోగ్య భద్రత కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మార్చి: సహజంగా అష్టమ కుజుడు ఇబ్బందులు కలిగించే గ్రహం. అయితే మిగిలిన గ్రహాల అనుకూలతల వల్ల ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ భద్రత బాగుంటుంది. వ్యాపారులు మంచి వ్యాపారం చేయగలుగుతారు. సిబ్బంది బాగా సహకరిస్తారు. మీ జాతకానికి ఈ గోచారానికి మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
పార్కింగ్ లో ఉన్న స్కార్పియో కార్లో మంటలు
-
‘భారతీయులు గర్వించేలా చేశారు’ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల స్పందన
ఇటీవల ఓ నెటిజన్ నువ్వు పంజాబీవా అడిగితే కాదు ఇండియన్ అంటూ సమాధానం ఇచ్చి భారతీయుల మనుసు గెలుచుకున్నారు ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్లు మరోసారి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశీ కార్ల తయారీ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న మహీంద్ర మరో ఘనత సాధించింది. మహీంద్రా వాహనాల పనితీరు నచ్చడంతో కెన్యా ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. వందకు పైగా సింగిల్ క్యాబ్ పికప్ స్కార్పియోలను కొనుగోలు చేసి వాటిని కెన్యా రాజధాని నైరోబీ పోలీసు విభాగానికి అప్పగించింది. కెన్యా పోలీసు డిపార్ట్మెంట్ మహీంద్రా వెహికల్స్‌ని ఉపయోగించడంపై ఆనంద్మహీంద్రా స్పందించారు. నైరోబీ పోలీసు శాఖలో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు స్కార్పియో వాహనం ఓ బీస్ట్ లాంటిదంటూ తమ ప్రొడక్టుని పొగిడారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు విదేశీ కార్లను ఇండియా దిగుమతి చేసుకుకేది. ఇప్పుడు మహీంద్రా బ్రాండ్ కింద మన కార్లు విదేశాల్లోకి వెళ్తున్నాయి. మహీంద్రా గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని కోరుకుంటున్నామని నెటిజన్లు అంటున్నారు. భారతీయులు గర్వించేలా చేశారు ఆనంద్ మహీంద్రా అంటూ ట్వీట్లతో హోరెత్తెస్తున్నారు. Nairobi, Kenya. We’re delighted to be a part of the Police Service team. The ‘Beast’ under the bonnet of the Scorpio is at their service! https://t.co/yrYlDwYhkw — anand mahindra (@anandmahindra) January 10, 2022 చదవండి: నెటిజన్ తలతిక్క ప్రశ్న..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
బిల్‌గేట్స్ పేరెత్తితే ఆనంద్ మహీంద్రాకి చిరాకు.. కారణం ఇదే?
Padma Bhushan Anand Mahindra Life Story In Telugu: సోషల్ మీడియాలో ఏదైనా వీడియో బాగా పాపులర్ అయితే అది వెంటనే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా అకౌంట్లో ప్రత్యక్షం అవుతుంది. సామాజిక అంశాల మొదలు స్పోర్ట్స్ ఈవెంట్స్ వరకు అన్నింటిపైనా ఆయన స్పందిస్తుంటారు. లక్ష కోట్ల రూపాయల బిజినెస్ నడిపించే వ్యక్తిగా ఆయన అసలే కనిపించరు. కారణం .. ఆయనకు సినిమాలంటే పిచ్చి.. సినిమాల్లోకి రావాలని హర్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. కానీ పరిస్థితులు అనుకూలించక తిరిగి కుటుంబ బిజినెస్లోకే వచ్చారు. స్టీలు, ట్రాక్టర్లు , జీపులు తయారు చేసే కంపెనీ కంప్యూటర్స్, ఎయిరోస్పేస్ వరకు తీసుకెళ్లారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం ఇటీవల ఆనంద్ మహీంద్రాని పద్మభూషణ్‌తో సత్కరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వ్యాపార సామ్రాజ్యానికి మూడో తరం వారసుడు ఆనంద్ గోపాల్ మహీంద్రా. 1953లో హరీష్ , ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. తమిళనాడులో స్కూలింగ్ పూర్తి చేసిన ఆనంద్ మహీంద్రా.. సినిమాలపై ఉన్న మక్కువతో 1977లో హర్వర్డ్ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత మనసు మార్చుకుని తిరిగి వ్యాపారం వైపు మొగ్గు చూపారు. దీంతో అదే యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో మాస్టర్స్ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. వ్యాపార మెళకువలు 1980వ దశకంలో స్టీలు వ్యాపారంలో జపాన్ గుత్తాధిపత్యం చెలాయిస్తుండేది. ప్రపంచంలో మరే దేశంలో మరే కంపెనీ జపాన్ సంస్థల ముందు నిలబడలేవు అనే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ముంబైలో ఉన్న మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఆఫీసరుగా 1981లో చేరారు. అక్కడే ఉంటూ . జీపులు, ట్రాక్టర్లు, స్టీలు వ్యాపారాల నుంచి మహీంద్రా గ్రూపుని ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలకు విస్తరించారు. వ్యాపారంలో ఒక్కో మెళకువను ఒంటబట్టించుకుంటూ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు ఆనంద్‌లో ప్రతిభకు పరీక్ష పెట్టేందుకు మరో సవాల్‌ని ఆయన ముందు ఉంచారు తాత జగదీశ్చంద్ర. తొలి పరీక్ష సమ్మెలతో అట్టుడికి పోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలు 1991లో మహీంద్రాకు అప్పగించారు. ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఆలస్యం ఫ్యాక్టరీలో మరోసారి పెద్ద సమ్మెకు పిలపునిచ్చారు కార్మికులు. ఫ్యాక్టరీలో తీవ ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆనంద్ మహీంద్రా క్యాబిన్ని చుట్టుముట్టి గట్టిగా నినాదాలు ఇస్తున్నారు కార్మికులు. ఏ కొంచెం తేడా వచ్చినా యజమానిపై దాడి తప్పదు అనేంత భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చని.. ఫ్యాక్టరీ వదిలి వెళ్లాలంటూ నలువైపుల నుంచి సలహాలు వస్తున్నాయి. అప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు ఆనంద్ మహీంద్రా. నేరుగా రంగంలోకి ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులతో స్వయంగా చర్చలకు దిగారు ఆనంద్. మీ డిమాండ్లు ఒప్పుకోవాలన్నా.. దీపావళికి బోనస్‌లు ఇవ్వాలన్నా ఈ స్ట్రైక్‌ని ఇక్కడితో ఆపేసి పనిలోకి వెళితే మంచిది లేదంటే అంతే సంగతులు అంటూ ఖరాఖండీగా చెప్పారు. ఒక్క మాట అటు ఇటు అయితే భౌతిక దాడులకు అవకాశం ఉన్న చోట ఎంతో ధైర్యంగా కంపెనీ పరిస్థితులు, తన చేతిలో ఉన్న అవకాశాలను కార్మికులకు వివరించారు. అప్పటి వరకు కార్మికులతో మధ్యవర్తులే మాట్లాడే వారు.. సమస్య పరిష్కారం కాకుండా సుదీర్ఘకాలం సాగదీసేవారు. ఆ సంస్కృతికి భిన్నంగా యజమానే స్వయంగా రంగంలోకి దిగడం. తనకు ఏం కావాలో.. తనేం చేయగలడో నేరుగా చెప్పడంతో కార్మికులకు కొత్తగా అనిపించింది. ఆనంద్ మహీంద్రా మాట గౌరవించి పనిలోకి వెళ్లారు. గత కొన్నేళ్లుగా చచ్చీ చెడీ యాభై శాతం ఉత్పత్తి మాత్రమే సాధించే ఆ ఫ్యాక్టరీ.. ఆనంద్ వచ్చాక ఆ ఏడాది 150 శాతం ఉత్పత్తిని సాధించింది. ఈ ఘటనతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యాపార సామ్రాజ్యం, అందులోని ఉద్యోగుల భవిష్యత్తుకి ఆనంద్ రూపంలో భరోసా లభించింది. తెగింపుకి తొలిమెట్టు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వాహన తయారీ టెక్నాలజీ కోసం ఇప్పటికీ విదేశీ కంపెనీలపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరంపరలోనే ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి తెచ్చారు ఆనంద్ మహీంద్ర. తొలి ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఆనంద్ సామర్థ్యంపై నీలినీడలు కమ్మకున్నాయి. కానీ ఈ అపజయాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నారు ఆనంద్. ఆ ప్రాజెక్టులో పని చేసిన 300 ఇంజనీర్లు, ఇతర సభ్యులతో సొంతంగా టీమ్‌ని తయారు చేశారు. దేశీయంగా ప్యాసింజర్ వెహికల్ తయారీ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు ఆనంద్ మహీంద్రా. ఆ రోజుల్లో ఆ ప్రయత్నం ఆత్మహత్యాసదృశ్యమే. అనేక నిద్రలేని రాత్రులు ఆ టీం గడిపింది,. స్కార్పియో సంచలనం మహీంద్రా టీం చేసిన కృషితో దేశీ టెక్నాలజీతో స్కార్పియో మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు సక్సెస్ ఇండియా మార్కెట్‌నే కాదు ప్రపంచ మార్కెట్‌నే మార్చేసింది. అప్పటి వరకు విదేశీ టెక్నాలజీపై ఆధారపడిన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చుక్కానిలా పని చేసింది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో సైతం స్కార్పియో వాహనాల అమ్మకాలు దుమ్ము రేపాయి. ఆ రోజుల్లో యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ మార్కెట్ వాటా 4.9 శాతం ఉంటే స్కార్పియో వాటా ఏకంగా 36 శాతానికి పెరిగింది. అదే ఒరవడిలో తర్వాత మహీంద్రా నుంచి జైలో ఎక్స్‌యూవీ సిరీస్, కేయూవీ సిరీస్‌లతో పాటు ఆఫ్‌రోడ్‌లో సంచలనం సృష్టిస్తున్న థార్ వంటి వెహికల్స్ వచ్చాయి. మహీంద్రా దూకుడు దేశీ టెక్నాలజీ తయారైన స్కార్పియో విజయం ఆనంద్ మహీంద్రాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో మహీంద్రా గ్రూపు కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా మహీంద్రా లోగోలో రైస్‌ని చేర్చి మహీంద్రా రైస్ అంటూ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్, గుజరాత్ ట్రాక్టర్స్, రేవా ఎలక్ట్రిక్ కార్ వెహికల్స్, సత్యం కంప్యూటర్స్, ప్యూజియోట్ మోటార్ సైకిల్స్, సాంగ్యాంగ్ మోటార్ సైకిల్స్ తదితర కంపెనీలను వేగంగా కొనుగోలు చేసి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుని విస్తరించారు. ఎయిరోస్పేస్లోకి కూడా అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ మహంద్రానే. మహీంద్రా విస్తరణ మహీంద్రా గ్రూపులో 1991లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పుడు కంపెనీ విలువ రూ.1,520 కోట్లు ఉండగా ముప్ప ఏళ్లలో 60 రెట్లు పెరిగి 2020 వచ్చే సరికి రూ. 96,241 కోట్లకు చేరుకుంది. పలు అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు , గౌరవ పదవులు చేపట్టారు. బిల్‌గేట్స్ పేరు ఎత్తితే చిరాకు ఆనంద్ మహీంద్రా భార్య పేరు అనురాధ. ఆమె జర్నలిస్టుగా పని చేస్తున్నారు. వెర్వే, మెన్స్ వరల్డ్ అనే పత్రికల నిర్వహిస్తున్నారు. ఆయనకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హర్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో బిల్‌గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరు క్లాస్మేట్స్. బయట తాను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా తన కూతుళ్లకు మాత్రం ఫెయిల్యూర్ పర్సన్లానే కనిపిస్తుంటానని ఆనంద్ మహీంద్రా అంటున్నారు. అందుకు కారణం ఆయన కూతుళ్లెవాళ్లెప్పుడు బిల్‌గేట్స్‌తో నన్ను పోలుస్తూ ‘నువ్వో ఫెల్యూయర్ పర్సన్’ అని ఆటపట్టిస్తుంటారు. అందుకే నాకు బిల్‌గేట్స్ పేరు వింటేనే కోపం వస్తుందంటూ సరదగా తన కుటుంబ విశేషాలను మీడియాతో ఆయన పంచుకున్నారు. సామాజిక సేవలో వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన తర్వాత సామాజిక సేవల్లోకి వచ్చారు ఆనంద్ మహీంద్ర. సామాజిక సేవ కోసం నాంది ఫౌండేషన్ స్థాపించారు. అందులో ఆయనకు ఎక్కువ సంతృప్తి ఇచ్చింది చదువుకు దూరమైన పేద బాలికల కోసం చేపట్టిన నహీ కాలీ ప్రాజెక్టు. 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 3.30 లక్షల మంది ఆడ పిల్లలకు ఈ ప్రాజెక్టు ద్వారా విద్య అందుతోంది. A matter of great happiness to see my good friend @anandmahindra get the Padma Bhushan. He has led the Mahindra group ably and ethically and more importantly always had India’s interest beating in his heart. pic.twitter.com/GCFzCW9VeA — Harsh Goenka (@hvgoenka) November 8, 2021 ఆనంద్ గోపాల్ మహీంద్రా ఘనతలు - భారత ప్రభుత్వం నుంచి 2021 నవంబర్ 7న పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. - ఫార్చూన్ మ్యాగజైన్ 2014లో ప్రకటించిన వరల్డ్ గ్రేటెస్ట్ లీడర్స్ -50లో చోటు దక్కించుకున్నారు. - ఫార్చూన్ ఆసియా మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పీపుల్ 25లో స్థానం పొందారు - ఫోర్బ్స్ పత్రిక 2013లో ఎంట్రప్యూనర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు విశేషాలు - 1945లో ముహమ్మద్, జగదీశ్ చంద్ర మహీంద్రాలు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఎం అండ్ ఎం పేరుతో కంపెనీ నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓవర్ లాండ్ అనే యూరప్ కంపెనీతో కలిసి ఆర్మీకి జీపులు తయారు చేసే పని దక్కించుంది. - దేశ విభజన సమయంలో ఈ సంస్థలో భాగస్వామిగా ఉన్న ముహమ్మద్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే ఎం అండ్ ఎం గ్రూపులో తన తమ్ముళ్లని పార్ట్నర్లుగా జగదీశ్ చంద్ర చేర్చారు. అనంతరం కంపెనీ పేరును మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. - టాటా, మహీంద్రా గ్రూపులు చూపిన బాటలో ఇండియాలో స్టీలు పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుగుతూ జపాన్ను వెనక్కి నెట్టింది. చైనా తర్వాత రెండో స్థానంలో నేడు ఇండియా నిలిచింది. I began my career in the 80’s at our alloy steel company. Back then the Japanese dominated the industry like unshakeable Gods. It was unimaginable that we could ever be more than a midget in front of them. I wonder if today’s youth will understand the magnitude of this milestone https://t.co/c0KOhuZEQm — anand mahindra (@anandmahindra) January 6, 2021 - 80,90వ దశకాల్లో రూరల్ ఇండియాలో కనెక్టివిటీకి మరోపేరుగా మహీంద్రా కమాండ్ జీపులు నిలిచాయి. - మహీంద్రా గ్రూపుకి 72 దేశాల్లో కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. 100కు పైగా దేశాల్లో మహీంద్రా ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. 🙏🏽 for all your congratulations on my Padma Bhushan award. Repeating my tweet from last year: “There’s an old saying: If you see a turtle on top of a fence, you know for sure it didn’t get there on its own! I stand on the shoulders of all Mahindraites.” https://t.co/tdJBbjNNWo — anand mahindra (@anandmahindra) November 9, 2021 వారి వల్లే ఈ ఘనత పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన సందర్భంలో వచ్చిన ప్రశంసలకు ఆయన వినమ్రంగా స్పందించారు.. ఈ ఘనత వెనుక మహీంద్ర సంస్థ ఉద్యోగుల శ్రమ ఉందన్నారు. వారి భుజాలపై తాను నిలబడి ఈ అవార్డు అందుకున్నట్టుగా తెలిపారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్స్.. రూ.2.58 లక్షల వరకు డిస్కౌంట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్యువి కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇటీవల ఎక్స్ యువి700ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర మహీంద్రా ఎక్స్యువి 500, సబ్ కాంపాక్ట్ ఎక్స్యువి 300, పాపులర్ స్కార్పియో కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. (చదవండి: వారంలో రెండు రోజులు ఆఫీస్..!) మహీంద్రా ఎక్స్యువి 500 డిస్కౌంట్లు మహీంద్రా ఎక్స్యువి 500 డబ్ల్యు11, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ వేరియెంట్లపై కంపెనీ రూ.1,79,800 వరకు క్యాష్ డిస్కౌంట్ తో పాటుగా ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే, ఎక్స్ఛేంజ్ కింద ₹50,000 వరకు అదనపు బోనస్ కూడా అందిస్తుంది. ఇంకా కంపెనీ ₹20,000 విలువైన యాక్సెసరీస్ కూడా ఇవ్వనుంది. ఇక డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ వేరియెంట్లపై మహీంద్రా ₹1,28,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹20,000 విలువైన యాక్సెసరీస్ ఇస్తుంది. డబ్ల్యు5, డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు11 ఆప్షన్, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ మోడల్స్ అన్నింటిపై, కంపెనీ ₹2,58,000 వరకు ప్రయోజనాలను కూడా ఇవ్వనుంది. మహీంద్రా ఎక్స్యువి 300 డిస్కౌంట్లు డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్ బీఎస్ఐవీ, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ డీజిల్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఐచ్ఛిక డీజిల్, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ ఎఎమ్ టి, డబ్ల్యు8 డీజిల్ సన్ రూఫ్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్ వంటి కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇక కొనుగోలుదారులు యాక్ససరీలపై ₹5000 ఆఫర్ పొందవచ్చు. ఇక డబ్ల్యు4, డబ్ల్యు4 డీజిల్ కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అలాగే యాక్ససరీలపై కంపెనీ ₹5,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా స్కార్పియోపై డిస్కౌంట్లు ఎస్3 ప్లస్ కొరకు, ఎస్3 ప్లస్ 9 సీటర్ కార్లపై మహీంద్రా ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ ₹5,000 వరకు ఉచిత యాక్ససరీలను కూడా అందిస్తోంది. ఎస్11, ఎస్9, ఎస్7 కార్లపై కంపెనీ కేవలం ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తుంది. ఎస్5 వేరియంట్ కారుపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹15,000 వరకు విలువైన ఉచిత యాక్ససరీస్ ఆఫర్ అందిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి
