ముంబై: దేశీయ విద్యార్థులు ఎక్కువగా చైనాలో విదేశీ విద్యను అభ్యసిస్తుంటారు. అయితే భారత్, చైనా దేశాల మద్య సరిహద్దు వివాదాల కారణంగా విదేశీ విద్యను అభ్యసిస్తున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సంవత్సరం చైనాకు వెళ్లకూడదని మెజారిటీ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఈ సమాచారాన్ని కన్సెల్టెన్సీలు ద్రువీకరిస్తున్నాయి. చైనాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల జాబితాలో భారత్ నాలుగవ స్థానంలో ఉంది.
ఈ సంవత్సరం చైనాకు వెళ్లవద్దని విద్యార్థులు నిర్ణయించుకున్నట్లు ఎడ్యూకేషన్ స్టార్టప్స్ కాలేజీఫై, యాకేట్ తదితర సంస్థలు అభిప్రాయపడ్డాయి. దేశంలోని 80నుంచి 90శాతం విద్యార్థులు చైనాలో విదేశీ విద్యను అభ్యసిస్తున్నారు. చైనాలో కేవలం రూ.20లక్షల లోపే విదేశీ విద్య పూర్తికావడంతో దేశీయ విద్యార్థలు చైనాలో చదవడానికి మక్కువ చూపుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పునరాలోచన చేస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment