Poland
-
స్వియాటెక్ ఫటాఫట్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవా లిస్తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది. కీస్ సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది. సినెర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. -
బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!
మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది... నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా. .. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్‌లో ఆమె శవాన్ని పార్శిల్ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.పోలాండ్(Poland) నగరం కటోవీస్‌లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18). దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. గ్లివిస్ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది. -
అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?
చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న రాజుల కాలం నాటి ఎన్నో ప్రసిద్ద కోటల గురించి కథకథలుగా విన్నాం. కొన్ని కోటలు మిస్టరీగా ఉండి లోనివి వెళ్లేందుకు భయంకరంగా ఉన్న వింత కట్టడాలను చూశాం. ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీని ఎంతో మెచ్చుకుని సంబరిపడ్డాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా కోట మాదిరి ఓ ఆధునాతన కట్టడం మన ముందుక రానుంది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో వింటే షాకవ్వుతారు. ఎక్కడంటే..?చుట్టూ కొలను, కొలను మధ్యలో కోట– చూడటానికి వింతగా ఉంది కదూ! పోలండ్‌లో ఉన్న ఈ రాతికోట పురాతన కట్టడమేమీ కాదు, అత్యంత అధునాతన కట్టడం. పశ్చిమ పోలండ్‌లో ఉన్న నాటెకా అడవి శివార్లలో ఉన్న కొలనులో కృత్రిమ దీవిని నిర్మించి, ఆ దీవిపై ఈ రాతికోట నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. ‘స్టోబ్నిసా క్యాజిల్’ పేరుతో చేపట్టిన ఈ కోట నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. దీని నిర్వాహకులు ప్రస్తుతం కోట పరిసరాలను తిలకించడానికి పర్యాటకులకు టికెట్లు అమ్ముతున్నారు. ఒక్కో టికెట్టు ధర 5.90 పౌండ్లు (రూ.650) మాత్రమే!(చదవండి: ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!) -
వన్స్‌మోర్... వరల్డ్ రికార్డు
సిలెసియా (పోలాండ్): క్రీడాకారులెవరైనా ఒకసారి ప్రపంచ రికార్డు సృష్టిస్తేనే ఎంతో గొప్ప ఘనతగా భావిస్తారు. రెండుసార్లు బద్దలు కొడితే అద్భుతం అనుకుంటారు... మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొలి్పతే అసాధారణం అనుకుంటారు... మరి 10 సార్లు ప్రపంచ రికార్డులను సవరించిన వారిని ఏమనాలి...! ప్రస్తుతానికి మోండో డుప్లాంటిస్ అని అనాల్సిందే. వరల్డ్ రికార్డులు తన చిరునామాగా మలుచుకొని... ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇంత సులువా అన్నట్లు స్వీడన్ పోల్‌వాల్టర్ మోండో డుప్లాంటిస్ చెలరేగిపోతున్నాడు. మూడు వారాల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లో తొమ్మిదోసారి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్... తాజాగా పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో 10వసారి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. తన రెండో ప్రయత్నంలో డుప్లాంటిస్ 6.26 మీటర్ల ఎత్తును దాటేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 6.25 మీటర్లతో తానే సృష్టించిన వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాంటిస్కు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు ఇదే మీట్లో నార్వేకు చెందిన జాకబ్ ఇంగెబ్రింగ్స్టెన్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇంగెబ్రింగ్స్టెన్ 7 నిమిషాల 17.55 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో 1996లో కెన్యా అథ్లెట్ డేనియల్ కోమెన్ (7 నిమిషాల 20.67 సెకన్లు) నెలకొలి్పన వరల్డ్ రికార్డు తెరమరుగైంది. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు జాకబ్‌కు కూడా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందించారు. -
వినూత్న విదేశాంగ విధానం
నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలామంది అనుకొనేదే. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందోనన్న సంశయమే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన తాజా యూరోప్ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిన వైనాన్ని వెల్లడించింది. ఇది మంచిదా, కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గరా కాదు... దూరమూ కాదని అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య దేశాలకూ మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తుకుతెస్తుంది. మోదీ రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్ దుదాతో సమావేశమయ్యారు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఇవి రివాజులో భాగంగా సాగిన పర్యటనలు కాదు. మన దేశ ప్రధాని ఒకరు పోలెండ్‌ను సందర్శించటం గత నలభై అయిదేళ్లలో ఇదే తొలిసారి. 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. కానీ అప్పటికది సోవియెట్ యూనియన్ ఛత్రచ్ఛాయలో ఏర్పడ్డ వార్సా సైనిక కూటమిలో భాగం. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలడానికి చాలా ముందే పోలెండ్ బాట మార్చింది. సోవియెట్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో కూటమి దేశాలకు చేరువైంది. 1999లో నాటోలో చేరింది. 2004లో యూరొపియన్ యూనియన్ (ఈయూ)లో భాగమైంది. ఆ తర్వాత మరెప్పుడూ మన ప్రధానులు ఆ దేశాన్ని సందర్శించ లేదు. ఇక సోవియెట్‌లో ఒకప్పుడు భాగమైన ఉక్రెయిన్ 26 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల సలహాతో తన అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకుంది. భిన్న సందర్భాల్లో వాటి మనోభావాలకు తగినట్టు తన విధానాలను తీర్చిదిద్దుకుంది. వాజపేయి హయాంలో మన దేశం నిర్వహించిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది. మన కశ్మీర్ విధానాన్ని ఖండిస్తూ వచ్చింది. పాకిస్తాన్‌కు శతఘ్నులు విక్రయించింది. రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈమధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్ కూడా ప్రదర్శించింది. జూలై రెండో వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. నెత్తురంటిన పుతిన్‌తో ఎలా కరచాలనం చేస్తారని మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవటం విచారకరమన్నారు. ఆ సమయంలో మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియూవ్‌లో పిల్లల ఆస్పత్రిపై రష్యా బలగాలు దాడి చేసిన మాట వాస్తవమే. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం గనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. ఇది తెలివితక్కువతనం. భారత్–రష్యా సంబంధాల సంగతే తీసుకుంటే రష్యా అనేక కారణాల వల్ల పాకిస్తాన్‌కు ఆయుధ విక్రయంపై ఉన్న ఆంక్షలను పదేళ్లక్రితం సడలించింది. దూరశ్రేణి క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలు అందజేసింది. ఎంఐ–26 సైనిక రవాణా హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి సాయం అందజేసింది. మనకు ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు విక్రయించినప్పుడల్లా సమతూకం పాటించే నెపంతో పాకిస్తాన్‌కు కూడా అమ్మకాలు సాగించటం రష్యా నేర్చుకుంది. చైనాతో దాని సంబంధాలు సరేసరి. ఇలా మనకు బద్ధ వ్యతిరేకమైన రెండు దేశాలతో రష్యా సంబంధాలు నెరపుతున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కోరుకోవటం అర్థరహితం.రష్యా – ఉక్రెయిన్ల మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మన దేశం ఖండించలేదు. రష్యాను విమర్శిస్తూ తీసుకొచ్చిన తీర్మానాలపై వోటింగ్ సమయంలో మన దేశం గైర్హాజరైంది. అయితే యుద్ధ క్షేత్రంలో కాక చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఈ మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇరు దేశాలూ చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సరిగ్గా నాటో 75 యేళ్ల ఉత్సవాల సందర్భంలో రష్యా పర్యటనను ఎంచుకున్నందుకు అమెరికా ఆగ్రహించింది. అయితే ఎడతెగకుండా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకడమెలా అన్నది దానికి బోధపడటం లేదు. తన మద్దతుతో, పాశ్చాత్య దేశాల సహకారంతో 3, 4 నెలల్లో రష్యాను ఉక్రెయిన్ అవలీలగా జయిస్తుందన్న భ్రమ మొదట్లో అమెరికాకు ఉంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది కొడిగట్టింది. నిరుడు ఫిబ్రవరిలో శాంతి సాధన పేరుతో చైనా ఒక ప్రతిపాదన చేసింది. కానీ అందులో రష్యావైపే మొగ్గు కనబడుతోందన్న విమర్శలొచ్చాయి. పైపెచ్చు చైనా అధికారిక మీడియా మొదటి నుంచీ రష్యాను వెనకేసుకొస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ దౌత్యంపై ఆశలేర్పడటం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాలు మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరొప్ దేశాలు గుర్తించాల్సివుంది. ఆ తర్వాతే ఉక్రెయిన్ దూకుడు తగ్గుతుంది. ఆ మాటెలావున్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచింది. -
ఉక్రెయిన్‌లో శాంతికి సహకారం
వార్సా: ఏ సమస్యకైనా సరే యుద్ధక్షేత్రంలో పరిష్కారం దొరకదని తాము బలంగా నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంఘర్షణలు, వివాదాలను శాంతియుతంగా దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవడమే ఉత్తమమైన విధానమని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తిసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రెండో రోజు గురువారం పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్‌్కతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–పోలండ్ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఒకదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కారి్మకులు మరో దేశంలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి వీలు కలి్పంచే సామాజిక భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, కృత్రిమ మేధ(ఏఐ), అంతరిక్షం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. డొనాల్డ్ టస్‌్కతో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో చర్చించిన కీలక అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సంస్థలను సంస్కరించాలిభారత్–పోలండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండుతున్నాయని, ఈ సందర్భంగా ఇరు దేశాల నడుమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. సామాజిక భద్రతా ఒప్పందంతో నైపుణ్యం కలిగిన కారి్మకులకు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వారి సంక్షేమం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్–రష్యా ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను క్షేమంగా వెనక్కి రప్పించడానికి సహకరించినందుకు పోలండ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై పోలండ్ సైతం తనతో ఏకీభవించిందని తెలిపారు.భారత్‌కు అభినందనలు: డొనాల్డ్ టస్క్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న యుద్ధాలపై మోదీ, తాను చర్చించామని టస్క్ వివరించారు. వాటిపై స్పష్టతకు వచ్చామన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా కృషి చేయడానికి మోదీ సంసిద్ధత వ్యక్తం చేయడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. భారత్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు. -
Narendra Modi: అన్ని దేశాలతో కలిసి నడుస్తాం
వార్సా/సాక్షి, న్యూఢిల్లీ: ‘‘దశాబ్దాల క్రితం పలు దేశాలతో సమదూరం పాటించిన భారత్ నేడు అన్ని దేశాలతో అనుసంధానమవుతోంది. అందరి అభివృద్ధినీ కాంక్షిస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం రాత్రి పోలండ్ రాజధాని వార్సాలో భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి. యుద్ధం మానవాళికి మహా ముప్పు. భారత్ అనాదికాలం నుంచి శాంతినే ప్రవచించింది. ఇది యుద్ధాల యుగం కాదంటూ మన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఈ విపత్కర పరిస్థితుల్లో సమష్టిగా ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యమార్గం ద్వారానే శాంతి సాధ్యం. సంక్షోభం అంచుకు చేరిన ఏ దేశానికైనా ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సదా సిద్ధం. సహానుభూతికి సరైన అర్థం ‘భారత్’. కష్టజీవులకు చిరునామా భారత్. బుద్దుని బోధలతో పునీతమైన నేల భారత్. ప్రపంచంలో ఎక్కడ విలయాలు సంభవించినా ‘మానవాళికి సాయం’ మంత్రాన్నే జపిస్తుంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడినంతసేపూ ‘మోదీ మోదీ’ నినాదాలతో సభావేదిక మార్మోగింది.వార్సాలో ఘనస్వాగతం అంతకుముందు మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. పోలాండ్ అధికారులు, భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మోదీ బస చేసిన హోటల్లో భారతీయ, పోలండ్ కళాకారులు సంప్రదాయ గుజరాతీ దుస్తులు ధరించి అద్భుతమైన నృత్యరూపకం ప్రదర్శించారు. వారి నృత్యాన్ని మోదీ అభినందించారు. భారత ప్రధాని పోలండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి! పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ సెబాస్టియన్ డుడా, ప్రధాని డొనాల్డ్ టస్‌్కతో మోదీ గురువారం సమావేశమవుతారు. శుక్రవారం మోదీ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకుంటారు.తెలుగు సంఘం ప్రతినిధుల స్వాగతం పోలండ్ తెలుగు అసోసియేషన్ (పోటా) ప్రతినిధులు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆయన బస చేసిన హోటల్లో తెలుగు తల్లికి వందనం, భరతమాతకు వందనం అంటూ స్వాగతించారు. పోలండ్‌లో దాదాపు 25వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 5 వేల మందికిపైగా ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులున్నారు.గుడ్ మహారాజా స్క్వేర్ వద్ద నివాళులుజామ్నగర్ పాలకుడు జామ్ సాహెబ్ దిగి్వజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా స్మారకార్థం వార్సాలో ఏర్పాటు చేసిన ‘గుడ్ మహారాజా స్క్వేర్’ వద్ద మోదీ నివాళులరి్పంచారు. నగరంలోని మాంటె కసీనో వార్ మెమోరియల్ సమీపంలోని వలివాడె–కొల్హాపూర్ స్మారకం వద్ద కూడా నివాళులర్పించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణ సమీపంలోని వలివాడె గ్రామం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6 వేల మందికిపైగా పోలండ్ ప్రజలకు ఆశ్రయమిచ్చింది. -
పోలెండ్ చేరుకున్న ప్రధాని మోదీ
వార్సా: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(ఆగస్టు21) సాయంత్రం పోలెండ్ చేరుకున్నారు. రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం పలికారు. భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలెండ్‌లో పర్యటిస్తున్నారు. పోలెండ్ పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. -
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. 45 ఏళ్లలో తొలిసారి
న్యూఢిల్లీ: పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయల్దేరారు. నేడు ఆయన పోలాండ్ రాజధాని వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని మోదీ తెలిపారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.కాగా గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ పోలాండ్‌ను సందర్శించారు. అయితే ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా పోలాండ్‌లో మోదీ పర్యటన సాగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశంలోనూ ప్రధాని పర్యటించనున్నారు. ఇక ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.Leaving for Warsaw. This visit to Poland comes at a special time- when we are marking 70 years of diplomatic ties between our nations. India cherishes the deep rooted friendship with Poland. This is further cemented by a commitment to democracy and pluralism. I will hold talks…— Narendra Modi (@narendramodi) August 21, 2024 -
పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 21 పోలాండ్‌లో పర్యటించనున్నారు. ఆగష్టు 23న యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి తన్మయలాల్ సోమవారం ప్రకటించారు.కాగా భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు. మరోవైపు రష్యాతో వివాదం తర్వాత ఉక్రెయిన్‌లో ప్రధాని తొలి పర్యటన ఇది. గత 30 ఏళ్లలోనూ భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి మాస్కోలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన నెల రోజుల తర్వాత మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య రాజధానులు మాస్కోపై ఆంక్షలు విధించారు. అయితే భారతదేశం వంటి స్నేహపూర్వక దేశాలు దానితో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. -
మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!
మిస్ సుప్రానేషనల్ 2024 అందాల పోటీలు పోలాండ్లోని మలోపోల్స్కాలో జరిగాయి. ఆ పోటీల్లో భారతదేశానికి చెందిన సోనాల్ కుక్రేజాతో సహా సుమారు 68 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సోనాల్ 12వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని జైపూర్‌లో జన్మించిన సోనాల్ యూఎస్ఏలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌ను అభ్యసించింది. అంతేగాదు కొత్త క్రిప్టో సేవలతో భారతదేశ ఆర్థిక ప్రపంచాన్ని మార్చే ఒక స్టార్టప్ యునికాన్ వ్యవస్థాపకురాలు కూడా. మహిళల సామాజిక నిబంధనలను ఉల్లంఘించి ఆర్థికంగా స్వతంత్రంగా మారాలిని ఆమె కోరుకుంటోంది. అంతేగాదు ఆమె గతంలో లైవా మిస్ దివా సుప్రానేషనల్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇక ఈ మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని ఇండోనేషియాకు చెందిన హరాష్ట హైఫా జహ్రా సొంతం చేసుకుంది. ఆమె ఇండోనేషియా ఎంట్రెప్రెన్యూర్, మోడల్, అందాల రాణి. ఆమె గతంలో పుటేరి ఇండోనేషియా 2024 కిరీటాన్ని పొందింది. ఆమె పర్యావరణ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. కాగా, ఈ అందాల పోటీల జాబితాలో ఫిన్లాండ్కు చెందిన అలెగ్జాండ్రా హన్నుసారి, థాయ్‌లాండ్‌కు చెందిన కసామా సూట్రాంగ్, ప్యూర్టో రికోకు చెందిన ఫియోరెల్లా మదీనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెథియా అంబ్రోసియో, దక్షిణాఫ్రికాకు చెందిన బ్రయోనీ గోవెండర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన జెన్నా డైక్స్ట్రా, డెన్మార్క్ లార్సెన్‌కు చెందిన విక్టోరియా లార్సెన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?) -
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
యూరో కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం హాంబర్గ్ వేదికగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్‌లో ఆఖరికి విజయం డచ్ జట్టునే వరించింది.తొలుత ఫస్ట్‌హాఫ్ 16వ నిమిషంలో ఆడమ్ బుకస పోలండ్‌కు మొదటి గోల్‌ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్ ఫార్వర్డ్ కోడి గక్పో అద్బుతమైన గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.ఫస్ట్‌హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్ సమయంలో పొలాండ్ మేనెజర్ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్‌కు బదలుగా ఇంపాక్ట్ సబ్‌గా స్జిమాన్స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు.కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్ హాఫ్ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.వౌట్ వెఘొర్స్ అద్బుతం..ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్ సమయంలో రోనాల్డ్ కోమాన్.. మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్ని ఇంపాక్ట్ సబ్‌స్ట్యూట్‌గా తీసుకువచ్చాడు.మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్.. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్‌కొట్టి డచ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్ నిరాశలో కూరుకు పోయింది.చదవండి: ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ -
పోలాండ్ రోడ్లు, స్కూళ్లకు భారతీయ రాజు పేరెందుకు?
పోలాండ్ దేశం తమ ప్రాంతాల్లోని రహదారులకు, స్కూళ్లకు ఒక భారతీయ రాజు పేరు పెట్టి మరీ గౌరవించింది. అంతలా విదేశీయలుచే గౌరవింపబడుతున్న ఆ రాజు ఎవరూ? అతడేం చేశాడంటే..రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ ఆర్మీ తమ దేశంలోని 600 మంది మహిళలను పిలలను ఒక ఓడలో వేరే దేశానికి వెళ్లిపోమని చెప్పి పంపించేశారు. ఏ దేశం రక్షణ కల్పిస్తే అక్కడ ఆశ్రయం పొందమని చెప్పి మరీ వారందర్నీ షిప్లో పంపించేశారు. అయితే వాళ్లకు ఏ దేశం ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. చివరకు వాళ్ల ఓడ మంబై పోర్టుకు చేరుకుంది. అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ సైతం వీరికి ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఈ విషయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన మహారాజ్ దిగ్విజయ్ సింగ్ రంజిత్ సింగ్ జడేజా తెలిసింది. వెంటనే ఆయన తన రాజ్యంలో పోలిష్ శరణార్థులకు, పిల్లలకు ఆశ్రయం ఇచ్చాడు. వారందరీ కోసం తన ప్యాలెస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఒక ప్యాలెస్‌ని నిర్మించి ఇచ్చాడు. వారందర్నీ తన స్వంత కుటుంబంలా చూసుకున్నాడు. వారి పిల్లలకు స్కూళ్లు, ఆహారశైలికి సంబంధించిన గోవా వంటవాళ్లను ఏర్పాటు చేశాడు. అలా వాళ్లు దాదాపు తొమ్మిదేళ్లపాటు గుజరాత్‌లోని జామ్నగర్లోనే ఆశ్రయం పొందారు. ఆ తర్వాత వారంతా దేశానికి వెళ్లిపోయారు. ఏ దేశం ఆశ్రయం ఇవ్వకపోయిన ఆ భారతీయ రాజు ఎంతో సహృద్భావంతో తమకు ఆశ్రయం ఇచ్చాడని కొనియాడుతూ..ఆ రాజుని పోలాండ్ అత్యున్నత మెడల్‌తో సత్కరించింది. అంతేగాదు ఆ భారతీయ రాజు మానవత్వంతో చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా తమ దేశంలోని రహదారులకు, స్కూళ్లకు ఆయన పేరు పెట్టుకున్నారు. (చదవండి: వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?) -
ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే..!
కీవ్: ఉక్రెయిన్‌పై ఆదివారం(మార్చ్ 24)రష్యా తాజాగా మిసైళ్లతో విరుచుకుపడింది. కీవ్‌తో పాటు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్పై రష్యా దాడులు చేసింది. కీవ్‌లో రష్యా దాడుల కారణంగా పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయని నగర మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని, పెద్దగా నష్టమేమీ జరగలేదని కీవ్ చీఫ్ మిలిటరీ ఆఫీసర్ చెప్పారు. రష్యా మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసిందని తెలిపారు. ఇటీవల తమ దేశంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్ కావాలని దాడులు చేసిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై రష్యా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. రష్యా తాజా దాడులతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ అలర్ట్ అయింది. తమ ఆకాశంలోకి ఇతర దేశాల యుద్ధ విమానాలు ప్రవేశించకుండా నిఘా పెట్టింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం బాధితుడే!
అత్యంత అరుదైన వ్యాధి. దీని బారినపడితే ఆ వ్యక్తి అత్యంత నరకయాతన అనుభవిస్తాడు. చివరికి ఆ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారట. అందుకే దీన్ని "ఆత్మహత్య వ్యాధి" అని కూడా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా ఆ వ్యాధి? ఎలా సోకుతుంది తదితరాల గురించే ఈ కథనం.! ఈ వ్యాధి పేరు ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రైఫేషియల్ న్యూరల్జియా అంటారు. వ్యవహారికంలో ఫాంటమ్ ఫేస్ పెయిన్ అని పిలుస్తారు. ఇది ముఖంలోని నరాలకు సంబంధించిన వ్యాధి. కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రెజిమినల్ నాడిని ప్రభావితం చేస్తుందట. దీంతో ఆ వ్యక్తి ముఖంలో ఎడమ లేదా కుడివైపు విపరితమైన నొప్పి వస్తుంది. అది ఒక తిమ్మిరి మాదిరిగా, ఎవ్వరైన కొడితే దిమ్మతిరిగినట్లుగా పెయిన్ వస్తుందట. అలా అరగంట నుంచి గంట వరకు విపరీతమైన నొప్పి ఉంటుందట. దీంతో నోరు లేదా దవడలను కదపడం చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎంతసేపు ఉంటుందనేది చెప్పలేం. తగ్గాక కూడా మళ్లీ ఎప్పుడూ వస్తుందో కూడా చెప్పలేం. దీని ప్రభావం దైనందిన జీవితంపై ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడూ కనీసం బ్రెష్ కూడా చేయలేరు. ఆ నొప్పికి తాళలేక ముఖాన్ని మాటి మాటికి రాపిడికి గురి చేస్తారు రోగులు. దీంతో ముఖం పుండ్లుగా ఏర్పడి ఒక విధమైన చర్మవ్యాధికి దాదితీస్తుంది. ఇది 50 ఏళ్ల వయసు నుంచి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కూడా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమస్యను క్రికెటర్ల దగ్గర నుంచి ఎందరో ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఫేస్ చేశారట. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వ్యాధి బారినే పడ్డారు. దీని కోసం యూఎస్ వెళ్లి మరీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐతే ఈ చికిత్స అత్యంత ఖర్చుతో కూడినది. పైగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండదు. ఎలా వస్తుందంటే.. ట్రిజెమినల్ న్యూరల్జియా లేదా ట్రిజెమినల్ డిఫెరెంటేషన్ నొప్పి అనేది కపాలం నుంచి ముఖానికి వెళ్లే త్రిభుజాకారంలోని నరాలు దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుంది. ఈ నొప్పి తొమ్మిరితో కూడిన ఒక విధమైన భరించేలేనిదిగా ఉంటుంది. మైగ్రైన్ నొప్పిలా అనిపిస్తుంది. దీనికి చికిత్స కూడా చాల కష్టం. ప్రస్తుతం తాజాగా పోలాండ్‌కి చెందిన 70 ఏళ్ల మహిళ కూడా ఇదే వ్యాధిని బారినపడింది. దీని కారణంగా ఆమె కుడివైపు నాసికా రంధ్రం గాయమవ్వటమే కాకుండా కన్ను కుడవైపు ముఖ ప్రాంతమంతా పుండుగా మారిపోయింది. ఆ నొప్పికి తాళ్లలేక ముఖాన్ని రుద్దడంతో పుండ్లు వచ్చి చర్మవ్యాధికి దారితీసింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రితో జాయిన్ చేశారు. వైద్యులు ఆమె ట్రైజెమినల్ ట్రోఫిక్ సిండ్రోమ్(టీటీస్)తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఎదురయ్యే సమస్యలు.. దీని కారణంగా దవడ, దంతాలు లేదా చిగుళ్ళలో విద్యుత్ షాక్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ముఖంలో ఆకస్మిక నొప్పికి కారణమయ్యే నరాల నష్టం అని అన్నారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చు గానీ కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయని అంటున్నారు. దాదాపు నూరు కేసుల్లో 70 శాతం సక్సెస్ అయితే 30 శాతం ఫెయిల్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయని అన్నారు. దీనికి పవర్ఫుల్ యాంటి బయోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందన్నారు. వృద్ధులు వాటిని తట్టుకునే స్థితిలో ఉండలేరు కాబట్టి వారికి చికిత్స చేయడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధి భారినపడ్డవారు చేతికి గ్లౌజ్‌లు ధరించి ముఖాన్ని రాపిడికి గురిచేయకుండా ఉండేలా క్లాత్‌ని చుట్టి ఉంచుకుంటే..కొద్ది మోతాదు మందులతోనే నయం చేసే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
పోలాండ్ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్ యువకుడు!
పాకిస్తాన్‌కు చెందిన సీమా, యూపీకి చెందిన సచిన్ ప్రేమ కథ, అనంతర పరిణామాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పోలాండ్ మహిళ బార్బరా, జార్ఖండ్ యువకుడు షాబాద్‌ల ప్రేమ కథ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. ప్రియురాలు బార్బరా యూరోపియన్ దేశమైన పోలాండ్‌కు చెందినది. ప్రియుడు జార్ఖండ్‌లోని కటకంసాండీ బ్లాక్ పరిధిలోని బరతువా గ్రామానికి చెందినవాడు. వీరికి సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2021లో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. అంతే.. ఆమె పోలాండ్ విడిచిపెట్టి తన ఆరేళ్ల కుమార్తె అనన్యతో పాటు బరతువా గ్రామానికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె ప్రియుని ఇంటిలోనే ఉంటోంది. త్వరలో వీర్దిదరూ వివాహం చేసుకోనున్నారు. గ్రామంలో వీరి వివాహానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. బార్బరా కుమార్తె ఇప్పటి నుంచే షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. తనకు భారత్ ఎంతో నచ్చిందని, తాను ఇక్కడికి రాగానే తనను స్థానికులు ఒక సెలబ్రిటీగా చూస్తున్నారని బార్బరాతెలిపింది. ఇది కూడా చదవండి: 36 ఏళ్లుగా అతనినే తండ్రి అనుకుంది.. తల్లి అసలు రహస్యం చెప్పగానే.. -
వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..
చెట్లు నిటారుగా ఉంటాయి. కొన్ని వంకరగా కూడా ఉంటాయి. మరికొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్లో లేక మరేదైనా కారణం చేతనో వంకరగా ఉండటం సహజం. కానీ ఎవరో దగ్గరుండి పనిగట్టుకుని పెంచినట్లుగా అన్ని ఒకే వంకరల్లో చెట్లు ఉంటాయ?. విచిత్రం ఏమిటంటే అలా వంపు తిరిగి ఉన్నవన్నీ ఒకే జాతి మొక్కలు. ఎందకిలా జరిగింది? రీజన్ ఏంటో అని శాస్త్రవేత్తలు జుట్లు పీక్కుని మరీ పరిశోధనలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇంతకీ ఆ అడవి ఎక్కడుందంటే.. పోలాండ్లోని వెస్ట్ పోమెరేనియాలోని గ్రిఫినో అనే పట్టణానికి సమీపంలో ఈ విచిత్రమైన అడవి ఉంది. దీన్ని 'వంకర అడవి' లేదా క్రూక్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి చెట్టు బేస్ వద్ద వంపు తిరిగి ఉండి.. అసాధారణమైన అడవిలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ పైన్ చెట్లే. పైగా చెట్లన్ని కూడా సుమారు 90 డిగ్రీ బేస్ వంపు తిరిగి ఉన్నాయి. సుమారు రెండు హెక్టార్ల భూమిలో వందకు పైగా ఉన్నో ఈ పైన్ చెట్లన్ని ఇలానే వంకరగా ఉన్నాయి. చూడటానికి ఆంగ్ల అక్షరం 'J' ఆకారంలో ఉన్నాయి చెట్లు. ఆ చెట్లన్ని కూడా ఉత్తరం వైపే తిరిగి ఉంటాయి. ఇవి వంకరగా ఉన్నప్పటికీ వాటి వంపుతో సంబంధంల లేకుండా సుమారు 50 అడుగులు ఎత్తు వరకు ఎదగుతుండడం విశేషం. వాటికి ఎలాంటి చీడపీడల లేవు. పైగా ఆరోగ్యంగా ఉన్నాయి. పైన్ చెట్లు ఎందుకిలా వంపు తిరిగి ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో భాగంగా ఆ చెట్ల వయసును లెక్కిస్తే.. దాదాపు 1930లలో నాటిన చెట్లుగా తేలింది. ఇక్కడ చెట్లు వంపు తిరిగి ఉండటానికి మంచు తుపానులు, లేక గురత్వాకర్షణ శక్తి లేదా జన్యు పరివర్తన అని పరివిధాలుగా పరిశోధనలు చేసినా.. ఓ పట్టాన శాస్త్రవేత్తలు అసలు కారణం ఏమిటో చెప్పలేకపోయారు. గ్రహాంతరవాసులు పని అని కొందరూ భావిస్తున్నారు. ఈ ఫైన్ చెట్లు ఇలా అసాధారణ రీతిలో ఉండటానకి కారణం స్థానికి రైతులేనని అంటున్నారు పలువురు. ఫర్నీచర్ కోసం ఇలా వంగిన చెట్లను ఉద్దేశపూర్వకంగానే పెంచుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈ అడివిలో దాదాపు 400 పైన్చెట్లు ఉన్నాయని అవే అలా వంకర ఉన్నాయని పలు వాదనలు వినిపిస్తున్నాయి. 1970లో రెండోవ ప్రపంచ యుద్ధంలో ఆ అడవిని అలా వదిలేయడంతో ఇలా చెట్లు వంపు తిరిగి ఉన్నాయని కొందరూ చెబుతున్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థానికులకే ఈ అసాధారణ అడవికి సంబంధించిన రహస్యం తెలిసి ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైనా ఇప్పటి వరకు ఆ అడవి అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది. (చదవండి: ఓర్నీ!.. ఏం రికార్డ్రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!) -
పారిస్ ఒలింపిక్స్‌కు అవినాశ్ సాబ్లే అర్హత
భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో అర్హత సాధించాడు. పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల అవినాశ్ 8 నిమిషాల 11.63 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (8ని:15.00 సెకన్లు) అవినాశ్ అధిగమించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హీట్స్‌లోనే వెనుదిరిగిన అవినాశ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచాడు. -
ఊరు కాదు వీధి
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక ఊరు అనుకుంటే పొరపాటే. అదొక వీధి. అక్కడ ఏకంగా 6 వేల మంది నివసిస్తున్నారు. ఆ వీధి మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడుంటుందో అక్కడ నివసించే వారికే సరిగ్గా తెలీదు. ఇలాంటి వీధి పోలండ్‌లో ఉంది. ఈ వీధికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. దక్షిణ పోలండ్‌లో సులోస్జోవా అనే పట్టణంలో ఈ వీధి ఉంది. దీని పొడవు ఏకంగా తొమ్మిది కిలో మీటర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద వీధి ఇదే. ఇరువైపులా పచ్చని పంట పొలాలతో, పొందికగా అమర్చిన ఇళ్లతో ఈ వీధి ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. -
ఫ్రీగా వస్తోందని తప్పతాగి.. కుప్పకూలిపోయాడు
క్లబ్లో ఫ్రీ ఎంట్రీ, ఉచితంగా లిక్కర్ బోర్డు కనిపించేసరికి అతని ప్రాణం ఆగమైంది. లోపలికి దూరిపోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ జరుగుతోంది పెద్ద మోసమని అతనికి అర్థం కాలేదు. నాన్ స్టాప్‌గా అలా తాగుతూనే కుప్పకూలి.. మరణించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతని జేబులోంచి డబ్బును లాగేసుకుని.. శవాన్ని బయటకు విసిరిపారేసింది ఆ ముఠా. ఆరేళ్ల కిందట సంచలన సృష్టించిన బ్రిటిష్ టూరిస్ట్ హత్య కేసులో.. 58 మందిపై తాజాగా అభియోగాలు నమోదు చేశారు పోలాండ్ పోలీసులు. ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలు చేస్తున్న క్రమంలో.. సదరు టూరిస్ట్ ప్రాణం తీశారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు 700 నేరపూరితమైన అభియోగాలను ఈ ముఠాపై నమోదు చేశారు. ఏం జరిగిందంటే.. 2017లో బ్రిటన్‌కు చెందిన మార్క్ సీ అనే వ్యక్తి పోలాండ్‌లో పర్యటించాడు. ఆ సమయంలో ఓ స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో ఫుల్‌గా తాగాడు. ఆపై క్రాకో లో ఉన్న వైల్డ్ నైట్ క్లబ్‌కు చేరాడు. అక్కడ ఉచిత ప్రవేశం బోర్డు చూసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఫ్రీగా మందు తాగుతూ పోయారు. అయితే ఒక దశకు వచ్చేసరికి.. మార్క్ ఆపేద్దామనుకున్నా క్లబ్ నిర్వాహకులు ఊరుకోలేదు. గంటన్నరలో అతనితో 22 పవర్ఫుల్ షాట్స్ తాగించారు. ఇంకేం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మార్క్. చనిపోయిన తర్వాత ఆ ముఠా.. అతని జేబులో ఉన్న డబ్బు లూఠీ చేసింది. అతని శవాన్ని, మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని క్లబ్ బయటకు నెట్టేసింది. శవ పరీక్షలో.. మార్క్ ఒంట్లో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 0.4 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. లిక్కర్ పాయిజన్‌తోనే అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. ఆరేళ్లుగా దర్యాప్తు చేసింది. మద్యం తాగించి మత్తులో మునిగిపోయే మందు బాబుల నుంచి డబ్బు, నగదు దోచుకుంటున్నట్లు.. ప్రత్యేకించి టూరిస్టులే టార్గెట్‌గా ఈ మోసం నడుస్తున్నట్లు తేల్చారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు మనిషి శరీరం బ్లడ్‌లో ఆల్కాహాల్ లెవల్ 0.3కి చేరినా, అంతకు మించినా ఆల్కాహాల్ పాయిజనింగ్ జరిగినట్లు లెక్క. దొరికింది కదా అని వేగంగా మద్యం తాగడమూ ఆరోగ్యానికి హానికరమే. మాట, నడకలో తడబాటుతో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడడం లేదంటే ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలతో గుండె ఆగిపోవడం లాంటి హఠాత్ పరిణామాలు ఎదురవుతాయి. -
95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు
ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా..మెడల్స్ కొట్టాలన్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువైంది. తాజాగా పోలాండ్లోని టొరున్లో జరిగిన తొమ్మిదో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్(World Master Athletics Indoor Championship)లో సత్తా చాటింది. 60 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్‌త్రో ఈవెంట్స్‌లో భగవానీ దేవి డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది.ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. హర్యానాలోని ఖేడ్కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్‌కు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది. అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, వ్యవసాయ పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుక్కి ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో క్లర్క్‌గా ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్‌పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొంది. అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనుమడు వికాస్ డాగర్ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఎన్నో పతకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్నాడు. India's 95-year-old Bhagwani Devi Dagar won 3 gold medals in the 9th World Master Athletics Indoor Championship 2023 at Toruń, Poland. She clinched the medals in 60-meter running, shotput and discus throw. pic.twitter.com/CaR6pj1PRW — ANI (@ANI) March 29, 2023 🙏🙏🙏🙏🙏 https://t.co/IUdldckOOc — ATHLETE BHAGWANI DEVI DAGAR (@BhagwaniDevi94) March 6, 2023 చదవండి: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? -
పారిస్ పవనాలు
తెలుగువాళ్లు ఉగాది జరుపుకోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రపంచ సాహిత్యానికి ‘వసంతం’ వచ్చింది. సాహిత్య రంగంలో అత్యంత విశిష్టమైన మ్యాగజైన్ గా పేరున్న ‘ద పారిస్ రివ్యూ’ తన 70వ వార్షికోత్సవ ‘స్ప్రింగ్’ సంచికను ఈ వారంలోనే విడుదల చేసింది. అన్ని సంచికలనూ క్రమసంఖ్యతో వెలువరించే సంప్రదాయం ఉన్నందున పత్రిక పరంపరలో ఇది 243వ ఇష్యూ. 2018లో మ్యాన్ బుకర్ గెలుచుకుని, అదే ఏడాది నోబెల్ పురస్కారం పొందిన పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ ఇంటర్వ్యూ ఈ సంచిక విశేషాల్లో ఒకటి. కవిత్వం, వచనం, కళలకు అత్యంత ప్రాధాన్యముండే ఈ పత్రికలో రచయితల అంతరంగాలను లోలోతుల నుంచి అత్యంత సూక్ష్మంగా, విశదంగా స్పృశించడం మొదటినుంచీ ఒక ప్రత్యేకతగా నిలిచిపోయింది. నేపథ్యం, రాసే విధానం, విచారధారతో పాటు సాహిత్య సృజనను ప్రయోగ శాలలో పరిశీలించినంత లోతుగా జరిపే కాలాతీత సంభాషణలు ఇవి. ‘ఒక రాత్రి ఓ స్నేహితుడు నాకు ఫ్రాంజ్ కాఫ్కా కథల పుస్తకం అరువిచ్చాడు. నేనుంటున్న లాడ్జికి తిరిగివెళ్లి ‘ద మెటమార్ఫసిస్’ చదవడం మొదలుపెట్టాను. ఆ మొదటివాక్యమే నన్ను దాదాపు మంచంలోంచి కిందపడేసినంత పని చేసింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మొదటి వాక్యం ఇలా ఉంది: ‘‘ఒక ఉదయం కలత నిదురతో మేల్కొన్న గ్రెగర్ జాంజా, మంచంలో తానొక పెద్ద పురుగుగా మారిపోయి ఉండటం గుర్తించాడు...’’ ఆ వాక్యం చదవగానే, ఎవరైనా ఇలాంటి విషయాలు కూడా రాయవచ్చని నాకు ఇంతకుముందు తెలీదే అని నాకు అనిపించింది. తెలిసివుంటే, నేను ఎప్పుడో రాయడం మొదలుపెట్టేవాడిని. వెంటనే నేను కథలు రాయడం మొదలుపెట్టాను’ అని తన సాహిత్య ప్రస్థానం గురించి చెబుతారు గాబ్రియేల్ గార్సియా మార్వె్కజ్. ‘ఫిక్షన్ నా జర్నలిజానికి సాహిత్య విలువను ఇచ్చింది. జర్నలిజం నా ఫిక్షన్ ను వాస్తవానికి దగ్గరగా ఉండేట్టు చేసింది’ అంటారు ఈ పాత్రికేయ రచయిత. ‘నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను’ అని చెబుతారు తన మాతృభాష రష్యన్ కు దూరమైన వ్లాదిమీర్ నబకోవ్. ‘అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ’ అంటారు ఈ పర్ఫెక్షనిస్టు. ‘నేను ఎవరికీ ప్రాతినిధ్యం వహించటం లేదు’ అని నిర్మొహమాటంగా చెప్పే భారత మూలాలున్న ట్రినిడాడ్–బ్రిటిష్ రచయిత వి.ఎస్.నైపాల్, ‘మనిషి అనునిత్యం నైతిక తీర్పుల బరువు మోయనక్కర్లేని ప్రపంచాన్ని కోరుకున్నాను’ అంటారు. ఎర్నెస్ట్ హెమింగ్వే, జేమ్స్ థర్బర్, రే బ్రాడ్బరీ, స్టీఫెన్ కింగ్, రేమండ్ కార్వర్, మాయా ఏంజెలో, లిడియా డేవిస్ లాంటి వందలాది మేటి రచయితల ఇంటర్వ్యూలను ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్ ’ విభాగంలో ప్రచురించింది పారిస్ రివ్యూ. జార్జ్ లూయీ బోర్హెస్, హారుకీ మురకామి, మిలన్ కుందేరా, సైమన్ దె బువా, ఒర్హాన్ పాముక్, సల్మాన్ రష్దీ, చినువా అచేబే లాంటి భిన్న మూలాలున్న రచయితలు ఇందులో ఉన్నారు. ‘ది ఆర్ట్ ఆఫ్ పొయెట్రీ’గా రాబర్ట్ ఫ్రాస్ట్, టీఎస్ ఎలియట్, అక్తావియో పాజ్, పాబ్లో నెరూడా, ఎజ్రా పౌండ్ లాంటి కవుల సంభాషణలను నమోదు చేసింది. ఇవన్నీ ‘ద రైటర్స్ ఎట్ వర్క్’ పుస్తకాల సిరీస్‌గా వచ్చాయి. ప్రపంచ చరిత్రలో పట్టువిడవకుండా ఒంటిచేత్తో నెరిపిన సాంస్కృతిక సంభాషణగా దీన్ని అభివర్ణించారు సాహిత్య విమర్శకుడు జో డేవిడ్ బెలామీ. ఈ త్రైమాసిక ఆంగ్లభాష పత్రిక ఫ్రాన్ ్స రాజధాని నగరం పారిస్‌లో 1953లో ప్రారంభమైంది. 1973లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి తన కార్యస్థానాన్ని మార్చుకుంది. పత్రికను స్థాపించిన నాటి నుంచీ 2003లో మరణించేదాకా– యాభై ఏళ్లపాటు అమెరికా రచయిత జార్జ్ ప్లింప్టన్ దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన ముద్ర ఎంతటిదంటే, ఈయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బ్రిజిడ్ హ్యూస్... ప్లింప్టన్ గౌరవార్థం ‘సంపాదకురాలు’ అనిపించుకోవడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎమిలీ స్టోక్స్ సంపాదకురాలిగా ఉన్నారు. పత్రిక చరిత్రలో ఈమె ఆరో ఎడిటర్. ఫిలిప్ రాత్, ఇటాలో కాల్వీనో, శామ్యూల్ బెకెట్, డేవిడ్ ఫాస్టర్ వాలెస్ లాంటి మహామహుల రచనలు పారిస్ రివ్యూలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 24,000 ప్రింట్ కాపీల సర్క్యులేషన్, నెలకు సుమారు 12 లక్షల ఆన్ లైన్ వ్యూస్ ఇది కలిగివుంది. ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో సాహిత్య పత్రికలు మూతపడ్డాయి. ‘ఎన్ని పోయినా మనకు ‘పారిస్’ మాత్రం ఉంటుంది’ అంటారు రచయిత వుహాన్ విడాల్. ‘పారిస్ రివ్యూ చచ్చేంత బోర్ కొడుతోందని ఎప్పటికీ అనలేం’ అంటారు పబ్లిషర్ జెస్సా క్రిస్పిన్ . ఉత్తమ సాహిత్యానికి పెద్దపీట వేయడంతో పాటు, ఆర్కైవు మొత్తాన్నీ అందుబాటులో ఉంచడం, అందులోని క్లాసిక్స్‌ను నవతరపు రచయితల వ్యాఖ్యానంతో పునఃప్రచురించడం లాంటివి కొత్త పాఠకులను పాత సాహిత్యంతో పరిచయం చేసుకునేలా ఉపకరిస్తున్నాయి. 2012 నుంచీ మొబైల్ యాప్ ప్రారంభించింది. 2017లో పాడ్‌కాస్ట్ మొదలుపెట్టింది. సమకాలీన రచయితల రచనలను తమ గొంతుల్లోనే వినిపించడం కూడా మొదలుపెట్టింది. ఎలా రాయాలో శిక్షణ ఇచ్చే రోక్సానే గే తన ‘మాస్టర్ క్లాస్’లో వర్తమాన రచయితలకు ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా: పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలను లోతుగా చదవడం! సాహిత్యం రెండో ఆలోచనగా మాత్రమే ఉండే ప్రపంచంలో దాన్ని ఉత్సాహభరితం చేస్తూ, ప్రధాన స్రవంతికి తేగలిగింది ‘ద పారిస్ రివ్యూ’! -
ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!
ఈ పొటోలో కనిపిస్తున్న పిల్లిని చూశారు కదా! భలే బొద్దుగా ముద్దుగా ఉంది కదూ! ఇది పోలండ్‌లోని స్కజేషిన్ నగరంలో ఉంటుంది. ఈ పిల్లి అక్కడ చాలా ఫేమస్. జర్మనీ సరిహద్దుల్లో ఉండే పురాతన నగరమైన స్కజేషిన్లో ఈ పిల్లి పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానికులు ఈ పిల్లికి ‘గకేక్’ అని పేరు పెట్టుకున్నారు. స్కజేషిన్ నగరం శివార్లలోని కస్జుబ్స్కా ప్రాంతంలో పదేళ్ల కిందట ఇది తొలిసారిగా కనిపించింది. అప్పటి నుంచి ఇది అదే వీథిని తన నివాసంగా చేసుకుని, ‘కింగ్ ఆఫ్ కస్జుబ్స్కా స్ట్రీట్’గా పేరు పొందింది. స్కజేషిన్ నగరానికి వచ్చే పర్యాటకులు నగరంలోని మ్యూజియం, పార్కులు, ఇతర పర్యాటక కేంద్రాలను చూడటంతో పాటు ఈ పిల్లిని కూడా ప్రత్యేకంగా చూసి, ఫొటోలు తీసుకుని వెళుతుండటం విశేషం. చదవండి: Anjali Sood: అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో.. -
2024 Paris Olympics: పారిస్ ఒలంపిక్స్‌ను బహిష్కరించాలి: పోలండ్
వార్సా: 2024 పారిస్ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్ మంత్రి కమిల్ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఈ నెల 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. -
పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య..
వార్సా: పోలాండ్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని ఒల్లూర్‌కు చెందిన సూరజ్(23) పోలాండ్లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అయితే జార్జియా దేశానికి చెందిన ఓ ముఠా సూరజ్, అతని స్నేహితులతో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సూరజ్‌ను జార్జియా దేశస్థులు కత్తితో పొడిచిచంపారు. అతని స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్ మృతిని వార్సాలోని ఇండియన్ ఎంబసీతో పాటు అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కొద్దిరోజుల క్రితం కేరళ పాలక్కడ్‌కు చెందిన ఇబ్రహీం షరీఫ్ అనే యువకుడు కూడా పోలాండ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇతడ్ని ఓనరే క్రూరంగా చంపాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే ఎందుకు హత్య చేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు. చదవండి: ఒక్క నిమిషం పట్టదు.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు -
Qatar FIFA World Cup 2022: ఫ్రాన్స్ జోరు...
దోహా: ఆద్యంతం దూకుడుగా ఆడిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొమ్మిదోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్‌తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో పోలాండ్ జట్టును ఓడించింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (44వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎంబాపె (74వ, 90+1వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్ జట్టుకు కెప్టెన్ లెవన్డౌస్కీ (90+9వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభంలో ఫ్రాన్స్‌ను నిలువరించిన పోలాండ్ తొలి అర్ధభాగం చివర్లో తడబడింది. ఎంబాపె అందించిన పాస్‌ను జిరూడ్ లక్ష్యానికి చేర్చడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. జిరూడ్ కెరీర్లో ఇది 52వ గోల్. ఈ గోల్‌తో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును జిరూడ్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ ఆడుతుంది. -
FIFA WC: తండ్రి మారడోనాతో.. కొడుకు మెస్సీతో
అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా, పోలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో పోలాండ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమి పాలైన రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ కూడా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. అర్జెంటీనా మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌లో ఒకటి జట్టు మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్ చేశాడు. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనాకు గోల్ అందించాడు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అలిస్టర్‌కు ఇచ్చేశాడు. దీని వెనుక ఒక కారణం ఉంది. అలెక్సిస్ మాక్ అలిస్టర్ తండ్రి కార్లోస్ మాక్ అలిస్టర్ కూడా ఫుట్‌బాలర్‌గా జట్టుకు సేవలందించాడు. కార్లోస్ దిగ్గజం మారడోనాతో కలిసి అర్జెంటీనాతో పాటు బోకా జూనియర్స్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మారడోనాతో కలిసి తండ్రి కార్లోస్ అలిస్టర్ ఆడితే.. ఇప్పటితరం గొప్ప ఆటగాళ్లలో ఒకడైన లియోనల్ మెస్సీతో కలిసి కొడుకు అలెక్సిస్ మాక్ అలిస్టర్ వేదికను పంచుకున్నాడు. అందుకే మెస్సీ అలెక్సిస్ తండ్రిపై ఉన్న గౌరవంతో అతనికి వచ్చిన అవార్డును అలెక్సిస్‌కు అందించాడు. ఇదే విషయమై అలెక్సిస్ మాక్ అలిస్టర్ స్పందింస్తూ.. ఇది ఎప్పటికి మరిచిపోలేనిది. నా తండ్రి దిగ్గజం మారడోనాతో కలిసి ఆడడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు నా ఆరాధ్య దైవం మెస్సీతో కలిసి ఆడడం మరిచిపోలేని అనుభూతి. అతను నాకు ట్రైనింగ్ ఇస్తున్న తీరుకు ఫిదా అయ్యా. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న అర్జెంటీనా డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అటు పోలాండ్ డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది. చదవండి: Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు' -
FIFA WC: రికార్డు బద్దలు కొట్టినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ!
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్-2022 టోర్నీలో అర్జెంటీనా ముందడుగు వేసింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు పోలాండ్‌ను 2-0తో మట్టికరిపించింది. గ్రూప్- సీ టాపర్‌గా నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో రౌండ్ ఆఫ్ 16లో భాగంగా అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఆ రెండు గోల్స్ దోహా వేదికగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో గ్రూప్-సీలో భాగమైన అర్జెంటీనా- పోలాండ్ తలపడ్డాయి. ఈ క్రమంలో తొలి అర్ధభాగం గోల్ లేకుండానే ముగిసింది. అయితే, సెకండాఫ్‌లో అలెక్సిస్ మాక్ అలిస్టర్, జూలియన్ అల్వరెజ్ గోల్స్ సాధించడంతో మెస్సీ బృందం విజయం ఖరారైంది. ఇదిలా ఉంటే గ్రూప్-సీలోని మరో మ్యాచ్‌లో మెక్సికో సౌదీ అరేబియాను 2-1తో ఓడించింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఆరు పాయింట్లతో అర్జెంటీనా గ్రూప్- సీ టాపర్‌గా నాకౌట్‌కు చేరగా.. రెండో స్థానంలో ఉన్న పోలాండ్ ఓడినప్పటికీ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనా- ఆస్ట్రేలియాను, పోలాండ్- డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఎదుర్కోనున్నాయి. రికార్డు బద్దలు కొట్టినా.. స్టార్ ఫుట్‌బాలర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లియోనల్ మెస్సీకి ఇది 999వ మ్యాచ్. అంతేకాదు.. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో 22వది. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఉన్న పేరిట రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఆ ఒక్క లోటు మాత్రం.. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ఈవెంట్లో మెస్సీ ఇప్పటి వరకు ఎనిమిది గోల్స్ చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్-2022లో సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్ కొట్టిన మెస్సీ.. మెక్సికోతో మ్యాచ్‌లో అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు గోల్ సాధించలేకపోయాడు. పోలాండ్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచలేకపోయాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా నాకౌట్‌కు చేరుకోవడంతో ఈ లోటు తీరినట్లయింది. చదవండి: Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే.. FIFA WC 2022: అమెరికా ఆరోసారి.. ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి! 🙌 See you both in the Round of 16! 🫶@Argentina | @LaczyNasPilka | #FIFAWorldCup pic.twitter.com/iu1vuwkH75 — FIFA World Cup (@FIFAWorldCup) November 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెస్సీకి అగ్ని పరీక్ష.. పోలాండ్ చేతిలో ఓడితే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బుధవారం అగ్నిపరీక్ష ఎదుర్కోనుంది. ఇవాళ అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అర్జెంటీనా కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ అని భావిస్తున్న తరుణంలో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్‌కు చేరాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే గ్రూప్-సిలో అర్జెంటీనా సహా మిగతా అన్ని జట్లకు కూడా రౌండ్ ఆఫ్-16 అవకాశాలున్నాయి. అయితే చివరకు రెండు జట్లు మాత్రమే ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. మరి ఆ రెండు జట్లు ఏవి అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటీనా, పోలాండ్‌కు ఎంత అవకాశం? ►బుధవారం జరగబోయే మ్యాచ్‌లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్ సిలో టాపర్‌గా ఉన్న పోలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. ►ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్ డిఫరెన్స్‌తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్ డ్రా కావాలి. సౌదీ అరేబియా, మెక్సికో ►సౌదీ అరేబియా నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్ ఆఫ్ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్ డిఫరెన్స్‌లో పైచేయి సాధించాలి. అయితే సౌదీ అరేబియాతో పోలిస్తే మెక్సికోకు నాకౌట్ చేరే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రీ క్వార్టర్స్ చేరాలంటే పోలాండ్‌ను కచ్చితంగా ఓడించాల్సిందే. ఇక తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతుల్లో ఓడడం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇప్పటికే బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లాంటి జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్-ఏ నుంచి నెదర్లాండ్స్, సెనెగల్.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, అమెరికాలు ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. చదవండి: Lionel Messi: ఒక్క మ్యాచ్.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు పంత్‌కు గాయం.. బంగ్లా టూర్‌కు దూరం! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Lionel Messi: ఒక్క మ్యాచ్.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సౌదీ అరేబియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడి అర్జెంటీనా అందరికి షాక్ ఇచ్చింది. అయితే మెక్సికోతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం అద్భుత విజయంతో అర్జెంటీనా ప్రి క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తాజాగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెస్సీ బృందం పోలాండ్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఎవరితో సంబంధం లేకుండా నేరుగా ప్రిక్వార్టర్స్ చేరుతుంది.. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉన్నప్పటికి అర్జెంటీనా ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెస్సీ మరోసారి మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్‌తో మెరిసినప్పటికి జట్టు ఓటమి పాలయింది. ఇక మెక్సికోతో రెండో మ్యాచ్‌లో మాత్రం మెస్సీ తనకు మాత్రమే సాధ్యమైన గోల్ కొట్టి అర్జెంటీనాను విజయం వైపు నడిపించాడు. ఇక పోలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా మెస్సీ ముందు మూడు అరుదైన రికార్డులు ఎదురుచూస్తున్నాయి. వీటిలో రెండు రికార్డులు మాత్రం మ్యాచ్‌లో బరిలోకి దిగితే వస్తాయి.. మరొక రికార్డు మాత్రం మెస్సీ కొట్టే గోల్స్‌పై ఆధారపడి ఉంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► పోలాండ్‌తో మ్యాచ్ మెస్సీకి తన ఫుట్‌బాల్ కెరీర్లో 999వది కావడం విశేషం. ► ఇక ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవనున్నాడు. పోలాండ్‌తో మ్యాచ్ మెస్సీకి ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 22వది. దీంతో మారడోనా(21 మ్యాచ్‌లు)ను అధిగమించి మెస్సీ తొలి స్థానంలో నిలవనున్నాడు. ► ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మెస్సీ ఇప్పటివరకు ఎనిమిది గోల్స్ చేశాడు. మారడోనాతో సమానంగా ఉన్న మెస్సీ మరొక రెండు గోల్స్ చేస్తే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలుస్తాడు. ఇప్పటివరకు అర్జెంటీనా దిగ్గజం గాబ్రియెల్ బటిస్టువా 10 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేస్తే గాబ్రియెల్ సరసన.. మూడు గోల్స్ చేస్తే అర్జెంటీనా తరపున ఫిఫా ప్రపంచకప్‌లలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలవనున్నాడు. చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం పోలాండ్, సౌదీ అరేబియా మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంతదాకా తన సొంతజట్టైన సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసిన ఒక అభిమాని.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్ కొట్టగానే దెబ్బకు ప్లేట్ ఫిరాయించాడు. అప్పటిదాకా సౌదీ.. సౌదీ అని అరిచిన నోటి నుంచి లెండోవాస్కీ పేరు బయటకు వచ్చింది. అంతేకాదు తాను వేసుకున్న సౌదీ అరేబియా జెర్సీని తీసేసి లోపల వేసుకున్న లెండోవాస్కీ జెర్సీని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ''నువ్వయ్యా అసలైన అభిమానివి.. దెబ్బకు ప్లేట్ ఫిరాయించావు.. నీలాంటోడు ఉండాల్సిందే'' అంటూ పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పోలాండ్ సౌదీ అరేబియాను 2-0తో ఓడించింది. మ్యాచ్‌లో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెండోవాస్కీ గోల్ నమోదు చేశాడు. కాగా తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న లెండోవాస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం. అంతకముందు తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్‌కు తొలి గోల్ అందించాడు. మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక అర్జెంటీనాకు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ఆటలు పోలాండ్ ముందు సాగలేదు. pic.twitter.com/3Ug8Sl4gaX — Out Of Context Football (@nocontextfooty) November 26, 2022 చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ? 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
పోలాండ్ దెబ్బకు తోక ముడిచిన సౌదీ అరేబియా
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా పోలాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సిలో శనివారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. పోలాండ్ తరపున ఆట 39వ నిమిషంలో పియోట్ జిలిన్ స్కీ తొలి గోల్ కొట్టగా.. ఆట 82వ నిమిషంలో జట్టు కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ రెండో గోల్ అందించాడు. అయితే తమ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను ముచ్చెమటలు పట్టించి ఓడించిన సౌదీ అరేబియా పోలాండ్‌కు మాత్రం దాసోహమయ్యింది. తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్‌కు తొలి గోల్ అందించాడు. ఇక మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఆ తర్వాత రెండో అర్థభాగంలో సౌదీ పలుమార్లు పోలాండ్ గోల్ పోస్ట్‌పై దాడి చేసినప్పటికి సఫలం కాలేకపోయింది. ఇక చివర్లో పోలండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ గోల్ కొట్టడంతో పోలాండ్ 2-0 తేడాతో విజయం అందుకుంది. ఇక తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న లెవాండోస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం. -
FIFA WC: డెన్మార్క్‌కు చెక్ పెట్టిన ట్యునీషియా.. మెక్సికో- పోలాండ్ మ్యాచ్ కూడా
FIFA World Cup 2022- దోహా: పట్టుదలతో ఆడితే ప్రపంచకప్‌లాంటి గొప్ప ఈవెంట్లోనూ తమకంటే ఎంతో మెరుగైన జట్టుపై మంచి ఫలితం సాధించవచ్చని ట్యునీషియా జట్టు నిరూపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 0–0తో ప్రపంచ 10వ ర్యాంకర్ డెన్మార్క్జట్టును నిలువరించింది. రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ట్యునీషియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా డెన్మార్క్ జట్టు ఐదుసార్లు షాట్లు కొట్టినా ఫలితం లేకపోయింది. డెన్మార్క్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 62 శాతం ఉంచుకున్నా ట్యునీషియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయలేకపోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. మరో ‘డ్రా’ దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మరో ‘డ్రా’ నమోదైంది. పోలాండ్, మెక్సికో జట్ల మధ్య మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. మెక్సికో జట్టు పోలాండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగు సార్లు షాట్లు సంధించగా ఒక్కటీ లక్ష్యానికి చేరలేదు. పోలాండ్ స్టార్ ప్లేయర్ లెవన్డౌస్కీను మెక్సికో జట్టు వ్యూహత్మకంగా కట్టడి చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. వేల్స్‌ను గట్టెక్కించిన బేల్ 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన వేల్స్ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అమెరికాతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను వేల్స్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 82వ నిమిషంలో వేల్స్ జట్టుకు లభించిన పెనాల్టీని గ్యారెత్ బేల్ గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 36వ నిమిషంలో టిమోతి చేసిన గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లుకు ఒక్కో పాయింట్ దక్కింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో సంచలనాల జాబితా.. ఇప్పుడు సౌదీ.. అప్పట్లో -
పోలండ్‌పైకి క్షిపణులు... రష్యా దాడి కాదు
షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్‌కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్‌తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది. బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ కూడా బ్రసెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. -
పోలాండ్‌పై మిసైల్ దాడిలో ట్విస్ట్.. అది రష్యా పని కాదు..!
వాషింగ్టన్: పోలాండ్ సరిహద్దు గ్రామం ప్రెజెవోడో సమీపంలో మిసైల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మిసైల్‌పై 'మేడ్ ఇన్ రష్యా' అని ఉండటంతో అంతా రష్యానే ఈ దాడికి పాల్పడిందని భావించారు. పోలాండ్ కూడా రష్యా రాయబారికి ఈ విషయంపై సమన్లు పంపింది. అయితే ఈ ఘటనపై అమెరికా కీలక విషయం వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది రష్యా కాదని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పింది. రష్యా మిసైల్స్‌ను ఉక్రెయిన్ నిలువరించే క్రమంలో పొరపాటున ఓ మిసైల్ పొరుగుదేశమైన పోలాండ్ సరిహద్దులో పడిందని పేర్కొంది. ఉక్రెయిన్ ఫైరింగ్ వల్లే రష్యా మిసైల్ పోలాండ్‌లో పడినట్లు అమెరికా నిఘా అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా బాలిలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. పోలాండ్ మిసైల్ ఘటన వెంటనే అప్రమత్తమై జీ20 సదస్సులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మిసైల్ దాడి రష్యా చేసినట్లు కన్పించడం లేదని ఆయన కూడా ఇప్పటికే సూత్రప్రాయం తెలిపారు. పోలాండ్ కూడా ఈ పని చేసింది రష్యానే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే పేర్కొంది. చదవండి: పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్! -
పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్!
ఉక్రెయిన్‌లో దాడులతో ప్రపంచదేశాలను రష్యా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్‌ను ప్రయోగం జరగడం కలకలం సృష్టించింది. కాగా, ఈ మిస్సైల్ రష్యాకు చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు.. ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్న సమయంలో పోలాండ్‌లో ఇలా జరగడం మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా, ఈ మిస్సైల్ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ అప్రమత్తమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్.. జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, జీ-20 సమావేశాల అనంతరం ఈ వీరితో బైడెన్ భేటీ కానున్నారు. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. నాటోలో పోలాండ్ సభ్య దేశంగా ఉంది. ఇక.. పోలాండ్‌లో మిస్సైల్ దాడిని నాటో సభ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిస్సైల్ దాడికి రష్యానే పాల్పడిందని ఆరోపిస్తూ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఇక, ఈ మిస్సైల్ దాడి చేసింది.. రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు పోలాండ్ ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. President Biden on Missile Strike in Poland: "I'm going to make sure we figure out exactly what happened...and then we're going to collectively determine our next step as we investigate and proceed." pic.twitter.com/pY55Feq66m — CSPAN (@cspan) November 16, 2022 -
దూసుకొచ్చిన మిస్సైల్.. పోలాండ్‌లో హైఅలర్ట్
వార్సా: ఉక్రెయిన్ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం ఉక్రెయిన్ పొరుగు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. హైఅలర్ట్ ప్రకటించారు. ప్రెజెవోడో గ్రామం దగ్గర మిస్సైల్ దాడి జరగడంతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మిస్సైల్‌పై మేడ్ ఇన్ రష్యాగా ఉన్నట్లు పోలాండ్ అధికారులు గుర్తించారు. అయితే మిస్సైల్ దాడి చేసింది రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు వార్సా ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. ఇక ఈ పరిణామంతో పోలాండ్ జాతీయ భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించింది. మరోవైపు సరిహద్దులో పోలాండ్ సైన్యం అప్రమత్తం అయ్యింది. ఇంకోవైపు పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో చర్చించారు. ఈ ఘటనపై పోలాండ్ నిర్వహించే దర్యాప్తునకు పూర్తిస్థాయి సహకారం ఉంటుందని బైడెన్ తెలిపారు. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తోనూ బైడెన్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. బుధవారం నాటో రాయబారులు పోలాండ్ మిస్సైల్ దాడి వ్యవహారంపై అత్యవసరంగా భేటీ కానున్నారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా -
FIFA World Cup 2022: అర్జెంటీనా జోరు కనబర్చేనా!
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గుర్తొచ్చేది అర్జెంటీనా. దివంగత దిగ్గజం మారడోనా నుంచి నేటి తరం మెస్సీ దాకా అర్జెంటీనాను అందలంలో నిలిపిన వారే! ఇలాంటి జట్టు ఉన్న గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులకు గుండె హడల్ గ్యారంటీ. గ్రూప్ ‘సి’లో ఈ మేటి జట్టును ఎదుర్కొనేందుకు మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఓడించలేకపోయినా... కనీసం నిలువరించినా ఆయా జట్లకు గెలిచినంత సంబరం. ఈ నేపథ్యంలో ఏ జట్టు అర్జెంటీనాను ‘ఢీ’కొంటుందనేది అసక్తికరం! అర్జెంటీనా ప్రపంచకప్‌లో శక్తిమంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఖతర్ ఈవెంట్లో తన బలాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. తమ ఆల్ టైమ్ గ్రేటెస్టు ఫుట్‌బాలర్ లయెనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. 35 ఏళ్ల మెస్సీ ప్రపంచకప్ మెరుపులకు ఖతరే ఆఖరి వేదిక. ఆ తర్వాత ఆటకు టాటా చెప్పడమే తరువాయి. గతేడాది గట్టి ప్రత్యర్థి బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా అమెరికా కప్’ను గెలిచింది. ఆ టోర్నీలో మెస్సీతో పాటు ఏంజెల్ డి మరియా అద్భుతంగా రాణించారు. ఫిఫా ర్యాంక్: 3 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు విజేత (1978, 1986). ఇతర ఘనతలు: 15 సార్లు ‘కోపా అమెరికా కప్’ టైటిళ్లు. అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో రన్నరప్ ద్వారా. కీలక ఆటగాళ్లు: మెస్సీ, డి మరియా, లో సెల్సో. మెక్సికో ఈ గ్రూప్‌లో అర్జెంటీనా తర్వాత మరో మంచి జట్టు మెక్సికో. గత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని కంగుతినిపించి గ్రూప్ దశను ఆరంభించిన మెక్సికో తదుపరి రౌండ్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు చెమటోడ్చింది. అర్జెంటీనాకు చెందిన కోచ్ గెరార్డో మార్టినో 2019 నుంచి మూడున్నరేళ్లుగా జట్టును సానబెడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు రాల్ జిమెనెజ్, హెక్టర్ హెరెరా, హిర్వింగ్ లొజానోలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫిఫా ర్యాంక్: 13. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1986). ఇతర ఘనతలు: కాన్ఫెడరేషన్ కప్ విజేత (1999). అర్హత: ఉత్తర, మధ్య అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ రన్నరప్‌తో. కీలక ఆటగాళ్లు: జిమినెజ్, హిరెరా. పోలాండ్ అర్జెంటీనా, మెక్సికోలతో పోల్చితే గట్టి ప్రత్యర్థి కాదు కానీ... ఈ గ్రూప్‌లో ‘డార్క్ హార్స్’ అని చెప్పొచ్చు. తనదైన రోజున ఒక్క గోల్‌తో పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్ట్రయికర్లు రాబర్ట్ లెవండోస్కీ, పీటర్ జెలిన్స్కీ, మాటీ కాష్లు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లండ్, స్పెయిన్ లీగ్‌లలో సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కోచ్ బాధ్యతలు చేపట్టిన చెస్లా మిచ్నివిక్ (పోలాండ్) సొంత జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే మేటి జట్లను దాటుకుని నాకౌట్ చేరడం అంత సులువేమీ కాదు. ఫిఫా ర్యాంక్: 26. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1982). ఇతర ఘనతలు: ‘యూరో కప్’లో క్వార్టర్స్ (2016). అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ విన్నర్. కీలక ఆటగాళ్లు: లెవండోస్కీ, జెలిన్స్కీ. సౌదీ అరేబియా గ్రూప్‌లోని మిగతా జట్లకంటే తక్కువ ర్యాంక్ జట్టు. పైగా గత నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయింది. ఇలాంటి జట్టు గ్రూప్ ‘సి’ నుంచి ప్రిక్వార్టర్స్ చేరితే అది సంచలనమే అవుతుంది. అయితే గల్ఫ్ దేశంలోనే మెగా ఈవెంట్ జరగడం కాస్త కలిసొచ్చే అంశం కానీ... ముందడుగు వేయడం కష్టమే! కీలక ఆటగాళ్లు సలేహ్ అల్ శెహ్రి, సలిమ్, సాల్మన్ అల్ ఫరాజ్ తమ ప్రదర్శనతో గల్ఫ్ సాకర్ ప్రియుల్ని అలరించడం ఖాయం. ఫ్రాన్స్‌కు చెందిన కోచ్ హెర్వ్ రినార్డ్ 2019 నుంచి జట్టును తీర్చిదిద్దుతున్నాడు. ఫిఫా ర్యాంక్: 51. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (1994). ఇతర ఘనతలు: ఆసియా చాంపియన్ (1984, 1988, 1996). అర్హత: ఆసియా క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ రన్నరప్. కీలక ఆటగాళ్లు: సలేహ్ అల్ శెహ్రి, అల్ ఫరాజ్. –సాక్షి క్రీడా విభాగం -
తాగుబోతు స్టాంప్: పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే!
మద్యపానం విషయంలో ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. స్తీలు అధికంగా మద్యపానం చేస్తే పిల్లలు పుట్టరంటూ పోలాండ్ పాలక పక్ష నాయకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. స్త్రీలు డ్రింక్ చేయడం వల్లే జననాల రేటు తక్కువగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడాయన. పోలాండ్ జనాభా తక్కువగా ఉండటానికి కారణం స్త్రీలు అధికంగా మద్యపానం సేవించడమే ప్రధాన కారణమని అన్నారు. 25 ఏళ్లు వయసు ఉన్న స్త్రీలు.. అదే వయసు ఉన్న పురుషుల కంటే ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు పిల్లలు ఉండరన్నారు. పురుషులు తాగుబోతులు అని ముద్ర వేయించుకోవడానికి 20 ఏళ్లు పడితే స్త్రీలకు కేవలం రెండేళ్లు చాలంటూ కామెంట్లు చేశాడు. అంతేగాదు మద్యానికి బానిసైన మగవాళ్లకు చికిత్స అందించి సులభంగా నయం చేయవచ్చు కానీ స్త్రీలను నయంచ చేయలేమని ఇది ఒక వైద్యుడు అనుభవం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా ఇది పితృస్వామ్య రాజ్యమని ప్రూవ్ చేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వాస్తవానికి పోలాండ్లోని మహిళలు ఆర్థిక స్థిరత్వం, అబార్షన్ రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా పిలలు కనడం పట్ల అంత ఆసక్తి కనబర్చడం లేదనేది ప్రధాన కారణమని నిపుణుల చెబుతున్నారు. (చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలా ఉంటుందా!) -
83 ఏళ్ల వృద్ధురాలితో 28 ఏళ్ల వ్యక్తి ప్రేమ వివాహం
ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు వంటి డైలాగులు సినిమాల్లో చూస్తుంటాం. కానీ కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అన్నానంటే అతడి 28 ఏళ్లు, ఆమెకు 83 ఏళ్లు వారి మధ్య విడదీయరాని ప్రేమ చిగురించడం అంటే వినేందుకు కాస్త విడ్డూరంగా ఉంది కదూ. కానీ ఆ ఇద్దరు ఒకరినొకరు విడిచి జీవించలేమంటూ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే....పోలాండ్‌కి చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు పాకిస్తాన్‌కి చెందిన 28 ఏళ్ల హఫీజ్ నదీమ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరు ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఒకరికొకరు జీవితాంతం కలిసే ఉండాలని వాగ్దానం చేసుకుని మరి ఒకటవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఐతే సదరు వృద్దురాలు మాత్రం నదీమ్‌ని విడిచి ఉండలేనంటూ ప్రియుడు కోసం ఏకంగా పాకిస్తాన్ వచ్చేసింది. ఆ తర్వాత ఈ జంట పెద్దలను ఒప్పించి పాకిస్తాన్‌లోని హఫ్జాబాద్‌లో కాజీపూర్‌లో అక్కడ సంప్రదాయపద్ధతిలో నవంబర్ 2021న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తామెంతో సంతోషంగా ఉన్నామంటూ పలు ఇంటర్వూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పెళ్లిలో తలెత్తిన గొడవ...నలుగురు మృతి) -
పోలాండ్‌లో రవితేజ ఈగిల్?
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగిల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, కావ్యాథాపర్ హీరోయిన్స్‌గా నటించనున్నారని టాక్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పోలాండ్‌లో మొదలైందని ఫిల్మ్‌నగర్ సమాచారం. రవితేజ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే ఈ సినిమాను అధికారికంగా ఓ టీజర్‌తో ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తోందట. అందుకే పోలాండ్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేశారని భోగట్టా. ఇక ‘ఈగిల్’ కాకుండా ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలు చేస్తున్నారు రవితేజ. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటించారు. -
మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్ను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 52 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-2, 7-6, (7-5) తేడాతో ఓన్స్ జబీర్‌పై స్వియాటెక్ విజయం సాధించింది. ఈ విజయంతో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను పోలాండ్ భామ తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 2016 తర్వాత ఒకే సీజన్లో రెండు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా స్వియాటెక్ నిలిచింది. చదవండి: IND-W vs ENG-W: భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం! -
తవ్వకాల్లో బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు!
ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా.. అలాంటి లిస్ట్ నుంచి ఓ మిస్టరీని చేధించే యత్నాల్లో ఒక ‘క్లూ’ చిక్కింది. ఆడ వాంపైర్(రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు. వ్యాంపైర్ అంటే.. కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలుకే కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. మెడపై వ్యాంపైర్ గనుక కొరికితే.. అవతలి వాళ్లూ వ్యాంపైర్లుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని.. చాలా కథల్లో, సినిమాల్లో చూసే ఉంటారు. కానీ, వ్యాంపైర్ల ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథలుగానే, ఫిక్షన్ క్యారెక్టర్‌గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది. పరిశోధకులు ఏమన్నారంటే.. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్‌గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్‌గా భావించి.. ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు. అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు. ఆరోజుల్లో మూఢనమ్మకాలు అలా ఉండేవి’’ అని తెలిపారు ఈ పరిశోధనకు నేృతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డారియుస్జ్ పోలిన్స్కి. అయినప్పటికీ తమ పరిశోధన ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అయితే.. గతంలో యూరప్ తూర్పు ప్రాంతంలోనూ ఈతరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడ్డప్పటికీ.. తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాస్తవ-అవస్తవాలను పక్కనపెడితే.. వ్యాంపైర్ ప్రపంచం గురించి పరిశోధిస్తున్నవాళ్లకు.. ప్రత్యేకించి రచయితలకు ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఓ కుతూహలాన్ని రేపుతోంది. ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్ మరణం.. ఆకాశంలో అద్భుతం -
US Open 2022: అటు అన్స్...ఇటు ఇగా
న్యూయార్క్: ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో కొత్త విజేతను చూడొచ్చు. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఐదో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా) తొలిసారిగా యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ స్వియాటెక్ 3–6, 6–1, 6–4తో ఆరోసీడ్ అరియానా సబలెంక (బెలారస్)పై గెలుపొందగా, జబర్ 6–1, 6–3తో 17వ సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. శనివారం రాత్రి జరిగే ఫైనల్లో స్వియాటెక్‌తో జబర్ తలపడుతుంది. స్వియాటెక్‌కు యూఎస్ ఓపెన్ ఫైనల్ కొత్త కానీ... ఆమె ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లున్నాయి. 2020, 2022లలో ఈ పోలండ్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. మరో వైపు జబర్ ఈ సీజన్లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరింది. వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ట్యునీషియా అమ్మాయి ఈ సారి ‘గ్రాండ్’ ముచ్చట తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. శ్రమించిన టాప్‌సీడ్... తొలి సెమీ ఫైనల్లో టాప్‌సీడ్ స్వియాటెక్‌కు ప్రత్యర్థి సబలెంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొదటి సెట్లో రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంక అదే ఉత్సాహంతో సుదీర్ఘంగా జరిగిన ఐదో గేమ్‌ను గెలుచుకుంది. 8, 9 గేమ్‌లను చకచకా ముగించి తొలిసెట్‌ను వశం చేసుకుంది. తర్వాత రెండో సెట్లో స్వియాటెక్ పుంజుకోవడంతో సబలెంక చేతులెత్తేసింది. వరుస రెండు గేముల్ని అవలీలగా గెలుచుకున్న స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో పోటీ ఎదురైంది. ఆ గేమ్ సబలెంక గెలిచినా... తదుపరి మూడు గేముల్లో తన రాకెట్ పదునేంటో చూపించిన స్వియాటెక్ 6–1తో సెట్ నెగ్గింది. నిర్ణాయక మూడో సెట్లో ఆరంభంలో దూకుడుగా ఆడిన సబలెంక 2–0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో మూడు, నాలుగు గేముల్లో ఏస్‌లు, విన్నర్లు కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ 2–2తో సమం చేసింది. ఆ తర్వాత రెండు గేముల్ని పట్టుదలగా ఆడిన బెలారస్ స్టార్ 4–2తో ఒత్తిడి పెంచింది. ఈ దశలో నంబర్‌వన్ తన అసలైన ప్రదర్శనతో వరుసగా నాలుగు గేములు గెలిచింది. 2 ఏస్‌లు సంధించిన స్వియాటెక్ 3 డబుల్‌ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్‌లు కొట్టి ఏడుసార్లు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది. రెండో సెమీఫైనల్లో ఐదో సీడ్ జబర్ అలవోకగా ప్రత్యర్థి ఆటకట్టించింది. 8 ఏస్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని జబర్ వరుస సెట్లలో కేవలం 66 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను ఏకపక్షంగా 21 విన్నర్లు కొట్టిన జబర్ 15 అనవసర తప్పిదాలు చేయగా, రెండు ఏస్‌లు సంధించిన గార్సియా, 23 అనవసర తప్పిదాలు చేసింది. -
పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్యలు
లండన్: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్ మాల్ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది. నువ్వెందుకు పోలండ్ వచ్చావు? పోలండ్‌ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్‌లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్‌లో ఉండొద్దు. పోలండ్ పోలిష్ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్ టీవీ’ అనే విద్వేష గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న జాన్ మినడియో జూనియర్‌గా గుర్తించారు. -
150 మిలియన్ ఏళ్ల నాటి జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు
150 million-year-old marine invertebrate Named after Ukraine President: పోలాండ్లోని పాలియోంటాలజిస్టులు 150 మిలియన్ ఏళ్ల నాటి పురాతన సముద్ర జీవికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు పెట్టారు. ఆఫ్రికాలోని ఇథియోపియాలోని అంటలో సున్నపురాయి నిర్మాణంలో ఈ వింత జీవి పూర్తి శిలాజం సురక్షితంగా ఉంది. ఇది ఒక రకమైన ఈక నక్షత్రం అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రగర్భాంలో ఉండేలా సుమారు 10 పొడవాటి చేతులు, పదునైన టెన్టకిల్ లాంటి పంజాలను కలిగి ఉందని పరోశోధకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ కోసం పోరాడటమే కాకుండా ఉక్రెయిన్‌ని కాపాడుకునేందుకు శాయశక్తుల కృషి చేసి ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమర్ జెలెన్స్కీ. మాతృభూమి రక్షణకై జెలన్స్కీ కనబర్చిన తెగువ ధైర్యసాహసాలకు గౌరవార్థంగా ఈ వింతజీవికి అతని పేరుని సూచించారు. ఈ మేరకు ఆ వింత జీవికి ఆసిచిక్రినైట్స్ జెలెన్ స్కీ గా నామకరణం చేశారు. ఇలాంటి వితజీవులకు సమద్ర అడుగుకు చేరుకుని ఉపరితలాన్ని పట్టుకునేలా భారీగా 10 చేతులు, ఆధారంగా ఒక పంజా ఉంటాయి. ఐతే ప్రస్తుతం ఈ వింత శిలాజం మాత్రం ఒక చేతిని కోల్పోయింది. నిజానికి ఈ వింతజీవులు చనిపోయినప్పుడూ మృదుజాలం క్షీణించి ఎముకలు, చేతులు వంటి అవయవాల సాధారణం విడిపోతాయి. కానీ ఈ శిలాజం మాత్ర విడిపోకుండా పూర్తి నమూన సురక్షితంగా భద్రపరచబడిందని పోలాండ్ శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజ జీవి ఇతర జంతుకుల దాడి నుంచి బయటపడి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ జీవులు మానవులకు విషపూరితం కాదు గానీ ఇతర జీవులకు విషపూరితమే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. (చదవండి: పాపం యాన్ యాన్.. తిండి మానేసి మరీ కన్నుమూసింది) -
ఆ మమ్మీకి అరుదైన కేన్సర్ ?
వార్సా: రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్ ఆనవాళ్లు కనిపించాయి. 19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు నుంచి పోలండ్‌కు తీసుకువచ్చారు. అప్పుడే శాస్త్రవేత్తలు ఈ మమ్మీ గర్భిణిగా ఉన్నప్పుడే మరణించిందని నిర్ధారించారు. గర్భిణిగా ఉన్న ఒక ఈజిప్టు మమ్మీ లభించడం ప్రపంచంలో అదే తొలిసారి. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని, మరణించే సమయానికి 28 వారాల గర్భంతో ఉన్నట్టు తేలింది. ఇప్పుడు ఈ అరుదైన కేన్సర్ గురించి వెలుగులోకి వచ్చింది. పోలండ్‌లోని వార్సా మమ్మీ ప్రాజెక్టుకి (డబ్ల్యూఎంపీ) చెందిన శాస్త్రవేత్తలు తాము చేస్తున్న అధ్యయనాల్లో భాగంగా ఆ మమ్మీ పుర్రెకి స్కానింగ్ తీయగా ఎముకల్లో కొన్ని గాయాల గుర్తులు కనిపించాయి. నేజోఫరెంజియో అనే అరుదైన కేన్సర్ సోకే రోగుల ఎముకల్లో ఇలాంటి గురుతులే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మమ్మీ అదే కేన్సర్‌తో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన గొంతు కేన్సర్. ముక్కు వెనుక భాగం నుంచి నోటి వెనుక భాగాన్ని కలిపి ఉంచే భాగానికి ఈ కేన్సర్ సోకుతుంది. డబ్ల్యూఎంపీ ఈ పుర్రె భాగానికి చెందిన ఫోటోలను విడుదల చేసింది. అందులో ఎముకలపై కనిపించిన కొన్ని మార్కింగ్‌లను చూస్తే అవి కేన్సర్ వల్ల ఏర్పడినవని భావిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మనసున్న మారాజు.. జామ్‌సాహెబ్, ఎవరీ మారాజు?
రష్యా దురాక్రమణతో ఉక్రేనియన్లు లక్షలాదిగా శరణార్ధులవుతున్న దృశ్యాలు చూస్తున్నాం! ప్రాణాలరచేతిలో పెట్టుకొని వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్, రొమేనియా, హంగరీ, స్లొవేకియా తదితర దేశాలు సరిహద్దులు తెరిచి ఆశ్రయమిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో మానవ సంక్షోభం తలెత్తలేదని నిపుణులు వర్ణిస్తున్నారు. ఇలాంటి సందర్భమే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పలు యూరప్ దేశాలకు ఎదురైంది. ఆ సమయంలో వారికి నేనున్నానంటూ ఒక భారత మహారాజు అక్కున చేర్చుకున్నారు. అనాథలమైపోయామని బాధ పడొద్దంటూ ఆయన యుద్ధ శరణార్ధులకు ఆశ్రయం కల్పించారు. ముఖ్యంగా హిట్లర్ దురాక్రమణతో కకావికలమైన పోలాండ్‌కు ఆ మహారాజు అండగా నిలిచారు. పోలాండ్ చిన్నారులకు ఒక తండ్రిలా మారారు. నిజానికి ఆ సమయంలో భారత్‌లో బ్రిటిష్ పాలన నడుస్తోంది. సొంత ఖండానికి చెందిన వారే అయినా పోలాండ్ శరణార్ధులను అనుమతించకూడదని భారత్‌లో బ్రిటిష్ అధికారులు నిర్ణయించుకున్న సమయంలో మహారాజా దిగ్విజయ్సింహ్జీ రంజిత్సింహ్జీ జడేజా వారికి ఆశ్రయం ఇచ్చి మనసున్న మారాజని నిరూపించుకున్నారు. గుజరాత్‌లోని నవానగర్ సంస్థానాధిపతైన దిగ్విజయ్ సింహ్‌జీని ప్రజలు గౌరవంగా జామ్‌సాహెబ్ అని పిలుస్తారు. నన్ను మీ బాపూ అనుకోండి! 1942లో సోవియట్ సైన్యం పోలాండ్ పైకి వచ్చినప్పుడు 2 నుండి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికి పైగా పిల్లలని ఒక నౌకలో ఎక్కించి శరణార్థులుగా పంపించారు. వీళ్లకు ఎవరూ ఆశ్రయమివ్వలేదు. చివరకు భారత్‌లో వలస పాలకులు కూడా శరణార్థుల సాయానికి ఆటంకాలు కల్పించారు. యుద్ధం కారణంగా అనాథలైన పోలాండ్ పిల్లల వెతలు చూసి జామ్‌సాహెబ్ చలించిపోయారు. బ్రిటీష్ అధికారుల ఆటంకాలు లెక్కచేయకుండా పోలండ్ పిల్లల ఓడను తన రాజ్యంలోని రోసి పోర్టుకు ఆయన ఆహ్వానించారు. అక్కడకు సమీపంలోని బాలచడి నగర సరిహద్దుల్లో పోలండ్ శరణార్ధుల కోసం కుటీరాలు ఏర్పాటు చేయించారు. ‘‘నన్ను మీ బాపూ (తండ్రి) అనుకోండి! మీకు ఏ లోటూ రాదు’’ అని వారికి అభయం ఇచ్చారు. యుద్ధం కారణంగా ఇల్లూ వాకిలి వదిలిన పోలండ్ వాసులు సొంతింట్లో ఉన్న భావన కలిగించాలని ఆయన అనేక సదుపాయాలు కల్పించారు. దాదాపు 640 మంది శరణార్ధులు మహారాజు వద్ద ఆశ్రయం పొందారు. ఆ తర్వాత 1946 లో వారిని తిరిగి పోలాండ్ పంపించారు. శరణార్ధులకూ హక్కులుంటాయి! శరణార్ధుల్లో ఒకరు జామ్‌సాహెబ్ ఆతిథ్యం గురించి చెబుతూ ‘‘ఆ సమయంలో మాకు పునరావాస కేంద్రాల్లో ఇస్తున్న ఉడికించిన పాలకూర నచ్చలేదు. దీంతో స్ట్రయిక్ చేద్దామని నిర్ణయించుకున్నాం! ఈ విషయం బాపూ (జామ్‌సాహెబ్) కు తెలిసింది. వెంటనే వంటగాళ్లకు ఆ కూర వండవద్దని ఆదేశించారు. నిజానికి శరణార్ధులుగా ఉన్న మాకు డిమాండ్లు చేసే హక్కుంటుందని మేం భావించలేదు. కానీ ఆయన అతిచిన్న విషయంలో కూడా మాకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు’’ అని తెలిపారు. పొలండ్, పోలిష్ రిపబ్లిక్ గా ఏర్పాటు అయిన తర్వాత ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్‘ అవార్డును ఆయనకు ప్రకటించింది. ఇప్పటికీ పోలండ్వాసులు మహారాజా పెద్ద మనసును మరిచిపోలేదు. ఆయన ఆశ్రయం పొంది అనంతరం పోలండ్ తిరిగివెళ్లిన వాళ్లు ‘సర్వైవర్స్ ఆఫ్ బాలచడి’’ పేరిట బృందంగా ఏర్పడ్డారు. జామ్సాహెబ్కు ఆజన్మాంతం తామంతా రుణపడ్డామని వీళ్లు చెప్పేవాళ్లు. తమ కృతజ్ఞతకు గుర్తుగా వార్సాలో ఆయన పేరిట స్క్వేర్ ఆఫ్ గుడ్ మహారాజా అని ఒక కూడలి ఏర్పాటు చేసుకున్నారు. 2014లో అక్కడ ఒక పార్కు కూడా ప్రారంభించారు. అందులో ఆయన స్మారక చిహ్నం స్థాపించారు. ఎవరీ మారాజు? జామ్ సాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన రాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా (1895–1966) యదువంశీ రాజ్‌పుత్ వంశానికి చెందినవారు. ప్రఖ్యాత క్రికెటర్ రంజిత్‌సింగ్‌జీ ఈయనకు మేనమామ. యూనివర్సిటీ కాలేజ్ లండ¯Œ లో విద్యాభ్యాసం చేశారు. 1919లో బ్రిటిష్ ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1947 వరకు లెఫ్టినెంట్–జనరల్ గా బ్రిటీష్ఇండియన్ ఆర్మీ నుంచి గౌరవ భృతి పొందారు. 1935లో ఆయనకు మహా రాజకుమారి బైజీ రాజ్ శ్రీ కంచన్ కున్వెర్బా సాహిబాతో వివాహమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నవానగర్‌ను యునైటెడ్ స్టేట్ ఆఫ్ కతియావార్‌లో విలీనం చేశారు. – శాయి ప్రమోద్ -
FIH Hockey 5s: హాకీ ఫైవ్స్ విజేత భారత్
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో (ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున ఆడతారు) భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఐదు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది. పోలాండ్ జట్టుతో ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 6–4 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంజయ్, గురీందర్ సింగ్ ఒక్కో గోల్ చేయగా... ధమి బాబీ సింగ్, రాహీల్ మొహమ్మద్ రెండేసి గోల్స్ సాధించారు. Congratulations to the Indian Men's Hockey Team for winning Gold in the all-new format of Hockey at the Hero FIH Hockey 5s Lausanne 2022. 🏆 Once again, the Indian Men's Team has made India proud! 🇮🇳 pic.twitter.com/SZ6ixzKd55 — Hockey India (@TheHockeyIndia) June 5, 2022 This is the one that counts! Counting down the final moments to the Hero FIH #Hockey5s men's finals! Will it be @TheHockeyIndia or @hockey_poland to take the crown? Match begins at 18:30 CEST! Who are you supporting? 📲 Download the @watchdothockey app to stream the match live. pic.twitter.com/A1Ljb3h5vS — International Hockey Federation (@FIH_Hockey) June 5, 2022 -
French Open 2022: ఇగా సిగలో ఫ్రెంచ్ కిరీటం
పారిస్: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ స్వియాటెక్ 68 నిమిషాల్లో 6–1, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్, 18 ఏళ్ల కోకో గాఫ్ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు)... రన్నరప్ కోకో గాఫ్‌కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది స్వియాటెక్‌కిది వరుసగా 35వ విజయంకాగా... ఆమె ఖాతాలో ఆరో టైటిల్ చేరింది. 21 ఏళ్ల స్వియాటెక్ 2020లో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరే క్రమంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. కానీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్వియాటెక్‌తో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ ఒత్తిడిలో చేతులెత్తేసింది. ఆమె కేవలం నాలుగు గేమ్‌లు గెలిచింది. మరోవైపు స్వియాటెక్ పక్కా ప్రణాళికతో ఆడుతూ కోకోకు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కచ్చితమైన సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో ఈ పోలాండ్ స్టార్ విజృంభించింది. సుదీర్ఘ ర్యాలీలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా స్వియాటెక్ చాలాసార్లు పది ర్యాలీల్లోపే పాయింట్లు గెలుచుకుంది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్వియాటెక్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో గేమ్‌లో కోకో గాఫ్ తొలిసారి తన సర్వీస్‌ను కాపాడుకోగా... ఆరో గేమ్‌లో స్వియాటెక్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, ఏడో గేమ్‌లో గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 35 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్లో కోకో కాస్త పోటీనిచ్చినా స్వియాటెక్‌ను ఓడించేందుకు అది సరిపోలేదు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు 35-0 🏆#RolandGarros pic.twitter.com/Tq7u72NWH8 — Roland-Garros (@rolandgarros) June 4, 2022 -
French Open 2022: తిరుగు లేని స్వియాటెక్
పారిస్: జోరుమీదున్న పోలాండ్ ‘టాప్’స్టార్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లోనూ ఆమె రాకెట్‌కు ఎదురే లేకుండా పోయింది. దీంతో ఆమె జైత్రయాత్రలో వరుసగా 34వ విజయం చేరింది. గురువారం జరిగిన పోరులో స్వియాటెక్ వరుస సెట్లలో 6–2, 6–1తో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. రోలాండ్ గారోస్‌లో 2020లో టైటిల్ సాధించిన స్వియాటెక్ తాజాగా మరో ట్రోఫీపై కన్నేసింది. రెండో సెమీస్‌లో అమెరికాకు చెందిన 18వ సీడ్ కోకో గౌఫ్ 6–3, 6–1తో ఇటలీకి చెందిన మార్టినా ట్రెవిసాన్ను ఓడించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గౌఫ్‌తో స్వియాటెక్ తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ దెబ్బకు... టాప్ సీడ్ స్వియాటెక్ ధాటికి రష్యన్ ప్రత్యర్థి నిలువలేకపోయింది. తొలిసెట్ ఆరంభంలో 18 నిమిషాలు మాత్రమే 2–2తో దీటు సాగిన మ్యాచ్ క్షణాల వ్యవధిలోనే ఏకపక్షంగా మారింది. వరుసగా రెండు గేముల్ని గెలిచిన స్వియాటెక్‌కు మూడో గేమ్‌లో ఆమె సర్వీస్‌ను బ్రేక్ చేసి కసత్కినా షాకిచ్చింది. నాలుగో గేమ్‌ను నిలబెట్టుకుంది. తర్వాత ప్రపంచ నంబర్‌వన్ దూకుడు పెంచింది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై ఎదురులేని ఆధిక్యాన్ని సాధించింది. వరుసగా నాలుగు గేముల్ని నిమిషాల వ్యవధిలోనే ముగించింది. తొలిసెట్ గెలిచేందుకు 38 నిమిషాలు పట్టగా... రెండో సెట్లో స్వియాటెక్ జోరుకు 26 నిమిషాలే సరిపోయాయి. ఇందులో రష్యన్ ప్లేయర్ రెండో గేమ్‌లో మాత్రమే తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటే... వరుసగా ఐదు గేముల్ని స్వియాటెక్ చకాచకా ముగించింది. 22 విన్నర్లు కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది. 10 విన్నర్స్కే పరిమితమైన కసత్కినా 24 అనవసర తప్పిదాలు చేసింది. తొలిసారి సెమీస్‌లో సిలిచ్ మారిన్ సిలిచ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 33 ఏళ్ల వయసులో ఎర్రమట్టి నేలలో అతని రాకెట్ గర్జించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ క్రొయేషియా ఆటగాడు ఏకంగా 33 ఏస్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ సమరంలో సిలిచ్ 5–7, 6–3, 6–4, 3–6, 7–6 (10/2)తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. 16 ఏళ్లుగా రోలండ్ గారోస్ బరిలోకి దిగుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా క్వార్టర్స్ (2017, 2018) దశనే దాటలేకపోయాడు. ఎనిమిదేళ్ల క్రితం 2014లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన సిలిచ్ మధ్యలో 2017లో వింబుల్డన్, 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచాడు. ఈ రెండు మినహా గ్రాండ్‌స్లామ్ సహా పలు మేజర్ టోర్నీల్లో సీడెడ్ ప్లేయర్‌గా దిగి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. పోరాడి ఓడిన బోపన్న జోడీ పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది. అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. నేడు పురుషుల సెమీ ఫైనల్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) X అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కాస్పర్ రూడ్ (నార్వే) Xమారిన్ సిలిచ్ (క్రొయేషియా) సా. గం. 6.15నుంచి సోనీలో ప్రత్యక్ష ప్రసారం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2020 చాంపియన్ స్వియాటెక్ 6–3, 7–5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై గెలిచి ఈ ఏడాది వరుసగా 31వ విజయాన్ని నమోదు చేసింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ సబలెంకా (బెలారస్), మూడో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) మూడో రౌండ్లోనే నిష్క్రమించారు. 28వ సీడ్ కమిలా జార్జి (ఇటలీ) 4–6, 6–1, 6–0తో సబలెంకాను ఓడించగా... వెరోనికా కుదెర్మెతోవా (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో బదోసా తొలి సెట్‌ను 3–6తో కోల్పోయి, రెండో సెట్లో 1–2తో వెనుబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది. బదోసా, సబలెంకా ఓటమితో ఈ టోర్నీలో టాప్–10 క్రీడాకారిణుల్లో కేవలం స్వియాటెక్ మాత్రమే బరిలో మిగిలింది. బోపన్న జోడీ సంచలనం పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట 6–7 (5/7), 7–6 (7/3), 7–6 (12/10)తో రెండో సీడ్ మాట్ పావిచ్–నికోల్ మెక్టిక్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. -
ఉక్రెయిన్ ఖతం.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ దేశమేనా..?
Chechen Ramzan Kadyrov Warning.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యాకు మద్దతుగా కీలక పాత్ర పోషిస్తున్న చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ‘విక్టరీ డే’ సందర్భంగా పోలాండ్‌లో రష్యా రాయబారిపై ఎరుపు సిరా దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దాడిని రంజాన్ కదిరోవ్ ఖండించారు. పోలాండ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలాండ్ పట్ల ఆసక్తిగా ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వీడియోలో కదిరోవ్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ అనంతరం.. ఒకవేళ మాకు ఆదేశాలు వస్తే.. ఆరు సెకండ్లలో ఏం చేయగలమో చేసి చూపిస్తాం’ అంటూ పోలాండ్‌ను హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలను పోలాండ్ వెనక్కి తీసుకోవాలని ఆ దేశాన్ని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌ను గెలువనీయబోమని జర్మన్ చాన్స్‌లర్ ఓలఫ్ స్కోల్ట్ గురువారం పేర్కొన్నారు. ఇక, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధంలో రష్యన్ సైన్యం దాదాపు 1,000 ట్యాంకులు, 350 ఫిరంగి నౌకలు, 30 ఫైటర్-బాంబర్లు, 50 కంటే ఎక్కువ హెలికాప్టర్లను కోల్పోయిందని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. The Chechen president #RamzanKadyrov has threatened #Poland: “#Ukraine is already a closed issue. I'm interested in Poland.. we'll show what we are capable of in 6 seconds. Better get yr weapons (Poles)” PLEASE PRAY FOR PEACE 🙏🙏 pic.twitter.com/5j70TH3qlf — Schulla (@RiettedeKlerk) May 27, 2022 ఇది కూడా చదవండి: తుపాకుల నియంత్రణను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు -
Russia War: భారత్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆక్రమణలపర్వం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూసివేసిన భారత రాయబార కార్యాలయాన్ని ఈనెల 17వ తేదీ నుంచి తిరిగి ఓపెన్ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా భయంకరమైన బాంబు దాడుల నేపథ్యంలో కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తరలించారు. మార్చి 13వ తేదీ నుండి పోలాండ్లోని వార్సా నుంచి తాత్కాలికంగా భారత రాయబార కార్యాలయం సేవలను కొనసాగించారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులను తరలించారు. మరోవైపు.. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఆస్తి నష్టం, ప్రాణా నష్టంతో ఉక్రెయిన్ విలవిలాడుతోంది. ఇక, రష్యాపై ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ అతిపెద్ద ఎనర్జీ కార్పొరేషన్ ఈఎన్‌ఈవోఎస్(ENEOS) రష్యకు చమురు కొనుగోలును నిలిపివేసింది. Indian Embassy to resume operation in Kyiv from next week Read @ANI Story | https://t.co/xWRqrz0ji9#IndianEmbassy #India #Ukraine #Kyiv #Poland #UkraineConflict pic.twitter.com/MgK6X8LrBL — ANI Digital (@ani_digital) May 13, 2022 ఇది కూడా చదవండి: నార్త్ కొరియాలో కరోనా కలకలం.. టెన్షన్లో కిమ్ జోంగ్ ఉన్ -
Victory Day: పుతిన్‌కు షాక్.. రష్యా అంబాసిడర్‌పై దాడి
వార్సా: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నవేళ రష్యా విక్టరీ డే(మే 9వ తేదీ) సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యా విక్టరీ డే సందర్బంగా వ్లాదిమిర్ పుతిన్.. మాతృభూమి కోసం రష్యా వీరులు పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రష్యా రక్షించుకునేందుకే ఈ ప్రయత్నం. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా. కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దూ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలాండ్ రాజధాని వార్సాలో రష్యా అంబాసిడర్ సెర్గీ ఆండ్రియేవ్‌పై ఉక్రేనియన్లు దాడి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మృతిచెందిన రెడ్ ఆర్మీ సైనికులకు సెర్గీ ఆండ్రియేవ్ నివాళులు అర్పిస్తుండగా ఉక్రెయిన్ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఆయనపై ఎరుపు రంగు సిరాను చల్లి నిరసనలు తెలిపారు. ఈ దాడిలో తనకు గాయాలేవీ కాలేదని సెర్గీ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో విక్టరీ సందర్భంగా పోలాండ్‌లో పుష్ప నివాళి ఈవెంట్‌ను రద్దు చేయాలని అధికారులు రష్యాను కోరారు. కానీ, సెర్గీ ఆండ్రియేవ్ మాత్రం సైనిక శ్మశానవాటికకు వచ్చి పెద్ద సాహసం చేశారు. దీంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. Russian Ambassador to Poland Sergey Andreev covered in red paint in Warsaw. 100s of protesters met him at the soviet soldiers cemetery where he went to mark Russian victory day over the Nazis. The crowd chants “fascist” and “murderer” at him. pic.twitter.com/jAIHvLXEgv — Jack Parrock (@jackeparrock) May 9, 2022 -
Putin: అన్నంత పని చేసిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన. ఈ తరుణంలో.. రూబుల్స్‌లో చెల్లింపులకు నిరాకరించిన పోల్యాండ్, బల్గేరియాలకు గాజ్ప్రోమ్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేయించారు. రష్యా ఎనర్జీ దిగ్గజం గాజ్ప్రోమ్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోల్యాండ్(పీజీఎన్ఐజీ), బల్గేరియా(బల్గర్గ్యాజ్)లకు పూర్తిగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రూబుల్స్ రూపేణా బకాయిల చెల్లింపుల మూలంగానే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. కిందటి నెలలోనే పుతిన్ ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు చాలా దేశాలు తేలికగా తీసుకున్నాయి. పైగా యూరోప్ దేశాలు తమకు రూబుల్స్ ఎలాగ ఉంటుందో కూడా తెలియదంటూ సెటైర్లు వేశాయి. ఈ తరుణంలో పుతిన్ తొలిసారి గ్యాస్ సరఫరా నిలిపివేయించడం ఇదే ప్రథమం. ఇక హంగేరీ మాత్రమే రూబుల్స్‌లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో.. పుతిన్ ప్రతీకారంగా ఈ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా దేశాలకు ఇదే పరిస్థితి గనుక ఎదురైతే.. నష్టం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇది రష్యా ఆర్థికంపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని! -
మయామి ఓపెన్ చాంపియన్ స్వియాటెక్
పోలాండ్ టెన్నిస్ స్టార్ స్వియాటెక్ మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీ ఫైనల్లో 6–4, 6–0తో మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో స్వియాటెక్‌కిది వరుసగా మూడో ప్రీమియర్ టైటిల్ (ఖతర్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, మయామి ఓపెన్) కావడం విశేషం. సెరెనా (అమెరికా–2013లో), వొజ్నియాకి (డెన్మార్క్–2010లో) తర్వాత ఒకే సీజన్లో వరుసగా మూడు డబ్ల్యూటీఏ–1000 టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. -
Russia-Ukraine War: లివీవ్ ముట్టడి
లివీవ్: పోలండ్‌కు అతి సమీపంలో ఉండే ఉక్రెయిన్ నగరం లివీవ్‌పై రష్యా రెండు రోజులుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడికి సమీపంలోని శరణార్థుల శిబిరాన్ని సందర్శిస్తున్న సమయంలోనే లివీవ్‌పై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. తద్వారా అమెరికాకు రష్యా ఓ హెచ్చకరిక సంకేతం పంపిందని భావిస్తున్నారు. లివీవ్‌లోని అక్కడి రక్షణ శాఖ ఇంధన ప్లాంటును క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ఆదివారం ప్రకటించారు. కీవ్‌లోనూ మరో ఇంధన డిపోను యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన మిసైల్ ద్వారా ధ్వంసం చేశామన్నారు. నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతంపైనా రెండు రాకెట్లు పడ్డాయి. అక్కడ గంటల తరబడి దట్టమైన పొగ రేగుతూ కన్పించింది. కీవ్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన సెయింట్ సోఫియా కేథడ్రల్ దాడుల్లో ఏ క్షణమైన నేలమట్టమయ్యేలా కన్పిస్తోంది. కీవ్‌కు ఉత్తరంగా ఉన్న స్లావ్యుచ్ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించిందని కీవ్ ప్రాంత గవర్నర్ ప్రకటించారు. కీవ్‌లో కర్ఫ్యూను సోమవారం దాకా పొడిగించారు. పొట్ట చేతపట్టుకుని వలస పోతున్న ఉక్రేనియన్లకు ఇంతకాలంగా లివీవ్ మజిలీగా ఉపయోగపడుతూ వస్తోంది. దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యావసరాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతూ వచ్చాయి. లివీవ్‌పైనా రష్యా దాడులను ఉధృతం చేయడం ఉక్రెయిన్‌లో మరింత సంక్షోభానికి కారణమయ్యేలా కన్పిస్తోంది. ఖర్కీవ్‌లోని అణు పరిశోధన సంస్థపైనా మరోసారి బాంబుల వర్షం కురిసింది. మరోవైపు రష్యాలో చేరడంపై రెఫరెండం నిర్వహిస్తామని లుహాన్స్క్ వేర్పాటువాద నేతలు చెప్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ మరో దఫా చర్చలు సోమవారం జరగనున్నాయి. జెట్లు, ట్యాంకులివ్వండి: జెలెన్స్కీ యూరప్, పశ్చిమ దేశాలు కాస్త తెగువ చూపి తమకు సకాలంలో యుద్ధ విమానాలు, యుద్ధట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పరిస్థితి మరోలా ఉండేదని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఈ విషయంలో అవి కనీసం ఒక్క శాతం ధైర్యం చూపినా బాగుండేదని వాపోయారు. యూరోపియన్ యూనియన్ను, నాటోను రష్యా నడుపుతోందా అంటూ మండిపడ్డారు. ‘‘మీరు పంపుతున్న షాట్ గన్లు, మెషీన్ గన్లతో రష్యా క్షిపణులను అడ్డుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా యుద్ధ విమానాలు, ట్యాంకులు ఇవ్వండి. లేదంటే పోలండ్, స్లొవేకియా తదితర బాల్టిక్ దేశాలపైనా రష్యా దాడి చేయడం ఖాయం’’ అని జెలెన్స్కీ అన్నారు. యుద్ధం ద్వారా రష్యన్లపై ఉక్రెయిన్ ప్రజల్లో పుతిన్ తీవ్ర విద్వేషం నింపుతున్నారని దుయ్యబట్టారు. డోన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్ రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. ఖర్కీవ్, మారియుపోల్ నగరాల నుంచి రష్యా పటాలాలు ఇందుకోసం ఇప్పటికే బయల్దేరినట్టు చెప్పింది. అదే సమయంలో ఉక్రెయిన్ నగరాలపై దాడిని కూడా రష్యా తీవ్రస్థాయిలో కొనసాగిస్తోందని వివరించింది. తమ దేశాన్ని ఆక్రమించడం అసాధ్యమని తేలిపోవడంతో కనీసం రెండు ముక్కలైనా చేయాలని రష్యా చూస్తోందని మిలిటరీ ఇంటలిజెన్స్ చీఫ్ బుడనోవ్ ఆరోపించారు. రష్యా సైన్యాలకు చుక్కలు చూపిస్తామన్నారు. ఆటవిక యుద్ధం ఇకనైనా ముగియాలని పోప్ ఫ్రాన్సిస్ మరోసారి ప్రార్థనలు చేశారు. బైడెన్ ఉద్దేశం వేరు: అమెరికా వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగరాదన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వివరణ ఇచ్చారు. పుతిన్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రయత్నించడం లేదన్నారు. పొరుగు దేశాలపై యుద్ధానికి దిగకుండా పుతిన్‌ను కట్టడి చేయాలన్నదే బైడెన్ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు. రష్యాలో గానీ, ఇంకే దేశంలో గానీ నాయకత్వ మార్పులకు అమెరికా ఎన్నటికీ పూనుకోదన్నారు. బైడెన్ వ్యాఖ్యలను సమర్థించబోనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు. ‘‘నేనలాంటి పదజాలం ఉపయోగించను. సంక్షోభానికి తెర దించేందుకు పుతిన్‌తో చర్చలు కొనసాగిస్తా’’ అని చెప్పారు. మరోవైపు, రష్యా తమపై సైబర్ దాడికి దిగొచ్చని ఫిన్లండ్ అధ్యక్షుడు సాలీ నినిస్టో అన్నారు. ఫిన్లండ్ నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. రష్యాతో 1,340 కిలోమీటర్ల మేర సరిహద్దును కూడా పంచుకుంటోంది. మరోవైపు పుతిన్ సన్నిహితుడైన రష్యా కుబేరుడు ఎవగెనీ ష్విల్డర్కు చెందిన రెండు జెట్ విమానాలను ఇంగ్లండ్ జప్తు చేసింది. -
ఉక్రెయిన్‌కి అమెరికా చేసిందేమీ లేదు... బైడెన్ గాలి తీసేసిన ఉక్రెయిన్ ఎంపీ
As Ukrainian feel reassured: యూరప్ పర్యటనలో భాగంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్ పర్యటన చేసిన సంగతి తెలిసింది. ఈ మేరకు బైడెన్ పోలాండ్లోని ఉక్రెనియన్ అగ్ర నేతలతో భేటి అయ్యారు. ఆ సమావేశంలో ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులపై బైడెన్ చర్చించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఇన్నా సోవ్‌సన్ జోబైడెన్ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఒక ఉక్రెనియన్గా భరోసా కలిగించే ఒక్కమాట కూడా జోబైడెన్ నుంచి తాను వినలేదని అన్నారు. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యూరోపియన్ దేశానికి సహాయం చేయడానికి అమెరికా తగినంతగా ఏమి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం మాకు పశ్చమ దేశాలే ఎక్కువ సహాయం చేస్తున్నయని అన్నారు. కానీ ఈ ప్రసంగంలో బైడెన్ పోలాండ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉక్రెయిన్ ఎంపీ సోవ్‌సన్. అయినా దాడులు జరుగుతోంది కైవ్లోనూ, ఖార్కివ్‌లోనూ,.. వార్సాలో కాదంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉక్రెయిన్ ఎంపీ ట్విట్టర్ వేదికగా జో బైడెన్ ప్రంసంగం పై విరుచుకుపడ్డాఈరు. ఇదిలా ఉండగా..ఆ ప్రసంగంలో బైడెన్ రష్యాన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పరమ కసాయిగా పేర్కొన్నారు. అంతేకాదు అతను ఎక్కువ కాలం అధ్యక్షుడిగా సాగలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా పై ఉక్రెయిన్ సాగిస్తున్న ప్రతి ఘటనను సోవియట్‌కి వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా అభివర్ణించారు. గతంలో రష్యా ఉక్రెయిన్ వివాదంపై బైడెన్ నాటో, జీ7 సమావేశల్లో పాల్గొన నాట భూభాగంలో ఒక్క అంగుళం మీదకు వెళ్లడం గురించి ఏ మాత్రం ఆలోచనే చేయోద్దు అని రష్యాను హెచ్చరించారు కూడా. I'll be blunt. I did not hear a single word from @POTUS that would make me, as #Ukrainian feel reassured that the West will help us more than doing right now (which is not enough). I am happy he reassured Poland, but the bombs are exploding in Kyiv, and Kharkiv, not in Warsaw — Inna Sovsun (@InnaSovsun) March 26, 2022 (చదవండి: పుతిన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు.. రష్యా సూపర్ కౌంటర్) -
ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్.. నంబర్‌వన్‌గా స్వియాటెక్
ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా అవతరించనుంది. మయామి ఓపెన్ టోర్నీ రెండో రౌండ్లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 6–0తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై నెగ్గడంతో ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమైంది. ప్రస్తుత నంబర్‌వన్ యాష్లే బార్టీ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాంతో ఏప్రిల్ 4న విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా స్వియాటెక్‌కు టాప్ ర్యాంక్ ఖరారవుతుంది. చదవండి: ipl 2022: "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా -
మీ రక్షణ మా బాధ్యత
వార్సా: ‘‘మీ రక్షణ మా బాధ్యత. రష్యా ఒకవేళ దాడికి దిగితే మేం రక్షిస్తాం. మీ స్వేచ్ఛకు మాది పూచీ’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌కు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల యూరప్ పర్యటన ముగింపు సందర్భంగా పోలండ్ అధ్యక్షుడు ఆంద్రె డూడాతో ఆయన భేటీ అయ్యారు. నాటో కూటమిని విడదీయాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలలు కల్లలుగానే మిగిలాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ శరణార్థులకు భారీ సంఖ్యలో ఆశ్రయమిచ్చిందంటూ పోలండ్‌ను కొనియాడారు. శరణార్థులను ఆదుకుంటున్న పోలండ్‌కు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అదనంగా లక్ష మంది ఉక్రెయిన్ వాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని ఉద్ఘాటించారు. పుతిన్ ఓ నరహంతకుడు వార్సాలో ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని బైడెన్ సందర్శించారు. గంటపాటు శరణార్థులతో మాట్లాడారు. వారి కష్టాలు విని చలించిపోయారు. పుతిన్ నరహంతకుడంటూ మండిపడ్డారు. పుతిన్ దాష్టీకాల వల్ల వేలాది మంది మహిళలు, పిల్లలు పొరుగు దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిబిరాల్లో చిన్నారులను చూస్తే మనసు ద్రవిస్తోందన్నారు. పోలండ్‌కు 20 లక్షల మంది ఉక్రెయిన్‌తో పోలండ్ దేశం 300 మైళ్ల సరిహద్దును పంచుకుంటోంది. 35 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థుల్లో 20 లక్షల మంది పోలండ్‌కు చేరుకున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు, పలు దేశాలు నిత్యావసరాలు పంపిస్తున్నాయి. -