సాక్షి, హయత్‌నగర్/రామగిరి(నల్లగొండ): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీటీసీ సభ్యురాలితోపాటు ఆమె భర్త మృతిచెందారు. పోలీసుల కథ నం ప్రకారం నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి చెంది న దొంతం కవిత (40) తిప్పర్తి మండలంలోని థానేదార్పల్లి ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(52) బిల్డర్. హైదరాబాద్‌లో మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్ సమీపంలో వీరు ఉంటున్నారు. కూతురు వివాహంకోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్‌లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి వచ్చేందుకు రాత్రి 8.30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్‌లోని ఔటర్ రింగురోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈ దంపతుల వాహనం టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ పాడె మోస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిప్పర్ కింద ఇరుక్కుపోయిన వాహనం.. టిప్పర్‌ను స్కార్పియో వాహనం వెనుకనుంచి వేగంగా ఢీ కొట్టడంతో టిప్పర్ కింద ఇరుక్కుని స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చిందని, అప్పటికే వారు మృతి చెందారని స్థానికులు తెలిపారు. కూతురి వివాహం.. అంతలోనే విషాదం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తుండగా ఎంబీబీఎస్ చదివిన కూతురుకు ఆగస్టు 20న వివాహం జరిపించారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడం అందరిని కలచి వేసింది. బుధవారం మృతుల అంత్యక్రియలు వారి స్వగ్రామం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో జరిగాయి. అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు మృతులకు నివాళులర్పించారు. -
పోలీస్ బాహుబలి.. మెకానిక్ షాపు వరకు జీపును లాక్కెళ్లాడు
సాక్షి బళ్లారి: మరమ్మతులకు గురైన జీపును ఒక సీఐ స్వయంగా మెకానిక్ షెడ్ వద్దకు లాక్కెళ్లి నెటిజన్ల నుంచి బాహుబలిలా ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా యలబుర్గి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి శుక్రవారం ఓ కేసు విచారణ నిమిత్తం స్కార్పియో వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి బయల్దేరుతుండగా వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో 20 మీటర్ల దూరంలోని మెకానిక్ షెడ్ వద్దకు స్వయంగా వాహనాన్ని లాక్కొని వెళ్లారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీస్ బాహుబలి అంటూ సందేశాలు పోస్టు చేశారు. శారీరక దృఢత్వంతో ఇలాంటి సాహసాలు చేయవచ్చని పేర్కొన్నారు. చదవండి: నకిలీ టీకా క్యాంపులపై సీబీఐ దర్యాప్తు! -
అంబానీ ఇంటి వద్ద కలకలం : కీలక వీడియో ఫుటేజ్
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటిముందు అనుమానాస్పద వాహనం రేపిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈకేసులో తాజాగా మరో కీలక విషయాన్ని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ కేసులో పోలీసు అధికారి సచిన్ వాజేతో కలిసి ఉన్న వీడియోను గుర్తించినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రకటించాయి. (అంబానీ ఇంటివద్ద కలకలం : బతికుండగానే నీటిలో ) ఫిబ్రవరి 17న వీరిదద్దరూ కలిసి ఉన్నట్లు వెల్లడించే వీడియో ఫుటేజీని కనుగొన్నామని విచారణ అధికారులు తెలిపారు. ఫుటేజ్ ప్రకారం హిరేన్‌కు చెందిన నల్ల మెర్సిడెస్ బెంజ్ కారులో వాజేను కలుసుకున్నారు. వీరి సమావేశం సుమారు 10 నిమిషాల పాటు కొనసాగింది. వీడియోలో, వాజే ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని బెంజ్ కారులో వెళ్ళడాన్ని గమనించవచ్చని ఏటీఎస్ తెలిపింది. ఈ సందర్భంగా హిరేన్ స్కార్పియో కారు తాళాలను వాజేకు అప్పగించి ఉంటాడని కూడా ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న, హిరేన్ తన స్కార్పియో చోరికి గురైందని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 25 న బెదిరింపులేఖతోపాటు జెలిటిన్ స్టిక్స్ ఉన్న అదే స్కార్పియోను అంబానీ నివాసం యాంటిలియా వెలుపల కనుగొన్నారు. ప్రస్తుతం వాజే వాడుతున్న బ్లాక్ బెంజ్ కారును ఇటీవల ఏటీఎస్ సీజ్ చేసింది. తాజా పరిణామంతో హిరేన్ మృతిలో వాజే పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అలాగే వాజేకు చెందిన మూడు ప్రధాన వ్యాపార సంస్థలపై నిఘాపెట్టాయి. వాజ్ డైరెక్టర్‌గా పనిచేసిన డిజీ నెక్స్ట్ మల్టీ మీడియా లిమిటెడ్, మల్టీ-బిల్డ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్, టెక్లీగల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఆరా తీస్తున్నాయి. ఈ సంస్థలలో ఇతర డైరెక్టర్ల పాత్రను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు థానే సెషన్స్ కోర్టులో వాజే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌కు ఏటీఎస్ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ మార్చి 30 కి వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలు కలకలం రేపాయి. ఇందులోని ఒకవాహనం స్కార్పియో వాహనం యజమాని హిరేన్ మార్చి 5 న ముంబై సమీపంలోని ఒక కొలనులో శవమై తేలాడు. అయితే ఈ కారును సచిన్ వాజే నాలుగు నెలలు ఉపయోగించారని, ఫిబ్రవరి 5న తిరిగి ఇచ్చారని హిరేన్ భార్య విమల ఆరోపించారు. తన భర్త మరణంలో వాజ్ పాత్ర ఉందని కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మూడు కేసులను ఎన్ఐఏ, ఏటీఎస్ విచారిస్తున్నాయి. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు
సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో అనేక ట్విస్ట్ అండ్ టర్న్స్ మధ్య తాజాగా ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) హెడ్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేపై వేటు పడింది. ఆయనను క్రైమ్ బ్రాంచ్ నుండి తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ కేసులో స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ మరణం కేసులో వాజేను రక్షించేందుకు శివసేన ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. అలాగే ఫిబ్రవరి 22 న హోటల్లో శవమై కనిపించిన దాద్రా, నాగర్ హవేలీ ఎంపీ మోహన్ డెల్కర్ రాసిన సూసైడ్ లేఖ తన దగ్గర ఉందంటూ రాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఈ ఘటనపై అసెంబ్లీలో రచ్చ చేసిన ప్రతిపక్షాలు) గతనెల 25న అంబానీ ఇంటి ముందుపేలుడు పదార్థాలతో కనిపించిన స్కార్పియో యజమాని, ఆటో విడిభాగాల వ్యాపారి మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంపై ఫడ్నవిస్, పోలీసు అధికారి సచిన్ వాజేపాత్రపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సచిన్ తన భర్తను హత్య చేసి ఉండవచ్చని హిరేన్ భార్య ప్రకటన మేరకు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు) మరోవైపు తాజా వ్యవహారంతో శివసేన, బీజేపీ మధ్య రగులుతున్న వివాదం మరింత రాజుకుంది. అన్వే నాయక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ) -
అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం
సాక్షి, ముంబై: ఆసియా కుబేరుడు, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం (ఫిబ్రవరి 26న) నవ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా అనుమానాస్పదంగా మరణించిన స్కార్పియో ఓనర్ మన్సుఖ్ హిరెన్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. నేరపూరిత కుట్ర, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హిరేన్ భార్య విమల ఫిర్యాదు మేరకు మరణించిన రెండు రోజుల తరువాత, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం ఆదివారం హత్య కేసు నమోదు చేసింది. అలాగే రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం హిరెన్ మరణానికి సంబంధించిన కేసునుఏటిఎస్కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత పత్రాలన్నీ ఏటీఎస్ విభాగం స్వాధీనం చేసుకుని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి విచారిస్తున్నారు. ఈ కేసులో హిరేన్ ఒక్కడే సాక్షి అతడిని కూడా కోల్పోయామని అని దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. (అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు) రిలయన్స్ అధినేత అంబానీ నివాసానికి సమీపంలో గుర్తించిన పేలుడు పదార్థాలున్న వాహనం యజమానిగా భావిస్తున్న మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్ఐఏ దర్యాప్తును డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసు అధికారులు తనను వేధిస్తున్నారని, ఈ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా థానే, ముంబయి పోలీస్ కమిషనర్లకు హిరేన్ మార్చి 2న లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 5న హిరేన్ అనుమానాస్పదంగా శవమై తేలడం సంచలనం రేపుతోంది. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు) మన్సుఖ్ హిరెన్(ఫైల్ ఫోటో) కాగా కుటుంబ సభ్యులు అందించిన సమాచారం వారం రోజుల క్రితమే తన వాహనం చోరీకి గురైందని మన్సుఖ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కందివాలి యూనిట్ క్రైమ్ బ్రాంచ్ అధికారిని కలవడానికి తాను థానేలోని ఘోడ్‌బందర్ ప్రాంతానికి వెళుతున్నానని హిరెన్ తన కొడుకుతో చెప్పి ఆటో రిక్షాలో బయలుదేరాడనీ, మార్చి 4, గురువారం రాత్రి 10.30 నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. శుక్రవారం ఉదయం వరకు హిరెన్ కనిపించకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు నౌపాడా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గత వారం మధ్యాహ్నం థానేలోని కొలనులో నోటిలో గుడ్డలు గుక్కిన రీతిలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే తన సోదరుడు అత్మహత్య చేసుకునేంత పిరికవాడుకాదనీ, అతనికి ఈత కూడా బాగా వచ్చని హిరెన్ సోదరుడు వినోద్ మీడియాకు తెలిపారు. ఇది కచ్చితంగా హత్యే అని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు తని శరీరంపై పలు గాయాలున్నాయని పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం రేపిన కలకలం మరింత ముదురుతోంది. ముంబైలోని అంబానీ ఇంటిముందు అనుమానాస్పందంగా కనిపించిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ (45) శవమై తేలడం వివాదాన్ని మరింత రాజేస్తోంది. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర మాజీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అనుమానాలకు తావిస్తోందనీ, దీనిపై ఉన్నత స్థాయి దర్యప్తు జరపాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్' మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజ్ పాత్రపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి) రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబానీ బెదిరింపు కేసులో అనుమానాలకు దారితీసే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మన్సుఖ్‌ని, వాజ్ టెలిఫోన్ సంభాషణ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు పోలీసు కమిషనరేట్‌కు సమీపంలో ఉన్న దక్షిణ ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్‌ని వాజ్ కలిశారని చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది పోలీసులు అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మన్సుఖ్ తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇన్ని అనుమానాల నేపథ్యంలోఈ కేసు దర్యాప్తు తప్పనిసరిగా ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. (అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు) మరోవైపు మన్సుఖ్ను కలిసారాన్న ఆరోపణలను సచిన్ వాజ్ ఖండించారు. మన్సుఖ్ థానేకు చెందినవాడు కాబట్టి తనకు తెలుసు అంతేకానీ, ఇటీవలి కాలంలో అతడిని కలవలేదన్నారు. అలాగే తనను వేధిస్తున్నట్టుగా మన్సుఖ్ ఫిర్యాదు చేశాడని ధృవీకరించారు. అలాగే ఈ కేసులోఅంబానీ నివాసానికి చేరుకున్న మొదటి వ్యక్తిని తాను కాదన, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గామ్దేవి అని, ఈ తరువాత క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు స్పాట్ చేరుకున్నానని వివరణ ఇచ్చారు. అలాగే క్రాఫోర్డ్ మార్కెట్లో మన్సుఖ్ను కలిశాననే ఆరోపణలు అబద్ధమని కొట్టి పారేశారు. కాగా ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ మన్సుఖ్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. వాహన విడిభాగాల వ్యాపారం చేసే మన్సుఖ్, తన ఎస్‌యూవీని ఎవరో దొంగిలించారంటూ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గురువారం రాత్రి కనిపించకుండా పోయిన మన్సుఖ్ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. -
ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కారును గొలుసుతో కట్టేయడమనేది..
సాక్షి, న్యూఢిల్లీ : పారిశ్రామిక వేత్త ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. ఇప్పుడా పోస్ట్ ట్విటర్లో హల్చల్ చేస్తోంది. చెట్టుకు గోలుసుతో కట్టేసి ఉన్న ఓ బ్లాక్ మహీంద్ర స్కార్పియో ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ‘లాక్డౌన్ సమయంలో నేను కూడా ఇలానే ఉన్నాను’ అనే అర్థంతో వచ్చే ట్యాగ్‌లైన్‌ను దానికి జత చేశారు. ‘కారుకు అత్యాధునికమైన లాకింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ.. గొలుసుతో కట్టేయడమనేది యజమాని స్వాధీనతను చూపుతుంది. నేను కూడా లాక్డౌన్ సమయంలో కరోనా అనే గొలుసుతో బంధీ అయ్యాను. ఈ వారాంతంలో దాన్ని చేధించి బయటకు వస్తానని అశిస్తున్నా(మాస్కుతో )’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి లైక్‌లు, కాంమెంట్లు వస్తున్నాయి. మనలోని చెడు ఆలోచనలను కూడా గొలుసుతో బంధించాలని ఒకరు, యజమానికి గొలుసుపైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుందని మరొకరు కామెంట్ చేశారు. (వైరల్ : ట్రంప్‌దే విజయం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్) Not exactly a high tech locking solution but at least it shows the owner’s possessiveness! To me, this pic perfectly describes how I feel under lockdown. This weekend I’m going to try breaking that chain..(with my mask on!) pic.twitter.com/CbW4FUml1a — anand mahindra (@anandmahindra) November 6, 2020 -
శ్రీమతి కోరిక : టెర్రస్ ఎక్కిన స్కార్పియో
సాక్షి,ముంబై: పాత వస్తువులను పారేయడమంటే చాలా మందికి చెప్పలేని బాధ. దాన్ని ప్రేమగా మరోదాని కోసం వినియోగించడం తరచూ చూస్తూనే ఉంటాం. అందులోనూ ఫస్ట్ బైక్, మొదటి కారు అంటే మరీ పిచ్చి. ఒక్క పట్టాన వదిలిపెట్టాలనిపించదు. అలాంటివస్తువులను మరింత ఇన్నోవేటివ్‌గా వాడుతూ వాటిమీద తమకున్న ప్రేమనుచాటుకుంటారు చాలామంది. బిహార్‌కు చెందిన ఇంతసార్ ఆలం ఆ కోవకే చెందుతారు. అయితే ఆలం ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచించారు. తనకెంతో ఇష్టమైన స్కార్పియో కారుపై ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నారు. అందుకే మహీంద్రా గ్రూప్ అధిపతిని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆలం తన మొదటి కారు స్కార్పియో ఆకారలో తన ఇంటి టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. అంతేకాదు దానికి ఒక నెంబరు ప్లేట్ కూడా జతచేశారు. మరో విషయం ఏమిటంటే స్కార్పియో వాటర్ ట్యాంక్ స్థాపించడం వెనుకఉన్న ఆలోచన ఇంతసార్ భార్యదట. ఆమె ఆగ్రాలో ఇలాంటిదే చూసి, అలాంటిదే కావాలని తన భర్తకు చెప్పిందట. దీంతో తన ఫస్ట్ లవ్.. ఇటు భార్య కోరిక ఎలా కాదనగలడు. అందుకే సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేసి స్కార్పియో వాటర్ ట్యాంక్ అలా టెర్రస్ ఎక్కించేశారన్నమాట అదీ సంగతి. ఈ స్కార్పియో వాటర్ ట్యాంకు ఇపుడు నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన ఆనంద్ మహీంద్ర తమ స్కార్పియో అంత ఎత్తుకు చేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. స్కార్పియో కారు పట్ల ఆలం అభిమానానికి, ప్రేమకు తన సలామ్‌లు అంటూ ప్రశంసలు కురిపించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం; తొమ్మిది మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్ గఢ్ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో ఉదయం 5.35 గంటల సమయంలో స్కార్పియో వాహనం, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం దురదృష్టకరం. మృతుల్లో అయిదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన ఒకరిని చికిత్స నిమిత్తం లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి బీహార్‌లోని భోజ్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రతాప్‌గఢ్ ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసం అవ్వడంతో మృతదేహాలను వెలికితీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి మృతదేహాలను బయటకు తీశారు. కాగా చనిపోయిన వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. (ఘోర ప్రమాదం: నాడు తల్లి.. నేడు కూతురు..) ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు -
శార్వరి నామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యాసంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరేవిధంగా అభివృద్ధి చేస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు. ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్‌కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవీప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీకు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. సినిమా, టీ.వీ, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదానానికి, గోసంరక్షణకు మీ శక్తిమేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిలో లోపం కంటపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించరు. పరిస్థితులు బేరీజు వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సర్పదోష నివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా రావలసిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇదే సమస్యగా మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు, వారిపై చర్య తీసుకోలేరు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యాసంబంధిత, నిర్మాణ సంబంధిత ఋణాలు మంజూరు అవుతాయి. నిత్యం హనుమాన్ సింధూర్ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలం. ఫంక్షన్‌హాల్స్ నిర్వాహకులకు మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కీళ్ళనొప్పులు, ఇ.ఎన్.టి. సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథ రచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. సోదరసోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అధిక శ్రమ చేస్తారు. అయితే మీరు ఊహించని పరిణామాలు ఏర్పడటం వల్ల ప్రత్యర్థుల వ్యూహం వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ మరో రూపంలో ధనం వస్తుంది. ఆ లోటు పూడుస్తుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యాలయంలో టీమ్ స్పిరిట్‌తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. రాజకీయ పదవిప్రాప్తి. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగిస్తారు. కోర్టుతీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శాంతి, సహనం, ఓర్పు వహించి చర్చలు ఫలవంతం చేసుకుంటారు. మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసి వస్తుంది. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వల్ల మీ విశ్వాసాన్ని నిరూపించుకోవలసి రావడం ఇబ్బందిగా మారుతుంది. మీరు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి ఋజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేకమందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే ‘‘పాముపడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో ఋజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు వ్రాసిన డాక్యుమెంట్స్‌లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయినవారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదేపనిగా గుర్తుకురావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తిసామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇన్కవ్ుట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, చోరభయం పొంచి వుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్లు కలిసిరావు. -
శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన దాఖలైన పరువు నష్టం కేసులో పదేపదే హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు రూ. 5వేల జరిమానా విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు హాజరుకావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విశాల్ పహుజా ఆయనను ఆదేశించారు. కాగా 2018లో బెంగళూరు సాహిత్య ఉత్సవంలో శశి థరూర్ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. చదవండి : మోదీ.. శివలింగంపై తేలు! -
సాగర్ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత
-
వికారినామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శని కేతువుల సంచారం, ద్వితీయ, తృతీయ స్థానాలలో గురు సంచారం, అష్టమంలో రాహు సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విద్య, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వాహనసౌఖ్యం ఏర్పడుతుంది. గృహనిర్మాణం చేస్తారు. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు. వారిని ఎదుర్కొనవలసి ఉంటుంది. స్త్రీలతో వైరం వద్దు. సాధ్యమైనంతవరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదాస్పదమైన విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నత ఆశయాలను ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చునని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్ధంలో ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. తెలివితేటలతో వాటిని సరిదిద్దగలుగుతారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. మీ కుటుంబసభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని స్వప్రయోజనాలకు వాడుకోవడం జరుగుతుంది. మీ నిజాయతీ, శ్రమ, మంచితనం, వృత్తి పట్ల అంకితభావం నోటి దురుసుతనం వలన మసిబారే అవకాశం ఉంది. మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. బంధువర్గంలో భేదాభిప్రాయం తొలగిపోవటం వలన ముఖ్యమైన బాధ్యతలని తేలిగ్గా నెరవేర్చే వీలు కుదురుతుంది. రాజకీయ లబ్ధి పొందుతారు. వ్యవసాయం, జలసంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే అధికారుల వలన అంతకంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఇప్పటి మీ ఉన్నతస్థితికి కారణం వారసత్వంగా ఆస్తులు, భూములు లభించటమే కారణం అని, ఆస్తి రావలసిన దానికన్నా అధికంగా రావడం వల్లనే బాగుపడ్డారనే వదంతులు వ్యాపిస్తాయి. వృత్తిలో మీకు లభించవలసిన ప్రమోషన్ల కోసం అంతర్గత పోరాటం తప్పనిసరి అవుతుంది. మీకు న్యాయం జరుగుతుంది. ప్రింటింగ్ సమాచార సాధనాల ఖర్చు, స్టేషనరీ ఖర్చులు అధికం అవుతాయి. వ్యాపార విస్తరణలో భార్యవైపు సహాయ సహకారాలు లభిస్తాయి. చాలా విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. కూతురు విషయంలో విశేషమైన అభిమానం, మినహాయింపులు ఉంటాయి. కష్టాలు భయపెడతాయి కానీ పడదోయవు. సహచరవర్గం ఉన్నతస్థానాలలో ఉంటారు. సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకు స్వాతంత్య్రం ఉండదు. మీ ప్రతి విజయానికి మరొకరిని కారణంగా చూపిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సలహాలు చెప్పే మేధావులుగా రాణిస్తారు. ముఖ్యస్థానాలలోని వారికి సర్వస్వం మీరే అవుతారు. నిందలు ప్రచారంలోకి వస్తాయి. సొంత రహస్యాలను సొంత మనుషులు బయట పెట్టనంత వరకు ఇబ్బందులు రావు. విదేశీ వ్యవహారాలు, షేర్ల బిజినెస్‌ల విషయంలో అధిక శ్రమ అవసరం. ఉన్నతాధికారుల వద్ద మంచి అభిప్రాయం, అభిమానం సంపాదించుకుంటారు. మిమ్ములను కూలదోయాలని కుట్రలు పన్నే వర్గం విజయం సాధిస్తారేమోనన్న దిగులు ఉంటుంది. బాల్యమిత్రులు, బంధువర్గంలోని వాళ్ళతో ఏర్పడిన విభేదాలు వృత్తి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి. స్త్రీ దేవతామూర్తుల ఆరాధన వల్ల విశేషమైన మేలు జరుగుుతుంది. ఆర్థికంగా సంవత్సర ప్రథమార్ధం అంత ప్రోత్సాహకరంగా ఉండదు. విద్యాసంబంధిత విషయాలకు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. విదేశాలకు సంబంధించిన వ్యహారాలు లాభిస్తాయి. పెద్దవాళ్ళతో, సమాజంలో పరపతి కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు, చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మానసిక వేదనకు గురి అవుతారు. నైతికధర్మం కలిగి సర్వదా మీ యందు ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులు మీ దృష్టిలో పడతారు. వాళ్ళకి ఇన్నాళ్ళు సహాయపడలేక పోయినందుకు విచారించి తగిన న్యాయం చేస్తారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన సదస్సులు, విందులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. భాగస్వాములతో వివాదాలు వస్తాయి. భూముల వల్ల అధికలాభం పొందుతారు. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది. బెట్టింగులు, కోడిపందాలు, పేకాటలకు దూరంగా ఉండండి. పదిమందికి బాగోగులు చెప్పే స్థానంలో ఉన్న మీరు మీకంటే చిన్నవాళ్ళతో నీతులు చెప్పించుకోవలసిన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తపడండి. అమ్మాయి నచ్చితే జాతకం కుదరకపోవడం, జాతకం కుదిరితే అమ్మాయి నచ్చకపోవడం, ఇవన్నీ బాగుంటే అమ్మాయి తరఫువారు సంబంధం వద్దు అనడం, దగ్గరి దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక వేదనకు కారణం అవుతాయి. ఎట్టకేలకు ఒకమంచి సంబంధం కుదురుతుంది. విద్యాసంబంధ విషయంలో, పోటీపరీక్షల సంబంధ విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటికి ఎంపిక అవుతారు. ఐఏఎస్., ఐపీఎస్, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి తగిన విధంగా భగవంతుడు మంచి ఫలితాలను అందిస్తాడు. రాజకీయ వ్యూహాలు లాభిస్తాయి. రాజకీయంగా వచ్చిన నూతన బాధ్యతలను వినూత్నంగా నిర్వహిస్తారు. శత్రువర్గాన్ని లెక్కచేయరు. మోసం చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రజాబలంతో ఎదుర్కొంటారు. అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తారు. ఆరోగ్య సంబంధిత విషయాలలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సహోదర సహోదరీవర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు. సన్నిహితులు, మిత్రులు మీ ద్వారా సహాయం పొందుతారు. నూతన వ్యాపారం కలిసిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చివేస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మీకు రావలసిన ధనం మాత్రం సులభంగా చేతికి అందదు. కుటుంబంలో అశాంతి వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల వల్ల చికాకులు, విభేదాలు సంభవిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు, సేవాసంస్థలకు ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయాన్నీ రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకోకపోవడమే మంచి నిర్ణయం అని భావిస్తారు. అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది. అత్యవసరంగా సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తే నిపుణుల సలహాలు తీసుకుని సంతకాలు చేయండి. ప్రేమవివాహాలు కలిసిరావు. పునర్వివాహం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాంట్రాక్టులు, సబ్–కాంట్రాక్టులు, లైసెన్స్‌లు, లీజు పొడిగింపు వంటి అంశాలు వివాదస్పదం అవుతాయి. ప్రతి చిన్న విషయానికి పలుకబడి ఉపయోగించవలసి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం అనివార్యం అవుతుంది. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో సమయోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మందుల వ్యాపారులకు, వైద్యులకు, లోహపు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, చేతివృత్తి పనివారికి, విద్యారంగంలో ఉన్నవారికి, పరిశోధనారంగంలో ఉన్నవారికి, ఆహారధాన్యాల వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వస్త్రవ్యాపారం చేసేవారికి ఫలితాలు మద్యస్థంగా ఉన్నాయి. కళా, సాహిత్య రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియాపరంగా ఖ్యాతి లభిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. నిర్మాణరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోళ్ళఫారాలు, పశువుల పెంపకం లాభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరింప చేస్తారు. సిబ్బందికి మీ మనస్తత్వం అర్థంకాక విధిలేని పరిస్థితులలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం మేలని గ్రహిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. అన్యభాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. కొత్త బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి రావలసిన బిల్స్, చెక్స్, క్లెయిమ్స్ సరైన సమయంలో రాకపోవడం వల్ల ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైరివర్గం చర్యల వల్ల ఉద్యోగంలో బదిలీ సూచిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఖరీదైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. చోరభయం పొంచి వుంది. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభపడతారు. సంవత్సర ప్రథమార్ధంలో వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థానం లభిస్తుంది. తరతమ భేదం లేకుండా అందరికీ సహాయం చేస్తారు. మీ సన్నిహితవర్గాన్ని బలోపేతం చేసుకుంటారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీ పరీక్షలలో మంచి మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో ఉద్యోగం సాధిస్తారు. సన్నిహిత బంధువుల విమర్శలు బాధించినా పైకి లెక్కచేయనట్లు ఉంటారు. మీ నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందిపెట్టే వాళ్లను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారు. చాలా సందర్భాలలో మీకు ఇష్టంలేని విషయంపైనే చర్చించవలసి వస్తుంది. మీరు ఓ ప్రశాంతమైన దారిలో వెళుతుంటే మిమ్మల్ని మరో మార్గంలోకి నడిపించడానికి మీ మిత్రులు ప్రయత్నిస్తారు. మీ మీద ఎటువంటి ప్రలోభాలు పనిచేయవు. జీవితాశయాన్ని సాధిస్తారు. రాజకీయ పదవిప్రాప్తి. మీ మీద ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతారు. కొన్ని పనులు మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. గతంలో లభించిన రాజకీయపదవి వల్ల లాభపడతారు. మీకున్న అవకాశాలను ఉపయోగించుకొని పదిమందికీ ఉపయోగుపడే పనులు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అవివాహితులైన వారికి వివాహకాలం. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. పునర్వివిహా ప్రయత్నాలకు అనుకూలకాలం. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. ఎవరు ఎంతగా భయపెట్టినా జంకకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వెన్నుచూపి పారిపోవటం మీ చరిత్రలో లేదు అని నిరూపిస్తారు. దివారాత్రులు వృత్తి ఉద్యోగాలలో శ్రమించినా గుర్తింపు రాని ఉద్యోగాలను మానేసి మరొక చోట ఉద్యోగం చూసుకుందామని భావిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తారు. ప్రభుత్వ స్కీములు మీకు ఉపయోగపడతాయి. తనఖా పెట్టిన వస్తువులను విడిపిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాలయాలలో సీటు లభిస్తుంది. కోరుకున్న చదువును అభ్యసించగలుగుతారు. విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కీళ్ళనొప్పులు, చెవి, ముక్కు, గొంతు వంటివి బాధిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మీకు న్యాయం జరుగుతుంది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల పెంపకం విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. బ్యూటీపార్లర్స్ లాభాల బాటలో నడుస్తాయి. పుట్టింటి యోగక్షేమాలు విచారించడం పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. మీరు ఫోన్లలో, సెల్ఫోన్లలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని మీ ఇంట్లోవారే పరిశోధిస్తారు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
జాతీయ రహదారిపై స్కార్పియో బోల్తా
విశాఖపట్నం, పాయకరావుపేట: జాతీయరహదారిపై సీతారామపురం జంక్షన్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. పరవాడ మండలం మడకపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది అయ్యప్ప స్వాములు తూర్పుగోదావరిజిల్లా శంఖవరం సమీపంలో ఉన్న ఆంధ్ర శబరిమలలో ఇరుముడి సమర్పించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనానికి సీతారామపురం వద్ద మోటారు సైక్లిస్ట్‌ను అడ్డంగా వచ్చాడు. అతనిని తప్పించబోయి అదుపు తప్పిన స్కార్పియో రోడ్డు పక్కకు వెళ్లి పోయి, పల్టీలు కొట్టింది.ఈప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న నాగుబల్లి రాము, సానాపతి రమణ, అప్పారావు, శ్రీనులకు స్పల్పగాయాలయ్యాయి. అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన మోటారు సైక్లిస్ట్ ఉరుము రాజు, ఇతని కుమార్తె రాజకుమారిలకు కూడా స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం మండలం యర్రవరం గ్రామానికి చెందిన రాజు, అతని కుమార్తె రాజకుమారి ఇటుకబట్టీలో పనిచేసేందుకు సీతారామపురం వచ్చారు. పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామం వెళ్లి సాయంత్రం తిరిగి సీతారామపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియోను వీరి బైక్ పక్కగా ఢీకొట్టడం వల్ల వీరు కూడా రోడ్డుపై పడి గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాబూరావు తెలిపారు. అయ్యప్ప దయ వల్లే ప్రాణాలు దక్కాయి... ప్రమాదం జరిగిన తీరు చూస్తే భారీ ప్రాణనష్టం జరిగి ఉంటుందని భావిస్తారు. జాతీయరహదారిపై స్కార్పియో వాహనం రెండు పల్టీలు కొట్టింది. డివైడర్‌పైకి ఎక్కిపోయింది.ఆ సమయంలో వాహనంలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయ్యప్ప దయవల్ల ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం గాని పెద్ద గాయాలు గానీ తగల్లేదని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు, వాహనం బోల్తాపడిన దృశ్యాన్ని చూసి రాకపోకలు సాగించే వారు స్థానికులు సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. చివరకి ఎవరికి ఏమీజరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
మహీంద్ర స్కార్పియో కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీదారు మహీంద్ర అండ్ మహీంద్ర తన పాపులర్ మోడల్లో కొత్త వేరియట్‌ను తీసుకొచ్చింది. స్కార్పియో ఎస్‌యూవీలో ఎస్9 పేరుతో ఈ సరికొత్త వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. అంతేకాదు కీలక ఫీచర్లతో స్కార్పియో ఎస్ 11 కంటే తక్కువ ధరకే దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. మహీంద్ర స్కార్పియో ఎస్ 9 ఎస్యూవీ ధరను రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తమ డీలర్ల దగ్గర ఈ వాహనం తక్షణమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2.2-లీటర్ టర్బోడీజిల్ ఇంజీన్ కెపాసిటీ, 140 హెచ్‌పీ వద్ద 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, 5.9 ఇంచెస్ టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే స్టీరింగ్ వీల్‌పై ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్తోపాటు, ఆడియో, క్రూయిస్ కంట్రోల్ బటన్లను అమర్చింది. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే.. టాటా హెక్సాతో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
మోదీ.. శివలింగంపై తేలు!
బెంగళూరు: ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది ఒక అసాధారణ పోలికగా అభివర్ణిస్తూ.. ‘ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారు’ అంటూ థరూర్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. తన వ్యాఖ్యపై వివరణ ఇస్తూ ‘ఒకవేళ చేత్తో తీస్తే ఆ తేలు కాటేస్తుంది. శివలింగాన్ని చెప్పుతో కొడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి’ అని థరూర్ పేర్కొన్నారు. ‘హిందుత్వ ఉద్యమం, మోదిత్వ భావజాలం మధ్య నెలకొన్న సంక్లిష్ట బంధాన్ని వివరించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది’ అన్నారు. మోదీని నియంత్రించడం బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆరెస్సెస్‌కు అత్యంత కష్టంగా మారిందని కూడా థరూర్ వ్యాఖ్యానించారు. బెంగళూరు సాహిత్య వేడుకలో ఆదివారం థరూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాజీ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. వీటిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించాలని, శివభక్తుడినని చెప్పుకునే రాహుల్ ఈ వ్యాఖ్యను సమర్థిస్తారో లేదో చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. థరూర్ వ్యాఖ్యలు మహాశివుడిని అవమానించేవేనని, తక్షణమే రాహుల్, శశిథరూర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రవిశంకర్ ప్రసాద్ విమర్శలపై థరూర్ స్పందిస్తూ.. మోదీకి సంబంధించి ఈ వ్యాఖ్య తాను చేసింది కాదని, ఆ కామెంట్ ఇప్పటిది కూడా కాదని, చాన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారమవుతూనే ఉందని సమాధానమిచ్చారు. మోదీపై థరూర్ రాసిన ‘ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ ఇటీవలే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
‘పశ్చిమ’లో ఘోర రోడ్డు ప్రమాదం
భీమడోలు: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనం అదుపుతప్పి, రెండు బైక్‌లను ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడివాడకు చెందిన జంగం ఆనంద్‌రాజ్ పశ్చిమ బెంగాల్లో ని దుర్గాపూర్‌లో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం కుటుంబంతో కలసి స్కార్పియో వాహనంలో దుర్గాపూర్ నుంచి గుడివాడకు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు వల్ల స్కార్పియో వాహనం అదుపుతప్పి కురెళ్లగూడెం వద్ద రెండు మోటార్ సైకిళ్లతో పాటు కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను ఢీకొంది. అనంతరం పల్టీలు కొట్టుకుంటూ డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న దాసరి కృష్ణయ్య, అతడి మనవడు తాళ్లూరి అరుణ్(8) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో వెళ్తున్న మహిళా కూలి చలమల సత్యవతి తీవ్రంగా గాయపడి.. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదంలో కారు, ఆటో, బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. పుట్టిన రోజు నాడే.. కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దాసరి కృష్ణ తన మనవడు తాళ్లూరి అరుణ్ పుట్టిన రోజు కావడంతో కొండాలమ్మ ఆలయం వద్ద పూజలు చేయించేందుకు అరుణ్‌తో కలసి బైక్‌పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
జవాన్ దుర్మరణం
- స్కార్పియో వాహనం బోల్తా - హుళేబీడు గ్రామం వద్ద ఘటన హుళేబీడు(ఆలూరు రూరల్) : ఆలూరు మండలం హుళేబీడు గ్రామశివారులోని మలుపు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. స్వయంగా వాహనం నడుపుతున్న అతడు మలుపు వద్ద నియంత్రించుకోలేకపోవడంతో బోల్తా పడింది. మృతుడు గుంతకల్‌కు చెందిన సి.రామ్‌బాబుగా తెలిసింది. ఇతడు డ్రైవింగ్ చేస్తూ ఆదోనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై మలుపు వద్ద వాహనాన్ని(స్కార్పియో: ఏపీ 21 ఏటీ296) నియంత్రించుకోలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్కార్పియో వాహనంలో ఇరుక్కుపోయిన రామ్‌బాబు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న ఆధార్, ఐడెంటిటీ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. సి.రాంబాబు, సన్నాఫ్ ప్రకాష్ పేర్లున్నాయి. గుంతకల్‌కు చెందిన వ్యక్తిగా వివరాలు అందులో నమోదయ్యాయి. మరొక కార్డులో సి.రామ్‌బాబు, బీఎస్ఎఫ్ జవాన్ అనే ఐడెంటిటీ కార్డు కూడా లభ్యమైంది. వాహనంలో ఎందరు ప్రయాణిస్తున్నారు, ఆ వాహనం ఎక్కడికి వెళ్తుందన్న వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు ఎస్ఐ ధనుంజయ తెలిపారు. -
స్కార్పియో బీభత్సం..
