Confusion
-
చేతులెత్తేసిన చంద్రబాబు..
-
‘రంగారెడ్డి’ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్‌కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్‌కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
నరసరావుపేట రూరల్/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్‌తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్ నరసరావుపేటలో ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్సీపీ వర్గీయులు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్‌కు ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్ పే, గుగూల్ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తికృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్ అసిస్టెంట్ మట్ట కిషోర్‌బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్‌బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్‌కు ఓటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిషోర్‌బాబుకు మంగళవారం 140వ బూత్‌లో ఓటు కల్పిస్తామని ఏఆర్వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం హెల్ప్‌డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్ ఎస్జీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఏఆర్వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌కు జహంగీర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
టీడీపీ, బీజేపీ మధ్య టిక్కెట్ల దోబూచులాట
సాక్షి, విజయవాడ: టీడీపీ, బీజేపీ మధ్య టిక్కెట్ల దోబూచులాట కొనసాగుతోంది. బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు ఎంపీ స్ధానాలను చంద్రబాబు పెండింగ్‌లో ఉంచగా, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్‌లో పెట్టగా, ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. వెంకయ్యనాయుడు పీఏగా సుదీర్ఘ కాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగుతున్నారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్‌లో ఉంచారు. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కోసం కడప స్ధానాన్ని చంద్రబాబు పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. -
ఆ సర్వేతో చంద్రబాబు షాక్.. ముందు నుయ్యి వెనుక గొయ్యి
ఆ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారట కానీ ఎవరిని బరిలోకి దించాలో తెలియక కిందామీదా పడుతున్నారట. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జికే సీటివ్వాల.. లేక బయటి నుంచి ఎవరినైనా తెచ్చి పోటీ పెట్టాలో తేల్చుకోలేకపోతున్నారట. అందుకే మీ ఓటు ఎవరికి వేస్తారంటూ రోజుకొకరి పేరుతో సర్వే చేయిస్తున్నారట చంద్రబాబు. కాని.. ప్రజలు టీడీపీలో ఎవరికీ అనుకూలంగా లేకపోవడంతో పచ్చ బాస్ తలపట్టుకున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? తొలి విడత సీట్లను ప్రకటించేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబుకు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదట. వాస్తవానికి సామాజికవర్గం పరంగా, పార్టీ పరంగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో ఈసారి ఎలాగైనా పెనమలూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గన్నవరం, గుడివాడతో పాటు పెనమలూరు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ...పెనమలూరులో వైసీపీని ఢీకొట్టే అభ్యర్ధి మాత్రం చంద్రబాబుకు దొరకడం లేదని టాక్. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకే టిక్కెట్ అని ఆయన ఆశపడుతున్నారు. కానీ పెనమలూరు విషయంలో చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బోడే కాకుండా గట్టి అభ్యర్ధిని బరిలోకి దించాలని రకరకాల ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారట. ఇటీవల టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ తో పాటు దేవినేని ఉమా పేరు మొన్నటి వరకూ పెనమలూరులో బలంగా వినిపించాయట. కానీ వసంతకు మైలవరం దాదాపు ఖాయమైపోవడంతో ఉమా అయితే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఓ సర్వే చేయించారట. పెనమలూరు అభ్యర్ధిగా ఉమా మీకు కావాలంటే ఓటేయండంటూ ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా సర్వేలో కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు సేకరించారట. ఈ సర్వేలో ఉమాకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎం.ఎస్.బేగ్ పేరుతో మరో సర్వే చేయించారట. దీనిలోనూ పెద్దగా అనుకూలత రాలేదట. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్.. కొలుసు పార్ధసారధి ద్వారా పెనమలూరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా రోజుకో పేరుతో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న సమయంలో మాకేం తక్కువ అని నిలదీస్తున్నారట పెనమలూరు లోకల్ తెలుగు తమ్ముళ్లు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరెవరి పేరుతోనే సర్వేలు చేయించడమేంటని మండిపడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో అభ్యర్ధుల్ని తెచ్చి బలవంతంగా తమపై రుద్దే బదులు ఆ టిక్కెట్ ఏదో తమకే ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారట. ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయించిన తరుణంలో మైనార్టీ కోటాలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్. మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు ప్రకటిస్తారని అంతా ఆశించారు. అలా జరిగేలా లేదని తేలిపోవడంతో బోడేకు టిక్కెట్ ఇవ్వకపోతే మైనార్టీ అభ్యర్ధిగా తనకే కేటాయించాలి కానీ వలస వచ్చే వారికి ఇస్తే మాత్రం సహకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారట. పెనమలూరు టిక్కెట్ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి మాని త్వరగా తేల్చేయాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరులో జెండా పాతడం ఎలా అంటూ చంద్రబాబు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇదే విధంగా జాగు చేస్తే..అంతా కలిసి టీడీపీ జెండా పీకేసేలా ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందట. ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం! -
బిడ్డను చంకనెత్తుకుని... ఊరంతా వెతికాడట!
నెత్తిన కళ్లజోడు పెట్టుకుని.. అయ్యో నా కళ్ల జోడు అని వెతుక్కోవడం.. తాళాలు చేత్తో పట్టుకొని తాళాలు కోసం తెగ ఖంగారు పడి పోవడం మనలో చాలా మందికి అనుభవమే. అంతేకాదు ఒక్కోసారి ఫోన్ మాట్లాడుతూనే.. నా ఫోన్ ఏది అని గాభరా పడిపోతూ ఉంటాం కదా. మడి సన్నాక.. అయోమయం, మతిపరుపు కామన్ అంటారా? అయితే సరే.. ఈ వైరల్ వీడియో చూడండి..ఎండింగ్ అస్సలు మిస్ కాకూడదు మరి! ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బేబీ స్క్రోలర్లో బేబీ లేకపోవడంతో ఒక్కసారి కంగారు పడిపోయాడు. అటూ ఇటూ వెదుకుతూ తెగ ఆందోళన చెందాడు. తీరా .. చూస్తే ఆ పాపను భుజంపైన ఎత్తుకోవడం కనిపిస్తుంది. చివరికి అసలు సంగతి తెలుసుకున్న తరువాత తండ్రి రియాక్షన్ చూడాలి.. ఎంతో ఊరట చెంది పాపను హత్తుకుంటాడు హృద్యంగా. ఇంకో వీడియోలో ఒక మహిళ బేబీని ఎత్తుకుని, వాకర్ని ఊపుతూ ఉంటుంది బేబీని నిద్రపుచ్చాలని. కానీ కొన్ని క్షణాల్లో వాకర్‌లో ఏమీ లేకపోవడంతో బేబీని హడావిడిగా వెదుకుతూ ఉంటుంది. కాసేపటిరి బేబీ తన దగ్గరే.నన తన చంకలోనే ఉందన్న సంగతి తెలుసుకుని హమ్యయ్యా అనుకోవడమే కాదు తెగ నవ్వుకుంటుంది. మనమందరం కొన్నిసార్లు గందరగోళానికి గురవుతాము అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు A man panicked when he realized that his daughter was missing, when he forgot that he was carrying her around his neck. We can all be confused sometimes! 😂pic.twitter.com/VVsMXmMprb — Figen (@TheFigen_) January 18, 2024 Many such cases 🤣 pic.twitter.com/F87jvkduTB — AGI - Tech Gone Wild 🤖❤️🔥🇳🇴 (@AGItechgonewild) January 18, 2024 -
కన్ఫ్యూజ్ చేస్తున్న వివేక్..విజయం కలేనా..?