War Crisis: రంగంలోకి దిగిన అమెరికా.. ఉక్రెయిన్ సరిహద్దులకు జో బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడి కొనసాగుతోంది. పుతిన్ దళాల దాడిలో ఉక్రెయిన్ అస్తవ్యస్తమైంది. బాంబుల దాడితో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాలుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈ వారంలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టి దాదాపు నెల రోజులకు చేరుకోబోతోంది. ఈ సమయంలో జో బైడెన్ యూరప్ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా బైడెన్.. బ్రస్సెల్స్ చేరుకొని అక్కడ నాటో, యూరప్ మిత్ర దేశాలతో సమావేశం జరుపనున్నారు. అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్‌లో బైడెన్ పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుబాతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్‌లో పరిస్థితులపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పోలాండ్‌కు వలస వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది శరణార్థులు పోలాండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే, ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటన ఉండదని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, దాడుల నేపథ్యంలో బైడెన్.. రష్యా, పుతిన్‌పై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌కు భద్రతాపరంగా, మానవతా పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని అమెరికా స్పష్టం చేసింది. అంతకు ముందు ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం అందజేసింది. మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధమని, ఒకవేళ అవి గనుక విఫలం అయితే తదనంతర పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. -
ఉక్రెయిన్‌లో మారణ హోమం.. 26 లక్షల మంది శరణార్థులున్న స్థావరంపై..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో భయాకన వాతావరణాన్ని సృష్టించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా సైన్యం. తాజాగా రష్యా బలగాలు మరో మారణహోమాన్ని సృష్టించాయి. రష్యా బలగాలు పశ్చిమ ఉక్రెయిన్‌కు విస్తరిస్తున్న క్రమంలో తాజాగా పోలాండ్ సరిహద్దుల్లోని ల్వీవ్ వద్ద ఉక్రెయిన్ సైనిక శిక్షణ స్థావరంపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో 35 మంది మరణించగా 134 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ల్వీవ్ ఒకటిగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ల్వీవ్‌లో దాదాపు 26 లక్షల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఆదివారం జరిగిన దాడితో వారిలో ఆందోళన మొదలైంది. Today, Russian war criminals abducted another democratically elected Ukrainian mayor, head of Dniprorudne Yevhen Matveyev. Getting zero local support, invaders turn to terror. I call on all states & international organizations to stop Russian terror against Ukraine and democracy. pic.twitter.com/jEPTBTLikY — Dmytro Kuleba (@DmytroKuleba) March 13, 2022 మరోవైపు రష్యా బలగాలు మరో ఘాతుకానికి ఒడిగట్టాయి. ద్నిప్రోరుడ్నే మేయర్ యెవెన్ మాట్వీవ్‌ను అపహరించినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్థానికుల నుంచి సహకారం లేకపోవడంతో రష్యన్ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్‌పై భయానక దాడులను నిలువరించేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..! -
మరో 674 మంది స్వదేశానికి..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారత వైద్య విద్యార్థులను ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా అధికారులు శుక్రవారం స్వదేశానికి తరలించారు. సుమీ నుంచి పోలండ్‌కు చేరుకున్న 674 మందిని మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకొచ్చారు. మొదట ఎయిర్ ఇండియా విమానం 240 మంది విద్యార్థులతో ఉదయం 5.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 221 మందితో ఇండిగో విమానం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీకి చేరింది. భారత వైమానికి దళానికి(ఐఏఎఫ్) చెందిన మూడో విమానం 213 మంది విద్యార్థులతో మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీలోని హిండాన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. సి–17 సైనిక రవాణా విమానంలో విద్యార్థులను ఢిల్లీకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమే రష్యా సైనిక దాడులతో దద్దరిల్లుతున్న సుమీ నగరం నుంచి క్షేమంగా బయటపడడం నిజంగా ఒక అద్భుతమేనని భారత వైద్య విద్యార్థులు చెప్పారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా వారు ప్రత్యేక విమానాల్లో శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో భావోద్వేగపూరిత దృశ్యాలు కనిపించాయి. సుమీ నుంచి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులను, బంధువులను ఆలింగనం చేసుకొని, కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల మెడలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారత్ మాతాకీ జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టులో తన తల్లిదండ్రులను కళ్లారా చూడడం చాలా ఆనందంగా ఉందని ధీరజ్ కుమార్ అనే విద్యార్థి తెలిపాడు. యుద్ధభూమి నుంచి తాము ప్రాణాలతో స్వదేశానికి తిరిగిరావడం ఒక భయానక అనుభవమేనని పేర్కొన్నాడు. మార్గమధ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాడు. సుమీలో సైరన్లు వినిపించినప్పుడల్లా వెంటనే బంకర్లకు చేరుకొనేవాళ్లమని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని మహిమా వెల్లడించింది. భారత్‌కు తిరిగి వస్తామో లేదోనన్న భయాందోళన ఉండేదని తెలిపింది. స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రాణాలు తిరిగొచ్చినట్లుగా ఉందని, ఇప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని పేర్కొంది. సహకరించిన దేశాలకు ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు ఉక్రెయిన్ నుంచి తమ విద్యార్థుల తరలింపునకు సహకరించిన ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలకు, రెడ్ క్రాస్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సుమీ నగరం నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ పెనుసవాలు విసిరిందని శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా భారత విద్యార్థులను క్షేమంగా వెనక్కితీసుకురావడంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలండ్, స్లొవేకియా, మాల్డోవా ఎంతగానో సహకరించాయని, ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 18,000 మంది భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. -
ఓవైపు కాల్పుల మోత.. వణికించే చలిలో వలసలు
కీవ్: యుద్ధంతో కుంగిపోతున్న ఉక్రెయిన్‌లో ఓవైపు భారీగా రష్యా కాల్పుల మోత, మరోవైపు పెద్ద సంఖ్యలో పౌరుల తరలింపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా పొట్ట చేతపట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లారు. వీరిలో సగానికి సగం చిన్నారులేనని సమాచారం. వలస వెళ్లిన వారిలో చాలామంది పోలండ్ బాట పట్టారు. సమీలో బుధవారం ప్రకటించిన 12 గంటల కాల్పుల విరమణ సమయంలో మానవీయ కారిడార్ల గుండా గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు నగరం వదిలి వెళ్లినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మంగళవారం 1700 మంది భారతీయ, ఇతర దేశాల స్టూడెంట్లతో పాటు దాదాపు 5000 మంది నగరం వీడినట్టు సమాచారం. ఇతర నగరాల్లో మాత్రం రష్యా కాల్పులు, ఆ దేశానికి దారితీసే కారిడార్లను ఉక్రెయిన్ అంగీకరించపోవడంతో తరలింపులు సాధ్యపడలేదు. మారియుపోల్‌లో నిత్యావసరాలతో వస్తున్న ఉక్రెయిన్ హ్యుమానిటేరియన్ వాహనాలపై రష్యా సేనలు కాల్పులకు దిగడంతో అక్కడ కూడా తరలింపుకు విఘాతం కలిగినట్టు సమాచారం. బెలారస్ రాజధాని మిన్స్క్ ఎయిర్ బేస్‌లో రష్యా భారీ సంఖ్యలో హెలికాప్టర్లను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఇవన్నీ ఉక్రెయిన్‌పై మరింత భారీ దాడి వ్యూహంలో భాగం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా అల్లాడుతోంది. పరిస్థితి చేజారుతుండటంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల నుంచి డాలర్స్ విత్డ్రాయల్స్పై రష్యా సెంట్రల్ బ్యాంకు పరిమితి విధించింది. ఇవన్నీ జనాల్లో భయాందోళనలను మరింతగా పెంచుతున్నాయి. దాంతో వీలైనంత వరకూ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. దాంతో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి. భీకర దాడులు పట్టణాలు, నగరాలను లక్ష్యం చేసుకుని రష్యా చేస్తున్న దాడులు బుధవారం మరింత పదునెక్కాయి. భారీగా వచ్చిపడుతున్న బాంబులు, క్షిపణులతో రాజధాని కీవ్, ఖర్కీవ్, మారియుపోల్, మల్యిన్, చుహుయివ్, ఒడెసా, చెర్నిహివ్, మైకోలెవ్ అల్లాడుతున్నాయి. ఖర్కీవ్, జైటోమిర్, మాలిన్ నగరాల్లోనైతే నివాస ప్రాంతాలపై రష్యా విమానాలు విచక్షణారహితంగా దాడులకు దిగాయి. వీటిలోనూ భారీగా ప్రాణనష్టం జరిగినట్టు చెబుతున్నారు. కీవ్ శివార్లలోని ఇర్పిన్, బుచా, హోస్టోమెల్, వ్యషోరోడ్, బోరోడియాంక తదితర చోట్ల పరిస్థితి దయనీయంగా ఉందని సమాచారం. తిండి, తాగునీరు, కరెంటు, మందులు తదితరాల కొరతతో ఎక్కడ చూసినా జనం అష్టకష్టాలు పడుతున్నారు. విపరీతమైన చలి పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. మారియుపోల్ తదితర నగరాల్లో ఏ వీధిలో చూసినా దిక్కూమొక్కూ లేకుండా పడున్న శవాలే కన్పిస్తున్నాయి. వీలైనప్పుడల్లా పెద్ద సంఖ్యలో శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. బాంబుల మోత ఏ కొంచెంసేపు ఆగినా నిత్యావసరాల కోసం దుకాణాలపై జనం దాడులకు దిగుతున్నారు. కనిపించిన సరుకులనల్లా ఖాళీ చేస్తున్నారు. ఇది పోట్లాటలకూ దారితీస్తోంది. రాజధాని కీవ్‌లో జనం చాలావరకు సబ్వే స్టేషన్లలోనే తలదాచుకుంటూ గడుపుతున్నారు. నగరంపై రష్యా భీకరంగా దాడులను కొనసాగిస్తోంది. నగరంలోని మానసిక చికిత్సాలయంలో 200 మందికి పైగా రోగులు నిస్సహాయంగా పడి ఉన్నారు. బుధవారం నాటి కాల్పుల్లో పౌరులు భారీగా మరణించినట్టు ఉక్రెయిన్ చెప్తోంది. రష్యా సైనికులూ, వెళ్లిపోండి: జెలెన్స్కీ రష్యా సైనికులు ఇప్పటికైనా యుద్ధం ఆపి వెనుదిరగాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. ‘‘మా పోరాట పటిమను రెండు వారాలుగా చూస్తున్నారుగా. మేం లొంగే ప్రసక్తే లేదు. మా భూభాగమంతటినీ తిరిగి స్వాధీనం చేసుకుని తీరతాం. వెళ్లిపోయారంటే ప్రాణాలు దక్కించుకున్న వాళ్లవుతారు’’ అని రష్యన్ భాషలో వారికి సూచించారు. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తమకు వెంటనే యుద్ధ విమానాలు పంపాల్సిందిగా పశ్చిమ దేశాలను మరోసారి కోరారు. జెలెన్స్కీ పిలుపునకు పోలండ్ స్పందించింది. ఉక్రెయిన్‌కు మిగ్ ఫైటర్ జెట్లను పంపేందుకు సిద్ధమని ఆ దేశ ప్రధాని మాటెజ్ మొరావికి ప్రకటించారు. ఆస్పత్రి పై బాంబుల వర్షం మారియుపోల్‌లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా సైన్యాలు బాంబుల వర్షం కురిపించాయి. దాడిలో ఆస్పత్రి దాదాపుగా నేలమట్టమైందని సిటీ కౌన్సిల్ చెప్పింది. ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమంది. దీన్ని దారుణమైన అకృత్యంగా జెలెన్స్కీ అభివర్ణించారు. పసిపిల్లలతో పాటు చాలామంది శిథిలాల కింద చిక్కుబడ్డారని ఆవేదన వెలిబుచ్చారు. దాడిలో ఆస్పత్రి శిథిలాల దిబ్బగా మారిన వైనానికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. రష్యా సైనికుల అవస్థలు ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా రష్యా సైనికులను చంపేసినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. వందలాది యుద్ధ ట్యాంకులు, 1,000కి పైగా సాయుధ వాహనాలు, 50 దాకా యుద్ధ విమానాలు, సుమారు 100 హెలికాప్టర్లు తదితరాలను ధ్వంసం చేశామని ఆ దేశ సైన్యం వెల్లడించింది. తమ పౌరులను భారీ సంఖ్యలో రష్యా సేనలు పొట్టన పెట్టుకున్నాయని ఆరోపించింది. రష్యా ఖండిస్తున్నా, ఈ రెండు వారాల్లో దాని సైన్యానికి ఇప్పటిదాకా భారీ నష్టమే జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలున్ని గద్దెనెక్కించాలన్న లక్ష్యానికి ఇప్పటికీ రష్యా ఇంకా చాలా దూరంలోనే ఉంది. పైగా కీవ్ దేవుడెరుగు, ఖెర్సన్ మినహా ఏ ప్రధాన నగరమూ ఇప్పటిదాకా రష్యా అధీనంలోకి రాలేదు. ఉక్రెయిన్ చెబుతున్న స్థాయిలో కాకున్నా రష్యాకు సైనిక నష్టం వేలల్లోనే జరిగి ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ సైనికులు తమ పౌరులతోకలిసి రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. దాంతో ముందుకు సాగడం వారికి చాలా కష్టంగా మారుతోంది. ఉక్రెయిన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటనను పుతిన్ అంచనా వేయలేకపోయారంటున్నారు. పైగా సైన్యానికి ఆహారం, ఇంధన తదితర సరఫరాలు సరిగా అందడం లేదని తెలుస్తోంది. దీనికి వణికించే చలి తోడై వారి పరిస్థితి దుర్భరంగా ఉందంటున్నారు. అనుకున్నంత త్వరగా లక్ష్యం సాధించలేకపోయానన్న నిరాశలో ఉక్రెయిన్‌పై దాడులను పుతిన్ మరింత తీవ్రతరం చేయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రష్యా సైనికులు యుద్ధం చేయడానికి అంత సుముఖంగా లేరన్న సంకేతాలు ఆ దేశ నాయకత్వాన్ని కలవరపరుస్తున్నాయి (చదవండి: రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు..!) -
ఉక్రెయిన్ సాయాన్ని అడ్డుకున్న అమెరికా!!
ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష సాయం చేయని అమెరికా.. పరోక్షంగా బయటి నుంచి అందే సాయాన్ని అడ్డుకోవడం విశేషం. అమెరికా ఎయిర్ బేస్ ద్వారా ఉక్రెయిన్‌కు MiG-29 ఫైటర్ జెట్లను పంపాలనుకున్న పోల్యాండ్ ప్రతిపాదనను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అసలు ఆ ప్రతిపాదనను అమెరికా తప్పు పట్టింది. ఉక్రెయిన్‌కు సాయం చేయాలన్న పోల్యాండ్ ప్రతిపాదన.. మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమైని పేర్కొంది. జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో ఉన్న యూఎస్ ఎయిర్‌బేస్‌కు చెందిన సోవియట్ కాలం నాటి విమానాలను ఉక్రెయిన్‌కు తరలించే ప్రతిపాదనను అమెరికా అధికారులు వ్యతిరేకించారు. ఒప్పందం ప్రకారం MiG-29 ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ పంపడం సాధ్యపడదని తెలిపారు. అయితే వాటి స్థానంలో F-16 ఫైటర్లను తరలించవచ్చని చెప్పారు. కానీ, ఇది పోల్యాండ్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానికదాడులు చేస్తున్న క్రమంలో యూఎస్-నాటో ఎయిర్ బేస్ నుంచి MiG-29 ఫైటర్ జెట్లను పోల్యాండ్ పంపాలన్న ప్రతిపాదన సరైంది కాదని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రతిపాదన మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాము పోల్యాండ్, ఇతర NATO మిత్రదేశాలతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. లాజిస్టికల్ సవాళ్లతో కూడిన పోల్యాండ్ ప్రతిపాదన సమర్థనీయం కాదని తెలిపారు. మరోవైపు రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రష్యా మిలటరీ బలగాలు విధ్వంసం 14వ రోజు కూడా కొనసాగుతోంది. ఇక, ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతా. చదవండి: భారత్‌కు రుణపడి ఉంటా: పాక్ విద్యార్థిని భావోద్వేగం -
ఉక్రెయిన్‌కు నాటో సాయం.. ఉత్తదేనా?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో వైమానిక దాడులను ఉధృతం చేయాలని రష్యా ఒకవైపు యోచిస్తుండగా, మరోవైపు అమెరికా సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యాను ఢీకొట్టడానికి గాను ఉక్రెయిన్ దళాలకు ఫైటర్ జెట్లు అందజేయడానికి నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నాటో దేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఉక్రెయిన్‌కు Fighter Jets అందజేసి, సహకరించడానికి ఇప్పటిదాకా నాటో దేశాలేవీ ముందుకు రాలేదు. కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విన్నపాలు సైతం పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లు పంపించాలని ఆయన పదేపదే కోరుతున్నా మిత్ర దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గగనతల శక్తిలో ఉక్రెయిన్ కంటే రష్యా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉక్రెయిన్ వద్ద కేవలం 67 ఫైటర్ జెట్లు, 34 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. రష్యా అమ్ముల పొదిలో ఏకంగా 1,500 ఫైటర్ జెట్లు, 538 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఉక్రెయిన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే ఆ దేశం నేరుగా తమపై యుద్ధం సాగిస్తున్నట్లుగానే పరిగణిస్తామని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆర్మీని గానీ, వైమానిక దళాన్ని గానీ పంపించబోమని అమెరికా ఇప్పటికే తేల్చిచెప్పింది. చదవండి: యుద్ధ గందరగోళంలో పాపం ఆయన్ని కాల్చి చంపేశారు! -
పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనేందుకు అమెరికా, నాటో సభ్యదేశాలు సంకోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై నేరుగా దండెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న సందేహాలు లేకపోలేదు. ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలను ఇప్పటికిప్పుడు బయటకు తరిమేయడం సాధ్యం కాదు కాబట్టి అమెరికా ప్రభుత్వ పెద్దలు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆధ్వర్యంలోనే పొరుగు దేశం పోలండ్‌లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అమెరికా దృష్టి పెట్టినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని అధికారిక ప్రభుత్వంగా గుర్తించడంతోపాటు తగిన సాయం అందించడానికి పశ్చిమ దేశాలు రంగం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా స్వాధీనం చేసుకునే పరిస్థితి తలెత్తితే మాత్రం ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదని అమెరికా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. (చదవండి: మాట తప్పిన రష్యా: ‘ఆపరేషన్ గంగ’కు ఆఖరి దశలో అడ్డంకులు!) -
War Updates: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సాయం.. 400 మిలియన్ పౌండ్లు..
Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా.. చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో.. ►ఉక్రెయిన్‌కు బ్రిటన్ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్ 400 మిలియన్ పౌండ్లను ఉక్రెయిన్‌కు సాయంగా అందించింది. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది. ►రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది. ►ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. ►ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ►ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. ►రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్‌ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్ మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. ►రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ►ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ►రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్‌ను మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయడంపై పుతిన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ►తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది. ►భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ►రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. ►ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి. తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్ నెంబర్ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ► రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. ► ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్ విమానాల్లో భారత్‌కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని భారత్ భావిస్తోంది. #WATCH | Tears of joy and some sweets at Delhi airport, as a mother breaks down on seeing her daughter Saloni, who has arrived from war-torn #Ukraine "Can't be expressed in words how happy I feel to see my child back home with me," the mother said pic.twitter.com/V2xUzXgHLG — ANI (@ANI) March 7, 2022 ► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ► రష్యా సెంట్రల్ బ్యాంక్‌తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్ కొరియా. ► జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కీవ్, మరియూపోల్, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ వ్యక్తిగత రిక్వెస్ట్ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు. ►ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది. Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik — ANI (@ANI) March 7, 2022 ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మధ్యాహ్నాం ఫోన్లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది. ► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్‌కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. ► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్ పోర్టు నగరం మికోలాయివ్ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి పిలుపు ఇచ్చాడు. Russian forces appear to have launched a heavy artillery barrage against Mykolaiv, a day after Ukrainian troops pushed them from the city and recaptured the airport. From my vantage, I could see flashes from the attack lighting up the night sky along a large swath of the city. pic.twitter.com/cm4E0cNtN3 — Michael Schwirtz (@mschwirtz) March 7, 2022 ► రష్యాపై ఆంక్షల పర్వం రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్‌పైనా బ్యాన్ విధించే యోచనలో ఉన్నాయి. ► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్ పరస్పరం వాదించనున్నాయి. ► జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్! ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్ సాయం కోరనున్న జెలెన్స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం. PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources (file photos) pic.twitter.com/PuWuCv2Fqw — ANI (@ANI) March 7, 2022 ► అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్ను వీడొచ్చని అంచనా వేస్తోంది. ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నాటో ఎంట్రీ ► నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిహెచ్చరిక. ► ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక. రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 పైటర్జెట్లు. పోలాండ్‌కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్. ► ఫలించిన జెలెన్స్కీ విజ్ఞప్తి. నాటోకు అమెరికా గ్రీన్ సిగ్నల్. పోలాండ్‌కు సాయం తరలింపు. ► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్‌కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్‌తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్ దగ్గర హోరాహోరీ పోరు. ► యుద్ధ భయంతో ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్‌కు. ముఖ్యంగా మరియూపోల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్, వాటర్‌ను కట్ చేసి పడేసింది నగరానికి. ► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయ్యింది. ► ఉక్రెయిన్‌లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. ► ఇర్పిన్ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు. ► ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్ సంస్థలు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి ఫైనాన్షియల్ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. ► ఉక్రెయిన్‌కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్‌తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. -
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం సీఎం జగన్ ప్రత్యేక చర్చలు
-
పారిపోలేదు..ఇక్కడే ఉన్నా: ఉక్రెయిన్ అధ్యక్షుడు
యుద్ధంలో ఓటమి భయం, ప్రాణ భయంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. పోల్యాండ్‌కు పారిపోయాడంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్స్కీ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. ‘నేను ఇక్కడే కివీలోనే ఉన్నా. ఇక్కడి నుంచే పని చేస్తున్నా. ఎవరూ ఎక్కడికీ పారిపోలేదు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. జెలెన్స్కీ ఉక్రెయిన్ వదిలి పారిపోయాడని, పోల్యాండ్‌లో తలదాచుకున్నాడని రష్యా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశాడు. అతన్ని పట్టుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నించినా.. జాడ లేకుండా పోయాడని, బహుశా పోల్యాండ్‌లో జెలెన్స్కీ తలదాచుకుని ఉంటాడని వోలోదిన్ పేర్కొన్నాడు. అయితే.. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) ఈ క్రమంలోనే పిరికిపంద అపవాదుపై జెలెన్స్కీ తీవ్రంగా స్పందించాడు. పిరికిపందను కాను.. ఎవరూ ఎక్కడికి పారిపోరు అని వీడియోలో పేర్కొన్నాడు. మరోవైపు రష్యా పరిణామాలపై అజ్ఞాతంలో ఉంటూనే జెలెన్స్కీ స్పందిస్తున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు, మీడియా ద్వారా పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తులు చేస్తున్నాడు. -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: నేడు భారతీయులకు అండగా పోలండ్.. మరి ఆనాడు..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలమంది భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులకు పరుగెడుతున్నారు.. అలా వస్తున్న మనవారికి పోలండ్ సహకరిస్తోంది.. విమానాల ద్వారా భారత్‌కు వెళ్లేందుకు తోడ్పడుతోంది. ఇది ఈనాటి దృశ్యం.... కానీ ఒకప్పుడు దీనికి రివర్స్‌గా జరిగింది తెలుసా? పోలండ్ నుంచి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే.. ఇక్కడ ఒక ‘గుడ్ మహారాజా’ వాళ్లను ఆదరించారు. ఆ విశేషాలు ఇవి.. – సాక్షి సెంట్రల్‌డెస్క్ అప్పుడేం జరిగిందంటే.. ..దాదాపు 80 ఏళ్ల క్రితం.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ చేతిలో పోలాండ్ అతలాకుతలం అవుతున్న సమయం. యుద్ధ సంక్షుభిత పోలండ్ నుంచి, సోవియట్ అధీనంలోని జైళ్ల నుంచి.. పోలండ్ చిన్నారులను శరణార్థులుగా వదిలివేశారు. 1942లో సోవియట్ సైన్యం.. రెండేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికిపైగా పిల్లలను ఓ నౌకలో ఎక్కించి పంపించేసింది. ఆ షిప్‌ను ఏ నౌకాశ్రయంలో ఆపినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఆశ్రయం ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఆ నౌక ప్రస్తుత గుజరాత్ తీరంలోని నవానగర్‌కు చేరింది. నవానగర్ రాజు ‘జామ్‌సాహెబ్ దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా’ ఎంతో పెద్ద మనసుతో వారిని అక్కున చేర్చుకున్నారు. ది గుడ్ మహారాజా స్క్వేర్ మీరందరూ నా పిల్లలే.. పోలండ్ నుంచి వచ్చిన చిన్నారుల్లో దాదాపు అందరూ అనాథలుగా మిగిలినవారే. దీనిపై చలించిపోయిన నవానగర్ మహారాజు ఆ పిల్లలెవరినీ అనాథలుగా చూడొద్దని, వారంతా నవానగర్ పౌరులని, రాజ్యాధినేతగా తాను వారికి తండ్రిలాంటి వాడినని ప్రకటించారు. ఆ పిల్లల కోసం ప్రత్యేక క్యాంపులు, పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వైద్యం అవసరమైన వారికి చికిత్స చేయించారు. అలా నాలుగేళ్లపాటు వారి ఆలనాపాలనా చూసుకున్నారు. వారు కూడా నవానగర్ మహారాజును ‘బాపూ (తండ్రి)’గా పిలుచుకునేవారు. పోలండ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత 1946 నుంచి దశలవారీగా వారు తిరిగి తమ స్వదేశానికి చేరుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. మన దేశం నుంచి బ్రిటీష్‌వారు వెళ్లిపోవాలంటూ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయమది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న ఆ సమయంలో ఐరోపా దేశాల పిల్లలను ఆదుకునేందుకు నవానగర్ మహారాజు చూపిన చొరవ ప్రశంసలు పొందింది. ఇంత ఘనత పొందిన నవానగర్ మహారాజు 1966లో కన్నుమూశారు. పోలండ్‌లో.. మన మంచి మహారాజు నవానగర్ మహారాజు చూపిన ఔదార్యానికి పోలండ్ మర్చిపోలేదు. పోలిష్ రిపబ్లిక్‌గా ఏర్పాౖ టెన తర్వాత ఆ దేశ అత్యున్నత అవార్డు అయిన ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్’తో ఆయన్ను గౌరవించింది. వార్సా నగరంలోని హైస్కూల్‌కు ‘మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ, రంజిత్‌సింగ్‌జీ జడేజా’ పేరు పెట్టింది. అంతేకాదు.. 2013లో వార్సాలోని ఓ జంక్షన్‌కు ‘ది గుడ్ మహారాజా స్క్వేర్’ అని నామకరణం చేసింది. -
దేశం విడిచి వెళ్లిన ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం దేశం విడిచి వెళ్లినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారని రష్యా మీడియా తెలిపింది. అయితే ఇంతకముందు కూడా జెలెన్స్కీ దేశం విడిచిపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నట్లు అనేక వీడియోలతో స్పష్టం చేశారు. మరీ ప్రస్తుత వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. కాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అంతమొందించే దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం రోజుల్లోనే జెలెన్స్కీ హత్యకు మూడుసార్లు ప్రయత్నం జరిగినట్లు అంతర్జాతీయ వీడియో పేర్కొంది. అయితే ముందే అప్రమత్తమవ్వడం వల్ల ఉక్రెయిన్ భద్రతా దళాలు కుట్రలను భగ్నం చేసినట్లు తెలిపింది. చదవండి: ‘నేనేమీ కొరకను.. ఎందుకు భయం’.. పుతిన్‌కు జెలెన్స్కీ చురకలు కాగా జెలెన్స్కీ భద్రతా విషయంలో ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. . దేశం విడిచి వచ్చేయండి, రక్షణ కల్పిస్తామని అగ్రరాజ్యాలు ఆహ్వానం అందించినా కాదన్నారు. ఈ క్రమంలోనే దేశం విడిచి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా పిలుపునిచ్చిన్పటికీ జెలెన్స్కీ తిరస్కరించారు. యుద్ధ భూమిలోనే పూర్తి స్థాయి సైనికుడిగా మారిపోయారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడికి రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఫ్రాన్స్ దేశం కూడా ప్రకటించింది. చదవండి: రష్యా విధ్వంసం.. మూడో విడత చర్యలకు ఉక్రెయిన్ యత్నం! -
ఉక్రెయిన్‌లో భారత విద్యార్థిపై కాల్పులు.. పరిస్థితి విషమం!
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు యుద్ధ వాహనాలు, ట్యాంకర్ల ద్వారానే కాల్పులు జరిపిన రష్యా బలగాలు తాజాగా వైమానిక దాళాలతో దాడులను వేగవంతం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కీవ్‌లో భయాంకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్దభూమిలో పోరును కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు, విదేశీయులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో, భద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే తల దాచుకుంటున్నారు. మరోవైపు విద్యార్థుల తరలింపు కోసం మంత్రి వీకే సింగ్ పోలాండ్ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కీవ్ నగరంలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు. కీవ్‌లో రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిపై ఫైరింగ్ జరిగినట్టు మంత్రి వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు జరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు మంగళవారం రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో ఇంకా 1700 మంది భారతీయ విద్యార్థులు చిక్కున్నారని, వారిని భారత్‌కు తరలించేందుకు అన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా కారణంగా కేంద్రం అడ్వైజరీ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ను వదిలి స్వదేశానికి వచ్చారని స్పష్టం చేశారు. అయితే, భారత్ నుండి ఉక్రెయిన్‌లో దాదాపు 20 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. -
తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది. ఆపరేషన్ గంగ గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్ శేఖరప్ప ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. (చదవండి: Ukraine War: ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’ ) -
ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’
లండన్: పుతిన్ యుద్ధోన్మాదం నుంచి తమను కాపాడేందుకు పాశ్చాత్య దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదని డారియా కాల్నిక్ అనే ఉక్రెయిన్ మహిళా జర్నలిస్టు ఆవేదనతో ప్రశ్నించారు. పోలాండ్ ఒక భేటీలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈ మేరకు నిలదీశారు. ఉక్రెయిన్ ప్రజలను రక్షించేందుకు ఆయన భయపడుతున్నారరు. ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా నాటో ప్రకటించకపోవడంతో తమ పిల్లలు, మహిళలు వైమానిక దాడులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకరకంగా మా పిల్లలు బలై మిమ్మల్ని కాపాడుతున్నారు. వారి చాటున నాటో దాక్కుంటున్నట్టే లెక్క’ అని దుయ్యబట్టారు. అయితే జాన్సన్, చేయగలిగిందంతా చేస్తానని, నేరుగా సైన్యాన్ని పంపలేనని ఆమెకు సమాధానం ఇచ్చారు. Ukrainian journalist makes emotional plea to Boris Johnson. Pleas for NATO cover on the border to allow refugees cross safely, asks why Abramovich and Putin’s children she claims are in London and the EU are not sanctioned while people in Ukraine dying pic.twitter.com/KGxL0VwzVY — Lisa O'Carroll 🇺🇦 (@lisaocarroll) March 1, 2022 -
పాపం.. దురదృష్టవంతుడు! ఆ హింస పడలేక దేశం విడిస్తే.. మళ్లీ అదే పరిస్థితి!
Afghan Man Again Escape Poland: అఫ్గనిస్తాన్‌కి చెందిన అజ్మల్ రహ్మనీ ఒక ఏడాది క్రితం అప్గనిస్తాన్ విడిచి పెట్టి ఉక్రెయిన్ వచ్చాడు. అఫ్గాన్‌లోని హింస నుంచి తప్పించుకుని ఉక్రెయిన్‌లో హాయిగా జీవిద్దామని అనుకున్నాడు. అయితే అఫ్గాన్‌లో అనుక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన అతనికి ఉక్రెయిన్ అత్యంత స్వర్గధామంగా అనిపించింది. మళ్లీ గత నాలుగు రోజులుగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుండటంతో భయాందోళనలతో మళ్లీ పోలాండ్ సరిహద్దుకు పరిగెత్తాడు. ఈ బాంబుల మోత తనను వదలడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాను ఒక యుద్ధం నుంచి తప్పించుకుని మరో దేశం పరిగెత్తాను, మళ్లీ ఈ దేశంలో యుద్ధం మొదలైంది ఎంత దురదృష్టం అంటూ ఆవేదన చెందాడు. రహ్మనీ తన భార్య మినా, కుమారుడు ఒమర్, కూతురు మార్వాతో కలిసి ఉక్రెయిన్ సరిహద్దుకు కాలినడకన 30 కిలోమీటర్లు నడిచి వెళ్లామని చెప్పాడు. తాను పోలాండ్ వైపున ఉన్న మెడికాకు చేరుకున్న తర్వాత తన కుటుంబం ఇతర శరణార్థులతో కలిసి సమీపంలోని ప్రజెమిస్ల్ నగరానికి తీసుకెళ్లే బస్సులో వెళ్లామన్నారు. 40 ఏళ్ల రహ్మానీ, కాబూల్ విమానాశ్రయంలో 18 ఏళ్ల పాటు అఫ్గనిస్థాన్‌లోని నాటో కోసం పనిచేశానని చెప్పారు. యూఎస్ బలగాల ఉపసంహరణకు నాలుగు నెలల ముందు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అఫ్గాన్‌ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అంతేకాదు తనకు అప్గనిస్తాన్‌లో మంచి జీవితం ఉందని తనకొక మంచి ఇల్లు, కారు మంచి జీతం అన్ని ఉన్నాయని రహ్మానీ చెప్పారు. అఫ్గనిస్తాన్‌ను విడిచిపెట్టడానికి వీసా కోసం తాను చాలా కష్టపడ్డానని, పైగా తనను అంగీకరించే ఏకైక దేశం ఉక్రెయిన్ మాత్రమేనని అతను చెబుతున్నాడు. రహ్మానీ అతని కుటుంబం పోలాండ్‌లో వీసా లేని ఇతరుల మాదిరిగానే ఉన్నాడని, నమోదు చేసుకోవడానికి 15 రోజుల సమయం ఉందని వలసదారుల స్వచ్ఛంద సంస్థ అయిన ఓక్లైన్ (సాల్వేషన్) ఫౌండేషన్ న్యాయవాది టోమాస్జ్ పీట్ర్జాక్ అన్నారు. అయితే ఉక్రెయిన్ నుంచి దాదాపు 2 లక్షల మంది వలసదారులు పోలాండ్లోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు. (చదవండి: రష్యాతో జతకట్టనున్న బెలారస్!) -
మా ప్రజలు హింసకు గురవుతుంటే అలా వదిలేయ లేం: రాహుల్ గాంధీ
Indians Stuck In Ukraine: ఉక్రెయిన్ సంక్షోభంపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. తరలింపు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ప్రధానమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు తరలింపు ప్రయత్నాల మధ్య సుమారు 2 వేల మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చినట్లు కూడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అయితే ఇంకా కొంతమంది విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద చిక్కుకుపోయారు. అంతేకాదు ఆ సరిహద్దు వద్ద ఉన్న గార్డులు భారతీయ విద్యార్థులను హింసకు గురిచేస్తున్నారు. అమ్మాయిలని కనికరం కూడా లేకుండా దారుణంగా కొడుతున్నారు. కొంతమంది విద్యార్థులను సరిహద్దుల నుంచి నెట్టివేయడంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగానూ, గందరగోళంగానూ ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆయన అక్కడ పరిస్థితిపై ఆందోళన చెందుతూ దయచేసి ప్రభుత్వం త్వరితగతిన భారతీయ విద్యార్థులను తరలించాలని కోరారు. హింసకు గురువుతున్న భారతీయ విద్యార్థులు వారి కుటుంబాలను చూస్తుంటే హృదయం విలవిలాడిపోతుందని అన్నారు. అంతేకాదు తరలింపు చర్యలు మరింత ముమ్మరంగా సాగించాలని ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు. నివేదికల ప్రకారం విద్యార్థులు పోలాండ్ దాటడానికి ప్రయత్నించినప్పుడు వేధింపులకు గురవుత్ను వీడియో అని తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, కేంద్ర ప్రభుత్వం గత వారం హంగరీ, పోలాండ్, రొమేనియ, స్లోవేకియా రిపబ్లిక్ సహాయంతో ప్రత్యామ్నాయ తరలింపు ప్రణాళికలను రూపొందించింది. పైగా సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవద్దని ప్రభుత్వం ఒక ప్రకటనలో విద్యార్థులకు తెలిపింది కూడా. My heart goes out to the Indian students suffering such violence and their family watching these videos. No parent should go through this. GOI must urgently share the detailed evacuation plan with those stranded as well as their families. We can’t abandon our own people. pic.twitter.com/MVzOPWIm8D — Rahul Gandhi (@RahulGandhi) February 28, 2022 (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి)