Indian students
-
అమెరికా పొమ్మంటోంది.. ఖర్చులు రమ్మంటున్నాయ్..
హైదరాబాద్‌లోని మీర్జాలగూడ (Mirjalguda) నివాసితులైన దంపతుల కుమారుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పీజీ చేస్తున్నాడు.. ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండాలని, అక్కడే ఒక హోటల్లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అది కూడా వారానికి రెండు రోజులు మాత్రమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉద్యోగం మానేయాలా వద్దా? లేక అమెరికా(United States of America) నుంచి తిరిగి వచ్చేయాలా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నగరంలో నివసించే దంపతుల ఇద్దరు కుమారులూ అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అక్కడ పంజాబ్‌కు చెందిన ఆభరణాల వ్యాపారుల దగ్గర మంచి వేతనానికి పనిచేస్తున్నారు. వీరు ఇంకా ఉద్యోగం మానమని చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులు వీరి గురించి ఆందోళన చెందుతున్నారు. ⇒ కొన్నేళ్లుగా అటు చదువు.. ఇటు పార్ట్ టైమ్ ఉద్యోగాలతో(Part time Job) అటు చదువు కోసం చేసిన అప్పుల్ని అమెరికాలో జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పలువురు నగర విద్యార్థుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో బహిష్కరణ భయాల మధ్య యునైటెడ్ స్టేట్స్(యూఎస్)లోని మన విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా.. మధ్యతరగతికి చెందినప్పటికీ స్థోమతకు మించి విదేశీ విద్యను ఎంచుకున్న మన విద్యార్థుల్లో అత్యధికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువు కోసం చేసిన భారీ రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు అక్కడి జీవన వ్యయాలను భరించడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతూ వచ్చిన విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది తదుపరి ఉన్నత చదువులకు అడ్మిషన్లపై ప్రభావం చూపక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నిన్నా మొన్నటి దాకా అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపిన మన రాష్ట్రం నుంచి భవిష్యత్తులో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నవారిని ఈ పరిస్థితులు పునరాలోచనలో పడేస్తున్నాయి.ఉద్యోగాలకు అనుమతి ఉన్నా..హెచ్–1 వీసాలపై అమెరికాలో ఉన్న విద్యార్థులు తాము చదువుతున్న క్యాంపస్‌లోనే వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే కాలేజీ క్యాంపస్‌లలో పనిచేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ అక్కడ తగినన్ని ఉద్యోగావకాశాలు లేకపోవడం లేదా అక్కడ ఆశించిన ఆదాయం రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఖర్చుల్ని భరించడం కోసం క్యాంపస్ వెలుపల రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో అనధికారికంగా పనిచేస్తున్నారు.⇒ కాలేజీ సమయం ముగిసిన తర్వాత ఒక చిన్నకేఫ్లో ప్రతిరోజూ 6 గంటలు పని చేసేవాడిని. గంటకు 7 డాలర్లు చొప్పున లభించేవి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన వైఖరితో వారం రోజుల క్రితం పని వదిలేశా.. ఇది ఇబ్బంది పెట్టే సంగతే.. అయినా ఇక్కడ చదువుకోవడానికి 50,000 డాలర్లు(సుమారు రూ.43.5 లక్షలు) రుణం తీసుకున్నా. జాబ్ కోసం చదువును పణంగా పెట్టే పరిస్థితిలో లేను’ అని ఇల్లినాయిస్లో గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి ధ్రువన్ చెప్పాడు.⇒ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా చెల్లుబాటయ్యే వర్క్ వీసాలు కలిగిన వ్యక్తులను మాత్రమే నియమించుకోవడం ప్రారంభించాయి. గతంలో స్థానిక వ్యాపారాలు, ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మన విద్యార్థులపై ఆధారపడేవి. ఇప్పుడు, వారు విద్యార్థులను తొలగించి, చెల్లుబాటు అయ్యే జాబ్ వీసాలో ఉన్నవారిని నియమించుకుంటున్నారు. న్యూయార్క్‌లో మాస్టర్స్ చదువుతున్న ఓ విద్యార్థిని నేహా మాట్లాడుతూ ‘పని ప్రదేశాలలో తనిఖీలు చేస్తున్నారు.. దాంతో నన్ను నా ఫ్రెండ్స్‌ను పార్ట్‌టైమ్ ఉద్యోగాలు మానేయాలని మాకు జాబ్స్ ఇచ్చినవారు వెళ్లగొట్టారు. ఇది చాలా కష్టం, కానీ పూర్తి బహిష్కరణకు గురికావడం లేదా మా విద్యార్థి వీసా స్థితిని కోల్పోవడం మరింత నష్టం. నన్ను ఇక్కడికి పంపించడానికి నా తల్లిదండ్రులు ఇప్పటికే చాలా రకాల త్యాగాలు చేశారు’ అని చెప్పింది. ఈ పరిస్థితులపై ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ ‘విద్యార్థులు క్యాంపస్ వెలుపల పనిచేయడం అక్కడ చట్టవిరుద్ధం. మునుపటి పాలకుల్లా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హెచ్1బీ, గ్రీన్కార్డ్లతో పాటు తమ భవిష్యత్ ఇమ్మిగ్రేషన్ అవకాశాల గురించి విద్యార్థులు భయపడుతుండటం సహజమే’ అని చెప్పారు. -
140 కోట్ల భారతీయులకూ అది అవమానమే!
డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో, ద్వంద్వ నీతితో, మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ముడిపడ్డవే. విద్య, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను (Indians) అవమానకరంగా వెనక్కి పంపింది. వీళ్లంతా నేరస్తులు కాదు. ఆ దేశం అక్రమ వలసదార్ల వల్ల భారీ లాభాలు గడించింది. వలసదార్ల రంగు నలుపైనా, చట్టం అక్రమ వలసదార్లని చెప్పినా, వారి సాంకేతిక నైపుణ్యం అమెరికన్ కార్పొరేట్లకి అంటరానిది కాదు. ట్రంప్ సర్కార్ వచ్చాక మన వాళ్ళను క్రిమినల్స్‌లాగా వేటాడి నిర్బంధించింది. సంకెళ్ళతో అమెరికా సైనిక విమానాల్లో కుక్కి అమృతసర్‌లో దింపేసి వెళ్ళింది. అది ఆ 104 మందికే కాదు మొత్తం 140 కోట్ల భారతీయులకూ అవమానమే!అమెరికా (America) నుంచి భారత్‌కు చేరుకున్న వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారి దీన గాథలు వింటే కడుపు తరుక్కు పోతుంది. ఏజంట్ల మాటలకు మోసపోయి లక్షలు చెల్లించి వెళ్లిన వీరు అమెరికా భూమిపై అడుగు పెట్టడానికి పడిన పాట్లు వర్ణనాతీతం. మైళ్ల కొద్దీ కాలినడక, చిన్నబోటులో ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించి అమెరికా గడ్డపై కాలు పెట్టడం, ఆ వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు చీకటి గదుల్లో బంధించడం... వీరి ప్రస్థానంలో మరపురాని ఘట్టాలు. అక్కడ వేలాది మంది పంజాబీ యువకులూ, పిల్లలూ కనిపించారనీ, అందరిదీ ఒకటే దుఃస్థితి అనీ తిరిగివచ్చిన వారు చెబుతున్నారు.ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంత మంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంతలో కొంత మిగుల్చుకుని తల్లిదండ్రులకు పంపేవారు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు జమచేస్తూ ఉంటారు. ఇదీ చదవండి: వెనక్కి పంపేస్తే నష్టమే!చదువు కోసం వెళ్లిన వారు కూడా ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యా సంస్థలు, యూనివర్సిటీ క్యాంపస్‌ల బయట చేయడానికి వీలు లేదన్న నిబంధనను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు నెలకు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకూ పంపించాల్సి వస్తోంది.ఇదీ చదవండి: అమెరికాలో భగ్నస్వప్న గాథ! అట్లాంటా, ఒహాయో, క్యాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, డల్లాస్‌లలో తెలుగు విద్యార్థులు (Telugu Students) ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక సమస్య అయితే ఓపీటీ పూర్తయిన తర్వాత ఏ ఉద్యోగం దొరక్క అమెరికాలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కక్షకట్టింది. అక్కడ ఒత్తిడిలో ఉన్న యువత ఫోన్లు ఎత్తకపోతే కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వారు ఏ ఆపదలో ఇరుక్కుపోయారో అనే ఆందోళన ఇందుకు కారణం. ఇది కేవలం భారతీయులకు, భారత దేశానికి చెందిన సమస్యే కాదు. ఎన్నో ప్రపంచ దేశాల సమస్య. అందుకే ట్రంప్ దుందుడుకు విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా మానవత్వంతో వ్యవహరించాలి.– వెంకటేష్, పీడీఎస్‌యూ -
ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్త
పారిస్: మూడు రోజుల ఫ్రెంచ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి పారిస్ వైపు మళ్లింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అధ్యక్షుడు మాక్రాన్‌తో కీలక రక్షణ, అణు ఇంధన ఒప్పందాలపై సంతకాలు చేసి భారత్ –ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా, వర్క్ పర్మిట్లను పారిస్ ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.ఇంతకుముందు బిగ్ ఫోర్‌గా పేరుగాంచిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలు నాలుగు గమ్యస్థానాలుగా ఉండేవి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మారింది. యూరప్ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులకు టాప్ చాయిస్‌గా మారింది. హెచ్ఈసీ పారిస్ బిజినెస్ స్కూల్, సోర్బోన్ విశ్వవిద్యాలయం, ఎకోల్ పాలిటెక్నిక్ వంటి 75 కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, వ్యాపారం, కళలు, సాంకేతికత, శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య పట్ల భారతీయ విద్యార్థులకు మక్కువ ఎక్కువైంది.2023–24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని విద్యాసంస్థల్లో చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 200 శాతం పెరుగుతుందని అంచనా. 2024 జనవరిలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని ఆనాడు మాక్రాన్ తన మనసులో మాట చెప్పారు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన క్యూఎస్ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31 శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పడం విశేషం. భారతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫ్రాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.ఫ్రెంచ్ నేర్చుకుంటే.. ట్రంప్ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్ ఉదంతంతో భారత్–కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్ బోధిస్తూ అది పూర్తి చేసిన వారికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు అనుమతిస్తోంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి, ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్ చదివిన భారతీయ విద్యార్థులు ఐదేళ్ల షార్ట్–స్టే స్కెంజెన్ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్ మాస్టర్స్ డిగ్రీతో పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పోస్ట్–స్టడీ వర్క్ వీసాను కూడా ఫ్రాన్స్ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం రెండేళ్లపాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.ఖర్చు తక్కువ..భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్‌తోపాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య ఖర్చు మిగతా బిగ్‌ఫోర్ దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్ అందిస్తోంది. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం కూడా తక్కువే. పారిస్‌లో నెలకు సగటున రూ.1.54 లక్షలు, లియోన్‌లో రూ.1.01 లక్షలు వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇతర నగరాల్లో సగటు జీవన వ్యయం నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాలు చాలా మంచి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. -
ట్రంప్ ఎఫెక్ట్.. తెలుగు విద్యార్థి ఆత్మహత్య
-
ట్రంప్ దెబ్బకు..పీడ కలగా అమెరికా చదువు..!
అమెరికాలో చదువుకోవడం అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల. అందుకోసం ఎన్నో ప్రయాసలుపడి, అప్పులు చేసి అమెరికాకు వస్తారు. ఎలాగోలా కష్టపడి మంచి యూనివర్సిటీలో సంబందిత కోర్సుల్లో జాయిన్ అయ్యి చదువుకుంటారు. అలాగే తల్లిదండ్రులకు భారం కాకుండా తమ ఖర్చుల కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటుంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాక..గ్రీన్‌కార్డ్ కోసం పాట్లుపడి ఏదోలా అక్కడే స్థిరపడేవారు. అలా అమెరికాలో జీవించాలనే కోరికను సాకారం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప దెబ్బకు భారత విద్యార్థులకు ఆ ధీమా పోయింది. అసలు అక్కడ చదువు సజావుగా పూర్తి చేయగలమా అనే భయాందోళనతో గడుపుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు కచ్చితంగా పనినిబంధనలు పాటించాలనే కొత్తి ఇమ్మిగ్రేషన్ చట్టాల నేపథ్యంలో చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేశారు. అస్సలు అక్కడ ఉండాలో వెనక్కొచ్చేయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలామంది విద్యార్థులు. అసలెందుకు ఈ పరిస్థితి..? భారతీయ విద్యార్థులు ఈ సమస్యను ఎలా అధిగమించొచ్చు తదితరాల గురించి తెలుసుకుందాం..!.ఇంతకుమునుపు వరకు అమెరికాలో చదువుకోవాలనుకునే చాలామంది భారతీయ విద్యార్థులు బ్యాంకు రుణం తీసుకునేవారు. ఆ తర్వాత జీవన ఖర్చులను భరించడానికి పార్ట్‌టైమ్‌గా పనిచేయడం, ఏదోలా ఉద్యోగం పొందడం, H-1B వీసా పొందడం వంటివి చేసేవారు. ఇక ఆ తర్వాత తమ విద్యా రుణాన్ని తిరిగి చెల్లించి అక్కడే స్థిరపడేలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇదంతా చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించినా..అందుకోసం మనవాళ్లు చాలా సవాళ్లనే ఎదుర్కొంటారు. అది కాస్తా ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని మరింత కఠినంగా మారిపోయింది. అసలు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తమ పరిస్థితి ఏంటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అగ్రరాజ్యంలో చదువుకోవడానికి వచ్చిన చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి పంపిస్తే వచ్చినవారే. వారంతా తమ ఖర్చులు కోసం తామే చిన్న చితకా ఉద్యోగాలు చేసి చదుకోవాల్సిందే. ఇప్పుడేమో ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకారం ..చదువుకునే విదేశీ విద్యార్థులంతా పని నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి. పైగా స్టూడెంట్ వీసాలు కఠినమైన పరిమితుల కిందకు వచ్చాయి. ఇంతకుమునుపు ఎఫ్1 వీసా ఉన్నవారు సాధారణంగా విద్యా నిబంధనల సమయంలో వారానికి 20 గంటలు, సెలవులు, విరామ సమయాల్లో వారానికి 40 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధన ప్రకారం..పరిమితలుకు మించి పనిచేయడం లేదా క్యాంపస్ వెలుపల అనధికార ఉపాధి చేపడితే విద్యార్థి హోదాను కోల్పోవడం తోపాటు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం వంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు..సజావుగా స్టడీస్ పూర్తి చేయాలంటే..విద్యార్థులు అమెరికాలో తమ స్టడీస్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే..తమ వీసా స్థితికి సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. విద్య నాణ్యత, కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉండే టైర్ 1 లేదా టైర్ 2 లాంటి విద్యా సంస్థలలో చదువుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక ట్యూషన్ ఖర్చులు విషయమై ఆందోళన చెందకుండా క్యాంపస్‌లోనే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ఎందుకంటే చదువుకు సంబంధంలేని ఉపాధి చేయడానికి లేదనే నిబంధన ఉంది కాబట్టి వీసా నిబంధనను ఉల్లంఘించకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేయపోవడమే మంచిది. అలాగే విద్యార్థులు తమ విద్యా సంస్థలోని అంతర్జాతీయ విద్యార్థి కార్యాలయాన్ని సంప్రదించడం లేదా సందేహం వచ్చినప్పుడు న్యాయ సలహ తీసుకోవడం వంటివి చేస్తే.. వీసా సంబంధిత కఠిన సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు. అలాగే అక్కడ వసతికి సంబంధించిన అంతరాయలను కూడా సులభంగా నివారించుకోగలుగుతారు. కఠినతరమైన సమస్యలు, ఆంక్షలు అటెన్షన్‌తో ఉండి, నేర్పుగా పని చక్కబెట్టుకోవడం ఎలాగో నేర్పిస్తాయే గానీ భయాందోళనలతో బిక్కుబిక్కుమని గడపటం కాదని నిపుణులు చెబుతున్నారు.-చిట్వేల్ వేణుగమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్ఆర్ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.(చదవండి: ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా! -
ట్రంప్ టెర్రర్.. డేంజర్ లో డాలర్ డ్రీమ్స్
-
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్‌లో చదువుకుంటున్న సురేష్‌ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్‌లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్‌టైమ్ జాబ్స్‌ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్‌టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
ట్రంప్ దూకుడు.. మన విద్యార్థుల్లో ఆందోళన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలామంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్‌టైమ్‌గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్‌టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ధీమా పోయింది.. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు. ‘‘రూ.42 లక్షలు అప్పు చేసి మరీ వచ్చా. కాలేజీ కాగానే చిన్న కఫేలో రోజుకు ఆరు గంటలు పని చేసేవాన్ని. గంటకు ఏడు డాలర్ల చొప్పున ఇచ్చేవారు. నెలవారీ ఖర్చులు హాయిగా వెళ్లిపోయేవి. కానీ ఇలా అనధికారికంగా పని చేస్తున్న వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియడంతో గత వారం రాజీనామా చేశా’’ఇల్లినాయీ వర్సిటీకి చెందిన ఓ భారతీయ విద్యార్థి చెప్పారు. ‘‘ఇప్పటికే నా పొదుపులో చాలావరకు వాడేశా. రూమ్మేట్స్ నుంచి అప్పు తీసుకుంటున్నా. ఇంకెంతకాలం నెట్టుకురాగలనో తెలియడం లేదు’’అని టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మరో విద్యార్థి వాపోయాడు. ఈ అనిశ్చితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతోంది. అతి పెద్ద విద్యార్థి సమూహం... అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నివేదిక ప్రకారం 2022–23లో 2.69 లక్షల భారత విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే అది ఏకంగా 35% అధికం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు!
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది లక్ష మంది విద్యార్థులుఅంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. కోర్టు చెప్పినా... విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్‌ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి చర్చలు.. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. ప్రశ్నార్థకంగా భవిష్యత్...అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్‌లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్‌టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా
ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా. అగ్రరాజ్యంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం ప్రపంచవ్యాప్తంగా యువత కల. అమెరికాకు విద్యార్థులను పంపించడంలో చైనా ముందంజలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ దక్కించుకుంది. అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో నిలవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ‘ఓపెన్ డోర్స్’సోమవారం తమ నివేదికలో వెల్లడించింది. 2022–23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థులే అధికంగా ఉండేవారు. ఆ తర్వాతి స్థానం భారతీయ విద్యార్థులది. సంవత్సరం తిరిగేకల్లా పరిస్థితి మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు, రెండో స్థానంలో చైనా విద్యార్థులు ఉన్నారు. ⇒ 2023–24లో అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022–23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి ఏకంగా 23 శాతం పెరిగింది. ⇒అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతం కావడం గమనార్హం. ⇒ఇండియా తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలున్నాయి. ⇒చైనా విద్యార్థులు 2.77 లక్షలు, దక్షిణ కొరియా విద్యార్థులు 43,149, కెనడా విద్యార్థులు 28,998, తైవాన్ విద్యార్థులు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ⇒2008/2009లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమైంది. ⇒ ఒక విద్యా సంవత్సరంలో 3,31,602 మంది అమెరికాలో చదువుకుంటుండడం ఇదే మొదటిసారి. ⇒అంతర్జాతీయ గ్రాడ్యుయేట్(మాస్టర్స్, పీహెచ్డీ) విద్యార్థులను అమెరికాకు పంపుతున్న దేశాల జాబితాలో ఇండియా వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలుస్తోంది. ఇండియన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19 శాతం పెరిగి 1,96,567కు చేరుకుంది. ⇒ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరింది. ఇండియన్ నాన్–డిగ్రీ విద్యార్థుల సంఖ్య 28 శాతం తగ్గిపోయి 1,426కు పరిమితమైంది. ఓపెన్ డోర్స్ రిపోర్టును ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ప్రచురించింది. ఈ సంస్థను 1919లో స్థాపించారు. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై ప్రతిఏటా సర్వే నిర్వహిస్తోంది. వారి వాస్త వ సంఖ్యను బహిర్గతం చేస్తోంది. 1972 నుంచి యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చరల్ అఫైర్స్ కూడా సహకారం అందిస్తోంది. -
ట్రంప్ 2.0 అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్ ఏంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్ కంటున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.ట్రంప్ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.లే ఆఫ్.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో హెచ్1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరిఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి. ఇదీ చదవండి : ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.- సింహబలుడు హనుమంతు -
విదేశాల్లో.. ‘త్రివర్ణ’ విద్యా పతాక!
నూతన విద్యావిధానంలో భాగంగా విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు భారత్ తలుపులు బార్లా తెరిచింది. అదేసమయంలో విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతక రెపరెపలకూ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) తమ క్యాంపస్‌లను దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ‘వాణిజ్య సంప్రదింపులు’ అనే కొత్త సబ్జెక్ట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ ప్రకటించారు. విదేశాల్లో క్యాంపస్‌లను స్థాపించాలనుకునే భారతీయ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం2021 నుంచి అడుగులు...! విదేశాల్లో భారతీయ విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుపై 2021లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐఐటీల్లోని డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 1:10 నిష్పత్తిలో విద్యార్థులను తీసుకోవాలని, ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని ఇలా కొన్ని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇక గతేడాది దేశానికి చెందిన ప్రభుత్వ రంగ ఉన్న విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎం విదేశాల్లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దుబాయ్, టాంజానియా, ఈజిప్‌్ట, ఆఫ్రికా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆయా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఐఐటీ ఢిల్లీ – యూఏఈలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, విదేశాల్లో భారతీయ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ముందుకొచి్చంది ఐఐఎఫ్‌టీ మాత్రమే.విదేశాల్లో భారత్‌కు చెందిన 10 ప్రైవేట్ వర్సిటీలు1. అమిత్ యూనివర్సిటీ: 2013లో దుబాయ్‌లో ఈ క్యాంపస్ ఏర్పాటైంది. విదేశీ విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.2. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2000లో ఈ వర్సిటీ ఏర్పాటుచేసింది. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో వివిధ కోర్సులను అందజేస్తోంది. అక్కడి వర్సిటీల్లో టాప్–10లో కొనసాగుతోంది. 3. ఎస్పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్: 2004లో దుబాయ్, సింగపూర్, సిడ్నీ దేశాల్లో వర్సిటీలను ఏర్పాటు చేసింది. 4. బిట్స్ పిలానీ: దుబాయ్‌లో 2000లో ఈ సంస్థ ఏర్పాటైంది. భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో.. దుబాయ్‌లోని అంతే క్రేజ్ కొనసాగుతోంది. ఇక్కడ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 5. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: 2010లో దుబాయ్‌లో సేవల్ని ప్రారంభించిన ఎస్ఆర్ఎం.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. 6. మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 2013లో రువాండాలో ఏర్పాటైంది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐటీలో పీజీ, ఎంబీఏ కోర్సులను అందిస్తోంది. 7. అమృత విశ్వ విద్యాపీఠం: దుబాయ్‌లో 2015లో ఈ యూనివర్సిటీ సేవలు ప్రారంభించింది. విభిన్న కోర్సుల్ని అందిస్తోంది. 8. సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ: దుబాయ్‌లో 2008లో క్యాంపస్ ఏర్పాటు చేసింది. 9. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్: దుబాయ్‌లో 2002లో మొదలైంది. 10. విట్ యూనివర్సిటీ: 2017లో తన సేవల్ని దుబాయ్‌లో విస్తరించింది. భారత్‌లోనూ విదేశీ క్యాంపస్లుఉన్నత విద్యకోసం విదేశాలు వెళుతున్న భారతీయల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో... విదేశీ విద్యా సంస్థలే భారత్‌కు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం అనుమతులిచ్చేందుకూ సిద్ధంగా ఉంది. ఈక్రమంలోనే దేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ముందుకొచ్చింది. తమ క్యాంపస్‌ను గుర్గావ్లో ఏర్పాటు చేయనున్నామని, జూలై 2025లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఇలా విదేశాల్లో విద్యా ‘త్రివర్ణ’ పతాకను ఎగురవేసేందుకు భారత్ అడుగులు వేస్తుండగా, విదేశీ విద్యాసంస్థలు సైతం భారత్‌లో వర్సిటీల స్థాపనకు సిద్ధమవుతున్నాయి. టాప్–10లో స్థానమే లక్ష్యం..చదువుల్లో నాణ్యత, ఉద్యోగవకాశాలు, సాంస్కృతిక అనుకూలత వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల్లో జెండా పాతేందుకు దేశీయ వర్సిటీలు సిద్ధమవుతున్నాయి. ఆసక్తి, అభిరుచి, డిమాండ్, ఫ్లెక్సిబిలిటీ, ఆర్థిక స్థోమత మొదలైనవి పరిగణనలోకి తీసుకొని ఆ దేశ విద్యార్థులకు అవసరమయ్యే కోర్సుల్ని ప్రవేశపెడుతూ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా.. విదేశాల్లోనూ పాగా వేస్తూ.. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ టాప్–10లో భారతీయ విశ్వవిద్యాలయాలే ఉండే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ఫాస్ట్ ట్రాక్ వీసాలకు కెనడా మంగళం
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్డీఎస్ను నిలిపేశామని వివరణ ఇచ్చింది. -
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్‌తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్‌మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు!
ఒట్టావా: కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇకపై ఒక వారమంతా కలిపి 24 గంటలపాటు మాత్రమే కాలేజీక్యాంపస్ బయట పనిచేసే అవకాశం కలి్పస్తామని కెనడా ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. కోవిడ్ సంక్షోభకాలంలో చిరు ఉద్యోగాల్లో తీవ్రమైన కొరత నెలకొనడంతో ఉద్యోగసంక్షోభాన్ని నివారించేందుకు కెనడా ప్రభుత్వం విద్యార్థులపై ఉన్న ‘వారానికి 20 గంటల పని’పరిమితిని ఎత్తేసింది. దాంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఎక్కువ గంటలపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేవారు. దీంతో విద్యార్థుల అద్దె, సరుకులు, ఇతరత్రా ఖర్చుల భారం కాస్తంత తగ్గింది. వారానికి 20గంటల పని పరిమితికి ఇచి్చన సడలింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిసింది. ఈ పరిమితికి మరో నాలుగు గంటలు జత చేసి ‘వారానికి 24 గంటల నిబంధన’ను తీసుకొస్తున్నారు. ఇది ఈ వారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో కెనడాలోని భారతీయ విద్యార్థులను ఆర్థిక కష్టాలు మళ్లీ చుట్టుముట్టనున్నాయి. 2022 ఏడాదిలో కెనడాకు 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు రాగా అందులో 2.26 లక్షల మంది భారతీయులేకావడం గమనార్హం. విద్యార్థి వీసాల మీద ప్రస్తుతం కెనడాలో 3.2 లక్షల మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు(గిగ్ వర్కర్లు)గా పనిచేస్తూ కెనడా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ఆఫ్–క్యాంపస్ ఉద్యోగాలతో అక్కడి విదేశీ విద్యార్థుల చేతికొచ్చే చిన్న మొత్తాలు.. విద్యార్థుల నెలవారీ కనీస అవసరాలు తీర్చేవి. పనివేళల నిబంధనల ప్రకారం ఒకేసారి డ్యూటీలో గరిష్టంగా 8 గంటలే పనిచేయొచ్చు. ఈ లెక్కన కొత్త నిబంధన ప్రకారం భారతీయ విద్యార్థులకు వారంలో కేవలం మూడ్రోజులే పని దొరికే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది మే నెల నుంచి కొత్త నిబంధనల ప్రకారం గంటకు 17.36 కెనడియన్ డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నారు. గత ఏడాది ఈ వేతనం 16.65 కెనడియన్ డాలర్లుగా ఉండేది. దీంతో టొరంటో వంటి ఖరీదైన నగరాల్లో చదువుకుంటూ అక్కడే ఉండే మన విద్యార్థులకు ఆర్థిక ఇక్కట్లు పెరిగే ప్రమాదముంది. ‘‘ఇంత తక్కువ గంటల పనితో చేతికొచ్చేదెంత? నెలవారీ సామగ్రి కొనడం కూడా కష్టమే’’అని భారతీయ విద్యార్థి నీవా ఫతర్ఫేకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘యార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో సరి్టఫికేట్ కోర్సు చేస్తున్నా. ఇప్పుడున్న ఖర్చులతో విడిగా అద్దెకుండటం చాలా కష్టం. అందుకే స్నేహితుల గదిలోకి మారా. అక్కడే సెనేకా కాలేజీలో బ్రాండ్ మేనేజ్మెంట్ చదువుకుంటా’అని నీవా చెప్పారు. ‘‘కనీస ఆదాయం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలరు. ఎలాంటి వ్యవస్థలోనైనా సమానత్వం పాటించాలి’’అని బార్బరా షెలిఫర్ స్మారక క్లినిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లాయర్ అయిన దీపా మాటో చెప్పారు. -
70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ
టోరంటో: కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థులోగుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70 వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైఖరి మార్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసన దీక్షలకు దిగుతున్నారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియా తదితర ప్రావిన్స్‌ల్లో దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులే ఉన్నారు. కొత్త జీవితం నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టిన వీరంతా ఇప్పుడు దినదినగండంగా బతుకున్నారు.స్పందన శూన్యం స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్ల సంఖ్యను భారీగా కుదించాలని, పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్లను కనీసం 25 శాతం తగ్గించాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఈమేరకు ఇటీవలే మార్పులు చేసింది. 70 వేల మంది విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్ల గడువు ఈ ఏడాది ఆఖరు నాటికి ముగిసిపోతుంది. వాటిని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. దాంతో వారంతా బయటకు వెళ్లక తప్పదు. దాంతో దేశవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. వర్క్ పర్మిట్ల గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టపడడం లేదు.ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ శాసనసభ భవనం ఎదుట గత మూడు నెలలుగా ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులపైనా పరిమితి విదేశాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చిపడుతుండడంతో కెనడాలో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు అందరికీ అందడం లేదు. అందుబాటులో ఉన్న వనరులు సరిపోని పరిస్థితి. అందుకే విదేశాల నుంచి వలసల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థుల రాకను చట్టబద్ధంగానే అడ్డుకుంటోంది.రాబోయే రెండేళ్లపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ పర్మిట్ అప్లికేషన్లను పరిమితంగానే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కేవలం 3.60 లక్షల స్టడీ పర్మిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అంచనా. గత ఏడాది కంటే ఇది 35 శాతం తక్కువ కావడం గమనార్హం. పోస్టుగ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ల కోసం విదేశీ విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవద్దని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ సూచించారు. తక్కువ వేతనాలకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై పరిమితి విధించబోతున్నట్లు కెనడా ప్రధానమంత్రి కెనడా జస్టిన్ ట్రూడో సోమవారం వెల్లడించారు. -
విదేశీ విద్యపైనే మోజు!
విదేశాల్లో చదువుకునేందకు ఇష్టపడే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మనదేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు విదేశాలకు భారీగా తరలిపోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతోంది. దీని కారణంగా భారతదేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశాల్లో చదువుకుంటూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు డబ్బును తిరిగి భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్ల కరెంట్ అకౌంట్ లోటును తెచ్చిపెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నదాని ప్రకారం గత పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించిన వ్యయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2014–15లో రూ.20,597 కోట్ల నుంచి 2023–24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వేళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. మన విద్యార్థులు ఇష్టపడుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే, దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే. నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది. 2014–15లో 21 శాతం నుంచి 2021–22లో 28శాతానికి పెరిగింది. 2014–15తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మలేషియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్‌కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో ఆఫ్ఘనిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021–22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని, బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్ని చేసినా ప్రయోజనం స్వల్పమే..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ను తెచ్చింది. ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అనేక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే యూజీసీ సైతం ద్వంద్వ, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లను అనుమతించేలా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. 2018లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అత్యుత్తమ స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందించేలా రూపొందించింది. అయితే భాగస్వామ్య దేశాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విదేశీ విద్యార్థులను దేశానికి ఆకర్షించడంలో ఈ కార్యక్రమం నత్తనడకన సాగడంతో విఫలమైంది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2014–15 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరాల వరకు విదేశీ విద్యార్థుల నమోదు కేవలం 16.68శాతం మాత్రమే పెరిగిందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా చెబుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఎఫెక్ట్‌తో విదేశీ విద్యార్థుల సంఖ్య 48,035కు, 2021–22లో 46,878కి తగ్గింది. విదేశీ విద్యకు రుణాలు పెరిగాయి..దేశంలో ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతుండటంతో డెమోగ్రాఫిక్ సమతౌల్యం దెబ్బతింటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆదాయం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు వంటివి లాభాలను సృష్టిస్తున్నాయి. నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు సైతం విద్యా రుణాలను గణనీయంగా పెంచాయి. ఫలితంగా విదేశాల్లో ఫీజులు చెల్లించే సామర్థ్యం పెద్ద సమస్య కాకుండాపోయింది. – మహేశ్వర్ పెరి, ఛైర్మన్,కెరీర్స్ 360 సీఈవో దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల క్షీణత..భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్‌లో విద్యా సంబంధిత అంశాల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం తగ్గింది. 2014–15లో రూ.4,345 కోట్ల నుంచి 2023–24కు రూ.2,068 కోట్లకు పడిపోయింది. అయితే 2022–23తో పోలిస్తే కేవలం విదేశీ మారకపు ఆదాయం స్వల్పంగా పెరిగింది. కోవిడ్ తర్వాత 2021–22లో రూ.912 కోట్ల కనిష్ట స్థాయి నుంచి పుంజుకుంది. అయినప్పటికీ 2014–15తో పోలిస్తే చాలా తక్కువగానే నమోదైంది. -
ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: గత అయిదేళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సోమవారం సమాధానమిచ్చారు.2019 నుంచి విదేశాల్లో వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న 633 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు తెలిపారు. ఈ మరణాలు 41 దేశాల్లో జరగ్గా.. కెనడాలో అత్యధికంగా 172 మంది, అమెరికాలో 108 మంది భారతీయ విద్యార్ధులు ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కెనడా, యూఎస్ తరువాత, అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో యూకే (58), ఆస్ట్రేలియా (57), రష్యా (37), జర్మనీ (24) ఉన్నాయి. పొరుగున ఉన్న పాక్‌లోనూ ఒకరు మరణించారు.అయితే వీరంతా ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి వివిధ కారణాల వల్ల చనిపోయినట్లు చెప్పారు. దీనికితోడు విదేశాల్లో జరిగిన దాడుల్లో 19 మంది మరణించగా.. అత్యధికంగా తొమ్మిది మంది కెనడాలో, ఆరుగురు అమెరికాలో ప్రాణాలు విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.అయితే విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించడం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు. గత మూడేళ్లలో 48 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. వారి బహిష్కరణకు గల కారణాలను అమెరికా అధికారులు అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
దేవరపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే సాయిసూర్య అవినాష్ (26) సోమవారం వాటర్‌ఫాల్స్‌లో పడి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంటుండగా, 2023 జనవరిలో ఆమె సోదరుడు సాయి సూర్య అవినాష్ ఉన్నత చదువు (ఎంఎస్)కు అమెరికా వెళ్లాడు. అక్క ఇంటి వద్ద ఉంటూ ఉన్నత చదువుకుంటున్నాడు. ఆదివారం అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కుటుంబాలూ వాటర్‌ఫాల్స్‌కు వెళ్లాయి. అక్కడ సాయిసూర్య అవినాష్ ప్రమాదవశాత్తూ వాటర్‌ఫాల్స్‌లో పడి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అవినాష్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు రెట్టింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజును రెట్టింపునకు మించి పెంచింది. ప్రస్తుతం 710 డాలర్లు (రూ.59,255)గా ఉన్న ఫీజును 1,600 డాలర్లు (రూ.1.33 లక్షల)కు పెంచింది. పెంచిన ఫీజులు అమలవుతాయని జూలైæ ఒకటో తేదీ నుంచి తెలిపింది. దీని ప్రభావం ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై పడనుంది. ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థుల్లో భారతీయులది రెండో స్థానం. 2023 ఆగస్ట్ నాటికి 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ తెలిపింది. ఇకపై విదేశీ విద్యార్థులు బ్రిటన్ వంటి దేశాలను ఎంచుకోవచ్చంటున్నారు. కునే బ్రిటన్‌లో స్టూడెంట్ వీసా ఫీజు 900 డాలర్లు(రూ.75 వేలు)గా ఉంది. -
రష్యాలో నదిలో మునిగి... మన విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: రష్యాలోని వెలికీ నోవ్గోరోడ్ ప్రాంతంలోని విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న నలుగురు భారత వైద్య విద్యార్థులు వోల్ఖోవ్ నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్టు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒక మహిళా విద్యారి్థని కాపాడి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థులంతా వెలికీ నోవ్గోరోడ్ స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు. మృతులంతా మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారు. మృతుల్లో జియా, జిషాన్ అక్కాతమ్ముళ్లు. నది ఒడ్డున వాకింగ్ తర్వాత వారంతా నదిలోకి దిగారు. ఈత కొడుతుండగా జిషాన్ తమ కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఈత వద్దని కుటుంబసభ్యులు ఫోన్లో వారిస్తుండగానే జియా మునగడం, కాపాడేందుకు ప్రయతి్నస్తూ మిగతావారు కూడా నదిలో కొట్టుకుపోవడం కాల్లో రికార్డయింది. మృతదేహాల తరలింపు కోసం భారత కాన్సులేట్ ప్రయత్నిస్తోంది. -
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భరతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.🚨 Indian students in Prince Edward Island, a province in Canada, are protesting as they face being deported to India after a sudden change in the provincial immigration rules. 🇮🇳🇨🇦 pic.twitter.com/sSfd2OOH5h— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితుల ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు. దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు’’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ నిరసన రెండో వారంలో అడుగుపెట్టిందని నిరసన తెలుతున్న భారతీయ విద్యార్థులు తెలిపారు. ‘‘మేము చేపట్టిన నిరసన రెండో వారంలోకి చేరింది. అంతే ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు పారదర్శకత కావాలి. నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఓ భారతీయ విద్యార్థి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధలను మార్పు చేసింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావటంతో హెల్త్‌కేర్, నివాస సదుపాయాలపై ప్రతికుల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో వర్క్ పర్మిట్లు రద్దై, తాము బహిష్కరణ ఎదుర్కొవల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో చదువు.. వీసాకు కొత్త రూల్
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపించాలి.నాలుగు సార్లు పెంపుఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండేది.ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
భద్రత ఉంటేనే అమెరికా చదువులకు!
