హైదరాబాద్: దేశీయంగా సమీకృత లాజిస్టిక్స్ సర్వీసులందించే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్‌ఎల్) స్థానికంగా నెట్ జీరో సౌకర్యానికి తెరతీసింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక ఇంధనం, వనరుల పరిరక్షణసహా పర్యావరణ అనుకూల(గ్రీన్ కవర్) వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్‌తో దీనిని ఏర్పాటు చేసింది.
ఈ అత్యాధునిక వేర్‌హౌస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నెలకొంది. కంపెనీకిగల దేశవ్యాప్త మల్టీ యూజర్ సోలార్ విద్యుత్ సౌకర్యాలలో భాగమైన ఈ కేంద్రం కస్టమర్ల తయారీ, ఫుల్‌ఫిల్‌మెంట్ ఇన్‌బౌండ్ కార్యక్రమాలకు వీలు కల్పించనుంది. ఈ-కామర్స్ కస్టమర్లకు మద్దతివ్వనుంది. (లేడీ బాస్ సర్‌ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!)
ఈ నూతన కేంద్రం 100శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలనూ కల్పించనుంది. ఎంఎల్‌ఎల్ 350 మందికి పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కల్పించింది. అధిక డిమాండ్ సమయంలో థర్డ్ పార్టీ అసోసియేట్లు ఈ సంఖ్యకు మూడింతలు అధికంగా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.(పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే! )
Comments
Please login to add a commentAdd a comment