logistics company
-
ఎన్ఎస్డీఎల్, స్టాండర్డ్ గ్లాస్, జింకా లాజిస్టిక్స్.. ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవల దిగ్గజం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూకి లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సైతం సెబీ నుంచి లిస్టింగ్‌కు అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం..ఎన్ఎస్డీఎల్ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్ఎస్డీఎల్ 2023 జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే 14 నెలల తదుపరి అనుమతులు సాధించడం గమనార్హం! ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో 5.72 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా కంపెనీలో వాటాదారు సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లు, ఎన్ఎస్ఈ 1.8 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 56.25 లక్షల షేర్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 40 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో ద్వారా ఎన్ఎస్డీఎల్కు ఎలాంటి నిధులు అందబోవు! ఇదీ బ్యాక్‌గ్రౌండ్ సెబీ వద్ద రిజిస్టరైన్ ఎన్ఎస్డీఎల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులందించే కంపెనీ. దేశీయంగా ఫైనాన్షియల్, సెక్యూరిటీస్ మార్కెట్లో వివిధ సర్వీసులు, ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. 1996లో ప్రవేశపెట్టిన డిపాజిటరీల చట్టం ప్రకారం అదే ఏడాది నవంబర్‌లో సెక్యూరిటీల డీమ్యాట్ సేవలకు తెరతీసింది. కాగా.. డిపాజిటరీ సేవలందించే మరో కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) 2017లో ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. దీంతో పబ్లిక్‌గా ట్రేడయ్యే రెండో డిపాజిటరీగా ఎన్ఎస్డీఎల్ నిలవనుంది. జింకా లాజిస్టిక్స్ వస్తు రవాణా రంగ కంపెనీ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అమ్మకాలు, మార్కెటింగ్ వ్యయాలకు, భవిష్యత్ అవసరాలరీత్యా బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా? స్టాండర్డ్ గ్లాస్ హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో వినియోగించే స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ పరికరాల తయారు చేస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూనే ఉంది. ఫ్యూయెల్ కార్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన OHM E లాజిస్టిక్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.OHM E లాజిస్టిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సిట్రోయెన్ 1000 ఈ-సీ3 ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా సరఫరా చేయనుంది. మొదటి ఫ్లీట్ ఇండక్షన్ దశలో కంపెనీ 120 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయనుంది. ఆ తరువాత 12 నెలల్లో మరో 880 కార్లను డెలివరీ చేస్తుంది.అక్టోబర్ 2022లో కేవలం 100 ఎలక్ట్రిక్ క్యాబ్‌లతో ప్రారంభమైన ఓహెచ్ఎమ్ ఇప్పుడు విస్తృతమైన సేవలు అందిస్తోంది. సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రవాణా కంపెనీ గతి తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్‌ను పరిచయం చేసింది. చదువుల కోసం ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) దేశంలో ఎక్కడికైనా 20 కిలోల ప్రత్యేక బాక్స్‌ను రవాణా చేస్తే.. ఉపరితల రవాణా ద్వారా అయితే రూ.825, వాయు మార్గం ద్వారా రూ.2,100 చార్జీ చేస్తారు. దేశవ్యాప్తంగా 735 జిల్లాల్లోని 19,800 పిన్‌కోడ్స్‌లో ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సామాన్ల తరలింపు ఇబ్బందులను లేకుండా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) దీంతోపాటు విద్యార్థుల కోసం గతి సంస్థ మరికొన్న సదుపాయాలు కల్పిస్తోంది. సామాన్ల ప్రత్యేక ప్యాకేజింగ్, ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పికప్, డెలివరీ, ఉచిత డోర్‌స్టెప్ పికప్, డెలివరీ, వాతావరణ ప్రూఫ్ కంటైనర్ వాహనాల ద్వారా రవాణా, ఆన్లైన్, ఎస్ఎంఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఈమెయిల్ అప్డేట్, 24/7 కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు అందిస్తోంది. -
మహీంద్రా లాజిస్టిక్స్ వేర్‌హౌస్ షురూ
హైదరాబాద్: దేశీయంగా సమీకృత లాజిస్టిక్స్ సర్వీసులందించే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) స్థానికంగా నెట్ జీరో సౌకర్యానికి తెరతీసింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక ఇంధనం, వనరుల పరిరక్షణసహా పర్యావరణ అనుకూల(గ్రీన్ కవర్) వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్‌తో దీనిని ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక వేర్‌హౌస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నెలకొంది. కంపెనీకిగల దేశవ్యాప్త మల్టీ యూజర్ సోలార్ విద్యుత్ సౌకర్యాలలో భాగమైన ఈ కేంద్రం కస్టమర్ల తయారీ, ఫుల్ఫిల్మెంట్ ఇన్‌బౌండ్ కార్యక్రమాలకు వీలు కల్పించనుంది. ఈ-కామర్స్ కస్టమర్లకు మద్దతివ్వనుంది. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) ఈ నూతన కేంద్రం 100శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలనూ కల్పించనుంది. ఎంఎల్ఎల్ 350 మందికి పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కల్పించింది. అధిక డిమాండ్ సమయంలో థర్డ్ పార్టీ అసోసియేట్లు ఈ సంఖ్యకు మూడింతలు అధికంగా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.(పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే! ) -
ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు
ముంబై: సరుకు రవాణా సేవల్లో ఉన్న డెలివరీ (Delhivery) సీజనల్ ఉద్యోగాల కోసం వచ్చే ఒకటిన్నర నెలలో 75,000 మందిని నియమించుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో కాంట్రాక్ట్ కంపెనీ తరఫున డెలివరీ గేట్వేస్, గిడ్డంగులు, డెలివరీ విభాగాల్లో 10,000 మంది ఉంటారు. పండుగ సీజన్లో పార్సెల్, ఎక్స్‌ప్రెస్ పార్ట్–ట్రక్ లోడ్ వ్యాపారం రెండింటిలోనూ ఆశించిన అధిక డిమాండ్‌ను చేరుకోవడం లక్ష్యంగా కొత్త వారిని చేర్చుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో పార్ట్-ట్రక్లోడ్ సామర్థ్యాన్ని 50 శాతం విస్తరించేందుకు వ్యక్తిగత బైకర్లు, స్థానిక రిటైలర్లు, వ్యాపార భాగస్వాములు, రవాణాదారులను నియమించుకోవడం ద్వారా భాగస్వామ్య కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని కంపెనీ తెలిపింది. (PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి) అధిక కస్టమర్ డిమాండ్ నేపథ్యంలో పాన్-ఇండియాలో పార్శిల్ సార్టింగ్ సామర్థ్యాన్ని రోజుకు 1.5మిలియన్ షిప్మెంట్లు లక్క్ష్యంగా పెట్టుకున్నామని డెలివరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజిత్ పాయ్ అన్నారు. (jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) -
సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్‌గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఐనా ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ మూడేళ్లలో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గత రెండేళ్లలో పలు కంపెనీల షేర్లు తమ వాటాదారులకు భారీ లాభాలనే అందించాయి. పెన్నీ స్టాక్ నుంచి మల్టీబ్యాగర్ స్టాక్‌గా ఎదిగిన వాటిలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ షేర్లు కూడా ఒకటి. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో 2019 మార్చిలో లిస్టింగ్ అయ్యింది. ఆ సమయంలో స్టాక్ ధర రూ. 0.35పైసలుగా ఉంది. గత మూడు ఏళ్లలో స్టాక్ విలువ 567 సార్లు పెరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ షేర్ ధర రూ. 198. 45 చేరింది. మూడేళ్ల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 5.67 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్ హోల్డర్లకు దాదాపు 10,176 శాతం రాబడిని అందించింది. సుమారు మూడేళ్ల పాటు నిరీక్షించిన షేర్ హోల్లర్లకు ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ కాసుల వర్షానే కురిపించింది. ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ లాజిస్టిక్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్ సేవలను అందిస్తోంది. వేర్‌హౌసింగ్, పంపిణీ, సరుకు రవాణా, కస్టమ్స్ బ్రోకింగ్, కార్గో, కన్సాలిడేషన్, మల్టీమోడల్ రవాణా , వంటి సేవలను ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ అందిస్తుంది. చదవండి: కళ్లుచెదిరే లాభం.. 6 నెలల్లో లక్షకు రూ.30 లక్షలు! -
లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్
ముంబై, సాక్షి: భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల వినియోగానికి సన్నాహలు చేస్తున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ కంపెనీలకు ఆర్డర్లు పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల యూఎస్ దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్‌కు యూకే, బెహ్రయిన్, కెనడా అనుమతించగా.. తాజాగా యూఎస్ అదే బాట పట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక దేశీయంగానూ సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ తదితర కంపెనీలు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతుల సన్నాహాల్లో ఉన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతించవలసిందిగా డీసీజీఐకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. తద్వారా కోవిడ్-19 కట్టడికి దేశీయంగా ఒక వ్యాక్సిన్ వినియోగం కోసం డీజీసీఐకు దరఖాస్తు చేసిన తొలి దేశీ కంపెనీగా సీరమ్ ఇన్స్టిట్యూట్ నిలవగా.. ఐసీఎంఆర్ సహకారంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై సీరమ్ ఇన్స్టిట్యూట్ దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టిన విషయం విదితమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై మరోపక్క యూకే, బ్రెజిల్‌లోనూ తుది దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!) ఎంవోయూ కోవిడ్-19 కట్టడికి వినియోగించనున్న వ్యాక్సిన్ల సరఫరా, పంపిణీలకు వీలుగా గురువారం దేశీ కంపెనీలు స్పైస్‌జెట్, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తద్వారా చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వ్యాక్సిన్ల సరఫరాకు శీతలీకరణ సౌకర్యాలతో కూడిన ఎయిర్ కనెక్టివిటీ సర్వీసులు అందించనుంది. వీటికి జతగా లాజిస్టిక్స్ కంపెనీ స్నోమ్యాన్ భూమిమీద శీతల గిడ్డంగులు, ప్యాకింగ్, స్టోరేజీ, పంపిణీ తదితర సేవలు అందించనుంది. వెరసి ఎండ్టు ఎండ్ సర్వీసులు అందించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం స్పైస్‌జెట్, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ షేర్లు బలపడిన విషయం విదితమే. ఈ బాటలో మరోసారి స్పైస్‌జెట్ షేరు 3 శాతం పుంజుకుని రూ. 103కు చేరగా.. తాజాగా లాజిస్టిక్స్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. పలు కౌంటర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. (దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి) షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నవకార్ కార్పొరేషన్ 10 శాతం దూసుకెళ్లి రూ. 42.95కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఆల్కార్గో లాజిస్టిక్స్ 4 శాతం ఎగసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 155 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. వరుసగా రెండో రోజు స్నోమ్యాన్ లాజిస్టిక్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 65 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 70 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. ఈ బాటలో మహీంద్రా లాజిస్టిక్స్ 5 శాతం పెరిగి రూ. 410 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 428 వరకూ ఎగసింది. ఇదేవిధంగా సికాల్ లాజిస్టిక్స్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 18.30 వద్ద, పటేల్ ఇంటిగ్రేటెడ్ 10 శాతం వృద్ధితో రూ. 31.25 వద్ద ఫ్రీజయ్యాయి. ఇతర కౌంటర్లలో గతి, వీఆర్ఎల్ లాజిస్టిక్స్ సైతం ప్రస్తావించదగ్గ లాభాలతో కదులుతున్నాయి. -
ఆస్టెక్ లైఫ్- బ్లూడార్ట్.. ఎక్స్‌ప్రెస్ స్పీడ్
ఉదయం సెషన్లో జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా పతన బాట పట్టాయి. తొలుత లాభాల డబుల్ సెంచరీ చేసిన సెన్సెక్స్ ప్రస్తుతం 328 పాయింట్లు కోల్పోయింది. 39,422కు చేరింది. నిఫ్టీ సైతం 82 పాయింట్ల నష్టంతో 11,589ను తాకింది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఓవైపు బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్.. మరోపక్క హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నికర లాభం 189 శాతం జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 8 శాతం పెరిగి రూ. 867 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 17.5 శాతం పుంజుకుని రూ. 57 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 3,767కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 11 శాతం లాభంతో రూ. 3,603 వద్ద ట్రేడవుతోంది. ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ నికర లాభం 238 శాతం జంప్‌చేసి రూ. 18 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 155 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 205 శాతం ఎగసి రూ. 24 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 1,185కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.2 శాతం లాభంతో రూ. 1,168 వద్ద ట్రేడవుతోంది. -
బీపీసీఎల్ పతనం- రామ్‌కో సిస్టమ్స్ జోరు
తొలి సెషన్లో కన్సాలిడేట్ అయిన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 209 పాయింట్లు జంప్‌చేసి 38,182ను తాకగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగసి 11,245 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చమురు దిగ్గజం బీపీసీఎల్ విక్రయానికి వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువును పెంచింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్గజం నుంచి ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. వెరసి బీపీసీఎల్ కౌంటర్ భారీగా నష్టపోగా.. రామ్‌కో సిస్టమ్స్ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. బీపీసీఎల్ చమురు పీఎస్‌యూ.. బీపీసీఎల్‌ను ప్రయివేటైజ్ చేసే బాటలో కేంద్ర ప్రభుత్వం ఈవోఐల దాఖలుకు తాజాగా గడువును నవంబర్ 16వరకూ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 7న తొలిసారి కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కొనుగోలుకి ఆసక్తి చూపగల కంపెనీల నుంచి వినతులమేరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 53 శాతం వాటా ఉంది. కాగా.. బీపీసీఎల్ కొనుగోలుపట్ల విదేశీ దిగ్గజాలు రాస్‌నెఫ్ట్, సౌదీ అరామ్కో విముఖత చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు 9 శాతం పతనమై రూ. 352 దిగువకు చేరింది. రామ్‌కో సిస్టమ్స్ లాజిస్టిక్స్ రంగంలోని గ్లోబల్ కంపెనీతో డీల్‌ను కుదుర్చుకున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన అంతర్జాతీయ పేరోల్ నిర్వహణలో ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు వీలుగా ఐటీ సేవలు అందించనున్నట్లు తెలియజేసింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలలో గల పేరోల్ కార్యకలాపాలను లాజిస్టిక్స్ కంపెనీ ఏకీకృతం చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 425 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! -
కరోనాలోను 30 వేల ఉద్యోగాలు..
ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న వేళ ఈకామ్ ఎక్ప్‌ప్రెస్ అనే లాజిస్టిక్స్ కంపెనీ 30,000మంది ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. త్వరలో పండగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. కాగా విజయవాడ, అమ్మాదాబాద్, సూరత్, ఇండోర్, పాట్నా, జైపూర్ తదితర ప్రాంతాలలో నియామకాలు చేపడతామని సంస్థ పేర్కొంది. అయితే ఆన్లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యతిస్తున్నందున ఎక్కువ స్థాయిలో డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దేశంలో వివిధ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. -
టాటా కన్జూమర్- గేట్‌వే డిస్ట్రిపార్క్స్ భళా
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో లాజిస్టిక్స్ దిగ్గజం గేట్‌వే డిస్ట్రిపార్క్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇతర వివరాలు ఇవీ.. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ మూడు రోజులుగా బలపడుతూ వస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ తాజాగా ఎన్ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లి రూ. 592కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత రెండు నెలల్లో ఈ షేరు 46 శాతం పురోగమించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 53,000 కోట్లను అధిగమించింది. తద్వారా గ్రూప్‌లోని ఇతర దిగ్గజాలు టాటా స్టీల్, టాటా మోటార్స్ విలువను దాటేసింది. ఈ ఏడాది క్యూ1లో ఇబిటా 37 శాతం ఎగసి రూ. 486 కోట్లను తాకగా.. నిర్వహణ మార్జిన్లు 3.12 శాతం బలపడిన విషయం విదితమే. గేట్‌వే డిస్ట్రిపార్క్స్ సమీకృత లాజిస్టిక్స్ కార్యకలాపాలు కలిగిన గేట్‌వే డిస్ట్రిపార్క్స్ వ్యాపార పునర్వ్యవస్థీకరణను చేపట్టనుంది. ఇందుకు బుధవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. కంపెనీకిగల వివిధ వ్యాపార విభాగాలను గ్రూప్‌లోని విభిన్న సంస్థలు నిర్వహస్తున్న కారణంగా పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించినట్లు తెలియజేసింది. తద్వారా వివిధ కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గేట్‌వే డిస్ట్రిపార్క్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 108కు చేరింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 6.5 శాతం జంప్‌చేసి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో షేరుకి రూ. 72 ధరలో చేపట్టిన రైట్స్ ద్వారా కంపెనీ రూ. 116 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. -
ఆల్కార్గో- ఎల్ఐసీ హౌసింగ్.. యమస్పీడ్
వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి ఖంగుతిన్నాయి. తొలుత 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ ప్రస్తుతం నష్టాలతో కదులుతోంది. 70 పాయింట్లు క్షీణించి 38,729కు చేరింది. నిఫ్టీ సైతం 18 పాయింట్లు తక్కువగా 11,448 వద్ద ట్రేడవుతోంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీని డీలిస్ట్ చేయనున్న వార్తలతో ప్రయివేట్ రంగ కంపెనీ ఆల్కార్గో లాజిస్టిక్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ కంపెనీ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆల్కార్గో లాజిస్టిక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను డీలిస్ట్ చేసేందుకు ప్రమోటర్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు ఆల్కార్గో లాజిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. ప్రమోటర్ శశి కిరణ్ శెట్టితోపాటు.. టాలెంటోస్ ఎంటర్టైన్మెంట్ ఇందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి కంపెనీని స్వచ్చందంగా డీలిస్ట్ చేసేందుకు వీలుగా ప్రమోటర్లు పబ్లిక్ వాటాదారుల నుంచి ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్‌నకు 70 శాతంపైగా వాటా ఉంది. దీంతో ఈ కౌంటర్లో కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువయ్యారు. వెరసి ఎన్ఎస్ఈలో ఆల్కార్గో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22 ఎగసి రూ. 131 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎల్ఐసీ హౌసింగ్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 817 కోట్లను తాకింది. ప్రొవిజన్లు రూ. 253 కోట్ల నుంచి రూ. 56 కోట్లకు తగ్గడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్లు 2.41 శాతం నుంచి 2.32 శాతానికి స్వల్పంగా నీరసించాయి. మొత్తం ఆదాయం రూ. 4807 కోట్ల నుంచి రూ. 4977 కోట్లకు బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 309ను తాకింది. ప్రస్తుతం 8.3 శాతం లాభంతో రూ. 300 వద్ద ట్రేడవుతోంది. -
ఈడీ కొరడా : రూ.1610 కోట్ల వాహనాలు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6వేల కార్లను ఎటాచ్ చేసింది. వీటి విలువ 1610 కోట్ల రూపాయలు. సూరత్‌కు చెందిన సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎస్విఎల్ఎల్) సంస్థ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకులో చోటు చేసుకున్న రూ. 836.29 కోట్ల స్కాంకు సంబంధించి ఈడీ ఈ చర్య చేపట్టింది. నకిలీ పత్రాల, నకిలీ పేర్లతో భారీ ఎత్తు రుణాలు, నిధుల మళ్లింపుతోపాటు, అనేక అవతవకల ఆరోపణల నేపథ్యంలో ఎస్విఎల్ఎల్ కంపెనీపై 2016లో సీబీఐ కేసులు నమోదు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ కంపెనీ, దాని డైరెక్టర్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ రూప్‌చంద్ బైద్‌ను గతంలోనే అరెస్ట్ చేసింది. వ్యక్తిగత లాభాల కోసం సంస్థ ఉద్యోగులు, డ్రైవర్ల పేర్లతో, తప్పుడు పేపర్లను ఉపయోగించి బ్యాంకుల నుండి అనేక రుణాలు పొందిందనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఈ అక్రమాల్లో రూప్‌చంద్ కీలక పాత్ర పోషించాడని, సంబంధిత సంస్థల వివిధ ఖాతాల ద్వారా రుణాలను పొంది, వాటిని దారి మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2002 నుంచి సిద్ధి వినాయక్ లాజిస్టిక్ లిమిటెడ్ ముంబై ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చాలక్ సే మాలక్ (డ్రైవర్ టూది ఓనర్) పేరుతో పాత, కొత్త వాహనాల కొనుగోలుపై వివిధ రుణ సదుపాయాలందిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్‌సిఆర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నెట్ వర్క్ ఉంది. మరోవైపు ఇప్పటికే (2017, జూన్) 19 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ED attaches movable properties comprising 6170 vehicles worth Rs.1609.78 Crores of M/s Sidhi Vinayak Logistics Ltd (SVLL), Mumbai in a bank fraud case under PMLA, 2002. — ED (@dir_ed) June 18, 2019 -
ఏపీ, తమిళనాడుల్లో వందచోట్ల ఐటీ దాడులు
చెన్నై/విశాఖ దక్షిణం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఏపీ, తమిళనాడుల్లోని 100 చోట్ల ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడు లు జరిపారు. వీవీ మినరల్స్ సహా నాలుగు ప్రముఖ సంస్థలు గనులు, ఖని జాల ఎగుమతుల సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో సోదాలు జరిపినట్లు ఐటీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ఐటీ బృందాలు విశాఖలోని లాజిస్టిక్ కంపెనీలు, ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ మురళీకృష్ణ కార్యాలయాలు, అక్కయ్య పాలెంలో ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్ ఆఫీసు, అక్కయ్యపాలెంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దాడులు చేపట్టాయి. నక్కపల్లి మండలం బం గారమ్మపేట గ్రామంలో బీఎంపీ కంపెనీ ఆఫీ సులో సోదాలు చేశాయి. ఈ కంపెనీ చెన్నై ప్రధాన కేంద్రంగా విశాఖ జిల్లా నక్కపల్లి, శ్రీకాకుళంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దువ్వాడలో గల టీజీఐ లాజిస్టిక్స్ లోనూ ఐటీ తనిఖీలు జరిగాయి. ఈ కంపెనీ తెలంగాణ టీడీపీ నేత దేవేందర్ గౌడ్ బంధువులదని సమాచారం. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ వద్దనున్న ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ ఇండస్ట్రీ (టీజీఐ) ఆఫీసుతోపాటు రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడికుదిటిపాలెంలోని టీడీపీ నేత, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ నడికుదిటి ఈశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపారు. తమిళనాడుకు చెందిన వీవీ మినరల్స్ యాజమాన్యంలో టీజీఐ నడుస్తోంది. చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, ట్యుటికోరన్, కరైకల్‌లలోని వివిధ ఆఫీసులపై జరిపిన సోదాల్లో 130 మంది పాల్గొన్నారు. -
ఆర్డర్ డెలివరీకి బైకులు కావాలా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి. స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం... ఈ రోజుల్లో ఆన్లైన్ సంస్థలకు కొదవ లేదు. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవటమనేది ప్రతి సంస్థా చేస్తోంది. కాకపోతే తీసుకున్న ఆర్డర్‌ను డెలివరీ చేయటమే అసలైన సమస్య. ఎందుకంటే డెలివరీ కోసం ప్రతి సంస్థకూ సొంత లాజిస్టిక్స్ విభాగం ఉండాలి. లేకపోతే వేరొక లాజిస్టిక్స్ కంపెనీపై ఆధారపడాలి. దీన్నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు కిరణ్‌కుమార్ రెడ్డి. కార్ల అగ్రిగేటర్ ఉబెర్‌ను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ కేంద్రంగా బైకులకు అగ్రిగేటర్‌గా ఈ ఏడాది జులైలో సెండ్ఫాస్ట్.ఇన్ను ఆరంభించాడు. దీనికి సంబంధించి కిరణ్‌కుమార్ ఏమంటారంటే... ‘‘స్థానికంగా ఉన్న ఫార్మసీ దుకాణాలు, రెస్టారెంట్లు, గ్రోసరీ సంస్థల వద్ద మా సెండ్ఫాస్ట్ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్లో సరకులను ఎక్కడికి డెలివరీ చేయాలన్నది నమోదు చేస్తే చాలు. అందుబాటులో ఉన్న బైకర్ల వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తాయి. వారికి కావాల్సిన బైకర్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఇందుకుగాను 5 కి.మీ. వరకు రూ.35, ఆ తర్వాత ప్రతి కి.మీ. మీద రూ.9 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీ తాలుకు వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ కూడా చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం. సెండ్ఫాస్ట్లో బైక్‌ను రిజిస్టర్ చేసిన వారికి నెలకు రూ.11 వేలు వేతనంగా అందిస్తున్నాం. ప్రస్తుతం రెండు నగరాల్లో కలిపి నెలకు 7,000 మంది మా అప్లికేషన్‌ను వినియోగించుకుంటున్నారు. రోజుకు 500 ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇటీవలే లాంటెక్ ఫార్మా కంపెనీ యజమాని ప్రకాశ్ రెడ్డి మా సంస్థలో రూ.15 లక్షల పెట్టుబడులు పెట్టారు. విస్తరణ బాటలో పయనిస్తున్నాం..’’ అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వీఆర్ఎల్ లాజిస్టిక్స్ మెరుపులు
43 శాతం వృద్ధితో రూ.294 వద్ద ముగింపు ముంబై: రవాణా, లాజిస్టిక్స్ కంపెనీ వీఆర్ఎల్ లాజిస్టిక్స స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపలు మెరిపించింది. ఇష్యూ ధర (రూ.205) కంటే అధికంగా రూ. 288 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. 281-309 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు43% లాభంతో రూ.293 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో కూడా 43% లాభంతో రూ. 294 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 71 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 2 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,676 కోట్లుగా ఉంది.