- వేగంతో వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన కారు - ఒకరు మృతి.. మరో నలుగురికి గాయాలు - మాదాపూర్‌లో ఘటన హైదరాబాద్: జనసమ్మర్థ ప్రాంతం... మితిమీరిన వేగం... రోడ్డుపై అడ్డదిడ్డంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ... ఒకరిని బలితీసుకుంది. మరో నలుగురిని గాయాలపాలు చేసింది. శనివారం రాత్రి మాదాపూర్ కావూరిహిల్స్ ఉడెక్స్ కాంప్లెక్స్ వద్ద ఈ బీభత్సం చోటుచేసు కుంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న బసంత్ శనివారం రాత్రి స్కార్పియో వాహనంలో జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వేగంగా దూసుకెళుతున్నాడు. ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారిపై గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వెళు తున్న బసంత్... కారును అదుపు చేయలేక పోయాడు. ఈ క్రమంలో కావూరిహిల్స్ వద్ద ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు కార్లను ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న రామకృష్ణ(55) అక్కడికక్కడే మరణించారు. బైకులపై వెళుతున్న మరో నలుగురు లాలూసాబ్, కె.శంకర్, భాషా, శ్రీశైలం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టూ వీలర్లు నుజ్జునుజ్జయ్యాయి. రంగం లోకి దిగిన పోలీసులు స్కార్పియో డ్రైవర్ బసంత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఆటో డ్రైవర్‌కు కలిసి వచ్చిన అదృష్టం
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు ఓ ఆటో డ్రైవర్ ఏకంగా మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ మోడల్‌ను అనుకరించి ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. స్కార్పియో వాహనాన్ని త్రీ వీలర్ ఆటోగా తయారు చేసి ఏకంగా పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మనసు దోచాడు. ప్రతిఫలంగా ఒక సరికొత్త మహేంద్రా ఫోర్ వీలర్ కారును అందుకున్నాడు. కేరళకు చెందిన సునీల్ మహీంద్ర కంపెనీనుంచి ‘మహీంద్ర సుప్రో మినీ ట్రక్’ను అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం మార్చి 19 అనిల్ ఫణిక్కర్ మహీంద్రా స్కార్పియో మోడల్లో ఉన్న ఓఆటో ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. భారతీయ రోడ్లపై స్కార్పియో ఎంత పాపులరో తెలుపుతూ ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్ర స్పందించారు. సదరు ఆటో రిక్షా యజమానిని కనుక్కోవాలని ట్వీట్ చేశారు. మహీంద్రా మ్యూజియం కోసం ఆ రిక్షాను తాను తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు దాని స్థానంలో బహుమతిగా అతనికి ఓ బ్రాండ్ న్యూ వాహనాన్ని ఇస్తానని ప్రకటించారు. మహేంద్ర టీం కేరళకు చెందిన సునీల్‌ని గుర్తించిందని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడించారు. అతనికి కొత్త వాహనం అందించినట్టు తెలిపారు. Here's Sunil, the proud owner of the 3 wheeler 'Scorpio', now a happy owner of a 4 wheeler. All thanks to you twitterati! (2/2) pic.twitter.com/5nb12j2dnj — anand mahindra (@anandmahindra) May 3, 2017 -
విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం
- ముగ్గురు హైదరాబాద్ వాసుల మృతి - ముగ్గురి పరిస్థితి విషమం ఎస్.రాయవరం: విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకుపాడు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్క, తమ్ముడు సహా ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ హయత్ నగర్లో నివసిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన 11మంది విశాఖ బంధువుల ఇంటికి వచ్చారు. వారు విశాఖ నుంచి స్కార్పియోలో అన్నవరం వెళుతుండగా గోకుపాడు జంక్షన్ దాటిన తరువాత కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న రూప (45), రాజేష్ (40) అక్కడిక్కడే మృతి చెందగా సుభోసింగ్ (18) ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఇదే కారులో ఉన్న ఏడాది చిన్నారి శ్రామేలికి, నేహా సింగ్, గీతా సింగ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల వయస్సులోపు వయసున్న యహోసింగ్, రిషి సింగ్, అభిషేక్, మరో మహిళ బిందుప్రియ, బండి నడుపుతున్న అభిజీత్‌లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్ప త్రికి తరలించారు. లారీ డ్రైవర్ శ్రీనివాస్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు విశ్రాంత ఉద్యోగుల దుర్మరణం.. మృతులు హైదరాబాద్ వాసులు చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న నాగార్జున అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు రంగరాజు, కనకరాజు, రామకృష్ణరాజు, సుబ్బరాజులతోపాటు స్నేహితులు కృష్ణారావు వీఎన్ మూర్తిరాజు, రామ్మోహన్‌రాజు ఈనెల 11న స్కార్పియో వాహనంలో తీర్థ యాత్రలకు బయల్దేరారు. వివిధ ప్రాంతాల్లో దర్శనాలు ముగించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం తెల్లవారుజామున చాగలమర్రి సమీపంలో కూలూరు రస్తా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రంగరాజు (64), కనకరాజు (72), రామకృష్ణరాజు (58), సుబ్బరాజు (60) దుర్మరణం చెందగా.. కృష్ణారావు, వీఎన్ మూర్తి, రామ్మోహన్‌రాజులకు తీవ్ర గాయాలయ్యారుు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియో
-
అకస్మాత్తుగా మంటలు.. స్కార్పియో దగ్ధం
-
అకస్మాత్తుగా మంటలు.. స్కార్పియో దగ్ధం
వంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా): అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ స్కార్పియో కారు దగ్ధమైంది. ఈ సంఘటన వంగుటూరు మండలం నాచుగుంటలో మంగళవారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఓ కుటుంబం నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నుంచి పొగలు రావడం గమనించి అందులో ఉన్నవారు కిందగి దిగారు. అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం కాపాడిన హెల్మెట్
గాయాలతో ఆస్పత్రిలో చేరిన విద్యార్థి భీమారం : ముందు జాగ్రత్తగా ధరించిన హెల్మెట్ ఫిజియోథెరపీ విద్యార్థి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన నగరంలో 55వ డివిజన్ ఎల్లాపురం బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపురానికి చెందిన గుర్రెపు శ్రీకాంత్ అదే జిల్లాలోని కమలాపురంలో ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతున్న తన సమీప బంధువులను చూసేందుకు తన మేనమామతో కలిసి హన్మకొండకు బయల్దేరాడు. వారు చెరొక ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎల్లాపురం బ్రిడ్జి వద్ద హన్మకొండ నుంచి కరీంనగర్‌వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం శ్రీకాంత్ బైక్‌ను ఢీకొంది. అయితే అతడు హెల్మెట్ ధరించి ఉండడంతో అతడి తలకు ఎలాంటి గాయంకాలేదు. హెల్మెట్ మా త్రం పగిలింది. ఈ ప్రమాదంలో శ్రీ కాంత్ కాళ్లకు బలమైన గాయాల య్యాయి. హెల్మెంట్ ధరించకపోతే శ్రీ కాంత్ అక్కడికక్కడే మృతిచెంది ఉండేవాడని పోలీసులు అభిపాయ్రపడ్డారు. ముందు ద్విచక్ర వాహనం, ఆ తర్వాత ఆటో ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనం శ్రీకాంత్ బైక్‌ను ఢీకొట్టిన తర్వాత, ముందు వెళుతున్న ఆటోను బలంగా తగిలింది. దీం తో ఆటో బోల్తాపడడంతో బాహుపేట కు చెందిన ఆటో డ్రైవర్ కొడకండ్ల అరుణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వాహనాన్ని పట్టుకున్న ఇన్స్పెక్టర్.. రెండు వాహనాలను ఢీకొని వేగంగా వెళ్తున్న స్కార్పియోను స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్ ఆ వాహనం వదిలి పారిపోయాడు. అన్నాసాగరం సమీపంలో ఎట్టకేలకు వాహనాన్ని పట్టుకున్నారు. -
లోగుట్టు లీక్!
మన రక్షణ అవసరాలను తీర్చడానికి అడుగు ముందుకేసినప్పుడల్లా ఏవో అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా నౌకాదళం సమకూర్చుకొనబోయే స్కార్పిన్ జలాంతర్గాముల శక్తిసామర్థ్యాలకు సంబంధించిన సవివరమైన డేటా ఆస్ట్రేలియాకు చెందిన పత్రికలో వెల్లడై ప్రకపంనలు సృష్టిస్తున్నది. 22,457 పత్రాల్లో ఉన్న ఆ వివరాలన్నీ అత్యంత కీలకమైనవి. స్కార్పిన్ గమనంలో ఉండగా దాన్నుంచి ఎంత పౌనఃపున్యంలో ధ్వని వెలువడుతుందన్న దగ్గరినుంచి... దాని కనిష్ట, గరిష్ట వేగం, వేర్వేరు వేగాల్లో ఉన్నప్పుడు దాని ప్రొపెల్లర్లనుంచి వెలువడే ధ్వని వివరాలు, సముద్ర జలాల్లో అది చూడగల లోతులు, వివిధ స్థాయిల్లో దాని సామర్థ్యం తీరు, శత్రు నౌకలపై దాడి చేశాక వెనుదిరగడంలో, వాటి దాడికి అంద కుండా ముందుకు కదలడంలో దాని పటిమ, శత్రు నౌకలనూ, టార్పెడోలనూ, క్షిపణులనూ ధ్వంసం చేయడంలో దానికుండే సామర్థ్యం వగైరాలన్నీ ఆ డేటాలో ఉన్నాయి. ఈ డేటాను అధ్యయనం చేస్తే స్కోర్పిన్ను ఎదుర్కొనడానికి అనువైన రక్షణ ఏర్పాట్లను చేసుకోవడం ప్రత్యర్థులకు పెద్ద కష్టం కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే లీకైన వివరాలన్నీ జలాంతర్గామికి చెందిన బ్లూ ప్రింట్ లోనివేనని, దాని చోదన, ఆయుధ వ్యవస్థల వివరాలు అందులో ఉండవు గనుక అదంత ప్రమాదం కాదని మరికొందరి అభిప్రాయం. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ సైతం ఈ లీకు వల్ల ఏర్పడగల ముప్పేమీ లేదన్న వాదనతోనే ఏకీభవి స్తున్నారు. నిజానికి స్పార్పిన్ ప్రపంచంలోని జలాంతర్గాములతో పోలిస్తే అన్ని విధాలా మెరుగైనదన్న పేరుంది. అది నిలకడగా దాదాపు 50 రోజులపాటు నీటి అడుగున ఉండగలదు. మన నౌకాదళం వద్ద ప్రస్తుతం 13 జలాంతర్గాము లున్నా వాటిలో కొన్ని అవసాన దశకు చేరుకున్నాయి. పైగా ఇప్పటి అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవు. సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న వర్త మానంలో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే తప్ప ప్రత్యర్థులపై ఆధిక్యత సాధ్యం కాదు. స్కార్పిన్లు ఆ లోటు తీరుస్తాయనుకుంటున్న తరుణంలో ఈ లీకులు వెలుగులోకొచ్చాయి. స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన నిర్మాణ పనులు పదేళ్లక్రితం మొదలయ్యాయి. అవి దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆఖరు కల్లా ఆరు జలాంతర్గాములనూ మన నౌకాదళానికి అప్పగించే అవకాశాలున్నాయం టున్నారు. ఈ దశలో వాటì డిజైన్‌ను సవరించడం కూడా కష్టమంటు న్నారు. ఈ లీకులు మన దేశాన్ని ఇరకాటంలో పడేయటానికా లేక డీసీఎన్ఎస్ సంస్థపై కక్ష తీర్చుకోవడానికా అన్నది ఇంకా తేలవలసి ఉంది. లీకుల వల్ల జరిగిన నష్టమెంత అన్నదానిపై ఎటూ సమీక్ష ఉంటుంది. దేశ భద్రతతో ముడిపడిన అంశం గనుక అసలు అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో రాబట్టడం ఇప్పుడు ముఖ్యం. జలాంతర్గాముల్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మనకు ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. 1981లో పశ్చిమ జర్మనీతో కుదిరిన హెచ్డీ డబ్ల్యూ జలాంతర్గాముల కొనుగోళ్ల ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశంలో జలాంతర్గాముల నిర్మాణ కార్యక్రమం అట కెక్కింది. అందులో సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేశాక 1999లో మళ్లీ కదలిక వచ్చింది. 2005లో రూ. 18,000 కోట్ల విలువైన ఆరు జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేసేందుకు, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్ని బదిలీ చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్ సంస్థతో ఒప్పందం ఖరారైంది. అయితే ఆ మరుసటి ఏడాదే ఇందుకోసం 4 శాతం ముడుపులు చెల్లించారని గుప్పుమంది. ఈ వ్యవహారంలో డీసీఎన్‌ఎస్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని 2009లో కాగ్ సైతం చెప్పింది. అయితే అది ఎత్తి చూపిన లోపాలు ప్రాజెక్టును ఆపేయవలసినంత ముఖ్యమైనవి కాదని నిర్ణయించారు. ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేయడానికి అను వుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం, దాని రూపకల్పనపై ఇక్కడివారికి శిక్షణనివ్వడం ఒప్పందంలో కీలకాంశాలు. లీకులతో ముప్పేమీ ఉండబోదన్న పరీకర్ ప్రకటన వాస్తవం కాదని దీన్ని బయటపెట్టిన పాత్రికేయుడు కామెరాన్ స్టీవర్ట్ అంటున్నాడు. భారత్, ఫ్రాన్స్‌లు రెండూ జరిగిన నష్టాన్ని తగ్గించి చూపు తున్నాయని, తన దగ్గరున్న మిగిలిన సమాచారం వెల్లడిస్తే అసలు కథ ఏమిటో వెల్లడవుతుందంటున్నాడు. రేపో మాపో ఆ పని చేస్తానంటున్నాడు. అందు వల్ల పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా లీకు వల్ల నష్టం ఉన్నదనో, లేదనో చెప్పడం తొందరపాటే అవుతుంది. అది దేశ భద్రతకు చేటు తెస్తుంది. పైకి ఏం చెప్పినా శత్రు దేశాల అంతర్గత భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల గురించి ఆరా తీయడం, అందుకోసం వారు చేసుకుంటున్న ఏర్పాట్లపై నిఘా ఉంచడం ఎవ రైనా చేసే పనే. అవతలివారి సమాచారాన్ని రాబడితే తప్ప మనం చేసుకుంటున్న ఏర్పాట్ల లోటుపాట్లేమిటో సంపూర్ణంగా తెలియదు. అదే సమయంలో మనకు సంబంధించిన సమాచారం కాస్తయినా బయటకు పొక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అడపా దడపా శత్రు దేశాల గూఢచారులుగా వ్యవహ రిస్తున్నవారు పట్టుబడుతుంటారు. రక్షణ కొనుగోళ్లు ఆషామాషీగా జరిగే వ్యవ హారం కాదు. టెండర్లు పిలవడం దగ్గర్నుంచి సంస్థల ఎంపిక వరకూ ఎన్నో జాగ్ర త్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ స్థాయిలో రాజీపడినా కాంట్రాక్టు దక్కని సంస్థ దాని కూపీ లాగి యాగీ చేస్తుంది. బోఫోర్స్ తుపాకుల స్కాం బయటపడ్డాక కొను గోళ్లలో దళారుల ప్రమేయాన్ని అంగీకరించరాదన్న విధానం పెట్టుకున్నా ముడు పులు చేతులు మారుతూనే ఉన్నాయి. అవి ఏదో ఒక దశలో బయటపడి అనిశ్చితి ఏర్పడుతోంది. ఇప్పుడు లీకైంది ముడుపుల సంగతి కాక ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలు. భారత్‌లోనే లీక్ అయి ఉండొచ్చునని డీసీఎన్ఎస్ అంటుండగా అది అసాధ్యమని పరీకర్ గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో పటిష్టమైన దర్యాప్తు జరిపి దోషుల్ని పట్టుకోనట్టయితే నష్టపోయేది ఫ్రాన్సే. -
తేలుకాటుకు చిన్నారి మృతి
నాటువైద్యుడితో మంత్రం వేయించిన వైనం చికిత్స అందడంలో జాప్యం రాంపూర్(ధర్మసాగర్ ) : తేలుకాటుకు గురై చిన్నారి మృ తిచెందిన సంఘటన మండలంలోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఉమాకాంత్ కథనం ప్రకా రం.. రాంపూర్‌కు చెందిన తొట్టె రాజు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారైలు. వీరిది వ్యవసాయ కుటుంబం. కాగా వీరంతా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సా యంత్రం తమ వ్యవసాయ బావి వద్దకు వన భోజనాలకు వెళ్లారు. అక్కడే ఆడుకుంటున్న వీరి పెద్ద కూతురు తొట్టె అక్షిత(06) ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది. దీంతో అక్షి త ఆడుకుంటున్న పరిసరాల్లో చూడగా తేలు కనిపించిం ది. తమ పాపను ఆ తేలు కుట్టినట్లుగా భావించి దాన్ని చంపేశారు. తేలు మంత్రం వేస్తే తమ చిన్నారి ప్రాణాలు దక్కుతాయని తల్లిదండ్రులు భావించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే పాపను ఓ నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి మంత్రం వేయించినట్లు సమాచారం. అనంతరం కొద్దిసేపు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపించిన చిన్నారి.. మళ్లీ కాసేపటికే స్పృహను కో ల్పోయింది. పాపను హన్మకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీ సుకెళ్లగా, అక్కడ చేర్చుకునేందు కు నిరాకరించారు. దీంతో ఎంజీ ఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని ఆరోగ్య పరి స్థితి విషమించడంతో డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఉదయం అక్షిత కన్నుమూసింది. ఆమె కాజీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతోంది. -
తేలు కాటుకు గురైన ‘ఆశ్రమ’ విద్యార్థి
కొత్తగూడ: తేలు కాటుకు గురై ఆశ్రమ పాఠశాల విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కామారం ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈక రవికుమార్ రెండు రోజుల క్రితం సాయంత్రం భోజనం చేసి ఇంటికి వెళ్లే క్రమంలో తేలు కుట్టింది. పాఠశాల మొత్తంలో 37 మంది స్థానిక గ్రామ విద్యార్థులే చదువుతుండటంతో ఉదయం, సాయంత్రం భోజనం పెట్టిన తరువాత విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. కాగా ఇంటికి వెళ్లే సమయంలో తేలు కాటు వేయడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఉపాద్యాయులు వెంటనే హన్మకొండలోని అమృత ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈవిషయమై ఏటీడబ్ల్యూఓ మోహన్‌రావును వివరణ కోరగా తేలు కుట్టింది నిజమేనని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ వార్డెన్‌కు ఐటీడీఏ డీడీ పోచం మెమో జారీ చేసినట్లు తెలిసింది. -
తేలుకాటుతో యువకుడి మృతి
చేర్యాల : తేలుకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెం దిన ఘటన మండలంలో ని దొమ్మాటలో సోమవా రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దొమ్మాటకు చెందిన గడిల కృష్ణ(22) కూలీ పనికి వెళ్లగా తేలు కాటు వేసింది. దీంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అతడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ నడిమింటి శ్రీనివాస్, ఎంపీటీసీ బొమ్మగోని రవిచందర్, మాజీ ఎంపీటీసీ మాచర్ల భారతమ్మ కోరారు. -
నెల్లూరులో పోలీస్ వ్యాన్ - స్కార్పియో ఢీ
-
హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో
ధర రూ. 14 లక్షలు న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ స్కార్పియో మోడల్లో కొత్త మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.74-14.01 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. కంపెనీ ఇందులో తొలిసారిగా ‘ఇన్‌టెలి-హైబ్రిడ్’ అనే హైబ్రిడ్ టెక్నాలజీని పొందుపరిచింది. దీని వల్ల ఇంధన వినియోగం 7% మేర తగ్గుతుందని కంపెనీ పేర్కొంది. 2.2 లీటర్ ఎం-హక్ ఇంజిన్ కలిగిన స్కార్పియో ఎస్4, ఎస్4 ప్లస్, ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడీ, ఎస్6 ప్లస్, ఎస్8, ఎస్10-2డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్మిషన్), ఎస్10-4డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్మిషన్) వేరియంట్లలో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. వాయిస్ మేసేజింగ్ సిస్టమ్ ఉన్న తొలి దేశీ ఎస్యూవీ ఇది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన సీఆర్డీఈ ఇంజిన్‌ను తొలిసారిగా దీనిలోనే ఉపయోగించారు. -
లారీని ఢీకొన్న స్కార్పియో: ఇద్దరి మృతి
దొరవారిసత్రం: వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కలగుంట సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తెనాలికి చెందిన డా.ఆదిశేషారావు కుటుంబ సభ్యులతో కలిసి స్కార్పియో వాహనంలో తమిళనాడుకు వెళ్తుండగా.. కలగుంట సమీపంలో స్కార్పియో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆదిశేషారావు(45) తోపాటు డ్రైవర్ నరేష్(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రాణాలు తీసిన నిద్ర మత్తు.. అతివేగం
దొరవారిసత్రం: స్కార్పియో కారు డ్రైవర్ నిద్ర మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్ సెంటర్‌ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరికం సందర్భంగా స్వగ్రామైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16వ తేదీన భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటకు పొన్నేరికి కారులో బయలుదేరారు. కలగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుకు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్ ధరణి నరేష్ (30), డాక్టర్ భవాని ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్ తీవ్రగాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసుల తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటల పాటు అల్లాడిన యువకుడు డాక్టర్ కుటుంబానికి తోడుగా వచ్చిన యువకుడు కుమార్ జరిగిన ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకుని ఎస్సై, పోలీస్‌లు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికి ఎంత ప్రయత్నం చేసిన ఇరుక్కుపోయిన యువకుడిని బయటకు తీయలేకపోయారు. చివరికి ఎస్ఐ నాయుడుపేట నుంచి ఓ క్రేన్ తెప్పించి గాయపడిన కుమార్‌ను వెలికి తీసే సరికి రెండు గంటలు పట్టింది. అప్పటి వరకు కాపాడండి కాపాడండి అంటూ ఆ యువకుడు నరకయాతన పడ్డాడు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో..
భోగాపురం(విజయనగరం): ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అమనాం జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కార్పియో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం. -
ఎమ్మెల్యే కారు దొరికిందోచ్
కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇంట్లో చోరీకి గురైన స్కార్పియో వాహనం ప్రత్యక్షమైంది. వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన ఈ వాహనాన్ని గిప్సన్ కాలనీలోని ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటి వద్ద నుంచి గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వాహనంతో పాటు ఇంట్లో సూట్‌కేసులో ఉన్న రూ.20వేల నగదు అపహరించి ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు ఇంటివద్ద ఉన్న సీసీ పుటేజి హార్డ్ డిస్క్‌ను కూడా దొంగలు తీసుకెళ్లారు. వాహనం కనిపించకపోవడంతో శుక్రవారం ఎమ్మెల్యే సమీప బంధువు గౌతం రెడ్డి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ ములకన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. వాహన డ్రైవర్ మహనందితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించారు. దొంగలు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు వాహనాన్ని ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్కుచేసి వెళ్లారు. చోరీకి గురైన ఎమ్మెల్యే వాహనం ఎట్టకేలకు ప్రత్యక్షం కావడతో అటు పోలీసులు, ఇటు వాహన యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
భారీ కుట్రను భగ్నం చేసిన నల్లగొండ పోలీసులు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు యత్నించిన ఓ ముఠా కుట్రను శుక్రవారం జిల్లా పోలీసులు భగ్నం చేశారు. మునగాల మండలం నర్సింహులగూడెంలో గత కొంతకాలంగా భూవివాదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముగ్గురిని హత్య చేసేందుకు యత్నించిన నలుగురి సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్కార్పియోలో వెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. గతంలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నల్లగొండ సరిహద్దు జిల్లాలో ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడకు చెందిన వీరిపై పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. వారి నుంచి రూ.12 లక్షలు, ఓ స్కార్పియోతో పాటు 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. -
అనంతపురంలో అర్ధరాత్రి స్కార్పియో దగ్ధం
గుత్తి: అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందున్న స్కార్పియోకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధం అయింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంపీపీ వీరేష్ బసినేపల్లిలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి ఇంటి ముందు స్కార్పియోను పార్క్ చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల వరకు మేల్కొనే ఉన్నారు. తెల్లారి చూసేసరికి వాహనం పూర్తిగా దగ్ధమై కనిపించింది. దీనిపై ఆయన పోలీసులకు సమాచారం అందించారు. -
తేలుకాటుతో యువకుడు మృతి
నల్లగొండ: వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో తేలు కుట్టిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేందర్ వ్యవసాయ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పనిచేసుకుంటున్న సమయంలో తేలు కుట్టడంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉపేందర్ గురువారం రాత్రి మృతిచెందాడు. -
చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి
-
చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి
అనంతపురం(నల్లచెరువు): నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఓ స్కార్పియో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు రవి(50), మురళి(56), అనిల్(30) అంతా హిందూపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. రవి అక్కడిక్కడే మృతిచెందగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. -
దెయ్యాల గ్రామం
మిస్టరీ * ఊరు ఉంది * మనుషులు మాత్రం లేరు * వాళ్లంతా ఏమయ్యారు?! గుజరాత్‌లోని కుల్ధారా గ్రామ శివారు ప్రాంతం... ఓ స్కార్పియో వేగంగా వచ్చి ఆగింది. ఆ వేగానికి రోడ్డుమీది ఎర్రటి మట్టి అంతె త్తున ఎగసి మబ్బులా కమ్ముకుంది. ‘‘ఓ గాడ్... ఏంటిది సందీప్. కాస్త మెల్లగా ఆపొచ్చు కదా?’’... దడదడా కొట్టుకుంటోన్న గుండె మీద చేయి వేసుకుని అంది రూప. ‘‘నువ్వు మరీను రూపా... నేనేమైనా కావాలని బ్రేక్ వేశాననుకున్నావా? అదే ఆగింది’’ అన్నాడు సందీప్ కాస్త విసుగ్గా. ‘‘ఆగిందా? అలా ఎలా ఆగుద్ది?’’ అంది రూప అయోమయంగా. ఈసారి మరింత విసుగు వచ్చింది సందీప్‌కి. ‘‘ఉండు... దాన్నే అడిగి చెప్తాను’’ అంటూ కిందికి దిగాడు. టైర్లు చెక్ చేశాడు. బాగానే ఉన్నాయి. బానెట్ తెరిచి అన్నీ పరిశీలించాడు. ఎక్కడా ఏ లోపమూ లేదు. డీజిలు కూడా ఉంది. మరి ఏమయినట్టు? ఉన్నట్టుండి కారు ఎందుకు ఆగిపోయినట్టు?! మళ్లీ కారు స్టార్ట్ చేయాలని ప్రయ త్నించాడు. స్టార్ట్ కాలేదు. ట్రై చేసి ట్రై చేసి విసిగిపోయి వదిలేశాడు. ‘‘ఏంటి దీపూ... ఏం జరిగింది?’’... అడిగింది రూప. ‘‘ఏమో తెలియడం లేదు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ కారు మాత్రం స్టార్ట్ కావట్లేదు.’’ ‘‘పోనీ ఇక్కడెక్కడైనా మెకానిక్ షెడ్ ఉందేమో చూడు’’ అంది కారు దిగుతూ. ఇక అదే చేయాలి అనుకుంటూ తనూ దిగాడు సందీప్. ఇద్దరూ ఐదు నిమిషాలు నడిచాక ‘కుల్ధారా’ అన్న బోర్డు కనిపించింది. ప్రవేశద్వారమూ ఉంది. ‘‘హమ్మయ్య... ఏదో ఊరు ఉందిక్కడ. కచ్చితంగా మెకానిక్ ఉండే ఉంటాడు’’ అంటూ హుషారుగా అటువైపు నడిచాడు సందీప్. రూప అతణ్ని అనుస రించింది. నాలుగడుగులు వేయగానే ఓ పాతికేళ్ల అమ్మాయి ఎదురొచ్చింది. వీళ్లని చూసినా చూడనట్టుగా వెళ్లిపోసాగింది. ‘‘హలో ఆగండి’’ అంటూ ఆమె దగ్గరకు పరుగెత్తారు ఇద్దరూ. ఏమిటన్నట్టు చూసిందామె. ‘‘మా కారు ఆగిపోయింది. ఈ ఊళ్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా?’’ ఆమె మాట్లాడలేదు. వాళ్లవైపు రెండు క్షణాలు తీక్షణంగా చూసింది. ఊళ్లోకి వెళ్లమన్నట్టు చేతితో చూపించింది. ‘‘థాంక్ గాడ్... ఉన్నట్టున్నారు. పద దీపూ వెళ్దాం’’ అంది రూప ఊపిరి పీల్చు కుంటూ. ఇద్దరూ మళ్లీ నడకందుకున్నారు. ఊళ్లోకి నడుస్తుంటే విచిత్రంగా అని పించసాగింది. ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. అన్ని ఇళ్ల తలుపులూ వేసి ఉన్నాయి. వెళ్లి కొడితే ఎవ్వరూ తీయడం లేదు. ఎవరైనా ఉన్నారా అని అడిగితే బదులు రావట్లేదు. సమయం గడిచిపోతోంది. వెలుగు దూరమవుతోంది. చీకటి కమ్ముకుంటోంది. అయినా వాళ్లు వెతుకుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు కనిపించకపోతారా అని ఆశగా వీధి వీధీ తిరుగుతూనే ఉన్నారు. వారి ప్రయత్నమైతే ఫలించలేదు. కానీ ఉన్నట్టుండి ఒక మహిళ స్వరం మాత్రం వినిపించింది. ‘‘దీపూ.. ఒక్కసారి విను’’ అంది రూప చెవులు రిక్కిస్తూ. సందీప్ నడక ఆపేశాడు. శ్రద్ధగా వింటున్నాడు. ఎవరిదో ఏడుపు. చిన్నగా మొదలైంది. ఉండేకొద్దీ పెద్దదవుతోంది. కాసేపటికి చెవులు చిల్లులు పడేంతగా వినిపించసాగింది. గుండెలు జారిపోయాయి ఇద్దరికీ. ఆ ఏడుపు మామూలుగా లేదు. బాధా కరంగా, భయానకంగా... అసలు మనిషి ఏడుపులానే లేదది. ఇక ఆలస్యం చేయలేదు సందీప్. రూప చేయి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి పరుగందుకున్నాడు. ఇద్దరూ ఆగకుండా పరిగెడుతున్నారు. అంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. ఉన్నట్టుండి నవ్వు మొదలైంది. ఆమె పగలబడి నవ్వుతోంది. తెరలు తెరలుగా నవ్వుతోంది. గుండెను చిక్కబట్టుకుని పరిగెడు తూనే ఉన్నారు ఇద్దరూ. అలసిన కాళ్లు సలుపుతున్నాయి. కానీ అవేమీ పట్టించు కునే స్థితిలో లేరు. ఎలాగైనా అక్కడ్నుంచి బయటపడాలి... అంతే. ఎట్టకేలకు కారు దగ్గరకు చేరుకున్నారు. కానీ ఏం లాభం? కారు పనిచేయడం లేదుగా! ఆ విషయం గుర్తు రాగానే గుండె జారిపోయింది. మళ్లీ పరుగందుకున్నారు. ఎలాగో హైవే మీదికి చేరుకున్నారు. అటుగా వెళ్తోన్న ఓ కారును ఆపారు. లిఫ్ట్ అడిగి ఎక్కేశారు. చెమటతో ముద్దయిపోయి, ఆయాసంతో రొప్పుతోన్న ఆ ఇద్దరినీ చూసి కారులోని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైంది సర్? యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా?’’ అన్నాడు ఆదుర్దాగా. లేదన్నట్టు తలూపింది రూప. జరి గింది చెప్పాడు సందీప్. అంతే... హడలి పోయి కారు ఆపేశాడా వ్యక్తి. ‘‘ఏ ఊరు?’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో. ‘‘కుల్ధారా’’... చెప్పాడు సందీప్. ‘‘కుల్ధారా వెళ్లారా? అసలు మీకా ఊరి గురించి తెలుసా? అక్కడ మూడు వందల యేళ్లుగా ఎవరూ ఉండడం లేదు. ఉండాలన్నా ఉండలేరు. ఎందుకంటే అది ఊరు కాదు. దెయ్యాల స్థావరం.’’ తుళ్లిపడ్డారు సందీప్, రూపలు. మూడు వందల యేళ్లుగా ఎవరూ ఉండటం లేదా? మరి ఊళ్లోకి వెళ్లమని తమకు దారి చెప్పిన స్త్రీ ఎవరు? అదే సందేహాన్ని వెలిబుచ్చారు. ‘‘మీకు ఇంకా అర్థం కాలేదా... మీకు దారి చూపింది, ఏడ్చింది, నవ్వింది ఎవరో! అసలు అక్కడ ఇళ్లే ఉండవు. మొండిగోడలు మాత్రమే ఉంటాయి. మనుషులు ఉండరు. దెయ్యాలు మాత్రమే తిరుగుతుంటాయి. మరి మీరు ఎవరిని చూశారు? ఏ ఇంటి తలుపులు కొట్టారు?’’ పై ప్రాణాలు పైనే పోయాయి సందీప్, రూపలకు. ఆ ఊరిలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ భయం వేయ సాగింది. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే చూశారు. నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయారు. నిజమే. ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ వాస్తవం. రాజస్థాన్ లోని కుల్ధారా గ్రామానికి వెళ్తే ఇలాంటి అనుభవాలు బోలెడు ఎదురౌతాయి. ఎందుకంటే అది ఒక హాంటెడ్ విలేజ్! రాజస్థాన్ రాష్ట్రంలో, జైసల్మేర్‌కి పది హేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్ధారా. ఒకప్పుడు నిండా జనంతో, అందమైన గృహాలతో కళక ళలాడేది. పండుగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇళ్లు లేవు. అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరివో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. ఎందుకని? అసలా ఊరికి ఏమయ్యింది? మూడు వందల యేళ్ల క్రితం కుల్ ధారాలో పలివాల్ బ్రాహ్మణ కులస్థులు మాత్రమే ఉండేవారు. అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ రాత్రికి రాత్రే ఊరిలోని జనమంతా మాయమై పోయారు. దానికి కారణం... ఒకరోజు ఆ గ్రామానికి దురదృష్టం నడచుకుంటూ వచ్చింది... ప్రధాని సలీమ్ సింగ్ రూపంలో (అప్పట్లో గ్రామ ప్రధానులని ఉండేవారు. వారిదే ఆధిపత్యం)! కుల్ధారా గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను సలీమ్ ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతణ్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీమ్. అది తట్టుకోలేక ఊరివాళ్లు తిరగ బడ్డారు. తమ కులం కానివాడికి అమ్మా యిని ఇవ్వలేమని, దూరంగా ఉండమని హెచ్చరించారు. రగిలిపోయాడు సలీమ్. ఊరివాళ్ల మీద పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరూ లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. అతనికి ఎదురు తిరిగి పోరాడటం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లేముందు... ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్ధారా అలా అయిపోయిందని అంటూ ఉంటారు. అయితే ఈ కథలో కొంతే నిజం ఉందని, గ్రామస్థులు ఊరు విడిచి వెళ్లిపోలేదని, రాత్రికి రాత్రే సలీమ్ సింగ్ అందరినీ చంపి పాతి పెట్టేశాడని, వాళ్లంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడిం చడం మొదలు పెట్టారనీ మరో వాదన. ఏది నిజమో తెలుసుకోవాలని, రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కని పెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఎవరి జాడా తెలియక మిన్నకుండిపోయారు. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రిళ్లు ఎవరో తలుపులు బాధేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు. ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతూండేవి. ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారి పోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియ డంతో ఎవ్వరూ అక్కడకు వెళ్లే సాహసం చేయలేపోయారు. ఒక్కోసారి ఆ ఊరి పక్క నుంచి వెళ్లేవాళ్ల వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నవారంతా కలిసి కుల్ధారా ఒక ఘోస్ట్ విలేజ్ అని తేల్చి చెప్పేశారు. ఆ ముద్ర నేటికీ అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఎందుకంటే... తమ ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం గానీ... అక్కడికి వెళ్లి తమ జీవితాలను రిస్క్‌లో పెట్టుకునే ధైర్యం గానీ ఎవరికీ లేవు కాబట్టి! కుల్ధారా ముఖద్వారం ఢిల్లీలోని పారాపార్మల్ సొసైటీకి చెందిన పన్నెండు మంది సభ్యులు కుల్ధారా గ్రామానికి వెళ్లారు. వాళ్లు అక్కడ ఉన్న ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఏవేవో నీడలు కనిపించాయి. ఏవేవో స్వరాలు వినిపించి భయపెట్టాయి. వారి వాహనాల మీద చిన్నపిల్లల చేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయేది. ఉన్నట్టుండి పెరిగిపోయేది. దాంతో వాళ్లు కూడా కుల్ధారా గురించి అంతవరకూ ఉన్నవన్నీ వదంతులు కావని, వాస్తవాలేనని నమ్మే పరిస్థితి వచ్చింది. నాటి నుంచీ కుల్ధారా అంటే అందరికీ మరీ భయం పట్టుకుంది. ప్రభుత్వం కుల్‌ధారాని సందర్శనా స్థలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. సందర్శకులు కూడా బాగానే వస్తున్నారు. కానీ చీకటి పడే సరికల్లా పరారైపోతురు. -
ఎందుకో.. ఏమో!
ఆత్మకూరు రూరల్: దర్జాకు ప్రతిరూపంగా నిలిచే నల్ల స్కార్పియో.. యజమానుల్లో తెలియని భయం సృష్టిస్తోంది. అధికారులు ఈ వాహనాల వివరాలను సేకరిస్తున్నా.. ఎందుకోసమనే వివరాలు వారికీ స్పష్టంగా తెలియకపోవడమే ఈ పరిస్థితి కారణం. గత మూడు రోజులుగా జిల్లాలోని నల్ల స్కార్పియో యజమానులు ప్రాంతీయ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల మెట్లు ఎక్కి దిగుతున్నారు. జిల్లాలోని నల్ల స్కార్పియోల సంఖ్య, వీటి వివరాలు తెలియజేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టుకమిషనర్‌కు ఓ లేఖ రాశారు. ఆ మేరకు నంద్యాల ఆర్టీఓకు.. కర్నూలు నంద్యాల, ఆదోని, డోన్ ఎంవీఐలకు ఈ సమాచారం చేరింది. వీరు తమ పరిధిలోని వాహన యజమానులకు నోటీసులు జారీ చేసి కార్యాలయంలో కలవాలని ఆదేశిస్తున్నారు. అలా వచ్చిన యజమానుల నుంచి వాహన వివరాలతో పాటు డ్రైవర్ సమాచారం సేకరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న వాహన శ్రేణిలో స్కార్పియో వాహనాలు ఉండటం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు అలాంటి వాహనాలు కాన్వాయ్‌లో కలిస్తే భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతోనే నల్ల స్కార్పియోల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అవసరమైతే వీటిని వినియోగించుకునే ఉద్దేశం కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే... డిప్యూటీ రవాణా కమిషనర్, జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మా పరిధిలోని నల్ల స్కార్పియోల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశాం. వాహనం పూర్తి వివరాలతో పాటు డ్రైవర్ వివరాలను సేకరించాం. -జింకల అనిల్ కుమార్, ఎంవీఐ, ఆత్మకూరు -
మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్
న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏటీ) ఫీచర్‌తో సరికొత్త న్యూ జనరేషన్ స్కార్పియోను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13.13 లక్షల నుంచి రూ.14.33 లక్షల (ఎక్స్‌షోరూం ఢిల్లీ) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏటీ వేరియంట్ ఎస్యూవీ స్కార్పియో టాప్-ఎండ్ ఎస్10 వేరియంట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా తెలిపారు. -
వృశ్చిక రాశివారు... స్వేచ్ఛాప్రియులు
ఆస్ట్రోఫన్డా: వృశ్చికం రాశిచక్రంలో వృశ్చికం ఎనిమిదో రాశి. ఇది సరి రాశి. జలతత్వం, శీతల స్వభావం. బ్రాహ్మణ జాతి, క్రూర రాశి. రంగు ఎరుపు. శరీరంలో రహస్యాంగాలను, హృదయాన్ని, తొడలను సూచిస్తుంది. ఇది స్థిర రాశి, స్త్రీ రాశి. దిశ ఉత్తరం. ఇందులో విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. దీని అధిపతి కుజుడు. ఇనుము, చెరకు, పంచదార, బెల్లం, కందులు, దూది, వక్కలు, ఆవాలు వంటి ద్రవ్యాలను సూచిస్తుంది. ఈ రాశి నార్వే, మొరాకో, వాషింగ్టన్ పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. - పన్యాల జగన్నాథ దాసు వృశ్చికరాశిలో జన్మించిన వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. పర్యవసానాలను పట్టించుకోని దూకుడు వీరి సహజ లక్షణం. మొండితనం కూడా వీరికి ఎక్కువే! విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావం, చిత్తశుద్ధి కలిగి ఉంటారు. ప్రథమకోపంతో వీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. రహస్య పరిశోధనలపై వీరికి ఆసక్తి ఎక్కువ. అతీంద్రియ శక్తులు, మార్మిక విషయాలపై అమితాసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవిస్తారు. చురుకైన తెలివితేటలు వీరి సొంతం. ఆసక్తి కలిగితే ఎలాంటి క్లిష్టమైన విషయాలనైనా ఇట్టే ఆకళింపు చేసుకోగలరు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొనే శక్తి వీరి సొంతం. దార్శనికత, వ్యూహరచనా చాతుర్యం వీరి తిరుగులేని బలాలు. గ్రహగతులు అనుకూలిస్తే ఈ లక్షణాలతోనే వీరు ఉన్నత స్థానాలను అందుకోగలరు. స్వతంత్రాభిలాష వీరికి ఎక్కువ. అందువల్ల స్వతంత్ర వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణించగలరు. స్వతంత్ర అధికారాలు గల ఉద్యోగాల్లో సత్తా చూపగలరు. వైద్య, విద్యా, న్యాయవాద, వ్యాయామ, పోరాట విద్యలలో చక్కగా రాణించగలరు. సైనిక, పోలీసు, గూఢచర్య సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లోనైనా, వృత్తి ఉద్యోగాల్లోనైనా వీరు పోటీని ఇష్టపడతారు. గట్టి పోటీ ఎదురైనప్పుడు సవాలుగా తీసుకుని, సత్తా చాటుకుంటారు. గ్రహగతులు ప్రతికూలిస్తే, వీరు ఇతరులపై అకారణంగా అనుమానం, ఈర్ష్య పెంచుకుని, వారికి హాని తలపెట్టేందుకైనా వెనుకాడరు. విమర్శలను, ఓటమిని సహించలేక వ్యసనాలకు లోనవుతారు. అనుకున్నది సాధించడానికి అపమార్గాలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతారు. ఫలితంగా మానసిక వ్యాధులకు, నాడీ సమస్యలకు, గుండెజబ్బులకు లోనవుతారు. - వృశ్చిక రాశిలో పుట్టిన బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ -
ప్రాణం మీదకు తెచ్చిన సినిమా
- ఎద్దును ఢీకొట్టి పల్టీలు కొట్టిన స్కార్పియో - ఒకరి మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు - పరిస్థితి విషమం, ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు - పరకాల మండలం నడికూడ వద్ద దుర్ఘటన పరకాల : సినిమాకు పోదామనే సరదా... ప్రాణం మీదకు తెచ్చింది. అతివేగంతో రోడ్డుపక్కన ఉన్న ఎద్దును ఢీకొట్టడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్ర గాయూలపాలయ్యూరు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి పరకాల మండలంలోని నడికూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై దీపక్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌కు చెందిన సం పంగి వెంకటేష్, పోగుల మధు, పల్లపు తిరుపతి, కంది వెంకటేష్ (డ్రైవర్), బొంత కుమార్(18), మరొకరు కలిసి రాత్రి సినిమా చూసేందుకు స్కార్పియోలో పరకాలకు బయలుదేరారు. మార్గమధ్యలో ఉన్న నడికూడ గ్రామ స్టేజీ సమీపంలోని హనుమాన్ ఆలయం ముందు ఉన్న రోడ్డు పక్కన రైతు తోర్ణం శంకర్రావు ఎద్దులను కట్టేశారు. వర్షం జల్లులు వస్తుండడంతో ఒక ఎద్దును దొడ్డిలో కట్టేయడానికి తీసుకుపోయారు. అదేదారి వెంట వస్తున్న స్కార్పియో అతివేగంగా వచ్చి ఎద్దును ఢీకొట్టిం ది. అక్కడ నుంచి ఆర్అండ్బీ రాయిని ఢీకొట్టి.. మూడు పల్టీలు కొట్టి.. చెట్టును ఢీకొట్టి ఆగింది. స్కార్పియో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న బొంత కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎద్దు సైతం ఎక్కడే మృత్యువాత పడింది. కారులో ఉన్న సంపంగి వెంకటేష్ నడుం, కాళ్లు విరిగిపోగా, పల్లపు తిరుపతి తలకు, చేతులకు, పోగుల మధుకు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ కంది వెంకటేష్, మరొకరు ప్రమాదం నుంచి బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన వారిలో ఒక్కరు బావిలో పడ్డట్లు వదంతుల రావడంతో గ్రామస్తులు, పోలీసులు కొద్దిదూరంలో ఉన్న బావి వద్దకు వెళ్లి చూశారు. అక్కడ లేక పోవడంతో వెనక్కి వచ్చారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో పరకాలలోని సివిల్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బొంత కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపర్చారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు దీపక్, రవీందర్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేక పోవడం, ఎదురుగా వాహనాలు రాక పోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. -
నందిగామలో స్కార్పియో కలకలం
కృష్ణా: కృష్ణా జిల్లా నందిగామలో స్కార్పియో కేసు కలకలం రేపింది. ఆ కారు తిరుమలలో మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే విధంగా కారు రిజిస్ట్రేషన్ మాత్రం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చేశారు. అంతే కాకుండా స్కార్పియోకు ముందు భాగంలో పోలీసు స్టిక్కర్లు, వెనుక భాగంలో ఆర్డీవో స్టిక్కర్లతో పలు మోసాలు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించడంతో నిందితులు స్కార్పియోను వదిలి పరారయ్యారు. -
ఆధ్యాత్మిక ప్రయాణం.. విధి రాసిన విషాదం
ఆధ్యాత్మికానందం కోసం సాగిస్తున్న ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. ఏడుగురు యాత్రికులు.. వందల కిలోమీటర్ల దూరం.. మూడు రోజుల కిందట బయలుదేరిన వీరు శ్రీశైలేశుని దర్శనానంతరం వెంకన్న సన్నిధికి పయనమయ్యారు. సోమవారం వేకువజామున వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం చాగలమర్రి మండల పరిధిలోని చిన్నబోధనం వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఎన్ని రోజుల యాత్రో తెలియదు.. ఎక్కడితో ముగుస్తుందో తెలియదు.. వాహనంలోని ఏడుగురూ మృత్యువాత పడ్డారు. వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పేర్లు మాత్రమే తెలుసుకోగలిగారు. మృతులంతా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ నియోజకవర్గానికి చెందిన వారుగా గుర్తించారు. చాగలమర్రి: మృత్యువు మాటు వేసి విసిరిన పంజాకు రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆనందంగా సాగుతున్న ఆ యువకుల తీర్ధయాత్ర అనంత లోకాలకు చేరింది. సోమవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామ సమీపంలో ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ప్రమాదంలో ఏడుగురు యువకులు దుర్మరణం చెందారు. వాహనంలో అందరూ మృత్యువాత పడటంతో ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు. కాగా వాహన డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. మహారాష్ట్రలోని భారమతి నియోజకవర్గం దూలేగాం గ్రామానికి చెందిన రసాల్ సాగర్ అంకుష్(30), రసాల్సాగర్ బాలసు రసాయి(29), ర సాల్ ఆజీత్ రాంచంద్ర(28), ఉండవాడి సూప గ్రామానికి చెందిన గవాలి అనీల్మ్రేష్ (31), గవాలి శేఖర్ బాపురావు (27), గవాలి రుషికేష్(26), గవాలి మోహన్ దత్తాత్రేయ(30) లు ఎంహెచ్ 42కే 2443 నంబరు గల స్కార్పియో వాహనంలో మూడు రోజుల క్రితం దైవ దర్శనానికి బయలు దేరారు. రెండు కుటుంబాలకు చెందిన వీరంతా ఈనెల 21వ తేదీన బయలుదేరి మొదట శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండగా కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై పెద్దబోధనం గ్రామం వద్ద రహదారి పక్కనే ఉన్న బాల ఓబయ్య ఇంట్లోకి వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న రసాల్సాగర్ అంకుష్, రసాల్ సాగర్ బాలసు రసాయి, ర సాల్ ఆజీత్ రాంచంద్ర, గవాలి శేఖర్ బాపురావు, గవాలి రుషికేష్ వాహనంలో ఇరుక్కొని అక్కడి అక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలను ఏఎస్పీ శశికుమార్ క్రేన్ ద్వారా బయటకు తీసి కారును పక్కకు తీయించారు. తీవ్రంగా గాయపడిన ఉండవాడిసూప గ్రామానికి చెందిన గవాలి అనీల్ రమేష్, డ్రైవర్ గవాలి మోహన్ దత్తాత్రేయలను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పెద్దబోధనం గ్రామానికి చెందిన బాలనాగమ్మకు తీవ్ర గాయూలు కాగా కడపకు తరలించారు. శేఖర్, సురేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకొన్న ఆళ్లగడ్డ ఏఎస్పీ శశికుమార్, అగ్నిప్రమాదదళ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆళ్లగడ్డ ఇన్చార్జి సీఐ ప్రభాకర్ రెడ్డితో ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొన్నారు. వాహన నంబర్ ఆధారంగా అక్కడి పోలీసులకు సమాచారం అం దించగా మృతుల వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలకు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మహారాష్ట్ర పోలీసులకు అప్పగిస్తామని ఆయన వివరించారు. -
ఇంట్లోకి స్కార్పియో.. ఏడుగురు మృతి
-
ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఏడుగురు మృతి
చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతికి వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతి తాలూకా వాసులు ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.... మార్గం మధ్యలో ఒకరు, ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఒకరు మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించడంతోపాటు వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. -
కలకలం సృష్టించిన రోడ్డు ప్రమాదం
స్కార్పియోను ఢీకొన్న లారీ ►ఇద్దరు నగరవాసుల మృతి ►వాహనంలో రెండు 0.22 దేశీయ ఆయుధాలు ►పది కిలోల జింక మాంసం స్వాధీనం సంగారెడ్డి క్రైం : జిల్లాలోని మునిపల్లి మండలం కంకోల్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనంలో రెండు దేశీయ ఆయుధాలు, ఆరు బుల్లెట్లు, 15 కిలోల మాంసం లభించాయి. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం మేరకు.. హైదరాబాద్‌లోని ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ సయీద్‌ఖాన్ (39), అమాన్ సఫీయుల్లాఖాన్ (29), మెహిదీపట్నంకు చెందిన మహ్మద్ అనీసుల్లాఖాన్, అబ్దుల్ అజీజ్ఖాన్లు స్కార్పియో వాహనంలో జహీరాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న లారీ మునిపల్లి మండలం కంకోల్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న స్కార్పియోను ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ సయీద్‌ఖాన్, అమాన్ సఫీయుల్లాఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను సదాశివపేట ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన మహ్మద్ అనీసుల్లాఖాన్, అబ్దుల్ అజీజ్‌ఖాన్‌ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.. కలకలం సృష్టించిన రోడ్డు ప్రమాదం సంగారెడ్డి క్రైం : జిల్లాలోని మునిపల్లి మండలం కంకోల్ చౌరస్తా వద్ద బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నుంచి రెండు 0.22 దేశీయ ఆయుధాలు, వాడిన ఆరు రౌండ్ల బుల్లెట్లు లభించడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా స్కార్పియో వాహనంలో ఆయుధాలతో పాటు 15 కిలోల మాంసం లభించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ మాంసం జింకదే కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన వారు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని బీదర్ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి వస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనంలో లభించిన ఆయుధాలు కేవలం జంతువులను చంపడానికి మాత్రమే వినియోగిస్తారని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో ఉంటున్న వీరు జంతువుల నుంచి ప్రమాదమేముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మాంసం నిర్దారణ కోసం పోలీసులు ల్యాబోరేటరీకి పంపారు. కాగా ప్రముఖ సినీ నటుడు సల్మాన్ ఖాన్ సైతం ఇదే తరహా కేసుపై అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరితో పాటు గాయపడిన ఇద్దరిపై కూడా క్రూర మృగాల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి డీఎస్పీ ఎం తిరుపతన్న తెలిపారు. -
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం!
-
శ్రీవారికి స్కార్పియో కారు
చిత్తూరు(తిరుమల) : తిరుమల శ్రీవారికి శనివారం ఓ కారు కానుకగా అందింది. చెన్నైకి చెందిన స్టెప్‌స్టోన్ సంస్థ అధినేత మోతేష్కుమార్, మరో దాత అమిత్కోఠారి రూ.14.50 లక్షల విలువ చేసే స్కార్పియో కారును టీటీడీకి అందజేశారు. ఈ మేరకు కారును శనివారం ఉదయం ఆలయం ముందుకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం కారు తాళాలను దాతలు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అప్పగించారు. గతంలో కూడా అమిత్కొఠారి వాహనాలను టీటీడీకి విరాళంగా ఇచ్చి ఉన్నారు. విరాళంగా అందిన వాహనాన్ని జేఈవో శ్రీనివాసరాజు కొద్ది దూరం సరదాగా నడిపారు. -
దూసుకెళ్లిన స్కార్పియో...92 గొర్రెలు మృతి
కర్నూలు(కోవెలకుంట్ల) : గొర్రెల మందపైకి స్కార్పియో వాహనం దూసుకెళ్లటంతో 92 గైలు మృతి చెందాయి. ఈ సంఘటనలో కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల- ముదిగేడు రోడ్డులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు... అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారులు తమ 800 గొర్రెలను మేపుకునేందుకు గోస్పాడుకు తోలుకెళ్తున్నారు. కోవెలకుంట్ల వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనం మందను గమనించకుండా వేగంగా దూసుకెళ్లడంతో 92 గొర్రెలు మృతి చెందాయి. మరో 15 గొర్రెలు గాయపడ్డాయి. చనిపోయిన గొర్రెల విలువ సుమారు రూ. 5.50 లక్షల వరకు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
నెల్లూరు (సూళ్లూరుపేట) : పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడే పదిమంది దొంగల ముఠాలో ఐదుగురిని సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట పోలీసులు అరెస్ట్ చేశారని గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. వారి వద్ద ఉన్న రూ.13 లక్షలు నగదు, స్కార్పియో వాహనం, ఓ మినీ లారీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో దుండగుల అరెస్ట్ వివరాలను డీఎస్పీ వివరించారు. మంగళవారం రాత్రి ఆరుగురితో కూడిన దుండగుల బృందం తడ మండలం భీములవారిపాళెం చెక్‌పోస్టు సమీపంలోని లక్కీ వేబ్రిడ్జి వద్ద స్పార్పియో వాహనంలో వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట ఎసై్సలు జీ గంగాధర్‌రావు, అబ్దుల్జ్రాక్, అంకమ్మతో పాటు సిబ్బంది కలిసి వారిని అదపులోకి తీసుకున్నారు. ఆరుగురిలో ఒకరు తప్పించుకుని పరారీ కాగా మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. లారీలతో పాటు వాటిలోని సరుకులు మాయం చేసే చెన్నైకి చెందిన శాంతిలాల్ ముఠాలో రాజస్థాన్ నుంచి వచ్చి సికింద్రాబాద్‌లో స్థిరపడిన సీ.విష్ణు (32), చెన్నై బ్రాడ్వేకు చెందిన డీ రాజా (37), చెన్నై నగరం మాధవరానికి చెందిన ఎస్ వెంకటేష్ (44), తడ మండలం పెరియవెట్టుకు చెందిన ఆనంద్ (30) అనే ఐదుగురిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఈ ముఠాలోని టీ వెంకటేష్, రామరాజ్, అరుల్, దిలీప్ అనే నలుగురు తమిళనాడులోని వివిధ కేసుల్లో వేలూరు జైల్లో ఉన్నారని చెప్పారు. ఇంకా ఈ ముఠాలో షణ్ముగం అనే అతను పరారీ ఉన్నాడని తెలిపారు. ఈ ముఠానే కాకుండా మరో ముఠా కూడా ఈ తరహా నేరాలు చేస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులకు, ఐడీ పార్టీ బృందానికి క్యాష్ రివార్డులు అందజేస్తానని చెప్పారు. భారీ స్థాయిలో రికవరీని చేయడమే కాకుండా పెద్ద దోపిడీ ముఠాను పట్టుకున్న సీఐ విజయకృష్ణా, ఎసై్సలు జీ గంగాధర్‌రావు, అబ్దుల్ రజాక్, అంకమ్మను ప్రత్యేకంగా అభినందించారు. -
ఔటర్‌రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం
-
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
గుల్బర్గా జిల్లా సేడెం సమీపంలో రెండు కార్లు ఢీ రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన ఐదుగురి దుర్మరణం కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి కూడా... పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన వికారాబాద్, న్యూస్‌లైన్: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణవాసులు ఐదుగురు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని సేడెంలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్‌ఖాన్(62) టీబీ ఆస్పత్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆయన ఆదివారం తతన భార్య ఆశాబేగం(52), కుమారుడు ఫజల్‌ఖాన్(24), మనవడు రేహాన్(5), సమీప బంధువు(50)తో కలిసి ఇండికా కారులో కర్ణాటక గుల్బర్గా జిల్లా కర్తాల్‌లో బంధువుల వివాహానికి వెళ్లాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో సేడెం సమీపంలోని కండ్రపల్లి సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న స్కార్పియో ఢీకొంది. ప్రమాదంలో వీరంతా తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కాగా ఈ ప్రమాదంలో కర్నాటకలోని చిత్తాపూర్‌కు చెందిన ఇన్నోవా కారు డ్రైవర్ అయ్యన్న పూజారి(25)కూడా మృతిచెందారు. -
బెంజ్ నుంచి పోర్షే దాకా..!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు ఇప్పుడు రాజకీయ దర్పానికి చిహ్నం గా మారిపోయూరుు. సంపద సమృద్ధిగా ఉన్న రాజకీయ నాయకులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ లేదా లీటర్ల కొద్దీ పెట్రోలు తాగే విలాసవంతమైన ఎస్వీయూలపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు వారు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను బట్టి స్పష్టమవుతోంది. ఇక స్కార్పియో, టాటా సఫారీ వంటి కార్లు సర్వసాధారణమై పోయూరుు. వృత్తిరీత్యా లాయర్, అమృత్సర్ బీజేపీ అభ్యర్థి అరుున అరుణ్ జైట్లీకి ఓ మెర్సిడెజ్, మరో బీఎండబ్ల్యూతో పాటు పోర్షే, హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్ ఉన్నారుు. ఇక భోజ్‌పురి నటుడు, ఈశాన్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీకి ఉన్న కార్ల శ్రేణిని చూసినా ఆశ్చర్యం వేస్తుంది. ఆడి క్యూ7, మెర్సిడిస్ బెంజ్, టయోటా ఫార్చ్యూనర్, హోండా సిటీ వాటిలో కొన్ని. మథుర బీజేపీ అభ్యర్థి నటి హేమామాలినికి మెర్సిడిస్ బెంజ్, టయోటా ఇన్నోవా కార్లుండగా, ఆమె భర్త, సినీ నటుడు ధర్మేంద్రకు రేంజ్ రోవర్ ఉంది. ఇక హర్యానా జనహిత్ కాంగ్రెస్ అధినేత కుల్దీప్ బిష్ణోయ్‌కు ఏకంగా ఐదు కార్లు (జాగ్వార్ ఎక్స్ఎఫ్, ఆడి క్యూ7, రేంజ్ రోవర్ తదితరాలు), కాంగ్రెస్ అభ్యర్థి (టోంక్-సవారుు మాధోపూర్) అజారుద్దీన్‌కు రెండు కార్లు (బీఎండబ్ల్యూ 650ఐ, హోండా సీఆర్వీ) ఉన్నారుు. -
రోడ్డు ప్రమాదం: అలీ సోదరుడికి గాయాలు
హయత్‌నగర్ మండలం కోహెడ్ వద్ద బుధవారం ఉదయం స్కార్పియో వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యుమ్కు గాయాలయ్యాయి. దీంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించారు. స్కార్పియోలో చిక్కుకున్న ఖయ్యుమ్ను బయటకు తీసి మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. స్కార్పియో వాహనంలో ఖయ్యుమ్ మరో వ్యక్తి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయని అతడిని కూడా అదే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.