
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రవాణా కంపెనీ గతి తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్‌ను పరిచయం చేసింది. చదువుల కోసం ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.
(వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!)
దేశంలో ఎక్కడికైనా 20 కిలోల ప్రత్యేక బాక్స్‌ను రవాణా చేస్తే.. ఉపరితల రవాణా ద్వారా అయితే రూ.825, వాయు మార్గం ద్వారా రూ.2,100 చార్జీ చేస్తారు. దేశవ్యాప్తంగా 735 జిల్లాల్లోని 19,800 పిన్‌కోడ్స్‌లో ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సామాన్ల తరలింపు ఇబ్బందులను లేకుండా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొంది.
(Jio offer: జియో అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!)
దీంతోపాటు విద్యార్థుల కోసం గతి సంస్థ మరికొన్న సదుపాయాలు కల్పిస్తోంది. సామాన్ల ప్రత్యేక ప్యాకేజింగ్, ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పికప్, డెలివరీ, ఉచిత డోర్‌స్టెప్ పికప్, డెలివరీ, వాతావరణ ప్రూఫ్ కంటైనర్ వాహనాల ద్వారా రవాణా, ఆన్‌లైన్, ఎస్‌ఎంఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఈమెయిల్ అప్‌డేట్, 24/7 కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment