అమరావతికి ఉద్యోగుల తరలింపుపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆదివారం గుంటూరులో జరిగిన రెవిన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
గుంటూరు : అమరావతికి ఉద్యోగుల తరలింపుపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆదివారం గుంటూరులో జరిగిన రెవిన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. హెచ్‌ఓడీ కార్యాలయాలు ఎక్కడో తెలియకుండా ఎక్కడికి వచ్చి పనిచేయాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి తాము రావడానికి సిద్ధంగానే ఉన్నామని, కానీ కనీస సౌకర్యాలు లేకుండా ఎలా పనిచేయాలని ఆయన అన్నారు.
స్థానికత అంశంపై కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయలేదని వెంటనే ఆ అంశంపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెవిన్యూశాఖలో ఖాలీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.