
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన.. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీకి చెందిన ''స్కార్పియో ఎన్'' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 19.19 లక్షల నుంచి రూ. 24.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ పటిష్టమైన డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్‌తో.. స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. డార్క్ ట్రీట్‌మెంట్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్‌లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వానో ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్ వంటివి దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కొత్త ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్‌లలో మాత్రమే లభిస్తుంది.
స్కార్పియో
దశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా స్కార్పియో.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. ఇప్పుడు స్కార్పియో ఎన్ కార్బన్ వేరియంట్ లాంచ్ అయింది.
ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!
స్కార్పియో ఎన్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి డిజైన్, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఈ కారును చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పటికే రెండు లక్షల మంది ఈ కారును కొనుగోలు చేసారంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment