తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ. కోటి విరాళం అందజేశారు. విశాఖపట్నంకు చెందిన శ్రీమిత్రా ఇన్ఫ్రా అధినేత పి.శ్రీనివాసరావు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని శుక్రవారం ఉదయం తిరుమలలో కలిశారు. అనంతరం ఆయనకు చెక్కును అందజేశారు. ఈ మొత్తాన్ని నిత్యాన్నదానం ట్రస్టు కింద జమ చేయాలని కృష్ణమూర్తిని పి. శ్రీనివాసరావు కోరారు. ఆ తర్వాత పి.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.