సాక్షి,మంచిర్యాల: నాయకులు పార్టీ మారడం సాధారణంగా జరిగేదే. ఓ నేత పార్టీలు మారుతూ జనాన్ని కన్ఫ్యూజ్లోకి నెట్టేస్తుంటారు. అందుకే ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో విజయాన్ని చూడలేదు. తాజాగా మరోసారి పార్టీ మారారు. ఈసారి తనకొడుకును బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. గతంలో తండ్రిని ఓడించిన అధికార పార్టీ నాయకుడు ఈసారి ఆయన తనయుడిని కూడా ఓడిస్తానంటున్నారు. ఇంతకీ అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఆ నాయకులెవరో చూద్దాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి గులాబీ పార్టీలో పేరు తెచ్చుకున్న బాల్క సుమన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. విద్యార్థి నేతగా ఉద్యమంలో చురుగ్గా ఉన్నకాలంలోనే రాష్ట్రం ఏర్పాటైనపుడు 2014లో పెద్దపల్లి నుంచి గులాబీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచీ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కూడా చెన్నూరు నుంచే పోటీ చేస్తున్నారు సుమన్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఈసారి చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈసారి అసెంబ్లీ బరిలో వివేక్ నిలబడకుండా ఆయన తనయుడు వంశీతో రాజకీయం అరంగేట్రం చేయిస్తారని తెలుస్తోంది. వ్యాపారరంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న గడ్డం వివేక్..రాజకీయాల్లో తత్తరపాటు నిర్ణయాలతో ఓటమిపాలవుతున్నారనే టాక్ నడుస్తోంది. తండ్రి కాలం నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్న వివేక్ 2009లో ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాటం జరుపుతున్నా తెలంగాణ ఇవ్వడంలేదని కాంగ్రెస్ మీద కోపం వచ్చి ఆనాడు గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించాక కృతజ్ఞతతో మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ తరపున ఎంపీ సీటుకు పోటీ చేసి బాల్క సుమన్ మీద ఓడిపోయారు. కేసీఆర్ సీఎం అయ్యాక 2016లో మరోసారి గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కాని.. గత ఎన్నికల్లో కేసీఆర్ సీటు ఇవ్వనందుకు కోపం వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో బీజేపీకి రాజీనామా చేసి మరోసారి సొంతగూటికి చేరుకున్నారు గడ్డం వివేక్. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి పెద్దపల్లి నుంచే బరిలోకి దిగాలనుకుంటున్న గడ్డం వివేక్...అసెంబ్లీ ఎన్నికల్లో తనయుడు వంశీకృష్ణకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో తనను ఓడించిన బాల్క సుమన్ మీద చెన్నూరులో పోటీ చేయడానికి తనయుడిని సిద్ధం చేస్తున్నారట వివేక్. తండ్రిని ఓడించిన సుమన్‌ను ఓడించి అసెంబ్లీలో ప్రవేశించడానికి వివేక్ తనయుడు వంశీకృష్ణ రెడీ అవుతున్నారని టాక్. అయతే గతంలో ఒకసారి తండ్రిని ఓడించి ఎంపీగా గెలిచాను...ఈసారి కొడుకును ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అవుతానంటున్నారు గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్. తండ్రీ, తనయులను ఓడించి చరిత్ర కెక్కుతానంటున్నారు బాల్కసుమన్. ఎన్నికల వేళ రాజకీయాల్లో కోలాహలం మామూలే. రాత్రి ఒక పార్టీ.. ఉదయం మరోపార్టీ మారే నాయకులు మనకు అనేకమంది కనిపిస్తారు. ఒక రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ మారే నేతల్ని మనం చూస్తున్నాం. గడ్డం వివేక్ ఈసారైనా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందే అని భావిస్తున్నారా? వివేక్ నిర్ణయం కరెక్టా? కాదా అన్నది చెన్నూరు ప్రజలే తేలుస్తారు. -
తెలుగుదేశం పార్టీ పనైపోయిందా ?
-
ఎందుకీ కన్ఫ్యూజన్..! ఆ విషయంలో పవన్ లెక్క తప్పాడా?
పొత్తు ఎవరితో ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదని ఆయనే చెబుతున్నారు. ప్రజల మద్దతు తనకు ఉంటుందో లేదో అన్న డైలమాని ఆయనే బయట పెట్టుకున్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తోరో ఇంత వరకు క్లారిటీయే రాలేదు. కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి సీటుపై కూర్చోడానికి రెడీ అంటున్నారు పవన్ కళ్యాణ్. లెక్కలేనంత తిక్క.. తలతిక్కను మించిన కన్ఫ్యూజన్ను అణువణువునా నింపుకున్న పవన్ కల్యాణ్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధం అవుతోందా? అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత విశాఖలో వారాహి యాత్ర ముగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనలో ఉన్న అయోమయాన్ని బయట పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే పరిస్థితిలో లేని టీడీపీతో కానీ.. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కానీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం కచ్చితంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. పొత్తులు అయితే గ్యారంటీగా ఉంటాయి కానీ.. అది బీజేపీతో ఉంటుందా? లేక టీడీపీతో ఉంటుందా? అన్న అంశాలపై చర్చ నడుస్తోందన్నారు పవన్. అంటే ఎవరితో పొత్తు ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదన్నట్లే అంటున్నారు రాజకీయ పండితులు. సరే పొత్తులు బీజేపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీతో ఉంటాయా లేదంటే 2014 తరహాలో మళ్లీ మూడు పార్టీలు కలిసి జట్టు కడతాయా? అన్నదాంట్లోనూ క్లారిటీ లేదు. ఒక వేళ టీడీపీతో కానీ బీజేపీతో కాని పొత్తులు పెట్టుకుంటే అపుడు ఆ పార్టీలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయి? అన్నదానిపై క్లారిటీ లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఓ పాతిక సీట్లు జనసేనకు ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. మరీ ఎక్కువ అనుకుంటే 40 స్థానాల దాకా ఇవ్వచ్చు. ఒక వేళ జనసేనకి 40 స్థానాలు కేటాయిస్తే ఆ 40 నియోజక వర్గాల్లోనూ జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపితే పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నింట్లో విజయాలు సాధించే అవకాశాలుంటాయన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్నది ఏక్ నిరంజన్ లా ఒకే ఒక్క సీటు. జనసేన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ జోడీ మొత్తానికి 88 స్థానాలు దక్కితేనే మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతాయి. కానీ క్షేత్ర స్థాయిలో జనసేనతో టీడీపీ కలిసినా బీజేపీ కలిసినా ఈ ఫిగర్‌కు దరిదాపుల్లో కూడా స్థానాలు దక్కే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చదవండి: బాబూ.. కాస్త ప్రధాని మోదీని చాలెంజ్ చేయొచ్చుగా! అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాబోయేది మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు. అంతే కాదు తాను ఈ సారి సీఎం సీటు ఎక్కడానికి రెడీ అంటున్నారు. అయితే దానికి ప్రజలు బలంగా తనకు మద్దతు తెలపాలంటున్నారు పవన్. దీని మీదనే సోషల్ మీడియాలో పవన్‌ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్న అన్నట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ పొత్తు పెట్టుకోబోయే పార్టీకి కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లు వస్తాయన్న గ్యారంటీయే ప్రస్తుతానికి లేదు. కానీ పవన్ మాత్రం సీఎం సీటుకు తాను రెడీ అంటున్నారు. సీఎం సీటులో కూర్చోడానికి పవన్ రెడీ కావచ్చు. కానీ రెడీగా ఉండాల్సింది సీఎం సీటు కదా? సీఎం సీటు రెడీగా ఉండాలంటే అసలు పవన్‌ని సీఎంగా చేయడానికి ప్రజలు రెడీగా ఉండాలి కదా? ఆ ప్రజలే పవన్‌ను సీఎంగా చేయడానికి రెడీగా ఉండే పరిస్థితులు ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసిన అగత్యం ఎందుకొస్తుంది? తాను అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నానన్న దౌర్బల్య పరిస్థితిలోనే కదా పవన్ పొత్తుల కోసం పరితపిస్తున్నది. పొత్తులు లేనిదే తాను పోటీచేయలేనని చెప్పుకోడానికి నామోషీ అయ్యే కదా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే సవాల్ విసిరినట్లు పవన్ నటించింది? తన వైఫల్యలపై కూడా పవన్ కళ్యాణ్ మంచి కామెడీ చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ గందరగోళంలోనే తనకున్న కన్ఫ్యూజన్ ని పవన్ అందరికీ పంచిపెడుతున్నారని వారు సెటైర్లు వేస్తున్నారు. -
ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..
జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది. నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట. ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది. -
తెలంగాణ బీజేపీ.. మరీ ఇంత గందరగోళమా?
తోచీ తోయనమ్మ తోడికోడలు.. పుట్టింటికి వెళ్లిందని ఒక సామెత. భారతీయ జనతా పార్టీ నేతల తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో మేధావులను,వివిధ వర్గాల ప్రముఖులను కలవడానికి ఆ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంది. మంచిదే!. ఆ సందర్భంగా వారు తమకు కాస్త సానుకూలంగా ఉండేవారినో, లేక తటస్థంగా ఉండేవారినో కలిస్తే ప్రయోజనం ఉంటుంది. అలాకాకుండా పూర్తి వ్యతిరేక సిద్దాంతంతో ఉండేవారిని, మరో పార్టీకి ఏజెంట్ గిరీ చేసేవారిని కలవడానికి ఆలోచించడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ✍️ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా.. హైదరాబాద్‌లో మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆయన కూడా వీరిని సాదరంగా ఆహ్వానించి ఇంటిలోకి తీసుకువెళ్లారు. ఆయనకు మోదీ పాలనకు సంబంధించిన వివిధ పుస్తకాలను నడ్డా అందించారు. సిద్దాంతాలు వేరైనా ఇలా రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలియచేయడానికి రావడం ప్రజాస్వామ్యంలో మంచిదేనని నాగేశ్వర్ అన్నారు. బాగానే ఉంది. నాగేశ్వర్ మర్యాదస్తుడు. అందరితో గౌరవించబడే వ్యక్తి. అంతవరకు ఓకే. అసలు బీజేపీ పెద్దలు ఆయనను కలవడం వల్ల ఏమి ప్రయోజనం వచ్చిందన్నది ప్రశ్న. తెలంగాణ బీజేపీ నేతలే కొందరు ఈ ప్రశ్న లేవనెత్తడం విశేషం. నాగేశ్వర్ వామపక్ష సిద్దాంత భావాలు ఉన్న ప్రముఖుడు. ఆయన కొంతకాలం సీపీఎం ఆధ్వర్యంలోని ఒక టీవీ చానల్ ను కూడా నిర్వహించారు. వివిధ టీవీ చానళ్లలో విశ్లేషకుడిగా కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. ఇప్పుడు నడ్డా కలవడం వల్ల నాగేశ్వర్ తన భావాలను మార్చుకుంటారని అనుకోజాలం. తాను చెప్పదలచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. అందుకు బీజేపీ నేతలు ఇష్టపడతారా? బీజేపీ సిద్దాంతం అంటే అంతగా ఇష్టపడని వ్యక్తి అని తెలిసి కూడా ఆయనను కలవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. గతంలో బీజేపీ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన చరిత్ర కూడా నాగేశ్వర్‌కు ఉంది. రాజకీయ వర్గాలలోను, రాజకీయేతర వర్గాలలోను ఈయన పట్ల చాలా మందికి అబిమానం ఉంది కనుక ఎవరో ఈ భేటీని అభ్యంతరంగా తీసుకోరు. కాకపోతే బీజేపీ తెలంగాణలో గందరగోళంలోనే ఉందన్న సంగతి మరోసారి స్పష్టం అవుతుంది. ✍️ కొంతకాలం క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జర్నలిస్టు ముసుగులో ఉన్న తెలుగుదేశం ఏజెంట్ ఒకరిని కలవబోతున్నారని వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు డైరెక్ట్ ప్రతినిధిగానే కాకుండా ఫిరాయింపులు, రాజకీయ ఆర్దిక లావేదేవీలు వంటివాటిలో క్రియాశీలకంగా ఉంటూ పవర్ బ్రోకర్ గా పేరొందిన జర్నలిస్టును కలవబోతున్నారని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. గతంలో ఒకసారి ఈయనను పిలిపించుకుని ఢిల్లీలో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ కోసం ఈయన బీజేపీపై కారాలు, మిరియాలు నూరారు. కొంతకాలం రెండు పార్టీలు కలిస్తే ఏపీలో జగన్ ను ఇబ్బందిపెట్టవచ్చని అనుకున్నారు. ఆ దిశగానే పనిచేశారు. ఏపీ బీజేపీలోని ఒక నేతను ఈయన టీవీచానల్ లో డిబేట్ లోనే మరొకరు కొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కొందరు బిజెపిలో చేరి కోవర్టులుగా వ్యవహరిస్తుంటారు. వారందరికి ఈయనే సలహాలు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని జాతీయ స్థాయిలో హోం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కలవడమా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ✍️ ఆ తర్వాత కారణం ఏమో తెలియదు కాని అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడంతో ఆ భేటీ అగిపోయింది. నిజమైన బీజేపీ నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడైనా కలుస్తారేమో తెలియదు. జేపీ నడ్డా తన పర్యటనలో ఆ జర్నలిస్టు ఇంటికి వెళ్లకపోవడం గమనించదగ్గ అంశమే అవుతుంది.అంతకుముందు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన అమిత్ షా మరో మీడియా అధిపతిని ఆయన ఫిలిం సిటీకి వెళ్లి కలుసుకుని మద్దతు కోరారు. అయినా ఆ మీడియా అంతగా పట్టించుకోలేదు. అది పూర్తి స్తాయిలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తోంది. కేసీఆర్ పాలన గురించి అద్భుతంగా పొగుడుతూ ఎడిటోరియల్ కూడా రాసింది. ఆ మీడియా అధిపతికి తన కారణాలు తనకు ఉండవచ్చు. కానీ అమిత్ షా ఆయన్ని కలవడం వల్ల బీజేపీకి ఒరిగే ప్రయోజనం ఏముంది?. ✍️ తెలంగాణలో బిజెపి పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక కావొచ్చు. కర్నాటక ఎన్నికల ఓటమి తర్వాత తెలంగాణలో బీజేపీ అయోమయంలో పడిపోయింది. కారణం ఏమైనా దాని గ్రాఫ్ తగ్గుతున్న మాట వాస్తవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ లో చేసిన విమర్శలు ఎలా ఉన్నా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితను పలుమార్లు విచారించిన తీరు. ఆ తర్వాత పలువురు ఇతరులను అరెస్టు చేసినా, ఆమె జోలికి వెళ్లకపోవడంపై కాంగ్రెస్ పక్షం విమర్శిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తోంది. దానికి తగ్గట్లుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలికాలంలో బీజేపీపై విమర్శలు తగ్గించడం, కాంగ్రెస్‌పై దాడి పెంచడం చేస్తున్నారు. అంతేకాక దేశస్థాయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లకపోవడం, అదే టైమ్ లో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంలో కొందరు మంత్రుల్ని కలవడం, చివరికి అమిత్ షా అప్పాయింట్మెంట్ పొందడం అందరి దృష్టిని ఆకర్షించాయి. కానీ, చివరి క్షణంలో అమిత్ షా తో భేటీ రద్దు అయింది. ✍️ మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా ఇప్పుడు కేంద్రాన్ని ఆయా డిమాండ్లపై కలవడంలో రాజకీయం కూడా ఉండొచ్చు. కానీ, రెండు పార్టీల అగ్రనేతల మధ్య ఏదో రాజీయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యాపించాయి. ఢిల్లీలో జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు చేస్తామని కేటీఆర్ చెప్పడం చిత్రంగానే అనిపిస్తుంది. కేటీఆర్ డిల్లీ టూర్ లో ఉన్నప్పుడే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలతో డిల్లీలో అమిత్ షా, నడ్డాలు సమావేశం అయి పార్టీ వ్యవహారాలు చర్చించారు. కేటీఆర్‌ను కలవడం వల్ల బిజెపి గ్రాఫ్ మరింత పడిపోతుందని వారు స్పష్టం చేయడంతోనే షా రద్దు చేసుకున్నారని అంటున్నారు. తాము బిజెపితో కలిసిందే బిఆర్ఎస్ కు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా అయితే, వారితో కాంప్రమైజ్ అయితే తాము బిజెపిలో కొనసాగి ప్రయోజనం ఏమి ఉంటుందని వారు ప్రశ్నించారట. ✍️ ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది. ఒకప్పుడు మంచి జోష్ వచ్చినా, ఇప్పుడు డల్ అవడంతో బీజేపీ పెద్దలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ నడ్డా, అమిత్ షాలు వచ్చి కేసీఆర్‌ను ఎంత ఘాటుగా విమర్శించినా గ్రాఫ్ పెరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. మొత్తం రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. తెలంగాణలో తాము గెలవలేకపోతే బీఆర్ఎస్ విజయం సాధించడం బెటరా? కాంగ్రెస్ గెలిస్తే లాభమా ? అనేది ఆలోచించుకుంటారు. కచ్చితంగా బీఆర్ఎస్ ఉండడం వల్ల తమకు వచ్చే నష్టం లేదని బీజేపీ వారు అనుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే దాని ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాలపై పడవచ్చు. అందువల్ల ఎన్నికల నాటికి బీజేపీ హడావుడి చేసినా, కాంగ్రెస్ గెలవకూడదనే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే పాయింట్ కావచ్చు. ✍️ ఎన్నికల సమయంలో ఆదాయపన్ను ,సిబిఐ , ఈడి వంటివాటిని ప్రయోగించకుండా ఉంటే బీఆర్ఎస్ కు ఇబ్బంది ఉండదు. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఈడీ దాడులు చేసింది. అలాగే మెడికల్ కాలేజీలలో అక్రమాలపై దృష్టి సారించింది. అందులో బిఆర్ఎస్ కు బాగా దగ్గరగా ఉండే ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతానికి మేనేజ్ చేసుకోగలిగారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జోరు తగ్గిన బిజెపి ఆయా నియోజకవర్గాలలో కొత్త నేతలను ఇప్పటికైతే ఆకర్షించలేకపోతోంది. మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లె కృష్ణారావు తదితరులు బిజెపి కన్నా కాంగ్రెస్ బెటర్ అనే భావనకు వచ్చారు. వారికోసం బిజెపి విఫల యత్నం చేసింది. ఈ నేపధ్యంలోనే ఈటెల రాజేందర్, రాజగోపాలరెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూడవచ్చన్న వార్తలు వస్తుండడంతో హైకమాండ్ అలర్ట్ అయింది. తెలంగాణ బిజెపి సీనియర్ నేతలలో ఉన్న విభేదాలు కూడా పార్టీని ఇరుకున పెడుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, మరో నేత డి.కె. అరుణ వంటివారు ఈ వాదనలను ఖండిస్తున్నా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటేనని చెబుతున్నా, జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. రాజగోపాలరెడ్డి ఆయా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఎక్కువకాలం బిజెపిలో ఉండరేమోననిపిస్తుంది. రాజకీయాలు మొత్తం మారిపోవడానికి ఒక స్టెప్ చాలు అనడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి ఇలాంటి సందిగ్ద పరిస్థితిలోనే కొట్టుమిట్లాడుతోందని చెప్పాలి. ::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కన్ఫ్యూషన్ లో బీజేపీ
