చిత్తూరు(తిరుమల) : తిరుమల శ్రీవారికి శనివారం ఓ కారు కానుకగా అందింది. చెన్నైకి చెందిన స్టెప్‌స్టోన్ సంస్థ అధినేత మోతేష్‌కుమార్, మరో దాత అమిత్‌కోఠారి రూ.14.50 లక్షల విలువ చేసే స్కార్పియో కారును టీటీడీకి అందజేశారు. ఈ మేరకు కారును శనివారం ఉదయం ఆలయం ముందుకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం కారు తాళాలను దాతలు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజుకు అప్పగించారు. గతంలో కూడా అమిత్‌కొఠారి వాహనాలను టీటీడీకి విరాళంగా ఇచ్చి ఉన్నారు. విరాళంగా అందిన వాహనాన్ని జేఈవో శ్రీనివాసరాజు కొద్ది దూరం సరదాగా నడిపారు.