మహబూబ్‌నగర్ జిల్లా: పాలమూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జవాను మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అచ్చంపేట మండలం శేఖరయ్య తోట వద్ద బుధవారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బల్మూరు మండలం తోడేళ్లగట్ట గ్రామానికి చెందిన కొనమోని ఈశ్వర్(26) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈశ్వర్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన ఈశ్వర్ తిరిగి రేపు జార్ఖండ్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో రామస్వామి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ఫకీర్(60) అనే వ్యక్తికి కాలు విరిగడంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.