
ప్రసాద్‌కుమార్, వంశీ మృతదేహాలు
రాజాపూర్ (జడ్చర్ల): ద్విచకవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంగటన మండలంలోని రాజాపూర్ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ యాదయ్య కథనం ప్రకారం.. మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన పాలాది ప్రసాద్‌కుమార్(31) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం స్వగ్రామమైన దోనూరుకు తన బంధువు, డిగ్రీ విద్యార్థి జగద్గిరిగుట్టకు చెందిన వంశీ(18)తో కలిసి స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో రాజాపూర్ శివారులోని వంతెన వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇనుప పైపుల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ లారీ వీరి స్కూటీని వెనక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు కిందపడగా.. ఇద్దరిపై కంటైనర్ టైర్లు వెళ్లడంతో తలలు పగిలి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రసాద్‌కుమార్‌కు గత మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రసాద్‌కుమార్ తమ్ముడు పురుషోత్తం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment