relocation
-
ఐటీ ఉద్యోగులకు బలవంతంగా బదిలీలు.. రంగంలోకి దిగిన కార్మిక శాఖ
చాలా కాలంగా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అలవాటు పడిన ఐటీ ఉద్యోగులను దాదాపుగా అన్ని కంపెనీలు ఆఫీసులకు పిలిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులందరూ ఆఫీసుల బాట పట్టారు. అయితే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీలు మరో ఝలక్ ఇస్తున్నాయి. ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా రీలొకేట్ చేస్తున్నాయి. దీంతో కార్మిక శాఖ రంగంలోకి దిగింది. ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) దాఖలు చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు నోటీసు జారీ చేసింది. ముందస్తు నోటీసు, సంప్రదింపులు లేకుండానే 2,000 మందికి పైగా ఉద్యోగులను టీసీఎస్ ఇతర నగరాలకు రీలొకేట్ అవ్వాలని బలవంతం చేసిందని యూనియన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఈనెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లుగా తమకు లభించిన నోటీసును ఉటంకిస్తూ సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, అటువంటి అనైతిక పద్ధతుల నుంచి ఐటీ ఉద్యోగులను రక్షించాలని తాము కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 2,000 మందికి పైగా నోటీసులు టీసీఎస్ వివిధ ప్రదేశాలలో 2,000 మందికి పైగా ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు జారీ చేసిందని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ తన ఫిర్యాదులో ఆరోపించింది. "టీసీఎస్ 2,000 మందికి పైగా ఉద్యోగులను ఎటువంటి నోటీసు, సంప్రదింపులు లేకుండా వివిధ నగరాలకు బలవంతంగా బదిలీ చేస్తోందని నైట్స్‌కి 180కి పైగా ఫిర్యాదులు అందాయి. ఈ చర్యలతో దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బదిలీ ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కంపెనీ బెదిరిస్తోంది. ఈ బలవంతపు బదిలీల వల్ల ఉద్యోగులకు కలిగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ఆందోళనను కంపెనీ విస్మరిస్తోంది" అని హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్‌కు ముగింపు టీసీఎస్ ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ముగింపు పలికింది. ఉద్యోగులందరూ వారంలో ఐదు రోజులపాటు ఆఫీసులకు రావాల్సిందేనని గతేడాది అక్టోబర్ 1న అంతర్గత కమ్యూనికేషన్లో ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆవశ్యకతను టీసీఎస్ తమ 2023 వార్షిక నివేదికలో సైతం హైలైట్ చేసింది. ఇదీ చదవండి: కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు! కాగా టీసీఎస్ గతేడాది ఆగస్టు నెల చివరి నుంచే ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది. అందులో కొత్త లొకేషన్లో చేరడానికి 2 వారాల సమయం ఇచ్చినట్లు చెబుతున్నారు. -
విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రవాణా కంపెనీ గతి తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్‌ను పరిచయం చేసింది. చదువుల కోసం ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) దేశంలో ఎక్కడికైనా 20 కిలోల ప్రత్యేక బాక్స్‌ను రవాణా చేస్తే.. ఉపరితల రవాణా ద్వారా అయితే రూ.825, వాయు మార్గం ద్వారా రూ.2,100 చార్జీ చేస్తారు. దేశవ్యాప్తంగా 735 జిల్లాల్లోని 19,800 పిన్‌కోడ్స్‌లో ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సామాన్ల తరలింపు ఇబ్బందులను లేకుండా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) దీంతోపాటు విద్యార్థుల కోసం గతి సంస్థ మరికొన్న సదుపాయాలు కల్పిస్తోంది. సామాన్ల ప్రత్యేక ప్యాకేజింగ్, ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పికప్, డెలివరీ, ఉచిత డోర్‌స్టెప్ పికప్, డెలివరీ, వాతావరణ ప్రూఫ్ కంటైనర్ వాహనాల ద్వారా రవాణా, ఆన్లైన్, ఎస్ఎంఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఈమెయిల్ అప్డేట్, 24/7 కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు అందిస్తోంది. -
అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహం
బీజింగ్: అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహంపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ తరలింపు వ్యవహారంలో వస్తున్న వార్తలను ఖండించింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నిరాధారమైన ఈ వార్తలు షాక్‌కు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, జమాతే ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాక్ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు తరలించమని జిన్‌పింగ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. అదంతా నిరాధారం. మేం ఎలాంటి సూచనలు చెయ్యలేదు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికాతోపాటు భారత్ కూడా పాక్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సయీద్‌ను పశ్చిమ ఆసియా దేశాలకు పంపించాలని గత నెల బీజింగ్‌లోని బావో ఫోరమ్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని అబ్బాసీతో సమావేశమైనపుడు కోరినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇరు దేశాధినేతలు దాదాపు అరగంట పాటు సయీద్ అంశం గురించి చర్చించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు సైతం ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ ఖండన ప్రకటన విడుదల చేసింది. కాగా, హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా, అతడిపై 10 మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. -
'ఉద్యోగుల తరలింపులో గందరగోళం'
గుంటూరు : అమరావతికి ఉద్యోగుల తరలింపుపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆదివారం గుంటూరులో జరిగిన రెవిన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. హెచ్ఓడీ కార్యాలయాలు ఎక్కడో తెలియకుండా ఎక్కడికి వచ్చి పనిచేయాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి తాము రావడానికి సిద్ధంగానే ఉన్నామని, కానీ కనీస సౌకర్యాలు లేకుండా ఎలా పనిచేయాలని ఆయన అన్నారు. స్థానికత అంశంపై కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయలేదని వెంటనే ఆ అంశంపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెవిన్యూశాఖలో ఖాలీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
శ్రీనగర్ నిట్ తరలించేది లేదు!
న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు కొందరు, తమ క్యాంపస్‌లో భద్రతను పటిష్టం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఎన్ఐటీ ప్రాంగణాన్ని మరోచోటికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే క్యాంపస్‌ను మరోచోటికి తరలించడానికి స్మృతి ఇరానీ అంగీకరించలేదని ఓ విద్యార్థి తెలిపాడు. కొద్ది రోజులుగా నిట్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. టీ-20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ నిట్‌లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తాయి. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ గొడవలు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.