Mahindra & Mahindra
-
మహిళల ‘సెకండ్ కెరియర్’కు మహీంద్రా ప్రోగ్రామ్
వృత్తి జీవితాలను ఇతర కారణాలతో మధ్యలో వదిలేసిన మహిళలకు మహీంద్రా గ్రూప్(Mahindra Group) శుభవార్త చెప్పింది. సుదీర్ఘ విరామం తరువాత మహిళా ప్రొఫెషనల్స్(women professionals) తిరిగి వృత్తి జీవితంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఎస్ఓఏఆర్ (సీమ్‌లెస్ అపర్చునిటీ ఫర్ అమేజింగ్ రిటర్న్‌షిప్) పేరుతో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు విరామం తీసుకున్న కనీసం ఐదు సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉన్న మహిళలకు ఈ ప్రాగ్రామ్ ద్వారా సాయం అందించనున్నారు.మహీంద్రా గ్రూప్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రెసిడెంట్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు రుజ్ బెహ్ ఇరానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘తిరిగి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి గణనీయమైన వృద్ధిని తీసుకువస్తారు. సోర్ ప్రోగ్రామ్‌లో భాగంగా మహిళలకు మెంటార్ షిప్, అప్ స్కిల్, ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్, నెట్ వర్కింగ్ సెషన్లు అందిస్తారు. ప్రతి ఒకరికి ఒక మెంటార్‌ను కేటాయిస్తారు. దాంతో ప్రోగ్రామ్ సమయంలో ఏదైనా అనుమానాలు వస్తే నిత్యం మెంటార్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు’ అని అన్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదంకార్పొరేట్ హెచ్ఆర్ అండ్ గ్రూప్ టాలెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి హండా మాట్లాడుతూ..‘పనిప్రాంతంలో లింగ వైవిధ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే కొంత పని అనుభవం ఉన్న మహిళలు కొన్ని కారణాల వల్ల పని చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు. అలాంటి వారికి కొంత ప్రోత్సాహం, సమయం ఇస్తే తిరిగి వారు శ్రామికశక్తి(workforce)లో భాగమవుతారు. అందుకు కంపెనీ అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి సంస్థ సంస్కృతి, విలువల గురించి పరిచయం చేయడం కోసం మహీంద్రా లీడర్షిప్ యూనివర్శిటీలో ప్రత్యేక కోర్సు కూడా ఉంటుంది. -
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్‌పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ లేదా మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్ మహీంద్రా బీఈ–6, ఎక్స్ఈవీ 9ఈ టాప్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్‌షోరూంలో టాప్ వేరియంట్స్ అయిన బీఈ–6 ప్యాక్–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. వేరియంట్‌నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకే ప్లాట్ఫామ్ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా రిటైల్(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్ తెరతీసింది. సూపర్‌యాప్ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితరాలున్నట్లు పేర్కొంది. -
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
కొత్త ఎలక్ట్రిక్ కారు.. పేరు మార్చేసిన మహీంద్రా: ఎందుకంటే..
మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.6ఈ పేరుతో ఇండిగో సేవలుఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది. -
ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన టాప్ 10 పాపులర్ కార్లు (ఫోటోలు)
-
కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్‌పై దావా
దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది. -
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే: ధరలు ఎలా ఉన్నాయంటే..
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్లైట్లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్‌లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్లు, హుడ్ స్కూప్‌తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్లైన్డ్ బంపర్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్‌రౌండ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్‌కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తాయి. -
మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్: సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.మహీంద్రా థార్ రోక్స్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
థార్ రాక్స్ 4x4 ధరలు ఇవే
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్‌లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి. -
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్‌లో పుణె, ఔరంగబాద్‌లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..? -
మహీంద్రా కొత్త ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్‌కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు. చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్ఎఫ్ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్‌యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్‌యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్‌లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. -
1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్
ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్ కూడా అందిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్పోర్ట్ హబ్‌లను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. -
మహీంద్రా వాణిజ్యవాహనం ‘వీరో’
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.ఎల్సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్సీవీ సెగ్మెంట్లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు. -
ఎస్‌యూవీల రారాజు ఇదే..
దేశంలో ఎస్‌యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్‌యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ ఎస్‌యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్‌యూవీలు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్యూవీ మార్కెట్లో మహీంద్రా ఎస్‌యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్‌లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. -
ఇకపై ఈ మహీంద్రా కొత్త కారు కనిపించదు!.. ఎందుకంటే?
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ఉత్తమ అమ్మకాలు పొందిన 'మహీంద్రా మరాజో' ఉత్పత్తిని కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. 2018లో మారుతి ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మరాజో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఎమ్‌పీవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉండేది.ప్రారంభంలో ఉత్తమ అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందలేకపోయింది. గత ఐదు నెలలో ఈ కారు కేవలం 34 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం ప్యాసింజర్ ఎమ్‌పీవీ మార్కెట్లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో కంపెనీ మరాజో కారును నిలిపివేయడానికి సంకల్పించింది.ప్రారంభం నుంచి జూన్ 2024 వరకు మహీంద్రా మరాజో సేల్స్ మొత్తం 44793 యూనిట్లు మాత్రమే. నెలకు సగటున కేవలం 640 యూనిట్ల మరాజో కార్లు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు తగ్గడమే కాకుండా.. బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు. ఇది కూడా కంపెనీ మార్కెట్లో విజయం పొందకపోవడానికి కారణమనే తెలుస్తోంది. -
అరుదైన సేల్స్ రికార్డ్.. అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా!
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి. 2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.2013 ఆర్థిక సంవత్సరంలో 50168 యూనిట్లు, 2014వ ఆర్థిక సంవత్సరంలో 50,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇలా ప్రతి ఏటా మహీంద్రా స్కార్పియో అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ప్రారంభం నుంచి గత నెల వరకు కంపెనీ 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించి.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రారంభంలో కంపెనీ స్కార్పియో కార్లను మాత్రమే విక్రయించింది. 2022లో కంపెనీ స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇవి మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పనితీరుపరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందించాయి. ఇవన్నీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో సహాయపడ్డాయి. -
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్‌ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రైండ్‌లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. -
రూ.12000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మహీంద్రా: ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది. -
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024 -
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.