Indian In Ukraine: Indian Students Beaten By Poland Police At Ukraine Borders - Sakshi
Sakshi News home page

భారతీయులపై పోలాండ్‌ పోలీసుల అరాచకం.. కాళ్లతో తన్నుతూ.. వీడియో వైరల్‌

Feb 27 2022 8:12 PM | Updated on Feb 28 2022 11:02 AM

Poland Kicked Indian Student At Ukraine Border - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను స‍్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క‍్రమంలో పోలాండ్‌ మీదుగా స్వదేశానికి తరలి వచ్చేందుకు భారత విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి పయనమయ్యారు. అంతకు ముందు పోలాండ్‌ అధికారులు సైతం భారత విద్యార్ధులకు వీసా లేకపోయినప్పటికీ తమ దేశంలోకి రావచ్చు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉండగా.. పోలాండ్‌ సరిహద్దుల్లోకి భారత విద్యార్థులు రాగానే ఆ దేశ పోలీసులు ఒ‍క‍్కసారిగా రెచ్చిపోయారు. ఉద్రిక్త పరిస్థితుల్లో నుంచి బయటపడుతున్నారన్న జాలి కూడా చూపకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ర‌ద్దీని నియంత్రించే క్ర‌మంలో పోలీసులు స‌హ‌నం కోల్పోయి విచ్చక్షణారహితంగా కాల్పులు జరుపుతూ, లాఠీచార్జ్‌ చేశారు. 


అంతటితో ఆగకుండా వారు ఏదో నేరం చేసినట్టుగా విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కాళ్లతో తన్నుతూ, దారుణంగా చితకబాదారు. ఆడ‌వాళ్లు కాళ్లు మొక్కితేనే బార్డ‌ర్ దాటి రావాలని, మ‌గ‌వాళ్లు తాము చెప్పినట్టు వింటేనే రానిస్తామంటూ పోలీసులు ష‌ర‌తులు పెట్టిన‌ట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కేరళకు చెందిన ఏంజెల్‌ అనే విద్యార్థి అక్కడి పోలీసుల దుసురు ప్రవ‍ర్తనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పోలీసుల దాడిపై వీడియో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలెండ్ పోలీసుల తీరుపై నెటిజన్లు మండిప‌డుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement