మహబూబ్నగర్ కొత్తకోట మండలం అమడబాకుల స్టేజ్ సమీపంలోని జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలకు రహదారిపై నుంచి పక్కకు తప్పించారు. అనంతరం మృతదేహలను స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.