-
టీడీపీ అంతర్గత సమావేశం.. అంతా గందరగోళం
నెల్లూరు(టౌన్): జిల్లాలో నిర్వహించిన టీడీపీ అంతర్గత సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ ఘటన ఉదయమే చోటు చేసుకోవడంతో ఏ పరిస్థితికి దారి తీస్తుందోనని నేతలు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం నెల్లూరులోని ఎస్వీజీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జోన్–4కు సంబంధించి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్, యూనిట్, మండల పార్టీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. దీనికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చారు. అయితే ఆయన అనుచరులకు అనుమతి లేదని రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఉండే వారు నిలిపివేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కొమ్మి ఆత్మకూరు టీడీపీకి చెందిన కన్నబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అనుచరులకు అనుమతి లేకుండా వేరే వాళ్లను ఎలా పంపిస్తారని వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంచాలని కన్నబాబుకు ఇస్తే.. ఎక్కడా పంచకుండా దాచుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ నెలకో, రెండు నెలలకో ఆత్మకూరుకు వచ్చే కన్నబాబుకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తారని దుర్భాషలాడారు. దీంతో కన్నబాబు అనుచరులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నాయకులు ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. దీంతో అసంతృప్తికి లోనైన కొమ్మి సమావేశానికి చంద్రబాబు వచ్చిన తర్వాత కనిపించలేదు. ఇంకా భోజనాల దగ్గర మీడియా ప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. ఇంకా నెల్లూరు నగరం నుంచి రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి నారాయణ ముఖ్యమైన సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఆ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జి నుంచి ప్రతిస్పందన కరువైంది. -
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
తొలిరోజే ప్రయాణికులకు షాక్ ఇచ్చిన కువైట్ సమ్మర్ సర్వీస్
సాక్షి, గన్నవరం: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కువైట్ సమ్మర్ ఎయిర్ఇండియా సర్వీస్‌ను బుధవారమే ప్రారంభమైంది. ఐతే తొలిరోజే కువైట్ సమ్మర్ సర్వీస్ ప్రయాణికులకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికులను వదిలేసి ముందే విమానం వెళ్లిపోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎయిర్ ఇండియా ఉదయం 9.55 నిమిషాలకు దాదాపు 67 మంది ప్రయాణికులుతో గన్నవరం నుంచి కువైట్‌కి బయల్దేరిపోయింది. అయితే ఫ్లైట్ వెళ్లిన కొద్ది నిమిషాలకు కువైట్‌కి వెళ్లేందుకు వచ్చిన సుమారు 20 మంది ప్రయాణికులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. విమానం 1.10 నిమషాలకు వెళ్లాల్సి ఉండగా.. ముందుగా బయల్దేరడమేమిటని ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశ్నించారు. అయితే సిబ్బంది మాత్రం విమానం ఉదయం 9.55 నిమిషాలకే బయల్దేరుతుందని మెసేజ్ పెట్టామంటున్నారు. ప్రయాణకులేమో మాకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదంటూ ఎయిండ్ ఇండియా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ..గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ఆందోళనకు దిగారు ప్రయాణికులు. కాగా, ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి గన్నవరం ఎయిర్పోర్టకి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా ఈ కువైట్ సమ్మర్ సర్వీర్ని బుధవారం ప్రారంభించింది. ఈ సర్వీస్‌ను ఈరోజు నుంచి అక్టోబర్ చివరి వరకూ ప్రతి బుధవారం కువైట్‌కు ఎయిర్ ఇండియాను నడపనున్నారు. (చదవండి: 162 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు భర్తీ) -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్‌ల్యాండ్‌లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం
-
టీడీపీలో ‘కరివేపాకులు’.. నమ్ముకున్నోళ్లనే ముంచేస్తున్నాడు మావా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో చంద్రబాబు పర్యటన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు భవిష్యత్‌పై అయోమయంలో పడ్డారు. తొలుత కందుకూరు, కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని ప్రకటించినా.. ఆఖరి క్షణంలో ఉదయగిరి పర్యటన వాయిదా వేసుకున్నారు. చివరాఖరుకు మూడు నియోజకవర్గాల్లో తిరిగినా.. వాటిల్లో ఫలానా అభ్యర్థి ఉంటారని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం, సీఎంను దూషించడం.. ఈ రెండింటి మీదే పర్యటన సాగింది. కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కూతవేటు దూరంలోని నెల్లూరులో ఉంటున్న నగర ఇన్చార్జిని కూడా పరామర్శించడానికి వెళ్లలేదు. టీడీపీలోకి పక్క పార్టీల్లోని సమర్థులైన నాయకులు రావాలని పిలుపునివ్వడం చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆ పార్టీలో కింగ్లనుకునే అందరూ కరివేపాకులే అని సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది. కందుకూరు సభలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కావలి, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించినా పార్టీ నేతల్లో జోష్ నింపలేకపోయారు. అధినేత పర్యటనకు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ఆశావహులు రూ.లక్షలు కుమ్మరించి భారీ ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. అయితే అధినేత మాత్రం ఏ నియోజకవర్గంలో తన పార్టీ తరఫున ఫలానా నాయకుడు మీకు అండగా ఉంటారని, పోటీలో ఉండబోతారని ఎక్కడా చెప్పలేదు. కాగా పక్క పార్టీల్లో బలమైన, సమర్థులైన నేతలు టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉందంటూ పిలుపునివడంతో ఇన్నాళ్లు పార్టీ కోసం పాకులాడుతున్న సీనియర్లు కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. రేపటి ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసంతృప్తి జ్వాలలు.. వర్గ విభేదాలు చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత అడుగడుగునా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు, వర్గ విభేదాలు రగిలాయి. కావలి నియోజకవర్గ ఇన్చార్జి కరివేపాకేనని స్పష్టమైంది. కావలిలో బీద రవిచంద్ర కనుసన్నల్లోనే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. పైకి మాత్రం కావలి తనకు వద్దంటూనే బీద గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కాదని తన అనుచరుడిగా ఉన్న ఓ మండల స్థాయి లీడర్ సుబ్బానాయుడుకి ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేలా చేశాడు. టీడీపీ హయాంలో సహజవనరులు దోచుకుని రూ.కోట్లు సంపాదించిన ఈ చోటా నేతతో చంద్రబాబు పర్యటనకు భారీగా ఖర్చు పెట్టించాడు. అయితే చంద్రబాబు సభలో కావలి అభ్యర్థి ఫలానా అని చెప్పకపోవడంతో సుబ్బానాయుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు. కోవూరులో పరిస్థితిలో మరోలా ఉంది. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన చంద్రబాబు పర్యటనలో కూడా ఇరువురూ కలిసి పనిచేయలేదు. వేర్వేరుగా స్వాగతం పలికారు. కోవూరు సభలో మాత్రం పోలంరెడ్డి తనయుడు దినేష్‌రెడ్డి ప్రచార వాహనంలో ఉన్నాడు. కోవూరు టికెట్ తన కొడుక్కే దక్కుతుందని శ్రీనివాసులురెడ్డి ఇది వరకే కార్యకర్తలకు పరిచయం చేయడం, ఇంకా ప్రచార వాహనంలో బాబు పక్కనే ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ చేజర్ల కరివేపాకులా మారాడు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న ఆయనకు కనీసం ప్రచార వాహనంలో కూడా స్థానం ఇవ్వలేదు. కానీ చంద్రబాబు తమ అభ్యర్థిగా దినేష్‌ను పరిచయం కూడా చేయకపోవడం ఇరువర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఇకపోతే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ కరివేపాకులా మారారనే చెప్పాలి. కోవూరు టికెట్ సాధించేందుకు రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ముద్ర వేసుకుని పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుడు. ప్రతి ఎన్నికల సమయంలో పెళ్లకూరుకు టికెట్ అంటూ ప్రచారం మాత్రం జోరుగా ఉంటుంది. చివరాఖరుకు ఇంకొకరు పోటీలో నిలబడతారు. ఒకానొక దశలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పేరు ఖరారు చేసి చివరి క్షణంలో ఆయన్ను తప్పించి వలస నేత అబ్దుల్ అజీజ్‌కు ఇచ్చారు. ఇలా ఎన్నోసార్లు పెళ్లకూరు మరో కరివేపాకు అయ్యాడు. చదవండి: నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’ బలంగా వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీకి బలమైన పట్టు ఉన్న జిల్లాలో టీడీపీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడే పరిస్థితి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థలు, తిరుపతి పార్లమెంట్, ఆత్మకూరు ఉప ఎన్నికల వరకు వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు సైకిల్ పంక్చరైంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పార్టీ పోటీ చేయక పోయినా బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇచ్చినా వృథా అయింది. ఈ క్రమంలో జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా జిల్లాలో మూడు రో జుల పాటు పర్యటన చేసినా పార్టీలో జోష్ రాలేదు.. నేతల్లో అసంతృప్తి జ్వాలలను రగిల్చి వెళ్లాడు. ముఖం చాటేశారు పార్టీ కోసం చొక్కాలు చించుకుని పనిచేసిన టీడీపీ ముఖ్య నేతలకు సైతం చంద్రబాబు ముఖం చాటేశారు. టీడీపీ ముఖ్య నాయకుల్లో నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒకరు. ఇటీవల ఆయన ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యారు. మూడురోజులు జిల్లాలో ఉండీ.. నెల్లూరుకు కూతవేటు దూరంలోని కోవూరు వరకు వచ్చిన చంద్రబాబు కనీసం పరామర్శకు కూడా రాలేదు. బాబు పర్యటన షెడ్యూల్లో కోటంరెడ్డికి పరామర్శ కార్యక్రమం ఉన్నట్లు చూపించారు. అయితే రాకుండానే వెళ్లిపోయారంటే ముఖ్య నేతలకు చంద్రబాబు దగ్గర ఉన్న విలువెంతో అర్థమవుతోంది. జిల్లా పార్టీ నేతల ద్వారా కోటంరెడ్డి చంద్రబాబును తన ఇంటికి తీసుకురమ్మని శతవిధాలా ప్రయత్నాలు చేయించినా సక్సెస్ కాలేదు. ఆయన్ను బాబు కరివేపాకులా తీసేశాడని తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణకు సహకరించలేదనే లెక్కలు ఉండడంతో చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. -
తెలంగాణాలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి : జగ్గారెడ్డి
-
Russia-Ukraine War: పుతిన్ ‘తప్పు’టడుగులు
ఉక్రెయిన్‌పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్‌పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ? ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్‌లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం. ఉక్రెయిన్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాల అండ అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్‌కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థతోనే ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్‌పై దాడులకి దిగితే అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా చమురు, గ్యాస్ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి. పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్‌కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్‌బర్గ్ కాలమిస్ట్ లియోనిడ్ బెర్షిడ్స్కీ అన్నారు. కదనరంగంలో కిరాయి సైనికులు ఉక్రెయిన్‌లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్‌లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోమయమా.. జట్టు రాలుతుందా..? అయితే ఈ కారణమే కావచ్చు..!
ఆరోగ్యకరమైన ఆహారం లేదా పోషకాల విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ప్రోటీ న్లు, కాల్షియం లేదా విటమిన్లు. వీటిలో జింక్ ఒకటి. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. జింక్ లోపం ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్‌లు అవసరం. ఆ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి. బరువు తగ్గడం.. జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతో అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. జుట్టు రాలిపోవడం.. జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు. తరచూ జలుబు.. జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు తగ్గుతుంది. చూపు మసక బారడం.. ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి కాబట్టి శరీరంలో జింక్ లోపిస్తే చూపు మసకబారుతుంది. గందరగోళం.. మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి. సంతానోత్పత్తిపై ప్రభావం.. జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం.. శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. అయితే జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది కాబట్టి లోప నివారణకు సప్లిమెంట్లు తీసుకోక తప్పదు. ఇలా నివారించాలి.. జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లను తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. -
పూడురు సర్పంచ్.. ఒకరోజు ఆమె, మరొకరోజు ఆయన.. ఏంటీ మాకీ కన్ఫ్యూజన్!
మండలంలోని మేజర్ పంచాయతీలలో పూడూర్ గ్రామ పంచాయతీ ఒకటి. పూడూర్ గోసాయిగూడ గ్రామాలు కలిపి పూడూర్ గ్రామ పంచాయతీగా ఉంది. అలాంటి పూడూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సీట్లో సస్పెన్షకు గురైన వ్యక్తి ఒకరోజు, ఉపసర్పంచ్‌గా అవిశ్వాసంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయిన వ్యక్తి మరొక రోజు సర్పంచ్ సీట్లో కూర్చుంటూ గ్రామస్తులను అయోమయంలో పడేస్తున్నారు. అధికారులు ఏ విషయం ఖచ్చితంగా తేల్చకపోవడంతో ఎవరికి వారే సర్పంచ్‌గా కొనసాగుతుండటం గమనార్హం. సాక్షి,మేడ్చల్: పూడూర్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా బాబుయాదవ్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో 7వ వార్డు నుంచి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన జ్యోతిరెడ్డిని వార్డుసభ్యులు ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో అంతా సాఫీగా సాగింది. తదనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో బాబుయాదవ్ టీఆర్ఎస్లో చేరారు. గత ఫిబ్రవరిలో బాబుయాదవ్ ఓ రియల్ ఎస్టెట్ వెంచర్ ఏర్పాటు వ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో జిల్లా అధికారులు బాబుయాదవ్‌ను సర్పంచ్ పదవి నుంచి తొలగించి ఉపసర్పంచ్ జ్యోతికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో జ్యోతిరెడ్డి కాంగ్రెస్ నుంచి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అవిశ్వాసంలో పదవి కోల్పోయి.. తిరిగి ఇన్చార్జ్ సర్పంచ్‌గా బాధ్యతులు ఈ క్రమంలో వార్డు సభ్యులు ఉపసర్పంచ్ జ్యోతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది నెగ్గడంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయింది. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు రెండు ఖాళీ కావడంతో ఒక వార్డుమెంబర్‌కు ఇన్చార్జ్ సర్పంచ్ బాధ్యతుల అప్పగించాల్సి ఉండగా.. తిరిగి 7వ వార్డు సభ్యురాలైన జ్యోతిరెడ్డి ఇన్చార్జ్ సర్పంచ్‌గా అధికారులు నియమించారు. కోర్టు ఆర్డర్‌తో సర్పంచ్‌గా బాబుయాదవ్.. రెండు నెలలు తర్వాత బెయిల్‌పై వచ్చిన బాబుయాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో బాబుయాదవ్ తిరిగి బాధ్యతలు తీసుకుని సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. బాబుయాదవ్ కేవలం తప్పుడు పత్రాలతో ఎలాంటి అధికారిక పత్రాలు చూపెట్టకుండా సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నాడని.. ఆయన సర్పంచ్‌గా ఉండటానికి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జ్యోతి తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నారు. దీంతో పూడూర్ సర్పంచ్ ఎవరో తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. జాతరకు ముందే సర్పంచ్ ఎవరో తేల్చాలి.. గ్రామంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ, మైసమ్మ జాతరను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జాతర సాఫీగా జరగాలంటే గ్రామంలో సర్పంచ్ ఎవరో ముందుగా అధికారులు తేల్చాలి. లేకుంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. ఒత్తిళ్లతోనే ఆర్డర్‌ను ఆమోదించడం లేదా? దీనికి పుల్‌స్టాప్ పెట్టాలంటే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూడూర్ సర్పంచ్‌గా బాబుయాదవ్ పేరును జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ఉత్తర్వులను జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే కోర్టు ఆర్డర్‌ను ఆమోదించడం లేదని అందరూ బాహాటంగానే అనుకుంటున్నారు. మరి దీనిపై జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు బాబుయాదవ్ సస్పెన్షకు గురికావడంతో జిల్లా కలెక్టర్ నన్ను పూడూర్ ఇన్చార్జ్ సర్పంచ్‌గా నియమించారు. అధికారులు పదవి అప్పగిస్తే సర్పంచ్ సీట్లో కూర్చున్నాను. çబాబుయాదవ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించినట్లు నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఆయన తానే సర్పంచ్‌ను అంటూ గ్రామస్తులు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు – జ్యోతిరెడ్డి న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. జిల్లా కలెక్టర్ సర్పంచ్ పదవి నుంచి నన్ను తొలగించడంతో హైకోర్టును ఆశ్రయించాను. సర్పంచ్‌గా నన్నే కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని కోరాను. ఏప్రిల్ 11న ఇన్చార్జ్ సర్పంచ్ జ్యోతిని పదవి నుంచి తొలగిస్తూ నన్ను సర్పంచ్‌గా కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఆర్డర్ కాపీలను జిల్లా కలెక్టర్, డీపీఓ, గ్రామస్థాయి అధికారులకు అందజేశాను. పిటిషన్లో జ్యోతిని సైతం పార్ట్ చేశాను. న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. అధికారుల ఆదేశానుసారమే నేను తిరిగి సర్పంచ్ బాధ్యతలు చేపట్టాను. స్వార్థ రాజకీయాలతో జ్యోతి వర్గీయులు గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు. శుక్రవారం జ్యోతి సర్పంచ్ సీట్లో కూర్చోవంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. – బాబుయాదవ్ ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్ కోర్టు ఎవరిని ఉండమంటే వారే సర్పంచ్. పూడూర్ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి వివరణ కోరితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కొత్తగా అడుగుతారేంటి అక్కడ మొన్నటి వరకు ఎవరు ఉంటే వారే సర్పంచ్‌గా ఉంటారు. కోర్టు బాబుయాదవ్‌ను సర్పంచ్‌గా నియమించింది. ఆయనే సర్పంచ్‌గా కొనసాగుతారు. శుక్రవారం జ్యోతి సీట్లో కూర్చుంది కదా అని అడగగా తనకు తెలియదని... ఉదయం కూర్చుంటే కూర్చుండొచ్చు కాని ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్. – డీపీఓ రమణమూర్తి చదవండి: అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా! -
త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ తాజాగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. బంతిని త్రో వేయడంలో ఫీల్డర్లు కన్ఫ్యూజ్ కాగా బ్యాట్స్‌మెన్ మాత్రం రనౌట్ల నుంచి తప్పించుకుంటూ రన్స్ పూర్తి చేశారు. ఈ ఫన్నీ ఘటన యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో చోటుచేసుకుంది. వర్మ్‌డో సీసీ, స్టాక్‌హోమ్ సూపర్ కింగ్స్ మధ్య గురువారం లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టాక్‌హోమ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్మ్‌డో బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ థర్డ్‌మన్ దిశగా ఫ్లిక్ చేశాడు. అయితే పరుగున వెళ్లిన కీపర్ క్యాచ్‌ను అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ప్రయత్నించగా.. కీపర్ త్రో సరిగా వేయలేదు. అది ఓవర్ త్రో అవడం.. ఆ తర్వాత మరో ఫీల్డర్ త్రో సరిగ్గా వేసినా మరొక ఫీల్డర్ దానిని అడ్డుకొని రనౌట్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. అయితే అనతు వేసిన బంతి ఈసారి కూడా వికెట్లను తాకకుండా పక్కనుంచి వెళ్లిపోయింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ మాత్రం రెండు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొని 4 పరుగులు పూర్తి చేశారు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఒక ఆటగాడు బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడానికి నిలబడి ఉన్నా అతనికి ఒక్కసారి కూడా బంతి కరెక్ట్‌గా ఇవ్వకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోనూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ''ఎందుకో ఇది నాకు సరైన క్రికెట్‌లా అనిపిస్తుంది.. ఇలా ఆడితే వికెట్లు ఏం పడుతాయి ఎందుకు పడుతాయి'' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. వాన్ షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా ఇటీవలే భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమయంలో తన చర్యలతో వాన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైన తర్వాత పిచ్‌పై విమర్శలు కురిపిస్తూ నాలుగో టెస్టు మొదలయ్యే వరకు పిచ్‌కు సంబంధించి రోజుకో ఫోటో షేర్ చేస్తూ నవ్వులపాలయ్యాడు. భారత్ 3-1 తేడాతో సిరీస్ గెలిచిన తర్వాత కూడా వాన్ తన పంతాన్ని పక్కన బెట్టకుండా.. ఇండియా ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిస్తే తాను బెట్లు వేయడం మానుకుంటానని మరోసారి విమర్శలు చేశాడు. కాగా భారత్, ఇంగ్లండ్‌ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటకు అహ్మదాబాద్ వేదికగా మొదలుకానుంది. చదవండి: వైరల్: ధోని సిక్సర్ల వర్షం.. ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి Now this is proper cricket !!! pic.twitter.com/bhJ6rDLVAd — Michael Vaughan (@MichaelVaughan) March 10, 2021 -
తెలంగాణలో రెవెన్యూ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అవినీతిరహిత, పారదర్శక రెవెన్యూ లావాదేవీల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. ఇప్పటి వరకు దాని అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయకపోవ డంతో అధికారుల ముందరి కాళ్లకు బంధం పడినట్టయింది. కొన్ని నిర్ణ యాల అమలుకు పాత చట్టాన్నే పరిగణ నలోకి తీసుకోవాలని చెబుతున్న ప్రభు త్వం.. మరికొన్నింటికి మాత్రం గత నెలలో ఆమోదముద్ర వేసిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020(ఆర్వోఆర్) ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేస్తోంది. విధానపర నిర్ణయాల అమల్లో భాగంగా ఏకకాలంలో వేర్వేరు చట్టాలను అమలు చేయాలని భూ పరిపాలన శాఖ స్పష్టం చేస్తుండటం క్షేత్రస్థాయి అధికా రులను ఇరకాటంలో పడేస్తోంది. ఆర్వోఆర్ చట్టం–1971 స్థానంలో కొత్త చట్టానికి గత నెల 9న శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అయితే కొత్త చట్టం మేరకు అధికారాలు, విధులు, బాధ్యతలపై ప్రభుత్వం ఇప్పటివరకు నియమావళి (రూల్స్)ని జారీ చేయలేదు. సాదాబైనామాలపై స్పష్టత ఏదీ? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పాత చట్టం ప్రకారమే నడుచుకోవాలని ప్రభు త్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం అధికారులను.. దరఖాస్తు దారులను అయోమయంలో పడేసింది. ప్రస్తుతానికి పాత చట్టమే మనుగడలో ఉన్నా.. కొత్త చట్టం అమలుపై నేడో, రేపో విధివిధా నాలు ఖరారైతే ఏ చట్టం ప్రకారం ముందుకెళ్లాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పాత చట్టం ప్రకారం క్రమబద్ధీకరణను తిరస్కరిస్తే ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు సెక్షన్–5 (బీ) మేరకు అప్పీల్ చేసుకొనే వెసు లుబాటు అర్జీదారులకు ఉంటుంది. అయితే కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్, ఆర్డీవో, ఏసీల అధికారాలకు ప్రభుత్వం కోత పెట్టింది. రెవెన్యూ కోర్టులనూ రద్దు చేసింది. దీంతో సాదాబై నామాల అప్పీళ్లను విచారించే అవకాశం లేదు. ఎలాం టి వివాదమైనా సివిల్ కోర్టులను ఆశ్ర యించాల్సి ఉంటుంది. కొత్త యాక్ట్‌పై రూల్స్ వెల్లడించే వరకు పాత చట్టమే అమల్లో ఉం టుంది కనుక అధికారులు అభ్యంతరాలను ఎలా పరిష్కారిస్తారనే విషయమై స్పష్టత కొర వడింది. పాత చట్టం ప్రకారం ఒకవేళ వారు ఉత్తర్వులిచ్చినా కొత్త చట్టానికి అనుగుణంగా సవరణలతో ఉత్తర్వులు ఇవ్వకుండా పాత చట్టం మేరకు నడుచుకోవాలని అనడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. విధివిధానాల ఖరారులో జాప్యంతో రెవెన్యూ యంత్రాంగం డైలమాలో పడింది. పాత చట్టం ప్రకారం ముందుకెళ్లాలా లేక కొత్త చట్టం రూల్స్ వచ్చే వరకు వేచి చూడాలా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. సాదా బైనామాలకు మాత్రం పాత చట్టాన్ని వర్తిం పజేస్తూ జీవో విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.. కొత్త చట్టంపై నియమావళి విడుదల చేసే వరకు ఎలాంటి నిర్ణయాలు (ఆర్డర్లు) వెల్లడించవద్దని ఆదేశించడం ఉన్నతా« దికారుల ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువ పత్రాల జారీ అధికారాలను స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్లు కొత్త చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పటికీ వాటిని తహసీళ్లలోనే జారీ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు అధికారాలను సంక్రమింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వనందున జారీ తాము చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అదే ఇతరత్రా వ్యవహారాలకు వచ్చే సరికి కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ దాటవేస్తున్నారు. దరఖాస్తులకు మోక్షం ఎలా? కొత్త రెవెన్యూ చట్టం అంకురార్పణ జరిగిన మరుక్షణమే రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయ కూడదని ఆదేశాలివ్వడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రికార్డుల నిర్వహణ, కోర్టుల్లో వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లో సమస్యల పరిష్కారం, అర్జీల పరిశీల న, భూముల సర్వే సబ్‌డివిజన్ అర్జీలు పెం డింగ్‌లో పడ్డాయి. రెవెన్యూ కేసుల జోలికి వెళ్లకూడదని.. ఏ వివాదమైనా కోర్టుల్లోనే తేల్చుకోవాలని కొత్త చట్టంలో స్పష్టం చేయ డంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. 38 (ఈ), లావణి, ఓఆర్సీ హక్కులను ధరణిలో ఎక్కించడానికి మార్గమేమిటో చెప్పకపోవడం... సవరణలకు అవ కాశం ఇవ్వక పోవడం ద్వారా ధరణిలో నమోౖ దెన తప్పుడు రికార్డులకే చట్టబద్ధత కల్పించడం సరికాదని రెవెన్యూ వర్గాలు అంటు న్నాయి. పైగా రెవెన్యూ కోర్టుల రద్దుతో సివిల్ కోర్టులకు వెళ్లాలన్నా.. కరోనా కారణంగా ప్రధాన కేసులు మినహా ఇతర కేసుల విచారణను కోర్టులు చేపట్టడం లేదని, కొత్త చట్టంపై స్పష్టమైన మార్గదర్శకాలు త్వరగా జారీ చేస్తే తప్ప ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.