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తమ పిల్లలను పంపే తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడి భద్రతపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో డిగ్రీలకన్నా తమ పిల్లలు భద్రంగా ఉంటారా లేదా అనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల ఉదంతాల నేపథ్యంలో ఈ తరహా జాగ్రత్త కనిపిస్తోంది. ఈ క్రమంలో సవాలక్ష సందేహాలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయని అమెరికా వర్సిటీల్లో మన విద్యార్థులు ప్రవేశాలు పొందడంలో సాయం చేసే కన్సల్టెంట్లు చెబుతున్నారు. చేర్చాలనుకునే వర్సిటీలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుగా ఓ వ్యక్తిని పంపి అక్కడి పరిస్థితుల గురించి వాకబు చేయిస్తున్నారు. 2024 అడ్మిషన్ల ఫలితాలు వెల్లడువుతున్న తరుణంలో ఇలాంటి భయాలు తల్లిదండ్రుల్లో ఎక్కువయ్యాయని కన్సల్టెంట్లు అంటున్నారు. అమ్మాయిలను అమెరికాలో పైచదువులకు పంపే తల్లిదండ్రులు మరింత ఎక్కువగా విచారణ చేయిస్తున్నారని బెంగుళూరుకు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో ఆదర్శ ఖండేల్వాల్ తెలిపారు. ‘ప్రస్తుతం అడ్మిషన్ ఫలితాలు వెలువడుతున్నాయి. 2024లో భద్రత అనేది ఒక ప్రధాన అంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. క్రైం రేటుపై వాకబు.. అమెరికాలోని ఏయే యూనివర్సిటీల పరిధిలో ఎంత క్రైం రేటు ఉంది? ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? డ్రగ్స్ ప్రభావం ఏమైనా ఉందా? అనే అంశాలను తల్లిదండ్రులు ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం పిల్లలను పంపే తల్లిదండ్రుల్లో నేరాలపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. తొలిసారి దేశానికి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని విదేశీ కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి. షికాగో, బోస్టన్, ఇండియానా వంటి ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులతోపాటు అక్కడ ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా నివేదికలు ఇవే వెల్లడించడంతో ఈ ప్రాంతాలకు పంపాలంటే తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. సమస్యాత్మకం కాని వర్సిటీల వైపే అమెరికన్ యూనివర్సిటీలకు వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువ సమస్యాత్మకమైన వాటినే భారతీయ విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీనిపై సమగ్ర అవగాహన కలిగాకే విదేశీ చదువులపై ప్రణాళిక రచిస్తున్నారని విదేశాల్లోని స్టడీ కెరీర్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు కరణ్ గుప్తా తెలిపారు. పెద్ద నగరాలు లేదా తక్కువ సమస్యాత్మకమైనవిగా గుర్తించే యూఎస్ వర్సిటీల ఆఫర్లను మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఫ్లోరిడాలోని ‘చి’ యూనివర్సిటీని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతంపై సమగ్ర సమాచారం సేకరించిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఆ వర్సిటీలో కాకుండా ఎన్‌వైయూ యూనివర్సిటీ మంచిదని అందులో చేర్పించారు. 95% కేసుల్లో, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో కన్సల్టెంట్ గుప్తా తెలిపారు. ఆరిజోనా, ఒహాయో, టెక్సాస్, లాస్ ఏంజిలెస్, కాలిఫోర్నియా, డాలస్ వంటి ప్రాంతాలకు తమ పిల్లలను పంపాలనుకొనే తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు కోరుతున్నారు. వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో చేరాలని ఇష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం దానికి బదులుగా బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్‌ను తీసుకోవాలని పట్టుబట్టారు, విద్యార్థి మేనమామ అక్కడ నివసిస్తున్నాడని, అది భద్రత కల్పిస్తుందని భావించారు. కన్సల్టెన్సీల్లోనూ ఆందోళన భారతీయ విద్యార్థులపై ఆందోళనల నేపథ్యంలో కన్సల్టెన్సీలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పించే రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కన్సల్టెన్సీలన్నీ కలిపి తొలిసారిగా విద్యార్థుల భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించాయి. ముందుగా విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి. ఆన్లైన్లో ఆయా ప్రదేశాల సమాచారం అందుబాటులోకి తేవడంతోపాటు అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రుల బృందాలు కూడా ఆయా వర్శిటీలను సందర్శించేందుకు, అక్కడి సీనియర్ విద్యార్థులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. -
యూఎస్‌లో భారత స్టూడెంట్స్ మరణాలు.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికాలో వరుసగా జరిగిన ఐదుగురు భారత విద్యార్థుల మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. ‘చనిపోయిన ఐదుగురు భారత విద్యార్థుల్లో ఇద్దరే భారత పౌరులు. మిగిలిన ముగ్గురు భారత సంతతికి చెందిన అమెరికా పౌరులే. డ్రగ్స్‌కు బానిసైన ఇల్లు లేని ఓ వ్యక్తి వివేక్ సైనీ అనే భారత విద్యార్థిని తలపై సుత్తితో 50సార్లు కొట్టి దారుణంగా చంపాడు. సిన్సినాటిలో జరిగిన మరో ఘటనలో మరో భారత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీరు కాక భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ ఘటనల్లో మరణించారు. వీరిలో వివేక్ సైనీ హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. విచారణ వేగంగా జరుగుతోంది.సిన్సినాటి ఘటనలో విద్యార్థి మృతికి సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టుల కోసం వేచి చూస్తున్నాం. భారత విద్యార్థుల మరణాలపై అమెరికాలోని ఆయా ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సాయం చేస్తున్నాం’ అని జైస్వాల్ తెలిపారు. ఇదీ చదవండి.. ఢిల్లీలో రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు -
విదేశాల్లో విద్యార్థుల మరణాలపై కేంద్రం పకటన
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత ఐదేళ్లలో.. విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. మూడోరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా.. అత్యధికంగా 91 మంది కెనడా దేశంలో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లండ్‌లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్‌లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది. అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దేశంలో ఇప్పటివరకు అసలు ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు -
భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్ శివారులోని ఆమెర్ కోటను మాక్రాన్ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో -
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్‌లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్‌టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్‌లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
కనువిప్పు కలిగించే కోత!
కెనడాతో మరో తంటా వచ్చి పడింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై రెండేళ్ళ పాటు పరిమితులు విధిస్తున్నట్టు ఆ దేశం సోమవారం ప్రకటించింది. వీసాల సంఖ్య తగ్గిందంటే, కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుందన్న మాట. ఈ వీసాల కోత అన్ని దేశాలకూ వర్తించేదే అయినా, మనవాళ్ళ విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కెనడా గడ్డపై ఓ ఖలిస్తానీ తీవ్రవాది హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే భారత – కెనడా దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. ఆ కథ కొలిక్కి రాకముందే, విదేశీ స్టూడెంట్ వీసాలకు కెనడా చెక్ పెట్టడం ఇంకో కుదుపు రేపింది. ఇటీవల కెనడాకు వెళ్ళి చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అతి పెద్ద వర్గాలలో ఒకటి భారతీయ విద్యార్థి వర్గం. 2022లో 2.25 లక్షల పైచిలుకు మంది మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్ళారు. వివరంగా చెప్పాలంటే, ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41 శాతానికి పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక, 2023 సెప్టెంబర్ నాటి కెనడా సర్కార్ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులే. 12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తీరా ఇప్పుడీ కొత్త నిబంధనలు అలా కెనడాకు వెళ్ళి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి. 2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లిచ్చింది. దశాబ్ది క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలకు తగ్గనుంది. అంటే, 35 శాతం కోత పడుతుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలకు ఇది వర్తించకపోవడం ఊరట. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. గతంలో కెనడాలో పీహెచ్డీ, మాస్టర్స్ కోర్సులు చేస్తుంటే మూడేళ్ళ వర్క్ పర్మిట్ దక్కేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరి దోవ. ప్రధానంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే, లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక ఆ వీలుండదు. స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు... కెనడాకూ దెబ్బ తగలనుంది. పెద్దయెత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా 1640 కోట్ల డాలర్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండి పడనుంది. అలాగే, జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థీ 20 వేల కెనడా డాలర్ల విలువైన ‘గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్’ (జీఐసీ) తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికీ నష్టమే. అలాగే, దాదాపు లక్ష ఖాళీలతో కెనడాలో శ్రామికశక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గడచిన 2023లో ఒక్క ఆహారసేవల రంగంలో 11 లక్షల మంది కార్మికు లుంటే, వారిలో 4.6 శాతం మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామికశక్తి కొరత పెరుగుతుంది. అయినా, కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న ఈ కోత నిర్ణయం వెనుక అనివార్యతలు అనేకం. చదువు పూర్తి చేసుకొని, అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం గనక విదేశీ విద్యకు కెనడా పాపులర్ గమ్యస్థానం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి, అద్దెకు అపార్ట్ మెంట్లు దొరకని పరిస్థితి. నిరుడు కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7 శాతం పెరిగాయి. గృహవసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని అతిగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా జాతీయుల భావన. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభించింది. పైగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి, వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. విద్యార్థుల సంఖ్యను వాటంగా చేసుకొని, కొన్ని సంస్థలు కోర్సుల నాణ్యతలో రాజీ పడుతున్న వైనానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్య చేపట్టామని కెనడా మాట. తాజా పరిణామం భారత్‌కు కనువిప్పు. కెనడాలో పలు ప్రైవేట్ సంస్థలు ట్యూషన్ ఫీజులేమో భారీగా వసూలు చేస్తూ, నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో, మరో విదేశానికో వెళ్ళి, ఎంత ఖర్చయినా పెట్టి కోర్సులు చేసి, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. 2025 నాటికి భారతీయ కుటుంబాలు పిల్లల విదేశీ చదువులకై ఏటా 7 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయని అంచనా. చిన్న పట్నాలు, బస్తీల నుంచీ విదేశీ విద్య, నివాసంపై మోజు పెరుగుతుండడం గమనార్హం. నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ వాస్తవాలు గ్రహించి, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే, అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్ళు మరో దేశం దిక్కు చూడాల్సిన ఖర్మ తప్పదు! -
ఇండియన్ స్టూడెంట్స్ మరణాలు ఎక్కువగా ఆ దేశంలోనే
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో కెనడా వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల మరణించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహజ మరణాలతో పాటు యాక్సిడెంట్లు, ఆరోగ్య పరమైన సమస్యలతో స్టూడెంట్లు మృతిచెందుతున్నట్లు తెలిపింది. అయితే వీటిలో కొన్ని అనుమానాస్పద మరణాలున్నట్లు పేర్కొంది. విదేశాల్లోని భారత విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని కేంద్రమంత్రి మురళీధరన్ చెప్పారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విదేశాల్లో విద్యార్థులు మరణిస్తే వాటిపై ఆయా దేశాల అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల మృతికి కారణమైన వారికి సరైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల్లో మృతి చెందతున్న భారత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఎందుకుంటోందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని విదేశాంగ శాఖ అధికారి అరిందమ్ బగ్చి చెప్పారు. ఇదీచదవండి..ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..! -
లండన్‌లో భారత విద్యార్థి మృతి..
నవంబర్ నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి కథ విషాదాంతమైంది. లండన్‌లోని థేమ్స్ నదిలో 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కాగా ఉన్నత చదువుల కోసం మిత్‌కుమార్ రెండు నెలల క్రితం (సెప్టెంబరు) యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతం సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు కనుగొన్నారు. అతను ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ అతను హత్యకు గురవ్వలేదని, అనుమానాస్పద మృతి కాదని పోలీసులు చెబుతున్నారు. మిత్‌కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు అతడి బంధువు పార్త్ పటేల్ అనే వ్యక్తి వెల్లడించాడు. ‘గో ఫండ్ మీ’ ఆన్లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని తెలిపాడు. వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి(4 లక్షల 76 వేలు) పైగా వచ్చాయని తెలిపాడు. మిత్‌కుమార్ వయసు 23 సంవత్సరాలని, 19 సెప్టెంబర్ 2023న యూకే వచ్చాడని చెప్పాడు. నవంబర్ 20న షెఫీల్డ్ హాలమ్ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉందని, అమెజాన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కూడా లభించిందని తెలిపాడు. ఇంతలోనే నవంబర్ 17న డైలీ వాక్కు వెళ్లిన పటేల్.. తిరిగి ఇంటికి వెళ్లలేదని చెప్పాడు. నవంబర్ 21న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారని.. ఉన్నత చదువుల కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా చనిపోవడం బాధ కలిగిస్తోందని, అతడి కుటుంబానికి సహాయం చేయాలని భావించామని చెప్పాడు. మిత్‌కుమార్ మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని అన్నాడు. సేకరించిన నిధులను ఇండియాలోని మిత్‌కుమార్ కుటుంబానికి అందిస్తామని చెప్పాడు. -
స్టూడెంట్ వీసాకు అమెరికా కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు
ఢిల్లీ: భారతీయ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా రాయబార కార్యాలయం సవరణలు చేసింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి. ఎఫ్, ఎమ్, జే వీసా ప్రోగ్రామ్‌ల క్రింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్ట్ సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్‌పోర్ట్ నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్ సెంటర్ల వద్ద తిరస్కరిస్తారు. వారి అపాయింట్మెంట్లు రద్దు అవుతాయి. వీసా రుసుమును కూడా రద్దు చేస్తారు. ఎఫ్, ఎమ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. Attention Students! To prevent fraud and abuse of the appointment system, we are announcing the following policy change which will be implemented beginning November 27, 2023. All F, M, and J student visa applicants must use their own passport information when creating a profile… pic.twitter.com/2JqoEg3DJ1 — U.S. Embassy India (@USAndIndia) November 24, 2023 తప్పుడు పాస్‌పోర్ట్ నంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్‌పోర్టు పోవడం లేదా చోరీకి గురైతే కొత్త పాస్‌పోర్ట్ తీసుకున్నవారు, కొత్తగా పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్నవారు.. పాత పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్మెంట్ను అంగీకరిస్తారు. ఇదీ చదవండి: అమెరికాలో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!
ఒట్టావా: ఖలిస్తానీ తీవ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత దేశాల మధ్య సంబంధాలు ఇటీవల అనూహ్య మార్గంలో పయనిస్తున్నాయి. కెనడా ఉన్నత విద్యాసంస్థల్లో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న కారణంగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదుల భారత వ్యతిరేక ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 19వ శతాబ్దం చివరి నుంచీ కెనడాతో పంజాబ్ రాష్ట్రానికి నాటి (బ్రిటిష్ ఇండియా కాలం) నుంచీ చారిత్రకంగా సంబంధాలు ఉండడంతో–తమిళులకు శ్రీలంక ఎలాగో, పంజాబీలకు కెనడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉన్న ప్రాంతంగా మారింది. గత పదేళ్లుగా ఏటా కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరుతున్న విద్యార్థుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే సింహభాగం అనేది తెలిసిందే. భారత విద్యార్థులు కెనడలో తమ విద్యాభ్యాసానికి చేస్తున్న వ్యయం (కోట్లాది డాలర్లు) అక్కడి ప్రావిన్సులను (రాష్ట్రాలను) ఆర్థికంగా నిలబెడుతోంది. ప్లస్ టూ తర్వాత, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల కోసం కెనడా వెళ్లి చదువుతున్న భారత విద్యార్థులు ఏటా దాదాపు 20 బిలియన్ల డాలర్లు (2000 కోట్ల డాలర్లు) ఖర్చుచేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇండియా నుంచి కెనడాకు రావడంతో రెండు దేశాల మద్య సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో అక్కడి విద్యాసంస్థలకు కెనడా సర్కారు కన్నా భారత విద్యార్థులే ఎక్కువ మొత్తంలో ఫీజుల రూపంలో నిధులు సమకూర్చుతున్నారంటే–కెనడాలో భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రాముఖ్యం ఎంతో అర్థమౌతోంది. కెనడా కాలేజీల్లో స్థానిక విద్యార్థులు చెల్లించే ఫీజులకు మూడు రెట్లు ఎక్కువ ఫీజులను భారత విద్యార్థులు చెల్లిస్తున్నారని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే కెనడా ఉన్నత విద్యాసంస్థలు వసూలు చేసే అన్ని రకాల ట్యూషన్ ఫీజుల మొత్తంలో 76 శాతం భారత విద్యార్థుల నుంచే వస్తోందన్న మాట. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్సులోని విద్యాసంస్థలన్నీ భారత విద్యార్థుల ఫీజుల డబ్బుతోనే నడుస్తున్నాయని వార్తలొస్తున్నాయి. విద్యార్థుల నుంచి కెనడాకు 22.3 బిలియన్ డాలర్లు 2022 మార్చిలో కెనడా కాలేజీలు, వర్సిటీల ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల సంఖ్యపై చేసిన ఒక విశ్లేషణ ప్రకారం–ఈ ఉత్తర అమెరికా ఫెడరల్ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో 22.3 బిలియన్ (2230 కోట్ల డాలర్లు) డాలర్ల సొమ్ము పంపుతున్నారు. అంటే, కెనడా ప్రతి సంవత్సరం ఇతర దేశాలకు ఆటోమొబైల్ విడిభాగాలు, కలప, విమానాల ఎగుమతుల ద్వారా సంపాదించేదాని కన్నా అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించేదే ఎక్కువ. ఇక సంఖ్య విషయానికి వస్తే 1990ల చివర్లో కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 40 వేలు కాగా, 2020–21 నాటికి ఈ సంఖ్య 4,20,000కు పెరిగింది. 2009 నుంచీ కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరి చదువులు పూర్తిచేసుకునే పంజాబీ, ఇతర భారత రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య వేగం పుంజుకుంది. ఇండియా నుంచే గాక ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. 2021–22లో కెనడాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల్లో విదేశీ స్టూడెంట్ల సంఖ్య 17.6 శాతం ఉండగా, కెనడా కాలేజీల్లో ఈ అంతర్జాతీయ విద్యార్థల వాటా 22 శాతం ఉంది. ఒంటారియా ప్రావిన్స్ కాలేజీల్లో ఇలాంటి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 2016–17, 2019–20 మధ్య కాలంలో రెట్టింపు కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమంటే–ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే దానికి ఆరు రెట్ల సంఖ్యలో భారత యువతీయువకులు విదేశీ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో చేరుతున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంగ్ సంస్థ ఒకటి అంచనా వేసింది. ఇలా విదేశీ ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇటీవల 7,70,000కు చేరింది. 2024 నాటికి పాశ్చాత్య దేశాలు సహా విదేశాలకు పోయి అక్కడ ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య 18 లక్షలకు చేరుతుందని అంచనా. :::విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ ఇదీ చదవండి: భారత హైకమిషన్‌కు ఖలిస్తాన్ నిరసన సెగ -
స్టూడెంట్స్ పంట పండింది! రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల పంట పండింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్‌కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థులకు 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్ మిషన్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ప్రకటించింది. నాలుగింట ఒకటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ చేసినట్లు యూఎస్ మిషన్ పేర్కొంది. అలాగే తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. చైనాను అధిగమించిన భారత్ 2022లో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక హైలైట్ చేసింది. భారత్ నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్ కూడా.. ఇంతకుముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30,000 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం , రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all… — U.S. Embassy India (@USAndIndia) September 25, 2023 -
కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్‌లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు. Set up helpline for Indian students, NRIs in Canada: Punjab BJP chief urges Centre #India #Canada https://t.co/dT8lYAE9qm — IndiaToday (@IndiaToday) September 23, 2023 'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్దీప్ కౌర్ కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? -
భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు
UK Student Visa యునైటెడ్ కింగ్డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థి , పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్‌ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ ఆమోదం తరువాత పెంచిన ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూఏ హోం ఆఫీస్ పేర్కొంది. దీంతో లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారం పడనుంది. UK హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 నుండి 115 పౌండ్లకు చేరింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా(Study Visa) ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 చేరింది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, 2021-2022లో 120,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు. కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ల ఫీజును 20 శాతం పెంచింది. -
మన పిల్లలకు అండగా నిలుద్దాం
సాక్షి, అమరావతి: అమెరికా వెనక్కు పంపిన భారతీయ విద్యార్థుల్లో కొంత మంది తెలుగు విద్యార్థులూ ఉన్నారనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆరా తీశారు. ఆ విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు.. ప్రభుత్వం వేగంగా స్పందించి పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. విదేశాంగ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించారు. వెనక్కి వచ్చిన విద్యార్థులు వ్యాలిడ్ వీసాలను కలిగి ఉండటంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ను సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఇందుకోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ కేటాయించిందన్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, +91 8632340678, 8500027678 సంప్రదించాలని సూచించారు. లేదా info@apnrts.com, helpline@apnrts.com కు మెయిల్ చేయాలని చెప్పారు. నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదని, విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లాప్టాప్, మొబైల్లో అమెరికా నిబంధనలను ఉల్లంఘించేలా సందేశాలు (పార్ట్‌టైమ్ జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ తదితర) ఉండకూడదని తెలిపారు. ఆ దేశంలోకి ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి, వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ముందుగానే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు తగిన రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని వారు భావిస్తారని చెప్పారు. ఈ విషయాలపై విద్యార్థులు ముందుగానే అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు వెన్నక్కి పంపిస్తున్న అధికారులు
-
చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అమెరికాలో గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత స్థానంలో భారత్ ఉంది. కానీ ఈ పరిస్థితి మరికొన్ని సంవత్సరాల్లోనే మారనుంది. త్వరలోనే భారత్ మొదటి స్థానంలోకి రానుంది. చైనా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలం వరకు అమెరికా విద్యాసంస్థలు చైనా విద్యార్థులను చేర్చుకోవ డానికి అధిక ప్రాధాన్యతనిచ్చేవి. కోవిడ్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా విద్యాసంస్థలు భారత్‌ను తమకు అనుకూలమైన అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తు న్నాయి. స్ప్రింగ్ స్నాప్‌షాట్ పేరిట ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నిర్వహించిన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2020 నుంచి 2023 నాటికి చైనా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 3,68,800 నుంచి 2,53,630కి తగ్గగా.. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య 1.90 లక్షల నుంచి 2.53 లక్షలకు పెరిగినట్లు ఐఐఈ పేర్కొంది. 2030కి 3.94 లక్షల మందితో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది. భారత్ వైపే 57% సంస్థలు మొగ్గు గ్రాడ్యుయేషన్‌తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ఆకర్షించడానికి అమెరికా విద్యాసంస్థలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతి పది మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో నలుగురు విదేశీ విద్యార్థులు ఉండేలా ఈ రిక్రూట్మెంట్ విధానం కొనసాగుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఐఐఈ సర్వే నిర్వహించింది. మొత్తం 527 విద్యాసంస్థల నుంచి డేటా సేకరించింది. సుమారు 57 శాతం సంస్థలు భారత్ విద్యార్థులను ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. 2022–23 కంటే 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి తమకు అధికంగా దరఖాస్తులు అందినట్లు 61 శాతం కాలేజీలు/యూనివర్సిటీలు వెల్లడిస్తే.. మరో 28 శాతం విద్యా సంస్థలు తమకు గత సంవత్సరం వచ్చిన మేరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. మరో 12% విద్యా సంస్థలు మాత్రం తమకు దరఖాస్తులు తగ్గినట్లు తెలిపాయి. అమెరికాకు తగ్గిన ఆదాయం కోవిడ్ తరువాత గడిచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, కోవిడ్ కంటే ముందున్న ఆదాయం రాలేదని ఐఐఈ సర్వే వెల్లడిస్తోంది. కోవిడ్‌కు ముందు 2018 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు వచ్చే ఆదాయం దాదాపు 45 బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో అది రూ. 3.7 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఏ విద్యా సంవత్సరంతో పోల్చినా ఇదే అత్యధిక ఆదాయం. కాగా అప్పట్లో ఏటా దాదాపు 11 లక్షల వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యాభాస్యం కోసం వచ్చేవారని పేర్కొంది. అయితే 2022–23లో విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు 33.8 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అంటే మన కరెన్సీలో ఇది రూ.2.7 లక్షల కోట్లు. అమెరికా విద్యా సంస్థలకు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి పోటీ ఎక్కువ అవుతున్నట్లు సర్వేలో తేలింది. అంటే ఈ దేశాల విద్యా సంస్థల్లో కూడా విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారన్నమాట. ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. టాప్ టెన్ దేశాలివే.. విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఐఐఈ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం చైనా, భారత్, దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికో, నైజీరియా దేశాలు వరుసగా తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్ టెన్ దేశాల విద్యార్థులే కాకుండా ఇతర దేశాల విద్యార్థులను సైతం అమెరికా విద్యాసంస్థలు ఆకర్షిస్తున్నాయి. 2021–22 సంవత్సరంలో 11వ స్థానంలో ఉన్న జపాన్ నుంచి 14 శాతం పెరుగుదల ఉండగా, చైనా నుంచి 8.6 శాతం తగ్గుదల కనిపించింది. 2023లో జపాన్ విద్యార్థుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. నైజీరియా నుంచి కూడా అనూహ్యంగా విద్యార్థులు పెరిగినట్లు ఐఐఈ తెలిపింది ఇక సౌదీ అరేబియా నుంచి 17 శాతం మేర విద్యార్థులు తగ్గారు. అయితే 2030 నాటికి ఈ దేశం నుంచి విద్యార్థులు గణనీయంగా పెరగనున్నారు. తర్వాత నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెరిగి ఆ రెండు దేశాలు టాప్ టెన్‌లో (8, 9 స్థానాల్లోకి)కి రానున్నాయి. ఇంగ్లిష్ మాట్లాడే ఇతర దేశాలకూ విద్యార్థులు విదేశీ విద్యార్థులకు అమెరికానే తొలి ప్రాధాన్యత అయినప్పటికీ..అమెరికాతో పాటు ఆంగ్లం మాట్లాడే ఇతర దేశాలకు కూడా విద్యార్థులు గణనీయ సంఖ్యలో వెళుతున్నారు. ఈ మేరకు ఆమెరికాకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తో పాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు విదేశాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. ఆయా దేశాలు విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయి. – డాక్టర్ ఎస్తేర్ డి బ్రిమ్మర్, ఈడీ, సీఈఓ, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారిన్ స్టూడెంట్ ఎఫైర్స్ -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట
ఒట్టావా: కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట లభించింది. పంజాబ్‌కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ సహా 700 మంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి మన దేశానికి పంపడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు అందేవరకు వారు కెనడాలో ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఫోర్జరీ ఆఫర్ లెటర్లతో విద్యావకాశాలకు అనుమతి సంపాదించి లవ్ ప్రీత్ సహా ఇతర విద్యార్థులు కెనడాకి వచ్చారని కెనడియన్ బోర్డర్ సర్వీసు ఏజెన్సీ (సీబీఎస్ఏ) విచారణలో తేలింది. దీంతో జూన్ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ లవ్ ప్రీత్ సింగ్‌తో పాటు 700 మంది వరకు విద్యార్థులకు నోటీసులు అందాయి. ఒక సంస్థ చేసిన మోసానికి గురైన తాము బాధితులమే తప్ప మోసగాళ్లము కాదని తాము ఎందుకు దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు. జలంధర్‌కు చెందిన కన్సల్టెంట్ బ్రిజేష్ మిశ్రా కెనడాలోని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తప్పుడు ఆఫర్ లెటర్లు సృష్టించి ఆ విద్యార్థుల్ని ఆరేళ్ల క్రితమే కెనడాకు పంపారు. రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్ ఫోర్జరీ అని గుర్తించలేకపోయింది. విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లేవరకు అవి ఫేక్ అని తెలియలేదు. ఆ తర్వాత వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మిశ్రా నమ్మబలికాడు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం జరిపించిన విచారణలో కాలేజీల ఆఫర్ లెటర్స్ ఫోర్జరీ అన్న విషయం బయటపడింది. దీంతో బ్రిజేష్ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్‌ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారింది. -
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో సరస్సులో ఈతకెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15వ తేదీన సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20)లు మరికొందరితో కలిసి మొన్రో సరస్సులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూనే ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఈ నెల 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు సరస్సులో తేలియాడుతూ కనిపించగా వెలికితీశారు. సిద్ధాంత్, ఆర్యన్లు ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరిద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్‌లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
విదేశీ విద్య మరింత భారం.. భారత విద్యార్థులకు కొత్త టెన్షన్!
సాక్షి, అమరావతి: విదేశీ విద్య భారత విద్యార్థులకు మరింత భారమవుతోంది. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక.. కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సహజంగానే ఆ మేరకు రుణాల శాతం కూడా ఎక్కువైంది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. 2020లో ఆ సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాల్లో రాకపోకలపై నిషేధాలు, విద్యా సంస్థల మూత ఇందుకు కారణాలుగా నిలిచాయి. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో ఆ సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. గతేడాది 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అధిక రుణాలు విదేశాల్లో చదువులకోసం వెళ్లే విద్యార్థులు ఫీజుల కోసం అత్యధికంగా ప్రభుత్వ బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థులు ఈ రుణాల ఆధారంగానే విదేశీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 2020లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 23.5 శాతం తక్కువ. కరోనా కారణంగా 2020లో విదేశీ విద్యకు ఆటంకాలు ఏర్పడడంతో విద్యా రుణాల మంజూరు కూడా భారీగా తగ్గింది. 2022లో రుణాల మంజూరు అమాంతం పెరిగింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2021లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 68.2 శాతం అధికం. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు ఇవ్వగా అందులో దాదాపు సగం మేర అంటే రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే. చెల్లించడానికి ఇబ్బందులు ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విద్యా రుణాలపైన పడుతోందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతోందని, దీన్ని తీర్చడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి అధిక వేతనాలు తీసుకుంటున్న వారే తిరిగి కట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అలాంటిది అరకొర వేతనాలు, లేదా అసలు ఉద్యోగమే లేని వారి కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. -
అమెరికాలో 1.99 లక్షల మంది భారతీయ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదుకునేందుకు భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోందని అమెరికా రోవాన్ యూనివర్శిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డారెన్ వాగ్నర్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని స్కైవ్యూలోని ఇండో గ్లోబల్ స్టడీస్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయాన్ని ఆయన గ్లోబల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ అడ్వైజర్ సీఈఓ డాక్టర్ మార్క్ ఎస్ కోపెన్క్సి, ఐజీఎస్ వ్యవస్థాపకుడు చైర్మన్ అశోక్ కల్లం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశం నుంచి ఏడాది 18.9 శాతం విద్యార్థుల పెరుగుదల కనిపిస్తోందని, ప్రస్తుతం అమెరికాలో 1.99 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రస్తుతం 80 శాతం విద్యార్థులు గ్రాడ్యుయేషన్, 20 శాతం అండర్ గ్రాడ్యుయేషన్‌కు వెళ్ళుతున్నారని, 78 శాతం విద్యార్థులు స్టెమ్ ప్రోగ్రామ్‌లను తీసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం అమెరికాలో 1.6 మిలియన్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. రోవాన్ విశ్వవిద్యాలయం 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రభుత్వ సంస్థ అని దీన్ని 1923లో స్థాపించారని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మూడవ విశ్వవిద్యా లయంగా గుర్తింపు సాధించిందన్నారు. అనంతరం నూతన అడ్మిఫన్ల ప్రక్రియపై వారు చర్చించారు. (క్లిక్ చేయండి: సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!) -
Open Doors: విదేశీ విద్య @ అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లే భారతీయ విద్యార్థుల టాప్ చాయిస్ ఇప్పటికీ అమెరికానే! 2021–22లో అమెరికాలో 9.48 లక్షల మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారిలో 21 శాతం (1,99,182 మంది) భారతీయులే! 2020–21తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ కరోనా వల్ల 2020–21లో అమెరికాలో అడ్మిషన్లు తీసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13.2 శాతం తగ్గింది. వైరస్ ప్రభావం తగ్గడంతో 2021–22లో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. భారతీయ విద్యార్థుల సంఖ్య 18.9 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో చైనాదే అగ్రస్థానం. కానీ వారి సంఖ్య 2020–21లో 3.17 లక్షలుండగా 2021–22లో 2.9 లక్షలకు తగ్గింది. అమెరికాలో 9,48,519 మంది విదేశీ విద్యార్థులున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 21.1 శాతం (2 లక్షలు) మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 19.8 శాతం (1.88 లక్షలు) ఇంజనీరింగ్ చదువుతున్నారు. వచ్చే వేసవిలో భారత విద్యార్థులకు 82 వేలకు పైగా వీసాలు జారీ చేస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. గతేడాది 62 వేల వీసాలు జారీ చేసినట్లు ‘మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ పబ్లిక్ డిప్లొమసీ’ గ్లోరియా బెర్బెనా తెలిపారు. -
విదేశీ వర్సిటీల్లో చేరేలా... ‘ఉక్రెయిన్’ విద్యార్థులకు సాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇతర విదేశీ యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సాయపడండి. దేశాలవారీగా వర్సిటీల్లో ఖాళీలు, ఫీజులు తదితర పూర్తి వివరాలతో ఓ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయండి’’ అని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల వైద్య విద్యార్థుల పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు సూచనలపై కేంద్రం వైఖరి తెలపడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన సుమారు 20 వేల మంది విద్యార్థులను యుద్ధ బాధితులుగా పరిగణించాలని వారి తరఫున న్యాయవాది కోరగా విషయాన్ని అంత దూరం తీసుకెళ్లొద్దని ధర్మాసనం సూచించింది. ‘‘వాళ్లు స్వచ్ఛందంగానే ఉక్రెయిన్ వెళ్లారని గుర్తుంచుకోవాలి. పైగా వాళ్లు యుద్ధ రంగంలో లేరు కూడా’’ అని జస్టిస్ గుప్తా అన్నారు. విద్యార్థులకు సాయం చేయడానికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందని మెహతా తెలిపారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలతో భారత్ సంబంధాలు పెట్టుకుందన్నారు. విద్యార్థులు అనుకూలమైన విదేశీ వర్సిటీని ఎలా ఎంచుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. లైజనింగ్ అధికారిని నియమించామని చెప్పగా ఒక్క అధికారి ఉంటే చాలదని పేర్కొంది. వైద్య విద్య పూర్తి చేయాలనుకుంటే విద్యార్థులు ఓ దారి వెతుక్కోవాల్సిందేనని అభిప్రాయపడింది. విదేశీ వర్సిటీలు ప్రవేశాలు కల్పించగలిగితే భారత వర్సిటీలకు ఎందుకు సాధ్యం కాదని విద్యార్థుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. దేశీయ వర్సిటీలపై విద్యార్థులకు హక్కు లేదని ధర్మాసనం బదులిచ్చింది. విచారణను సెప్టెంబరు 23కు వాయిదా వేసింది. -
చైనాలో వైద్య విద్యపై జాగ్రత్త
బీజింగ్: చైనాలో కరోనాతో కారణంగా ఆగిన వైద్య విద్యను కొనసాగించాలనుకునే, అక్కడ కొత్తగా మెడిసన్ చేయాలనుకునే భారత విద్యార్థులకు చైనాలోని ఇండియన్ ఎంబసీ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్కడ చదివిన వారిలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం, చైనా భాషను నేర్చుకోవడం, తిరిగొచ్చాక కఠినమైన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీ) పాసవడం వంటివి దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ► 2015–2021 కాలంలో 40,417 మంది ఎఫ్ఎంజీ పరీక్ష రాస్తే 6,387 మందే గట్టెక్కారు. ► వీరంతా చైనాలోని 45 వర్సిటీల్లో చదివినవారే. ► ఇక నుంచి చైనాకు వెళితే ఈ 45 కాలేజీల్లోనే చదవాలి. అదీ ఇంగ్లీష్ మాధ్యమంలోనే. ► చైనీస్ భాషలో మెడిసన్ చేయకూడదు. ఇంగ్లీష్–చైనీస్ ద్విభాషగా చేసినా చెల్లుబాటు కాదు. ► చైనా అధికారిక భాష పుతోంగ్వాను హెచ్ఎస్కే–4 లెవల్ వరకు నేర్చుకోవాలి. లేదంటే డిగ్రీ ఇవ్వరు. ► చైనాలోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటే మళ్లీ లైసెన్స్‌ను సాధించాలి. ఐదేళ్ల మెడిసిన్ తర్వాత ఏడాది ఇంటర్న్‌షిప్ చేయాలి. తర్వాత చైనీస్ మెడికల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ► చైనా నుంచి మెడికల్ క్వాలిఫికేషన్ పొందాలంటే ముందు భారత్‌లో నీట్–యూజీ పాసవ్వాలి. ► చైనా నుంచి వచ్చే వారూ నీట్–యూజీలో ఉత్తీర్ణత సాధించాకే ఎఫ్‌ఎంజీఈకి అర్హులౌతారు. ► కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగా సంబంధిత పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలి. -
అమెరికా వీసాలు పొందడంలో భారత్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాలు పొందడంలో ఇండియా రికార్డు సృష్టించింది. మిగతా దేశాల కంటే భారతదేశ విద్యార్థులే ఎక్కువ వీసాలు పొందడం గమనార్హం. అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలు మంజూరు చేసినట్లు ‘ద యూఎస్ మిషన్ ఇన్ ఇండియా’ప్రకటించింది. 2022లో ఈ స్థాయిలో వీసాలు పొందిన మరో దేశం లేదని తెలిపింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లోని కార్యాలయాలు కూడా భారతీయ విద్యార్థుల వీసాల జారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయని, మే నుంచి ఆగస్టు వరకూ వీటిని వీలైనంత వేగంగా జారీ చేసే ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులు సకాలంలో అమెరికాలో విద్యాభ్యాసం మొదలు పెట్టే వీలు కలిగిందని వివరించింది. ‘‘కోవిడ్–19 కారణంగా గతేడాది మాది రిగా వీసాల జారీలో జాప్యం జరక్కపోవడం, సకాలంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరగలగడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 82 వేల వీసాలు జారీ చేయడం భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు చిహ్నం’’అని ఛార్జ్ డి అఫైర్స్ పాట్రీషియా లాసినా తెలిపారు. ‘‘అమెరికా దౌత్య వ్యవహారాల్లో అంతర్జాతీయ విద్యార్థులు కేంద్రస్థానంలో ఉంటారు. భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ’’అని మినిస్టర్ కౌన్సిలర్ డాన్ హెల్ఫిన్ అన్నారు. ఇరవై శాతం మంది భారతీయులే.. అమెరికాలో వేర్వేరు కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2020–2021లో దాదాపు 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. 2020లో అమెరికన్ ప్రభుత్వం, ఉన్నత విద్యాసంస్థలు కోవిడ్ రక్షణ ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను ఆహ్వానించాయి. ఆన్లైన్/ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ బోధన ఏర్పాట్లు చేశాయి. ఇదీ చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
స్కాట్లాండ్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
లండన్: బ్రిటన్‌లోని స్కాట్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులున్నారు. హైదరాబాద్‌కు చెందిన పవన్ బాశెట్టి(23), ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన మోదేపల్లి సుధాకర్(30)లతో పాటు బెంగళూరుకు చెందిన గిరిశ్ సుబ్రమణ్యం(23), దుర్మరణం చెందారు. హైదరాబాద్‌కు చెందిన సాయి వర్మ(24) ఇంకా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. లీసెస్టర్ యూనివర్సిటీలో పవన్, గిరిశ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నారు. వారి స్నేహితుడు, సుధాకర్ వర్సిటీ మాజీ విద్యార్థి. శుక్రవారం మధ్యాహ్నం స్కాట్లాండ్లోని ఆర్గిల్ కౌంటీలోని అప్పీన్ ఏరియాలో ఏ828 రహదారిపై క్యాసెల్ స్టేకర్ సమీపంలో భారీ సరకు రవాణా వాహనం, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారని స్కాట్లాండ్ పోలీసులు చెప్పారు. ఇదీ చదవండి: భారత విద్యార్థులకు శుభవార్త.. వీసాల జారీపై చైనా కీలక ప్రకటన -
భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. చైనా కీలక ప్రకటన
బీజింగ్: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా వీసాలపై నిరీక్షణకు తెరదించుతూ భారత విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేసే ప్రణాళిక చేస్తున్న ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ సహనం విలువైనదని రుజువైంది. నేను నిజంగా మీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని పంచుకోగలను. తిరిగి చైనాకు వచ్చేందుకు స్వాగతం.’ అంటూ ట్వీట్ చేశారు చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల కౌన్సెలర్ జి రోంగ్. భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలకు వర్కింగ్ వీసాల జారీపై న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ వివరణాత్మక ప్రకటనను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ప్రకటన ప్రకారం చైనాలో ఉన్నత విద్య చదవాలనుకుంటున్న కొత్త విద్యార్థులు, చైనా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఎక్స్1 వీసాలు జారీ చేయనున్నారు. కొత్తగా వెళ్లే విద్యార్థులు ఒరిజినల్ అడ్మిషన్ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారు చైనా యూనివర్సిటీల నుంచి అనుమతి పత్రాలను అందించాలి. చైనాలో కరోనా ఆంక్షలతో స్వదేశానికి తిరిగి వచ్చి సుమారు 23వేల మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. రెండేళ్లుగా తిరిగి వెళ్లేందుకు వీసాల కోసం నిరీక్షిస్తున్నారు. చైనాకు తిరిగి వచ్చే విద్యార్థుల వివరాలను అందించాలని ఇటీవలే చైనా కోరింది. దీంతో వందల మంది విద్యార్థుల జాబితాను చైనాకు అందించింది భారత్. సుమారు 1000 మంది పాత విద్యార్థులు చైనాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు లేకపోవటం విద్యార్థులకు ఇబ్బంది కలిగించనుంది. కొద్ది వారాల క్రితం శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా చైనాకు చేరుకున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో? -
భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త
బీజింగ్: చైనాలో విద్యనభ్యసిస్తూ కోవిడ్ కారణంగా స్వదేశంలో ఆగిపోయిన భారతీయ విద్యార్థులకు చైనా తీపి కబురు చెప్పింది. ‘వీలైనంత త్వరగా భారతీయ విద్యార్థులను చైనాకు తిరిగి రప్పించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. త్వరలోనే భారత్ నుంచి విద్యార్థుల తొలి బ్యాచ్ ఆగమనం మీరు చూస్తారు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్‌లో మీడియాతో అన్నారు. విదేశీ విద్యార్థుల కోసం ప్రభుత్వం నూతన వీసా విధానాన్ని తెస్తోందన్న వార్తల నేపథ్యంలో వాంగ్ స్పష్టతనిచ్చారు. భారతీయ రాయబార కార్యాలయం ఇచ్చిన విద్యార్థుల జాబితా పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. చైనాలో దాదాపు 23వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం వైద్య విద్యార్థులే. కోవిడ్ ఉధృతికాలంలో నిలిచిపోయిన చైనా, భారత్ మధ్య విమాన రాకపోకలు ఇంకా మొదలుకాలేదు. సర్వీసుల పునరుద్ధరణపై చర్చలు కొనసాగుతున్నాయి. -
IELTS Row: అడ్డంగా దొరికిపోయి భారత్ పరువు తీశారు!
అహ్మదాబాద్: అగ్రరాజ్యం గడ్డపై భారత్ పరువు పోయిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు ప్రయత్నించడంతో పాటు కోర్టులో ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. దీంతో అమెరికా నేరవిభాగం ఆదేశాలతో.. ఐఈఎల్టీఎస్ పరీక్ష అవకతవకలపై గుజరాత్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల కిందట.. అమెరికా-కెనడా సరిహద్దులో అక్వేసాసేన్ వద్ద సెయింట్ రెగిస్ నదిలో మునిగిపోతున్న ఓ పడవ నుంచి కొందరిని అమెరికా సిబ్బంది రక్షించారు. అందులో ఆరుగురు భారత విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ ఆరుగురు జడ్జి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు. దీంతో అప్పటికప్పుడు ఓ హిందీ ట్రాన్స్‌లేటర్ సాయంతో కోర్టు వాళ్ల నుంచి వాంగ్మూలం సేకరించింది. ► కెనడా నుంచి వాళ్లు అక్రమంగా అమెరికాలోకి చొరబడాలని ప్రయత్నించినట్లు తేలింది. అయితే ఐఈఎల్‌టీఎస్‌లో వీళ్లు 6.5 నుంచి 7 మధ్య స్కోర్ చేశారని తెలియడంతో కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ముంబైలోని అమెరికా క్రిమినల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. దర్యాప్తు చేపట్టాల్సిందిగా మెహ్సనా(గుజరాత్) పోలీసులకు మెయిల్ చేసింది. ► ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS.. ఇంగ్లీష్ సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్ష. చాలా దేశాల్లో మంచి కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షలో మంచి స్కోర్ అవసరం కూడా. అయితే.. ► భారతీయ విద్యార్థుల అక్రమ చొరబాటు వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భిన్న చర్చ నడిచింది. జుగాద్ కల్చర్ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. పరీక్షలో మోసం చేసి న్యూజెర్సీ దాకా వెళ్లి మరీ భారత దేశ పరువు తీశారని, మరికొందరు విద్యార్థుల ప్రయత్నాలపై ఇది ప్రభావం చూపెడుతుందని అంటున్నారు. ► విద్యార్థులంతా 19 నుంచి 21 ఏళ్లలోపు వాళ్లే. వారిలో నలుగురు దక్షిణ గుజరాత్ నవసారీ టౌన్లో సెప్టెంబర్ 25, 2021లో పరీక్ష రాశారని పోలీసులు ధృవీకరించారు. స్టూడెంట్ వీసా మీద మార్చి 19న కెనడాకు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందారు. ఆపై అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తూ.. రెండు వారాల కిందట యూఎస్-కెనడా సరిహద్దులో అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈ ఘటనపై గుజరాత్ పోలీసులు స్పందించారు. IELTS పరీక్ష జరిగిన రోజున.. నవసారీ టౌన్‌లోని ఎగ్జామ్ సెంటర్లోని సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్‌లో ఉన్నాయని స్థానిక అధికారి రాథోడ్ తెలిపారు. విచారణలో భాగంగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఏజెన్సీ నిర్వాహకులను సైతం పిలిపించుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ రాకెట్ గుట్టువీడడంతో మరో మూడు కేంద్రాలను సైతం పరీలిస్తున్నారు కూడా. -
భారతీయ విద్యార్ధులకు బంపరాఫర్!
భారతీయ విద్యార్ధులకు బంపరాఫర్. ఇకపై ఇంటర్ తర్వాత డిగ్రీని తమ దేశంలో చదువుకోవచ్చని యూకే ఆఫర్ ప్రకటించింది. దీంతో ఆక్స్ఫర్డ్,కేంబ్రిడ్జ్, ఎల్ఎస్ఈ వంటి దిగ్గజ యూనివర్సిటీల్లో దేశీయ విద్యార్ధులు చదువుకునే అవకాశం ఏర్పడింది. గతంలో మనదేశానికి చెందిన విద్యార్ధులు యూకేలో డిగ్రీ చేస్తే తిరిగి స్వదేశంలో ఉద్యోగం చేసేందుకు అనర్హులు. అక్కడి డిగ్రీలు..(కొన్ని సందర్భాలలో) ఇక్కడ చెల్లేవి కావు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 21న యూకే ప్రభుత్వంతో కేంద్రం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో భారత్ కు చెందిన విద్యార్ధులు..యూకేలో డిగ్రీ చేసి.. ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. "నేటి నుంచి యూకే డిగ్రీలను భారతీయ డిగ్రీలతో సమానంగా గుర్తిస్తాం. మీరు అక్కడ (యూకేలో) డిగ్రీ చదువుకోవచ్చు. మనదేశంలో ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే మెడిసిన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు ఈ ఒప్పందం పరిధిలోకి రావు' అని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇప్పుడు రెండు దేశాలలో గుర్తించబడతాయి. దీని అర్థం భారతీయ కళాశాలల్లో డిగ్రీ పొందిన విద్యార్ధి ఇప్పుడు యూకేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హత పొందుతాడు. భారతీయ డిగ్రీ హోల్డర్లు..యూకే డిగ్రీ హోల్డర్లతో సమానంగా పరిగణించబడతారు. యూకేలో ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. -
అమెరికాలో భారతీయుల హవా..చతికిల పడ్డ చైనా..!
అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా కొనసాగుతోంది. యూఎస్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12 శాతం పెరిగినట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శాఖ(యూఎస్సీఐఎస్) తాజాగా బుధవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా మరో వైపు డ్రాగన్ కంట్రీ చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతం మేర పడిపోయినట్టు తెలిపింది. కరోనా కారణంగా.. ఇంటర్నేషనల్ విద్యార్థుల రాకడపై ఇప్పటికీ ప్రభావం పడుతోందని యూఎస్సీఐఎస్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం..2021లో ఎఫ్-1, ఎమ్-1 వీసాపై చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 1,236,748. 2020 నాటి లెక్కలతో పోలిస్తే.. ఇది దాదాపు 1.2 శాతం తక్కువ. ‘‘అమెరికా చదువు కోసం వచ్చే విదేశీ విద్యార్థులో చైనా, ఇండియా విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటారు. అయితే.. 2021లో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గగా..భారత విద్యార్థుల సంఖ్య పెరిగింది’’ అని యూఎస్సీఐఎస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: బ్రిటన్ రాణిని దాటేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె..! -
అమెరికా చదువులకే ఆదరణ
సాక్షి, అమరావతి: అమెరికాలో చదివే భారత విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020తో పోలిస్తే 2021లో ఈ పెరుగుదల 12 శాతంగా ఉంది. ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉండగా విదేశీ చదువులకు భారత విద్యార్థుల మొదటి గమ్యస్థానంగా అమెరికా నిలుస్తోంది. అమెరికన్ డిగ్రీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తుండటం వంటి కారణాలతో భారత విద్యార్థులు అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థుల చేరికలపై కోవిడ్ ప్రభావం.. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య 2020తో పోలిస్తే 2021లో ఏకంగా ఎనిమిది శాతానికి తగ్గింది. మరోవైపు భారత విద్యార్థుల సంఖ్య 12 శాతం పెరిగింది. వాస్తవానికి.. ఈ సంఖ్య మరింత పెరిగేదని.. అయితే కోవిడ్ విద్యార్థుల చేరికలపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. కాగా, స్టూడెంట్స్ ఎక్సే్ఛంజ్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్ఈవీఐఎస్) గణాంకాల ప్రకారం.. ఎఫ్1 కేటగిరీ, ఎం1 కేటగిరీల్లో అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 2021 విద్యా సంవత్సరంలో 12,36,748గా ఉంది. 2020లో చేరిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే 2021లో 1.2 శాతం తగ్గుదల నమోదైంది. చైనీయులు, భారతీయులే అత్యధికం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో చైనీయులు, భారతీయులే అత్యధికం. ఏటా చైనా నుంచి వచ్చే విద్యార్థులే ఎక్కువ కాగా.. 2021లో భారత్ నుంచి వెళ్లినవారి సంఖ్య పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి వెళ్లినవారిలో 33,569 మంది తగ్గారు. భారతదేశం నుంచి చూస్తే 2020లో కన్నా 2021లో 25,391 మంది అదనంగా పెరిగారు. వీరిలో 37 శాతం మంది మహిళలే కావడం మరో విశేషం. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకొనే విద్యాసంస్థల సంఖ్య కూడా 2020తో పోలిస్తే 2021లో తగ్గింది. 2020లో 8,369 విద్యాసంస్థలకు అర్హత ఉండగా 2021లో 8,038 సంస్థలకు మాత్రమే అర్హత దక్కింది. చైనా కన్నా అమెరికాకే ప్రాధాన్యం కోవిడ్ అనంతరం చైనాలో చదువులపై భారతీయులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పైగా చైనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పదేపదే విద్యార్థులకు సూచిస్తోంది. దీంతో చైనాలో చదువులకు భారతీయులు అంతగా ఇష్టపడటం లేదు. పైగా కోవిడ్‌తో చైనాలోని పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు ఆన్లైన్లో కోర్సులను అందిస్తున్నాయి. ఇలా ఆన్‌లైన్‌లోకి మారే కోర్సులకు భారత్‌లో అనుమతులు ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదివేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విద్యార్థుల్లో దాదాపు 92 శాతం మంది స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ)–సర్టిఫైడ్ అసోసియేట్, బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డాక్టోరల్ ప్రోగ్రామ్ కోర్సులు చదువుతున్నారు. -
అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) ప్రకారం.. నాన్–ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసాలైన ఎఫ్–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు. విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్‌లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. -
వైద్య విద్యకు... చలో ఫారిన్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ మెడిసిన్ చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను కేంద్రం హుటాహుటిన స్వదేశానికి తీసుకొచ్చింది. దాంతో విదేశాల్లో వైద్య విద్యపై మరోసారి చర్చ ఊపందుకుంది. ఉక్రెయిన్‌తో పాటు రష్యా, చైనా తదితర దేశాల్లో లక్షలాది మంది భారత విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. మన దగ్గర మెడిసిన్ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది... భారత్‌లో డాక్టర్ చదువు అంత ఈజీ కాదు. ప్రతిభ ఒక్కటే సరిపోదు. విపరీతమైన పోటీని ఎదుర్కోవాలి. దానికి తోడు బాగా డబ్బు కూడా ఉండాలి. మన దేశంతో పోల్చి చూస్తే పలు దేశాల్లో కారు చౌకగా మెడిసిన్ చదువుకునే అవకాశాలుండటంతో మన విద్యార్థులు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో 88,120 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లున్నాయి. వీటిలో 284 ప్రభుత్వ కాలేజీల్లో 43,310 సీట్లు, 269 ప్రైవేటు కాలేజీల్లో 41,065 సీట్లున్నాయి. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి గతేడాది ఏకంగా 15.44 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 8.7 లక్షల మంది పాసయ్యారు. అయినా వీరిలో సీటు దొరికేది 10 శాతం మందికే. అర్హులకు, అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య భారీ అంతరముంది. ఖర్చు తడిసిమోపెడు దేశవ్యాప్త పోటీని తట్టుకొని నీట్లో మంచి మార్కులు సంపాదించినా ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర మెడిసిన్ కోర్సుకయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందులోనూ ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ చదివించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి కోటికి పైగా కావాల్సిందే. అదే ఉక్రెయిన్ వంటి దేశాల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల్లోపే పూర్తవుతుంది. ప్రాక్టీసూ కష్టమే ఎంబీబీఎస్ తర్వాత మన దేశంలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఏ) నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయాలి. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్‌కు అవకాశం వస్తుంది. అయితే అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండుల్లో మెడిసిన్ చదివేవారు ఈ పరీక్షతో పని లేకుండా భారత్‌లో నేరుగా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. రష్యా, చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, నేపాల్, కజకిస్తాన్, ఉక్రెయిన్ మెడికోలు మాత్రం ఈ పరీక్ష పాసై తీరాలి. ఏటా 13 వేల మందికి పైగా పరీక్షలో రాస్తుండగా 15 శాతానికి మించి పాసవడం లేదు. విదేశాలకు వెళ్లడం ఇక ఈజీ కాదు మోదీ ప్రభుత్వం నీట్ ప్రవేశపెట్టాక విదేశాల్లో ఎంబీబీఎస్ డిగ్రీ చదవడం కష్టతరంగా మారింది. నీట్లో కనీసం 119 మార్కులు వస్తేనే విదేశాల్లో కూడా వైద్య విద్యకు అర్హులవుతారు. దీంతో కొన్నేళ్లుగా మెడిసిన్ కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గింది. నీట్ నిబంధన వల్ల ప్రతిభ ఉన్నవారే విదేశాలకు వెళ్లగలుగుతున్నారని ఎఫ్ఎంజీఈ కోచింగ్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ నీరజ్ చౌరాసియా అన్నారు. ప్రతిష్ట కోసం విదేశాల్లో డాక్టర్ చదవాలనుకునే వారికి అడ్డుకట్ట పడ్డట్టేనని అభిప్రాయపడ్డారు. అంతటా మనవాళ్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పలు దేశాల్లో ప్రాక్టీసు చేస్తున్న వైద్యుల్లో లక్షకు పైగా భారత్‌లో శిక్షణ పొందిన వారే ఉన్నారు. ఒక్క అమెరికాలోనే 50 వేల మందికి పైగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు, కెనడాలో ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులే. ఇంగ్లండ్‌లో రిజిస్టర్డ్ వైద్యుల్లో తొమ్మిది శాతం అంటే 40 వేలకు పైగా భారతీయులేనని అంచనా. బంగ్లాదేశ్ భేష్ ఎఫ్ఎంజీఈ రాసేవారిలో బంగ్లాదేశ్ ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్లు అద్భుతంగా రాణిస్తూ టాపర్లుగా నిలుస్తున్నారు. భారత్‌లో మాదిరి సిలబసే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. చైనా, ఉక్రెయిన్, రష్యాలో చదివిన విద్యార్థులు అట్టడుగున నిలుస్తున్నారు. భారత్‌లోనే చదివేలా ఆదేశాలివ్వండి సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో మధ్యలో ఆగిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు వీలు కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుర్రా విద్య, సునీత రాజ్ సహా 50 మంది విద్యార్థుల తరఫున న్యాయవాది రమేశ్ అల్లంకి ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అందులో పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కూడా కోరారు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నా. ఆర్థికంగా కలిసొస్తుందనే అంత దూరం వెళ్లా. ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి, కేంద్రంతో సమన్వయం చేసుకుని క్షేమంగా తిరిగొచ్చేలా చూసింది. – రేష్మ, తెనాలి రెండుసార్లు నీట్ రాసినా బీడీఎస్‌లో సీటొచ్చింది. ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ వెళ్లాను. అక్కడ ఏటా రూ.4 లక్షలవుతుంది. ఇక్కడైతే ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చేతికి రావాలంటే కోటి దాకా పెట్టాలి. దుష్యంత్, గుమ్ములూరు, మహబూబాబాద్ మా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నా. ఫస్టియర్‌లో ఉన్నా. తిరిగొచ్చాక ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా భవిష్యత్తు ఏమిటో అయోమయంగా ఉంది. – కుడుపూడి భవ్యన, అమలాపురం, తూర్పుగోదావరి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు కొనలేక మా నాన్న అప్పు చేసి ఉక్రెయిన్ పంపారు. ఉక్రెయిన్ వర్సిటీ ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. కానీ డాక్టర్ కోర్సు ఆన్లైన్లో చదవడం చాలా కష్టం. తెలంగాణ ప్రభుత్వం మాకు నేరుగా ఎంబీబీఎస్‌లో సీటివ్వాలి. – బుస్రా, సానియా (అక్కాచెల్లెళ్లు) మాలపల్లి, నిజామాబాద్ – నేషనల్ డెస్క్, సాక్షి -
మాదేశానికి రండి..వద్దు.. ఇక్కడే చదవండి
సాక్షి, హైదరాబాద్: యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రష్యా దాడుల నేపథ్యంలో అర్ధంతరంగా భారత్‌కు చేరుకున్న విద్యార్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు, వారిని ఆకర్షించేందుకు ఉక్రెయిన్ పొరుగుదేశాలు ప్రయత్నిస్తోంటే, మరోవైపు వారిని నిలబెట్టుకునేందుకు ఉక్రెయిన్ యూనివర్సిటీలు కృషి చేస్తున్నాయి. బోధన మధ్యలోనే ఆగిపోవడాన్ని అదనుగా చేసుకుని ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, పోలండ్, జార్జియా, అర్మేనియా, రుమేనియాల్లోని మెడికల్ కాలేజీలు ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థులకు వల వేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఆగిపోయిన చదువును తమ దేశాల్లో పూర్తి చేయాలంటూ తమ ఏజెంట్ల ద్వారా కోరుతున్నా యి. ‘రుమేనియాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మూడో ఏడాది ఎంబీబీఎస్ తమ దేశంలో తక్కువ ఫీజుతో చేయమంటూ ఏజెంట్ చెప్పాడు’అని కూకట్‌పల్లికి చెందిన ఉక్రెయిన్ వైద్య విద్యార్థిని దివ్య తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చే సమయంలోనే భారత విద్యార్థుల వివరాలను కొంతమంది సేకరించారు. ‘మా కాలేజీతో సంబంధం లేని వాళ్లు అప్పుడు మా ఫోన్ నంబర్లు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. వారం రోజులుగా వాళ్లు ఫోన్ చేస్తున్నారు. హంగేరీలో మిగతా విద్య పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు’అని బోరబండలో ఉంటున్న స్వాతి చెప్పింది. హడావుడిగా ఆన్లైన్: ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు వల వేయడంతో ఉక్రెయిన్ కాలేజీలు హడావుడిగా ఆన్లైన్ మంత్రం అందుకుంది. బొకోవినియా స్టేట్ మెడికల్ కాలేజీ గూగుల్ మీట్ ద్వారా ఇప్పటికే వర్చువల్ క్లాసులు ప్రారంభించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, అవి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని మలక్‌పేటలో ఉంటున్న వైద్య విద్యార్థిని రూపా శ్రీవాణి చెప్పారు. యుద్ధం రాకపోతే ఈపాటికి సిలబస్ చాలా వరకూ పూర్తవ్వాల్సి ఉందని, జూన్‌లో రెండో సెమిస్టర్‌కు వెళ్లేవాళ్లమని వారన్నారు. కీలకమైన నాల్గో సంవత్సరంలో ఇంటర్నల్ మెడిసిన్, నరాల సంబంధిత సబ్జెక్టుల ప్రాక్టికల్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. కానీ థియరీ మాత్రమే చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఎక్కువ మంది వాపోతున్నారు. అనాటమీ కేవలం పుస్తకాల్లోని పాఠాల ద్వారా నేర్చుకుంటే ఎలా బోధపడుతుందని ప్రశ్నిస్తున్నారు. వేరే చోట విద్య ఎలా?: ఉక్రెయిన్ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్లంలోనే విద్యాభ్యాసం ఉంటుంది. విద్యార్థులు తేలికగా సబ్జెక్టు అర్థం చేసుకునే వీలుంది. అదేవిధంగా అక్కడ ఫ్యాకల్టీతో లోతుగా తమ భావాలు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉక్రెయిన్ పొరుగు దేశాలు చాలావరకూ స్థానిక భాషను అనుసరిస్తున్నాయి. దీనివల్ల హంగేరీ, జార్జియా, పోలండ్ తదితర దేశాల్లో వైద్య విద్య చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈలోపాన్ని గుర్తించిన పొరుగు దేశాల కాలేజీలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు కొత్త ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తామంటూ గాలం వేస్తున్నాయి. దీంతో ఇప్పటికే కొంతమంది అక్కడ ప్రవేశాలు పొందారు. ఆన్లైన్ అరకొరే: పి.దీప్తి (బొకోవినియన్ స్టేట్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని) నాల్గో సంవత్సరం వైద్య విద్య బోధన ఈ మధ్యే ఆన్లైన్లో మొదలుపెట్టారు. ఈ ఏడాది కీలకమైన సబ్జెక్టులుంటాయి. ప్రాక్టికల్స్‌తో నేర్చుకుంటే తప్ప అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆన్లైన్లో రోజుకు గంట మాత్రమే చెబుతున్నారు. ప్రత్యక్ష బోధనతో పోలిస్తే వైద్య విద్యకు ఆన్లైన్ ఏమాత్రం సరిపోదు. సరిహద్దు దేశాలు ఆకర్షిస్తున్నాయి: రాజు (ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, హైదరాబాద్) ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు తాజా పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ బోధన అనుకున్న స్థాయిలో లేదు. అక్కడి భాషను విద్యార్థులు ఇప్పటికిప్పుడు అర్థం చేసుకోవడమూ కష్టమే. అయితే, ఇవేవీ ఆలోచించకుండానే కొంతమంది చేరుతున్నారు. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే విద్యార్థులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. -
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
ఒట్టావా: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన ఐదుగురు యువకులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషయాన్నిభారత హైకమిషనర్ అజయ్ బిసారియా సోమవారం ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. వివరాల ప్రకారం.. కెనడాలోని ఒంటారియోలో శనివారం ఉదయం హైవే-401పై ప్యాసింజర్ వ్యాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఓ ట్రాక్టర్.. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, మరణించిన విద్యార్థులను హర్‌ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌లుగా గుర్తించారు. Heart-breaking tragedy in Canada: 5 Indians students passed away in an auto accident near Toronto on Saturday. Two others in hospital. Deepest condolences to the families of the victims. @IndiainToronto team in touch with friends of the victims for assistance. @MEAIndia — Ajay Bisaria (@Ajaybis) March 14, 2022 ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. అజయ్ బిసారియా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్యార్థుల మృతిపై తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్, జైశంకర్ స్పందిస్తూ.. చనిపోయిన విద్యార్థులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వారికి భారత ప్రభుత్వం నుంచి మద్దతు, సహాయ సహకారాలు అందించనున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. Deeply mourn the passing away of 5 Indian students in Canada. Condolences to their families. Pray for the recovery of those injured. @IndiainToronto will provide all necessary support and assistance. https://t.co/MAkMz0uwJ7 — Dr. S. Jaishankar (@DrSJaishankar) March 14, 2022 -
నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో వడ్డీ రేట్లు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలి : కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. -
భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్
న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఆగిపోయిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు శనివారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరిగే అవకాశముంది. ‘‘ఉక్రెయిన్ నుంచి 20,000 మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొంది’’ అని వారి తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్ సెల్ పేర్కొంది. (చదవండి: పార్శిల్లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు) -
సంక్లిష్టమైన సవాలు
చదువు కోసం, బ్రతుకు తెరువు కోసం... ఉక్రెయిన్ వెళ్ళిన భారతీయ బాటసారులు అత్యధికులు ఎట్టకేలకు క్షేమంగా ఇంటి ముఖం పడుతున్నారు. భయానక, బీభత్స దృశ్యాలెన్నో చూస్తున్న వేళ... యుద్ధక్షేత్రం నుంచి వందల సంఖ్యలో మనవాళ్ళు క్షేమంగా తిరిగి వస్తుండడం ఒకింత ఊరట. ముఖ్యంగా బాంబుల వర్షంలో బయటపడే మార్గం లేని సుమీ నగర భారతీయ విద్యార్థుల సంగతి. అక్కడ మూడు హాస్టళ్ళలో ఉన్న దాదాపు 700 మంది విద్యార్థులు మంగళవారం సురక్షిత మార్గంలో ముందుగా 175 కి.మీ.ల దూరంలో మధ్య ఉక్రెయిన్‌లోని పోల్టావాకు 12 బస్సుల్లో బయలుదేరారు. అలా ‘ఆపరేషన్ గంగ’ అతి క్లిష్టమైన ఘట్టానికి చేరింది. నిజానికి, సోమవారమే ఈ పని జరగాల్సింది. కానీ, కాల్పుల విరమణకు అంగీకరించినట్టే అంగీకరించి, ఇరుపక్షాలూ అందుకు కట్టుబడలేదు. దాంతో, భద్రతా కారణాల రీత్యా తరలింపు సాధ్యం కాలేదు. బస్సెక్కిన విద్యార్థులను సైతం సోమవారం మళ్ళీ హాస్టళ్ళకు వెనక్కి పంపేయాల్సి వచ్చిందంటే, సుమీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. చివరకు ఐరాస భద్రతా మండలిలో భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసి, దౌత్యపరంగా ఒత్తిడి పెంచడం ఫలితాన్నిచ్చింది. రష్యా, ఉక్రెయిన్ నేతలిద్దరికీ భారత ప్రధాని సోమవారం ఫోన్ చేసి, విద్యార్థుల తరలింపునకు సహకరించాలని కోరిన సంగతీ ప్రస్తావించాక ఎట్టకేలకు విద్యార్థుల నిరీక్షణకు తెర పడింది. మొత్తానికి, గత రెండు వారాల్లో 22500 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి బయటపడితే, అందులో 16 వేల పైమంది ‘ఆపరే షన్ గంగ’లో భాగంగా ప్రభుత్వ విమానాల్లో వెనక్కి వచ్చారు. ఇలా ఉండగా, బుధవారం ఉక్రె యిన్‌లో బాధిత నగరాలు ఆరింటిలో 12 గంటల కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్లు అంగీకరించడం చిన్న సాంత్వన. కీవ్, ఖార్కివ్, మారియాపోల్ల నుంచి పౌరులు తరలిపోయేం దుకు మానవీయ కారిడార్లకు అంగీకారం కుదిరింది. శరణార్థుల సంక్షోభం మాటెలా ఉన్నా, మానవతా కారిడార్లతో వేలమంది ప్రాణాలతో సురక్షిత ప్రాంతాలకు పోవడానికి వీలు కలిగింది. యుద్ధం మొదలయ్యాక 20 లక్షల మంది ఉక్రెయిన్ను వదిలిపోయారు. ఒక్క మంగళవారమే 7 వేల మందిని సుమీ నుంచి తరలించారు. ఈశాన్య ఉక్రెయిన్‌లో, రష్యా సరిహద్దుకు 60 కి.మీ.ల దూరంలోనే ఉంటుంది సుమీ నగరం. పశ్చిమ సరిహద్దుకు వెయ్యి కి.మీల దూరంలోని ఖార్కివ్ కన్నా, తూర్పు సరిహద్దు దగ్గరి సుమీ నుంచి ఆగని కాల్పుల మధ్య తరలింపు సంక్లిష్టమైంది. అక్కడి సుమీ స్టేట్ యూనివర్సిటీలోని వైద్య కళాశాలల్లో దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. సంక్లిష్ట యుద్ధ క్షేత్రంలో నడిమధ్యన ఉన్న సుమీలో హాస్టళ్ళలోని బంకర్ల నుంచి బయటకొస్తే – ఎటు నుంచి ఏ క్షిపణి తాకుతుందో తెలియని పరిస్థితుల్లో, తిండీ నీళ్ళు కూడా కరవై, గడ్డ కట్టే చలిలో అవస్థ పడ్డారు. కాలినడకన కూడా పోలేని పరిస్థితుల్లో, వారికి ధైర్యం చెబుతూ, వారందరి తరలింపు కోసం చివరి దాకా శ్రమించిన ప్రభుత్వం సహా ప్రతి ఒక్కరినీ అభినందించాలి. 1986 జనవరిలో దక్షిణ యెమెన్‌లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ దేశీయులకు భిన్నంగా 850 మంది భారతీయులు తమ తరలింపు కోసం రోజులకొద్దీ వేచిచూశారు. భారత ప్రభుత్వం చివరకు ఓ వాణిజ్య నౌకను ఒప్పించి, మనవాళ్ళను స్వదేశానికి తేగలిగింది. 30 ఏళ్ళ తర్వాత 2015 ఏప్రిల్‌లో యెమెన్‌లో మళ్ళీ సంక్షోభం తలెత్తినప్పుడు ‘ఆపరేషన్ రాహత్’ ద్వారా 5 వేల మంది భారతీయులనూ, 41 దేశాలకు చెందిన వెయ్యి మంది పౌరులనూ భారత సర్కారు సురక్షితంగా తరలించింది. ఆ తర్వాత ఏడేళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్‌లో క్లిష్టమైన తరలింపు ప్రక్రియలో తలమునకలైంది. పాకిస్తానీ, బంగ్లాదేశీ, నేపాలీయులను సైతం రక్షించి, వారి మనసు గెలిచింది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా ఉక్రెయిన్ వెళ్ళి, మన వాళ్ళ తరలింపు ప్రక్రియకు తోడ్పడడం విశేషం. సాధారణంగా ఇలాంటి తరలింపులకు ప్రచారార్భాటం లేని దౌత్య నీతి అవసరం. కారణాలేమైనా ఈసారి ‘ఆపరేషన్ గంగ’ పేరుతో మోడీ సర్కార్ చేపట్టిన తరలింపు ప్రక్రియ విమానాల్లో మంత్రుల హడావిడికీ, ఎన్నికల సభల్లో ప్రసంగాలకీ తావివ్వడం విచిత్రం. ఇవాళ ప్రపంచమంతటా ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 1.33 కోట్ల ౖపైగా భారతీయులు విదేశాల్లో ఉన్నారు. ఏటా 2 కోట్ల మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఉక్రెయిన్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే, అక్కడి మన దేశస్థులను సకాలంలో రక్షించుకోవడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించు కోవడం అవసరం. అందుకు తగ్గట్టు సామర్థ్యాన్ని విస్తరించుకోవడం కీలకం. 1950ల నుంచి ఇప్పటి దాకా మన దేశం ఇలా 30కి పైగా తరలింపు ప్రక్రియలను నడిపింది. చరిత్రలోని అపారమైన ఆ అనుభవాన్నీ, అనుసరించిన పద్ధతులనూ, నేర్చుకున్న పాఠాలనూ కలబోసి వాటిని వ్యవస్థీకృతం చేయాలి. దౌత్య సిబ్బందికి కూడా విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ముందుగా ప్రత్యేక శిక్షణనివ్వాలి. యుద్ధక్షేత్రాల్లో పనిచేయాల్సి వస్తే ఉపకరించేలా విదేశాంగ సర్వీసు శిక్షణార్థు లకు ఆర్మీ, లేదంటే పోలీసులతో శిక్షణనిప్పించవచ్చు. అలా చేస్తే, దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాకుండా రాబోయే విపత్తులకు ముందుగానే సిద్ధమై ఉంటాం. సాధన, సన్నద్ధత ఉంటే... ఏ సమస్య నుంచైనా సులభంగా బయటపడగలమని వేరే చెప్పనక్కర లేదు. ఉక్రెయిన్‌లో గాలిలో కలసిపోయిన అమాయక భారతీయ విద్యార్థి ప్రాణాలు ఆ సంగతిని గుర్తు చేస్తూనే ఉంటాయి! -
Ukraine Crisis: సేఫ్ కారిడార్లు ఎక్కడ? భారత్ అసంతృప్తి
ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నాం 12గం. 40ని. నుంచి విరమణ మొదలు కానుంది. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, మరియూపోల్, సుమీ, చెర్నీగోవ్ నగరాల నుంచి తరలింపునకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే.. మిగతా చోట్ల మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సేఫ్ కారిడార్లపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను తరలించే ప్రక్రియ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్.. ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. ఇందుకు పూర్తి సహకారం ఉంటుందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సైతం ప్రధాని మోదీకి తెలిపాయి. అయినప్పటికీ తరలింపు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడున్న వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అన్ని శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. సామరస్యంగా శాంతిపూర్వక చర్చలతో ఈ సంక్షోభం ముగియాలని భారత్ భావిస్తోంది. భారతీయుల తరలింపు సురక్షితంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. అని యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి, భద్రతా మండలిలో ప్రసంగించారు. సేఫ్‌కారిడార్ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఇరువైపు సానుకూల స్పందన వచ్చినట్లే అనిపిస్తోందని, కానీ, అది కార్యరూపం దాల్చట్లేదని ఆందోళన వ్యక్తం చేశారాయన. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రష్యా మరోసారి కాల్పుల విరమణ ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయినా ఇవాళ(మంగళవారం) సుమీ నుంచి భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల పౌరుల తరలింపు సురక్షితంగా పూర్తవుతుందేమో చూడాలి. సంబంధిత వార్త: సుమీ నుంచి తరలింపు.. అసలు సమస్యలు ఇవే! -
మాట తప్పిన రష్యా: ‘ఆపరేషన్ గంగ’కు ఆఖరి దశలో అడ్డంకులు!
కీవ్: ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి భారత విద్యార్థుల్ని వెనక్కి తీసుకువచ్చే ‘ఆపరేషన్ గంగ’ ఆఖరి దశలో సంక్లిష్టంగా మారింది. రష్యా ఫిరంగులు నిప్పులు కక్కుతుండటంతో సుమీ నగరంలో చిక్కుకుపోయిన 700 మందిని తీసుకురావడం సమస్యగా మారింది. ఉక్రెయిన్‌లో మారియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో పౌరులను సజావుగా ఖాళీ చేయించడానికి మానవతా దృక్పథంతో కాల్పులకు కాస్త విరామం ప్రకటిస్తున్నట్టు రష్యా శనివారం ప్రకటించింది. దాంతో సుమీలో చిక్కుకున్న మన విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావచ్చని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భావించింది. కానీ, రష్యా మాట తప్పి ఎడతెరిపి లేకుండా క్షిపణి, బాంబు దాడులకు దిగడంతో పరిస్థితి మొదటికొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కిన విద్యార్థుల్ని సరిహద్దులకు చేర్చాలంటే మారియుపోల్, వోల్నోవాఖ నుంచే తీసుకురావాలి. కానీ, అక్కడ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్కీవ్ సమీపంలోని పిసోచిన్, సుమీ నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. రష్యాకు ఈశాన్యంగా ఉన్న సుమీ పరిసరాల్లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. పైగా రవాణా సాధనాలేవీ లేకపోవడం మరో సమస్యగా ఉంది. దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చిన్న హోటల్ గది నుంచి ఆపరేషన్ గంగ కోసం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక హోటల్ గదిలో చిన్న కంట్రోల్ రూమ్ పెట్టి నడిపించారు. భారత రాయబార కార్యాలయంలోని మెరికల్లాంటి యువ ఐఎఫ్ఎస్ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. 150 మందికి పైగా వలెంటీర్లను నియమించుకొని భారతీయ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో సమాచారం సేకరించారు. ఆపరేషన్ గంగ విజయవంతం: మోదీ ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట ఎంతో పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. కాబట్టే మన పౌరులను ఉక్రెయిన్ నుంచి వేగంగా తీసుకొచ్చి ‘ఆపరేషన్ గంగ’ను విజయవంతం చేశామన్నారు. ఈ విషయంలో చాలా పెద్ద దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆదివారం పుణెలోని సింబయాసిస్ వర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు భారత్‌కు హరజోత్ సింగ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కొద్ది రోజుల క్రితం రష్యా దాడుల్లో గాయపడిన భారత విద్యార్థి హరజోత్ సింగ్ సోమవారం స్వదేశానికి రానున్నాడు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ చెప్పారు. 24 గంటల్లో 2,500 మంది రాక.. గత 24 గంటల్లో 13 విమానాలు 2,500 మంది విద్యార్థుల్ని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేర్చాయి. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటిదాకా 76 విమానాల్లో 15,920 మంది విద్యార్థులు క్షేమంగా తిరిగివచ్చారు. వచ్చే 24 గంటల్లో మరో 13 భారత వైమానిక దళ విమానాలు ఉక్రెయిన్ నుంచి విద్యార్థులతో బయల్దేరతాయి. ఉక్రెయిన్‌కు విమానాల రాకపోకలపై నిషేధం ఉండటంతో రుమేనియా, పోలండ్, హంగరి, స్లొవేకియా, మాల్డోవాల నుంచి విద్యార్థులను భారత్ వెనక్కు తీసుకొస్తోంది. హంగరీ నుంచి ఆఖరి విడతగా 13 విమానాలు రానున్నాయి. అందుకే హంగరీ సరిహద్దులకు చేరుకోవాలనుకునే విద్యార్థులంతా త్వరగా రావాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. సోమవారం బుడాపెస్ట్ నుంచి ఐదు, సుకేవా నుంచి రెండు, బుఖారెస్ట్ నుంచి ఒక విమానంలో మరో 1,500 మందిని తీసుకు రానున్నారు. -
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం సీఎం జగన్ ప్రత్యేక చర్చలు
-
ఉక్రెయిన్.. భారతీయుల తరలింపులో సమస్యలు!
ఊహించని రీతిలో ఉక్రెయిన్ యుద్ధానికి విరామం ప్రకటించి.. పౌరుల తరలింపునకు సహకరిస్తోంది రష్యా సైన్యం. ఈ క్రమంలో భారత్ పౌరులను సురక్షితంగా పంపించేందుకు సహకరిస్తామని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. అయితే చావు ఎటు నుంచి ముంచుకొస్తుందో అనే భయంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి తోడు ఇబ్బందులు కొన్ని.. తరలింపు ప్రక్రియకు అడ్డం పడుతున్నాయి. ఉక్రెయిన్ తూర్పు భాగంలో సుమీ స్టేట్ యూనివర్సిటీలో వందలమంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గురువారం రాత్రి ఈ ప్రాంతంలో రష్యన్ బలగాల దాడులతో భీత వాతావరణం నెలకొంది. విద్యార్థులంతా చెల్లాచెదురై రెండో ప్రపంచ యుద్ధ బంకర్లో దాక్కుండిపోయారు. తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. సాయం కోసం భారత ఎంబసీని ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది అక్కడ!. రష్యా సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమీ ప్రాంతం. అందుకే యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ సంకేతాలు ముందుగానే తెలియడంతో కొంతమంది నీళ్లు, ఆహారం ముందుగా తెచ్చి పెట్టుకున్నారు. కానీ, క్రమక్రమంగా కొరత మొదలైంది. దీనికి తోడు రష్యా దాడుల్లో వాటర్ పైప్ లైన్లు, పవర్ సిస్టమ్ దెబ్బతిని.. నీళ్లు, కరెంట్ లేక అసలు కష్టాలు మొదలయ్యాయి. సుమీలో యుద్ధ భయానికి దాక్కున్న చాలామందికి తిండి, నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఉన్నట్లుండి మంచు కురియడంతో విద్యార్థుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. మంచును కరిగించి ఆ నీటితోనే బాటిళ్లను నింపేసుకుంటున్నారు. Students in Sumy, north east of Ukraine, have started filling bottles with snow to melt and drink. On Thursday night, water station was bombarded by Russian forces cutting all water supplies, said Anuj, student in Sumy State University, who shot the video @scroll_in pic.twitter.com/NYys6PBHVl — Tabassum (@tabassum_b) March 4, 2022 దారుల్లేక.. యుద్ధం నిలిచిపోయి.. పౌరులను వెళ్లిపోవాలంటూ రష్యా బలగాలు ప్రకటించడం కొంత ఊరట ఇచ్చేదే. కానీ, సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ రైలు మార్గం ఒక్కటే పెద్ద దారి. కానీ, రష్యా దాడులతో రైల్వే ట్రాక్స్ దారుణంగా దెబ్బ తిన్నాయి. గగన తలం ఆల్రెడీ మూసుకుపోయింది. మరోవైపు రోడ్ల మీద రష్యన్ చెక్పాయింట్లు ఎక్కడికక్కడే వెలిశాయి. ఒకదగ్గర కానున్నా.. మరో దగ్గర ముప్పు మీద పడిపోతుందేమోనని విద్యార్థులు హడలి పోతున్నారు. సన్నగిల్లుతున్న ఆశలు! ఖార్కీవ్, సుమీలో కలిపి మొత్తం వెయ్యి మంది భారతీయ విద్యార్థులు ఉన్నారనేది ఒక అంచనా. మార్చి 2వ తేదీ వరకు సుమీకి 180కి.మీ.ల దూరంలోని ఖార్కీవ్లో విద్యార్థుల పరిస్థితి భయానకంగానే ఉండింది. అయితే కర్ణాటక విద్యార్థి నవీన్ మరణంతో.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భారత ఎంబసీ జోక్యంతో భారతీయ విద్యార్థులు సురక్షిత మార్గాల్లో సరిహద్దులకు సురక్షితంగా చేరారు. దీంతో సురక్షితంగా తామూ బయటపడతామని సుమీ విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, దారులన్నీ మూసుకుపోవడంతో భయాందోళనకు లోనవుతున్నారు. ఈ పదిరోజుల్లో కొందరు విద్యార్థులు రిస్క్ చేశారు. ఒకవైపు రష్యా సరిహద్దు, మరోవైపు బెలారస్ సరిహద్దు. అందుకే సుమీకి 170 కిలోమీటర్ల దూరంలోని పోల్తావా వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తుపాకులతో బెదిరించి మరీ సైన్యాలు వాళ్లను వెనక్కి పంపించాయి. ఇంటి నుంచి ఫోన్‌కాల్ వచ్చినప్పుడల్లా.. ఇదే తమ ఆఖరి ఫోన్‌కాల్ అనుకుంటున్న విద్యార్థులు ఎందరో. వాళ్లందరినీ సురక్షితంగా ఇంటికి చేరుస్తామని భారత ఎంబసీ ధైర్యం చెబుతోంది. జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పటడుగు వేయకండని, ధైర్యంగా ఉండాలని చెప్తూ వాళ్లను తరలించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. విద్యార్థులంతా సురక్షితంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు అంతా కోరుకుంటున్నారు. Exploring all possible mechanisms to evacuate 🇮🇳n citizens in Sumy, safely & securely. Discussed evacuation & identification of exit routes with all interlocuters including Red Cross. Control room will continue to be active until all our citizens are evacuated. Be Safe Be Strong — India in Ukraine (@IndiainUkraine) March 4, 2022 -
యుద్ధానికి బ్రేక్ వేసింది అందుకే! తరలించేందుకు సహకరిస్తాం!
Russia Says In UN Security Council meeting: ఉక్రెయిన్ పై రష్యా పది రోజులుగా దాడి కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలు వైమానిక క్షిపణులు, బాంబుల దాడులతో అత్యంత దయనీయంగా మారాయి. ఈ మేరకు రష్యా ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విదేశీయులను, భారతీయులను తరలించే నిమిత్తం యుద్ధానికి బ్రేక్ వేసింది కూడా. అంతేగాక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీయులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది. పైగా వారిని తరలించడానికి తూర్పు ఉక్రెయిన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యా బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని కూడ స్పష్టం చేసింది. ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేయడంతో అంతర్జాతీయ భద్రతా మండలి అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 15 దేశాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని రష్యా రాయబారి రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బలవంతంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితి రాయబారి సెర్గి కిస్లిత్సా రష్యా రాయబారి నెబెంజియాతో మాట్లాడుతూ.."దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రాంతాలను విడిచిపెట్టడానికి సురక్షితమైన కారిడార్‌ను నిర్ధారించేలా సాయుధ దళాలకు (రష్యా) విజ్ఞప్తి చేయండి. అని కోరారు. అంతేకాదు మీరు నిజంగా ఉక్రెయిన్ రాజధానితో సంబంధంలో ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో మీకు బాగా తెలుసు" అని వ్యగ్యంగా అన్నారు. (చదవండి: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన.. బాంబులు వేసేందుకే ఇలా చేశారా..) -
కంటి మీద కునుకు లేదు.. కడుపు నిండా తిండి లేదు
ఒక వైపు రాకెట్ల దాడులు, మరో వైపు ఫిరంగుల మోతలు, బాంబుల శబ్ధాలు. అంతా భయానక వాతావరణం. ఎప్పుడు చల్లారుతుందో తెలియదు. ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్తే.. అకస్మాత్తుగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు మన విద్యార్థులను కష్టాల్లోకి నెట్టాయి. బతుకు జీవుడా అంటూ బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకోవాల్సిన దీనావస్థ తెచ్చిపెట్టాయి. రష్యా భీకర దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న అనంతపురం జిల్లావాసులతో ‘సాక్షి’ గురువారం ఫోన్లో మాట్లాడింది. ‘కంటి మీద కునుకు లేదు.. కడుపు నిండా తిండి లేదు’ అని కొందరు భావోద్వేగంతో చెప్పగా, ‘ఎన్నో కష్టాలు పడి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నాం.. మరో రెండు రోజుల్లో మనం దేశం చేరుకుంటాం’ అని మరికొందరు వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఎంతో కష్టంగా హంగేరి చేరుకున్నా ఉక్రెయిన్‌లోని జెప్రోజీ స్టేట్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం చదువుతున్నా. వ్యయప్రయాసలతో ప్రస్తుతం హంగేరికి చేరుకున్నా. మరో రెండు రోజుల్లో స్వగ్రామానికి చేరుకుంటానని అనుకుంటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు. – సాయితేజ, బెళుగుప్ప బంకర్లో తలదాచుకున్నాం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపా. మేమున్న ప్రాంతంలో బాంబుల వర్షం కురవడంతో ఆ శబ్ధాలకు భయపడి బంకర్లోకి వెళ్లి దాక్కున్నా. నాతో పాటు ఏపీకి చెందిన మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ప్రాణభయంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక వాహనంలో రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నాం. రైల్లో సుమారు 1,400 కి.మీ ప్రయాణించి ఉక్రెయిన్ బార్డర్ దాటాం. భారత ఎంబసీ అధికారులను కలిశాం. రెండు రోజుల్లో ఢిల్లీ చేరుకుంటాం. –షేక్ షకుస్థా భాను, కదిరి నరకయాతన అనుభవించా.. రెండు రోజుల క్రితం బుడాపెస్ట్ చేరుకున్నా. ఎంబసీ అధికారులు సౌకర్యాలు కల్పించారు. జాబితా ఆధారంగా ఇండియాకు పంపుతున్నారు. శుక్రవారం సాయంత్రంలోపు చేరే అవకాశం ఉంది. రెండు రోజుల నుంచి నరకయాతన అనుభవించా. హోటల్‌కు వచ్చిన తరువాత మనశ్శాంతి కలిగింది. – జి.శ్రావణి, గుమ్మఘట్ట బాంబుల మోతతో దద్దరిల్లుతోంది మేమున్న ప్రాంతం రోజూ పదుల సంఖ్యలో హెలికాప్టర్లు, విమానాల బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మేం మా కాలేజ్ కన్సల్టెంట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో హంగేరి బార్డర్‌కు వచ్చాం. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి, భోజనం లభిస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియార్టీ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్లలో పంపుతున్నారు. త్వరలోనే ఇంటికి వస్తాను. – అముక్తమాల్యద, కళ్యాణదుర్గం ఆహారానికి ఇబ్బంది పడుతున్నాం ఉక్రెయిన్ దేశంలోని చెర్నోవిట్సిలో బ్యూకో వెనియన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నా. అష్టకష్టాలు పడి 3 రోజుల క్రితమే రుమేనియా సరిహద్దుకు చేరుకున్నా. ఇక్కడ ఒక భవనంలో నాతో పాటు మరికొందరిని ఉంచారు. ఆహారం, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. రోజూ అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడుతున్నా. – పవన్‌కల్యాణ్, మడకశిర ఒక్కో రూంలో 12 మంది బస ఉక్రెయిన్ యూనివర్సిటీ నుంచి బుధవారం సాయంత్రం బుడాపెస్ట్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకున్నాం. షిప్టుల వారీగా టోకెన్లు అందజేస్తున్నారు. ఇంకా ఎప్పుడు పంపుతారో తెలియదు. ఒక్కో రూంలో 12 మంది బస చేస్తున్నాం. గురువారం మధ్యాహ్నం వరకూ ఆహారం ఇవ్వలేదు. ఆకలితో ఉన్నా.. క్షేమంగా ఉండడం సంతోషాన్నిస్తోంది. ఈ విషయాన్నే తల్లిదండ్రులకు తెలిపా. – అజిత్ రెడ్డి, ఉక్రెయిన్ వర్సిటీ విద్యార్థి, రాయదుర్గం ప్రస్తుతానికి సేఫ్ జోన్లోనే ఉక్రెయిన్ యూనివర్సిటీలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతం సేఫ్ జోన్ లోనే ఉన్నా. హంగేరి దేశంలోని బుడాపెస్ట్ ఎయిర్ పోర్టుకు 20 కి.మీ. దూరంలో ఉన్నా. బసతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. విడతల వారీగా ఇండియాకు పంపుతున్నారు. మరో రెండు రోజుల్లో మన దేశం చేరుకుంటామని భావిస్తున్నా. – సాయి గణేష్, రాయదుర్గం ఎప్పుడెళ్లేది క్లారిటీ లేదు ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక రైలులో హంగేరిలోని బుడాపెస్ట్‌కు చేరుకున్నా. ఇక్కడ ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన ఆఫీస్‌లో ఉన్నా. సమయానికి భోజనాలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియాకు ఎప్పుడు తీసుకెళ్లేది అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. – తిప్పేష్, మెడిసిన్ విద్యార్థి, కణేకల్లు రెండు రోజుల్లో గుంతకల్లుకు.. 2019లో ఉక్రెయిన్‌లోని జాంబ్రేజాయా యూనివర్సీటీలో మెడిసిన్ అడ్మిషన్ పొందా. గతేడాది ఆగస్టులో ఉక్రెయిన్ వెళ్లా. యుద్ధ వాతావరణంలో ఉండలేక జాంబ్రేజాయా నుంచి బస్సు, రైలు ప్రయాణం, నడక మార్గం ద్వారా మంగళవారం రాత్రికి హంగేరికి చేరా. రెండు రోజుల్లో గుంతకల్లుకు చేరుకుంటా. – వి. సాయినాథ్, గుంతకల్లు -
యుద్ధభూమిలో ఉన్నాం... నిబంధనలను అతిక్రమిస్తే ప్రాణాలకే ముప్పు
సాక్షి హైదరాబాద్: ‘ఉక్రెయిన్ పౌరులపై రష్యా ప్రస్తుతం అత్యంత దారుణంగా యుద్ధానికి పాల్ప డుతోంది. ఈ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కొందరు భార తీయ విద్యార్థులు నిబంధనలకు అతిక్రమించి బంకర్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధగా ఉంది’ అని ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి, అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న లీదియా జురావ్వోలా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, చెన్నైలలో చదువుకున్న ఆమె భారతీయ సంస్కృతి, కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి నృత్యాలను నేర్చుకున్నారు. లీదియా ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కర్ణాటక విద్యార్థి నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ భవనం వద్ద బాంబు దాడిలో మృతి చెందిన సంఘటన తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు.. రష్యన్ బలగాలు ఏ వైపు నుంచి విరుచుకుపడతాయో తెలియదు. కొందరు విద్యార్థులు ఉక్రెయిన్ ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్ల మీదకు వస్తున్నారు. ఏజెంట్లను నమ్మి సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా బంకర్లలోనే ఉండాలి. ప్రతి విదేశీ విద్యార్థి పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. మా వలంటీర్లు బంకర్ల వద్దకు వెళ్లి ఆహారం, మందులు ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందే ఫిబ్రవరి 15న భారత ప్రభుత్వం తమ వాళ్లను స్వదేశానికి రావాలని సూచించింది. కానీ చాలా మంది విద్యార్థులు ఫిబ్రవరి 24 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చివరకు అంతర్జాతీయ రాకపోకలు స్తంభించడంతో చిక్కుల్లో పడ్డారు. స్థానిక రేడియోలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరైనా సరే కర్ఫ్యూ సడలించినప్పుడే బంకర్ల నుంచి బయటకు రావాలి. ఉక్రెయిన్‌లో 180 దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు. యుద్ధం కారణంగా అందరూ కష్టాల్లోనే ఉన్నారు. వారికి బంకర్లే సురక్షిత స్థావరాలు. ఆయా దేశాల ఎంబసీలు, ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. భారతీయ సంస్కృతిపై ప్రేమతో.. వినితియా నగరానికి చెందిన లీదియాను చిన్నప్పటి నుంచే విషాదం వెంటాడుతోంది. చెర్నోబిల్ అణు ధార్మికత ప్రభావంతో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. నాలుగుసార్లు సర్జరీలు జరిగాయి. కానీ యోగ, ధ్యానం, ప్రాణాయామంతో ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 2014లో జరిగిన యుద్ధంలో ఆమె తల్లిదండ్రులను, కుటుంబాన్ని కోల్పోయారు. అంతకుముందే 2011లోనే ఆమె భారత్‌కు వచ్చారు. నాట్యశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ‘బెల్ నాట్యం కథా కల్పం’ అనే నూతన నృత్యరీతిని పరిచయం చేశారు. ఆమెకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ప్రేమ. ఆ కోణంలోనే తన పేరులో చివరకు ‘లక్ష్మి’ వచ్చేలా పెట్టుకున్నట్లు లీదియా జురావ్వోలా లక్ష్మి పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో లీదియా.. ఆపదలో ఉన్న వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను అందుకొని అవసరమైన సహాయ సహకారాలను అందజేసే విధి నిర్వహణలో లీదియా ఉన్నారు. ఉక్రెయిన్ లోని ఏ మూల నుంచైనా ఇలాంటి అత్యవసర ఫోన్‌కాల్స్ రావచ్చు. వెంటనే వలంటీర్లను అక్కడికి తరలిస్తారు. లీదియాకు మాతృభాష ఉక్రెయిన్‌తో పాటు రష్యన్ భాష కూడా తెలుసు. అందుకే ఎస్ఓఎస్ విధులు అప్పగించారు. విభిన్న రంగాలకు చెందిన మేమంతా ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకొనే పనిలో ఉన్నాం. సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు అందరం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాం.మాకు ప్రపంచం మద్దతు కావాలి అని ఆమె చెప్పారు. (చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం) -
ఉక్రెయిన్‌లో పాకిస్తాన్ విద్యార్థులను కాపాడిన భారత జెండా!
భారత జాతీయ పతాకం పాకిస్థాన్ పౌరులకు అండగా నిలిచింది. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు బాసట అయ్యింది. కొందరు టర్కీ విద్యార్థులు కూడా త్రివర్ణ పతాకం సాయంతోనే ఉక్రెయిన్ సరిహద్దులు దాటగలిగారు. ఆపరేషన్ గంగలో భాగంగా భారత్ చేరుకున్న విద్యార్థులు ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు వేలమంది ప్రయత్నిస్తున్నారు. భారత్ మినహా మరే దేశమూ తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇతర దేశస్థులు కూడా మన జెండానే నమ్ముకుంటున్నారు. పాకిస్థాన్, టర్కీకి చెందిన కొందరు విద్యార్థులు భారత్ జెండాను ప్రదర్శించడం ద్వారా.. ఉక్రెయిన్ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు. ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వాయుసేన రవాణా విమానాలతోపాటు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండిగో సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు రొమేనియాలోని బుచారెస్ట్కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు. భారత జెండాలను పట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను వారు పాటించారు. మన జెండాను చూపించి ఉక్రెయిన్ సరిహద్దును దాటడం తమకు సులువైందని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే, తమను చూసిన కొందరు పాకిస్థాన్, టర్కీ విద్యార్థులు కూడా భారత జాతీయ జెండాను చేతబూని సరిహద్దులను దాటారని వివరించాడు. ఆపరేషన్ గంగలో భాగంగా బుధవారం 4 ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో మొత్తం 798మంది విద్యార్థులు భారత్ చేరుకున్నారు. గురువారం బుకారెస్ట్ నుంచి 8, బుడపెస్ట్ నుంచి 5, జెస్‌జోవ్ నుంచి 3, సుసీవా నుంచి 2, కోసిస్ నుంచి ఒక విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. వీటిలో మొత్తం 3726మంది భారతీయ విద్యార్థులు. పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. #WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray...Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf — ANI (@ANI) March 2, 2022 -
ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నా.. వచ్చేస్తున్నా..నాన్నా..
భోగాపురం రూరల్(విజయనగరం): నాన్నా... ఉక్రెయిన్ నుంచి బయలుదేరి లివీవ్ అనే స్టాప్‌లో ట్రైన్లోంచి ఇప్పుడే దిగాను. ఇక్కడ నుంచి బోర్డర్‌కి బస్ లేదా ట్రైన్‌గాని ఎక్కాలంట.. ఇక్కడ తినడానికి ఫుడ్ ఇస్తున్నారు.. లైన్లో ఉన్నా కంగారుపడవద్దు నాన్నా అని కుమార్తె మైలపల్లి యమున తన తండ్రి ఎల్లాజీకి ఫోన్ ద్వారా బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలిపింది. ఈ సమాచారంతో నాలుగు రోజులుగా ఆందోళనతో ఉన్న యమున తల్లిదండ్రులు ఎల్లాజీ, పైడితల్లి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీధిలో ఉన్న వారందరికీ విషయాన్ని సంతోషంగా తెలియజేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణంలో తమ కుమార్తె ఉండడంతో ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా? లేక వినకూడని వార్త ఏదైనా వింటామా? అని ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు ఈ సమాచారంతో ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తమ ఇలవేల్పుకు నమస్కారాలు చేసుకుని దీపాలు వెలిగించుకున్నారు. తిరిగి కుమార్తెను ఫొన్లో వివరాలు అడిగారు. అక్కడ బస్ ఎక్కితే ఎన్ని గంటలు జర్నీ ఉంటుంది అని తండ్రి అడిగాడు. బస్ ఎక్కిన తరువాత 5 లేదా 6 గంటలు పడుతుంది నాన్నా.. అని సమాధానం ఇచ్చింది కుమార్తె. ఇంకా ట్రైన్ ఎక్కి బోర్డర్‌కి వెళ్లలేదు నాన్నా, మధ్యలో ఉన్నాం, బోర్డర్‌కి వెళ్లిన తరువాత ఫ్లైట్ ఏ రోజు అని చెబుతారు.. వెంటనే ఫ్లైట్ ఎక్కించే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులు అక్కడ ఉంచి, వీసా ఇచ్చిన తరువాత ఫ్లైట్ ఎప్పుడని చెప్తారు నాన్నా. నీకు ఎçప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడాతా.. అమ్మకు చెప్పు భయపడొద్దని అని ఫోన్ కట్ చేసింది. -
నాన్న నేను భాగానే ఉన్నాను...
తెనాలి రూరల్/రేపల్లె: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారోనన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు కొంత ఊరట కలిగించే సమాచారం అందింది. తెనాలి విద్యార్థులు ఆ దేశ సరిహద్దు దాటేశారు. యుద్ధభూమిని దాటి మరో దేశంలోకి విద్యార్థులు ప్రవేశించినట్టు సమాచారం. ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో చదువుతున్న తెనాలి మండలం కొలకలూరుకు చెందిన షేక్ రేష్మ బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న ఆమె గురువారం విమానంలో గన్నవరం చేరుకుంటుంది. ఇక ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియాలో చదుతున్న తెనాలికి చెందిన చెన్నుపాటి రాణి, రావి శేషసాయి లక్ష్మీగణేష్, విష్ణుమొలకల వైష్ణవి, సమ్మెట టెండుల్కర్ వర్మ ఉక్రెయిన్–హంగేరి సరిహద్దుకు భారత కాలమానం ప్రకారం మంగళవరాం అర్ధరాత్రి దాటాక చేరుకున్నా రు. షేక్ రేష్మ అక్కడ నుంచి పాస్‌పోర్టులు, ఇతర తనిఖీలు పూర్తి చేసుకుని హంగేరి దేశంలోకి ప్రవేశించారు. హంగేరి సరిహద్దు నుంచి 18 గంటలు ప్రయాణించి ఆ దేశ రాజధాని బుడాపెస్ట్‌కు వెళ్లేందుకు రైలులో ఉన్నారు. వీరు బుధవారం అర్ధరాత్రి దాటాక బుడాపెస్ట్ చేరుకునే అవకాశం ఉంది. చెంచుపేటకు చెందని బొందలపాటి లక్ష్మీశ్రీలేఖ ఇప్పటికే బుడాపెస్ట్ చేరు కుంది. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకుంటానని కుటుంబసభ్యులకు సమాచారమందించింది. ఇక రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని శిబిరంలో ఇప్పటికే ఉన్న పట్టణానికి చెందిన గోపాలం రాజేష్, కొల్లిపర మండలం దంతులూరుకు చెందిన దర్శి డెయిసీ హవీలా ‘ఆపరేషన్ గంగా’లో భాగంగా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఉక్రెయిన్ బోర్డర్‌కు చేరుకున్నాం వైద్య విద్యార్థినీ తల్లిదండ్రులకు ఫోన్ ‘‘నాన్న నేను భాగానే ఉన్నాను... మీరు కంగారు పడకండి. అమ్మకు ధైర్యం చెప్పండి. ఉక్రెయిన్ బోర్డర్‌కు చేరుకున్నాం. నాతోపాటు చాలా మంది ఉన్నారు. ఇండియాకి రావటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ’’ ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థినీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన యోగక్షేమాలపై వివరించింది. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన మందపాకల శ్రీనివాసరావు–శ్రీలక్ష్మిల కుమార్తె జోత్స్న భార్గవి జోప్రసి యూనివర్సిటీలో ఐదో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నది. బుధవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లా డింది. తనతోపాటు ఇండియాకి చెందిన వి ద్యార్థులు 1500 మంది వరకు ఉంటారన్నారు. మేము క్షేమంగానే ఉన్నాం. ఇబ్బందేమీ లేదంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. -
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. డెడ్‌లైన్ విధించిన రష్యా
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ (సురక్షిత మార్గం) కల్పించాలని కోరారు. ఇందుకు రష్యా ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు డెడ్‌లైన్ విధించింది. ఈలోగా తక్షణమే ఖార్కివ్‌ను వదిలి వెళ్లాల్సిందిగా ఇండియన్ ఎంబసీ భారతీయులను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు గంటల పాటు కల్పించిన సేఫ్ ప్యాసేజిని వినియోగించాలని రష్యా సూచించింది. ఖార్కివ్‌ను చేజిక్కించుకునేందుకు ఏమాత్రం ఆలస్యం చేయబోమని ఈ సందర్భంగా రష్యా పేర్కొంది. చదవండి: (ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి) -
అందుకే భారతీయులు ఉక్రెయిన్ బాట!
'సాక్షి హైదరాబాద్: ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ క్షిపణి దూసుకువస్తుందో తెలీదు. ఏ క్షణాన ఏ బాంబు నెత్తి మీద పడుతుందో ఊహించలేం. ఉక్రెయిన్‌లో మన విద్యార్థులు క్షణక్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్నారు. కేంద్రం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకొస్తున్నా మరో 14 వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుబడ్డారు. సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కర్ణాటకకు చెందిన విద్యార్థి బాంబు దాడికి బలవడంతో భయపడిపోతున్నారు. వైద్య విద్య కోసం వేలాదిగా ఉక్రెయిన్ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత అన్న సమాధానమే వస్తోంది... వెద్య విద్యలో నాణ్యత ఉక్రెయిన్ వైద్య విద్యకు ప్రసిద్ధి చెందింది. ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీలకు నాణ్యమైన విద్య అందిస్తాయని పేరుంది. వైద్యవిద్యలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అత్యధిక విద్యార్థులు చదివే దేశాల జాబితాలో యూరప్‌లో ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. అందుకే తల్లిదండ్రులు ఎక్కువగా ఉక్రెయిన్ వైపు మొగ్గుచూపిస్తున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు ఉక్రెయిన్ మెడికల్ కాలేజీల డిగ్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉక్రెయిన్ కళాశాలలకు ఉంది. వరల్డ్ హెల్త్ కౌన్సిల్ సహా వివిధ దేశాలు ఈ డిగ్రీని గుర్తించాయి. దీంతో యూరప్ దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనేవారికి ఉక్రెయిన్‌లో చదవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రవేశ పరీక్ష అవసరం లేదు మన దేశంలో మెడిసిన్ సీటుకు తీవ్రమైన పోటీ ఉంటుంది. లక్షలాది మందితో పోటీ పడి జాతీయ స్థాయిలో నీట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 84 వేల వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. గతేడాది 16.1 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. అంత పోటీని తట్టుకొని సీటు సాధించడం సులువు కాదు. కానీ ఉక్రెయిన్‌లో సీటు కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షా రాయాల్సిన పని లేదు. బోధన ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాల్లో మాదిరిగా ప్రత్యేకంగా విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వైద్య విద్య పూర్తవుతుంది భారత్‌లో ప్రాక్టీసుకు లైసెన్స్ విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీతో మన దేశంలో ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) పాసవ్వాల్సి ఉంటుంది. ఏటా సగటున ఉక్రెయిన్ నుంచి 4 వేల మంది మెడికల్ డిగ్రీలతో వచ్చి ఈ పరీక్షలు రాస్తారు. వీరిలో 700 మంది దాకానే ఉత్తీర్ణులవుతారు. అయినప్పటికీ ఉక్రెయిన్ యూనివర్సిటీలకు భారత్ విద్యార్థుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలన్నీ ఉక్రెయిన్‌లో ఉండేవి. విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి ఇటీవల ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యూనివర్సిటీ డీన్లు భారత్ సహా వివిధ దేశాల్లో పర్యటించి విద్యార్థుల్ని ఆకర్షించేలా ప్రచారం చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని దేశానికి రప్పించారు. విదేశీ విద్యార్థుల ద్వారా ఉక్రెయిన్‌కు ఏడాదికి 54.2 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది.’’ – యుక్తి బెల్వాల్, బుక్‌మైయూనివర్సిటీ, భారతీయ విద్యా కన్సల్టింగ్ సంస్థ ఫీజులు తక్కువ ఉక్రెయిన్‌లో తక్కువ ఖర్చుతోనే మెడిసన్ పూర్తవుతుంది. భారత్‌లో దండిగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కాలేజీల్లో చదివించడం కంటే ఉక్రెయిన్‌లో ప్రభుత్వ కాలేజీల్లో సీటొస్తే అక్కడకి పంపించడానికే తల్లిదండ్రులు సుముఖత చూపిస్తున్నారు. ఆరేళ్ల మెడిసిన్ కోర్సుకు ఉక్రెయిన్‌లో ఏడాదికి రూ.4–5 లక్షలు అవుతుంది. అంటే రూ.17–20 లక్షలు ఖర్చు చేస్తే డిగ్రీ చేతికొస్తుంది. ఖర్చులన్నీ కలుపుకున్నా 25 లక్షలు దాటదు. అదే మన దేశంలో ప్రైవేటు కాలేజీలో ఏడాదికి కనీసం రూ.10–12 లక్షల పై మాటే. నాలుగున్నరేళ్ల కోర్సుకి రూ.50 లక్షల నుంచి 70 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి (చదవండి: ఎయిరిండియా సీఈవో పోస్టుకు ఇల్కర్ తిరస్కరణ ) -
రైల్లోంచి తోసేశారు: భారత విద్యార్థుల ఆవేదన
తిరువనంతపురం: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. రాజధాని కీవ్ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకుందామన్నా సాధ్యం కావడం లేదని, ప్రాణాలతో ఉంటామో లేదో అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియో సందేశాన్ని సోమవారం ఓ వార్తా సంస్థకు పంపించారు. కీవ్‌లోని రెండు మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న 350 మంది భారత విద్యార్థులు ప్రస్తుతం ఓ రైల్వేస్టేషన్లో తలదాచుకుంటున్నారు. ఇండియన్ సూచన మేరకు.. దక్షిణ ఉక్రెయిన్‌లోని లెవివ్ పట్టణానికి చేరుకోవడానికి రైళ్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తే, స్టేషన్ సిబ్బంది తమను బలవంతంగా కిందకు తోసేశారని విద్యార్థులు చెప్పారు. తమను దూషించారని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే కర్రలతో చావబాదారని తెలిపారు. తమతోపాటు వందలాది మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లోనే చిక్కుకుపోయారని వారు పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని, దయచేసి కాపాడండి అంటూ ప్రాధేయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకోవాలని ఆరాటపడొద్దని, అది వెంటనే సాధ్యం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విద్యార్థులకు సూచించాచు. తొలుత ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. అక్కడ యుద్ధభయం అంతగా లేదని అన్నారు.