నెల్లూరు (సూళ్లూరుపేట) : పలు రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడే పదిమంది దొంగల ముఠాలో ఐదుగురిని సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట పోలీసులు అరెస్ట్ చేశారని గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. వారి వద్ద ఉన్న రూ.13 లక్షలు నగదు, స్కార్పియో వాహనం, ఓ మినీ లారీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో దుండగుల అరెస్ట్ వివరాలను డీఎస్పీ వివరించారు. మంగళవారం రాత్రి ఆరుగురితో కూడిన దుండగుల బృందం తడ మండలం భీములవారిపాళెం చెక్‌పోస్టు సమీపంలోని లక్కీ వేబ్రిడ్జి వద్ద స్పార్పియో వాహనంలో వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట ఎసై్సలు జీ గంగాధర్‌రావు, అబ్దుల్జ్రాక్, అంకమ్మతో పాటు సిబ్బంది కలిసి వారిని అదపులోకి తీసుకున్నారు. ఆరుగురిలో ఒకరు తప్పించుకుని పరారీ కాగా మిగతా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
లారీలతో పాటు వాటిలోని సరుకులు మాయం చేసే చెన్నైకి చెందిన శాంతిలాల్ ముఠాలో రాజస్థాన్ నుంచి వచ్చి సికింద్రాబాద్‌లో స్థిరపడిన సీ.విష్ణు (32), చెన్నై బ్రాడ్‌వేకు చెందిన డీ రాజా (37), చెన్నై నగరం మాధవరానికి చెందిన ఎస్ వెంకటేష్ (44), తడ మండలం పెరియవెట్టుకు చెందిన ఆనంద్ (30) అనే ఐదుగురిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఈ ముఠాలోని టీ వెంకటేష్, రామరాజ్, అరుల్, దిలీప్ అనే నలుగురు తమిళనాడులోని వివిధ కేసుల్లో వేలూరు జైల్లో ఉన్నారని చెప్పారు. ఇంకా ఈ ముఠాలో షణ్ముగం అనే అతను పరారీ ఉన్నాడని తెలిపారు. ఈ ముఠానే కాకుండా మరో ముఠా కూడా ఈ తరహా నేరాలు చేస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులకు, ఐడీ పార్టీ బృందానికి క్యాష్ రివార్డులు అందజేస్తానని చెప్పారు. భారీ స్థాయిలో రికవరీని చేయడమే కాకుండా పెద్ద దోపిడీ ముఠాను పట్టుకున్న సీఐ విజయకృష్ణా, ఎసై్సలు జీ గంగాధర్‌రావు, అబ్దుల్ రజాక్, అంకమ్మను ప్రత్యేకంగా అభినందించారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Published Wed, Feb 25 2015 10:32 PM | Last Updated on Sat, Sep 15 2018 7:55 PM
Advertisement
Advertisement